ఇంత మంచి కారును ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ కారును కొనలేదు!

జనవరి నెల ముగిసిన నేపథ్యంలో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీలు వరుసగా తమ అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్నాయి. మొత్తం సేల్స్‌తో పాటు, విడివిడిగా మోడళ్ల వారీగా కూడా డేటాను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ సిట్రోయెన్(Citroen) ఇండియా ఇటీవల జనవరి 2025 అమ్మకాలను విడుదల చేసింది. దీని ప్రకారం, ఈ నెలలో కంపెనీ అనుకున్నంత సేల్స్‌ను నమోదు చేయలేకపోయింది. ఇండియాలో సిట్రోయెన్ విక్రయిస్తున్న ఐదు మోడళ్లలో C3 మోడల్ ఒక్కటే కొంచెం మెరుగైన అమ్మకాలతో మంచి స్థానంలో ఉంది. ఈ కారును 242 మంది కొనుగోలు చేశారు. అయితే ఇదే సమయంలో C5 ఎయిర్‌క్రాస్ (Aircross) కారును మాత్రం ఒక్క కస్టమర్ కూడా కొనుగోలు చేయకపోవడం గమనార్హం. దీన్ని వినియోగదారులు ఎవరు కూడా ఆదరలించలేదని డేటాను చూస్తేనే తెలుస్తుంది.

టాటా టియాగో ఈవీ Vs విన్‌ఫాస్ట్ వీఎఫ్3.. ఈ రెండు ఎలక్ట్రిక్ కార్ల మధ్య గట్టి పోటీ.. బెటర్ ఏదంటే..?

దేశంలో ఎలక్ట్రిక్ కార్ల సందడి కొనసాగుతోంది. స్టార్టప్ సంస్థల నుంచి మొదలుకొని.. విదేశీ దిగ్గజ సంస్థల వరకు అన్ని వాహన తయారీ సంస్థలు ఈవీలతో మార్కెట్లో పోటీ పెంచుతున్నాయి. ఇక దేశీయ దిగ్గజ సంస్థ టాటా మోటార్స్ నుంచి అతి తక్కువ ధరలో వచ్చిన ఎలక్ట్రిక్ కారు మోడల్ టాటా టియాగో ఈవీ. మరోవైపు విదేశీ సంస్థ విన్‌ఫాస్ట్ సంస్థ నుంచి VF3 ఎలక్ట్రిక్ కారు త్వరలో భారత మార్కెట్లోకి రానుంది. ఈ రెండు కారు మోడల్స్ ఒక దానికి ఒకటి గట్టి పోటీ నిచ్చేలా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు కార్ల మధ్య ఉన్న తేడాలు పోలికలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

అదిరిపోతున్న Tvs Jupiter CNG స్కూటర్.. లాంచ్ ఎప్పుడంటే..?

ఇండియా టూవీలర్ తయారీదారుల్లో ప్రసిద్ధ కంపెనీ అయిన టీవీఎస్ (Tvs) ఇటీవల కాలంలో సేల్స్ పరంగా బాగా పుంజుకుంటుంది. హీరో మోటోకార్ప్, హోండా వంటి టూవీలర్ కంపెనీలకు బలమైన ప్రత్యర్థిగా నిలుస్తూ, భారతీయ వినియోగదారుల కోసం అదిరిపోయే మోడళ్లను విడుదల చేస్తూ, మార్కెట్లో సరికొత్త టూవీలర్స్‌ను లాంచ్ చేస్తుంది. ప్రస్తుతం పోటీ వాతావరణం ఎక్కువ అయిన నేపథ్యంలో టీవీఎస్ వరుసగా కొత్త మోడళ్లను తీసుకురావడానికి ప్లాన్ చేసింది. ఇటీవల దేశరాజధాని ఢిల్లీలో జరిగిన భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో జూపిటర్ 125 CNG మోడల్‌ను ఘనంగా ఆవిష్కరించింది. ఇది కొనుగోలుకు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇతర టూవీలర్ తయారీదారులకు గట్టి పోటీ అవుతుంది. ఈ స్కూటర్ ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. దీని గురించిన ఫీచర్స్, డిజైన్, లాంచ్ వివరాలను కింది కథనంలో తెలుసుకోండి..

