తక్కువ సిసి.. కానీ పవర్ మాత్రం రాకాసి

యూత్ ఐకాన్ కేటీఎం(KTM) అంటేనే స్పీడ్, అగ్రెసివ్ లుక్స్. ఒకప్పుడు ఇండియాలో కుర్రకారును ఉర్రూతలూగించిన ఈ బ్రాండ్, మధ్యలో కొంచెం జోరు తగ్గించినా.. ఇప్పుడు మళ్ళీ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఇప్పటికే డ్యూక్ 160 (Duke 160) మోడల్‌తో మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కేటీఎం, ఇప్పుడు ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైక్ విభాగంలో తన బేబి ఆర్సీ అంటే RC 160ని రంగంలోకి దించుతోంది. ఈ బైక్ రాకతో యమహ R15 లాంటి పాపులర్ బైక్‌లకు గడ్డుకాలం మొదలైనట్టేనని ఆటోమొబైల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

2025లో కియా ఇండియా రికార్డ్ సేల్స్

ఇండియా ఆటోమొబైల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే, దేశీయ దిగ్గజాలు అయిన మారుతి సుజుకి, టాటా మోటార్స్ వంటి కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వగల స్థాయికి ఎదిగిన కార్ల తయారీదారుల్లో కియా ఇండియా (Kia India) ఒకటి. దక్షిణ కొరియాలో తన ప్రయాణాన్ని ప్రారంభించిన కియా, భారత మార్కెట్ ప్రత్యేకతలను లోతుగా అర్థం చేసుకుని, అతి తక్కువ సమయంలోనే ఇక్కడ తన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. స్టైలిష్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ, వినియోగదారుల అవసరాలకు తగ్గ ఫీచర్లు ఈ మూడు అంశాలను సమన్వయంగా అందించడం కియా విజయానికి ప్రధాన కారణంగా మారింది. భారత మార్కెట్‌లోకి ప్రవేశించినప్పటి నుంచి ప్రతి ఏడాది కియా ఇండియా స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తూ వచ్చింది.

ఈ ఒక్క నెల చూసి మోసపోకండి.. MG మోటార్ అసలు పవర్ ఇదే!

2026 సంవత్సరం చేరుకున్న వేళ, దేశీయ ఆటోమొబైల్ రంగం మరోసారి వెనక్కి తిరిగి చూసుకుంటోంది. డిసెంబర్ నెలతో పాటు 2025 క్యాలెండర్ సంవత్సరం మొత్తం తమ పనితీరు ఎలా ఉందో తెలియజేస్తూ, కార్ల తయారీ సంస్థలు తమ అమ్మకాల గణాంకాలను వరుసగా విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే JSW MG మోటార్ ఇండియా కూడా తన తాజా సేల్స్ డేటాను వెల్లడించింది. ఈ గణాంకాలు చూస్తే, కంపెనీకి నెలవారీగా కొన్ని సవాళ్లు ఎదురైనా, మొత్తం సంవత్సరానికి మాత్రం పాజిటివ్ ట్రెండ్ కొనసాగిందని స్పష్టంగా అర్థమవుతుంది. గత ఏడాది డిసెంబర్ నెలలో JSW MG మోటార్ మొత్తం 6,500 వాహనాలను విక్రయించింది. ఇది అంతకు ముందు ఏడాది డిసెంబర్‌లో నమోదైన 7,516 యూనిట్లతో పోల్చితే సుమారు 13.5 శాతం తగ్గుదలని సూచిస్తోంది.

