ఆ గ్రహశకలం భూమిని ఢీకొంటే ఏ నగరాలకు ప్రమాదం పొంచి ఉంది..?

ఖగోళ శాస్త్రజ్ఞులు 2024 YR4 అనే క్షుద్రగ్రహాన్ని 2032లో 2% ఢీకొనే ప్రమాదంతో పర్యవేక్షిస్తున్నారు. గ్లోబల్ సిద్ధత సంభావ్య ప్రభావాల కోసం కీలకం.

తమన్‌కు కోట్లు విలువ చేసే కారును గిఫ్ట్‌గా ఇచ్చిన బాలకృష్ణ

నటసింహం నందమూరి బాలకృష్ణ(Bala Krishna) ఏ చేసిన కూడా ప్రత్యేకంగా ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమలో అగ్ర హీరోల్లో ఒకరైన ఆయన ఇప్పటికి కూడా కొత్త తరం హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమా హిట్లతో దూసుకుపోతున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, నటన, డ్యాన్స్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకునిగా ప్రజలకు సేవ చేస్తూనే, సినిమాలు కూడా చేస్తూ తన అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన నుంచి వచ్చిన 'డాకు మహారాజ్' సినిమా ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే ఇటీవల కేంద్రం కూడా పద్మభూషన్ అవార్డుతో సత్కరించింది. ఇదిలా ఉంటే ఈ ఆనంద సమయంలో బాలకృష్ణ తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌కు ఖరీదైన కారును బహుమతిగా అందించారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాతో పాటు సినీ పరిశ్రమలో ట్రెండింగ్ టాపిక్ అయింది.

ఇండియాలో తయారైన ఈ కంపెనీ కార్లకు విదేశాల్లో భారీ డిమాండ్

ఇండియా ఆటోమొబైల్ పరిశ్రమ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతుంది. ప్రస్తుతం చాలా దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భారత్ మాత్రం ఎలాంటి ఢోకా లేకుండా ఇతర దేశాలకు అందనంత వేగంతో జీడీపీ వృద్ధిని సాధిస్తుంది. మన దేశీయ వాహన పరిశ్రమ అభివృద్ధికి చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. పెరుగుతున్న దేశ జనాభాకు అనుగుణంగా వాహనాల సంఖ్య పెరుగుతుంది. దీంతో దేశీయ కంపెనీలే కాకుండా అంతర్జాతీయంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన తయారీదారులు ఇండియాలో పెట్టుబడులపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. కొత్తగా తయారీ ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడే కార్లను ఉత్పత్తి చేసి వాటిని ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇదే క్రమంలో రెండు దశాబ్దాల క్రితం ఇండియాలో అడుగుపెట్టిన విజయవంతమైన కార్ల తయారీదారుగా గుర్తింపు పొందిన హ్యుందాయ్ (Hyundai) భారత్ నుంచి ఇతర దేశాలకు ప్యాసింజర్ వాహనాల ఎగుమతుల పరంగా 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.

బజాజ్ నుంచి కొత్త హంగులతో రానున్న ‘క్యూట్' వాహనం.. ఈ నాలుగు చక్రాల ఆటో ఫీచర్లన్నీ కిర్రాకే!

దేశంలో తక్కువ ధరలో దొరికే వాహనాలను కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కోవలో తక్కవ ధరలో దొరికే కారుగా మారుతీ సుజుకీ ఆల్టో మంచి పేరు సంపాదించుకుంది. ఇక దాని తర్వాత చెప్పుకోవాల్సింది బజాజ్ క్యూట్. రూ.3.61 లక్షలకే అందుబాటులో ఉన్న ఈ వాహనం వినియోగదారులకు బాగా చేరువైంది.
Advertisement