20 ఏళ్ల నుంచి డిమాండ్ ఏ మాత్రం తగ్గని 33 కి.మీ మైలేజ్ ఇచ్చే మారుతీ కారు

దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారతదేశంలో విడుదలై ఇప్పటికి కూడా దేశంలో డిమాండ్ తగ్గని కారు అంటే మొదటగా గుర్తుకువచ్చేది మారుతీ సుజుకీకి(Maruti Suzuki) చెందిన హ్యాచ్‌బ్యాక్ కారు స్విఫ్ట్ (Swift) మాత్రమే. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఈ కారును జనాలు ఆదరిస్తున్నారు. మార్కెట్లోకి ఎన్నో కొత్త మోడళ్లు వచ్చినప్పటికి మారుతీ స్విఫ్ట్‌కు మాత్రం ఇంకా ఆదరణ తగ్గలేదు. తాజాగా కంపెనీ ఈ హ్యాచ్‌బ్యాక్ అమ్మకాల వివరాలను వెల్లడించింది.మారుతీ సుజుకీ నుంచి వచ్చిన డేటా ప్రకారం, 2025 జనవరిలో స్విఫ్ట్‌ను దాదాపు 17,081 మంది కొనుగోలు చేశారు. ఇతర కంపెనీల నుంచి చాలా అధునాతన కార్లు కొనుగోలుకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా జనాలు ఇన్నేళ్లుగా ఈ కారును కొనుగోలు చేస్తూనే ఉండటం విశేషం. మిగతా హ్యాచ్‌బ్యాక్ మోడళ్లకు స్విఫ్ట్ బలమైన ప్రత్యర్థిగా ఉంది.
Advertisement

ఈ కారును జనాలు తెగ కొంటున్నారు.. ఏకంగా షోరూమ్‌ ముందు క్యూ

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ ఇండియా (Hyundai)ఇటీవల తన మోడళ్లకు సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడిస్తుంది. తాజాగా తన ప్రసిద్ధ మోడల్ క్రెటా (Creta) 2025 జనవరిలో సాధించిన సేల్స్ వివరాలను కంపెనీ విడుదల చేసింది. ఇది భారతీయ మార్కెట్లో ప్రసిద్ధ suvగా ఉంది. ఈ కారుకు దేశంలో వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. హ్యుందాయ్ గణాంకాల ప్రకారం, జనవరి నెలలో క్రెటా మొత్తం 18,522 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ఆటో పరిశ్రమలో విపరీతమైన పోటీ నెలకొంది. ఇలాంటి సమయంలో మిగతా కంపెనీలను దాటుకుని మరి క్రెటా అత్యధిక నెలవారీ అమ్మకాలను సాధించింది. దీని ఆకట్టుకునే డిజైన్, అధునాతన ఫీచర్స్ కారణంగా కొత్తగా కారు కొనుగోలు చేయాలని అనుకునే వారు క్రెటా ఎస్‌యూవీని ఎంచుకుంటున్నారు. ఇది దేశంలో లాంచ్ అయినప్పటి నుంచి కూడా కస్టమర్ల నుంచి విపరీతమైన డిమాండ్‌ను పొందుతూనే ఉంది.

టాటా ఎలక్ట్రిక్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్.. అన్ని పాపులర్ ఈవీ మోడళ్ల ధరలు తగ్గింపు!

దేశంలో అన్నివర్గాల వారికి సరిపడే కార్లను తయారు చేస్తూ చేరువైన దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్. ప్రసుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈవీల్లోనూ ఈ కంపెనీ తనకు తిరుగులేదని అనేకసార్లు నిరూపించింది. ఈ సంస్థ నుంచి వచ్చిన పంచ్ ఈవీ, టియాగో ఈవీ, నెక్సాన్ ఈవీ, కర్వ్ ఈవీ వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ఈ ఈవీలను మరింతమందికి చేరువచేసేలా టాటా సంస్థ ఓ అదిరిపోయే ఆఫర్‌తో ముందుకు వచ్చింది. తమ ఎలక్ట్రిక్ కార్ల మోడళ్లపై భారీగా ధర తగ్గింపు ప్రకటించింది. ఆ విశేషాలేంటో చూసేద్దాం.

