చిన్న కారు ధర పెరిగింది.. కానీ స్కూటర్ కంటే లాభం.. సేఫ్టీ, పర్ఫార్మెన్స్, వారంటీలో దీనికి తిరుగేలేదు

భారతీయుల కార్ల ఆలోచనను మార్చిన మోడల్ ఎంజీ కామెట్.. ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో విప్లవం సృష్టించిన ఈ చిన్న కారు ఇప్పుడు మహిళలకు కూడా ఇష్టమైన కార్లలో ఒకటిగా మారింది. సైజు ముఖ్యం కాదు ప్రాక్టికాలిటీనే కార్లకు ముఖ్యమని నిరూపిస్తూ కామెట్ ఒక డిఫరెంట్ మార్గాన్ని ఎంచుకుంది.

ఈ రెండింటిలో ఏ స్కూటర్ తీసుకుంటే మంచిది? Vida Vx2 vs iQube మధ్య తేడాలు

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో పోటీ రోజురోజుకీ తీవ్రతరమవుతోంది. ఈ పోటీలో ముఖ్యంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి , టీవీఎస్ iQube, హీరో మోటోకార్ప్ నుండి వచ్చిన తాజా ఎంట్రీ, Vida Vx2. ఈ రెండు స్కూటర్లూ నగర ప్రయాణాల్లో సౌకర్యాన్ని అందించడంలో దృష్టి పెట్టగా, ఇవి ఎక్కువగా యువత, డైలీ ఉద్యోగాలకు వెళ్లేవారికి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇవి ఒకే సిగ్మెంట్‌లో ఉన్నా, స్టైలింగ్, టెక్నాలజీ, స్పెసిఫికేషన్స్, ప్రాక్టికాలిటీ వంటి అంశాల్లో స్పష్టమైన తేడాలు ఉన్నాయి. Vida Vx2 హీరో నుండి వచ్చిన రెండో విద్యుత్ స్కూటర్.

సున్నా నుంచి 60 కి.మీ.కి కేవలం 2.7 సెకన్లు! కొత్త పల్సర్ NS400Z వచ్చేసింది

ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారతదేశంలో టూవీలర్ వాడకం ఎక్కువగా ఉంటుంది. దేశంలో 70 శాతానికి పైగా టూవీలర్ కలిగి ఉంటారు. తమ రోజువారి అవసరాల కోసం ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు తయారీదారులు కూడా పోటా పోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ బజాజ్ ఆటో (Bajaj Auto) యువతను ఆకట్టుకునేలా శక్తివంతమైన పల్సర్ NS400Z (pulsar NS400Z)ను విడుదల చేసింది. బజాజ్ బ్రాండ్‌కు స్థాయిని తీసుకువచ్చిన పల్సర్ సిరీస్‌లో ఇది ఇప్పటి వరకు వచ్చిన అత్యంత శక్తివంతమైన మోడల్. మాసివ్ లుక్స్, అగ్రెసివ్ స్టాన్స్‌తో పాటు తాజా టెక్నాలజీ కలిగిన ఈ బైక్‌కి కంపెనీ రూ. 1.92 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను నిర్ణయించింది.

యూరప్ బాటలో భారత్.. త్వరలోనే బ్యాటరీ పాస్ పోస్ట్.. కేంద్రం కొత్త రూల్స్

భారతదేశంలో బ్యాటరీలకు ఆధార్ కార్డు లాంటి ఒక వ్యవస్థను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విధానం ద్వారా బ్యాటరీ తయారైన సంవత్సరం, దాని వయస్సు, అది ఎలాంటి బ్యాటరీ, ఎలా తయారు చేశారు వంటి వివరాలను వినియోగదారులు ఎలాంటి సమస్యలు లేకుండా రియల్ సమాచారం తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
Advertisement

