34 కిమీ మైలేజ్‌తో మధ్యతరగతి ఫేవరెట్ కారు!
ఆటోమొబైల్స్
- 2 month, 10 days ago
భారతీయ పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో కార్లను అందించడంలో దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. ఈ కంపెనీ నుంచి వచ్చే కార్లు సాధారణంగా బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రతినెలా కూడా ఈ కంపెనీ అమ్మకాల పరంగా ఆకట్టుకునే సేల్స్ గణంకాలను నమోదు చేస్తుంటాయి. ఈ క్రమంలో మారుతి ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ అయినటువంటి వ్యాగన్ ఆర్ (Wagon R) అమ్మకాల విషయంలో గత నెలలో మెరుగైన సంఖ్యలను సాధించింది. తాజాగా వచ్చిన సేల్స్ ప్రకారం, వ్యాగన్ ఆర్ జూన్ 2026 లో 16,952 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి మార్కెట్లో తన సత్తా ఎంటో ఆటోమొబైల్ రంగానికి చూపించింది.