టారస్, లియో కోడ్‌నేమ్స్‌తో కొత్త హారియర్, సఫారీ

టాటా మోటార్స్ తమ పాపులర్ ఎస్‌యూవీలైన హారియర్, సఫారీలకు సంబంధించిన కొత్త జనరేషన్ మోడళ్లపై పని చేయడం మొదలుపెట్టింది. అయితే, వీటిని మార్కెట్‌లోకి తీసుకురావడానికి కనీసం రెండు సంవత్సరాల సమయం పడుతుంది. ఈ కొత్త జనరేషన్ ఎస్‌యూవీలు పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్ పై రూపొందుతాయి. ఇది ఇంటర్నల్ కంబూషన్ ఇంజిన్, ఎలక్ట్రిక్ వెహికల్ పవర్‌ట్రెయిన్‌లతో పాటు ఆల్-వీల్ డ్రైవ్ టెక్నాలజీని కూడా సపోర్ట్ చేస్తుంది.

పెద్ద కారు.. అదిరిపోయే ఫీచర్స్! దీనిని కొనుగోలు చేయవచ్చా?

MG M9 ప్రెసిడెన్షియల్ లిమోసిన్ భారతదేశంలో విడుదలైంది. దీని ఫీచర్లు, ధర, మరియు పనితీరు గురించి తెలుసుకోండి. లగ్జరీ, విశాలత మరియు అధునాతన సాంకేతికతతో కూడిన ఎలక్ట్రిక్ MPV.

పెరుగుతున్న పోటీ, తగ్గుతున్న అమ్మకాలు.. గ్రాండ్ విటారా పరిస్థితి ఇలా మారిపోయింది

మారుతి సుజుకి గ్రాండ్ విటారా (Maruti Suzuki Grand Vitara) ఒకప్పుడు మార్కెట్లో దుమ్మురేపిన SUV. దాని ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన పనితీరు, అధునాతన ఫీచర్ల వలన ఇది భారతీయ వినియోగదారులను ఆకట్టుకుంది. అయితే, ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం, ఈ కారుకు ఎదురవుతున్న ఆదరణలో పడిపోవడం కనిపిస్తోంది. 2025 జూన్‌లో గ్రాండ్ విటారా SUV అమ్మకాలు 6,828 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఇది గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే దాదాపు 29 శాతం తగ్గుదలగా చెప్పవచ్చు. 2024 జూన్‌లో 9,679 యూనిట్లు అమ్ముడవడం గమనార్హం. ఈ గణాంకాలు చూస్తే, ఏడాది ప్రాతిపదికన పరంగా ఈ మోడల్ ప్రస్తుతానికి కొంత వెనుకబడి పోతున్నట్టు స్పష్టమవుతుంది.

బసాల్ట్‌పై రూ.2.80 లక్షల తగ్గింపు.. సిట్రోయెన్ కొత్త వ్యూహంతో సేల్స్ పెరుగుతాయా ?

భారత మార్కెట్‌లోకి వచ్చినప్పుడు తాను పట్టినదల్లా బంగారం అవుతుందని ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ సిట్రోయెన్ భావించింది. కానీ వారి ప్లానులన్నీ ఫెయిల్ అయినట్లు కనిపిస్తోంది. భారతీయులను తక్కువ అంచనా వేయడమే సిట్రోయెన్ ప్రస్తుత స్థితికి కారణమని కొందరు చెబుతున్నారు. అయితే, తొలినాళ్లలో ఉన్న బ్రాండ్‌కు, ఇప్పటి బ్రాండ్‌కు చాలా తేడా ఉంది.
Advertisement

మహీంద్రా XUV 3XO.. రూ.8 లక్షల లోపే అద్భుతమైన కాంపాక్ట్ ఎస్‌యూవీ!