27.1 కి.మీ మైలేజ్ ఇచ్చే హ్యుందాయ్ కారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన కస్టమర్లు!

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) ఇటీవల వరుసగా తన కార్ల అమ్మకాలను వెల్లడిస్తుంది. ఇంతకుముందు 2024 ఏడాదికి సంబంధించిన సేల్స్ వివరాలను విడుదల చేసిన కంపెనీ తాజాగా 2025 జనవరి నెలకు సంబంధించిన డేటాను వెల్లడించింది. ఈ సేల్స్‌లో తన ప్రసిద్ధ మోడల్ ఎక్స్‌టర్ (Exter) గురించిన అమ్మకాలను చూసినట్లయితే గత నెలలో 6,068 యూనిట్ల ఎక్స్‌టీ ఎస్‌యూవీ విక్రయాలను నమోదు చేసిందని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది గత ఏడాది అంటే 2024 జనవరి నెలలో 8,229 యూనిట్ల అమ్మకాలను సాధించింది. ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే సేల్స్ దాదాపు 26 శాతం తగ్గడం గమనార్హం. ఇదిలా ఉంటే 2024 చివరి నెల డిసెంబర్‌లో మొత్తం 5,270 యూనిట్లు అమ్ముడుపోగా, ఒక నెల రోజుల వ్యవధిలోనే సేల్స్ తిరిగి పుంజుకున్నాయి.

ఈ కారు డిమాండ్‌ అధరహో..! డిమాండ్ తట్టుకోలేక బుకింగ్స్ కూడా క్లోజ్!

భారత ఆటో మొబైల్ మార్కెట్లో పాపులర్ బ్రాండ్ అయిన మారుతి సుజుకి నుంచి వచ్చిన బెస్ట్- ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ జిమ్నీ. ఈ కారుపై ఎన్నో అంచనాలు పెట్టుకుని విడుదల చేసిందీ సంస్థ. కానీ, ఇది భారతీయుల నుంచి ఆశించినంత స్పందనను అందుకోలేకపోయింది. కానీ, ఇదే కారు ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో తన సత్తా చాటుతోంది. భారతీయులు కాదన్న దాన్ని విదేశీయులు తెగ ఆరాధిస్తున్నారు. జపాన్‌లో జనవరి 30న మారుతి సుజుకి మాతృసంస్థ అయిన సుజుకి.. ఈ కారును జపనీస్ మార్కెట్లో 'జిమ్నీ నోమేడ్' పేరుతో విడుదల చేసింది.

టాటా నానోకు పోటీగా కొత్త ఎలక్ట్రిక్ కారు.. తక్కువ ధరలో, త్వరలో రాబోతుంది

వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ (vinfast) ఇండియాలో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. అంతర్జాతీయంగా ఈ కార్లకు చాలా మంది కస్టమర్లు ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారత మార్కెట్‌పై ఎక్కువ ఫోకస్ చేసింది. ఇక్కడ కూడా తన వ్యాపారాన్ని విస్తరించడానికి పలు కొత్త మోడళ్లను విడుదల చేయాలని చూస్తుంది. దీనిలో భాగంగా త్వరలో లాంచ్ చేయబోయే కొన్ని కార్లను ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగినటువంటి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ఈవెంట్‌లో పలు ఎలక్ట్రిక్ కార్లను ప్రపంచానికి పరిచయం చేసింది. వీటిలో ముఖ్యంగా 'VF3' అనే ఎలక్ట్రిక్ కారు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది చూడటానికి చిన్నగా భలేగా అనిపిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో చిన్న ఫ్యామిలీ కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్ కారుకు ముహూర్తం ఖరారు..! లేటుగా వచ్చిన లేటెస్ట్ రికార్డులు సృష్టించేలా..!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. అందరూ ఖర్చులు కలిసొస్తాయని ఎక్కువగా ఈవీలవైపు మళ్లుతున్నారు. అనేక వాహన తయారీ సంస్థలు కూడా కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో ముందుకు వస్తున్నాయి. అయితే.. భారత మార్కెట్లో ఎంతో సుపరిచితమైన మారుతీ సుజుకీ మాత్రం.. ఈవీల విషయంలో కాస్త వెనుకంజలో ఉందని చెప్పవచ్చు. అయితే.. ఈ సంస్థ నుంచి త్వరలోనే ఓ కొత్త ఈవీ మార్కెట్లోకి రాబోతోంది. అదే మారుతీ సుజుకీ ఇ- విటారా మోడల్ కారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ కారు లాంఛ్‌కు ముహూర్తం సమీపించింది. ఇంకో నెలలోనే దీన్ని వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకురానుందీ సంస్థ. ఈ ఈవీలో ఉండే ఫీచర్లు, రేంజ్ తదితర విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఒకే నెలలో 1.50 లక్షలకు పైగా కొనగోళ్లు.. ఈ కంపెనీ టూవీలర్స్‌కు విదేశాల్లో యమ క్రేజీ

ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత టూవీలర్ మార్కెట్ చాలా పెద్దది. ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక కంపెనీకి చెందిన టూవీలర్ కనిపిస్తుంది. జనాభా ఎక్కువగా ఉన్న కారణంగా అందరూ కూడా తమ రోజువారి అవసరాలకు తప్పనిసరిగా టూవీలర్ కలిగి ఉంటారు. దీంతో డిమాండ్ భారత్‌లో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా బాగా ప్రసిద్ధి చెందిన టూవీలర్ తయారీదారులు అధునాతన ఫీచర్స్, సరికొత్త డిజైన్లతో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. వీటిని భారత్‌లోనే విక్రయిస్తూనే అదే సమయంలో డిమాండ్ ఉన్న ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం విదేశాల్లో భారత టూవీలర్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ తయారయ్యే వాహనాలను ఇతర దేశాల ప్రజలు ఎంతో ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు. ఈ ఆదరణ ఎక్కువ కావడంతో కంపెనీలు సైతం తమ టూవీలర్స్‌ను వేగంగా సరఫరా చేస్తున్నాయి.

దేశీయ కార్ల ముందు మోకరిల్లిన విదేశీయులు.. భావోద్వేగానికి గురైన ఆనంద్ మహీంద్రా

ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు మౌలిక వసతులు, ఉపాధి, పెట్టుబడుల పరంగా వెనుకబడి ఉన్న దేశం ఇప్పుడు అత్యంత వేగంతో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. అంతర్జాతీయంగా వ్యాపార మార్కెట్ తీవ్ర అస్ధిరతతో కొట్టుమిట్టాడుతున్నప్పటికి భారత్ మాత్రం అన్ని పరిస్థితులను తట్టుకుని గట్టిగా నిలబడింది. ఇప్పుడు ఇతర దేశాల చూపు మొత్తం కూడా భారత్‌ వైపే ఉంది. ముఖ్యంగా ఆటో పరిశ్రమ భారతదేశ అభివృద్ధికి తోడ్పాటు అందించే అతిపెద్ద రంగం. జనాభా పెరుగుతున్నంత వేగంగా దేశీయ వాహన పరిశ్రమ కూడా విపరీతంగా వృద్ధి చెందుతుంది. దేశీయ కంపెనీలు అయినటువంటి టాటా మోటార్స్, మహీంద్రా వంటి అతిపెద్ద వాహన తయారీ కంపెనీలు విదేశాల్లో కూడా భారత బ్రాండ్‌ను మారుమోగిస్తున్నాయి.
Advertisement

కియా నుంచి కొత్త కారు వచ్చేసింది... కిర్రాక్ ఫీచర్లతో, తక్కువ ధరలో ఎస్‌యూవీ!

