మారుతి ఆల్టోకి ఏమైంది? జూన్‌లో కేవలం 5045 యూనిట్లు మాత్రమే!

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీదారు మారుతి సుజుకి నుంచి విడుదలయ్యే కార్లకు ప్రజల నుంచి ఎప్పుడు మంచి ఆదరణ లభిస్తూనే ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయగలిగే విధంగా తక్కువ ధరలో ఈ కంపెనీ కార్లు అందుబాటులో ఉంటాయి. పైగా ఫీచర్స్ కూడా బొలేడు ఉంటాయి. అందకే మార్కెట్లో అమ్ముడుపోతున్న 10 కార్లలో కనీసం 6 వరకు మారుతి కార్లే ఉంటాయి. ఇదిలా ఉంటే జూన్ నెల ముగిసిన తరువాత వాహనాల తయారీదారులు వరుసగా తమ మోడళ్ల అమ్మకాల వివరాలను విడుదల చేస్తుంటారు. ఇదే క్రమంలో మారుతి తన ప్రసిద్ధ హ్యచ్‌బ్యాక్ మోడల్ ఆల్టో K10 (Alto K10) సేల్స్‌ను వెల్లడించింది.

ఒకేసారి 24 ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన ఎలక్ట్రిక్ కారు ఇదే

ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో క్రొయేషియాకు చెందిన రిమాక్ అనే చిన్న కంపెనీ ఇప్పుడు ఒక సంచలనం సృష్టించింది. వారి కొత్త హైపర్‌కార్ అయిన రిమాక్ నెవెరా R కేవలం మూడు రోజుల్లో ఏకంగా 24 కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది. ఇది కేవలం స్పీడుతోనే కాదు, అడ్వాన్సుడ్ టెక్నాలజీతో కూడా ఆటోమొబైల్ ప్రపంచానికి ఒక కొత్త దిశను చూపించింది. ఈ కారు ఏయే రికార్డులను సాధించింది, దాని స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ హైపర్‌ ఎలక్ట్రిక్ కారు జర్మనీలోని ఆటోమోటివ్ టెస్టింగ్ పెప్పెన్‌బర్గ్ ట్రాక్‌పై జూలై 5 నుంచి 8 మధ్య ఈ అద్భుతాలు చేసింది. ఈ కారు సాధించిన కొన్ని ముఖ్యమైన రికార్డులు ఇక్కడ ఉన్నాయి. ఈ కారు కేవలం 1.72 సెకన్లలో ఈ కారు 100 కి.మీ./గం వేగాన్ని అందుకుంది. ఇది ప్రపంచంలో ఏ ఎలక్ట్రిక్ కారు కూడా ఇంత వేగంగా చేరుకోలేదు.

టాటా, మహీంద్రా, ఎంజీల ప్లాన్.. కస్టమర్ల నమ్మకం గెలుచుకోవడానికే లైఫ్ టైం వారంటీ

ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనుకునే వారిలో అతి పెద్ద ఆందోళన బ్యాటరీ గురించే. ఈ మధ్యకాలంలో ఈవీ తయారీదారులు వారంటీ ఇవ్వడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఐసీఈ వాహనాలకు ఇచ్చే వారంటీ కంటే ఎక్కువ రక్షణ కల్పిస్తూ కంపెనీలు కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.

మళ్లీ తన మార్క్ చూపిన బొలెరో..! జూన్‌లో అమ్మకాల్లో ఊపెత్తింది

భారతదేశపు మారుమూల గ్రామాల నుంచి పట్టణ వీధుల వరకూ తన శక్తి సామర్థ్యాలతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వస్తున్న లెజెండరీ SUV అంటే అందరికి గుర్తుకు వచ్చేది.. మహీంద్రా బొలెరో (Mahindra Bolero). జూన్ 2025లో విడుదలైన అమ్మకాల గణాంకాలు చూస్తే, ఈ కారుకు ఇంకా ఎంత స్థిరమైన డిమాండ్ ఉందో స్పష్టంగా తెలుస్తోంది. జూన్ 2024లో మహీంద్రా బొలెరో కారు 7,365 యూనిట్లు అమ్ముడవగా, ఏడాది తర్వాత అదే నెలలో అమ్మకాల సంఖ్య 7,478కి చేరింది. అంటే, సుమారు 2 శాతం వృద్ధి నమోదైంది. ఇది చిన్న సంఖ్యలా కనిపించినా, మార్కెట్ పరిస్థితులు, పెరిగిన పోటీ, ఎలక్ట్రిక్ వాహనాల లాంచ్ వంటి పరిస్థితుల్లో ఇది బొలెరోకి ఉన్న స్థిరమైన డిమాండ్‌కు నిదర్శనం.
Advertisement