మహీంద్రా కంపెనీకి చెందిన XUV 3XO కారు గత జూన్ నెలలో అద్భుతమైన అమ్మకాలను సాధించింది. గత సంవత్సరం జూన్ నెల అమ్మకాలతో పోలిస్తే కొద్దిగా తగ్గినప్పటికీ, ప్రస్తుత జూన్ నెల అమ్మకాలు మాత్రం చాలా బాగున్నాయని చెప్పొచ్చు. ఈ కారుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

జులై మొదటి బంపర్ షాక్.. టయోటా టైసర్ SUV ధర పెంపు

టయోటా (Toyota), మారుతి సుజుకి (Maruti Suzuki) మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం వల్ల, ఈ రెండు బ్రాండ్లు ఒకదానికొకటి కార్లను రీబ్రాండింగ్ చేసి విక్రయిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం, మారుతి విక్రయించే ఫ్రాంక్స్ SUV ఆధారంగా టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ (Urban Cruiser Taisor) పేరుతో అదే వాహనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది. లేటెస్ట్ డిజైన్, ఫీచర్లు, మైలేజ్ పరంగా సగటు వినియోగదారులకు సరిపోయేలా ఈ కారు రూపొందించబడింది. అయితే తాజా సమాచారం ప్రకారం, టయోటా టైజర్ SUV ధరలను రూ.2,500 వరకు పెంచింది. ఇది అన్ని వేరియంట్లకు వర్తించనుంది. పెట్రోల్, CNG రెండు ఫ్యూయల్ ఆప్షన్లలో లభిస్తున్న టైజర్ SUV ఇప్పుడు రూ. 7.77 లక్షల నుండి రూ.12.91 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు విక్రయించబడుతోంది. ఈ ధరల పెరుగుదలతో వినియోగదారులపై స్వల్ప ప్రభావం ఉండొచ్చు.

ర‌ణ్‌వీర్ సింగ్ నయా అస్త్రం.. బాలీవుడ్‌లో తొలి 'హమ్మర్ ఈవీ' ఓనర్!

బాలీవుడ్‌లో హీరోలు తమ కంటే తక్కువ వయసున్న హీరోయిన్లతో నటించడం కామన్. అయితే ఇప్పుడు బాలీవుడ్‌లో ర‌ణ్‌వీర్ సింగ్ గురించే చర్చ జరుగుతోంది. ఎందుకంటే, త‌నకంటే 20 ఏళ్లు చిన్నదైన సారా అర్జున్ అనే నటితో ర‌ణ్‌వీర్ సింగ్ ఒక కొత్త సినిమాలో నటిస్తున్నాడు.

పండుగ సీజన్‌కు ముందే అదిరిపోయే హైబ్రిడ్ SUV

హోండా (Honda) కార్స్ ఇండియా మార్కెట్లో తన శక్తిని తిరిగి చూపించడానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మూడు మోడళ్లలో అమేజ్, సిటీ, ఎలివేట్‌‌లు క్రమంగా ప్రజల ఆదరణను పొందడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం హోండా ఎలివేట్ SUV మీద ఎక్కువ ఆశలు పెట్టుకుంది. 2023 రెండవార్థంలో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఎలివేట్, ప్రారంభంలో మంచి ఆదరణను పొందినా, తరువాత నెలలుగా అమ్మకాల పరంగా కాస్త మందగమనంలోకి చేరినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఎలివేట్ SUV, భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడింది. దీని 1.5 లీటర్ 4-సిలిండర్ i-VTEC పెట్రోల్ ఇంజిన్‌తో రన్ అవుతుంది. ఇది 121 bhp పవర్, 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ, స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
Advertisement

టాటా కార్ల అమ్మకాల పతనం.. టియాగో ఒక్కటే అదరగొట్టింది?

భారత మార్కెట్‌లో 2025 జూన్ నెల టాటా మోటార్స్‎కు అంతగా కలిసి రాలేదు. టాటా మోటార్స్ కంపెనీలోని చాలా కార్ల అమ్మకాలు పడిపోయాయి. తాజాగా విడుదలైన సేల్స్ రిపోర్ట్ ద్వారా ఈ విషయం స్పష్టంగా తెలిసింది.

ఒక్క నెలలో 9వేలకుపైగా సేల్స్! ఫ్రాంక్స్ ఫ్యామిలీలను ఎలా ఆకట్టుకుంటోందో చూద్దాం!

