రెండు కుటుంబాలకు సరిపోయే స్కోడా కొత్త కారు.. ఫార్చ్యూనర్‌కు పోటీ వచ్చేసింది

ప్రముఖ కార్ల తయారీ కంపెనీ స్కోడా (Skoda) నుంచి కొత్త మోడల్ వచ్చింది. దేశ రాజధాని న్యూ ఢిల్లిలోని ప్రగతి మైదాన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో స్కోడా రెండో తరం కొడియాక్ (kodiaq) మోడల్‌ను ఆవిష్కరించింది. ఇది దాని పాత మోడల్‌తో పోలిస్తే, కొత్తగా మరిన్ని ఫీచర్స్‌తో అప్‌డేట్ అయి వచ్చింది. ఈ ఎస్‌యూవీ డిజైన్ ఆకట్టుకునే విధంగా ఉంది. భారత్‌లో స్కోడా కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ఇప్పటికే దీని పాత మోడల్‌ను చాలా మంది కొనుగోలు చేశారు. దీంతో ఈ కారుకు ప్రజల నుంచి మంచి ఆదరణ రావడంతో ఇప్పుడు ఈ కొత్త రెండో తరం‌ను తీసుకొచ్చింది. దీనిని 'మోడరన్ సాలిడ్' డిజైన్ శైలిలో రూపొందించారు. పొడవు కొంచెం ఎక్కువగా ఉంటుంది. లోపల ప్రయాణికుల సౌలభ్యం కోసం మరింత స్థలాన్ని అందించడానికి పొడవును పెంచినట్లు తెలుస్తోంది.

అదుర్స్ అనిపించేలా ఎంజీ కొత్త ఎలక్ట్రిక్ కార్లు.. వీటి ఫీచర్లు మామాలుగా లేవుగా!

బ్రిటిష్ మోటారింగ్ బ్రాండ్ జేఎస్ డబ్యూ ఎంజీ మోటార్ ఇండియా.. తమ వాహనాలతో భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. తమ కార్లతో అన్ని వర్గాల వారికి చేరువైంది. ఇప్పుడు దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ సాగుతున్న నేపథ్యంలో.. ఈవీల తయారీపై ఈ సంస్థ దృష్టి సారించింది. ఈ సంస్థ ఆటో ఎక్స్‌పోలో రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్ల మోడళ్లను ఆవిష్కరించింది. అందులో ఒకటి Cyberster EV కాగా.. మరొకటి లగ్జరీ ఎంపీవీ అయిన MG M9. మార్చిలో సైబర్ స్టర్ ఈవీ, ఎం9 కార్ల బుకింగ్స్ ప్రారంభించి, ఏప్రిల్‌లో వీటి డెలివరీలను మొదలుపెట్టనున్నట్లు తెలిపింది. ఈ కార్ల పీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

చూడ చక్కని పొట్టి ఈవీ కారు.. చిన్న కుటుంబాల కోసం బెస్ట్ మోడల్

ప్రపంచదేశాలను అబ్బురపరిచేలా దేశరాజధాని ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో భారత్ మండప వేదికగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమం ఘనంగా జరుగుతుంది. ఆటోమొబైల్ తయారీ దారులు అందరూ కూడా తమ ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం విడుదల కాబోతున్న వాహనాలు, అలాగే భవిష్యత్తులో రాబోతున్న కార్లు, బైక్స్, వాణిజ్య ఇతర వాహనాలకు సంబంధించిన కాన్సెప్ట్ వాహనాలను ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే భారత మార్కెట్ ప్రపంచ దేశాలతో పోలిస్తే వేగంగా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆటోమొబైల్ పరిశ్రమలో పేరుగాంచిన పలు వాహన తయారీ కంపెనీలు తమ కార్లను భారత్‌లో విడుదల చేస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ఢిల్లీలో అత్యంత ఘనంగా జరుగుతున్న అతిపెద్ద ఆటో ఎక్స్‌పో 2025 కార్యక్రమంలో ఈ కంపెనీలు తమ వాహనాలను ప్రదర్శిస్తున్నాయి.

