ఓలా కొత్త స్కూటర్ కొంటే హెలికాప్టర్ ఫీలింగ్

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో అగ్రగామిగా ఉన్న ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన అమ్ములపొదిలోని సరికొత్త ఆయుధాన్ని రోడ్లపైకి తీసుకొచ్చింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన 4680 భారత్ సెల్ (Bharat Cell) బ్యాటరీ ప్యాక్ కలిగిన S1 Pro+ (5.2 kWh) స్కూటర్ల డెలివరీలను కంపెనీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో వేగవంతం చేసింది.

యముడు ఎదురువచ్చినా కాపాడుతుంది

భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన శక్తివంతమైన SUV లైన టాటా హారియర్ (Tata Harrier), టాటా సఫారీ (Tata Safari) గురించి చాలా కాలంగా ఉన్న ఒకే ఒక లోపాన్ని టాటా మోటార్స్ (Tata Motors) తాజాగా సరిదిద్దింది. ఈ రెండు మోడళ్లు ఇప్పటివరకు కేవలం డీజిల్ ఇంజిన్ (Diesel Engine) ఆప్షన్‌తో మాత్రమే లభించేవి.

ఏళ్ల తరబడి క్రేజ్ తగ్గలేదు.. క్లాసిక్ 350 సేల్స్ గ్రోత్

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 (Royal Enfield Classic 350) ఒకటి. ఈ బైక్‌కు ఉన్న క్రేజ్ కొత్తది కాదు. ఎన్నో సంవత్సరాలుగా నిరంతరంగా మంచి అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. ప్రత్యేకంగా క్లాసిక్ డిజైన్, గంభీరమైన రోడ్ ప్రెజెన్స్, నమ్మకమైన పనితీరు కారణంగా ఈ బైక్‌కు దేశవ్యాప్తంగా భారీ అభిమానులు ఉన్నారు. ఇప్పుడు నవంబర్ 2025 నెలలో కూడా క్లాసిక్ 350 తన సత్తాను మరోసారి చాటుకుంది. ఈ నెలలో మొత్తం 34,793 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత సంవత్సరం అదే కాలంతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. నవంబర్ 2024లో ఈ బైక్ అమ్మకాలు 27,514 యూనిట్లకే పరిమితమయ్యాయి. అంటే ఏడాది వ్యవధిలోనే 7,279 యూనిట్ల అదనపు అమ్మకాలు నమోదయ్యాయి.

మైలేజ్, సేఫ్టీ, ఫీచర్లు అన్నీ ఒకే కారులో

హ్యుందాయ్ ఎక్స్‌టర్ (Hyundai Exter) భారత మార్కెట్లోకి వచ్చిన ఒక చిన్న క్రాస్ఓవర్ SUVగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ ధరలోనే SUV లుక్‌ను అందించడం దీని ప్రధాన ఆకర్షణ. కొత్తగా కారు కొనుగోలు చేయాలని భావిస్తున్న ఫస్ట్‌టైమ్ బయ్యర్లకు, అలాగే బడ్జెట్‌లోనే స్టైలిష్ కార్ కావాలనుకునే కుటుంబాలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. సాధారణ హ్యాచ్‌బ్యాక్‌లతో పోలిస్తే ఎక్స్‌టర్ డిజైన్ చాలా బోల్డ్‌గా, మస్కులర్‌గా కనిపిస్తుంది. ధర విషయానికి వస్తే, హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 5.49 లక్షల నుంచి ప్రారంభమై గరిష్టంగా రూ. 9.61 లక్షల వరకు ఉన్నాయి. ఈ ధర పరిధిలో SUV స్టైల్, హ్యుందాయ్ బ్రాండ్ నమ్మకం, ఆధునిక ఫీచర్లు కలిపి మంచి విలువను అందిస్తుంది.
Advertisement