భారతదేశంలో కార్ల తయారీలో అతిపెద్ద కంపెనీ మారుతి సుజుకి (maruti suzuki). ఇది పేద, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేసే విధంగా అందుబాటు ధరలోనే వాహనాలను విడుదల చేస్తుంది. ధర తక్కువగా ఉన్నప్పటికి ఫీచర్స్ మాత్రం బోలెడు ఉన్నాయి. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, మారుతి సుజుకి ఫ్రాంక్స్ (Fronx) దేశీయ మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంటూ, కాంపాక్ట్ SUV విభాగంలో వేగంగా ఎదుగుతోంది. బాలెనో ప్లాట్‌ఫాంపైన ఆధారపడి రూపొందించిన ఈ మోడల్, స్టైలిష్ డిజైన్‌తో పాటు, వినియోగదారులను ఆకట్టుకునే ప్రీమియం అంశాలతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. విడుదలైన నాటి నుండి వినియోగదారుల్లో విశ్వాసాన్ని సంపాదించుకుంటూ, అమ్మకాల పరంగా కూడా స్థిరమైన ప్రదర్శనను కనబరుస్తోంది.

టాటా సఫారీ ఫీచర్లు అన్నీ ఉన్నా, కస్టమర్లు ఎందుకు వెనకాడుతున్నారు?

భారతీయ కార్ల మార్కెట్‌లో టాటా సఫారీ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసింది. ఇది మంచి పర్ఫామెన్స్, ఎట్రాక్టివ్ ఫీచర్లకు పేరు పొందింది. అయితే, దీని అమ్మకాల సంఖ్య రోజురోజుకు పడిపోతోంది. ఈ జూన్ నెలలో కూడా ఇదే కొనసాగింది. కేవలం 922 యూనిట్లను మాత్రమే విక్రయించారు.

థార్ vs జిమ్నీ అమ్మకాల యుద్ధం.. జూన్‌లో ఎవరి గెలుపు?

భారతదేశంలో SUV లకు ఉన్న విపరీతమైన డిమాండ్ మధ్య, మహీంద్రా థార్, మారుతి జిమ్నీ మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొంది. మహీంద్రా థార్ ఇప్పటికే మార్కెట్లో తనదైన స్థానాన్ని ఏర్పరచుకున్నప్పుడు, మారుతి సుజుకి దీనికి ప్రత్యామ్నాయంగా జిమ్నీ 5-డోర్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. తక్కువ సైజులో ఉండి, మెరుగైన ఆఫ్-రోడ్ సామర్థ్యాలతో వస్తుందన్న హైప్‌తో, జిమ్నీ విడుదలకు ముందు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అప్పట్లోనే మార్కెట్ థార్ అమ్మకాలపై జిమ్నీ ప్రభావం చూపుతుందని అంచనా వేశారు. అయితే, వాస్తవ పరిస్థితి కొంత భిన్నంగా పరిణమించింది. జిమ్నీ మార్కెట్లోకి వచ్చిన తర్వాత, ఆశించిన స్థాయిలో అమ్మకాలను సాధించలేకపోయింది. అయితే మరోవైపు, థార్ అమ్మకాలు అదే వేగాన్ని కొనసాగిస్తూ కొన్ని నెలల్లో మరింత పెరిగాయి కూడా.
Advertisement

ఇంత తక్కువ ధరకి ఎలక్ట్రిక్ స్కూటరా? హీరో Vida VX2 రేటు వింటే షాక్!

హీరో మోటోకార్ప్, భారతదేశంలో ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ, తన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడానికి 'విడా' అనే ప్రత్యేక బ్రాండ్‌ను స్థాపించింది. ఈ బ్రాండ్ ద్వారా కొత్త టెక్నాలజీతో కూడిన, శక్తివంతమైన, అందుబాటులో ధరలో ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకువస్తోంది. మొదటగా విడుదలైన V1 స్కూటర్‌కు మంచి స్పందన వచ్చిన తర్వాత, ఇటీవల విడా VX2 పేరుతో రెండో మోడల్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. విడా VX2 స్కూటర్ తన ప్రారంభ ధర రూ. 59,490 (ఎక్స్-షోరూమ్)తోనే వినియోగదారులలో మంచి ఆసక్తిని రేపింది. అయితే ఇప్పుడు, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై హీరో మోటోకార్ప్ మరింత ఆకర్షణీయమైన ధరను ప్రకటించింది. పరిమిత కాలానికి ప్రత్యేక పరిచయ ఆఫర్‌గా, విడా VX2 ను కేవలం రూ. 44,990 (ఎక్స్-షోరూమ్)కి విక్రయించనున్నారు.

