కీవే ఆర్‌ఆర్‌300 వచ్చేసింది.. స్పోర్టీ లుక్, బడ్జెట్ ధరతో అదరగొట్టింది!

హంగేరీకి చెందిన కీవే చిన్న, మధ్య తరహా ద్విచక్ర వాహనాల తయారీకి పేరుగాంచింది. భారత మార్కెట్‌లో ఈరోజు ఆర్‌ఆర్‌300 పేరుతో సరికొత్త మోటార్‌సైకిల్‌ను విడుదల చేసింది. ఇది అత్యాధునిక డిజైన్, ఫీచర్లను కలిగి ఉంది. అంతేకాకుండా, సరసమైన ధరలో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ ధర మరియు ప్రత్యేకతల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

6లక్షల యూనిట్ల అమ్మకాలతో చరిత్ర సృష్టించిన టాటా పంచ్

టాటా మోటార్స్ తన విప్లవాత్మక కాంపాక్ట్ ఎస్‌యూవీ అయిన పంచ్ ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని ప్రకటించింది. ఇది కేవలం నాలుగు సంవత్సరాల కంటే తక్కువ వ్యవధిలో 6 లక్షల కార్ల ఉత్పత్తి మైలురాయిని అధిగమించింది. అక్టోబర్ 2021లో విడుదలైన తర్వాత టాటా పంచ్ తన స్పెషల్ డిజైన్, పర్ఫామెన్స్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్లో దూసుకుపోతోంది.

ఒక్క మోడల్‌కే పరిమితమైన నిస్సాన్… మాగ్నైట్ అమ్మకాల్లో నిరాశ!

జూన్ నెల ముగిసిన తరువాత వరుసగా వాహన తయారీదారులు తమ అమ్మకాల వివరాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కంపెనీ నిస్సాన్ (Nissan) కూడా తన ప్రసిద్ద మోడల్ అయినటువంటి మాగ్నైట్‌కు సంబంధించి సేల్స్ డేటాను విడుదల చేసింది. 2025 జూన్‌లో నిస్సాన్ భారత్‌లో కేవలం 1313 మాగ్నైట్ SUVలు మాత్రమే విక్రయించింది. ఇదే గడిచిన ఏడాది జూన్ 2024లో ఈ సంఖ్య 2107 యూనిట్లు. ఈ గణాంకాల ప్రకారం వార్షికంగా 38 శాతం అమ్మకాల్లో తగ్గుదల నమోదైంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మే 2025లో కూడా అమ్మకాలు పెద్దగా తేడా లేకుండా 1334 యూనిట్లకు పరిమితమయ్యాయి. పోటీ బ్రాండ్లు ఎన్నో మోడళ్లతో మార్కెట్‌ను ఆక్రమిస్తున్నప్పుడు, నిస్సాన్ మాత్రం ఒకే మోడల్ మాగ్నైట్ మీద ఆధారపడుతూ కొనసాగుతోంది.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 240 కిలోమీటర్ల దాకా! కోమాకి కొత్త బైక్స్ వచ్చేశాయ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగం వేంగా విస్తరిస్తుంది. గతంలో స్కూటర్లే ప్రధానంగా కనిపించినా, ఇప్పుడు బైకులకు గణనీయమైన గిరాకీ పెరుగుతోంది. ఈ కొత్త పోటీ వాతావరణంలోకి కోమాకి (Komaki) ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ క్రూయిజర్ రేంజర్ ప్రో (Ranger Pro), ప్రో ప్లస్ (Pro Plus) బైక్‌‌లతో అడుగుపెట్టింది. ఈ బైక్స్ లుక్ పరంగా అత్యంత ఫ్యాన్సీగా కనిపిస్తూ, పనితీరు విషయంలో నిజంగా రేంజర్ అనిపించేలా ఉన్నాయి. వీటి డిజైన్‌లో కొత్తదనం కనిపిస్తుంది. క్లాసిక్ క్రూయిజర్ స్టైల్‌ను ఆధునిక ఎర్గోనామిక్స్‌తో సమన్వయం చేస్తూ, దూర ప్రయాణాలకు అనువైనవిగా రూపొందించబడ్డాయి. ప్రయాణం పై ఫోకస్ పెట్టే రైడర్ల కోసం ఈ మోడళ్లు బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు.
Advertisement

అందం, పవర్, టెక్నాలజీ.. బీఎండబ్ల్యూ 2 సిరీస్ గ్రాన్ కూపే ఫీచర్లు!