టాటా నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కారు ఆవిష్కరణ.. ఏకంగా 500 కి.మీలు

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో దూసుకుపోతుంది. ఇండియాలో ఈవీలకు మంచి ఆదరణ ఉన్న నేపథ్యంలో కంపెనీ వరుసగా ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయడంపై కీలకంగా దృష్టి సారించింది. ప్రస్తుతం హ్యుందాయ్, మహీంద్రా, కియా మోటార్స్ వంటి వాహన తయారీదారులు ఈవీ సగ్మెంట్‌లో మంచి మార్కెట్ కలిగి ఉన్నారు. ఇప్పుడు కొత్తగా దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కూడా ఈవీ కారును తీసుకురావడంతో ఈ విభాగంలో పోటీ మరింత పెరిగింది. దీంతో భారత ప్రజలకు అత్యంత సేఫ్టీ ప్రమాణాలతో అత్యుత్తమైన నాణ్యతతో కార్లను తీసుకువస్తుందనే ప్రసిద్ధ పేరు కలిగిన టాటా మోటార్స్ ఇప్పుడు తన హారియర్ ఎస్‌యూవీని ఎలక్ట్రిక్ (Harrier Suv Electric) రూపంలో ఆవిష్కరించింది.
Advertisement

ఆటో ఎక్స్‌పోలో క్రేజీగా ఈ కాన్సెప్ట్ బైకు.. దీన్ని చూస్తే తొలిచూపులోనే ప్రేమలో పడిపోతారు!

దిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పో అట్టహాసంగా కొనసాగుతోంది. అనేక ఆటో మొబైల్ సంస్థలు తమ వాహనాలతో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. దిగ్గజ టూ- వీలర్ సంస్థ టీవీఎస్ సంస్థ కూడా తమ బ్రాండ్ నుంచి రానున్న వాహనాలను ప్రదర్శిస్తోంది. అయితే.. ఈ ఎక్స్ పోలో ఓ కాన్సెప్ట్ బైకుతో తళుక్కున మెరిసిందీ సంస్థ. చూడగానే 'వావ్' అనిపించేలా ఉన్న ఈ బైకు.. ఆటో ఎక్స్‌పోలో ఆకర్షణీయంగా నిలిచింది. టీవీఎస్ RTS X Concept పేరుతో దీన్ని ప్రదర్శించింది టీవీఎస్ సంస్థ. 300 సీసీ ఇంజిన్‌తో ఉన్న ఈ బైకు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

రెడ్ కలర్ డ్రెస్సులో ఖరీదైన కారుతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఊర్వశి

ఊర్వశి రౌటేలా అంటే తెలియని వారు ఉండరు. అటూ బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది. తెలుగులో ఇటీవల కాలంలో స్టార్ హీరోలతో ఐటెం సాంగ్స్‌లలో ఎక్కువగా కనిపిస్తుంది. మొదటగా ప్రైవేట్ సాంగ్స్‌లలో నటించి ఇప్పుడు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. గత ఏడాది ఇదే సంక్రాంతి సమయంలో విడువలైన వాల్తేరు వీరయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సాంగ్స్‌కు స్టెప్పులు వేసింది. ఇటీవల సంక్రాతి కానుకుగా వచ్చిన డాకు మహారాజ్‌ సినిమాలో కూడా నట సింహం సందమూరి బాలయ్యాతో కూడా చిందులు వేసింది. ఈ మధ్య కాలంలో ముంబైలో హడావుడి చేస్తూ, హైదరాబాద్‌లో కూడా తరుచుగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఊర్వశి రౌటేలాకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

2025 సుజుకి యాక్సెస్‌ వచ్చేసింది.. కత్తిలాంటి ఫీచర్లు, కెవ్వుకేక ఫర్ఫామెన్స్‌!