టయోటా వర్షాకాల సర్వీస్ క్యాంపెయిన్! ఇంటీరియర్ క్లీనింగ్ నుంచి బ్యాటరీ చెక్ వరకు

వర్షాలు పడే సీజన్ వచ్చింది అంటే, వాహనదారుల ఆందోళనలు మొదలవ్వడం సహజం. రోడ్లు జారిపోతాయి, విండ్‌షీల్డ్లు, టైర్లు ఇవన్నీ కరెక్ట్‌గా లేకపోయినా ఈ టైంలో పెద్ద ప్రమాదాలను ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇంజిన్ పనితీరుతో పాటు ఇతర విభాగాలు కూడా సరిగ్గా పనిచేస్తేనే ఈ సీజన్‌లో వాహనాలను జాగ్రత్తగా కాపాడుకోగలం. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టయోటా (Toyota) వినియోగదారుల కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. తన కస్టమర్లకు ఈ సీజన్‌లో మెరుగైన సేవలు అందించడానికి అమేజింగ్ టయోటా సర్వీస్ క్యాంపెయిన్(Awesome Toyota Service Campaign) అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశంలోని తన అన్ని అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుందని టయోటా ఒక ప్రకటనలో తెలిపింది.

మేడ్ ఇన్ ఇండియా ఈ-యాక్సిల్.. ప్రపంచవ్యాప్తంగా సేల్.. BMWకు పోటీ!

మారుతి సుజుకి ఇండియా నుండి తొలి ఎలక్ట్రిక్ కారు లేదా SUV కోసం నిరీక్షణకు త్వరలోనే ముగింపు పలకవచ్చు. కంపెనీ తమ మొదటి ఎలక్ట్రిక్ మోడల్ ఈ-విటారాను సెప్టెంబర్ చివరినాటికి విడుదల చేయనుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే భారతదేశంలో తయారైన ఈ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తారు. ఈ కారులో కంపెనీ భారతదేశంలో తయారుచేసిన కాంపాక్ట్ ఈ-యాక్సిల్‌ను ఉపయోగించనుంది.

ఇది కారు కాదు.. ఫ్యామిలీకి ఫుల్ డీల్! ట్రైబర్ కొత్త వెర్షన్ వచ్చేస్తుంది

ఫ్రెంచ్ ఆటోమేకర్ రెనాల్ట్(Renault) భారత మార్కెట్లో గత కొంతకాలంగా పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. అయితే రెనాల్ట్ పూర్తిగా వెనుకబడిందనుకోలేం. ఎందుకంటే, సంస్థకు ఇంకా కొన్ని నమ్మకమైన మోడళ్ల రూపంలో బలమైన బేస్ ఉంది, ముఖ్యంగా క్విడ్, ట్రైబర్, కైగర్ రూపంలో మార్కెట్‌ను కలిగి ఉంది. అయితే ఇప్పుడు, తమ వ్యాపార లాభాన్ని మరింత పెంచుకోవడానికి మరో కొత్త అడుగు వేయబోతుంది. తన ప్రసిద్ధ మోడల్ ట్రైబర్ (Triber) ను మరో కొత్త అవతరాంలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో ట్రైబర్‌కి పూర్తిగా ఒక ఫ్రెష్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లాంచ్ కాబోతోంది. ఈ MPV ఇటీవల కొత్త రూపంతో రోడ్లపై పరీక్షించబడుతూ పలుమార్లు కెమెరాలకు కనిపించింది. కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం కొత్త ట్రైబర్‌ను ఈ నెల 23న అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది.

జీప్ కార్లపై భారీ ఆఫర్లు.. ఇప్పుడే కొంటే భారీ తగ్గింపు

ఆఫర్లు లేకుండా జీప్ మెరిడియన్ ధర రూ.24.99లక్షల నుండి రూ.38.79 లక్షల వరకు ఉంటుంది. ఈ SUVని 5-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో కొనుగోలు చేయవచ్చు. మరోవైపు, జీప్ కంపాస్ ఎక్స్-షోరూమ్ ధర రూ.18.99 లక్షల నుండి రూ.32.41లక్షల వరకు ఉంటుంది. ఈ రెండు మోడళ్లలోనూ 2.0 లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్ వస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్తో జతచేయబడి ఉంటుంది.
Advertisement

సిమ్రాన్ ఇంటికే వచ్చిన థార్ రాక్స్.. వీడియో చూసి ఫ్యాన్స్ ఫిదా!

