చిన్న ఫ్యామిలీకి పర్ఫెక్ట్ అనిపించిన ఈ కారు ఎందుకు వెనుకబడుతోంది?
ఆటోమొబైల్స్
- 1 year, 1 month, 27 days ago
భారతీయ అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి (Maruti Suzuki) నుంచి వచ్చినటువంటి ఇగ్నిస్ (ignis) ఒక స్టైలిష్, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్. అర్బన్ యూత్‌ను టార్గెట్ చేస్తూ వచ్చిన ఈ కారు మొదట్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. కానీ... ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలలో గణనీయంగా పడిపోయింది. జూన్ 2024లో 2,536 యూనిట్లు అమ్ముడవుతే, 2025 జూన్‌లో కేవలం 1,484 యూనిట్లే అమ్ముడయ్యాయి. అంటే ఏకంగా 41.48 శాతం అమ్మకాలలో తగ్గుదల నమోదైంది. అయితే ఈ సేల్స్ తగ్గుదల గత నెలకు మాత్రమే పరిమితం కాలేదు. ఈ ఏడాది అంటే, 2025 మొదటి ఐదు నెలల్లో కూడా ఇగ్నిస్ అమ్మకాల్లో స్థిరత కనిపించలేదు. ఈ కాలంలో మొత్తం 11,865 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.