బజాజ్ ఎన్ఎస్ 400Z.. 400సీసీ సెగ్మెంట్‌లో సరికొత్త పోటీదారు

Bajaj NS 400Z గురించి తెలుసుకోండి: ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, పనితీరు మరియు ధర. 373.3cc ఇంజిన్, దూకుడు డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో కూడిన బైక్ గురించి పూర్తి సమాచారం.

కొత్త కార్ల కంటే పాత కార్ల అమ్మకాలే ఎక్కువ

భారతదేశంలో కొత్త కార్ల కంటే పాత కార్ల అమ్మకాలు ఎక్కువ జరుగుతున్నాయని ఇటీవల ఒక సర్వేలో వెల్లడైంది. తక్కువ ధర వంటి వివిధ కారణాల వల్ల ప్రజల్లో పాత కార్ల పట్ల ఆసక్తి బాగా పెరిగింది. ఇటీవల క్రిసిల్ సంస్థ పాత కార్ల అమ్మకాలపై ఒక నివేదికను విడుదల చేసింది.

ఒకే రోజులో ఒకటికి మించి చలాన్లు పడతాయా? .. ట్రాఫిక్ రూల్స్ ఇవే

మీరు ఉదయం ఆఫీస్‌కు వెళ్తున్నారు, హెల్మెట్ పెట్టుకోవడం మరచిపోయారు. దీని వల్ల ట్రాఫిక్ పోలీసులు మీ బైక్ ఆపి చలాన్ వేశారు. మళ్లీ సాయంత్రం వచ్చేటప్పుడు కూడా అదే దారిలో ఉన్న పోలీసులు మీ బండి ఆపారు. మరోసారి చలాన్ పడింది. దీంతో ప్రతి ఒక్కరి మనసులో ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఒకే రోజులో ఒకే తప్పుకు మళ్లీ మళ్లీ చలాన్లు పడతాయా? అలా పడితే ఎన్నిసార్లు పడతాయి? మీరు కూడా ఈ గందరగోళంలో ఉంటే ఈ వార్తను పూర్తిగా చదవండి.

ఊచకోత మొదలైంది.. Benz అమ్మకాల స్పీడ్ చూస్తే కంటి మీద కునుకు లేదు!

ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ ఇండియా (Mercedes Benz India) ఇటీవలి కాలంలో తన మార్కెట్‌ను క్రమంగా పెంచుకుంటుంది. తాజాగా వచ్చిన సేల్స్ డేటా ప్రకారం, మెరుగైన ఫలితాలను వెల్లడించింది. ఏప్రిల్ నుంచి జూన్ 2025 వరకు జరిగే మొదటి త్రైమాసికంలో కంపెనీ 4,238 యూనిట్లను సేల్ చేసి దాని అమ్మకాల పరంగా అత్యుత్తమ Q1 ఫలితాన్ని నమోదు చేసింది. ఇది కేవలం ఏడాది ముందటి కాలంతో పోల్చితే 10.08 శాతం పెరుగుదల మాత్రమే కాదు, బ్రాండ్ నమ్మకంగా కొనసాగుతున్నదన్నదానికి స్పష్టమైన సంకేతం కూడా. ఈ కాలంలో కంపెనీ 3,850 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. క్రమంగా వినియోగదారులకు లగ్జరీ కార్లకు అలవాటు పడటం కారణంగా ధర ఎక్కువ అయిన కూడా బెంజ్ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
Advertisement

ఈవీల భవిష్యత్తును మార్చనున్న హువావే

ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఫోర్-వీలర్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా భారత మార్కెట్‌లో గత కొన్ని నెలలుగా మంచి వృద్ధి కనిపిస్తోంది. అయితే, ఇప్పటికీ చాలా మంది ఎక్కువ బ్యాటరీ రేంజ్, ఛార్జింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల ఎలక్ట్రిక్ వాహనాలను కొనడానికి వెనుకాడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి, చైనా టెక్ కంపెనీ హువావే (Huawei) ఒక అద్భుతమైన ఆవిష్కరణ చేసింది.

