ఆటో ఎక్స్‌పో‌లో అదుర్స్ అనిపించేలా బజాజ్ కొత్త మోడళ్లు... కొత్త బైకులు, ఇ-స్కూటర్లతో పోటాపోటీగా..!

"భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025"కు మరికొన్ని రోజులే ఉంది. అనేక ఆటో మొబైల్ సంస్థలు తమ కొత్త వాహనాలతో సందడి చేయడానికి రెడీ అవుతున్నాయి. వినియోగదారులు కూడా ఈసారి ఏమేం కొత్త మోడళ్లు రాబోతున్నాయో అని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇదే క్రమంలో దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో... ఈ ఆటో ఎక్స్‌పోలో తమ ప్రత్యేకత చాటుకోవాలని భావిస్తోంది. ఈసారి ఆ సంస్థ కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఇథనాల్- పవర్డ్ వాహనాలను పరిచేయం చేయనుంది. 2024లో సేల్స్‌తో అదరగొట్టిన ఈ సంస్థ.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఎక్స్‌పోలో.. బజాజ్ తన అన్ని మోడళ్లను ప్రదర్శనలో ఉంచనప్పటికీ వాటికి సంబంధించిన స్నీక్ పీక్ మాత్రం వెల్లడించనుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.

దేశంలో అందరి చూపు సెకండ్ హ్యాండ్ కార్లవైపే.. 2024లో 76 శాతం మంది కొన్నిది పాత కార్లనే!

2024 సంవత్సవరం అనేక వాహన తయారీ సంస్థలు కూడా కొత్త మోడళ్లతో మార్కెట్‌లో పోటీ పెంచాయి. అయితే 2024 కొత్త వాహనాలకు మాత్రమే కాదు, పాత వాహనాలకు కూడా గిరాకీ బాగానే జరిగింది. కారులో ప్రయాణించాలనే ఆశ ఉన్నప్పటికీ.. కొత్త వాహనం కొనుగోలు చేసేందుకు సరిపడా డబ్బులు లేనప్పుడు అందరి చూపు సెకండ్ హ్యాండ్ కార్లవైపే ఉంటుంది. 2024 చివర్లో సెకండ్ హ్యాండ్ కార్లపై జీఎస్‌టీ పెంచుతున్నట్లు కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది. అయినా కూడా ఈ రంగం గతేడాది మంచి వృద్ధినే కనబర్చిందని చెప్పవచ్చు. Spinney అనే హెహికిల్ సేల్స్ ప్లాట్‌ఫామ్ నివేదిక ప్రకారం.. గతేడాది 76శాతం మంది సెకండ్ హ్యాండ్ కారునే తమ మొదటి వాహనంగా ఎంచుకున్నారని తెలిపింది. అంతకుమందు ఏడాది 73శాతం మాత్రమే కాగా... 2024నాటికి ఈ సంఖ్య 3శాతం పెరిగింది.

ప్రపంచంలోనే తొలి CNG బైకు పట్ల భారతీయుల క్రేజ్.. 6 నెలల్లో 40 వేలకు పైగా కొనుగోళ్లు!

దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ బజాజ్.. తమ వాహనాలతో అభిమానుల మనసు దోచుకుంటూ వస్తోంది. ఈ సంస్థ గతేడాది ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ బైకును లాంఛ్ చేసి సంచలనం సృష్టించింది. 2024లో జులైలో ఫ్రీడమ్ 125 సీఎన్‌జీ బైక్ పేరుతో లాంచ్‌ అయిన ఈ బైకును భారత వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. అందుకే సేల్స్‌లో దూసుకువెళ్లిపోయి బజాజ్ సంస్థకు లాభాలు తెచ్చిపెట్టింది. ఆరు నెలల వ్యవధిలో ఈ బైకును ఏకంగా 40 వేలకు మందికిపైగా వినియోగదారులు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..