అనతి కాలంలోనే భారతీయ వినియోగదారులకు చేరువైన విదేశీ వాహన తయారీ సంస్థ కియా. ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్ నెలకొల్పి వాహనాలను తయారు చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. ఇటీవలే ఈ సంస్థ 'సైరోస్' పేరుతో కొత్త కారును లాంఛ్ చేసింది. కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన ఈ కారును అధునాతన ఫీచర్లను జోడించి తీసుకువచ్చిందీ సంస్థ. దీని (ఎక్స్- షోరూమ్) ధర రూ.9 లక్షల నుంచి రూ.17.80 లక్షల మధ్య ఉంటుంది. ఈ కారును HDK, HDK Optional, HDK Plus, HDX, HDX Plus, HDX Plus Optional అనే ఆరు వేరియంట్లలో లాంఛ్ చేశారు. అయితే రూ.9 లక్షల్లో లభించే ఈ కారులో ఉండే ఫీచర్లు ఏంటో ఇప్పుడూ చూసేద్దాం.

కొత్తగా కారు కొనేవారికి మంచి ఛాన్స్ ఇస్తున్న మహీంద్రా.. ఫ్యామిలీ కారుపై భారీ డిస్కౌంట్

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా (Mahindra) గురించి అందరికీ తెలిసిందే. అధునాతన కార్లను విక్రయిస్తూ, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి తయారీదారులకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. గత ఏడాది భారతీయ వినియోగదారుల కోసం అదిరిపోయే మోడళ్లను తీసుకొచ్చిన కంపెనీ 2025లో కూడా పలు మోడళ్లను తీసుకురావడానికి ప్రణాళికలు చేసింది. ఇదిలా ఉంటే మహీంద్రా తన కార్ల అమ్మకాలను పెంచుకోడానికి సాధారణంగా తగ్గింపు ఆఫర్స్‌ను అందిస్తూ కస్టమర్లను తనవైపు తిప్పుకుంటుంది. ఈ క్రమంలో వారిని ఆకట్టుకోవడానికి మరోసారి తన ప్రసిద్ధ 7 సీటర్ ఎంపీవీ (MPV) కారు అయినటువంటి మారాజ్జో (marazzo)పై భారీ తగ్గింపును అందిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం కుటుంబ ప్రయాణాలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఎక్కువ మంది కలిసి ప్రయాణించే కార్లకు దేశంలో డిమాండ్ బాగా పెరిగింది.

వేలంటైన్స్ డే రోజున జర్నీ ప్లాన్ చేస్తున్నారా..? ఇదిగో ఈ టిప్స్ మీకోసమే..!

ఫిబ్రవరి 14th, వేలంటైన్స్ డే వచ్చేస్తోంది. యువత.. మరీ ముఖ్యంగా ప్రేమికులు ఈ రోజు కోసం ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇప్పటికే తమ ప్లాన్స్ కూడా రెడీ చేసుకుని ఉంటారు. చాలా మంది ఆరోజున తమ ప్రేయసి లేదా ప్రేమికుడితో కలిసి సరదాగా గడపాలనుకుంటారు. మరికొంతమంది అదే రోజున తమ ప్రేమను అవతలి వ్యక్తితో చెబుతుంటారు. ఇందుకోసం మంచి ప్లేస్ చూసుకుని వెళ్లాలనుకుంటారు. కార్లలో లేదా బైకులపై జాలీగా వెళ్లి ఆరోజును హాయిగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. అక్కడే తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటారు. మరి ఆరోజున లవర్స్ పాటించాల్సిన కొన్ని సేఫ్టీ టిప్స్ ఏంటో చూసేద్దాం.

10 చక్రాలు కలిగిన యోధుడు.. శత్రువులు భయపడి పారిపోవాల్సిందే..

ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ కార్లను తయారు చేసే ప్రముఖ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ప్యాసింజర్ వాహనాలతో పటు ఇతర అవసరాలకు ఉపయోగపడే వాటిని కూడా తయారు చేస్తుంది. ప్రస్తుతం సైనిక వినియోగానికి ఉపయోగకరంగా ఉండే ఒక ట్రక్కును తయారు చేసినట్లు సమాచారం. ఇది చాలా శక్తివంతమైనదని, అన్ని వాతావరణ కఠిన పరిస్థితులను సులభంగా తట్టుకుని సైనికులకు అన్ని విధాలుగా సహాయకరంగా ఉంటుంది. ఈ ట్రక్కు పేరు మెర్సిడెస్ అరోక్స్ 4042 AS 6X6 (mercedes arocs 4042 as 6x6). ఈ శక్తివంతమైన ట్రక్కును మెర్సిడెస్ బెంజ్ అబుదాబిలో జరుగుతున్న ప్రపంచ ప్రఖ్యాత అంతర్జాతీయ రక్షణ ప్రదర్శన అండ్ సమావేశంలో ప్రదర్శనకు ఉంచింది. ఇది కేవల సైనిక అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని తెలుస్తుంది. ఈ ఈవెంట్‌లో వివిధ కంపెనీలకు చెందిన సైనిక , సరిహద్దు భద్రతలో వాడే వాహనాలను, ఇతర పరికరాలను ప్రదర్శనకు ఉంచారు.

బంపర్ ఆఫర్ ఇస్తున్న ఫోక్స్‌వ్యాగన్.. ఏకంగా రూ.4.20 లక్షల తగ్గింపు

జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్(Volkswagen) అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన మోడళ్లను విడుదల చేస్తూ మంచి మార్కెట్‌ను కలిగి ఉంది. ఇతర దేశాల్లోనే కాకుండా భారత్‌లో కూడా ఈ కంపెనీ కార్లు ఎక్కువగా కనిపిస్తాయి. పోలో అనే సూపర్‌మినీ కారును విడుదల చేసి ఆటోమొబైల్ పరిశ్రమలో అతిపెద్ద సంచలనం సృష్టించి రికార్డు స్థాయిలో అమ్మకాలను నమోదు చేసింది. ఫోక్స్‌వ్యాగన్ నుంచి వచ్చిన టైగన్ (Taigun), వర్టస్ (Virtus) మోడళ్ల ద్వారా తన మార్కెట్‌ను దేశీయంగా నిలుపుకుని ఇతర కార్ల తయారీదారులకు పోటీగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో 2024 ఏడాదిలో మెరుగైన అమ్మకాలను సాధించిన ఫోక్స్‌వ్యాగన్ 2025లో కూడా మెరుగైన అమ్మకాలను సాధించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంంది. అందులో భాగంగా పలు కొత్త మోడళ్లను విడుదల చేయడంతో పాటు ఇప్పటికే ఉన్న వాటిపై తగ్గింపు ఆఫర్స్ అందిస్తుంది.

జరిమానాతో ఝడిపించిన ట్రాఫిక్ పోలీసులు.. రూ.80 వేల స్కూటర్ పై రూ.లక్ష ఫైన్

"చారాణ కూరకు బారానా మసాలా" అనే సామెత మీరు వినే ఉంటారు. చిన్న దానికి ఎక్కువ ఖర్చు చేసిన సందర్భంలో దీన్ని వాడుతుంటారు. ఈ సామెత ఇప్పుడు ఓ స్కూటరిస్టుకు సరిగ్గా సరిపోయేలా మారింది. ఎందుకంటే.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఓ వ్యక్తికి భారీ ఫైన్ పడింది. ఇలా రూల్స్ ఫాలో కాకపోతే.. ఫైన్లు ఎదుర్కోవడం కామనే అయినా.. ఇక్కడ జరిమానా అమౌంట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది. అది పాపం... అతడి స్కూటర్ ధరను మించిపోయి ఉంది. ఈ ఫైన్ కట్టే డబ్బులతో అతను వేరే కొత్త స్కూటర్‌ను కొనేయొచ్చు. అసలింతకీ ఏం జరిగిందంటే..

మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర పెంపు.. ఎంత పెంచారంటే?

మారుతి సుజుకి సంస్థ మిడిల్‌ క్లాస్‌ ఫ్యామీలల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కార్లను విడుదల చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ కంపెనీ చాలా తక్కువ ధరలో ప్రీమియ ఫీచర్లతో కార్లను విడుదల చేస్తూ ఉంటుంది. ఈ లిస్ట్‌లో ఉన్న మొట్టమొదటి కారుగా మారుతి సుజుకి ఫ్రాంక్స్‌ (Maruti Suzuki Fronx)ని చెప్పవచ్చు. ఈ కారుకి ఇంటర్నేషనల్ మార్కెట్‌లోనూ మంచి డిమాండ్‌ ఉంది. ఇది బాలెనో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్, బ్రెజా ఎస్‌యూవీ మధ్యలో ఉండే కారుగా ఉంటుంది. ఈ కారుని జనాలు సైతం అంతే మొత్తంలో కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మంచి డిజైన్‌ స్టైలింగ్, సరసమైన ధరలతో ఈ కారు మరింత పవర్‌ఫుల్‌గా ఉంది.

టాటా నానో ఈవీ కారు లాంచ్ అయిందా? ఇది అదేనా?

భారతదేశంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. అందరికీ సొంత ఇళ్లుతో పాటు, రోజువారీ అవసరాలకు ఉపయోగపడే టూవీలర్, కారును కొనడం ప్రతి ఒక్కరి కల. టూవీలర్స్ దాదాపు అందరి దగ్గర ఉన్నప్పటికి కారు మాత్రం ఉండటం చాలా అరుదు. మారుతున్న కాలానికి అనుగుణంగా తక్కువ ధరలో అయిన లభించే వాటిని కొనాలని చాలా మంది అనుకుంటారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వారి కోరికను తీర్చడానికి సామాన్య ప్రజలకు ఒక టూవీలర్ కొనగలిగే ధరలోనే కారును కూడా అందించాలనే ఆశయంతో ఎప్పుడు కూడా పేద, మధ్య తరగతి ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఆలోచన కలిగి ఉండే ఇటీవల మరణించిన టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా గతంలో టాటా నానో కారును తీసుకొచ్చారు. కేవలం ఒక లక్ష రూపాయల ధరలో ఈ నానో కారును విడుదల చేసి ఏకంగా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
Advertisement

సేల్స్‌లో సత్తా చాటుతున్న స్కోడా కైలాక్‌.. కనీవినీ ఎరగని రీతిలో‌ పెరిగిన అమ్మకాలు!

క్రమక్రమంగా భారతీయ కస్టమర్లను ఆకట్టుకుంటూ వారికి చేరువైన విదేశీ కార్ల తయారీ సంస్థ స్కోడా. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన కొన్ని మోడళ్లకు భారత వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఈ కస్టమర్ బేస్‌ను మరింత బలపర్చుకోవడంపై దృష్టి సారించిందీ సంస్థ. ఇందులో భాగంగా వినియోగదారుల కోసం కొత్త కారు మోడళ్లను లాంఛ్ చేయనుంది. వాటిని అతి తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఇటీవల విడుదలైన స్కోడా జనవరి నెల సేల్స్ రిపోర్టర్ ఈ విషయాలు వెల్లడిస్తున్నాయి. ఇక వీటి పూర్తి వివరాలు ఏంటో చూసేద్దాం.

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల ధరలు వచ్చేశాయ్‌.. ఏ మోడల్ ఎంతంటే?

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో అందిరికి తెలిసిందే. గత మూడు నాలుగేళ్ల నుంచి ఈవీలకు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ముఖ్యంగా గత ఏడాదిలో ఇది మరింత పెరిగింది. సాంప్రదాయ ఇంధన కార్ల అమ్మకాలతో పాటు ఎలక్ట్రిక్ కార్స్ కూడా పోటీ పడి మరి సేల్స్‌ను సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తయారీదారులు కూడా వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణండా లేటెస్ట్ టెక్నాలజీతో కూడిన మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఇటీవల దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా కొత్తగా BE 6,XEV 9e ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చింది. అయితే వీటి ధరలను తాజాగా ఇప్పుడు ప్రకటించింది. ఈ కార్ల కోసం చాలా మంది గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇవి SUV (ఎస్‌యూవీ) కార్స్. వీటితో పాటు మహీంద్రా మరో రెండు వేరియంట్లను కూడా అదనంగా తీసుకొచ్చింది.

