ఇంత తక్కువ ధరలో ఇంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే కారు ఇదే.. అయినా కొనే వాళ్లు అంతంతే! దీనికి కారణం ఏంటంటే.‌.?

తక్కువ ధరలో దొరికే కార్లను కొనేందుకు గతంలో ఎక్కువమంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవారు. అయితే ప్రస్తుతం భారత మార్కెట్లో.. చాలా కార్లు ఖరీదైనవే ఉంటున్నాయి. రూ 10 లక్షల కంటే తక్కువగా ఉండే కార్లు దొరకడం ప్రస్తుతం అరుదుగా ఉన్నాయని మాత్రమే చెప్పవచ్చు. దీంతో అందరూ ఖరీదైన కార్ల పైనే దృష్టి పెడుతుండగా తక్కువ ధరలో దొరికే కార్లకు డిమాండ్ తగ్గిపోయింది. దీనిపై దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి గతంలో తమ ఆందోళన వ్యక్తం చేసింది. ఎందుకంటే.. తక్కువ ధరలో లభించే తమ మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కారు సేల్స్.. దీనివల్ల బాగా దెబ్బతిన్నాయి. ఈ 2025 జనవరి నెలలో ఈ అమ్మకాలు మరింతగా పడిపోయాయి.

భారత రోడ్లపై షేకింగ్ రైడ్ ఇవ్వడానికి వస్తున్న రెబెల్.. వచ్చే ఏడాది లాంచ్!

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ హోండా (Honda)కు ఇండియాలో ఎంత పెద్ద మార్కెట్ ఉందో అందరికీ తెలిసిందే. మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా బైక్స్, స్కూటర్లను విడుదల చేయడంలో ఇది బాగా ప్రసిద్ధి చెందిన సంస్థ. తక్కువ ధరలో రోజువారీ ప్రయాణాలకు అవసరమయ్యే మోడళ్లను భారతీయ వినియోగదారులకు అందించడంలో హోండా కంపెనీకి మంచి పేరుంది. దేశంలో హోండా యాక్టివా స్కూటర్ ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న మోడల్. మార్కెట్లోకి ఎన్ని స్కూటర్ మోడళ్లు వచ్చినప్పటికి యాక్టివాకు ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. కంపెనీ సైతం దీన్ని ఎప్పటికప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్ చేస్తూ మరి తీసుకొస్తుంది. స్కూటర్ విభాగంలోనే కాకుండా బైక్స్‌లలో కూడా ఇది బాగా ప్రసిద్ది చెందిన సంస్థ.

కిర్రాక్ ఫీచర్లతో రానున్న టాటా నెక్సాన్‌ కొత్త వెర్షన్... దీని లుక్స్, డిజైన్ వీర లెవెల్!

దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్లుగా ఈ బ్రాండ్ కార్లు వినియోగదారులను ఆకట్టుకుంటూనే వస్తున్నాయి. వాటిల్లో బాగా పాపులర్ అయిన సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ టాటా నెక్సాన్. లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు కస్టమర్లను బాగా ఆకర్షించడమే కాకుండా.. టాటా సంస్థకు బోలెడన్ని లాభాన్ని కూడా తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ మోడల్‌లో నెక్స్ట్-జనరేషన్ మోడల్‌ను వినియోగదారుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది టాటా సంస్థ. 'Garut' పేరుతో రానున్నట్లు తెలుస్తున్న ఈ కారు 2027 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న నెక్సాన్.. టాటా లైన్‌-అప్‌లో పంచ్ కారు తర్వాత బెస్ట్-సెల్లింగ్ మోడల్‌గా కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, స్సెసిఫికేషన్స్‌ తదితర అంశాలకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

టయోటా నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. విడుదలైన ఇంటీరియర్ వీడియో

ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ టయోటా (Toyota) ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా తన సత్తాను చాటడానికి సిద్ధమైంది. త్వరలోనే ఈ కంపెనీ తొలి ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలు ఈవీ విభాగంలో దూకుడుగా ఉన్నాయి. గత ఏడాది అనేక ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేయగా, ఈ 2025 ఏడాదిలో కూడా ఇవి మరిన్ని ఈవీ మోడళ్లను తీసుకురావడానికి ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాయి. ఇప్పటికే అతిపెద్ద కార్ల తయారీదారు అయిన మారుతీ సుజుకీ (Maruti Suzuki) కూడా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ SUV, e-Vitara కారును తీసుకొచ్చింది. దీన్ని జనవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పో 2025లో కూడా ఆవిష్కరించింది. త్వరలోనే ఇది వినియోగదారుల వద్దకు చేరడానికి సిద్దంగా ఉంది.
Advertisement

భారీ ఆఫర్స్‌తో తక్కువ ధరకే ఈ అడ్వెంచర్ టూరర్ బైక్‌ను సొంతం చేసుకునే అవకాశం

భారత్‌లో అడ్వెంచర్ టూరింగ్ బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇటీవల కాలంలో చాలా మంది బైక్స్‌తో లాంగ్ టూర్లకు, ఆఫ్‌రోడ్ రైడింగ్‌లకు ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో ఇలాంటి మోడళ్లు ఇప్పుడు మార్కెట్లోకి వరుసగా విడుదల అవుతున్నాయి. బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ వంటి బైక్స్‌తో పాటు జపనీస్ టూవీలర్ తయారీదారు సుజుకీకి కూడా పలు మోడళ్లను విక్రయిస్తుంది. అయితే హిమాలయన్ మోడల్ దేశీయంగా బాగా అమ్ముడుపోతున్న అడ్వెంచర్ టూరింగ్ బైకుల జాబితాలో ముందు స్థానంలో ఉంటుంది. ఈ క్రమంలో దీనికి పోటీగా సుజుకీకి(Suzuki) చెందిన ఇదే తరహా బైక్ 250cc అడ్వెంచర్ టూరర్ V-Strom SX ప్రస్తుతం అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ బైక్‌ను ఆఫ్ రోడ్ రైడింగ్‌లకు అత్యంత అనువైన మోడల్ అని సుజుకీ పేర్కొంది. హైవే మార్గాల్లో టూరింగ్‌కు ప్లాన్ చేసిన వారికి కూడా ఇది బెస్ట్ ఆప్షన్.

మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ కారు లాంచ్‌కి ముహూర్తం ఫిక్స్.. రోడ్లపై సందడి చేయనున్న ఇ-విటారా కారు

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అనేక వాహన తయారీ సంస్థలు తమ ఈవీలతో పోటీ పడుతున్నాయి. అయితే దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి మాత్రం ఇంకా ఈ రేసులోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ త్వరలోనే తమ తొలి ఎలక్ట్రిక్ వాహనం అయిన ఇ-విటారాను లాంచ్ చేసి పోటీ‌ పెంచేందుకు సిద్ధమవుతోంది. మారుతి సుజుకి తొలి ఎలక్ట్రిక్ వాహనమైన ఇ-విటారా కారును దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌లలో లాంచ్ చేయనుంది. దీని ద్వారా ఈవీ సెగ్మెంట్‌లో తమ సత్తా చాటాలని ఈ సంస్థ భావిస్తోంది. ఈ కారు విశేషాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం

30 కి.మీ మైలేజ్ ఇచ్చే హైబ్రిడ్ క్రెటా కారు త్వరలో లాంచ్ కాబోతుంది!

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) దేశంలో ఇటీవల కొత్త మోడళ్లను తీసుకురావడంపై కీలకంగా దృష్టి సారించింది. ఆటోమొబైల్ పరిశ్రమలో విపరీతమైన పోటీ కారణంగా వీలైనంత వేగంగా కొత్త కార్లను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తూనే అదే సమయంలో తన పాత మోడళ్లను ట్రెండ్‌కు అనుగుణంగా కొత్తగా మార్పులు చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి కూడా కృషి చేస్తుంది. ఇప్పటికే కొన్నింటిని పూర్తిగా అప్‌డేట్ చేసి విడుదల చేయగా అవి చాలా వరకు సక్సెస్ అయ్యాయి. అమ్మకాల పరంగా మెరుగ్గా ఉన్నాయి. మిడ్-సైజ్ SUV మార్కెట్లో అగ్రగామి అయిన హ్యుందాయ్ తన క్రెటా కారును కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేయడానికి సిద్ధం అయింది. ఈ మోడల్‌ను ఇప్పటికే పలు దఫాలుగా అనేక మార్పులకు లోనవగా, ఇప్పుడు దీని మూడవ తరం మోడల్‌ను సైతం తీసుకురావడానికి ప్రణాళికలు చేస్తుంది. క్రెటా కారుకు భారతీయ వినియోగదారుల్లో మంచి ఆదరణ ఉంది.