కైనెటిక్ గ్రీన్ ట్రిపుల్ అటాక్.. వచ్చే 18 నెలల్లో 3 కొత్త స్కూటర్లు లాంచ్!

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ (Kinetic Green), భారత EV మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలపరిచే దిశగా శక్తివంతమైన అడుగులు వేస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-స్కూటర్ విభాగంలో తన గ్లోబల్ ప్రమాణాలకు తగిన శైలి, పనితీరు కలిగిన వాహనాలను అందించేందుకు కంపెనీ సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా, వచ్చే 18 నెలల కాలంలో మూడు కొత్త ఇ-స్కూటర్లను విడుదల చేయాలని కైనెటిక్ గ్రీన్ భావిస్తోంది. మొదటి మోడల్‌ను ఇప్పటికే ఫైనల్ చేస్తూ, దాన్ని 2025 ద్వితీయార్థంలో పండుగ సీజన్ సందర్భంగా మార్కెట్లోకి తీసుకురావాలని ప్రణాళిక రచిస్తోంది. ఈ విడుదల కేవలం కొత్త వాహనాన్ని పరిచయం చేయడమే కాక, సంస్థ దిశలో కొత్త శకాన్ని సూచించే పరిణామంగా మారనుంది.

టెస్లా కారు డెలివరీ డేట్ ఇదే... ఫస్ట్ వీఐపీలకేనట

టెస్లా కంపెనీ జూలై 15న భారతదేశంలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో టెస్లా వాహనాల బుకింగ్, డెలివరీకి సంబంధించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో టెస్లా వాహనాలను ఎలా బుక్ చేసుకోవచ్చు? డెలివరీలు ఎప్పుడు మొదలవుతాయి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

రూ. 8.94 లక్షలకే లాంచ్ అయిన కొత్త మహీంద్రా XUV 3XO REVX.. డిజైన్ చూసి ఫిదా అవుతారు!

భారతీయ SUV మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకుంటున్న మహీంద్రా (mahindra), తాజాగా XUV 3XO 'REVX' సిరీస్‌తో మరింత ఆకర్షణీయమైన అడుగు వేసింది. ఇది ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న XUV 3XO కొత్త అవతారం. ఈ సారి మరింత స్టైలిష్ డిజైన్, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు,డ్రైవింగ్ ఎంగేజ్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకుంది మహీంద్రా. స్పోర్టీగా కనిపించేట్టు, నడిపించడంలో జోష్ కలిగేట్టు, ఇంకా పోటీ ధరతో కొనుగోలుదారులకు లభించేలా REVX సిరీస్‌ను రూపొందించింది. ఈ సిరీస్‌ను ప్రీమియం డిజైన్, ఆధునిక ఫీచర్లతో పాటు శక్తివంతమైన పనితీరు కోరుకునే వినియోగదారుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. పోటీ ప్రస్తుతం ఆటోపరిశ్రమలో ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో దేశీయ దిగ్గజ కంపెనీ XUV 3XO 'REVX'తో ఇతర మోడళ్లకు బలమైన పోటీ ఇవ్వనుంది. ఈ కారు గురించిన వివరాలను ఈ కథణంలో తెలుసుకుందాం..
Advertisement

కేవలం 6 నెలల్లోనే 1400 యూనిట్లు.. ఎలక్ట్రిక్ బైక్‌లలో హీరోగా ఎదుగుతోన్న ఓబెన్

బెంగళూరుకు కేంద్రంగా ఉన్న ఓబెన్ ఎలక్ట్రిక్ (oben electric) అనే స్టార్టప్, భారతదేశపు పెట్రోల్ బైక్ మార్కెట్‌ను మెల్లగా మలుపుతిప్పే ప్రయత్నం చేస్తోంది. కొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు, మెరుగైన పనితీరుతో ఇది నగర ప్రాంతాల యువతను ఆకట్టుకుంటోంది. ప్రత్యేకంగా 150cc, 125cc ICE సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని అభివృద్ధి చేసిన రోర్, రోర్ EZ అనే రెండు అర్బన్ కమ్యూటర్ ఈ-బైక్‌లు మార్కెట్‌లో శరవేగంగా జోరు పెంచుకుంటున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, జూలై 10, 2023న తన మొదటి బ్యాచ్ బైకులను డెలివరీ చేసిన సరిగ్గా రెండు సంవత్సరాల తర్వాత 2,077 యూనిట్లు అమ్ముడవడం ఓబెన్ ఎలక్ట్రిక్‌కు మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ మొత్తంలో జనవరి 1 నుంచి జులై 9, 2025 మధ్య 1,443 యూనిట్లు ఉన్నాయి.