ఇంటి ముందు ఒక లగ్జరీ కారు ఉండాలని చాలా మంది కల కంటారు. ముఖ్యంగా బీఎండబ్ల్యూ సొంతం చేసుకోవడం అనేది చాలా మంది భారతీయ ఆటోమొబైల్ ప్రియుల ఆకాంక్ష. అయితే, అధిక ధరల కారణంగా ఈ కల చాలామందికి నెరవేరడం కష్టమే. కానీ ఇప్పుడు, బీఎండబ్ల్యూ తన కలలను నిజం చేసుకునే అవకాశాన్ని అందిస్తోంది.

మారుతి సుజుకి సంచలన నిర్ణయం! బాలెనో, ఎర్టిగా కార్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు

భారతదేశం మొత్తంలో అత్యధికంగా అమ్ముడయ్యే కార్ల బ్రాండ్ జాబితాలో మారుతి సుజుకి (Maruti Suzuki) ఎప్పుడు మొదటి స్థానంలో ఉంటుంది. దీనికి ప్రజల మనస్సు ఎలా గెలవాలో బాగా తెలుసు. గతంలో మారుతి కార్లకు భద్రత లేదు అంటూ చాలా విమర్శలు వచ్చినా, కంపెనీ వాటిని భరించింది. అయితే ఇప్పుడు , తన కొత్త మోడళ్లతో భద్రత పరంగా ఏ ఇతర బ్రాండ్ కంటే తక్కువేమీ లేదని నిరూపిస్తోంది. గతంలో డిజైర్ మోడల్, భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించింది. దీంతో కంపెనీ సేఫ్టీ పరంగా వెనక్కి తిరిగి చూసే అవసరం లేకుండా పోయింది. దీనిని కొనసాగిస్తూ, గ్రాండ్ విటారా కూడా పూర్తి సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇక బాలెనో కూడా 4-స్టార్‌లు సాధించి, సేఫ్టీ పరంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.

అదరగొట్టే మార్పులతో టీవీఎస్ కొత్త అపాచీ RTR 310 వచ్చేసింది!

కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల నుండి స్పోర్ట్స్ బైక్‌ల వరకు తయారు చేసి సత్తా చాటుతున్న సంస్థ టీవీఎస్. భారతదేశంలో టీవీఎస్ గేర్‌లెస్ స్కూటర్లు కూడా రికార్డు స్థాయిలో అమ్ముడవుతున్నాయి. బజాజ్ పల్సర్‌లు మార్కెట్‌ను ఏలుతున్న సమయంలోనే టీవీఎస్ అపాచీ అనే ఒక పవర్‎ఫుల్ స్పోర్ట్స్ బైక్‌ను పరిచయం చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పేరు యూత్‎లో బాగా ప్రాచుర్యం పొందింది.

జీప్ ట్రయల్ ఎడిషన్ వెర్షన్లు విడుదల! బాహుబలి లుక్‌లో కంపాస్ & మెరిడియన్

జీప్ ఇండియా (Jeep India) మరోసారి తన అసలైన ఆఫ్-రోడ్ పనితనాన్ని ప్రదర్శిస్తూ, తన ప్రముఖ SUV మోడళ్లైన జీప్ కంపాస్ (Jeep Compass), జీప్ మెరిడియన్ (Jeep Meridian) ట్రయల్ ఎడిషన్‌ (Trial Editions) లను అధికారికంగా విడుదల చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌లు, జీప్ ట్రస్ట్ అనే కొత్త ప్రోగ్రామ్ కింద అందుబాటులోకి తీసుకొచ్చినవి. ఈ ట్రయల్ ఎడిషన్‌లలో జీప్ క్లాసిక్ ఆఫ్-రోడింగ్ ఫోకస్‌కు తోడు, బోల్డ్ స్టైలింగ్ అప్‌డేట్లు, ప్రత్యేక ఎక్స్‌టీరియర్ టచ్‌లు, ఎక్స్క్లూజివ్ యాజమాన్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది కేవలం లుక్స్ పరంగా మాత్రమే కాకుండా, యూజర్ ఎక్స్‌పీరియన్స్ పరంగా కూడా ఓ కొత్త స్థాయిని అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఆఫ్-రోడ్ SUV విభాగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన జీప్ బ్రాండ్, ఈ ట్రయల్ ఎడిషన్‌లతో మరింతగా ఆ స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
Advertisement

బడ్జెట్ ధరలో SUV.. టాటా నెక్సన్ ఫుల్ డిమాండ్‌లో ఎందుకుంది?