సగం ధరకే నెక్సాన్, కర్వ్, పంచ్

టాటా కార్ల ప్రేమికులకు ఇది అదిరిపోయే శుభవార్త. మధ్యతరగతి సామాన్యుడికి సొంత కారు కల ఇప్పుడు చాలా సులభంగా నెరవేరబోతోంది. ప్రముఖ టాటా మోటార్స్ డీలర్ షిప్ నెట్‌వర్క్ అయిన జాస్పేర్ మోటార్స్(Jasper Motors) తమ వద్ద ఉన్న టెస్ట్ డ్రైవ్ వాహనాలను (Demo Cars) భారీ తగ్గింపు ధరలతో విక్రయానికి ఉంచింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఈ షోరూమ్‌లలో దాదాపు అన్ని మోడళ్లపై 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి.
Advertisement

అందరి ఫేవరెట్ కారు రేపు కొత్తగా రాబోతుంది

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారు కియా (Kia), భారత మార్కెట్‌లో మరో కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. 2026 జనవరి 2న కియా ఇండియా అధికారికంగా 2026 కియా సెల్టోస్ (రెండవ తరం) కాంపాక్ట్ SUVని భారతదేశంలో విడుదల చేయనుంది. ఇప్పటికే భారతీయ వినియోగదారులలో బలమైన బ్రాండ్ ఇమేజ్ సంపాదించుకున్న సెల్టోస్, ఈ కొత్త తరం వెర్షన్‌తో మరింత శక్తివంతంగా మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. కొత్త తరం కియా సెల్టోస్‌లో అప్‌డేట్ చేసిన ఎక్స్‌టీరియర్ డిజైన్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మరింత షార్ప్ లైన్స్, ఆధునిక లైటింగ్ ఎలిమెంట్స్, స్పోర్టీ లుక్‌తో ఈ SUVను మరింత ప్రీమియంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. కియా తన తాజా గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌ను ఈ మోడల్‌లో స్పష్టంగా చూపించనుందని ఆటో వర్గాలు అంచనా వేస్తున్నాయి.

విన్ ఫాస్ట్ స్పీడ్ చూస్తే కళ్ళు తిరగాల్సిందే

భారత ఎలక్ట్రిక్ వాహన (EV) మార్కెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త కంపెనీ పెను సంచలనం సృష్టించింది. కేవలం మూడు నెలల క్రితమే దేశీ మార్కెట్లోకి అడుగుపెట్టిన వియత్నాం దిగ్గజం విన్ ఫాస్ట్ (VinFast), తన దూకుడుతో దిగ్గజ సంస్థలైన హ్యుందాయ్, కియా, బీఎమ్‌డబ్ల్యూలను వెనక్కి నెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. 2025 డిసెంబర్ నాటికి టాప్-4 ఈవీ తయారీదారుగా ఎదిగి, భారత మార్కెట్లో తనదైన ముద్ర వేసింది.

2025లో ఇండియాలో నంబర్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఇదే

2025 సంవత్సరం భారత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఒక స్పష్టమైన మలుపుగా నిలిచింది. ఇప్పటివరకు ఈ విభాగాన్ని ఎక్కువగా స్టార్టప్ కంపెనీలు తమ ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ, 2025లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాంప్రదాయ ద్విచక్ర వాహన తయారీదారులు దూకుడుగా ముందుకు రావడంతో, ఎన్నేళ్లుగా మార్కెట్‌ను శాసించిన అనేక ఎలక్ట్రిక్ స్టార్టప్‌లు వెనక్కి నెట్టబడిన దృశ్యం కనిపించింది. ఇది కేవలం అమ్మకాల పరంగా మాత్రమే కాకుండా, వినియోగదారుల ఆలోచన విధానంలో వచ్చిన మార్పుకు కూడా నిదర్శనంగా నిలిచింది. ఈ మార్పుకు ప్రధాన కారణం వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు సమయంలో బ్రాండ్ నమ్మకం, విశ్వసనీయత, అమ్మకాల తర్వాత సేవలు వంటి అంశాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టడమే.