6 ఎయిర్‌బ్యాగ్‌లతో అతితక్కువ ధరలో లభించే బెస్ట్ కార్లు

ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారత్‌లో కూడా రోడ్డు ప్రమాదాల బారీన పడి చాలా మంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మరికొంత మంది గాయాలతో మంచనా పడుతున్నారు. దేశంలో చోటుచేసుకుంటున్న మరణాలో ఎక్కువగా యాక్సిడెంట్ల కారణంగానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్లను కొనుగోలు చేసే సమయంలో సేఫ్టీ పరంగా అత్యుత్తమమైన వాటిని ఎంచుకోవడం అతిముఖ్యం. ప్రస్తుతం కార్ల వినియోగం భారీగా పెరిగింది. దీంతో వాహన తయారీదారులు వరుసగా అధునాతన ఫీచర్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. వీటి నుంచి ప్రమాద సమయంలో రక్షణ పరంగా లోపల కూర్చున్న వారికి ఎలాంటి గాయాలు కాకుండా సేఫ్టీ అందించే కార్లను కొనడం బెస్ట్. ముఖ్యంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నవాటిని ఎంచుకోవడం ఉత్తమం. ఒకప్పుడు ప్రీమియం కార్లలోనే ఇవి అందుబాటులో ఉండగా, ప్రస్తుతం బడ్జెట్ ధరలో లభించే వాటిలో కూడా 6 ఎయిర్‌బ్యాగ్‌లను అందిస్తున్నారు. మార్కెట్లో ఉన్న ఈ కార్ల గురించి కింది కథనంలో తెలుసుకుందాం.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్.. మొదటి రోజే కొన్ని వేల బుకింగ్స్

భారత్‌లోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు మహీంద్రా దేశీయ వినియోగదారుల కోసం అధునాతన కార్లను విడుదల చేయడంలో ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. కంపెనీ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడంపై కీలకంగా దృష్టి సారించింది. అందుకే కొత్త ఈవీలను మార్కెట్లోకి తీసుకురావడానికి కృషి చేస్తుంది. గత ఏడాది మహీంద్రా(Mahindra) దేశీయ మార్కెట్లో XEV 9e, BE 6 అనే ఎలక్ట్రిక్ SUV లను విడుదల చేసింది. ఇవి మార్కెట్లోకి ఎప్పుడు వస్తాయా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇవి అంతర్జాతీయ కంపెనీలతో పాటు దేశీయ కార్ల తయారీదారులకు సైతం బలమైన ప్రత్యర్థిగా నిలవబోతున్నాయి. మహీంద్రా శుక్రవారం ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు సంబంధించిన బుకింగ్స్‌ను ప్రారంభించింది. దేశీయ వినియోగదారులు ఈ కార్లను పోటీ పడి బుకింగ్ చేసుకున్నారు.

తక్కువ ధరలో సేఫ్ కార్ల కోసం వెతికి వెతికీ అలసిపోయారా..? అయితే ఈ కార్లపై ఓ లుక్కేయండి.. క్లారిటీ దొరుకుతుంది!

కార్లను కొనేటప్పుడు రెండు విషయాలను ముఖ్యంగా మనం చూస్తాము. ఒకటి తక్కువ ధరలో ఉండాలి. రెండోది సేఫ్ కారు అయి ఉండాలి. ఈ రెండూ లక్షణాలతో ఉన్న కార్లకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అయితే... రూ.10 లక్షలలోపు ధరలో కూడా భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో సేఫెస్ట్ కార్లు భారత మార్కెట్లో ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. ఈ టెస్టులో మంచి రేటింగ్ సొంతం చేసుకున్న కార్లు సేఫ్టీ పరంగా ఉన్నతమైనవని అర్థం. మీరు ఒకవేళ రూ.10 లక్షల్లోపు ధరలో సేఫ్ కారు కోసం వెతుకుతున్నట్లయితే ఈ కథనం మీకోసమే. మీ బడ్జెట్‌లో ఏయే కార్లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం.

కొత్త మోడళ్లతో వచ్చేసిన గాయత్రి ఎలక్ట్రిక్... ఈ ఆటోల్లో అదుర్స్ అనిపించే ఫీచర్లు ఉన్నాయ్‌గా!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో అనేక స్టార్టప్ సంస్థలు ఈ రంగంలో అడుగుపెడుతున్నాయి. తమ వాహనాలతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అలా కస్టమర్లకు బాగా చేరువైన సంస్థ ఒక గాయత్రి ఎలక్ట్రిక్ ప్రైవేట్ లిటిమెట్. ఈ సంస్థ నుంచి తాజాగా ఓ కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా భారత మార్కెట్లో విడుదలైంది. సాధారణ ఆటో రిక్షా కంటే మెరుగైన ఫీచర్లు, సదుపాయాలతో ఈ ఇ-రిక్షాను తీసుకువచ్చింది గాయత్రి సంస్థ. ముఖ్యంగా ఇందులో 7+1 సీటర్ ఫెసిలిటీ దీనికి ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు.