టాటా నెక్సన్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తనదైన ముద్ర వేసుకున్న ఈ కారు నమ్మకానికి, అద్భుతమైన పనితీరుకు పేరుగాంచింది. ఈ జూన్ నెలలో 11,602 యూనిట్ల నెక్సన్ కార్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం జూన్ 2024లో 12,066 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి అమ్మకాలలో ఏడాదివారీగా కేవలం 4% స్వల్ప తగ్గుదల మాత్రమే నమోదైంది.

తగ్గిన డిమాండ్.. రెనాల్ట్ క్విడ్ జూన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి!

దిగ్గజ వాహన తయారీ కంపెనీ రెనాల్ట్ (Renault) చాలా కాలంగా భారత్‌లో సత్తా చాటడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది. దేశంలోని మధ్య తరగతి, సంపన్న వర్గాల వారిని లక్ష్యంగా చేసుకుని పలు మోడళ్లను విక్రయిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా తన ప్రసిద్ధ మోడల్ క్విడ్ (kwid)కు సంబంధించిన అమ్మకాల వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, జూన్ 2025 నెలలో కేవలం 449 యూనిట్లు మాత్రమే విక్రయించగలిగింది. ఇది గడిచిన ఏడాది ఇదే నెలలో నమోదైన 603 యూనిట్లతో పోలిస్తే దాదాపుగా 26 శాతం తగ్గుదల అని చెప్పవచ్చు. అంటే గత ఏడాదితో పోలిస్తే అమ్మకాల్లో 154 యూనిట్ల తగ్గుదల ఉంది. కేవలం నగర ప్రయాణాలకు సరిపడే కారుగా మాత్రమే కాకుండా, స్టైలిష్‌గా ఉండాలని కోరుకునే కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా ఉన్న ఈ కారును గత నెలలో తక్కువ మంది ఎంచుకున్నారు.

5-స్టార్ సేఫ్టీతో వచ్చిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ధరల పెంపు!

భారత మార్కెట్లో విశ్వసనీయతకు మారుపేరైన టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రా ఎమ్‌పీవీ ఇప్పుడు మరింత ఖరీదైంది. ఈ పెద్ద సైజు కారు స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, మంచి సంఖ్యలో అమ్ముడవుతోంది. తాజాగా, ఈ హైక్రాస్ ఎమ్‌పీవీ ధరలు పెరిగాయని ఒక ప్రైవేట్ మీడియా రిపోర్ట్ వెల్లడించింది. ఏ వేరియంట్‌కు ఎంత ధర పెరిగిందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

మార్కెట్లోకి ఇమొటోరాడ్ సరికొత్త అడ్వెంచర్ రేంజర్ ఈ-సైకిల్‌

భారతదేశంలో ఎలక్ట్రిక్ సైకిల్స్‌కు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రముఖ ఎలక్ట్రిక్ సైకిల్ కంపెనీ ఇమొటోరాడ్ ఒక సరికొత్త వాహనాన్ని విడుదల చేసింది. అదే అడ్వెంచర్ రేంజర్ ఈ-సైకిల్. ఇది ఇమొటోరాడ్ నుండి వస్తున్న మొదటి మోటో-స్టైల్ ఎలక్ట్రిక్ సైకిల్. దీని ధర కేవలం రూ.55,999 మాత్రమే.
Advertisement

జూన్‌లో ఇన్విక్టో అదరగొట్టింది! ఏడాది వ్యవధిలో 18.19% అమ్మకాల వృద్ధి!

మారుతి సుజుకి ఇన్విక్టో... పేరే సరిపోతుంది దాని ప్రీమియమ్‌ MPV స్థాయిని చెప్పేందుకు. టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించిన ఈ మోడల్, మరింత ఆకర్షణీయమైన స్టైలింగ్‌తో, మారుతి బ్రాండ్‌కు తగ్గటువంటి ప్రత్యేకమైన స్టైల్‌ను కలిగి ఉంది. ఇటీవలి జూన్ నెలలో ఈ కారుకు మార్కెట్‌లో మంచి స్పందన లభించింది. మీడియా నివేదికల ప్రకారం, ఒక్క నెల అంటే జూన్ 2025లో ఈ కారు 264 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. గత ఏడాది ఇదే కాలంలో 223 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి 18.19 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం. అంటే, మార్కెట్‌లో ఉన్న పోటీకి తగినట్టుగానే ఈ MPV తన స్థిరమైన కొనుగోలుదారుల్ని ఆకర్షిస్తూ ముందుకు సాగుతోంది.