కారు కంటే ఈమె బ్లౌజ్ కే ఎక్కువ మార్కులు

కొత్త కారు కొంటే ఆ సంతోషమే వేరు. ఇంటికి కొత్త అతిథి వస్తున్నట్లుగా అందరూ పండగ చేసుకుంటారు. కానీ, మహారాష్ట్రకు చెందిన ఒక జంట తమ కొత్త టాటా పంచ్ (Tata Punch) కారును డెలివరీ తీసుకున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కారు కంటే కూడా ఆ కారు యజమానురాలు కట్టుకున్న స్పెషల్ బ్లౌజ్ నెటిజన్ల మనసు దోచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

జనం పిచ్చెక్కిస్తున్నారు! హోండా షైన్ అమ్మకాలు భారీగా పెరిగాయి

హోండా షైన్ 100 (honda shien 100) భారత మార్కెట్లో నమ్మకమైన మోటార్‌సైకిల్‌గా తన స్థానం మరింత బలపరుచుకుంటోంది. రోజురోజుకూ దీనిపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతుండటమే కాదు, కొనుగోళ్లలో కూడా స్పష్టమైన వృద్ధి కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల నెలల్లో హోండా షైన్ 100 అమ్మకాలు గణనీయంగా పెరగడం ఆటో రంగాన్ని ఆకర్షిస్తోంది. ఈ నవంబర్ నెలలో కూడా అదే ట్రెండ్ కొనసాగింది. మొత్తం మీద ఈ ఒక్క నెలలోనే 1,86,490 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే ఈ వృద్ధి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 2024 నవంబర్ నెలలో హోండా షైన్ 100 అమ్మకాలు 1,45,530 యూనిట్లుగా నమోదయ్యాయి.

2025లో దుమ్మురేపిన టాప్ 5 స్కూటర్లు ఇవే

ప్రస్తుత రోజుల్లో సిటీ ట్రాఫిక్‌లో ప్రయాణించాలన్నా లేదా ఆఫీసు పనులకు వెళ్లాలన్నా బైక్ కంటే స్కూటర్లకే జనం ప్రాధాన్యత ఇస్తున్నారు. సౌకర్యవంతమైన సీటింగ్, కాలిక కింద సామాన్లు పెట్టుకునే స్పేస్, గేర్లతో పనిలేని డ్రైవింగ్ వెసులుబాటు వల్ల ప్రతి ఇంట్లోనూ స్కూటర్ ఒక భాగంగా మారిపోయింది. ముగియనున్న 2025 ఏడాదికి సంబంధించి సేల్స్ గణాంకాలను పరిశీలిస్తే, షోరూమ్‌కు వెళ్లే సగం మంది కస్టమర్లు కేవలం ఈ 5 స్కూటర్లలో ఒకదానినే ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. అవేంటో చూద్దాం.

ఇండియాలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే మారుతి కార్లు

కారు కొనగలరా అని నిర్ణయించే ముందు అందరి ప్రాధాన్యతలో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, అదే మైలేజ్. అది ఖర్చు తగ్గించడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. రోజువారీ ప్రయాణంలో ఇంధన వినియోగం తగ్గితే మీ పెట్రోల్/డీజిల్ ఖర్చు కూడా తగ్గిపోతుంది. అందుకే చాలా మంది కొత్త కార్లను ఎన్నుకునేటప్పుడు గరిష్ట మైలేజ్ ఇచ్చే కార్లపై ఎక్కువగా దృష్టి పెడతారు. మీరు మైలేజ్‌-ఫ్రెండ్లీ కార్లు గురించి ఆలోచిస్తున్నట్లయితే, ప్రస్తుతం భారత మార్కెట్లో కొన్ని మంచి ఎంపికలు ఉన్నాయి. మారుతి సుజుకి కంపెనీకి చెందిన కార్లు మంచి మైలేజ్ ఇవ్వడంతో పాటు అవి అతి తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి లభిస్తాయి. ఈ కథణంలో మారుతి సుజుకి ఆల్‌టో K10, సెలెరియో, స్విఫ్ట్ కార్ల గురించి తెలుసుకుందాం.
Advertisement