క్వాలిఫయింగ్‌ రేసింగ్‌లో సత్తా చాటిన అజిత్.. ఏకంగా టాప్ 10 లోపే

హీరో అజిత్ కుమార్‌‌కు సినిమాలతో పాటు కార్లు, బైక్స్ రేసింగ్ అన్న చాలా ఇష్టం. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన ప్రారంభంలో కూడా చాలా సార్లు ఈ రేసింగ్స్‌లలో కూడా పాల్గొన్నారు. గతంలో కూడా స్పోర్ట్స్ బైకులతో రోడ్లపై రైడింగ్ చేస్తూ చాలా సార్లు కనిపించారు. సినిమాలతో ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన కొంచెం సమయం దొరికిన కూడా తన కార్లు లేదా బైక్స్‌తో రోడ్లపై రయ్ మంటూ దూసుకుపోతుంటారు. ఇటీవల కొద్ది కాలం పాటు రేసింగ్ వంటి వాటికి బ్రేక్ ఇచ్చిన అజిత్ తాజాగా ఇలాంటి వాటిల్లో పాల్గొనడానికి మరోసారి రంగంలోకి దూకారు. ఇదిలా ఉంటే దుబాయ్‌లో 11, 12 తేదీల్లో 'Dubai 24 Hours Race' కార్ రేసింగ్ పోటీలు జరగనున్నాయి. దీనిలో ఆయన కూడా పాల్గొంటున్నారు. దీని కోసం గత కొన్ని నెలలుగా అక్కడే ఉంటూ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు.
Advertisement

అమ్మకాల్లో దూసుకెళ్తున్న మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, సేల్స్‌ ఎంత పెరిగాయంటే?

మహీంద్రా కార్లు మార్కెట్‌లో దూసుకెళ్తున్నాయి. ఈ కంపెనీకి చెందిన కార్లు గత కొన్ని నెలలుగా అమ్మకాల్లో అదరగొడుతున్నాయి. ఈ సంస్థ నుంచి మహీంద్రా థార్‌ రాక్స్‌, మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO, స్కార్పియో కార్లు రాణిస్తున్నాయి. బడ్జెట్‌ ధరలో మహీంద్రా గత ఏడాది విడుదల చేసిన XUV3XO ఎస్‌యూవీ మంచి అమ్మకాలను రాబడుతోంది. ఈ ఎస్‌యూవీ భారీ డిజైన్, అప్‌డేటెడ్‌ ఫీచర్లతో అందుబాటులో ఉంది. అందువల్ల ఈ కారుని జనాలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఈ కారు సేల్స్‌లో టాప్‌లో నిలిచింది.

రూ.8 లక్షలకే సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 315 కి.మీలు రేంజ్ ఇచ్చే టాటా కారు

భారత్‌లో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యున్నత భద్రతా ప్రమాణాలతో కార్లను విడుదల చేసే కంపెనీ అంటే మొదటగా గుర్తుకువచ్చేది టాటా మోటార్స్ (Tata Motors) మాత్రమే. అంతర్జాతీయ కంపెనీలకు ధీటుగా దేశీయ ప్రజల కోసం అధునాతన సదుపాయాలు, ఫీచర్స్‌తో కార్లను లాంచ్ చేస్తూ, దేశంలో చాలా మంది కస్టమర్లను కలిగి ఉంది. ఒక్క ఇండియాలోనే కాకుండా ఇక్కడ తయారైన కార్లను ప్రపంచమార్కెట్‌కు సైతం ఎగుమతి చేస్తూ మన దేశ సత్తాను అందరికి తెలిసేలా చేస్తుంది. ఇదిలా ఉంటే టాటా మోటార్స్ 2024 ఏడాదిలో సేల్స్ విషయంలో అదరగొట్టింది. గత సంవత్సరంలో కంపెనీ అదిరిపోయే కొత్త కార్లను విడుదల చేసి కొత్త కస్టమర్లను ఎక్కువగా సంపాదించింది. ఈ నేపథ్యంలో 2025 ఏడాదిలో కొత్త మోడళ్లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. తాజాగా కంపెనీ తన ప్రముఖ కార్ అయినటువంటి 2025 టియాగో(tiago), టియాగో ఈవీని కొత్తగా అప్‌డేట్ చేసి విడుదల చేసింది.