ఫీచర్లు చూస్తే మెచ్చుకోవాల్సిందే.. రెనాల్ట్ క్విడ్ EV త్వరలో రాబోతోంది!

ప్రపంచ మార్కెట్‌లో తనదైన శైలిలో ఉండే రెనాల్ట్ (Renault), ఇప్పుడు భారత మార్కెట్‌లో కూడా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలతో అడుగులు వేస్తోంది. అత్యంత లో-కాస్ట్ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో తన స్థానాన్ని బలపరచేందుకు, రెనాల్ట్ క్విడ్ EVను భారతదేశానికి పరిచయం చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఐసీఈ ఇంజిన్ విభాగంలో కైగర్, క్విడ్, ట్రైబర్ కార్లను విక్రయిస్తున్న కంపెనీ ఇప్పుడు ఈవీపై ప్రధానంగా ఫోకస్ చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ క్విడ్ కారును తీసుకురాబోతుంది. ఇది ఏ సాధారణ ఎలక్ట్రిక్ కారు కాదు, ఇది డాసియా స్ప్రింగ్ EV ఆధారంగా రూపొందించబడిన మోడల్. డాసియా బ్రాండ్‌ను యూరప్‌లో చాలా మంది విశ్వసనీయ బ్రాండ్‌గా పరిగణిస్తారు. అదే పునాదులపై ఇప్పుడు క్విడ్ EV రూపంలో రెనాల్ట్ భారత్‌కి తీసుకువస్తోంది.

బాలెనో అమ్మకాలపై గట్టి ప్రభావం! మారుతికి ఊహించని నష్టం!

భారతదేశంలో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగాన్ని మాటలకే కాదు, అమ్మకాల పరంగా కూడా శాసించింది మారుతి సుజుకి బాలెనో (Maruti Suzuki Baleno). అందమైన డిజైన్, మన్నికైన ఇంజిన్, మంచి మైలేజ్, ఖర్చు తక్కువైన మెయింటెనెన్స్... ఇవన్నీ కలిపి, ఈ కారును చాలా మంది కుటుంబాలు తమ మొదటి ప్రీమియం కారుగా ఎంచుకున్నాయి. రీసేల్ విలువ కూడా పటిష్టంగా ఉండటంతో, బాలెనో ఒక సురక్షితమైన పెట్టుబడి లా మారింది. అయితే తాజాగా ఈ కారుకు ఆదరణ తగ్గినట్లు తెలుస్తుంది. *జూన్ 2025లో బాలెనో కేవలం 8,966 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయింది. ఇది గత సంవత్సరం ఇదే జూన్ నెలలో విక్రయించిన 14,895 యూనిట్లతో పోలిస్తే దాదాపు 40 శాతం తగ్గుదల. బాలెనో తరహా పెద్ద బ్రాండ్‌కు ఇది చాలా పెద్ద నష్టమే.

టెస్లా మోడల్ Y vs టాటా హ్యారియర్.ఈవీ.. ఏది బెస్ట్?

భారత మార్కెట్‌లోకి ఎట్టకేలకు టెస్లా అడుగుపెట్టింది. టెస్లా తన మోడల్ Y సెడాన్‌ను రూ.60 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే..ఈ ఖరీదైన టెస్లాలో లేని కొన్ని అడ్వాన్సుడ్ ఫీచర్లు కేవలం రూ. 21 లక్షల ధర ఉన్న టాటా హ్యారియర్.ఈవీలో ఉన్నాయట. ఈ రెండు కార్ల మధ్య ఉన్న కీలక తేడాలు, ఏయే ఫీచర్లు టాటా హ్యారియర్‌ను స్పెషల్‎గా నిలబెడుతున్నాయో చూద్దాం. టెస్లా మోడల్ Y ఒక ప్రీమియం సెడాన్ కాగా, టాటా హ్యారియర్.ఈవీ ఒక భారీ ఎస్‌యూవీ. ఈ రెండింటి మధ్య ధరలో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా టాటా హ్యారియర్ కొన్ని చోట్ల టెస్లాను మించిపోయింది.
Advertisement

కేవలం రెండేళ్లలోనే బజాజ్ ఈ బైక్‌కి గుడ్‌బై చెప్పింది!