మ్యాన్యువల్ vs ఆటో క్లైమేట్ కంట్రోల్.. ఏది బెస్ట్ ?

వేసవిలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కారులో చల్లగా ఉండాలని అందరూ అనుకుంటారు. అప్పుడు ఏసీ చాలా సహాయపడుతుంది. కార్లలో సాధారణంగా రెండు రకాల ఏసీ సిస్టమ్స్ ఉంటాయి. అవి మ్యాన్యువల్ ఏసీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్. ఈ రెండింటిలో ఏది మంచిది, మీ అవసరాలకు ఏది సరిపోతుందో చాలామందికి తెలియదు. ఈ వార్తలో ఈ రెండు సిస్టమ్స్ మధ్య తేడాలు, వాటి లాభాలు, నష్టాల గురించి తెలుసుకుందాం.

SUV రేసులో టయోటా స్పీడు పెంచింది.. హైరైడర్ సేల్స్ జూన్‌లో హిట్

టయోటా(Toyota) కంపెనీకి చెందిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (urban cruiser hyryder) పేరు వింటేనే నమ్మకాన్ని కలిగించే ఈ కాంపాక్ట్ SUV, మార్కెట్లో తనదైన గుర్తింపుతో సుస్థిర స్థానం ఏర్పరచుకుంది. ఆకర్షణీయమైన డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, ఫ్యూయల్ ఎఫిషియంట్ హైబ్రిడ్ టెక్నాలజీ ఇవన్నీ కలిపి ఈ కారును మెయిన్‌స్ట్రీమ్ SUV సెగ్మెంట్‌లో ప్రజాదరణ పొందిన కారుగా నిలిపాయి. ఇందుకు నిదర్శనమే ఈ జూన్ నెలలో నమోదైన అద్భుతమైన సేల్స్. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, జూన్ 2025లో ఏకంగా 7,462 యూనిట్లు అమ్ముడుపోయి ఆటో పరిశ్రమలో తన దూకడును చూపించింది. ఇది కేవలం మార్కెట్ డిమాండ్‌కు నిదర్శనం మాత్రమే కాదు, గతేడాది జూన్‌లో అమ్ముడైన 4,275 యూనిట్లతో పోలిస్తే 75 శాతం వృద్ధిని నమోదు చేయడం.

టెస్లా అమ్మకాల పతనం.. ట్రంప్ vs మస్క్ గొడవే కారణమా?

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన దిగ్గజమైన టెస్లా యజమాని ఎలోన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వివాదం సోషల్ మీడియా, వార్తా మాధ్యమాల్లో ఇటీవల కాలంలో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా కొత్త పార్టీని స్థాపిస్తానని మస్క్ చెప్పగా, ట్రంప్ కూడా "మర్యాదగా ఉండకపోతే బయట పడేస్తాను" అని అన్నారు.
Advertisement

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ నుంచి వచ్చిన SUVకి భారీ డిమాండ్.. అందరినీ షాక్ చేసిన బుకింగ్స్!

చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసిన షియోమి (Xiaomi), ఇప్పుడు ఆటోమొబైల్ రంగానికీ అదే ఉత్సాహంతో అడుగుపెడుతోంది. ఫోన్ లాంటి ధరకు టాప్-క్లాస్ ఫీచర్లు ఇచ్చి వినియోగదారుల మనసు గెలుచుకున్న ఈ బ్రాండ్, ఇప్పుడు కార్ల రంగంలో కూడా అదే ఫార్ములాను పాటిస్తూ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ బ్రాండ్ మొబైల్ ఫోన్లకు పరిమితం కాకుండా, అవసరమైతే కార్లు కూడా తయారు చేయగలదని ఇప్పటికే నిరూపించింది. ఈ దిశగా Xiaomi అడుగులు వేస్తున్నప్పటి నుంచే ప్రపంచవ్యాప్తంగా టెక్, ఆటోప్రియుల దృష్టి ఈ బ్రాండ్‌పై నిలిచింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EVs) రంగంలో Xiaomi ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ, ఇప్పటికే తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది.