భారత్‌ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో (Bharat Mobility Auto Expo 2025)లో సుజుకి మోటార్‌సైకిల్స్‌ యాక్సెస్ 125 2025 (2025 Suzuki Access) వెర్షన్‌ స్కూటర్‌ని విడుదల చేసింది. ఈ సరికొత్త స్కూటర్‌ క్రేజీ లుక్‌తో పాటు, భారీ ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని ధరను రూ .81,700 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. ఈ కొత్త సుజుకి యాక్సెస్ 125 స్టాండర్డ్, స్పెషల్, రైడ్ కనెక్ట్ ఎడిషన్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్‌ మంచి సేల్స్‌ని రాబడుతుందని కంపెనీ భావిస్తోంది. దీని రాకతో సేల్స్‌ మరింత పెరిగే అవకాశాలు లేకపోదు. ఈ సరికొత్త అడ్‌డేటెడ్‌ వెర్షన్‌ స్కూటర్‌కి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ఆటో ఎక్స్‌పోలో హీరో సంస్థ అదుర్స్.. యూత్ కోసం నాలుగు కొత్త మోడల్స్

న్యూ దిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో కొనసాగుతోంది. అనేక ఆటో మొబైల్ సంస్థలు తమ కొత్త వాహనాలను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. దిగ్గజ టూ వీలర్ తయారీ సంస్థ హీరో.. ఈ ఎక్స్‌పోలో నాలుగు కొత్త టూ- వీలర్స్‌ను తీసుకువచ్చింది. Xoom 125, Xoom 160 స్కూటర్లతో పాటు Xtream 250R, XPulse 210 బైకులను లాంఛ్ చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆటో ఎక్స్‌పోలో ఘనంగా లాంచ్ అయిన హ్యుందాయ్ క్రెటా ఈవీ

దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) ఇండియా తాజాగా ఎలక్ట్రిక్ కారును విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ క్రెటా ఈవీ (Creta Ev). దీన్ని కంపెనీ ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో ప్రదర్శించింది. హ్యందాయ్ ice క్రెటా మోడల్‌కు ఇండియాలో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కంపెనీ ఎలక్ట్రిక్ వెర్షన్‌లో విడుదల చేసి ఈవీ సెగ్మెంట్‌లో తన వాటాను మరింత పెంచుకోనుంది. ప్రస్తుతం కొత్తగా కారు కొనుగోలు చేసే వినియోగదారులు, ఈవీ కార్లపై ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో కస్టమర్ల నుంచి వస్తున్న డిమాండ్‌ను గమనించిన చాలా వాహన తయారీ దారులు ఈ సెగ్మెంట్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. తమ పాత మోడళ్ల కార్లను కొత్తగా ఈవీ వేరియంట్‌లుగా మారుస్తూ మార్కెట్లో విడుదల చేస్తున్నారు.

కిర్రాక్ ఫీచర్లతో వస్తున్న సుజుకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని రేంజ్ అదిరిపోయిందిగా!

దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ సుజుకి ఇండియా.. తమ వాహనాలతో భారతీయ వినియోగదారులను ఎన్నో ఏళ్లుగా ఆకట్టుకుంటోంది. కార్లతో పాటు టూ- వీలర్లలోనూ ఈ సంస్థ తమ వాహనాలతో ప్రత్యేక గుర్తింపును సొతం చేసుకుంది. ఈ ఏడాది ఈ సంస్థ టూ- వీలర్స్‌కు సంబంధించి గట్టి ప్లాన్స్‌తో ముందుకు వస్తోంది. ఇందులో భాగంగా.. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తమ సంస్థ నుంచి కొత్త వాహనాలను పరిచయం చేయనుంది. దేశంలో ప్రస్తుతం ఈవీల హవా కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈవీల తయారీపై ఈ సంస్థ దృష్టి సారించింది.