కుటుంబంతో కలిసి వెళ్ళడానికి బెస్ట్ కారు! పేరు మార్చిన తర్వాత అమ్మకాల్లో జోరు

భారతీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra) అమ్మకాలతో దూసుకుపోతుంది. ఇతర కంపెనీలకు పోటీగా అధునాతన మోడళ్లను విడుదల చేస్తూ, క్రమంగా తన మార్కెట్ వాటాను పెంచుకుంటుంది. కంపెనీ ఇటీవల వరుసగా తన అమ్మకాల వివరాలు విడుదల చేస్తుంది. ఈ క్రమంలో XUV 3XO కారుకు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. ఇది అమ్మకాల పరంగా గణనీయంగా పురోగతి సాధించింది. ఇది గతంలో మహీంద్రా XUV300 కాగా దీన్ని ఏప్రిల్ 2024లో రీ బ్రాండ్ చేసి XUV 3XOగా తిరిగి లాంచ్ చేశారు. పాత పేరుతో ఉనప్పటి కంటే కొత్త పేరుతో విడుదల అయిన తరువాత ఈ కారు అమ్మకాలు దాదాపు 80 శాతం పెరిగినట్లు తెలుస్తుంది. రీబ్రాండ్ మోడల్‌గా విడుదల అయినప్పటి నుంచి జనవరి 2025 వరకు ఈ కాంపాక్ట్ SUV మొత్తం 85,990 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది.

టాటా మాస్టర్ ప్లాన్ అదిరిపోతుంది.. దేశంలోని ప్రతి మూలలో ఛార్జింగ్ పాయింట్లు

భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యంత అధునాతన ప్రమాణాలతో కార్లను తయారు చేయడంలో ప్రసిద్ధి చెందిన దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (tata motors) గత కొన్నేళ్లుగా సాంప్రదాయ ఇంధన వాహనాలను విడుదల చేస్తూనే అదే సమయంలో ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకొస్తూ దేశంలోనే టాప్ ఈవీ మేకర్‌గా ఉంది. కంపెనీ ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ కార్ల(ev) కోసం ఛార్జింగ్ పాయింట్లను దేశవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కూడా ఏర్పాటు చేయడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. తాజాగా కంపెనీ నుంచి ఈ విషయంపై కీలక ప్రకటన వెలువడింది. ఇండియాలో ఛార్జింగ్ స్టేషన్ల ఇప్పుడు ఉన్న వాటి కంటే రెట్టింపు చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. మామూలుగా భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను విక్రయించే సంస్థల్లో టాటా మోటార్స్ అగ్రస్థానంలో ఉంటుంది. ఈ నేపథ్యంలో తన కస్టమర్లకు ఛార్జింగ్ పరంగా ఎలాంటి ఇబ్బంది రాకూడదని వీటి సంఖ్యను పెంచాలని నిర్ణయించారు.

కొత్త బైక్ కొనాలని ఉన్నవారికి గోల్డెన్ ఆఫర్.. ఈ బైకుపై భారీ తగ్గింపు

అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా ప్రముఖ ప్రీమియం స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌గా పేరుగాంచిన దిగ్గజ కంపెనీ కేటీఎమ్ (Ktm) మంచి మార్కెట్ కలిగి ఉంది. యూత్‌ను ఆకట్టుకునే విధంగా అధునాతన డిజైన్లతో కూడిన మోడళ్లను లాంచ్ చేయడంలో ఈ కంపెనీ చాలా ప్రసిద్ది చెందింది. గతంతో పోలిస్తే ఇటీవలి సంవత్సరాల్లో ఇండియాలో స్పోర్ట్స్ తరహా బైక్స్ వాడకం భారీగా పెరిగింది. దీంతో ktm వరుసగా కొత్త మోడళ్లను తీసుకొస్తూనే ఉంది. 2024 ఏడాదిలో మెరుగైన సేల్స్ సాధించిన కంపెనీ 2025లో కూడా ఇంకా ఎక్కువ సంఖ్యలో సేల్స్‌ను నమోదు చేయడానికి పలు కొత్త బైక్స్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే కంపెనీ వీటిని తీసుకురావడానికి ముందు తన ప్రసిద్ధ స్ట్రీట్‌ఫైటర్ మోడల్ అయినటువంటి Gen-3 390 డ్యూక్‌ (390 Duke) బైక్‌పై భారీ ఎత్తున తగ్గింపు ఆఫర్ అందిస్తుంది. ఈ విషయాన్ని Ktm ఒక ప్రకటనలో తెలిపింది.