ఇదేం సిత్రం సామి.. స్ప్లెండర్ బైకును ఏటీఎం చేసేశాడుగా.. ఇక ఎప్పుడంటే అప్పుడు డబ్బులే!

సోషల్ మీడియాలో ఎన్నో సిత్రాలు కనువిందు చేస్తుంటాయి. ఈ విచిత్రాల మేకింగ్‌లో భారతీయులు తగ్గేదేలే అన్నట్లుగా పోటీ పడతారు. గతంలో బైకుల, కార్లకు సంబంధించి ఎన్నో వింత వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి. కొందరు బైకులను విభిన్నంగా మార్చి వైరల్ అయ్యి ఆకట్టుకున్నారు. ఇప్పుడు.. ఇంకాస్త వింత వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మిడిల్ క్లాస్ ఫేవరేట్ బైకు అయిన హీరో స్ప్లెండర్ మోటార్ సైకిల్‌ను ఓ వ్యక్తి.. ఊహకందని రీతిలో మోడిఫైడ్ చేశాడు. దీన్ని చూసిన వారంతా 'ఇదెక్కడి మ్యాజిక్కురా బాబు' అని ఆశ్చర్యపోతున్నారు. అతడి ట్యాలెంట్‌ను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ ఆ వ్యక్తి హీరో స్ప్లెండర్ బైకుతో ఏం ట్రిక్కు చేశాడు? దాన్ని ఏ విధంగా మార్చి ఆకట్టుకున్నాడో ఇప్పుడు చూద్దాం.

బ్లాక్ కలర్‌లో అదిరిపోతున్న హోండా కొత్త కార్లు లాంచ్

దిగ్గజ కంపెనీ హోండా కార్స్ ఇండియా కొత్త ఏడాది ప్రారంభంలోనే కస్టమర్లకు అదిరిపోయే న్యూస్ చెప్పింది. పొంగల్ పండుగ, రిపబ్లిక్ డేకు ముందు కంపెనీ రెండు ప్రత్యేక వెర్షన్ కార్లను విడుదల చేసింది. హోండా ఎలివేట్ బ్లాక్ ఎడిషన్ (honda elevate black edition), సిగ్నేచర్ బ్లాక్ ఎడిషన్ (Signature black edition) కార్లు తాజాగా మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ఇవి అదిరిపోయే డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఎక్స్‌టీరియర్ షేడ్‌ మొత్తం కూడా కొత్త క్రిస్టల్ బ్లాక్ పెర్ల్ మాదిరిగా ఉంటాయి. ఇండియాలో కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచ, దేశీయ ఆటోమొబైల్ తలయారీ కంపెనీలు భారత్‌లో వరుస బెట్టి పలు మోడళ్లను విడుదల చేస్తున్నాయి. ఈ క్రమంలో హోండా కంపెనీ దేశీయంగా కొత్త కస్టమర్లను పెంచుకోడానికి అదిరిపోయే ఫీచర్స్‌తో ఈ కార్లను విడుదల చేసింది. ఎక్స్‌టీరియర్‌తో పాటు ఇంటీరియర్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.

టాటా నానో ఈవీ మార్కెట్లోకి వచ్చిందంటే.. ఇక సేల్స్ రప్పా రప్పా అవ్వాల్సిందే!

టాటా నానో.. ఇది మనందరికీ సుపరిచితమైన తక్కువ ధరలో లభించే ఫేవరెట్ కారు. పేదలు కూడా కార్లలో తిరగాలనే దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా కలలకు వాస్తవ రూపం ఈ కారు. రూ. లక్ష ఖరీదుతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. కొన్నేళ్ల క్రితమే ఈ నానో కారు అమ్మకాలను టాటా సంస్థ నిలిపివేసింది. అయితే ఈ కారుపై ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఇప్పటికీ సెకండ్- హ్యాండ్ కార్ మార్కెట్లో దీన్ని కోరికోరి కొనుగోలు చేసేవారు అధికంగా ఉన్నారు. ప్రస్తుతం దేశంలో ట్రెండ్ మారతోంది. అందరూ ఈవీలపై మొగ్గు చూపుతున్నారు. అనేక వాహన తయారీ సంస్థలు సైతం ఈవీలను తయారు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.