మెర్సిడెస్ జీఎల్ఎస్ ఏఎంజీ లైన్ భారత్‌లోకి ఎంట్రీ.. ధర చూస్తే షాకే

లగ్జరీ కార్లకు పేరుగాంచిన జర్మన్ కంపెనీ మెర్సిడెస్-బెంజ్ ఇండియా భారత మార్కెట్‌లో తన కొత్త మోడల్ జీఎల్ఎస్ ఏఎంజీ లైన్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.1.40 కోట్ల నుంచి రూ.1.43 కోట్ల వరకు ఉంటుంది. కంపెనీ దీనిని జీఎల్ఎస్ 450 ఏఎంజీ లైన్, జీఎల్ఎస్ 450డి ఏఎంజీ లైన్ అనే రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది.

లైసెన్స్ అడగకండి సార్.. ఇది ఒడిస్సే రేసర్ నియో!

ఒడిస్సే ఎలక్ట్రిక్ వెహికల్స్ భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ విభాగంలో ఒక నమ్మకమైన పేరుగా నిలిచింది. ముంబైలో ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉన్న ఈ కంపెనీ, గత కొన్ని సంవత్సరాలుగా వినూత్నమైన ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్‌లు, ఇతర వాహనాలను అభివృద్ధి చేస్తూ మార్కెట్‌ను ఆకర్షిస్తోంది. ఈ సంస్థ ఎలక్ట్రిక్ స్కూటర్లే కాదు, వేగవంతమైన, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఎలక్ట్రిక్ బైక్‌లను కూడా వినియోగదారులకు అందిస్తోంది. ట్రోట్ అనే ప్రత్యేకమైన మినీ ఎలక్ట్రిక్ బైక్‌ను కూడా కంపెనీ రూపొందించింది, ఇది ముఖ్యంగా చిన్న వస్తువులను రవాణా చేయడానికే ఉద్దేశించబడింది. ఇలా అనేక అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాహనాలను రూపొందించడం ఒడిస్సేకు ప్రత్యేకత. ఇలాంటి పరిణామాల మధ్య ఒడిస్సే తాజాగా రేసర్ నియో (Racer Neo) అనే తక్కువ-వేగం గల ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది.

డాష్‌బోర్డ్ కెమెరా స్కూటర్.. యువతను ఆకట్టుకోనున్న కొత్త స్కూటర్

కొత్త స్కూటర్ కొనాలని చూస్తున్నారా? అయితే, ఇటలీకి చెందిన వెలోసిఫెరో కంపెనీ నుంచి ఒక కొత్త, కాస్త ఖరీదైన స్కూటర్ త్వరలో మన దేశంలోకి రాబోతోంది. దాని పేరు మొబ్స్టర్. దీని ధర రూ.1.40లక్షలు ఉంటుందని అంచనా. ఈ స్కూటర్ చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా, కొన్ని అదిరిపోయే కొత్త ఫీచర్లతో వస్తుంది. అసలు ఈ స్కూటర్ ఎప్పుడు వస్తుంది. దీని ప్రత్యేకతలు ఏంటి అని చాలా మంది ఎదురుచూస్తున్నారు.
Advertisement

లక్షల డిస్కౌంట్ ఇచ్చినా కొనేదిక్కేలేదు.. జూన్‎లో 12మందే కొన్నారు

హ్యుందాయ్ మోటార్ ఇండియా పోర్ట్‌ఫోలియోలో క్రెటా ఎలక్ట్రిక్ రాకతో వారి ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరిగాయి. అయితే క్రెటా ఒక మిడ్-బడ్జెట్ ఎలక్ట్రిక్ కారు కాబట్టి దాని అమ్మకాలు బాగున్నాయి. మరోవైపు, వారి లగ్జరీ ఎలక్ట్రిక్ కారు అయోనిక్ 5కు మాత్రం కస్టమర్లు దొరకడం చాలా కష్టంగా మారింది. జూన్ నెలలో ఈ కారు కేవలం 12 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.