బజాజ్ పల్సర్ పేరు చెబితే, బైకు ప్రేమికుల గుండెద‌డిగా మోగుతూనే ఉంది. 125సీసీ నుంచి 400సీసీ వరకు స్టాండర్డ్, P, N, NS, RS వంటి అనేక వేరియంట్‌లతో పల్సర్ పేరే ఒక సింబల్ అయింది. శక్తివంతమైన ఇంజిన్, స్పోర్టీ డిజైన్, అందుబాటు ధర.. ఇవన్నీ కలిపి పల్సర్‌ను యువత హార్ట్‌థ్రోబ్‌గా నిలిపాయి. అయితే కంపెనీ తాజాగా పల్సర్‌కు చెందిన ఒక వేరియంట్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. పల్సర్ N150 ని నిలిపివేసింది. యువతను ఆకట్టుకోవాలనే లక్ష్యంతో వచ్చిన ఈ మోడల్ అంతగా ఆదరణ పొందలేదు. ఇతర పల్సర్ మోడళ్లతో పోల్చితే, ఈ బైక్‌కి మార్కెట్‌లో సరైన స్పందన రాలేదు. అమ్మకాలు నిరాశపరిచాయి. దీంతో, ప్రారంభించిన రెండు సంవత్సరాలకే, బజాజ్ N150ను తాత్కాలికంగా నిలిపివేసింది.కంపెనీ యథాతథంగా కొనసాగించడం వల్ల మార్కెట్‌లో కలిగే నష్టాన్ని గమనించి, ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఎలక్ట్రిక్ కారు ఫాస్ట్ ఛార్జింగ్.. ఇంట్లో ఇతర వస్తువులకు ప్రమాదమా?

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం వేగంగా పెరుగుతోంది. చాలా మంది ఎలక్ట్రిక్ కార్లు కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే, ఇంట్లోని ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులకు నష్టం జరగవచ్చు. ఈ సమస్య ఎందుకు వస్తుంది, దీనికి పరిష్కారం ఏంటో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

కారును తుప్పు పట్టకుండా ఉంచే కోటింగ్స్: ఏది బెస్ట్?

వర్షాకాలం వచ్చిందంటే చాలు, కారు యజమానులకు ఓ పెద్ద సమస్య మొదలవుతుంది. అదే తుప్పు. ముఖ్యంగా, పాత కార్లు ఉన్నవారికి ఇది మరింత పెద్దగా మారుతుంది. కొత్త కార్లతో పోలిస్తే, పాత కార్లకు తుప్పు పట్టే ప్రమాదం చాలా ఎక్కువ. చిన్నపాటి గీతలు, పెయింట్ ఊడిపోయిన చోట్ల వర్షపు నీరు చేరితే, మెల్లగా తుప్పు పట్టి కారు రూపాన్నే మార్చేస్తుంది.

సురక్షితంగా, శక్తివంతంగా.. సుజుకి జిమ్నీ హైబ్రిడ్ వర్షన్ త్వరలో!

మారుతి సుజుకి (maruti suzuki) తన క్లాసిక్ లుక్‌కి గల, ఆఫ్‌రోడ్ మోడల్ అయిన జిమ్నీ (Jimny) కారును మరోసారి భారత మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. గతంలో మహీంద్రా థార్‌కి ప్రత్యామ్నాయంగా లాంచ్ చేసిన ఈ కారు, మొదట తగిన ఆదరణను పొందలేకపోయింది. దీంతో కంపెనీ ఈ సారి మరింత కొత్త అప్‌డేట్‌లతో ఈ కారును రీఎంట్రీ చేయడానికి సిద్ధం చేస్తోంది. ఈసారి ఇది కేవలం ఓ గ్లామరస్ SUVగా మాత్రమే కాకుండా మరింత స్టైలిష్, ఫీచర్-రిచ్ వేరియంట్‌తో తీసుకురానుంది. సరికొత్త హైబ్రిడ్ ఇంజిన్‌తో జిమ్నీ వస్తుందని తెలుస్తుంది. అయితే దీనిపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఆగష్టు నాటికి ఇది లాంచ్ కావచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో పాటు సేఫ్టీ పరంగా, అలాగే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇతర టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు కూడా దీనిలో ఉండనున్నాయి.
Advertisement

కేవలం 3 ఏళ్లలో 3 లక్షల యూనిట్లు.. మహీంద్రా XUV700 సక్సెస్ స్టోరీ!

