టాటా నెక్సాన్ వేరియంట్ వారీ ధరలు, EMI లెక్కలు లోపల!

ఇండియాలో అత్యంత డిమాండ్ కలిగిన కార్లలో టాటా మోటార్స్‌కు చెందిన టాటా నెక్సాన్ (tata nexon). ఇది భారత మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది. సిటీ డ్రైవింగ్‌కు సరిపోయే కాంపాక్ట్ పరిమాణం, ప్రతి రోజు ఉపయోగానికి ప్రాక్టికల్ డిజైన్, రాజీ పడని నిర్మాణం ఈ అన్ని అంశాలు కలిసి నెక్సాన్‌ను కుటుంబాలు, కొత్త డ్రైవర్స్, బడ్జెట్‌లో మంచి కారును కోరుకునే వారికి ఒక నమ్మదగిన ఎంపికగా నిలబెట్టాయి. అంతేకాదు, టాటా మోటార్స్‌ బ్రాండ్‌ మీద ఉన్న విశ్వసనీయత కూడా నెక్సాన్‌ను మరింత బలపరుస్తుంది. దీని ధర రూ. 7.32 లక్షల నుండి రూ. 14.05 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు. EMI ఆప్షన్‌లో ఈ కారును కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఈ కథణంలో నెలవారీగా EMI డేటా మీ కోసం.

నంబర్ పెరిగితే బడ్జెట్ బ్రేక్! వెంటనే కారు బుక్ చేయండి!

కొత్త సంవత్సరం మొదలవుతున్న వేళ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) వినియోగదారులకు ఒక షాక్ ఇవ్వడానికి సిద్ధమైంది. జపాన్‌కు చెందిన ఈ ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్, జనవరి 2026 నుంచి తన కార్ల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2025 చివరలో ఒక్కనంబర్ మారి 6 చేరిందటే ఇప్పుడు ఎక్కువ ధరతో కారు కొనాల్సి వస్తుంది. దీంతో కొత్తగా హోండా కారు కొనాలని భావిస్తున్న వారికి ఈ ప్రకటన కీలకంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆటోమొబైల్ పరిశ్రమ మొత్తం మీద ఒక స్పష్టమైన ట్రెండ్ కొనసాగుతోంది. ముడిసరుకు ధరలు, లాజిస్టిక్స్, రవాణా ఖర్చులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో, వాహన తయారీదారులు కాలానుగుణంగా తమ వాహనాల ధరలను సవరించుకోవాల్సి వస్తోంది. హోండా కూడా ఈ పరిస్థితి నుంచి మినహాయింపు కాదు.

కారు లోపల హెల్మెట్ ఏంటి బాసూ?

ఆటోమొబైల్ ప్రపంచంలో భద్రతకు సంబంధించి ఒక పెను మార్పు రాబోతోంది. సాధారణంగా హెల్మెట్ అంటే కేవలం ద్విచక్ర వాహనదారులకే పరిమితం అనుకుంటాం. కానీ భవిష్యత్తులో కార్లలో ప్రయాణించే వారు కూడా హెల్మెట్ వంటి రక్షణను పొందబోతున్నారు. చైనీస్ టెక్ దిగ్గజం హువావే (Huawei), చెర్రీ (Chery) కార్ల తయారీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంలోని లక్సీడ్(Luxeed) బ్రాండ్, ప్రపంచంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ హెల్మెట్ ఎయిర్‌బ్యాగ్ టెక్నాలజీని తన రాబోయే లగ్జరీ మినివాన్ లక్సీడ్ V9లో పరిచయం చేస్తోంది.

దేశంలో దీన్ని మించిన స్కూటర్‌ను చూపించలేరు!

భారతదేశంలో ప్రజలను బెస్ట్ స్కూటర్ ఏది? అని అడిగితే, చాలా మందికి వెంటనే గుర్తుకు వచ్చే పేరు హోండా యాక్టివా (Honda Activa). ఈ స్కూటర్ దేశవ్యాప్తంగా సాధించిన విశ్వాసం, స్థిరమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ కారణంగా సంవత్సరాలుగా వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. నగర ప్రయాణాలకే కాకుండా రోజువారీ అవసరాలకు కూడా అనువుగా ఉండే యాక్టివా, అన్ని వయసులవారి నుంచి ఒకే స్థాయిలో ఆదరణ పొందుతోంది. ఈ ప్రజాదరణ నవంబర్ నెల అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన డేటా ప్రకారం, నవంబర్‌లో హోండా యాక్టివా మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుతూ నంబర్ 1 స్థానంలో కొనసాగింది.
Advertisement

ఈసారి ప్లాన్ మామూలుగా లేదుగా!