34 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే ఈ కారు ధర కేవలం రూ. 4 లక్షలు మాత్రమే!

భారత అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) పేద, మధ్య తరగతి వినియోగదారులకు అనుకూలంగా ఉండే విధంగా తక్కువ ధరలో కార్లను విడుదల చేయడంలో చాలా ప్రసిద్ధి చెందిన సంస్థ. అందుబాటు ధరలో మంచి కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్న వారు ఈ కంపెనీకి చెందిన మోడళ్లను ఎక్కువగా ఎంచుకుంటారు. ఇదిలా ఉంటే ఇటీవల మారుతీ వరుసగా తన కార్ల అమ్మకాల వివరాలను విడుదల చేస్తుంది. తాజాగా తన ప్రసిద్ధ మోడల్ ఆల్టో కె10 (Alto K10)కు సంబంధించి 2025 జనవరి సేల్స్ డేటాను వెల్లడించింది. మారుతీ వెల్లడించిన దాని ప్రకారం, ఈ కారు అమ్మకాలు ఈ నెలలో 11,352 యూనిట్లుగా ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇదే కంపెనీ చెందినటువంటి ఆఫ్‌రోడ్ కింగ్ జిమ్నీ, S-ప్రెస్సో, సెలెరియో వంటి మోడళ్ల కంటే కూడా ఆల్టో కారు మెరుగైన సేల్స్ సాధించడం గమనార్హం.

కారు ఫ్యూయల్ తగ్గించుకునేందుకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.. తేడా మీరే చూస్తారు!

దేశంలో ఇంధన ధరల భారం పెరిగిపోతోంది. చాలామంది తమ సంపాదనలో ప్రతినెల కొంత ఫ్యూయల్ ఖర్చులకోసం తీసి పక్కన పెడుతూ ఉంటారు. సాధ్యమైనంత మేర ఈ ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఫ్యూయల్ ఖర్చులతో పాటు.. మనం వాడే కారు మెయింటెనెన్స్ ఖర్చులు కూడా అదనంగా ఉంటాయి. మనం మన కారు సరిగ్గా సర్వీసు చేయించకపోతే ఈ ఫ్యూయల్ భారం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ ఖర్చుల్లో చాలావరకు మనం ఆదా చేసుకోవచ్చు. అంటే దీన్నిబట్టి కారు మెయింటెనెన్స్‌కు, దాని ఫ్యూయల్ కన్సంప్షన్‌కు మధ్య సంబంధం ఉంటుందనేది తెలుస్తుంది. అయితే ఈ కథనంలో ఫ్యూయల్ కాస్ట్ తగ్గించుకోవడానికి ఉండే అవకాశాలు ఏంటో చూసేద్దాం.

వాలంటైన్స్ డే రోజు మీ భార్యకు ఈ స్పెషల్ గిఫ్ట్ ఇస్తే కచ్చితంగా ఫ్లాట్ అవ్వాల్సిందే

మరో రెండు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం రాబోతుంది. ప్రతి ఏడాది లాగే ఈ ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను తమకు ఇష్టమైన వారితో ఎంతో సంతోషంగా జరుపుకోడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఈ రోజు కోసం ఏడాది పాటు వేచి ఉంటారు. తమ ప్రేమను అవతలి వారికి వ్యక్తం చేయడానికి వాలెంటైన్స్ డేను పెద్ద పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమికులు ప్రేమగా ఒకరికొకరు బహుమతులను ఇచ్చుపుచ్చుకుంటారు. అవతలి వారిని ఆకట్టుకునే విధంగా గిఫ్ట్‌లను ఎంచుకోవాలని చూస్తారు. స్నేహితురాలు లేదా మీ భార్యకు పెద్ద బహుమతి ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి మార్కెట్లో చాలా రకాల బహుమతులు అందుబాటులో ఉన్నాయి. వారిని పెద్ద సర్‌ప్రైస్ విధంగా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్న వారికి స్కూటర్ సరైన బహుమతి అవుతుంది.

చూడగానే ఆకట్టుకునే ఇంటర్నేషనల్ కారు ఇప్పుడు మన దగ్గరికే వస్తుంది

ఇండియా మార్కెట్ ప్రపంచ ఆటోమొబైల్ పరిశ్రమకు అత్యంత కీలకమైంది. అంతర్జాతీయంగా బాగా ప్రసిద్ది చెందిన వాహన తయారీ కంపెనీలు భారత్‌ వైపు చూస్తున్నాయి. చాలా దేశాలు ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నప్పటికీ భారత్ మాత్రం అన్నింటిని తట్టుకుని బలంగా నిలబడి బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యంగా దేశ జీడీపీ వృద్ధి చెందడానికి ప్రధానంగా వాహన పరిశ్రమ అత్యంత కీలకంగా ఉంది. దేశీయంగా ఉన్న పలు సానుకూల అంశాల కారణంగా తయారీదారులు తమ మార్కెట్‌ను బాగా విస్తరించుకుంటున్నారు. ఈ తరుణంలో టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి కంపెనీలు పోటీ పడి మరి కొత్త మోడళ్లను విడుదల చేస్తుండగా, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలు కూడా ఇప్పుడు వీటికి పోటీగా అధునాతన కార్లను లాంచ్ చేస్తున్నాయి. మధ్యతరగతి వినియోగదారుల కోసం మాత్రమే కాకుండా లగ్జరీ కార్ల వినియోగదారుల కోసం కూడా అదిరిపోయే మోడళ్లు దేశంలో విడుదల అవుతున్నాయి.

ఈ హ్యాచ్‌బ్యాక్‌పై ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్న జనం.. ఏకంగా 2 లక్షల మంది కొనేశారు!

భారత మార్కెట్లో కార్లలో హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌దే ఒకప్పుడు అగ్ర తాంబూలం. అయితే.. కొన్ని సంవత్సరాలుగా హ్యాచ్‌బ్యాక్‌లపై ఆదరణ తగ్గిపోతూ వస్తోంది. వీటి స్థానాన్ని క్రమక్రమంగా ఎస్‌యూవీలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయినప్పటికీ.. హ్యాచ్‌బ్యాక్‌లను ఇష్టపడే వారి సంఖ్య అధికంగానే ఉంటోంది‌. అనేక దిగ్గజ వాహన తయారీ సంస్థలు ఇప్పటికీ ఈ సెగ్మెంట్లో వివిధ మోడళ్లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. వాటిల్లో.. టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వినియోగదారులను బాగా ఆకట్టుకుంటున్న ఈ కారు సేల్స్‌లో దూసుకెళ్లిపోతోంది. సేల్స్ విషయంలో టయోటా గ్లాంజా సరికొత్త మైలురాయి‌ని దాటింది. ఆ విశేషాలు చూసేద్దాం.
Advertisement

కొత్త స్కూటర్లతో రానున్న పాపులర్ కంపెనీ.. ఈసారి మరింత స్పెషల్‌గా.. కొనేందుకు రెడీగా ఉన్నారా?

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో.. విదేశీ కంపెనీల వాహనాలు కొన్ని చాలా పాపులర్ అయ్యాయి. అలాంటి వాటిల్లో ఒక కంపెనీ వెస్పా. ఇటలీకి చెందిన ఈ కంపెనీ స్కూటర్లు భారత కస్టమర్లను ఎన్నో ఏళ్లుగా విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు వినియోగదారులకు మరింత చేరువ కావడం కోసం ఈ స్కూటర్లో కొన్ని కొత్త మోడళ్లను తీసుకురానుంది. అధునాతన ఫీచర్లు జోడించి వీటిని అందుబాటులోకి తేనుంది. వాటి పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం. వెస్పా స్కూటర్లు భారత మార్కెట్లో ఖరీదైన స్కూటర్లుగా పేరుగాంచాయి. ఈ బ్రాండ్ నుంచి ఇతర స్కూటర్ల తరహాలోనే ఈ 2025 మోడళ్లలో కూడా మంచి ఫీచర్లు ఉండడమే కాకుండా కొత్త సాంకేతికతను ఈ సంస్థ వినియోగించింది.

పెద్ద ఫ్యామిలీకి చక్కగా సరిపోయి సెవెన్ సీటర్ కారు ఇదే.. ధర కూడా చాలా తక్కువే!

భారత్‌లో 7- సీటర్ కార్ల వినియోగం పెరుగుతోంది. ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లేందుకు.. పెద్ద కారు అయితే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. అందుకే ఏరి కోరి మరీ వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే సాధారణ కార్ల కంటే.. వీటి ధరలు అధికంగా ఉండడం చాలామందిని కొనుగోలులో వెనుకడుగు వేసేలా చేస్తోంది. ఇలాంటి సమస్యకు సమాధానం చెబుతూ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి.. తమ ఎర్టిగా మోడల్ కారును అందుబాటు ధరలో తీసుకువచ్చింది. దీన్ని "వ్యాల్యూ ఫర్ మనీ" కారుగా చెప్పొచ్చు. అధునాతన ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.

గత కొన్ని నెలలుగా విండ్సర్ కారును అందరు తెగ కొంటున్నారు

భారతదేశం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు అతిపెద్ద గమ్యస్థానంగా ఉంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో లేని సానుకూలతలు భారత్‌లో ఉండటం కారణంగా అంతర్జాతీయ కంపెనీలు మన దగ్గరే ప్లాంట్‌లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయి. భారత్ ఈవీ భవిష్యత్తుకు అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం భారీగా పెరిగింది. ముఖ్యంగా గత ఏడాది అమ్మకాలను చూసినట్లయితే గతంలో కంటే కూడా 2024లో ఈవీ సెగ్మెంట్‌లో అన్ని వాహనాల విక్రయాలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లోకి కొత్త మోడళ్ల రాక ఎక్కువ అయింది. దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు పోటా పోటీగా అధునాతన కార్లను లాంచ్ చేస్తూ తమ మార్కెట్‌ను వేగంగా విస్తరించుకుంటున్నాయి. ఇదే క్రమంలో ప్రముఖ కార్ల తయారీ దారు అయిన ఎంజీ (MG) కూడా ఈవీలను విడుదల చేస్తూ తన సత్తాను చాటుకుంటుంది. గతంలో తీసుకొచ్చిన విండ్సర్ (windsor) అమ్మకాల పరంగా దుమ్ములేపుతుంది.

మహీంద్రా థార్ రాక్స్ మీ సొంతం కావాలంటే 1.5 సంవత్సరాలు ఆగాల్సిందే

ఇండియాలో ప్రస్తుతం మహీంద్రా (Mahindra) కంపెనీకి చెందిన థార్ (Thar) మోడల్ ఒక సంచలనమైన కారుగా ఉంది. దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న స్టైలిష్ ఎస్‌యూవీలలో ఇది టాప్ ప్లేస్‌‌లో ఉంటుంది. మార్కెట్లోకి విడుదల అయిన అతి తక్కువ కాలంలోనే ఇది ఇతర మోడళ్లకు అందనంత ప్రజాధారణ పొందింది. మొదటగా 3 డోర్ థార్‌ను మహీంద్రా విడుదల చేసింది. బుకింగ్స్‌లలో ఇది సునామీ సృష్టించింది. దీని ఆకట్టుకునే రూపం, ఇంజిన్ పనితీరు కారణంగా భారతీయ వినియోగదారులకు ఈ కారును ఎగబడి మరి కొనుగోలు చేశారు. ఈ మోడల్‌కు భారీ డిమాండ్ రావడంతో మహీంద్రా దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ 5-డోర్ల వెర్షన్ రాక్స్‌ను(Thar Roxx) విడుదల చేసింది. దీన్ని ఆగస్టు 2024లో ఘనంగా లాంచ్ చేసింది. థార్‌తో పోలిస్తే రాక్స్‌ మరింత పొడుగ్గా ఉంటుంది.

టాప్‌ క్లాస్‌ మైలేజీతో హ్యుందాయ్ అప్‌డేటెడ్ కారు... ఫీచర్లలో కూడా తోపే!

కార్లలో ఎన్ని రకాల మోడల్స్ వచ్చినా సెడాన్ కార్లకు ఉన్న క్రేజే వేరు. చాలామందికి ఇది ఫేవరెట్ కారుగా ఉంటుంది. ఇప్పుడు ఈ సెడాన్ల స్థానాన్ని ఎస్‌యూవీలు క్రమక్రమంగా ఆక్రమించినప్పటికీ.. వీటిని కొనే వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ సెడాన్లలో లార్జ్ సెడాన్ల కంటే కాంపాక్ట్ సెడాన్ కార్లను డిమాండ్ ఎక్కువగా ఉంది. మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరా టాటా టిగోర్ వంటివి.. లార్జ్ సెడాన్ కార్లకు ఉదాహరణలు. ఇందులో హ్యుందాయ్ ఆరా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది భారీ బూట్ స్పేస్‌తో ఉండి కంఫర్టబుల్ రైడ్ అందిస్తుంది. ఇప్పుడు ఇందులో కొత్త వేరియంట్ లాంచ్ అయింది. ఈ హ్యుందాయ్ ఆరా కారుకు మారుతి డిజైర్ హోండా అమేజ్ కార్లు పోటీగా ఉన్నాయి.

మార్కెట్లోకి కొత్త బండి వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్స్ దీని సొంతం

ఇండియాలో సబ్ కాంపాక్ట్ SUVలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు. వీటి తరువాత సబ్ కాంపాక్ట్ సెడాన్‌లను ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఈ విభాగంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతీ సుజుకీ (Maruti Suzuki)కి చెందిన డిజైర్, మరో కంపెనీ హోండా (Honda)కు చెందిన అమేజ్ వంటివి బలమైన మోడళ్లుగా ఉన్నాయి. వీటికి ప్రధాన పోటీదారుగా టాటా టిగోర్ (tata tigor) ప్రస్తుతం గట్టి పోటీదారుగా ఉంది. ఆటోమొబైల్ మార్కెట్లో వివిధ కంపెనీల మధ్య పోటీ విపరీతంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కస్టమర్లను ఆకట్టుకోడానికి అదిరిపోయే ఫీచర్స్‌తో మోడళ్లను తీసుకొస్తేనే అమ్మకాలు పెరిగే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలో టాటా తన టిగోర్ కారును సరికొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది. 2025 మోడల్ రూ.6 లక్షల నుంచి మొదలవుతుంది. ఇది ఎక్స్-షోరూమ్ ధర.

తుఫాన్ వేగంతో దూసుకొస్తున్న చైనా ఈవీ కారు.. లాంచ్ ఎప్పుడంటే

ప్రస్తుతం ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో ఇటీవల కాలంలో జరుగుతున్న అమ్మకాలను చూస్తే తెలిసిపోతుంది. పెట్రోల్, డీజిల్, Cng వంటి సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఈవీ కార్లను చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో దేశీయ, అంతర్జాతీయ వాహన తయారీ కంపెనీలు వరుసగా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే దేశీయంగా టాటా మోటార్స్, హ్యుందాయ్, మహీంద్రా, ఇటీవల కొత్త మారుతీ సుజుకీ సైతం ఈవీలపై ప్రధానంగా దృష్టి సారించాయి. ఇండియా ఈవీ మార్కెట్ రానున్న రోజుల్లో భారీగా విస్తరించే అవకాశం ఉంది. ప్రపంచంలో లేని చాలా అవకాశాలు ఇక్కడ ఉండటం కారణంగా అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన ఈవీ తయారీదారులు ఇప్పుడు భారత్‌ వైపు చూస్తూ తమ కొత్త పెట్టుబడులను పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు అయితే ఇప్పటికే భారత ప్రభుత్వంతో పలు దఫాలు చర్చలు కూడా జరిపాయి.

జనవరి నెలలో డీలాపడ్డ మారుతి సుజుకి డిజైర్ కారు.. అమ్మకాల్లో అంత తక్కువగా..!

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో.. దిగ్గజ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి పేరు ఎంతో ప్రత్యేకం. తమ బ్రాండ్ నుంచి వచ్చిన వాహనాలతో తరతరాలుగా వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తోందీ సంస్థ. అయితే సేఫ్టీ స్టాండర్డ్స్ విషయంలో ఈ సంస్థ కార్లు గతంలో విమర్శలు ఎదుర్కొన్నాయి. ఆ విమర్శలకు సమాధానం చెబుతూ.. మారుతి సుజుకి డిజైర్ కారు సేఫ్టీలో ఔరా అనిపించింది. గ్లోబల్ ఎన్‌క్యాప్(G NCAP) క్రాష్ టెస్టులో ఈ కారు ఫైవ్-స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. అంతటి ఘన చరిత్ర కలిగినప్పటికీ.. ఈ డిజైర్ కారు ప్రస్తుతం కష్ట కాలాన్ని ఎదుర్కొంటోంది. ఇంతకీ అసలు వివరాలు ఏంటంటే..
Advertisement

చరిత్ర తిరగరాయడానికి ఓల్డ్ టైగర్‌ను దింపుతున్న టాటా మోటార్స్

భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యుత్తమమైన ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో టాటా మోటార్స్(Tata Motors) ఎప్పుడు అగ్రగామిగా ఉంటుంది. చాలా ఏళ్లుగా టాటా అదిరిపోయే కార్లు విక్రయిస్తూ, భారతదేశం పేరును ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేస్తుంది. తన పాత మోడళ్లను కొత్తగా అప్‌డేట్ చేస్తూనే ఇదే సమయంలో అదిరిపోయే కొత్త వాటిని సైతం విడుదల చేస్తుంది. తాజాగా టాటా మోటార్స్ తన ప్రసిద్ధ మోడల్ సియెర్రా (sierra) కారును సరికొత్త రూపంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఇది ఒక ఎస్‌యూవీ మోడల్. 1991 నుంచి 2003 వరకు భారతదేశ రోడ్లపై బాగా ప్రసిద్ధి చెందిన మోడల్. ఇప్పుడు ఈ కారును తిరిగి మరింత కొత్తగా మార్చి మార్కెట్లోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో కూడా ఈఎస్‌యూవీని ప్రదర్శించారు.

మిడ్-సైజ్ ఎస్‌యూవీల్లో బెస్ట్ సెల్లింగ్ కార్లు ఇవే.. అందరూ ఆకారు కోసమే ఎగడుతున్నారు.. ఎందుకని?

దేశంలో ఎస్‌యూవీల వాడకం పెరుగుతోంది. ఎక్కువమంది ఎస్‌యూవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపెడుతుండడంతో.. వీటి సేల్స్ కూడా పెరుగుతున్నాయి. ఈ ఎస్‌యూవీల్లో చాలా రకాలు ఉంటాయి. మైక్రో ఎస్‌యూవీలు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు, మిడ్-సైజ్ ఎస్‌యూవీలు, ఫుల్ సైజ్ ఎస్‌యూవీలు అని వివిధ పేర్లతో ఉంటాయి. ఇక మిడ్-సైజ్ ఎస్‌యూవీల విషయానికి వస్తే ఇవి 4.3 మీటర్ల నుంచి 4.5 మీటర్ల పొడవుతో ఉంటాయి. అయితే ఈ జనవరి నెలలో వినియోగదారులను బాగా ఆకట్టుకున్న టాప్ -10 మిడ్-సైజ్ ఎస్‌యూవీలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

తక్కువ ధరలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారులో అదిరిపోతున్న కొత్త సేఫ్టీ ఫీచర్స్

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ(Maruti Suzuki) మధ్యతరగతి వినియోగదారులకు అందుబాటులో ఉండే వాహనాలను విడుదల చేస్తూ, దేశంలో అందరి అభినందనలు పొందుతుంది. దశాబ్దాల కాలంగా మార్కెట్లో రారాజుగా నిలుస్తూ, ఇతర తయారీ కంపెనీలకు అందనంత ఎత్తులో ఉంది. మారుతీ నుంచి విడుదలయ్యే కార్లు ఢిల్లీ నుంచి గల్లీ వరకు రోడ్లపై కనిపిస్తుంటాయి. ప్రధానంగా కొన్నేళ్ల క్రితం మారుతీ నుంచి వచ్చిన ఒక మోడల్ భారతీయ మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా నిలిచి ప్రస్తుతం తక్కువ సేల్స్‌ను సాధిస్తుంది. అలాంటి కారును తాజాగా మరుతీ అప్‌డేట్ చేసి మరి విడుదల చేసింది. ఆ మెడల్ పేరే 'సెలెరియో (Celerio)'. మారుతీ ఈ కారులో ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించి అత్యుత్తమ ప్రమాణాలను అందించి ఇటీవల తిరిగి కొనుగోలుకు అందుబాటులోకి తీసుకొచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీ ఎక్కువగా అందించే కారును ఎంచుకుంటున్నారు.

27.97 కి.మీ మైలేజ్ ఇచ్చే టయోటా కారును జనాలు తెగ కొంటున్నారు

ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ టయోటా(Toyota) ఆకర్షణీయమైన మోడళ్లను విడుదల చేయడంలో ఎప్పుడు కూడా ముందు స్థానంలో ఉంటుంది. అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగా కూడా అధునాతన కార్లను లాంచ్ చేస్తూ, ప్రత్యర్థి కంపెనీలకు బలమైన పోటీదారుగా ఉంది. తాజాగా కంపెనీ తన ఫేవరెట్ మోడల్ అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (urban cruiser hyryder) ఎస్‌యూవీ (Suv)కి సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది. టయోటా విడుదల చేసిన డేటా ప్రకారం, 2025 జనవరి నెలలో ఈ కారు అమ్మకాల పరంగా మెరుగైన గణాంకాలను నమోదు చేసింది. ఈ సమీక్ష నెలలో ఎస్‌యూవీని దాదాపు మొత్తం 4,941 మంది కొనుగోలు చేశారు. ఇది 2024 డిసెంబర్‌లో జరిగిన 4,770 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే నెలవారీగా 3.46 శాతం వృద్ధిని సూచిస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం వాహన తయారీ కంపెనీల మధ్య బలమైన పోటీ నడుస్తోంది.

భారత ఆర్మీలో ఈ ఎంపీవీ వాహనానం వెరీ వెరీ స్పెషల్.. సైనికుల కోసం శత్రువుల నుంచి సేఫ్‌గా..

భారత ఆర్మీలో అప్పుడప్పుడు విభిన్న‌మైన వాహనాలను మనం చూస్తూ ఉంటాం. వాటిని చూసి.. 'అరే ఇదేదో భలే ఉందే' అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇలాంటివి 'ఎక్కడైనా కొనేందుకు దొరుకుతాయా' అని వెతికే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అలాంటి ఒక ప్రత్యేక వాహనం భారత ఆర్మీ కోసం సిద్ధమైంది. అదే VFJ ట్రక్కు. VFJ అంటే.. వెహికల్ ఫ్యాక్టరీ జబల్‌పుర్ అని అర్థం. ఇక ఈ ట్రక్కు పూర్తి పేరు VFJ MPV 6X6. పేరులో ఎంపీవి అని చూసి ఇదేదో మనం రెగ్యులర్‌గా వాడే కారు అనుకుంటే పొరపడినట్టే! మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వాహనం విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.