కారు కొనుగోలుదారులకు కన్నీళ్లు తెప్పిస్తున్న పన్నులు.. 58శాతం దాకా ట్యాక్స్‌తో గుండెలు గుబేల్!

కారు కొనడం చాలా మందికి చిన్న నాటి కల. ఆ కల నెరవేర్చుకోవడానకి చాలా మంది ఎంతో శ్రమిస్తుంటారు. తీరా కారు కొనే సమయంలో వాటి ధరలు చూసి.. "బాబోయ్.. మాకొద్దీ కారు తంటాలు" అంటున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతోంది. దీనికిి కారణం పన్నులు. పన్నులు చేసే ఘోరాలు "ఇంతింత కాదయా" అనేలా ఉన్నాయి. ఏ వస్తువు కొన్నా సరే దానికి పన్ను కట్టడం దేశ పౌరులుగా అది అందరి బాధ్యత, అది తప్పనిసరి అంశం. అయితే.. కారు విషయానికి వచ్చేటప్పటికీ దాదాపు 58శాతం వరకు ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే మాత్రం.. చాలా మంది భారంగా ఫీలవుతున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే..

సరికొత్త అడ్వెంచర్ ప్రపంచంలోకి తీసుకెళ్లే KTM బైక్స్ వచ్చేశాయ్

ప్రపంచవ్యాప్తంగా టూవీలర్ విభాగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ కంపెనీ కేటీఎమ్ (KTM) ప్రీమియం స్పోర్ట్స్ బైక్స్‌ను విడుదల చేస్తూ అంతర్జాతీయంగానే కాకుండా భారత్‌లో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. ఇండియాలో బజాజ్ ఆటోతో భాగస్వామ్యంతో కలిసి అధునాతన స్పోర్ట్స్ మోడల్ తరహా బైక్స్‌లను విడుదల చేస్తుంది. మార్కెట్లో పోటీ వాతావరణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తాజాగా 3 కొత్త అడ్వెంచర్ బైక్‌లను KTM లాంచ్ చేసింది. 250 (adventure) అడ్వెంచర్, 390 అడ్వెంచర్ (adventure), 390 అడ్వెంచర్ (adventure) X అనే మోడళ్లను భారతీయ వినియోగదారుల కోసం విడుదల చేసింది. ఇవి స్టైలిష్ డిజైన్‌తో యూత్‌ను ఎక్కువగా అట్రాక్ట్ చేసేలా ఉన్నాయి. ఆస్ట్రియాకు చెందిన KTM ఇండియాలో కూడా తన ఉనికిని కలిగి ఉంది. ఇటీవల కాలంలో ఈ కంపెనీకి పోటీగా ఇతర బైక్స్ లాంచ్ అవుతున్న నేపథ్యంలో తన మార్కెట్‌ను నిలబెట్టుకోడానికి వీటిని తీసుకొచ్చింది.

ఓలా నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్ బైకు... దీనికి పోటీ ఇవ్వనున్న హీరో స్ప్లెండర్ బైకు.. వీటిలో ఏది కొంటే బెటర్‌?

ఓలా ఎలక్ట్రిక్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీలో బెంగళూరుకు చెందిన ఈ సంస్థ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఈవీలు భారత వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సంస్థకు లాభాల్ని కూడా తెచ్చిపెట్టాయి. ఇదే జోష్‌తో ఈ సంస్థ.. రోడ్‌స్టర్ పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ను త్వరలో కూడా లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. దీనిపై ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి. అలాగే హీరో స్ప్లెండర్.. ఈ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్లుగా పల్లెల నుంచి పట్టణాల వరకు అందరికీ చేరువైన టూ- వీలర్. ఇప్పుడు ఓలా నుంచి ఎలక్ట్రిక్ బైకు రానున్న నేపథ్యంలో.. ఈ ఎలక్ట్రిక్ బైకుకు, చాలా మందికి ఫేవరేట్‌గా పేరుగాంచిన స్ప్లెండర్ బైకుకు మధ్య ఉన్న పోలికలు, తేడాలు ఏంటో ఈ కథనంలో చూసేద్దాం.