హ్యుందాయ్ కార్లపై దాదాపు రూ.2 లక్షల వరకు తగ్గింపు ఆఫర్

ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motors) భారత్‌లో కార్ల అమ్మకాల్లో దూసుకుపోతుంది. గత ఏడాది 2024లో కంపెనీ మెరుగైన సేల్స్ సాధించింది. అన్ని విభాగాల్లో కూడా అమ్మకాల పరంగా అదరగొట్టింది. చాలా కొత్త మోడళ్లను విడుదల చేసి ఎక్కువ మంది కొత్త కస్టమర్లకు చేరువ అయింది. ముఖ్యంగా పండుగల సమయంలో అయితే అంచనాల కంటే అత్యధిక సేల్స్‌ను నమోదు చేసి పాత ఏడాదికి ఘనంగా ముగింపు పలకగా, ఇప్పుడు కొత్త ఏడాదిలో కూడా సేల్స్ సంఖ్యలను మరింత పెంచడానికి కస్టమర్లను ఆకర్షించడానికి హ్యుందాయ్ అదిరిపోయే డిస్కౌంట్స్, ఆఫర్స్‌ను ప్రకటించింది. ప్రస్తుత జనవరిలో నెలలో పొంగల్, రిపబ్లిక్ డే వంటి పండుగలు ఉన్న నేపథ్యంలో ఇదే అవకాశంగా కంపెనీ తన కార్లపై భారీ తగ్గింపులు ఇస్తున్నట్లు పేర్కొంది. ఒక్కో మోడల్‌కు ఒక్కో విధమైన డిస్కౌంట్స్‌ను కంపెనీ ఇస్తుంది. ఆ వివరాలను క్రింది కథనంలో చూద్దాం.

ముంబయిలో చక్కర్లు కొడుతున్న స్టారియా ఎంపీవీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు!

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్‌.. తన వాహనాలతో కొన్నేళ్లుగా భారత ఆటోమోబైల్ ఇండస్ట్రీలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఈ 2025 లోనూ కొత్త వాహనాలతో మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తమ బ్రాండ్ నుంచి క్రెటా ఈవీని 2025 ఆటో ఎక్స్‌పోలో పరిచయం చేయనుంది. అయితే.. ఈ సంస్థ నుంచి మరో కొత్త మోడల్ స్టారియా ఎంపీవీ కారు భారత రోడ్లపై రయ్యిన దూసుకెళ్తూ కనిపిస్తోంది. ఇంకా రిలీజ్ కాకముందే ఈ కారు కనిపించడం అందరినీ ఆశ్చర్యపరించింది. ఈ ఎంపీవీ ఇంతకుముందు ఎప్పుడూ కనిపించలేదు. ముంబయి నగర రోడ్లపై వైట్ నంబర్ ప్లేటుతో తిరుగుతున్న ఈ కారు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ కారు గురించి ఆటోమోబైల్ ప్రేమికులు ఆరా తీయడం మొదలుపెట్టారు. మనం కూడా ఇప్పుడు ఈ కారు గురించి తెలుసుకుందాం.

పెట్రోల్, డీజిల్ అవసరమే లేని బెంజ్ కొత్త కారు.. ఏకంగా 820 కి.మీలు

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ (mercedes benz) ఇండియాలో అధునాతన సదుపాయాలతో కూడిన లగ్జరీ కార్లను విడుదల చేస్తూ, తన మార్కెట్‌ను భారీగా విస్తరించుకుంటుంది. దాదాపు కంపెనీ దేశీయంగా 30 ఏళ్లకు పైగా తన వాహనాలను ఇక్కడ సేల్ చేస్తుంది. ప్రతి ఏడాది కూడా అధునాతన ఫీచర్లతో కార్లను లాంచ్ చేస్తుంది. 2024 ఏడాదిలో కూడా భారతీయ వినియోగదారులకు మరింత చేరువ కావడానికి డజనకు పైగా లగ్జరీ కార్లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ కొత్త ఏడాదిలో కూడా మరిన్ని మోడళ్లను తీసుకురావడానికి ప్రణాళికలు వేసింది. ఈ నేపథ్యంలో 2025 ప్రారంభంలోనే కంపెనీ ఈక్యూఎస్ (EQS 450) మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ఒక ఎస్‌యూవీ (SUV). దీన్ని కంపెనీ రూ. 1.28 కోట్లకు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకు విడుదల చేసింది.
Advertisement