ఢిల్లీలో పాత వాహనాలపై కఠిన చర్యలు.. ఇతర నగరాల్లో పరిస్థితి ఎలా ఉంది?

భారతదేశంలోని పెద్ద నగరాల్లో రోడ్లపై వాహనాల వయస్సుపై వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. కొన్ని చోట్ల కాలుష్యాన్ని నియంత్రించడానికి కఠిన నిబంధనలు ఉంటే, మరికొన్ని చోట్ల జాతీయ వాహనాల స్క్రాప్ పాలసీ ప్రకారం పనులు జరుగుతున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి టాప్ 10 నగరాల్లో పాత వాహనాలను ఇంకా ఎంతకాలం నడపవచ్చు.. అందుకు నిబంధనలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ఇవి కారు కాదు… జనాల గుండెల్లో చోటు దక్కించుకున్న బ్రాండ్‌లు!

భారతదేశంలో జూన్ నెల కార్ల అమ్మకాల గణాంకాలు ఆసక్తికరంగా మారాయి. టాప్ 10 కార్ల జాబితా చూస్తే, మళ్లీ మారుతి సుజుకి దాదాపు ఎక్కువ కార్లను విక్రయించింది. టాటా, మహీంద్రా లాంటి దేశీయ బ్రాండ్‌లు కూడా తమ ఉనికిని చాటుకున్నాయి. అయినప్పటికి మొత్తం జాబితాలో మారుతి కార్లు స్పష్టమైన ఆధిపత్యాన్ని కొనసాగించాయి. బ్రాండ్ పట్ల ఉన్న నమ్మకం, అందుబాటు ధరలో లభించడం వంటి అంశాల కారణంగా మారుతీ తన సత్తా చాటింది. మొత్తం టాప్ 10 కార్లను చూసినట్లయితే ఈ జాబితాలో 10వ స్థానాన్ని దక్కించుకున్నది మారుతికి చెందిన స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ ఫ్రాంక్స్. జూన్ 2025లో ఫ్రాంక్స్ కారు మొత్తం 9815 యూనిట్లు అమ్ముడవ్వగా, గత ఏడాది ఇదే నెలలో 9688 యూనిట్లు అమ్ముడుపోయింది. అంటే సంవత్సరానికొకసారి లైట్‌గా అయినా 1 శాతం వృద్ధి నమోదైంది.

దీపావళికి టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్.. కేవలం రూ.6.5 లక్షలకే అదిరిపోయే ఫీచర్లు!

ఒకప్పుడు ఇండియన్ మార్కెట్‌లో అమ్మకాల్లో దుమ్మురేపిన కార్లలో టాటా పంచ్ ఒకటి. కానీ, ఇటీవల టాటా పంచ్ అమ్మకాలు బాగా మందగించాయి. 2025 జూన్ నెలలో కూడా టాటా పంచ్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. అయితే, దీనికి టాటా మోటార్స్ ఒక అదిరిపోయే ప్లాన్‌తో వస్తోంది. రూ.6.5 లక్షలకే రాబోయే కొత్త మోడల్ గురించి వివరాలు తెలుసుకుందాం.
Advertisement

ఇక్కడ మెప్పించిందే సరిపోలేదు.. ఆ దేశంలో ముద్ర వేయనున్న జూపిటర్!

టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ నుంచి విడుదల అయి భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో జూపిటర్ 110 (jupiter) స్కూటర్‌ ఒకటి. హోండా యాక్టివా తరువాత దేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోతున్న వాటిలో ఇది ప్రధానమైనది. ఇంతటి ఆదరణ కలిగిన స్కూటర్‌ను టీవీఎస్ ఇప్పుడు నేపాల్ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. స్కూటర్ విభాగంలో ప్రతిష్టాత్మకంగా నిలిచిన జూపిటర్, ఇప్పుడు నేపాలీ వినియోగదారులను ఆకట్టుకునే లక్ష్యంతో ప్రత్యేకంగా రూపొందించబడింది. భారత్‌లో అయితే ఏ విధంగా ప్రసిద్ధ స్కూటర్‌గా అవతరించి ప్రజలందరి అభిమానాన్ని పొందినదో, అదే, విధంగా నేపాల్ ప్రజల మనసును కూడా గెలుపొందుతుందని కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. ఈ కొత్త జూపిటర్ 110 స్కూటర్‌ను డాన్ బ్లూ మ్యాట్ అనే ఆకర్షణీయమైన రంగులో మాత్రమే అందిస్తున్నారు.

భారత టూ-వీలర్ మార్కెట్‌లో ఎవరు కింగ్? టాప్ 6 కంపెనీల జూన్ 2025 అమ్మకాలు!

ప్రపంచంలోనే అత్యధిక టూ-వీలర్ల అమ్మకాలు జరిగే దేశాల్లో మన భారత్ కూడా ఒకటి. ప్రతి నెల లక్షల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఇక్కడ అమ్ముడవుతాయి. మన మార్కెట్‌లో టూ-వీలర్లు విక్రయించే కంపెనీలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు డిమాండ్ పెరిగిన తర్వాత కొత్త స్టార్టప్‌లు చాలా వచ్చాయి. అయితే, మనం ఇప్పుడు భారతదేశంలో టూ-వీలర్ అమ్మకాల్లో ముందున్న టాప్ 6 కంపెనీల గురించి చూద్దాం.

భారత్‌లో దూసుకుపోతున్న ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్.. జూన్ 2025 అమ్మకాల నివేదిక విడుదల!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ విభాగంలో అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ కఠినమైన పోటీలో మహీంద్రా, ఎంజీ వంటి కంపెనీల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ, టాటా మోటార్స్ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్స్ తయారీ సంస్థగా తన స్థానాన్ని నిలబెట్టుకుంది.

ఒక్క లుక్‌కి ఫిదా అయిపోతారు.. ఇది మహీంద్రా 3XO REVX సిరీస్ మాయ!

భారతీయ SUV విభాగంలో మరోసారి మహీంద్రా తన ముద్ర వేసింది. ఓ ఏడాది క్రితం మార్కెట్‌లోకి వచ్చిన XUV 3XO మోడల్ కేవలం 12 నెలల్లోనే లక్ష యూనిట్లు అమ్ముడవడం అనేది దాని సక్సెస్‌కు నిదర్శనం. ప్రీమియం లుక్, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు ఇవన్నీ కలిపి XUV 3XO‌ను కేవలం SUVగా కాకుండా, ఒక ప్రత్యేకమైన ఎంపికగా నిలబెట్టాయి. తాజాగా, ఈ మోడల్ లైనప్‌లోకి 'REVX' అనే సరికొత్త వెర్షన్‌ వచ్చింది. దీని ప్రారంభ ధరను రూ. 8.94 లక్షలుగా నిర్ణయించారు. ఇది మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక ఫీచర్స్, ఆకట్టుకునే ఫీచర్స్‌తో విడుదల అయింది. కొత్తగా కారును కొనుగోలు చేయాలని ఆలోచన చేస్తున్నవారు దీన్ని హాయిగా ఎంచుకోవచ్చు. ఎక్స్‌టీరియర్, ఇంటీరియర్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది.
Advertisement

చిన్న కారు ధర పెరిగింది.. కానీ స్కూటర్ కంటే లాభం.. సేఫ్టీ, పర్ఫార్మెన్స్, వారంటీలో దీనికి తిరుగేలేదు

భారతీయుల కార్ల ఆలోచనను మార్చిన మోడల్ ఎంజీ కామెట్.. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవం సృష్టించిన ఈ చిన్న కారు ఇప్పుడు మహిళలకు కూడా ఇష్టమైన కార్లలో ఒకటిగా మారింది. సైజు ముఖ్యం కాదు ప్రాక్టికాలిటీనే కార్లకు ముఖ్యమని నిరూపిస్తూ కామెట్ ఒక డిఫరెంట్ మార్గాన్ని ఎంచుకుంది.