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో మహీంద్రా XUV700 ఒక సంచలనం సృష్టించింది. లగ్జరీ ఫీచర్లు, పవర్ ఫుల్ ఇంజిన్, హై-టెక్ సేఫ్టీ ఫీచర్లతో ఈ ఎస్‌యూవీ కేవలం మూడు సంవత్సరాలలో 3 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి దీనికి ఉన్న డిమాండ్ ఎంతగా ఉందంటే, కొన్నిసార్లు దీని వెయిటింగ్ పీరియడ్ ఏకంగా ఒక సంవత్సరం దాటిపోయింది.

మీ కార్‌కు వర్షం వల్ల ప్రమాదం కాకుండా చూడాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!

వర్షం మొదలవుతుందంటే చాలామందికి ఒక ప్రశాంతత, ఒక శాంతమైన వాతావరణం. కానీ కారును కలిగి ఉన్న వారికి మాత్రం ఇది సవాలుగా మారుతుంది. ఎందుకంటే వర్షాకాలంలో కారు మెయింటనెన్స్ అంటేనే చాలా కష్టంగా ఉంటుంది. సరైన నిర్వహణ లేకపోయినట్లతే ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ముందుగానే పలు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కారును వర్షంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా సులువుగా నడివగలిగేలా చేయవచ్చు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ కారును వర్షపు నీటి నుంచి అన్ని విధాలుగా రక్షించుకోవడానికి పాటించాల్సిన కొన్ని సూచనలను ఈ కింది కథనంలో అందించడం జరిగింది. మరి ఆ వివరాలు ఎంటో ఒకసారి తెలుసుకుందాం.

సబ్సిడీ షాక్.. ప్రభుత్వ నిర్ణయంతో కష్టాల్లో పడ్డ కంపెనీలు

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో, కొన్ని కంపెనీలు ఊహించని సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ సబ్సిడీల దుర్వినియోగం కారణంగా కొన్ని ప్రముఖ బ్రాండ్లు ఆర్థికంగా తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల చిన్న కంపెనీలు మూతపడే పరిస్థితి ఏర్పడింది.

కియా 7సీటర్ ఈవీ వేరియంట్ల వారీగా స్పెషాలిటీలివే

ఇండియాలోకి టెస్లా ఎంట్రీ ఇస్తుండడంతో అందరి దృష్టి దాని మీదే ఉంది. అదే సమయంలో కియా కంపెనీ కూడా ఇండియాలో కొత్తగా కేరెన్స్ క్లావిస్ ఈవీ అనే ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది. రూ.17.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైన ఈ కొత్త కేరెన్స్ క్లావిస్ ఈవీ HTK+, HTX, HTX+ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ వేరియంట్లలో ఎలాంటి టెక్నికల్ ఫీచర్లు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Advertisement

ఒకే కంపెనీకి చెందిన రెండు MPVలు.. ఎర్టిగా టాప్, XL6 డౌన్.. ఎందుకో?

మారుతి సుజుకి MPV సెగ్మెంట్ ప్రస్తుతం మార్కెట్ ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇందులో ముఖ్యంగా ఒక కీలక మోడల్ అయిన మారుతి సుజుకి XL6, సేల్స్ పరంగా నిరాశాజనకంగా కనిపిస్తోంది. ఇది ఒకప్పుడు ప్రీమియం ఎంపీవీగా మంచి అంచనాలతో మార్కెట్లోకి ప్రవేశించినా, ప్రస్తుతం ఆదరన కొల్పోతున్నట్లు కనిపిస్తుంది. ఇది 6 సీట్ల కాంబినేషన్‌తో స్టైలిష్ డిజైన్,ఆకట్టుకునే అంశాలను కలిగి ఉన్నప్పటికి కొనుగోలుదారులను ఆకర్షించడంలో మాత్రం సవాళ్లు ఎదుర్కొంటోంది. జూన్ 2025లో మారుతి సుజుకి XL6 అమ్మకాలు గణనీయంగా పడిపోవడం ఈ MPVకు ఎదురవుతున్న వాస్తవ సమస్యలను స్పష్టంగా చూపిస్తోంది. గతంలో ఒక ప్రీమియం ఎంపీవీగా మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న XL6, ఇప్పుడు కొనుగోలుదారుల నుంచి మెరుగైన స్పందనను పొందడంలో విఫలమవుతోంది.