రూ.7 లక్షల్లో 6 ఎయిర్‌బ్యాగులు ఇచ్చే హ్యాచ్‌బ్యాక్ ఇదే! ఫ్యామిలీకి ఫుల్ సేఫ్టీ

కార్ల ఎంపికలోనూ మార్పులు వస్తున్నాయి. ఈ రోజుల్లో కేవలం లుక్‌ లేదా మైలేజ్‌తో సరిపోదు , భద్రతే ప్రధాన ప్రమాణం. దీనిని బాగా అర్థం చేసుకున్న టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM), తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ గ్లాంజాలో (Glanza) రెండు కీలక అప్‌గ్రేడ్లతో ముందుకు వచ్చింది. ఇప్పటి వరకూ, గ్లాంజా ఒక స్టైలిష్, స్మార్ట్, మైలేజ్-ఫ్రెండ్లీ కారుగా గుర్తింపు పొందినప్పటికీ, ఈ తాజా మార్పుతో అది సేఫ్టీ డ్రైవింగ్ అనుభవానికి ఒక ప్రతీకగా మారుతోంది. కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ గ్లాంజాలోని అన్ని వేరియంట్లలో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందించింది. దీంతో గ్లాంజాను భద్రత పరంగా ముందంజలో నిలిపింది. డ్రైవర్లు, ప్రయాణికులకు ఎదురయ్యే అత్యవసర పరిస్థితులలో గరిష్ఠ రక్షణ ఇవ్వడం కోసం టయోటా తీసుకున్న ఈ చర్య, కంపెనీ గ్లోబల్ సేఫ్టీ ఫిలాసఫీకి అద్దం పడుతుంది.

ఈ సారి KTM నిజంగా రేస్‌కు రెడీ.. 390 అడ్వెంచర్ X కొత్త అప్‌డేట్స్‌తో వచ్చేసింది!

అడ్వెంచర్ టూరింగ్ మోటార్‌సైకిళ్ల ప్రపంచంలో, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఇప్పటికీ ఓ ప్రత్యేకమైన స్థానం దక్కించుకుంటూ ఉంది. అయితే, దాని ఎదుట గట్టి పోటీదారిగా నిలిచిన బైక్ KTM 390 అడ్వెంచర్. ఈ బైక్, ఆస్ట్రియన్ బ్రాండ్‌కు ఎప్పటినుంచో గుర్తింపునిచ్చినప్పటికీ, ఇటీవల కొన్ని సంవత్సరాలలో కాస్త వెనకబడింది. ఈ నేపథ్యంలో KTM తన బైకును కొత్తగా పలు మార్పులతో మార్కెట్లోకి విడుదల చేసింది. KTM తాజాగా విడుదల చేసిన 2025 మోడల్ 390 అడ్వెంచర్ X (390 adventure x) బైక్‌తో, మళ్లీ ఒకసారి ఆటలోకి అడుగుపెట్టింది. ఇది కొత్త చిన్న చిన్న అప్‌డేట్‌లతో, బైక్‌కి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. దాని ధరను చూస్తే ఢిల్లీలో ఎక్స్-షోరూమ్ రూ. 3.03 లక్షలు. పాత వేరియంట్‌తో పోలిస్తే ఇది సుమారు రూ.12,000 ఎక్కువే అయినా, అందుతున్న ఫీచర్లు చూస్తే ధర పెరిగింది.

ప్రధాని మోడీ, ఎలాన్ మస్క్ ఒకే వేదికపై? టెస్లా ప్రారంభోత్సవంపై భారీ అంచనాలు

టెస్లా కంపెనీ ముంబైలో తన మొదటి షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ షోరూమ్ జూలై 15న ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఈ ప్రారంభోత్సవంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొంటారని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
Advertisement

ల్యాండ్ క్రూయిజర్‌కు షాక్.. జూన్ నెలలో ఒక్క కారు కూడా అమ్ముడుకాలేదు!

