లీటర్ పెట్రోల్‌తో 90 కి.మీ వరకు మైలేజ్ ఇచ్చే బైక్! రూ.70 వేలకే వస్తుంది
ఆటోమొబైల్స్
- 1 year, 1 month, 29 days ago
భారతదేశంలో రోజూ స్కూటర్, బైక్ మీదే జీవితం సాగించే మిడిల్ క్లాస్ ప్రజలకు తక్కువ ధరలో లభిస్తూ, పెట్రోల్‌పై పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తూ మంచి మైలేజ్ అందించడంలో బజాజ్ ప్లాటినా (Bajaj Platina)కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇది మాములు టూవీలర్ కాదు, అది నిత్య జీవన భాగస్వామి. ఏప్రిల్ 2006లో ప్లాటినా బైక్ తొలిసారిగా రోడ్డుపైకి వచ్చింది. అప్పటినుండి ఇప్పటివరకు రెండు దశాబ్దాలకు చేరుకుంటున్నా, దీని డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. రోజూ ప్రయాణించాల్సిన ఉద్యోగులు, కాలేజీ స్టూడెంట్లు, చిన్న వ్యాపారస్తులు.. ఇలా అనేక రకాల వర్గాలకు ఇది అందుబాటులో ఉండే ఆప్షన్‌గానే నిలుస్తోంది. ఎక్కువ ఖర్చు పెట్టకుండా బైక్ కొనాలనుకునే వ్యక్తికి ఇది ఒక పెద్ద ఊరట.