అమ్మకాల్లో అదుర్స్ అనిపిస్తున్న విండ్సర్ ఈవీ.. కారు ‌హైప్‌ ‌ఉన్నప్పుడే ప్లేట్ మార్చిన ఎంజీ కంపెనీ!

విదేశీ దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ ఎంజీ మోటార్.. భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ ఈ బ్రాండ్ వాహనాలు వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ సంస్థ నుంచి వచ్చిన విండ్సర్ ఈవీ.. భారత కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. పెట్రోల్ కార్ ధరలో ఈ విండ్సర్ ఈవీ.. అందుబాటులో ఉండడం దీని సేల్స్ పెరగడానికి ముఖ్య కారణంగా చెప్పవచ్చు. టాటా నెక్సాన్ ఈవీని దాటుకొని భారత్‌లో విండ్సర్ ఈవీ బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచింది. అయితే ఎంజీ సంస్థ ప్రస్తుతం ఈ కారుకు సంబంధించి వినియోగదారులకు ఒక చిన్న మెలిక పెట్టింది. అదేంటంటే..
Advertisement

తెలంగాణ ఉద్యమం అంటే ఒక కుటుంబం కాదు!


ఈ మారుతి కారు పబ్లిక్‌లో ఫెయిల్..! ఆర్మీ మాత్రం ఈ కారే కావాలంటోంది..! దీనికి కారణం ఏంటి?

దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి గురించి అందరికీ తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా ఈ కంపెనీ కార్లు వినియోగదారులకు బాగా చేరువయ్యాయి. అయితే ఒక కారు మాత్రం మారుతి సుజుకి కంపెనీకి భారత్‌లో చేదు జ్ఞాపకాలను మిగులుస్తోంది. అదే ఆఫ్-రోడ్ SUV జిమ్నీ. మహీంద్రా థార్‌కు ఈ కారు గట్టి పోటీని ఇస్తుందని అందరూ భావించారు. కానీ అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి అన్నట్లుగా మారిపోయింది ఈ జిమ్నీ పరిస్థితి. సేల్స్‌లో ఈ కారు బోల్తా పడిపోయింది. కానీ, భారత ఆర్మీలో మాత్రం ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తున్నారు. పబ్లిక్‌లో ఆదరణ దక్కించుకోకపోయినప్పటికీ‌ ఈ కారును మిలిటరీలో వాడడానికి గల కారణాలేంటి?

అత్యంత సేఫ్టీ రైడింగ్‌ను ఇవ్వనున్న దేశంలోనే అందరి ఫేవరెట్ పల్సర్ బైక్‌

దేశీయ ప్రముఖ టూవీలర్ తయరీదారులలో ప్రసిద్ధ కంపెనీ బజాజ్ (Bajaj) భారతీయ వినియోగదారుల కోసం చాలా ఏళ్ల క్రితం తీసుకొచ్చిన పల్సర్ మంచి ఆదరణ సంపాదించింది. ఇది హోండా, హీరో వంటి కంపెనీలకు చెందిన పాపులర్ టూవీలర్స్‌ను సైతం ఎదుర్కొని విజయవంతమైన మోడల్‌గా నిలిచింది. మార్కెట్లో పల్సర్‌కు ఉన్న డిమాండ్ కారణంగా కంపెనీ తన ఈ మోడల్‌ను ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు అనుగుణంగా డిజైన్, ఫీచర్స్‌లలో మార్పులు తెస్తూ, కొత్తగా విడుదల చేస్తూనే ఉంది. గతంలో పల్సర్ NS125 మోడల్‌ను తీసుకొచ్చిన బజాజ్, తాజాగా దీనిలో కొత్తగా ABS వేరియంట్‌ను విడుదల చేసింది. బజాజ్ ఎప్పటికప్పుడు కొత్త పల్సర్ బైక్‌లను లను తన వినియోగదారులకు అందించడానికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఎందుకంటే పల్సర్‌ బైక్‌ కంపెనీకి అమ్మకాల పరంగా అత్యంత కీలకమైన మోడల్. కొత్తగా వచ్చిన పల్సర్ NS125‌లో రైడర్లకు మరింత సురక్షితమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందించడానికి ABS‌ను తీసుకొచ్చారు.

