పెద్ద కుటుంబానికి ఇంధ్రభవనంలా మెరిసిపోతున్న హ్యుందాయ్ ఈవీ
ఆటోమొబైల్స్
- 1 year, 8 month, 19 days ago
దక్షిణ కొరియాకు చెందినటువంటి ప్రముఖ కార్ల తయారి కంపెనీ హ్యుందాయ్(Hyundai) భారత్‌లో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి వాహన తయారీ కంపెనీలకు గట్టి పోటీగా నిలుస్తుంది. దేశరాజధాని ఢిల్లీలో జనవరి 17 నుంచి ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమంలో హ్యుందాయ్ తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. తన ఫేవరెట్ మోడల్ క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన కంపెనీ దీంతో పాటు ఐయోనిక్ 9 (Ioniq 9) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా ఆవిష్కరించింది. ప్రస్తుతానికి మాత్రం ఈ కారు ఇండియా మార్కెట్లో తీసుకురావడానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీనిని అంతర్జాతీయంగా ఉత్తర అమెరికా, దక్షిణ కొరియా మార్కెట్లో మాత్రం మొదట అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. ఆ తరువాత ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. హ్యుందాయ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంచి మార్కెట్ ఉంది.