2025లో కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఫేమస్ కంపెనీ నుంచి ఈ 3 కార్లపై లుక్కేయండి!

దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్.. భారత ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ప్రత్యేక బ్రాండ్‌గా పేరు సంపాదించింది. తక్కువ ధరలో, నాణ్యమైన కార్లను అందించడంలో ఈ సంస్థకు తమదైన గుర్తింపు ఉంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన టాటా టియాగో, టాటా టిగోర్ మోడల్ కార్లు.. కస్టమర్లను బాగా ఆకట్టుకున్నాయి. కంపెనీకి లాభాలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈ కార్లను మరింత అడ్వాన్స్‌డ్ ఫీచర్లను తీసుకువస్తోందీ సంస్థ. జనవరి 17 నుంచి 22వరకు దిల్లీలో జరగనున్న గ్లోబల్ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా టియాగో, టాటా టియాగో ఈవీ, టాటా టిగోర్ పేర్లతో మూడు అప్డేటెడ్ కార్లను లాంఛ్ చేయనుంది. ఈ నేపథ్యంలో ఈ మోడళ్లకు సంబంధించి టీజర్లను ఈ సంస్థ విడుదల చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.

2024లో ఎక్కువ మంది కొన్న టాప్ బెస్ట్ కార్లపై ఓ లుక్కేయండి

భారత వాహన పరిశ్రమకు 2024 ఏడాది బాగా కలిసి వచ్చింది. ప్రపంచ దేశాల్లో ఆటోమొబైల్ వృద్ధికి అంతగా సానుకూల అంశాలు లేనప్పటికీ కూడా ఇండియాలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. అన్ని కంపెనీల చూపు ఇప్పుడు భారత్‌ వైపే ఉంది. అందుకే గత ఏడాది దేశంలో అదిరిపోయే కొత్త కార్లు మార్కెట్లోకి లాంచ్ అయ్యాయి. మారుతీ సుజుకీ (Maruti Suzuki), టాటా మోటార్స్ (Tata Motors), హ్యుందాయ్ (Hyundai) వంటి పలు కార్ల తయారీ కంపెనీలు పోటీ పడుతూ మరి కొత్త మోడళ్లను విడుదల చేశాయి. దేశీయంగా ఇక్కడే తయారు చేస్తుండటంతో పాటు ఇతర దేశాలకు భారత్ నుంచే ఎగుమతి కూడా చేస్తున్నారు. 2024 ఏడాదిలో కార్ల తయారీ కంపెనీలు అమ్మకాల పరంగా మెరుగైన గణంకాలను సాధించాయి.

సేఫ్టీ విషయంలో డిజైర్ కారుపై డౌట్స్ క్లియర్... ఈ యాక్సిడెంట్ వీడియోనే సాక్ష్యం

కార్ల సేఫ్టీకి సంబంధించి గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ విధానాన్ని తీసుకువచ్చింది ప్రభుత్వం. కొన్ని కార్లను పరీక్షించి, అవి సేఫ్టీ పరంగా ఏ స్థాయిలో ఉన్నాయో తెలుపుతూ వాటికి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది. 5 స్టార్ రేటింగ్ సాధించడం అంటే.. ఆ కారు భద్రతాపరంగా అత్యున్నతం అని అర్థం. అయితే.. ఈ రేటింగ్స్ సాధించిన కార్లు నిజంగా ప్రయాణికులకు సేఫ్టీ అందిస్తాయా అనే విషయంలో వినియోగదారులకు చాలా సందేహాలే ఉండేవి. దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మారుతి నుంచి 5 స్టార్ రేటింగ్ సాధించిన బ్రాండ్ న్యూ డిజైర్ కారు విషయంలోనూ ఈ సందేహాలు ఎందరికో ఉన్నాయి. పర్ఫార్మెన్స్ పరంగా ఈ కారు మంచి పేరే సొంతం చేసుకుంది.