ఆటోడ్రైవర్లకు కేంద్రం భారీ షాక్

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడు ఆటో డ్రైవర్లకు పెద్ద షాక్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ త్రీ వీలర్ వెహికల్స్‎కు (E-3 Wheelers) అందిస్తున్న రాయితీలను (Subsidies) నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం, FAME II, PM-E డ్రైవ్ పథకాల కింద ఇప్పటివరకు ఇస్తున్న సబ్సిడీలు ఇకపై లభించవు. దీంతో కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసే వారికి లక్షల్లో భారం పడనుంది.
Advertisement

డబ్బు సంపాదించి పెట్టే హ్యూందాయ్ కార్లు వచ్చేశాయ్

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించుకున్న హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India), ఇప్పుడు మరో కీలక అడుగు ముందుకు వేసింది. ఈరోజు అధికారికంగా తన ప్రత్యేక టాక్సీ కార్ల శ్రేణిని ప్రకటిస్తూ, వాణిజ్య వాహన విభాగంలోకి ప్రవేశించినట్లు వెల్లడించింది. ఈ కొత్త ప్రయాణానికి ప్రతీకగా ప్రైమ్ HB (హ్యాచ్‌బ్యాక్), ప్రైమ్ SD (సెడాన్) మోడళ్లను హ్యుందాయ్ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ఫ్లీట్ ఆపరేటర్లు, టాక్సీ యజమానులు, రోజూ ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే డ్రైవర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రైమ్ సిరీస్‌ను రూపొందించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. హ్యుందాయ్ ప్రైమ్ సిరీస్ ప్రధాన లక్ష్యం నమ్మకం, విశ్వసనీయత, తక్కువ యాజమాన్య ఖర్చు. రోజువారీ వాణిజ్య వినియోగంలో కారుకు ఎదురయ్యే కఠిన పరిస్థితులను తట్టుకునేలా ఈ వాహనాలను డిజైన్ చేసినట్లు కంపెనీ చెబుతోంది.

థార్ రాక్స్‌కు గుండె మార్పిడి

ఆఫ్-రోడ్ ఎస్‌యూవీల సామ్రాజ్యంలో రారాజుగా వెలుగొందుతున్న మహీంద్రా థార్, ఇప్పుడు తన సరిహద్దులను మరింత విస్తరించుకుంటోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆఫ్-రోడర్‌గా పేరుగాంచిన థార్ రాక్స్ (Thar Roxx) మోడల్‌లో మహీంద్రా కీలక మార్పులు చేస్తోంది. 2025 ముగింపు వేళ ఆటోమొబైల్ ప్రపంచంలో వినిపిస్తున్న అత్యంత క్రేజీ అప్‌డేట్ ఏంటంటే.. మహీంద్రా థార్ రాక్స్‌కు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అమర్చబోతున్నారు.

మారుతి కోటకు గండి కొట్టిన కొరియన్ కత్తి

భారత ఆటోమొబైల్ రంగంలో ఎన్నో కార్లు వస్తుంటాయి, వెళ్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే చరిత్ర సృష్టిస్తాయి. దక్షిణ కొరియా దిగ్గజం హ్యుందాయ్ నుంచి వచ్చిన క్రెటా (Hyundai Creta) సరిగ్గా ఇదే చేస్తోంది. 2025 సంవత్సరానికి సంబంధించి విడుదలైన సేల్స్ రిపోర్ట్ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే.

రాయల్ ఎన్‌ఫీల్డ్ లో చీపెస్ట్ అండ్ బెస్ట్ ఇదే

సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే అది భారీగా ఉంటుంది.. నడపాలంటే గట్టి కండలు ఉండాలి, దాన్ని కొనాలంటే లక్షల రూపాయలు కుమ్మరించాలి అనే అంచనా అందరిలోనూ ఉంటుంది. కానీ ఆ అంచనాలను పటాపంచలు చేస్తూ మార్కెట్లోకి వచ్చిన మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350).
Advertisement

రేపటి నుంచి బైకులకు అది తప్పనిసరి

కేంద్ర ప్రభుత్వం 2026 జనవరి 1 నుంచి అన్ని ద్విచక్ర వాహనాలకు ABS (Anti-lock Braking System) తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. రేపే (జనవరి 1, 2026) ఈ గడువు ముగుస్తున్న నేపథ్యంలో, వాహన తయారీదారులు, సామాన్య వాహనదారుల మధ్య తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నిబంధన వల్ల కలిగే మార్పులు, ధరల పెరుగుదల, వాయిదా పడే అవకాశాల గురించి సమగ్ర సమాచారం ఇక్కడ ఉంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1,000 కిలోమీటర్లు