మారుతీ సుజుకీ తొలి ఎలక్ట్రిక్‌ కారు ఆవిష్కరణ.. సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీలు

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) నుంచి ఎప్పుడెప్పుడు ఎలక్ట్రిక్ కారు వస్తుందా అని ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు శుభవార్త చెప్పింది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ విటారా(e-Vitara)ను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఇండియాలోనే ఈవీ వాహనాల వాడకం విపరీతంగా పెరుగుతుంది. ఇప్పటికే టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి పలు కార్ల తయారీ కంపెనీలు ఈ విభాగంలో ముందడుగు వేసి ఈవీ కార్లను సేల్ చేస్తున్నాయి. అయితే దేశంలోనే అతిపెద్ద కార్ల ఉత్పత్తి దారుగా ఉన్నటువంటి మారుతీ మాత్రం ఇంత కాలం ఈ సెగ్మెంట్‌లో వెనుకబడి ఉంది. అయితే ఇప్పుడు కంపెనీ భారత ఎలక్ట్రిక్ మార్కెట్లో ఇ విటారాను తీసుకొచ్చి పెను సంచలనాలకు తెరలేపింది.

ప్రపంచంలోనే మొట్టమొదటి CNG స్కూటర్‌ రాబోతుంది.. మైలేజీ ఎంతో తెలుసా?

టీవీఎస్ జూపిటర్ సీఎన్‌జీ స్కూటర్‌ (TVS Jupiter CNG Scooter)ని ఆ సంస్థ భారత్ మొబిలిటీ ఆటో ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించింది. ఈ స్కూటర్ కేవలం కాన్సెప్ట్ మోడల్‌గా ప్రదర్శించినప్పటికీ ప్రపంచంలోనే ఇదే మొట్టమొదటి సీఎన్‌జీ స్కూటర్ కావడం విశేషం. దీని విడుదలపై కంపెనీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గత ఏడాది భారతీయ మార్కెట్‌లో బజాజ్‌ ఫ్రీడమ్‌ సీఎన్‌జీ మోటార్‌సైకిల్‌ని లాంచ్‌ చేసింది. దీనికి ఆటోమోబైల్‌ ఔత్సాహికుల నుంచి భారీ స్పందన లభించింది. ఇది సేల్స్‌లోనూ ఇతర సంప్రదాయ టూవీలర్స్‌తో పోటీగా దూసుకెళ్తుంది. ఇప్పుడు స్కూటర్లలో జూపిటర్‌ రాకతో మరో టూవీలర్‌ అందుబాటులోకి వచ్చేస్తుంది. దీని వివరాలపై ఓ లుక్కేయండి. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ స్కూటర్‌ కావడం విశేషం. ఇది 1.4 కిమీ సీఎన్‌జీ కిట్‌తో రానుంది. ఈ స్కూటర్‌లో భారీ అండర్ సీట్ స్టోరేజీ, ఇతర ప్లేస్‌మెంట్ కూడా నీట్‌గా ఉంది. ఇక ఇందులోని ట్యాంక్‌ని ప్లాస్టిక్ ప్యానెల్‌తో టీవీఎస్‌ కవర్ చేసింది. ప్రెజర్ గేజ్ చూపించడానికి చుట్టూ ఫిల్లర్ నాజిల్ ఉన్నాయి. ఈ సీఎన్‌జీ స్కూటర్‌ కిలో సీఎన్‌జీకి 84 కిలోమీటర్లు దూరం ప్రయాణించగలదని టీవీఎస్ పేర్కొంది.
Advertisement

యూత్ కోసం యమహా నుంచి సరికొత్త సైలిష్ బైక్.. దీని డిజైన్ చూస్తే మర్చిపోలేరు

ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా ఇండియా (Yamaha India) సరికొత్త టెనెరే 700 (Tenere 700) అడ్వెంచర్ బైక్ ఎప్పుడెప్పుడు పరిచయం చేస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తుండగా, తాజాగా ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్లో దీన్ని ప్రదర్శనకు ఉంచింది. దీని చివరి వెర్షన్‌ను మిలన్‌లో జరిగిన EICMA 2024 ఈవెంట్‌లో మొదటిసారిగా ప్రపంచానికి పరిచయం చేశారు. 2025లో కొత్తగా వస్తున్న ఈ అడ్వెంచర్ బైక్ ఈ ఏడాది అక్టోబర్ నాటికి మార్కెట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఇది సరికొత్త డిజైన్‌తో అడ్వెంచర్లు కోరుకునే కస్టమర్లను బాగా అట్రాక్ట్ చేస్తుంది. ఆటో ఎక్స్‌పో 2025లో దీన్ని చూసినట్లయితే చాలా అందంగా స్టైలిష్ రూపంతో కనిపిస్తుంది.

కియా కొత్త కారు కెవ్వుకేక.. ఆటో ఎక్స్‌పోలో అందరీ కళ్లు దీనివైపే!

ఆటో ఎక్స్‌పో 2025లో కియా ఇండియా కొత్త సబ్-4 మీటర్‌ ఎస్‌యూవీ కియా సైరోస్‌ (Kia Syros in Auto Expo 2025)ని ప్రదర్శించింది. ఈ సైరోస్‌ తొలి యూనిట్‌ అనంతపురంలో ఆవిష్కరించారు. ఇది పూర్తిగా ఈ ప్లాంట్‌లోనే ఉత్పత్తి అయ్యింది. ఈ మొట్టమొదటి యూనిట్‌ ఆటో ఎక్స్‌పో 2025లో ఆకట్టుకోనుంది. డిసెంబర్‌లో తొలిసారిగా ఈ కారును ఆవిష్కరించి బుకింగ్స్ ప్రారంభించింది. ఎవ్వరూ ఊహించిని విధంగా ఈ కారుకి ఫుల్‌ రెస్పాన్స్‌ వచ్చింది. విడుదలకు ముందే రికార్డు స్థాయిలో 10,258 ప్రీ-లాంచ్ బుకింగ్స్‌ని రాబట్టింది. ఈ కియా కొత్త సైరస్ ధరలను ఫిబ్రవరి 1 న కంపెనీ వెల్లడించనుంది.

Auto Expo 2025 : ఆటో ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా బజాజ్.. ఇథనాల్, ఎలక్ట్రిక్ బైకులు.. తగ్గేదేలే!

ఆటోమొబైల్ రంగం ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో ప్రారంభం కావడానికి మరికొన్ని ఘడియలే మిగిలి ఉంది. అనేక దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలు.. ఈ ఎక్స్‌పోలో తమ వాహనాలను పరిచయం చేయడానికి సిద్ధమవుతున్నాయి. ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ కూడా.. 'తగ్గేదేలే' అంటోంది. ఈసారి ఆ సంస్థ.. తమ బ్రాండ్ నుంచి సరికొత్త మోడళ్లను పరిచయం చేయనుంది. దేశమంతా ప్రస్తుతం.. సుస్థిరాభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న తరుణంలో.. బజాజ్ సంస్థ కూడా అందులో భాగం కావాలని భావిస్తోంది. ఇందుకోసం ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇథనాల్‌తో నడిచే మరో వాహనాన్ని కూడా ఈ ఎక్స్ పోలో పరిచయం చేయనుంది. దాంతోపాటు ఇటీవలే వినియోగదారుల ముందుకు తెచ్చిన.. చేతక్ 35 సిరీస్ తోనూ ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ సంగతులేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రధాని మోదీ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభం కానున్న అతిపెద్ద ఆటో ఈవెంట్

ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్ ఈ రోజు ఎంతో ఘనంగా ప్రారంభం కానుంది. జనవరి 17 నుంచి మొదలు అవుతున్న కార్యక్రమం 22 జనవరి 2025 వరకు జరుగుతుంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండప వేడుక ప్రారంభానికి సిద్ధం అయింది. ఈ షోను సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM)నిర్వహిస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉదయం 10 గంటలకు ఈ వేడుకును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 5 లక్షల మందికి పైగా వస్తారని అంచనా. దీనిలో వాహన తయారీ కంపెనీలు తమ వాహనాలను ఆవిష్కరించబోతున్నాయి. ఇప్పటికే తయారీదారులు అక్కడికి చేరుకుని తమ బైక్స్, స్కూటర్లు, కార్లు, బస్సులు, వాణిజ్య వాహనాలను లాంచ్ చేయడానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నారు.

ఈవీల్లో కింగ్ అయ్యేలా హోండా ప్లాన్స్.. ఈ రెండు కొత్త స్కూటర్ల బుకింగ్స్‌లో జోష్!

ఇప్పుడు ట్రెండ్ అంతా ఎలక్ట్రిక్ స్కూటర్లదే నడుస్తోంది. ఖర్చులు కలిసి వస్తాయని చాలామంది ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ఇక టూ వీలర్ మార్కెట్‌లోనూ ఈవీల సందడి కొనసాగుతోంది. అనేక స్టార్టప్ సంస్థలతోపాటు దిగ్గజ సంస్థలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో పోటీ పెంచాయి. గతేడాది నవంబర్లో దిగ్గజ టూ-వీలర్ తయారీ సంస్థ హోండా.. తమ బ్రాండ్ నుంచి తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశంలో లాంఛ్ చేసింది. హోండా activa e, హోండా QC1 పేరుతో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువచ్చింది. Swappable బ్యాటరీ సదుపాయంతో హోండా activa e మోడల్‌ని తీసుకురాగా.. ఫిక్స్‌డ్ బ్యాటరీతో హోండా QC1 ని తీసుకువచ్చింది. ఈ రెండు స్కూటర్లు బుకింగ్స్‌లో దూసుకుపోతున్నాయి. వీటికి సంబంధించి పూర్తి కథనం

సర్వాంగ సుందరంగా సిద్ధమైన భారత మండపం.. రేపటి నుంచి ఈవెంట్ స్టార్ట్

దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 కార్యక్రమం దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో అట్టహసంగా ప్రారంభం కాబోతుంది. జనవరి 17 నుంచి మొదలుకు కానున్న ఈ ఈవెంట్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు అధికారులు పూర్తి చేశారు. దీని కోసం ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. జీ20 సమ్మిట్ తర్వాత ప్రసిద్ధి చెందిన భారత్ మండపంలో ఈ ఆటో ఎక్స్‌పో ఈవెంట్ 22 జనవరి 2025 వరకు జరుగుతుంది. దీనిలో వాహన తయారీ కంపెనీలు పెద్ద ఎత్తున తమ మోడళ్లను ప్రదర్శించబోతున్నాయి. దీనిలో పాల్గొనే కంపెనీలకు చెందిన బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి. దేశీయ కంపెనీలు, అంతర్జాతీయ కంపెనీలు తమ ప్రదర్శనలతో భారత్ మండపాన్ని ఉర్రుతలుగించడానికి సిద్ధం అయ్యాయి.

కొత్త ఈవీతో అంచనాల్ని పెంచేస్తున్న మహీంద్రా.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ. వెళ్లేలా..!

జనవరి 17 నుంచి ప్రారంభమయ్యే ఆటో ఎక్స్‌‌పో కోసం.. ఆటోమొబైల్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. వాహన తయారీ సంస్థలు కూడా తమ కొత్త మోడళ్లను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈసారి మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ.. కూడా వినియోగదారులను ఆకట్టుకునేందుకు గట్టి ప్లాన్స్‌తో వస్తోంది. తమ బ్రాండ్ నుంచి కొత్త వాహనాలను పరిచయం చేయనుంది. ఈసారి ఆ సంస్థ ఎలక్ట్రిక్ వెహికిల్స్ పోర్ట్ ఫోలియోను పెంచుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ సంస్థ నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న మహీంద్రా XEV 7e ఎలక్ట్రిక్ కారును ఆటో ఎక్స్ పోలో ప్రదర్శించనుంది. ఈ కారు విశేషాలేంటి, ఇది మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చూద్దాం.