ఒకప్పుడు భారతీయ రోడ్లపై తమ స్థానాన్ని పదిలం చేసుకున్న అనేక కార్ బ్రాండ్‌లు(Car Brands) కఠినమైన పోటీ, సరైన ధరల నిర్ణయం లేకపోవడం, సర్వీస్ నెట్‌వర్క్ (Service Network) లోపాల కారణంగా మార్కెట్ నుంచి నిష్క్రమించాయి. అయితే, 2025 నాటికి భారతదేశపు వేగంగా అభివృద్ధి చెందుతున్న వాహన మార్కెట్ (Growing Indian Auto Market) ఇప్పుడు పాత బ్రాండ్‌లను మళ్లీ ఆకర్షిస్తోంది.

2026లో కార్ మార్కెట్‌ను షేక్ చేయనున్న మోడల్ వస్తోంది!

భారత ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో టాటా పంచ్ ఈవీ(Tata Punch Ev) ఒకటిగా నిలిచింది. టాటా మోటార్స్ విక్రయించే ఎలక్ట్రిక్ కార్లలో ఇది అత్యంత సరసమైన ధరకు లభించే మోడల్ కావడంతో, మిడిల్ క్లాస్ కుటుంబాలు, మొదటిసారి EV కొనుగోలు చేయాలనుకునే వినియోగదారుల నుంచి దీనికి భారీ స్పందన లభిస్తోంది. స్టైలిష్ డిజైన్, నగర వినియోగానికి సరిపోయే సైజ్, టాటా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం ఈ అన్నీ కలిసి పంచ్ EVని మార్కెట్లో హాట్ ఫేవరెట్‌గా మార్చాయి. మార్కెట్లో టాటా పంచ్ EVకు ఉన్న ఈ బలమైన డిమాండ్‌ను గమనించిన టాటా మోటార్స్, ఇప్పుడు ఈ కారును మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సిద్ధమవుతోంది.

నింజా 650 అప్‌డేట్తో ప్రత్యర్థులకు చుక్కలే

జపనీస్ మోటార్‌సైకిల్ దిగ్గజం కవాసకి (Kawasaki) భారతీయ మార్కెట్లోకి తన ఐకానిక్ మిడిల్ వెయిట్ స్పోర్ట్స్ బైక్ 2026 నింజా 650 (Ninja 650)ను అధికారికంగా ప్రవేశపెట్టింది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ.7.91 లక్షలుగా నిర్ణయించారు. మునుపటి 2025 మోడల్‌తో పోలిస్తే ధర సుమారు రూ.14,000 పెరిగినప్పటికీ, ప్రస్తుత పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా దీనిని E20 ఫ్యూయల్ (20% ఇథనాల్ మిశ్రమం)కు అనుకూలంగా అప్‌డేట్ చేయడం విశేషం.

ఇండియా నుంచి వెళ్లేది ఇప్పుడు SUVలే!

భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రస్తుతం ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో చిన్న హ్యాచ్‌బ్యాక్‌లు, తక్కువ ధర గల ప్యాసింజర్ కార్లు ప్రధానంగా డిమాండ్‌లో ఉండేవి. అయితే, ఇటీవలి కాలంలో వినియోగదారుల అభిరుచులు గణనీయంగా మారాయి. ఇప్పుడు ఎక్కువ మంది కస్టమర్లు సాధారణ కార్ల కంటే SUVల వైపు ఆకర్షితులవుతున్నారు. ఈ మార్పు కేవలం దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా, భారతదేశం నుంచి జరుగుతున్న వాహనాల ఎగుమతుల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం విడుదలైన గణాంకాలు ఈ ధోరణిని మరింత బలపరుస్తున్నాయి. భారత మార్కెట్లో SUVలు, MPVలు, ప్రీమియం ప్యాసింజర్ కార్లు భారీగా ప్రజాదరణ పొందుతున్నాయి. చిన్న కార్లను పక్కన పెట్టి, కొంచెం పెద్దగా కనిపించే, అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన SUVలు లేదా ఫ్యామిలీ అవసరాలకు సరిపోయే MPVల వైపు మొగ్గు చూపుతున్నారు.
Advertisement

లుక్ చూస్తే లయన్.. మైలేజ్‎లో కింగ్

భారతదేశంలో టూ-వీలర్ అనగానే సామాన్యుడి నుంచి కుర్రాళ్ల దాకా అందరికీ గుర్తొచ్చే ఏకైక పేరు బజాజ్ పల్సర్. కొన్ని దశాబ్దాలుగా ఇండియన్ రోడ్లపై తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఈ బైక్, ఇప్పుడు మరింత స్టైలిష్‌గా, హైటెక్ ఫీచర్లతో కొత్త అవతారమెత్తింది. బజాజ్ ఆటో తన పాపులర్ మోడల్ పల్సర్ 150 (Pulsar 150) లో 2026 అప్‌డేటెడ్ వెర్షన్‌ను లాంచ్ చేసింది.

రోజువారీ వాడుకకు బెస్ట్ స్కూటర్.. అమ్మకాలు చెప్పేదే నిజం!

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) భారత మార్కెట్లో ఒక సాధారణ స్కూటర్‌గా కాకుండా, ప్రపంచ ప్రఖ్యాత స్కూటర్‌గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. లాంచ్ అయినప్పటి నుంచి ఈ స్కూటర్‌కు ఉన్న క్రేజ్ తగ్గకుండా రోజురోజుకూ మరింత పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా నమ్మకమైన పనితీరు, సుజుకి బ్రాండ్ ఇమేజ్, అలాగే వినియోగదారులకు సరిపోయే డిజైన్ కారణంగా కొనుగోలుదారులు దీనిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇదే ట్రెండ్ 2025 నవంబర్ నెలలో కూడా స్పష్టంగా కనిపించింది. ఈ ఒక్క నెలలోనే సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ మొత్తం 67,477 యూనిట్లు అమ్ముడవ్వడం గమనార్హం. గత ఏడాది ఇదే నవంబర్ నెలతో పోలిస్తే ఇది చాలా పెద్ద వృద్ధి. 2024 నవంబర్‌లో యాక్సెస్ 125 అమ్మకాలు 54,118 యూనిట్లుగా నమోదయ్యాయి.

ఒకే కారుకు వేర్వేరు NCAP రేటింగ్‌లు ఎందుకు?

ఒకే మోడల్ కారు.. కానీ ఒక చోట 5-స్టార్ రేటింగ్, మరో చోట మాత్రం కేవలం 1-స్టార్.. ఈ మధ్య కాలంలో కొత్త కారు కొనాలనుకునే వారిని తీవ్రంగా వేధిస్తున్న ప్రశ్న ఇది. ఉదాహరణకు, మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు గ్లోబల్ NCAPలో మంచి మార్కులు సాధిస్తే, ఆస్ట్రేలియాకు చెందిన ANCAP టెస్టులో మాత్రం తక్కువ స్కోరుతో సరిపెట్టుకుంది. అసలు ఒకే కారుకు వేర్వేరు దేశాల్లో వేర్వేరు రేటింగ్‌లు ఎందుకు వస్తాయో, దీని వెనుక ఉన్న అసలు కారణాలేంటో వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

కేవలం రూ.2 లక్షలకే ఎలక్ట్రిక్ కారు

ఎలక్ట్రిక్ కారు కొనాలనే ఆలోచన రానివారు ఈ రోజుల్లో చాలా అరుదు. పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో తక్కువ ఖర్చుతో, ముఖ్యంగా నగరాల్లో సౌకర్యంగా ప్రయాణించాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంది. అయితే భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కారు అంటే కనీసం రూ. 8 లక్షల బడ్జెట్ ఉండాల్సిందే అన్న భావన చాలా మందిలో బలంగా ఉంది. అందుకే చాలామంది EV మనకు కాదు అని ముందే నిర్ణయించుకుని ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనను పూర్తిగా మార్చే ఒక ఆసక్తికరమైన నిజం బయటకు వచ్చింది. మన దేశంలోనే తయారైన ఒక ఎలక్ట్రిక్ వాహనాన్ని కేవలం రూ.1.99 లక్షలకే కొనుగోలు చేయవచ్చంటే ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఇది ఏ జోకో కాదు, నిజంగా జరుగుతున్న విషయం.
Advertisement

జనవరి వచ్చిందా మీ పని గోవిందా

ఖరీదైన కార్ల మార్కెట్లో బడ్జెట్ ధరకే దొరికే నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ప్రియులకు ఒక చేదు వార్త. వచ్చే ఏడాది అంటే 2026 జనవరి 1 నుంచి నిస్సాన్ ఇండియా తమ కార్ల ధరలను పెంచబోతున్నట్లు ప్రకటించింది. మీరు తక్కువ ధరలో ఈ ఎస్‌యూవీని సొంతం చేసుకోవాలనుకుంటే, డిసెంబర్ నెలే మీకు ఆఖరి అవకాశం.

బుల్లెట్‌ను మట్టి కరిపించడానికి క్లాసిక్ బైక్ వచ్చేస్తోంది

భారతదేశంలో రెట్రో క్లాసిక్ మోటార్‌సైకిల్ మార్కెట్ అంటే గుర్తొచ్చేది రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield). దశాబ్దాలుగా బుల్లెట్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. అయితే, ఇప్పుడు ఈ రాజసం పై దెబ్బ కొట్టేందుకు జపాన్ దిగ్గజం కవాసకి (Kawasaki) సరికొత్త అస్త్రంతో సిద్ధమైంది. కవాసకి గతంలో విడుదల చేసిన W175 మోడల్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది, కానీ ఇప్పుడు రాబోతున్న W230 (Kawasaki W230) మాత్రం మార్కెట్ సమీకరణాలను మార్చేలా కనిపిస్తోంది.

కేవలం రూ.5.35 లక్షలు ఉంటే కారు సొంతం చేసుకోవచ్చు

మారుతి సుజుకి ఇగ్నిస్ (maruti suzuki ignis) భారత మార్కెట్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందిన హ్యాచ్‌బ్యాక్. నెక్సా షోరూమ్‌ల ద్వారా మాత్రమే విక్రయించే ఈ కారు, స్టైలిష్ డిజైన్‌తో పాటు నమ్మకమైన పనితీరు కారణంగా ఇంటింటికీ సుపరిచితంగా మారింది. యూత్ నుంచి ఫ్యామిలీ వినియోగదారుల వరకూ విస్తృత వర్గాలను ఆకట్టుకునే విధంగా ఇగ్నిస్ తనదైన శైలిని చూపిస్తోంది. మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నట్లయితే, బడ్జెట్‌లో మంచి బ్రాండ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, నమ్మకమైన పనితీరు కావాలంటే మారుతి సుజుకి ఇగ్నిస్ ఒక ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. ధర విషయానికి వస్తే, కొత్త మారుతి ఇగ్నిస్ చాలా సరసమైన ధరలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర కేవలం రూ.5.35 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ.7.55 లక్షలు మాత్రమే (ఎక్స్-షోరూమ్).

టాటా EV ప్లాన్‌లో కీలక మోడల్.. 2026 చివర్లో అవిన్య ఎలక్ట్రిక్ SUV

టాటా మోటార్స్ (tata motors) ప్రస్తుతం భారత ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో అగ్రగామిగా నిలుస్తోంది. నెక్సాన్ EV, టియాగో EV, టిగోర్ EV వంటి మోడళ్లతో ఇప్పటికే బలమైన పునాదిని వేసుకున్న ఈ కంపెనీ, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న ఆసక్తిని స్పష్టంగా గుర్తించింది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని, రాబోయే సంవత్సరాల్లో మరింత పెద్ద స్థాయిలో తన EV పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు టాటా మోటార్స్ వ్యూహాత్మకంగా ముందడుగులు వేస్తోంది. ఈ ప్రణాళికల్లో భాగంగా 2026 ఏడాదిని టాటా మోటార్స్ కీలక సంవత్సరంగా భావిస్తోంది. ఆ ఏడాదిలో పలు కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురావాలని కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ముఖ్యంగా 2026లో ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తూ కొత్త టాటా అవిన్య (Avinya) EVను తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.
Advertisement

జనవరి 2న అసలు సినిమా మొదలు

భారతీయ ఎస్‌యూవీ (SUV) విభాగంలో పెద్ద ప్రకంపనలు సృష్టించేందుకు కొత్త తరం కియా సెల్టోస్ సిద్ధమవుతోంది. దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ అయిన కియాకు దేశీయ మార్కెట్‌లో ఒక గుర్తింపు తెచ్చిన ఈ మోడల్, ప్రస్తుతం అమ్మకాలలో హ్యుందాయ్ క్రెటా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి విక్టోరిస్, మారుతి గ్రాండ్ విటారా వంటి వాటి వెనుక ఉంది.

గ్రామీణం నుంచి నగరం వరకు.. HF డీలక్స్‌కు ఫుల్ డిమాండ్

నవంబర్ 2025 నెలలో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కార్ల అమ్మకాలతో పాటు ద్విచక్ర వాహనాలు కూడా మంచి ప్రదర్శన చూపించాయి. ముఖ్యంగా కమ్యూటర్ సెగ్మెంట్‌లో హీరో మోటోకార్ప్‌కు చెందిన హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hf Deluxe) బైక్ అమ్మకాల పరంగా ప్రత్యేకంగా నిలిచింది. ఈ మోడల్‌కు వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన గణనీయంగా ఉండటంతో, గత నెలలో కంపెనీ మొత్తం 91,082 యూనిట్లను విక్రయించింది. ఇది గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 61,245 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 48.72 శాతం వార్షిక వృద్ధిగా నమోదు కావడం విశేషం. ఈ సంఖ్యలు చూస్తేనే HF డీలక్స్ భారత ద్విచక్ర వాహన మార్కెట్లో ఎంత బలమైన స్థానం సంపాదించుకుందో అర్థమవుతుంది.

పొద్దున్న బండి ఇస్తే సాయంత్రానికి రెడీ

ఒకప్పుడు ఇండియా ఈవీ మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) అంటే ఒక తిరుగులేని శక్తి. 2024లో ఏకంగా 4 లక్షల స్కూటర్లను అమ్మి, మార్కెట్లో దాదాపు 40 శాతం వాటాను కైవసం చేసుకుంది. కానీ, సేల్స్ పెరిగినంత వేగంగా సర్వీస్ క్వాలిటీ పెరగలేదు. వేల సంఖ్యలో ఫిర్యాదులు, సర్వీస్ సెంటర్ల ముందు కస్టమర్ల నిరసనలతో ఓలా బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా డ్యామేజ్ అయ్యింది.

విదేశాల్లో కేవలం 1-స్టార్ భద్రతా రేటింగ్ మాత్రమే పొందిన కారు

మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Maruti Suzuki Fronx) భారత మార్కెట్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కాంపాక్ట్ SUVగా ఎదిగింది. భారత్‌లో తయారై ఎగుమతి అవుతున్న ఈ మోడల్, అంతర్జాతీయ మార్కెట్లలో సుజుకి ఫ్రాంక్స్ (Suzuki Fronx) పేరుతో అమ్ముడవుతూ, డిజైన్, ఇంధన సామర్థ్యం, బ్రాండ్ విశ్వసనీయత పరంగా మంచి స్పందనను పొందుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి అభివృద్ధి చెందిన ఆటో మార్కెట్లలో కూడా ఈ కారు అడుగు పెట్టడం మారుతి సుజుకి గ్లోబల్ వ్యూహానికి మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా ఫ్రాంక్స్ భద్రతా ప్రమాణాల విషయంలో చర్చకు దారి తీసింది.
Advertisement

నెక్సాన్ స్పీడ్‎కు బ్రేకుల్లేవ్..లక్ష యూనిట్లతో రికార్డు

టాటా మోటార్స్ అంటేనే చాలా మందికి సేఫ్టీ అనే పదం గుర్తుకు వస్తుంది. అందుకు ప్రధాన కారణం, వారి ప్రయాణంలో మైలురాయిగా నిలిచిన నెక్సాన్ (Nexon) కాంపాక్ట్ ఎస్‌యూవీ. ఈ మిడిల్ క్లాస్ ఎస్‌యూవీ ద్వారానే టాటా, కారు సేఫ్టీ విషయంలో కొత్త ప్రమాణాలను సృష్టించింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ, కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు కూడా సేఫ్టీ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు.