ఎలక్ట్రిక్ కార్ల రంగంలో రేంజ్ అనేది ఎప్పుడూ ఒక పెద్ద సవాలే. కానీ ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ ఈ సవాలును చిటికెలో ఛేదించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. తన సరికొత్త డెమో కార్ ఫిలాంటే రికార్డ్ 2025తో సింగిల్ ఛార్జ్‌పై ఏకంగా 1,008 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. ఎలక్ట్రిక్ వాహనాల చరిత్రలో ఇదొక మైలురాయిగా నిలిచిపోనుంది.

హీరోకు కోలుకోలేని దెబ్బ

ద్విచక్ర వాహన రంగంలో హీరో మోటోకార్ప్ అంటే ఒక తిరుగులేని సామ్రాజ్యం. స్ప్లెండర్ వంటి బండ్లతో సామాన్యుల గుండెల్లో గూడు కట్టుకున్న ఈ కంపెనీకి తాజాగా ఒక చేదు అనుభవం ఎదురైంది. లక్షల సంఖ్యలో వాహనాలు విక్రయించే ఈ సంస్థకు చెందిన ఒక ప్రీమియం బైక్, 2025 నవంబర్ నెలలో కనీసం ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోలేదంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ బైక్ గురించి వివరంగా తెలుసుకుందాం.

పల్లెటూరి పులి..బరువులు మోయడంలో మొనగాడు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో TVS XL100 కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. పల్లెటూరి రోడ్ల మీద పాలు, కూరగాయలు, సరుకుల బస్తాలు మోస్తూ కోట్లాది మంది సామాన్యుల ఉపాధికి ఊపిరిపోస్తున్న ఈ మోపెడ్ అమ్మకాలు 2025 నవంబర్ నెలలో కాస్త వెనుకబడ్డాయి.
Advertisement

దేశం మొత్తాన్ని షాక్‌కు గురిచేసిన స్కూటర్

భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఫ్యామిలీ స్కూటర్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోజువారీ అవసరాలు, కుటుంబ వినియోగం, సౌకర్యవంతమైన రైడింగ్, తక్కువ మెయింటెనెన్స్ వంటి అంశాల కారణంగా ఈ సెగ్మెంట్‌లో హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్, టీవీఎస్ జూపిటర్ లాంటి స్కూటర్లు సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయితే దేశంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్ మాత్రం గేర్‌లెస్ స్కూటర్ విభాగంలో తనకు తగ్గ స్థానం సంపాదించుకోవడంలో ఇప్పటివరకు తడబడుతూనే ఉంది. హీరో గత కొన్ని సంవత్సరాల్లో యువతను ఆకర్షించే ఉద్దేశంతో జూమ్ 110, జూమ్ 125, జూమ్ 160 వంటి కొత్త తరం స్కూటర్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.

2025లో కార్ మార్కెట్లో మహీంద్రా రెండో స్థానం!

భారతీయ కార్ల పరిశ్రమ ఈరోజుల్లో అద్భుత వేగంతో అభివృద్ధి చెందుతోంది. దేశీయ బ్రాండ్లు కేవలం దేశంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా గుర్తింపు సంపాదిస్తున్నాయి. వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ, మార్కెట్‌లో డిమాండ్ స్థిరంగా పెరుగుతోంది. ఇలాంటి వేగవంతమైన వృద్ధిలో, 2025 చివరి నాటికి వాహన రిజిస్ట్రేషన్ డేటా ఒక ఆసక్తికరమైన గణాంకాన్ని చూపిస్తుంది. మహీంద్రా (mahindra), భారతీయ బ్రాండ్లలోనే, ఈ ఏడాది రెండో స్థానంలో నిలిచింది. ప్రత్యేకత ఏమిటంటే, ఈసారి టాటా, హ్యుందాయ్ వంటి ప్రధాన బ్రాండ్లను దాటుకుని, రెండో స్థానాన్ని సాధించిందీ. ఇది మహీంద్రా బ్రాండ్ కోసం కొత్త చరిత్రను సృష్టించింది. అయితే, ప్రతి సంవత్సరం లాంటి సారూప్యత కొనసాగుతూ, మారుతి సుజుకి భారతీయ కార్ల మార్కెట్‌లో స్థిరంగా మొదటి స్థానంలో నిలిచింది.