సైబర్‌ట్రక్‌తో ఫోటోలు దిగిన హీరోయిన్.. సినిమాలకు బ్రేక్.. దుబాయ్‌లో ఎంజాయ్

తెలుగుతో పాటు తమిళ్, మలయాళ చిత్రసీమలో మంచి నటిగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సునయన (sunaina) ఇటీవల కాలంలో సినిమాలు తక్కువగా చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన సునయన తెలుగులో మొదటగా కుమార్ వెర్సస్ కుమారి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మళయాళం, కన్నడ పరిశ్రమలోకి అడుగు పెట్టింది. కొన్ని టెలివిజన్ సిరీస్‌లలో కూడా నటించింది. ప్రస్తుతం సినిమాల్లో కనిపించనప్పటికి కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులను ఎప్పటికప్పుడు పలకరిస్తుంది. తాజాగా ఆమె అరబ్ దేశానికి చెందిన యూట్యూబర్‌తో రిలేషన్ షిప్ ఉందని ప్రచారం జరుగుతుంది. దుబాయ్‌కి చెందిన ఖలీద్ అల్ అమెరిలలో రిలేషన్ షిప్ కొనసాగిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సినిమాల్లో యాక్టివ్‌గా లేనప్పటికి దుబాయ్‌లో తన ప్రేమికుడితో కలిసి చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారని తెలుస్తుంది.

అయ్యయ్యో.. ఈ కారుకు ఏమైంది?.. ఎందుకింత చిన్న చూపు? ఆరు నెలల్లో అంత తక్కువ‌ మంది కొన్నారా..!

దేశీయ దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా.. తమ వాహనాలతో ఎన్నో ఏళ్లుగా భారత కస్టమర్లను ఆకట్టుకుంటూ వస్తోంది. అయితే ఈ సంస్థ ఇప్పుడు ఓ కారు కారణంగా కష్టాలెదుర్కొంటోంది! సేల్స్ పెంచుకోలేక సతమతమవుతోంది. అదే మహీంద్రా నుంచి వచ్చిన మరాజో ఎంపీవీ. ఇది లాంచ్‌ అయిన కొత్తలో వినియోగదారులను బాగానే ఆకట్టుకుంది. 7- సీటర్ వాహనాల్లో భారతీయుల్లో చాలామందికి ఫేవరేట్ వాహనంలా నిలిచింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. ఈ కారుని జనాలు కొనేందుకు భారతీయ వినియోగదారులు పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు.

ఈ ఇ-స్కూటర్‌తో ఖర్చులు సేఫ్ అయినట్లే.. అదిరే లుక్‌లో, అదుర్స్ అనిపించే ఫీచర్లతో!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. టూ వీలర్ వినియోగదారుల్లో చాలామంది ఇప్పుడు ఈవీలవైపు మొగ్గుచూపుతున్నారు. ఓలా, ఏథర్ వంటి దిగ్గజ సంస్థలు ఇప్పటికే తమ ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఈ రంగంలో సత్తా చాటుతున్నాయి. మరోవైపు కొన్ని స్టార్టప్ సంస్థలు కూడా తమ ఈవీలతో మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. భారతీయ వినియోగదారులు వాహనం బాగుంటే చాలు.. బ్రాండ్‌తో సంబంధం లేకుండా.. ఈవీలను ఆదరిస్తూ వస్తున్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నాసిక్‌కు చెందిన జితేంద్ర ఈవీ అనే టూ వీలర్ స్టార్టప్ సంస్థ తమ కొత్త మోడల్‌తో మార్కెట్లోకి వచ్చేసింది. యూనిక్ పేరుతో తీసుకువచ్చిన ఈ ఇ-స్కూటర్‌ను అనేక ప్రత్యేకతలతో తయారు చేసింది. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.