తొంభైల్లో తెలుగు, తమిళ సినిమాలపై తనదైన ముద్ర వేసిన స్టార్ బ్యూటీ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాంప్రదాయ చీరల్లోనూ, ఆధునిక దుస్తుల్లోనూ అదే అందాన్ని, ఆకర్షణను చూపిస్తూ తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకుంది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ వంటి అగ్ర హీరోలతో ఎన్నోహిట్ సినిమాలు చేశారు. ఒకానొక సమయంలో సినిమాలకు గుడ్‌బై చెప్పిన ఆమె, తన కుటుంబానికి అంకితమై నిర్మాత దీపక్ బాగా భార్యగా జీవితం కొనసాగిస్తున్నారు. ఇటీవల రీ-ఎంట్రీ ఇచ్చారు. కాలం మారినా, సిమ్రాన్ పట్ల ప్రేక్షకుల్లో ఉండే ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. నటిగా మాత్రమే కాకుండా, నిర్మాతగా, నేపథ్య గాయనిగా, కొరియోగ్రాఫర్‌గా కూడా తన ప్రతిభను చూపిస్తూ మల్టీ టాలెంటెడ్ లేడీగా పేరు సంపాదించింది. ఇదిలా ఉంటే ఆమె వ్యక్తిగత జీవితంలో మరో అప్‌డేట్ తెరపైకి వచ్చింది.

ఈ బైక్ ధరలో రెండు లగ్జరీ కార్లు వస్తాయ్.. మార్కెట్లోకి మరో లగ్జరీ బైక్

ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్, బ్రిటీష్‌కు చెందిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన మోటార్‌సైకిల్ కంపెనీ. లక్షల రూపాయల విలువైన బైకులను విక్రయించే ట్రయంఫ్, భారత మార్కెట్‌లో కూడా తన బైకులను అమ్ముతుంది.

ట్రెండ్ మారిన భారత కార్ల మార్కెట్.. గతేడాదితో పోలిస్తే తగ్గిన అమ్మకాలు

ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల మార్కెట్‌లలో భారతదేశం కూడా ఒకటి. ప్రతీ నెలా లక్షలాది కార్లు భారతదేశంలో అమ్ముడవుతాయి. మారుతి సుజుకి ఒక్కటే ప్రతీ నెలా లక్షకు పైగా కార్లను విక్రయిస్తుందంటే దీని మార్కెట్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. గత 2025 జూన్ నెలలో అత్యధిక సంఖ్యలో కార్లను విక్రయించిన టాప్ 10 కంపెనీలు ఏవి? అవి ఎన్ని కార్లను విక్రయించాయి? వంటి వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఆటో, బస్సు, రైళ్లలో వెళ్లే బదులు ఈ కారులో హాయిగా వెళ్లొచ్చు

మారుతి సుజుకి ఎర్టిగా పెద్ద కుటుంబాల కలల MPV. విశాలమైన ఇంటీరియర్‌, మంచి మైలేజ్‌తో ఇది భారతీయ వినియోగదారుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రతీ నెలా దాని సేల్స్ ఒక కొత్త రికార్డు చెబుతున్నాయి. ఈ ఏడాది (జనవరి నుండి మే వరకు) ఎర్టిగా తన స్థిరమైన డిమాండ్‌ను నిలబెట్టుకుంటూ, ప్రతీ నెలా మెరుగైన అమ్మకాలను సాధిస్తుంది. తాజాగా విడుదలైన నివేదిక ప్రకారం, ఎర్టిగా జూన్ 2025లో 14,151 యూనిట్లు అమ్ముడుపోయింది. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో ఇది నాలుగవ స్థానంలో నిలిచింది. ఒక్క నెలలోనే 14,151 యూనిట్లు అమ్ముడవడం గర్వకారణం. దానికంటే ముందు స్థానాల్లో హ్యుందాయ్ క్రెటా (15,786 యూనిట్లు), మారుతి సుజుకి డిజైర్ (15,484 యూనిట్లు), మారుతి సుజుకి బ్రెజ్జా (14,507 యూనిట్లు) ఉన్నాయి.
Advertisement

టాటా, మహీంద్రాకు షాక్..సన్‌రూఫ్ కార్లతో హ్యుందాయ్ రికార్డు

సన్‌రూఫ్ కార్లకు ఇండియాలో డిమాండ్ అమాంతం పెరిగింది. ఈ ట్రెండ్‌ను సరిగ్గా పసిగట్టింది హ్యుందాయ్. కేవలం ఐదేళ్లలో రికార్డు సంఖ్యలో సన్‌రూఫ్ కార్లను అమ్మి సరికొత్త రికార్డు సృష్టించింది. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ ఒక పెద్ద విజయాన్ని ప్రకటించింది. కేవలం ఐదేళ్లలో భారతదేశంలో 11 లక్షలకు పైగా సన్‌రూఫ్ ఉన్న కార్లను విక్రయించింది.

బైక్ ప్రేమికులందరికి గుడ్‌న్యూస్.. ఈ బైకులు ఇప్పుడు సూపర్ చీప్!

ప్రముఖ వాహన బ్రాండ్ ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా, దేశవ్యాప్తంగా ఉన్న మోటార్‌సైకిల్ అభిమానులకు ఒక సంతోషకరమైన వార్తను అందించింది. ప్రీమియం సెగ్మెంట్‌లోకి వస్తున్న తమ రెండు ప్రసిద్ధ మోడళ్లపై భారీ ధరల తగ్గింపును ప్రకటించి, వీటిని మరింత చేరువైనవిగా మార్చింది. కొత్తగా బైకును కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్నవారు ఈ తగ్గింపును ఉపయోగించుకుని కొత్త బైకును తమ ఇంటికి తీసుకెళ్లవచ్చు. దాని ప్రసిద్ధ మోడల్ కీవే కె-లైట్ 250V (keeway k light 250v) దీని ధరను ఏకంగా రూ.71,000 తగ్గించారు. ఫలితంగా, ఈ స్టైలిష్ మోడల్‌ను ఇప్పుడు కేవలం రూ.2,49,000 (ఎక్స్-షోరూమ్)కు పొందవచ్చు. క్రూయిజింగ్ వాహనాల ప్రేమికులకు ఇది నిజమైన గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇది రెట్రో క్రూయిజర్ డిజైన్‌ కోసం ప్రత్యేకంగా గుర్తింపు పొందింది.

కారు ధరను ఎలా తగ్గించుకోవాలంటే తప్పని సరిగా ఈ విషయాలు తెలుసుకోండి

కొత్త కారు లేదా బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా.. షోరూంకు వెళ్లే ముందు రెండు రకాల ధరల గురించి వినే ఉంటారు. అవే ఎక్స్-షోరూమ్ ధర, ఆన్-రోడ్ ధర. ఈ రెండు పదాలు వాహనం ధరను తెలియజేసేవే అయినప్పటికీ వాటి మధ్య చాలా తేడా ఉంటుంది.

తక్కువ ఖర్చు.. టాప్ మైలేజ్.. 2025లో వ్యాగన్ఆర్ CNGకు డిమాండ్!

భారతీయ వినియోగదారులు కారు ఎంపికలో ఎప్పటినుండో మంచి మైలేజ్‌ను ప్రధానంగా చూస్తారు. ఇంధన ధరలు పెరుగుతున్న ఈ కాలంలో, తక్కువ ప్రయాణ ఖర్చులు కలిగిన వాహనాలకే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, ఈ డిమాండ్‌కి ముఖ్య సమాధానం డీజిల్ ఇంజిన్లతో వచ్చిన కార్లే. అధిక మైలేజీ, ఆర్థిక ప్రయోజనాలు అందించటంతో డీజిల్ వాహనాలు పెద్ద సంఖ్యలో అమ్ముడయ్యాయి. అయితే, వాయు కాలుష్యం అంశం తీవ్రమవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పరిమితులు, కొత్త ఉద్గార ప్రమాణాల అమలు కారణంగా, అనేక కంపెనీలు డీజిల్ ఇంజిన్ల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా, కొన్నిచోట్ల పూర్తిగా నిలిపివేశాయి. ఈ మార్పు, మార్కెట్ పరిస్థితులను కొత్త దిశకు మళ్లించింది. ఇలాంటి పరిస్థితిలో, స్మార్ట్‌ వినియోగదారులు మరో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నారు, అదే సీ‌ఎన్‌జీ (CNG) వాహనాలు.
Advertisement

మహీంద్రా స్కార్పియో రికార్డ్ సేల్స్.. టాప్ 10 కార్ల జాబితాలో 7వ స్థానం

భారతదేశ కార్ల మార్కెట్‌లో మహీంద్రా స్కార్పియో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. దశాబ్దాలుగా కస్టమర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుని, భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. కొనుగోలుదారులు కూడా చాలా ఇష్టపడి దీన్ని కొంటున్నారు. తెలుగు ఫ్యాక్షన్ సినిమాల్లో కీలక పాత్రను పోషించింది స్కార్పియో. స్కార్పియోలు గాల్లోకి లేచిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయి.

మూడో ఎడిషన్ షురూ కాబోతుంది.. ఎప్పుడు, ఎక్కడంటే? పూర్తి షెడ్యూల్ ఇది!

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో (BMGE) మూడవ ఎడిషన్‌ను ఫిబ్రవరి 4 నుండి 9, 2027 మధ్య ఢిల్లీ-NCR ప్రాంతంలో నిర్వహించనున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దేశంలోని అతిపెద్ద మొబిలిటీ కార్యక్రమాలుగా ఎదిగిన ఈ ఎక్స్‌పో, ఈసారి మరింత విస్తృత స్థాయిలో, కొత్త విభాగాలతో, ప్రత్యేక సౌకర్యాలతో కొనసాగనుంది. ఇంతకుముందు నిర్వహించినటువంటి మొదటి రెండు ఎడిషన్లు 2024, 2025లో విశేషమైన ప్రజాదరణ పొందాయి. ఈ కార్యక్రమాలకు లక్షల మంది హాజరయ్యారు. వీటి ద్వారా భారతదేశ ఖ్యాతి ప్రపంచానికి తెలియవచ్చింది. ఈ నేపథ్యంలో మూడవ ఎడిషన్‌‌ను కూడా దేశ రాజధాని పరిసరాల్లో ఎంతో అట్టహసంగా నిర్వహించడానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధం కానున్నారు.

నిలిచిపోనున్న ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ.. లాస్ట్ డేట్ ఇదే !

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలను అందిస్తోంది. ప్రస్తుత సబ్సిడీ పథకం మార్చి 31, 2026తో ముగియనుంది. ఈ నేపథ్యంలో తదుపరి సబ్సిడీ పథకం ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు ఎలా ఉంది? వంటి పూర్తి వివరాలను ఈ వార్తలో తెలుసుకుందాం.

టాటా కర్వ్ కొనాలనుకుంటున్నారా? దీని గురించి ముందే తెలుసుకోండి!

టాటా మోటార్స్ (Tata Motors) నుంచి వచ్చిన టాటా కర్వ్ ప్రీమియం కూపే SUV, తన ఆకర్షణీయ డిజైన్, లేటెస్ట్ ఫీచర్లు, అందుబాటులో ఉండే ధర వల్ల వినియోగదారులను ఆకట్టుకుంటోంది. మార్కెట్లోకి వచ్చి కొద్ది రోజులే అవుతున్నా, ఈ మోడల్‌ను పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. అంతే కాకుండా, కర్వ్ రూపకల్పనలో కనిపించే కాస్త స్పోర్టీ కూపే శైలి, బలమైన రోడ్డు ప్రెజెన్స్‌కి తోడు, ఇంటీరియర్‌లో అందించిన ఆధునిక టెక్నాలజీ ఫీచర్లు దీనికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొచ్చాయి. తాజాగా, ఈ కర్వ్ SUV వేరియంట్లలో కొన్నింటి ధరలు సవరిస్తూ టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపిక చేసిన కొన్ని వేరియంట్లకు గరిష్ఠంగా రూ.13,000 వరకు ధర పెరుగుదల చేసింది. ఈ సవరించిన ధరలు వెంటనే అమలులోకి రాగా, కొత్తగా కొనుగోలు చేసే వినియోగదారులకు ఇది వర్తిస్తుంది.
Advertisement

రూ.2.40 కోట్ల కారులో షికారు చేస్తున్న శృతిహాసన్..అదిరిపోయే ఫీచర్స్

గత కొన్నేళ్లుగా ఇండియాలో సెడాన్ కార్ల డిమాండ్ చాలా తగ్గింది. ప్రస్తుతం స్పోర్ట్ యూటిలిటీ వాహనాలకు చాలా మంచి డిమాండ్ ఉంది. అందుకే సెడాన్‌లకు పెద్దగా అమ్మకాలు లేవు. అయితే, సినీ తారలకు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు మాత్రం ఇప్పటికీ సెడాన్ కార్లంటేనే ఇష్టం.

మరాజ్జోకు కష్టకాలం.. జనవరి-మే 2025లో అమ్మకాలు కేవలం 37 యూనిట్లు!

ఆనంద్ మహీంద్రా ఆధ్వర్యంలోని మహీంద్రా (Mahindra) దేశీయంగా, అంతర్జాతీయంగా కార్ల అమ్మకాలతో దూసుకుపోతుంది. స్కార్పియో, XUV 3XO, XUV700, థార్ వంటి వంటి ప్రతీ మహీంద్రా మోడల్‌ కూడా మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి. దీని పొడవైన SUVల సిరీస్‌ను భారతీయులు ఎంతో అభిమానంతో స్వీకరించారు. అందుకే, ఈ మధ్యకాలంలో అమ్మకాల పరంగా మహీంద్రా దేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీదారుగా ఎదగడం పెద్ద వార్తైంది. దాని ప్రస్తుత మోడళ్లన్నీ మార్కెట్లో హిట్లుగా నిలుస్తూ, ఒక విశిష్టమైన ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నాయి. అయితే ఇలాంటి మెరుగైన సేల్స్ మధ్య ఒకటి మాత్రం ఆదరణ సంపాదించలేకపోతుంది. అదే మహీంద్రా మరాజ్జో ఎంపీవీ (Mahindra Marazzo Mpv). ఇది కంపెనీ ప్రారంభించిన ఏకైక MPV మోడల్‌. ఇది మాత్రం వినియోగదారుల నుండి సరైన స్పందన పొందలేకపోయింది.

2030 కల్లా 7 కొత్త టాటా కార్లు.. త్వరలో మార్కెట్లోకి మినీ సియెరా స్కార్లెట్

ఇండియాలో ప్రస్తుతం సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV కార్ల అమ్మకాలు చాలా జోరుగా జరుగుతున్నాయి. వీటి ధర కొంచెం తక్కువగా ఉండడమే మార్కెట్లో వీటి డిమాండ్ కు ప్రధాన కారణం. తక్కువ ధరలో SUV కారు కావాలని చాలా మంది కస్టమర్లు ఈ సెగ్మెంట్‌లోని కార్లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు.

కష్టమర్లకు ఈ కారంటే చాలా ఇష్టం.. మారుతి స్విఫ్ట్ 13,275 యూనిట్ల అమ్మకాలు

మారుతి సుజుకి స్విఫ్ట్ (maruti suzuki swift) ఇది కేవలం ఒక కార్‌ కాదు, ఎన్నో కుటుంబాలకు బాగా నమ్మకమైన మోడల్. ఇండియాలో ఎన్నో ఏళ్లుగా ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంది. పేద, మధ్యతరగతి వాళ్లు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో, మంచి మైలేజ్ సామర్థ్యంతో అందరి గుండెల్లో స్థానం సంపాదించింది. ఇదిలా ఉంటే మారుతి తాజాగా తన కార్ల జాబితా విడుదల చేసింది. దీని ప్రకారం, ఇటీవల భారతదేశంలోని అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో స్విఫ్ట్ (Swift) ఐదో స్థానాన్ని దక్కించుకుంది. జూన్ 2025లో ఈ కారు దాదాపు 13,275 యూనిట్లు అమ్ముడుపోయింది. దీన్ని బట్టి మార్కెట్లోకి ఎన్ని కొత్త మోడళ్లు వస్తున్నప్పటికి దీనికి డిమాండ్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది.
Advertisement

475 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లు..రూ.13లక్షలకే కియా నయా కారు

ఇండియాలో బాగా పాపులర్ అయిన కార్లలో కియా సైరోస్ ఒకటి. ఈ కారును గత ఫిబ్రవరిలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 9.50 లక్షలు. ఈ కారు టాప్ మోడల్ ధర రూ. 17.80 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఇప్పుడు కియా కంపెనీ ఈ కారుకు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురావడానికి చాలా వేగంగా పనులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.