టయోటా (Toyota) భారతదేశంలో జూన్ 2025 నెలలో మొత్తం 26,453 వాహనాలను విక్రయించినట్లు ప్రకటించింది. ఇది గత సంవత్సరం ఇదే నెలలో నమోదైన 25,752 వాహనాలతో పోలిస్తే కొంత మేరకు వృద్ధినే సూచిస్తోంది. అయితే, ఈ గణాంకాల్లోని ఓ ఆసక్తికరమైన అంశం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.. అదే టయోటా ల్యాండ్ క్రూయిజర్ 300 (Land Cruiser 300). గత కొన్ని సంవత్సరాలుగా ఈ మోడల్‌ను విక్రయించడంలో కంపెనీకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మిగతా మోడళ్లు ఆశించిన మేరకు సేల్ అవుతున్నప్పటికి జూన్ నెలలో ఇది మాత్రం ఒక్కటి కూడా అమ్ముడుపోలేదు. అధిక ధర, పరిమిత సంఖ్యలో లభించడం, వంటి కారణాల వల్ల ఈ కారుకు మార్కెట్లో వాస్తవంగా డిమాండ్ తక్కువగానే ఉంది.

ఎంజీ కొత్త ఎలక్ట్రిక్ కార్ల బుకింగ్స్ డిసెంబర్ నుంచి షురూ

లగ్జరీ బ్రాండ్‌ల జాబితాలో మోరిస్ గ్యారేజ్ (MG)కు మంచి స్థానం ఉంది. తమ వాహనాల్లో ఉండే ఫీచర్లు, ప్రయాణ సౌలభ్యంతో వినియోగదారుల మనసు గెలుచుకుంది. ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన సైబర్‌స్టర్ అనే 2-సీటర్ స్పోర్ట్స్ కారుకు, కొద్ది నెలల క్రితం విడుదల చేసిన ఎలక్ట్రిక్ ఎంపీవీ ఎంజీ M9 మోడల్‌కు ప్రజల్లో ప్రత్యేక ఆసక్తి ఉందని బ్రాండ్ విడుదల చేసిన నివేదికలో స్పష్టమవుతోంది.

జూన్‌లో టయోటా రూమియన్‌కు షాక్.. కేవలం 1415 యూనిట్లు మాత్రమే

భారతదేశంలో పెద్ద కుటుంబాల కోసం అనువైనవిగా నిలిచే కార్లు అంటే అందరికి 7 సీట్ల MPV మోడళ్లు గుర్తుకు వస్తాయి. ఇవి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చుతాయి. ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుల్లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) ఒకటి. దశాబ్ద కాలంగా విస్తృతంగా అమ్ముడవుతూ, వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ఇదే డిమాండ్‌ను కొనసాగిస్తూ, టయోటా (Toyota) సంస్థ కూడా MPV విభాగంలో అడుగుపెట్టింది. టయోటా రూమియన్ (Rumion) రూపంలో ఎర్టిగా‌కే కొత్త రూపమిచ్చింది. మారుతి సుజుకి, టయోటా మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం వల్ల, ఎర్టిగా వంటి విజయవంతమైన మోడల్స్‌ను టయోటా తమ బ్రాండ్ పేరుతో రీబ్యాడ్జ్ చేసి మార్కెట్లో ప్రవేశపెడుతోంది. అందులో భాగంగానే, ఎర్టిగా ఆధారంగా రూపొందించిన టయోటా రూమియన్ కూడా భారత వినియోగదారులను ఆకర్షిస్తోంది.

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో తీవ్ర పోటీ.. టాటా ఎంజీల మధ్య యుద్ధం

ఇతర ప్రపంచ దేశాల మాదిరిగానే భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసే వారి సంఖ్య నిరంతరం పెరుగుతోంది. అయితే, ఎలక్ట్రిక్ టూ-వీలర్ల లెవల్‎కు చేరకపోయినా, ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు మాత్రం కొంచెం నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ గత జూన్ 2025 నెలలో భారతదేశంలో అమ్ముడుపోయిన ఎలక్ట్రిక్ కార్ల వివరాలు అందుబాటులోకి వచ్చాయి.
Advertisement

టారస్, లియో కోడ్‌నేమ్స్‌తో కొత్త హారియర్, సఫారీ

టాటా మోటార్స్ తమ పాపులర్ ఎస్‌యూవీలైన హారియర్, సఫారీలకు సంబంధించిన కొత్త జనరేషన్ మోడళ్లపై పని చేయడం మొదలుపెట్టింది. అయితే, వీటిని మార్కెట్‌లోకి తీసుకురావడానికి కనీసం రెండు సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కొత్త జనరేషన్ ఎస్‌యూవీలు పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ పై రూపొందుతాయి. ఇది ఇంటర్నల్ కంబూషన్ ఇంజిన్, ఎలక్ట్రిక్ వెహికల్ పవర్‌ట్రెయిన్‌లతో పాటు ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది.