హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ కారు ఎలా ఉందో తెలుసా? దీనిని కొనుగోలు చేయవచ్చా?
ఆటోమొబైల్స్
- 1 year, 8 month, 24 days ago
దేశీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్ గత సంవత్సరం ఇదే సమయంలో ఫేస్‌లిఫ్టెడ్ క్రెటాను భారతదేశానికి తీసుకువచ్చింది. అప్పటి నుండి, అప్‌డేట్ చేసిన SUV దేశం అంతటా ఉన్న హ్యుందాయ్ డీలర్‌షిప్‌లలో వినియోగదారులను ఆకర్షిస్తూ బెస్ట్ మోడల్‌గా ఉంది. గత సంవత్సరం ఫేస్‌లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా ఇండియా రోడ్లపై ప్రయాణించినప్పుడు క్రెటా వేరియంట్ రాక గురించి చాలా మంది ఎదురుచూశారు. ఇది ఎలాంటి సౌండ్ లేకుండా సైలెంట్‌గా వెళ్తుంది. వేగంగా గడిచిపోయిన కాలం తరువాత హ్యుందాయ్ సరికొత్త క్రెటా ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చింది. ఇది భారతీయ మాస్-మార్కెట్‌లో మొదటి ఈవీ. దీనిని ఆటో ఎక్స్‌పో 2025లో లాంచ్ చేయబోతున్నారు. దీనికి ముందు సరికొత్త హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్‌ను మా డ్రైవ్‌స్పార్క్ టీం టెస్ట్ రైడ్ చేసింది. క్రెటా ఎలక్ట్రిక్ కారును నడిపిన సమయంలో మాకు అనిపించి ఎక్స్‌పీరియన్స్ గురించి క్రింది కథనంలో ఇవ్వడం జరిగింది.