టాటా సుమో తిరిగి వస్తుందా? క్రేజీ లుక్ అదిరిపోయింది

టాటా మోటార్స్ (tata motots) ఇటీవల సియారా పేరును మళ్లీ తెరపైకి తీసుకురావడంతో, భారత ఆటో మార్కెట్‌లో ట్రెండ్‌కు మళ్లీ ఊపొచ్చింది. ఒకప్పుడు భారతీయ రోడ్లపై రాజ్యమేలిన పాత కార్లను ఆధునిక రూపంలో తిరిగి పరిచయం చేయాలనే టాటా వ్యూహం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. సియారా రీ-ఎంట్రీ తర్వాత, టాటా అభిమానుల మధ్య ఒక ప్రశ్న బలంగా వినిపిస్తోంది.. తర్వాత ఏ లెజెండరీ కారు తిరిగి రాబోతోంది? ఈ చర్చల మధ్యలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు టాటా సుమో. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకూ, కుటుంబ వినియోగం నుంచి కమర్షియల్ అవసరాల వరకూ విస్తృతంగా ఉపయోగించిన సుమో, భారత ఆటో చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

మహీంద్రా నుంచి మినీ బాహుబలి వస్తున్నాడు

భారతీయ రోడ్లపై రఫ్ అండ్ టఫ్ ఎస్‌యూవీలకు కేరాఫ్ అడ్రస్ మహీంద్రా. ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి వస్తున్న సరికొత్త మోడల్ 'మహీంద్రా విజన్.ఎస్' (Mahindra Vision.S) ఆటోమొబైల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు తాజాగా టెస్టింగ్ చేస్తూ రోడ్లపై కనిపించడంతో కార్ల ప్రేమికుల్లో ఆసక్తి పెరిగింది.
Advertisement

ఉద్యోగస్తులు ఈ బైకును కళ్లుమూసుకుని కొనచ్చు!

హోండా యునికార్న్ (Honda Unicorn) భారత మార్కెట్లో చాలా కాలంగా నమ్మకమైన బైక్‌గా గుర్తింపు పొందింది. తక్కువ ఆదాయం ఉన్నవారు కూడా సులభంగా కొనుగోలు చేయగలిగేలా ఉండటంతో, ఇది రోజువారీ అవసరాల కోసం చాలామందికి తొలి ఎంపికగా మారింది. ఆఫీస్ ప్రయాణాలు, చిన్నపాటి పనులు, కుటుంబ అవసరాలు అన్నింటికీ సరిపోయే బైక్‌గా యునికార్న్ పేరు తెచ్చుకుంది. మీరు ఇప్పుడు కొత్త మోటార్‌సైకిల్ కొనాలనుకుంటున్నారా? ఎక్కువ ఖర్చు లేకుండా, మెయింటెనెన్స్ తక్కువగా ఉండే బైక్ కావాలంటే హోండా యునికార్న్ నిజంగా మంచి ఆప్షన్. సరసమైన ధరలో లభించడమే కాకుండా, శ్రామిక వర్గానికి పనివాడిగా ప్రత్యేకమైన పేరు సంపాదించింది. ప్రస్తుతం హోండా యునికార్న్ ధర రూ. 1.11 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఆన్-రోడ్ ధర సుమారు రూ. 1.44 లక్షల వరకు ఉంటుంది.