రాయల్ ఎన్‌ఫీల్డ్‎కే దడ పుట్టిస్తున్న టీవీఎస్

భారతీయ రోడ్ల మీద ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు కేవలం స్పోర్ట్స్ బైక్‌లు లేదా సాధారణ ప్యాసింజర్ బైక్‌లకే ప్రాధాన్యత ఉండేది. కానీ 2025 నాటికి సీన్ పూర్తిగా మారిపోయింది. పాతకాలపు లుక్ (Retro), మోడ్రన్ టెక్నాలజీ కలగలిసిన నియో రెట్రో బైక్‌లకు యువత బ్రహ్మరథం పడుతోంది. ఈ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, యమహా XSR 155 వంటి దిగ్గజాలు మార్కెట్లో రాజ్యమేలుతున్నా, ఇప్పుడు అందరి చూపు టివిఎస్ రోనిన్ 225 (TVS Ronin 225) వైపు మళ్లింది. ఒకప్పుడు తక్కువ అంచనా వేసిన ఈ బైక్, ఇప్పుడు విక్రయాల్లో సునామీ సృష్టిస్తోంది.

కియా తీసుకొస్తున్న హైబ్రిడ్ అస్త్రం! టయోటాకు గట్టి పోటీ..!

ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్ వేగంగా మారుతోంది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు హైబ్రిడ్ కార్లకు కూడా వినియోగదారుల్లో మంచి ఆదరణ పెరుగుతోంది. పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లపై ఇంకా కొన్ని సందేహాలు ఉన్నా, ఇంధన సామర్థ్యం ఎక్కువగా ఉండటం, తక్కువ ఎమిషన్లు, అలాగే రేంజ్ టెన్షన్ లేకపోవడం వంటి కారణాలతో హైబ్రిడ్ టెక్నాలజీపై ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ మారుతున్న ట్రెండ్‌ను గమనించిన కార్ తయారీ కంపెనీలు కూడా తమ భవిష్యత్ ప్రణాళికలను హైబ్రిడ్ వాహనాల వైపు మళ్లిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

70కి.మీ మైలేజీ ఇచ్చినా కొనేదిక్కులేదు

యమహా మోటార్స్ నుంచి వచ్చిన స్టైలిష్ స్కూటర్ ఫాసినో 125 (Yamaha Fascino 125) గురించి తెలియని వారు ఉండరు. ముఖ్యంగా దాని రెట్రో లుక్, అదిరిపోయే మైలేజీకి మహిళలు, యువత ఫిదా అయిపోయారు. అయితే తాజాగా విడుదలైన 2025 నవంబర్ సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే ఫాసినో జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. గతేడాదితో పోలిస్తే ఈ స్కూటర్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. అసలు ఫాసినో సేల్స్ ఎందుకు తగ్గాయి? మార్కెట్లో దీని పరిస్థితి ఏంటి? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

కొత్త ఏడాది మార్కెట్ పై మహీంద్రా దండయాత్ర

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ ప్రస్తుతం ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్‌లో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎస్‌యూవీ (SUV) విభాగంలో ఈ సంస్థకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అదే జోరును కొనసాగిస్తూ 2026 సంవత్సరంలో మహీంద్రా మూడు అద్భుతమైన కార్లను లాంచ్ చేయడానికి పక్కా ప్లాన్ సిద్ధం చేసింది. తన పాపులర్ మోడల్స్ అయిన ఎక్స్‌యూవీ 700, స్కార్పియో-ఎన్, థార్ కార్లను సరికొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేసి మార్కెట్లోకి వదలబోతోంది.
Advertisement

మారుతి బ్రెజ్జా కొత్త ఐడియా అదిరింది బాసూ!

మారుతి సుజుకి బ్రెజ్జా (Maruti Suzuki Brezza) భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్‌యూవీ (Compact SUV)లలో ఒకటి. 2022లో విడుదలైన సెకండ్ జనరేషన్ బ్రెజ్జా, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా నెక్సాన్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ వంటి కార్ల నుంచి వస్తున్న గట్టి పోటీని తట్టుకోవడానికి సిద్ధమైంది.

