ఈ కారు సేల్స్ చూసి షాక్ అయిన కంపెనీ.. అసలు ఎందుకిలా జరిగింది..?
ఆటోమొబైల్స్
- 1 year, 8 month, 16 days ago
ప్రముఖ వాహన తయారీ కంపెనీ స్కోడా ఇండియాలో కార్ల విక్రయాల్లో ప్రతి ఏడాది కూడా మెరుగైన గణంకాలు సాధిస్తుంది. ఈ సంస్థ నుంచి విడుదలయ్యే వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. అయితే తాజాగా ఒక మోడల్ మాత్రం అనుకున్నంత సేల్స్‌ను సాధించలేదు. అదే, స్కోడా సూపర్బ్ (2025 Skoda Superb) సెడాన్. ఇది గత ఏడాది డిసెంబర్‌లో అమ్మకాల పరంగా చాలా నిరాశపరిచింది. కంపెనీ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం, ఈ కారును 2024 డిసెంబర్ నెలలో కేవలం ఒక్కరంటే ఒక్కరే కొనుగోలు చేశారు. దీంతో దేశీయంగా ఈ నెలలో అత్యధికంగా అమ్ముడైన సెడాన్‌ల జాబితాలో చివరి స్థానం పొందింది. సాధారణంగా సెడాన్ కార్లకు ఇండియాలో మంచి ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలో స్కోడా సూపర్బ్ అమ్మకాల పరంగా మంచి స్థానంలో ఉంటుందని స్కోడా ఇండియా అంచనాలు పెట్టుకున్నప్పటి దానికి భిన్నంగా ఒక్క కారు అమ్ముడుపోవడం గమనార్హం.