మార్కెట్లోకి అదిరిపోయే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. అదరగొట్టిందా? ఫర్ఫామెన్స్‌ ఎలా ఉందంటే?

ద్విచక్ర వాహనాల EV మార్కెట్‌లో బెంగళూరుకు చెందిన మరో స్టార్టప్ న్యూమెరోస్ మోటార్స్, మార్చి 2024లో డిప్లోస్ ప్రోను ప్రారంభించింది. వాణిజ్య విభాగాన్ని లక్ష్యంగా చేసుకుని, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ వెనుక క్యారియర్, పెద్ద-ఇష్ ఫ్లోర్‌బోర్డ్ మరియు కఠినమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. . ఇది క్లెయిమ్ చేయబడిన IDC పరిధి 140కిమీ.

ఒక్క సారి ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీల పైనే.. 5 మందికి ఖర్చు చాలా తక్కువ

దేశీయ దిగ్గజ ప్రముఖ వాహన తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (Maruti Suzuki India) కార్ల సేల్స్‌లో అగ్రస్థానంలో ఉంటుంది. తక్కువ ధరలో కార్లను కొనుగోలు చేయాలనుకునే వారు మొదటగా ఈ కంపెనీ వైపు చూస్తారు. మధ్య తరగతి వినియోగదారులు ఎక్కువగా మారుతీ కార్లను వాడుతుంటారు. ప్రతి ఏడాది కూడా కంపెనీ వాహనాల సేల్స్ ఇతర కంపెనీల కంటే అధికంగా నమోదు అవుతుంటాయి. 2024 ఏడాదిలో ఇండియాలో కార్ల అమ్మకాల పరంగా మారుతీ సుజుకీ టాప్ స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెల ముగిసిన తరువాత తాజాగా ఆ నెలలో మోడళ్ల వారీగా జరిగిన సేల్స్ వివరాలను వెల్లడిస్తుంది. ఈ క్రమంలో మారుతీకి చెందిన ప్రసిద్ధ కాంపాక్ట్ SUV ఫ్రాంక్స్(fronx) సేల్స్ డేటాను ప్రకటించింది. ఈ కారు గత నెలలో మెరుగైన అమ్మకాలను సాధించింది.
Advertisement

హ్యుందాయ్‌ ఐ10 నియోస్‌, వెర్నా, వెన్యూ కార్లు విడుదల.. స్పెషల్‌ ఏంటంటే?

దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ తన లైనప్‌లోని వెర్నా, వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్‌ కార్లను కొత్త వేరియంట్లలో విడుదల చేసింది. ఈ మూడు హ్యుందాయ్‌ కార్లు ఇప్పటికే అందుబాటులో ఉన్న కొన్ని వెర్షన్లను అప్‌గ్రేడ్ చేసి తీసుకువచ్చింది. ఎంట్రీ లెవల్ కారు గ్రాండ్ ఐ10 హ్యాచ్‌బ్యాక్‌లోని స్పోర్ట్స్ (ఓ) వేరియంట్‌ ఇప్పుడు కొత్త 1.2 లీటర్ల కప్పా పెట్రోల్‌ ఇంజిన్‌ మాన్యువల్‌తో పాటు AMT గేర్‌బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. దీని మాన్యువల్ హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ ధర రూ.7,72,300 కాగా, AMT వేరియంట్ ధర రూ.8,29,100 ఎక్స్‌షోరూమ్‌గా ఉంది.

రోడ్డు యాక్సిడెంట్లను తగ్గించడానికి ఇకపై సేఫ్టీ పరికరాలు తప్పనిసరి

ఇండియాలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూనే ఉంది. దేశంలో చోటుచేసుకుంటున్న మరణాల్లో ఎక్కువగా యాక్సిడెంట్ల ద్వారానే నమోదు అవుతున్నాయి. ప్రతి నిమిషం ఎక్కడో ఒక చోట రోడ్డు ప్రమాదం జరుగుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఈ ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కూడా రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంపై ఆందోళన చేస్తూ వీటిని తగ్గించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. దీనికోసం ఆయన కఠిన నిబంధనలను రూపొందించమని అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH)కీలక ప్రతిపాదనలు తీసుకొచ్చింది. ఇక మీదట ప్రమాదాల తీవ్రతను తగ్గించడానికి భారీ వాహనాల్లో భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.

