ఈవీలపై భారీ తగ్గింపు ప్రకటించి టాటా మోటార్స్ సంస్థ... ఏకంగా రూ.85,000 వరకు డిస్కౌంట్!
ఆటోమొబైల్స్
- 1 year, 9 month, 2 days ago
భారత ఆటోమోబైల్ ఇండస్ట్రీలో.. తమ వాహనాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాటా మోటార్స్ సంస్థ. అన్ని వర్గాల వినియోగదారులకు సరిపడే వాహనాలను తయారు చేస్తూ కస్టమర్స్ నుంచి మన్ననలు అందుకుంటూ ఉంది. ఈవీల్లోనూ తగ్గేదేలా అన్నట్లుగా తమ జోరు చూపెడుతోంది. ఈ సంస్థ నుంచి గతేడాది టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), టాటా టియాగో ఈవీ (Tata Tiago EV) మోడళ్లు అమ్మకాలతో అదరగొట్టాయి. ఇప్పుడు తమ సేల్స్‌ను మరింత పెంచుకునేందుకు టాటా మోటార్స్ సంస్థ అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ఈ రెండు మోడళ్ల ఈవీలపై ఏకంగా రూ.85,000 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు అందుబాటులో ఉండనుంది? ఈ తగ్గింపుతో ఈ కార్ల ధరలు ఎలా ఉండబోతున్నాయి? వంటి వివరాలు చూసేద్దాం.