ఈ మహీంద్రా కార్లు మీకు బెస్ట్ ఛాయిస్..! ఈరోజు నుంచే బుకింగ్స్‌ స్టార్ట్‌!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో.. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా గట్టి ప్లాన్స్‌తో వచ్చేసింది. తమ బ్రాండ్ నుంచి రెండు కొత్త ఎలక్ట్రిక్ కారు మోడళ్లను లాంచ్ చేసింది. BE6, XEV9e పేరుతో వీటిని తీసుకువచ్చింది. వీటి బుకింగ్స్ ఫిబ్రవరి 14 2025 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ కొత్త వాహనాలతో భారత ఈవీ మార్కెట్లో ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ ఇవ్వాలని మహీంద్రా లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ కార్లు ఎప్పుడు వినియోగదారులకు డెలివరీ అవ్వనున్నాయి?. ఈ BE 6 కారు టాటా కర్వ్ ఈవీకి పోటీగా ఉండగా.. XEV9e కారు.. BYD Auto 3 సహా త్వరలో లాంచ్ కానున్న టాటా హరియర్ ఈవీకి పోటీ ఇవ్వనుంది.

తక్కువ ధరకే హోండా అడ్వెంచర్ బైక్.. ఇక లాంగ్ రైడ్‌కు హాయిగా వెళ్ళండి

భారతదేశంలో అడ్వెంచర్ బైక్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. సోషల్ మీడియా ట్రెండ్ పెరిగిన కారణంగా చాలా మంది ఇలాంటి వాటిని కొనుగోలు చేసి టూరింగ్ లాంటివి చేస్తూ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటిలో షేర్ చేస్తూ భారీగా ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. టెక్ ఉద్యోగుల్లో పని ఒత్తిడి పెరగడం వలన దాని నుంచి బయటపడటానికి అడ్వెంచర్ బైక్స్‌‌ను కొనుగోలు చేసి వీకెండ్స్ లేదా సెలవుల సమయాల్లో లాంట్ రైడింగ్ లాంటి చేస్తున్నారు. అందుకే మార్కెట్లో ఈ తరహా బైకుల అమ్మకాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. టూవీలర్ తయారీ కంపెనీలు కూడా కస్టమర్ల నుంచి వస్తున్న ఆదరణకు అనుగుణంగా ఈ మోడళ్లనే మరింత అప్‌డేట్‌గా తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ టూవీలర్ దిగ్గజం హోండా (Honda) అడ్వెంచర్ మోటార్ సైకిళ్ల విభాగంలో తన సత్తా చాటడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అందుకే కంపెనీ తాజాగా కొత్త అడ్వెంచర్ బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.

ఒకటి అనుకుంటే మరొకటి అయ్యింది. . విలీనం చర్చలకు ఎండ్ కార్డ్!

ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ పరిశ్రమలో పోటీ బాగా పెరిగిపోయింది. పెద్ద టాప్ కంపెనీలు తమ మార్కెట్‌ను విస్తరించడానికి నువ్వా నేనా అన్నట్లుగా పోటీ పడుతున్నాయి. ఎవరికి వారు కస్టమర్లను ఆకట్టుకోడానికి హ్యాచ్‌బ్యాక్‌ల నుంచి మొదలుకుని Suvలు, ఎంపీవీలు మొదలగు వాటిని విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు అయితే కలిసిపోయి ఒకే సంస్ధగా ఏర్పడి మరి వాహనాలను ఉత్పత్తి చేసి, వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ఈ క్రమంలో వాహన తయారీలో అంతర్జాతీయంగా పేరుగాంచిన జపాన్ కార్ల సంస్థలు హోండా(Honda), నిస్సాన్(Nissan) రెండు కలిసి ఒకే సంస్థగా మారి ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల మార్కెట్ కలిగిన కంపెనీగా అవతరించాలని ప్రయత్నాలు చేశాయి. ఇంతకుముందు ఈ రెండు సంస్థల మధ్య విలీనం కోసం చర్చలు కూడా జరిగాయి. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, ఇప్పుడు ఈ చర్చలు విఫలమయ్యాయని తెలుస్తుంది.