ఈవీలపై భారీ తగ్గింపు ప్రకటించి టాటా మోటార్స్ సంస్థ... ఏకంగా రూ.85,000 వరకు డిస్కౌంట్!

భారత ఆటోమోబైల్ ఇండస్ట్రీలో.. తమ వాహనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాటా మోటార్స్ సంస్థ. అన్ని వర్గాల వినియోగదారులకు సరిపడే వాహనాలను తయారు చేస్తూ కస్టమర్స్ నుంచి మన్ననలు అందుకుంటూ ఉంది. ఈవీల్లోనూ తగ్గేదేలా అన్నట్లుగా తమ జోరు చూపెడుతోంది. ఈ సంస్థ నుంచి గతేడాది టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) మోడళ్లు అమ్మకాలతో అదరగొట్టాయి. ఇప్పుడు తమ సేల్స్‌ను మరింత పెంచుకునేందుకు టాటా మోటార్స్ సంస్థ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు మోడళ్ల ఈవీలపై ఏకంగా రూ.85,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు అందుబాటులో ఉండనుంది? ఈ తగ్గింపుతో ఈ కార్ల ధరలు ఎలా ఉండబోతున్నాయి? వంటి వివరాలు చూసేద్దాం.

ఒక నెలలో కేవలం 24 మంది మాత్రమే కొన్న ఎలక్ట్రిక్ కారు ఇదే

భారతదేశపు ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ఇప్పటికే పెట్రోల్, డీజిల్ విభాగాల్లో తన కార్లను విక్రయిస్తుంది. అయితే దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఆ దిశగా అడుగులు వేస్తూ ఈవీ విభాగంలో కూడా తన కార్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా గతంలో ఐయోనిక్ 5(Ioniq 5) ఈవీ కారును తీసుకొచ్చింది. ప్రస్తుతం దీన్నే విక్రయిస్తుంది. ప్రపంచంతో పాటు భారత మార్కెట్లో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనే వినియోగదారుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. దీంతో ఈ పరిశ్రమలో పోటీ ఎక్కువ అయింది. ఈ నేపథ్యంలో ఈవీ తయారీదారులు పోటీ పడుతూ మరి సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తున్నారు. ఈ కొత్త 2025 ఏడాదిలో కూడా అధునాతన ఈవీలు రాబోతున్నాయి.

మంచి మైలేజీ ఇచ్చే కార్ల కోసం చూస్తున్నారా.. అయితే వీటిపై తప్పక లుక్కేయాల్సిందే!

కారు కొనేటప్పుడు ఎవరైనా సరే దాని డిజైన్, బ్రాండ‌తో పాటు ముఖ్యంగా చూసే అంశం మైలేజీ. అసలే ఫ్యూయల్ ఖర్చులు పెరిగిపోతున్నాయి. తక్కువ ధరలో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనం ఉంటే.. ఖర్చులను కొంతైనా తగ్గించుకోగలం. అందుకే మార్కెట్లో మైలేజ్ ఎక్కువ ఇచ్చే కార్లకు డిమాండ్ ఎక్కువ. తయారీదారులు కూడా వీలైనంత మేరకు ఇలాంటి కార్లను తయారు చేసేందుకే ఆసక్తి చూపిస్తారు. ప్రస్తుతం దేశంలో స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల హవా కొనసాగుతోంది. ఈ సెగ్మెంట్‌లో మరిన్ని ఆప్షన్ల కోసం వినియోగాదారులు ఎదురు చూస్తున్నారు. దీంతో దేశంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలు తమ బ్రాండ్ నుంచి కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్లను లాంఛ్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది ఏయే కార్లు మార్కెట్లో హల్‌చల్ చేయనున్నాయో చూసేద్దాం.