బైక్ కంటే ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎస్‌యూవీలు

పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలంటే మంచి మైలేజ్ ఇచ్చే కారు ఉండాల్సిందే. ఒకప్పుడు కేవలం చిన్న కార్లు మాత్రమే మైలేజ్ ఇస్తాయని అనుకునేవారు, కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. అదిరిపోయే ఎస్‌యూవీ లుక్, అది కూడా లీటరుకు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ మైలేజీతో మార్కెట్లోకి వచ్చేశాయి. కేవలం రూ. 5.50 లక్షల బడ్జెట్ నుంచి లభించే ఈ సూపర్ మైలేజ్ ఎస్‌యూవీల వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.

ఒక్కసారి ఛార్జింగ్ పెట్టి తిరుపతి వెళ్లి వెళ్లొచ్చు

మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి ఇ-విటారా (Maruti Suzuki e-Vitara)తో భారత ఈవీ మార్కెట్లో విప్లవం సృష్టించడానికి సిద్ధమైంది. కేవలం కారును లాంచ్ చేయడమే కాకుండా, వినియోగదారులకు రేంజ్ ఆందోళన (Range Anxiety) లేకుండా చేసేందుకు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తోంది. 2026 పొంగల్ పండుగ సందర్భంగా లాంచ్ కానున్న ఈ కారు గురించి మరిన్ని తాజా, ఆసక్తికరమైన వివరాలు తెలుసుకుందాం.

పెట్రోల్ తాగేది తక్కువ..మైలేజ్ ఇచ్చేది ఎక్కువ

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా (Yamaha) ఇప్పుడు భారత మార్కెట్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒకప్పుడు కేవలం స్పోర్ట్స్ బైక్‌లకు మాత్రమే పెట్టింది పేరైన యమహా, ఇప్పుడు స్కూటర్ల విభాగంలోనూ దుమ్మురేపుతోంది. ముఖ్యంగా యమహా రే జెడ్ఆర్ 125 (Yamaha RayZR 125) హైబ్రిడ్ స్కూటర్ అమ్మకాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
Advertisement

బడ్జెట్ ధరలోనే సఫారి లాంటి లుక్

భారతీయ మార్కెట్‌లో మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను క్రియేట్ చేసి అమ్మకాలలో అద్భుతాలు సృష్టించిన టాటా పంచ్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ తయారవుతోంది. కొత్త సంవత్సరంలో మార్కెట్‌లోకి వస్తుందని భావిస్తున్న ఈ పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కెమెరా కంటికి చిక్కింది. డిజైన్, ఫీచర్లలో భారీ మార్పులతో టాటా మోటార్స్ ఈ అప్‌డేటెడ్ వెర్షన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

7 సీటర్ కార్ అయినా తగ్గిన అమ్మకాలు

మారుతి సుజుకి ఎర్టిగా (maruti suzuki ertiga) భారత మార్కెట్లో సంవత్సరాలుగా సామాన్య కుటుంబాల నమ్మకాన్ని సంపాదించుకున్న ఒక విజయవంతమైన MPV. సరసమైన ధర, విశాలమైన కేబిన్, 7 సీట్ల సౌకర్యం, మంచి మైలేజ్ కారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఇది ప్రత్యేక స్థానం సంపాదించింది. ముఖ్యంగా ఒకే కారుతో ఫ్యామిలీతో పాటు రోజువారీ అవసరాలు, లాంగ్ డ్రైవ్స్‌ను కూడా సులభంగా నిర్వహించగలగడం ఎర్టిగాను బడ్జెట్ 7 సీటర్ సెగ్మెంట్‌లో బలమైన ఎంపికగా మార్చింది. అయితే, తాజా అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఎర్టిగా సేల్స్‌లో స్వల్ప తగ్గుదల నమోదైనట్టు తెలుస్తోంది. నవంబర్ 2025లో మారుతి సుజుకి ఎర్టిగా మొత్తం 16,197 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇది గత నెలతో పోలిస్తే గణనీయమైన తగ్గుదలగా చెప్పుకోవచ్చు.

ఇండియాలో బెస్ట్ 7 సీటర్ ఫ్యామిలీ కార్లు ఇవే!

కొత్త కారు కొనాలనే కోరిక చాలామందికి ఉంటుంది. కానీ ఆ కోరికను వాస్తవంగా మార్చే సమయంలో మాత్రం చాలా మంది గందరగోళానికి గురవుతుంటారు. ముఖ్యంగా పెద్ద కుటుంబం ఉన్నవారు కార్ ఎంపికలో మరింత ఆలోచించాల్సి వస్తుంది. రోజువారీ ప్రయాణాలు మాత్రమే కాకుండా, ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లే సందర్భాలు, పండుగలు, ఫంక్షన్లు, లాంగ్ డ్రైవ్స్ వంటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకుని కారు తీసుకోవాలి. ఈ పరిస్థితుల్లో ఒకేసారి అందరూ సౌకర్యంగా ప్రయాణించగలిగే కార్ కావాలంటే, 7 సీటర్ కార్లు ఉత్తమ పరిష్కారంగా నిలుస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్‌లో 7 సీటర్ సెగ్మెంట్‌లో కొన్ని కార్లు కస్టమర్లలో మంచి ఆదరణ పొందుతున్నాయి. వాటిలో రెనాల్ట్ ట్రైబర్, మారుతి సుజుకి ఎర్టిగా, కియా కారెన్స్ క్లావిస్ కార్లు ముఖ్యమైనవి. వీటి గురించి ఈ కింది కథనంలో చూద్దాం.

మైలేజ్‌లో నెం.1.. అమ్మకాలలో 9వ స్థానం!

బజాజ్ ప్లాటినా (bajaj platina) భారత ద్విచక్ర వాహన మార్కెట్లో సంవత్సరాలుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మోటార్‌సైకిల్. సరసమైన ధర, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు విస్తృతమైన వినియోగదారుల విశ్వాసాన్ని ఈ బైక్ పొందింది. ముఖ్యంగా రోజువారీ ఆఫీసు ప్రయాణాలు, చిన్న వ్యాపార అవసరాల కోసం ప్లాటినా చాలామందికి మొదటి ఎంపికగా నిలిచింది. అయితే, తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలను చూస్తే ప్లాటినా అమ్మకాల్లో స్పష్టమైన తగ్గుదల కనిపిస్తోంది. నవంబర్ 2025 నెలలో బజాజ్ ప్లాటినా మొత్తం 32,040 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనిని గత సంవత్సరం అదే నెలతో పోలిస్తే పరిస్థితి కొంచెం ఆందోళనకరంగా మారింది.
Advertisement

ట్రయంఫ్ బైక్ ధరలు పెరుగుతున్నాయి!

ప్రపంచ ప్రఖ్యాత మోటార్‌సైకిల్ బ్రాండ్ ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ (Triumph Motorcycles) భారత మార్కెట్‌లో తన బైక్‌ల ధరల విషయంలో కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం భారతదేశంలో విక్రయిస్తున్న ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ అన్ని మోడళ్లకు వర్తించే ఎక్స్-షోరూమ్ ధరలు 2025 డిసెంబర్ 31 వరకు మాత్రమే చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. అంటే, ఈ ఏడాది చివరి వరకే ప్రస్తుత ధరలు అమల్లో ఉంటాయన్న మాట. కొత్త ఏడాది ప్రారంభంతో పాటు, అంటే జనవరి 1, 2026 నుంచి, ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ లైనప్‌లోని అన్ని మోడళ్లపై ధరలపై పెరుగుదల అమల్లోకి రానుంది. అయితే, ధరలు ఎంత వరకు పెరగనున్నాయనే అంశంపై కంపెనీ అధికారికంగా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయినప్పటికీ, ధరల పెరుగుదల తప్పదనే సంకేతాలు మాత్రం ఇప్పటికే మార్కెట్ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