నెలకు రూ.25 వేలతో ఈ మంచి ఫ్యామిలీ కారును సొంతం చేసుకోండి

దేశీయ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) ప్రతి ఏడాది కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ మెరుగైన సేల్స్‌ను సాధిస్తుంది. ఇతర కార్ల తయారీ దారులతో పోటీ పడుతూ, మార్కెట్లోకి అధునాతన ఫీచర్లతో కూడిన కార్లను లాంచ్ చేస్తుంది. హ్యుందాయ్ కార్లకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. ప్రధానంగా క్రెటా (Creta) కారు మార్కెట్లో ఎక్కువగా డిమాండ్ ఉన్న మోడల్. లాంచ్ అయిన అనతి కాలంలోనే ఇది చాలా మంది కొత్త కస్టమర్లకు చేరుకుంది. దీని పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. ఇది దేశవ్యాప్తంగా పలు డీలర్‌షిప్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. హైదరాబాద్‌లో కూడా నగరంలోని పలు షోరూమ్‌లలో లభిస్తుంది. ప్రస్తుతం చాలా మంది కస్టమర్లు లోన్ సౌకర్యాన్ని ఎంచుకుంటున్నారు. వాయిదా పద్దతిలో చెల్లించడం ద్వారా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. క్రింది కథనంలో క్రెటా Onraod ధర, EMI వివరాలు అందించాము.
Advertisement

అదిరే ఆఫర్‌తో ఫ్లిప్‌కార్ట్.. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై భారీ తగ్గింపు.. కొనాలంటే ఇదే మంచి ఛాన్స్!

పెట్రోల్‌తో నడిచే స్కూటర్ల కంటే ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనేందుకు ఈ మధ్య కాలంలో వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అనేక స్టార్టప్ సంస్థలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లతో మార్కెట్లో దూసుకుపోతున్నాయి. మరోవైపు దిగ్గజ సంస్థలు.. కూడా ఈవీల తయారీకి ముందుకు వస్తున్నాయి. ఈవీ సెగ్మెంట్‌లో టీవీఎస్ సంస్థ.. మంచి పేరు సంపాదించింది. టీవీఎస్ ఐక్యూబ్.. ఇ-స్కూటర్ ఈ కంపెనీకి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ స్కూటర్‌పై ఇ- కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. రూ. లక్షకు‌ పైగా విలువ చేసే ఈ వాహనాన్ని రూ.86 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

రతన్ టాటాకు ఉన్నంత ప్రజాదరణ పొందిన కారు.. భద్రతలో రారాజు

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ప్రయాణికులకు అవసరమయ్యే సదుపాయాలతో కార్లను విడుదల చేస్తుంది. ఇండియాలో కార్ల ఉత్పత్తిలో మూడో అతిపెద్ద సంస్థగా ఉంది. రతన్ టాటా పేద, మధ్యతరగతి వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందుకే తక్కువ ధరల్లో కార్లు విడుదల అవుతుంటాయి. టాటా కంపెనీ నుంచి విడుదలయ్యే కార్లకు దేశంలో మంచి ఆదరణ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా కార్ల అమ్మకాల్లో ఇది వృద్ధి చెందుతూనే ఉంది. ఇటీవల వరుసగా తన అమ్మకాల వివరాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో టాటా పంచ్ మైక్రో SUV సేల్స్ డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, మార్కెట్‌లోకి లాంచ్ అయిన అనతి కాలంలోనే టాటా పంచ్ 5 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. 2024 ఏడాదిలో కూడా టాటా పంచ్ ఇండియా మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది.

హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు ఎలా ఉందో తెలుసా? దీనిని కొనుగోలు చేయవచ్చా?

దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ గత సంవత్సరం ఇదే సమయంలో ఫేస్‌లిఫ్టెడ్ క్రెటాను భారతదేశానికి తీసుకువచ్చింది. అప్పటి నుండి, అప్‌డేట్ చేసిన SUV దేశం అంతటా ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో వినియోగదారులను ఆకర్షిస్తూ బెస్ట్ మోడల్‌గా ఉంది. గత సంవత్సరం ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా ఇండియా రోడ్లపై ప్రయాణించినప్పుడు క్రెటా వేరియంట్ రాక గురించి చాలా మంది ఎదురుచూశారు. ఇది ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్‌గా వెళ్తుంది. వేగంగా గడిచిపోయిన కాలం తరువాత హ్యుందాయ్ సరికొత్త క్రెటా ఎలక్ట్రిక్‌ కారును తీసుకొచ్చింది. ఇది భారతీయ మాస్-మార్కెట్‌లో మొదటి ఈవీ. దీనిని ఆటో ఎక్స్‌పో 2025లో లాంచ్ చేయబోతున్నారు. దీనికి ముందు సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ను మా డ్రైవ్‌స్పార్క్ టీం టెస్ట్ రైడ్ చేసింది. క్రెటా ఎలక్ట్రిక్‌ కారును నడిపిన సమయంలో మాకు అనిపించి ఎక్స్‌పీరియన్స్ గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.

సేఫ్టీలో తిరుగులేనిదిగా స్కోడా కొత్త కారు.. ఇక దీన్ని కళ్లు మూసుకుని కొనేయొచ్చు!

కారు కొనే ముందు ఎవరైనా సరే.. దాని లుక్, మైలేజ్‌తో పాటు చూసే ముఖ్యమైన అంశం సేఫ్టీ. అన్నీ బాగున్నప్పటికీ.. ఆ కారు సురక్షితం కాదు అని తేలినప్పుడు దాన్ని కొనుగోలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపరు. ప్రమాదాలు జరిగినప్పుడు.. ప్రాణాపాయం కలగకుండా ఆ కారులో ఉండే సేఫ్టీ ఫీచర్లు కాపాడుతాయి. కాబట్టి, సేఫ్టీని చూసి కారు కొనుగోలు చేస్తాం. అయితే ఈ కార్లు ఎంత మేరకు సురక్షితమో తేల్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం భారత్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్. ఈ టెస్టులో ఫైవ్ స్టార్ రేటింగ్ ఏ కారైనా పొందితే అది సేఫ్టీ‌లో తిరుగులేనిది అని అర్థం. తాజాగా ఈ క్రాష్ టెస్టులో స్కోడా సంస్థ నుంచి కైలాక్ కారు ఫైవ్ స్టార్ రేటింగ్ సాధించింది. దాని విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

షాక్ ఇచ్చిన మరో కంపెనీ.. ఆ టాప్ కారుపై ధర రూ.7,500 పెంపు

భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మైక్రో ఎస్యూవీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. హ్యాచ్‌బ్యాక్ ధరల్లోనే ఈ మైక్రో ఎస్‌యూవీలు అందుబాటులో ఉండడంతో చాలా మంది దీన్ని కొనుగోలు చేస్తున్నారు. దిగ్గజ సంస్థ హ్యూందాయ్ నుంచి వచ్చిన Exter మోడల్.. కస్టమర్లను బాగా ఆకట్టుకుంది. ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీనిచ్చి అనతి కాలంలోనే సేల్స్ పెంచుకుంది. కాంపాక్ట్ అప్పియరెన్స్‌తో తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉండడంతో ఈ మైక్రో ఎస్‌యూవీ వినియోగదారులకు చేరువైంది. ఈ మోడల్.. మార్కెట్లో దూసుకుపోతున్న తరుణంలో హుందాయ్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కారు ధర పెంచుతున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.