సీటు బెల్టుతో ప్రాణాలకు సేఫ్.. ఈ పెద్ద యాక్సిడెంట్ వీడియోనే అసలైన ప్రూఫ్!

ట్రావెలింగ్ సమయంలో, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సీటు బెల్టు పెట్టుకోవాల్సి ఉంటుంది. దీనిపై ట్రాఫిక్ పోలీసులే కాదు, ఇంట్లో వాళ్లు తమ కుటుంబ సభ్యులకు నిత్యం గుర్తు చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది ఈ మాటను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఫలితంగా ప్రాణాలు కోల్పోయే పరిస్థితిని తెచ్చుకుంటారు. ఇలాంటి ఒక ఘటన తాజాగా జరిగింది. సీటు బెల్టు ప్రాముఖ్యాన్ని తెలియజెప్పే ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో హోండా సిటీ, హ్యూందాయ్ వెర్నా కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొని పెద్ద ప్రమాదమే సంభవించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

దారి తప్పిన గూడ్స్ రైలు.. ఏకంగా 147 కి.మీల ప్రయాణం..

సాధారణంగా బస్సులు, ట్రక్కులు వంటివి రోడ్డు మీద ప్రయాణించే వాహనాలు దారి తప్పి పోవడం జరుగుతుంది. తెలియని కొత్త ప్రాంతాలకు వెళ్లినప్పుడు పొరపాటున ఇలా అవుతుంది. అయితే తాజాగా ఒక రైలు దారి తప్పి అది వెళ్లాల్సిన మార్గంలో కాకుండా వేరే మార్గంలో ప్రయాణించిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన న్యూస్ సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అదే సమయంలో రైల్వే సిబ్బంది తప్పిదం కూడా బయటపడింది. అదృష్టం కొద్ది ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఇప్పటికే రైలు ప్రమాదాలను తగ్గించడానికి కీలక జాగ్రత్తలు తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన మరో చర్చకు దారి తీసింది. దారి తప్పిన రైలు కారణంగా ఎవరికి ఏం కాకపోవడంతో సిబ్బంది అంతా ఊపిరి పీల్చుకున్నారు
Advertisement

హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లో వెళ్లొచ్చు.. త్వరలో హై స్పీడ్ రైళ్లు

ఇండియాలో రైల్వే రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ప్రపంచదేశాల్లో ఇప్పటికే ఉన్నటువంటి రాకెట్ వేగంతో దూసుకుపోయే హై స్పీడ్ రైళ్లను దేశంలో క్రమంగా తీసుకొస్తున్నారు. దీని కోసం భారత ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుని హై-స్పీడ్ రైలు కారిడార్లను అభివృద్ధి చేస్తుంది. వందే భారత్ వంటి రైళ్లు, సాధారణ రైళ్లు ప్రయాణించే రైలు పట్టాల మాదిరిగా కాకుండా హై-స్పీడ్ ప్రయాణించాలంటే ప్రత్యేకంగా కారిడార్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం వీటి అభివృద్ధి కోసం భారీగా నిధులను సైతం కేటాయిస్తుంది. ఇప్పటికే ముంబై-అహ్మదాబాద్ హై-స్పీడ్ కారిడార్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ రైలు రాక ద్వారా ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోతుంది. ఇవి విమాన ప్రయాణంతో పోటీపడి మరి ప్రయాణిస్తాయి. హై-స్పీడ్ రైళ్లను దేశం అంతటా విస్తరించడానికి కేంద్రం కీలకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా దక్షిణ భారతదేశంలో కొత్త కారిడార్లను ఏర్పాటు చేయడానికి సిద్ధం అయింది.

అయ్యో నిస్సాన్.. ఈ లగ్జరీ ఎస్ యూవీపై కస్టమర్ల శీతకన్ను.. కనీసం ఒక్కరు కూడా కొనలేదు!

