కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఎంట్రీ ఇచ్చిన కొమాకి.. అతి తక్కువ ధరకే, అదిరే ఫీచర్లతో మూడు ఈవీలు!
ఆటోమొబైల్స్
- 1 year, 8 month, 12 days ago
దేశంలో ఈవీల హవా కొనసాగుతోంది. చాలా మంది వినియోగదారులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. టూ- వీలర్ రంగంలోనూ ఈవీల వాడకం జోరుగా కొనసాగుతోంది. అనేక స్టార్టప్ సంస్థల నుంచి దిగ్గజ సంస్థల వరకు ఈవీలతో మార్కెట్లో పోటీ పెంచుతున్నాయి. ఓలా, ఏథర్, బజాజ్, టీవీఎస్ వంటి సంస్థలు ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంచి గుర్తింపు సంపాదించాయి. అయితే వీటి కంటే ముందు నుంచే ఎలక్ట్రిక్- టూవీలర్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన సంస్థ కొమాకి. అనేక ప్రాంతాల్లో దీని డీలర్‌షిప్ నెట్వర్క్ ఉండడంతో.. దీని పేరు కూడా చాలా మంది ఇదివరకే విని ఉంటారు. ఇటీవల ఈ సంస్థ కొన్ని కొత్త మోడళ్లను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఆ స్కూటర్లు, వాటి విశేషాలేంటో చూసేద్దాం.