ఖర్చు లేకుండా రాకెట్లా దూసుకుపోండి

నేటి కాలంలో పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తుండటంతో, అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాల (EVs) వైపు మళ్లుతోంది. సాధారణంగా చాలామంది ఈవీ అనగానే స్కూటర్లే అనుకుంటారు, కానీ 2025 నాటికి భారతదేశంలో స్టైలిష్, పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ బైకులు కూడా రాజ్యమేలుతున్నాయి. ఈ బైకులు కేవలం పర్యావరణానికే కాదు, మీ జేబుకు కూడా చాలా మేలు చేస్తాయి.

ఇండియాలోకి అదిరిపోయే బైక్ ఎంట్రీ

ఇండియా కవాసకి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ (IKM) భారత మార్కెట్లో కొత్త MY26 కవాసకి వల్కాన్ S మోటార్‌సైకిల్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వర్షన్‌తో వల్కాన్ S మరింత దూకుడు స్వభావం, స్పోర్టీ లుక్, ఆధునిక క్రూయిజర్ ఆకృతితో అభిమానులను ఆకట్టుకుంటోంది. సాంప్రదాయ క్రూయిజర్ స్టైల్‌కు స్పోర్ట్ బైక్ ఎలిమెంట్స్‌ను మేళవిస్తూ రూపొందించిన ఈ మోడల్, లుక్ పరంగానే కాదు రైడింగ్ అనుభూతి పరంగానూ ప్రత్యేకంగా నిలుస్తుంది. MY26 వల్కాన్ S డిజైన్‌ను పూర్తిగా రైడర్-సెంట్రిక్‌గా తీర్చిదిద్దారు. తేలికైన ఫ్రేమ్, సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్, స్పోర్టీ స్టాన్స్ కలిసి దీన్ని నగర ప్రయాణాలకు, హైవే క్రూయిజింగ్‌కు సరైన మోటార్‌సైకిల్‌గా మారుస్తాయి. ముఖ్యంగా యూత్‌తో పాటు ప్రీమియం క్రూయిజర్ బైక్‌లను ఇష్టపడే రైడర్లను దృష్టిలో పెట్టుకుని కవాసకి ఈ మోడల్‌ను డిజైన్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

కేవలం రూ.6లక్షలకే 7గురు ప్రయాణించే కారు

భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు 7-సీటర్ (MPV) కార్లంటే ఎప్పుడూ అమితమైన ఆసక్తి ఉంటుంది. తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించే వెసులుబాటు ఉండటమే దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోంది. అయితే, ఎర్టిగా కోటను బద్దలు కొట్టడానికి జపాన్ దిగ్గజం నిసాన్ తన సరికొత్త అస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే నిసాన్ గ్రావైట్ (Nissan Gravite).
Advertisement

నడపడం ఈజీ.. వెనక్కి తీయడం ఇంకా ఈజీ! రివర్స్ గేర్ EV స్కూటర్లు

కార్లు, ఆటోలు, లారీలు, బస్సులు రివర్స్ గేర్ లేకుండా ఊహించలేం. కానీ ద్విచక్ర వాహనాల్లో ఇది ఎందుకు లేదని మనం ఎప్పుడైనా ఆలోచించామా? బైక్ లేదా స్కూటర్ నడిపిన ప్రతి ఒక్కరూ కనీసం ఒక్కసారైనా "రివర్స్ గేర్ ఉంటే బాగుండు" అనుకుని ఉంటారు. అయితే ఇప్పుడు కొత్త తరం ఎలక్ట్రిక్ స్కూటర్లలో రివర్స్ మోడ్ ఒక కీలక ఫీచర్‌గా మారింది. ఇరుకైన పార్కింగ్‌లు, ట్రాఫిక్‌లో వెనక్కి తీయాల్సిన సందర్భాల్లో ఇది చాలా ఉపయోగపడుతుంది. మీరు కొత్త EV స్కూటర్ కొనాలనుకుంటే, రివర్స్ మోడ్ ఉన్న మోడల్ ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. రోజువారీ ప్రయాణాల్లో ఎక్కువ సౌలభ్యం ఇచ్చే, సరసమైన రివర్స్ మోడ్ EVలపై ఓ లుక్ వేయండి!