భారత్‌లో సాధారణ కార్లతో పోలిస్తే లగ్జరీ కార్లకు డిమాండ్ కాస్త తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే చాలా మంది వినియోగదారులు తక్కువ ధరలో కొనేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ప్రముఖ వాహన తయారీ సంస్థ నిస్సాన్... తమ లగ్జరీ ఎస్‌యూవీ నిస్సాన్ ఎక్స్-ట్రయల్ కారుతో కష్టాలు ఎదుర్కొంటోంది. సేల్స్‌లో ఈ కారు రోజురోజుకు దిగజారిపోతోంది. టయోటా ఫార్చ్యూనర్ వంటి కార్లు దీనికి పోటీగా ఉన్న నేపథ్యంలో ఇది వినియోగదారులకు చేరువయ్యేందుకు చాలా శ్రమించాల్సి వస్తోంది. 2025 జనవరి నెలలో ఈ కారును ఏ ఒక్కరూ కూడా కొనుగోలు చేయలేదు. పైగా.. ఆరు నెలల వ్యవధిలో కారు అమ్మకాలు 22 యూనిట్లుగానే ఉన్నాయి.

బీఎండబ్ల్యూ కారు కొన్న పబ్‌జీ గేమర్.. ఈమె యూత్‌కు ఎంతో ఇన్‌స్పిరేషన్.. పాపం డ్రైవింగ్ రాక పరేషాన్!


అదిరిపోతున్న టాటా హారియర్- సఫారీ కొత్త ఎడిషన్.. వీటి లుక్ చూస్తే మతిపోతుంది..

ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి అత్యున్నత ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో ఇండియాలో ప్రసిద్ధి చెందిన ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్(tata motors) 2025 ఏడాదిలో తన హవాను చూపించడానికి సిద్ధమైంది. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో ఈవెంట్‌లో రెండు SUVలు హారియర్ స్టీల్త్ ఎడిషన్ ( Harrier Stealth Edition), సఫారీ స్టీల్త్ ఎడిషన్ (Safari Stealth Edition) మోడళ్లను ఆవిష్కరించగా, ఇప్పుడు వాటిని మార్కెట్లోకి విడుదల చేసింది. ఇవి ప్రస్తుతం వినియోగదారులకు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు ఇదే ఆటో ఎక్స్‌పోలో టాటా మోటార్స్ నెక్సాన్ EV, సఫారీ, హారియర్ బందీపూర్ ఎడిషన్‌లను కూడా ప్రదర్శించింది. ఇవన్నీ కూడా సందర్శకులను బాగా ఆకట్టుకున్నాయి. వీటిలో సఫారీ, హారియర్ స్టీల్త్ ఎడిషన్లను తాజాగా కస్టమర్ల చెంతకు తీసుకువచ్చింది.

అతి తక్కువ ధరలో కొత్త 2025 హోండా షైన్ వచ్చేసింది.. పేద-మధ్యతరగతి వారికి ఇక పండగే!

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా (Honda) మోటార్ ఇండియా దేశంలో స్కూటర్స్, బైక్స్‌ల విభాగంలో అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి చెందిన వాహనాలు దేశంలో ఢిల్లీ నుంచి గల్లి వరకు కూడా కనిపిస్తాయి. సాధారణంగా ఇండియాలో మధ్యతరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. ఎక్కువ డబ్బులు చెల్లించి బైకులను కొనుగోలు చేయలేని వారు తక్కువ ధరలో లభించేటువంటి హోండా టూవీలర్స్‌ను అధికంగా ఎంచుకుంటారు. ఈ కంపెనీ మోడళ్లు ప్రధానంగా తక్కువ ధరలో లభించడమే కాకుండా మైలేజ్ విషయంలో కూడా బాగా ఇస్తాయి. దేశంలో ప్రస్తుతం పెట్రోల్ రేట్లు రూ.110 కి దగ్గరగా ఉంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉండి పేద, మధ్యతరగతి వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటిది భారీ ధరకు లభిస్తున్న పెట్రోల్ కొనుగోలు చేయడం అంటే మరింత ఆర్థిక భారం అవుతుంది. రోజువారి ప్రయాణాలు చేసే వారి పరిస్థితి దారుణంగా ఉంటుంది.