కొత్త చరిత్ర సృష్టించిన రతన్ టాటా కంపెనీ

భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగంలో టాటా మోటార్స్ (Tata Motors) తన ఆధిపత్యాన్ని మరోసారి బలంగా నిరూపించుకుంది. ఒకప్పుడు ప్రారంభ దశలో ఉన్న EV మార్కెట్‌ను నేడు దేశవ్యాప్తంగా ప్రజల దైనందిన జీవితాల్లోకి తీసుకొచ్చిన బ్రాండ్‌గా TATA.ev నిలిచింది. 2020లో టాటా మోటార్స్ తన తొలి ఎలక్ట్రిక్ కారుగా Nexon.evను భారత మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటి నుంచి, ఈ విభాగంలో స్థిరమైన నాయకత్వాన్ని కొనసాగిస్తోంది. కేవలం కొత్త మోడళ్లను విడుదల చేయడమే కాకుండా, వినియోగదారుల నమ్మకాన్ని కూడా దక్కించుకుంటూ EV మార్కెట్ పరిణామానికి దిశానిర్దేశం చేస్తోంది.

ఫ్యామిలీ కారుకు మంగళం పాడుతున్నారా?

మారుతి సుజుకికి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన బాలెనో(Baleno) పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. మైలేజీలో రారాజుగా, మధ్యతరగతి కుటుంబాలకు ఇష్టమైన కారుగా పేరున్న బలేనో విక్రయాలు గత రెండు నెలలుగా దారుణంగా పడిపోతున్నాయి. కేవలం ఒక్క నెలలోనే వేల సంఖ్యలో యూనిట్ల విక్రయాలు తగ్గిపోవడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశమైంది.

తక్కువ ఖర్చుతో ఈ ఆటో డ్రైవర్ల కడుపు నింపుతుంది

డీజిల్ కొట్టించే అవసరం లేదు, ఇంజిన్ ఆయిల్ మార్చే తలనొప్పి లేదు.. కేవలం బ్యాటరీ ఛార్జ్ చేస్తే చాలు, భారీ బరువులను కూడా సులభంగా మోసుకెళ్లవచ్చు. అవును, భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతున్న యుధా(YOUDHA) సంస్థ, రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా తన కొత్త ఎలక్ట్రిక్ కార్గో వాహనం ట్రెవో(Trevo)ను మార్కెట్లోకి విడుదల చేసింది.
Advertisement

మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ 2026 అవార్ట్ గెలుచుకున్న బైక్ ఇదే

టీవీఎస్ మోటార్ కంపెనీకి (Tvs Motor Company) మరో ప్రతిష్ఠాత్మక ఘనత దక్కింది. కంపెనీ నుంచి తాజాగా వచ్చిన అడ్వెంచర్ ర్యాలీ టూరర్ మోటార్‌సైకిల్ టీవీఎస్ అపాచీ ఆర్‌టీఎక్స్ (Apachi RTX), జెకె టైర్ అందించే 2026 ఇండియన్ మోటార్‌సైకిల్ ఆఫ్ ది ఇయర్ (IMOTY) అవార్డును గెలుచుకుని దేశవ్యాప్తంగా ఆటో ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. ఇది టీవీఎస్‌కు మాత్రమే కాదు, భారత మోటార్‌సైకిల్ పరిశ్రమకే గర్వకారణంగా నిలిచింది. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును పొందడం అంత ఈజీ కాదు. భారతదేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ఆటోమోటివ్ జర్నలిస్టులతో కూడిన 27 మంది సభ్యుల ప్రత్యేక జ్యూరీ టీవీఎస్ అపాచీ RTXను సవివరంగా పరీక్షించి, అన్ని కోణాల్లో మూల్యాంకనం చేసింది.