రూ.6.25 లక్షలు.. 33 కి.మీ మైలేజ్, 5-స్టార్ సేఫ్టీ

రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, చిన్న వ్యాపార అవసరాలు లేదా కుటుంబంతో చేసే డైలీ జర్నీలు ఇలా అన్ని అవసరాల కోసం భారతీయ వినియోగదారులు కార్ ఎంపికలో కొన్ని విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా తక్కువ ధరలో లభించాలి, నమ్మకంగా ఉండాలి, అలాగే ఇంధన సామర్థ్యం మంచి స్థాయిలో ఉండాలి. ఈ మూడు లక్షణాలు ఒకే కారులో కలిసివస్తే, అది భారత మార్కెట్‌లో విజయం సాధించడం ఖాయమే. అందుకే ఇలాంటి కార్లకు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. ఈ కోవలోనే 2025 మోడల్ మారుతి సుజుకి డిజైర్‌ (Maruti Suzuki Dzire)ను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. సాధారణ వినియోగదారుల అవసరాలను లోతుగా అర్థం చేసుకుని రూపొందించిన ఒక గొప్ప కమ్యూటర్ కారు ఇది.

ఒక లెజెండ్ రీ–ఎంట్రీ! 2026 రెనాల్ట్ డస్టర్ కొత్త లుక్

కొత్త తరం రెనాల్ట్ డస్టర్ (Renault Duster) SUV రీ-ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఒకప్పుడు భారత మార్కెట్‌లో కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ని షేక్ చేసిన డస్టర్, ఇప్పుడు మళ్లీ అదే మేజిక్ చేయడానికి రెడీ అవుతోంది. 2012లో తొలిసారి లాంచ్ అయిన ఈ SUV, దాదాపు పదేళ్ల పాటు అంటే 2022 వరకు భారత రోడ్లపై తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకుంది. స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, రఫ్ అండ్ టఫ్ ఇమేజ్, డీజిల్ ఇంజిన్ పనితనం వంటి అంశాలు డస్టర్‌ను ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలబెట్టాయి. అయితే మార్కెట్ మార్పులు, పోటీ పెరగడం, మోడల్ అప్డేట్స్ ఆలస్యం కావడం వంటి కొన్ని కారణాల వల్ల క్రమంగా అమ్మకాలు తగ్గి, చివరికి ఈ కారు మార్కెట్ నుంచి తప్పుకుంది.

రూ.500 చలాన్ కి రూ.6లక్షల ఫైన్

నేటి డిజిటల్ యుగంలో సౌకర్యాలు ఎంత పెరిగాయో, అదే స్థాయిలో ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగిన తర్వాత సైబర్ నేరగాళ్లు సరికొత్త దారుల్లో మన జేబులకు చిల్లు పెడుతున్నారు. ఇటీవలే వెలుగులోకి వచ్చిన ఒక షాకింగ్ ఘటనలో.. కేవలం రూ.500 ట్రాఫిక్ చలాన్ చెల్లించబోయి ఒక వ్యక్తి ఏకంగా రూ.6 లక్షలు పోగొట్టుకున్నాడు. మనం ఏమరుపాటుగా చేసే ఒక చిన్న క్లిక్ మన జీవితకాల కష్టాన్ని ఎలా ఆవిరి చేస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక నిదర్శనం. అసలు ఈ స్కామ్ ఎలా జరుగుతుంది? దొంగలు మిమ్మల్ని ఎలా ట్రాప్ చేస్తారు? అనే పూర్తి వివరాలు చూద్దాం.
Advertisement

షోరూం వాళ్ళ మాటలు నమ్మకండి

కొత్త కారు కొనాలనుకునే వారు షోరూమ్‌కి వెళ్లగానే డీలర్లు చెప్పే మొదటి మాట వెయిటింగ్ పీరియడ్. కారు బుక్ చేసిన తర్వాత చేతికి రావడానికి నెలలు, ఒక్కోసారి ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్లే ఈ ఆలస్యం అని మనం అనుకుంటాం. కానీ దీని వెనుక కంపెనీలు, డీలర్లు ఆడే ఒక పెద్ద మైండ్ గేమ్ ఉందని మీకు తెలుసా? కస్టమర్లను ఊరించడం ద్వారా తమ బ్రాండ్ వాల్యూను పెంచుకోవడానికి కంపెనీలు చేసే కొన్ని గమ్మత్తైన విన్యాసాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.