475 కి.మీ రేంజ్.. అదిరిపోయే ఫీచర్లు..రూ.13లక్షలకే కియా నయా కారు

ఇండియాలో బాగా పాపులర్ అయిన కార్లలో కియా సైరోస్ ఒకటి. ఈ కారును గత ఫిబ్రవరిలోనే భారత మార్కెట్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం దీని ప్రారంభ ధర రూ. 9.50 లక్షలు. ఈ కారు టాప్ మోడల్ ధర రూ. 17.80 లక్షలు. ఇవన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు. ఇప్పుడు కియా కంపెనీ ఈ కారుకు ఎలక్ట్రిక్ వెర్షన్‌ను తీసుకురావడానికి చాలా వేగంగా పనులు చేస్తోందని వార్తలు వస్తున్నాయి.

హైవేలపై ప్రయాణించే వారికి శుభవార్త.. సగానికి తగ్గనున్న టోల్ ఫీజు

టోల్ ఫీజుల విషయంలో మొదటి నుంచీ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య చాలా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. "మా టాక్స్ డబ్బులతోనే రోడ్లు వేసి, మళ్ళీ ఆ రోడ్ల మీదే వెళ్లడానికి డబ్బులు వసూలు చేస్తారా?" అని ప్రజలు అడుగుతున్నారు. అయితే, దీనికి ప్రభుత్వం సమాధానం ఏంటంటే, దేశవ్యాప్తంగా వేల కోట్ల ఖర్చుతో మంచి ఎక్స్‌ప్రెస్‌వేలు నిర్మించాలన్నా, వాటిని ఎప్పుడూ మంచిగా మెయింటెయిన్ చేయాలన్నా టోల్ ఫీజులు తప్పవని చెబుతోంది.

స్కోడా భారత్‌లో కొత్త చరిత్ర… 5 లక్షల కార్లను స్వదేశంలోనే నిర్మించిన ఘనత

స్కోడా బ్రాండ్‌కి భారతదేశంలో మంచి మార్కెట్ ఉంది. స్కోడా 2001లో భారత్‌లో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అప్పట్నుంచి దేశీయ వినియోగదారుల మన్ననలు పొందుతూ, తన మోడళ్లను పరిచయం చేసింది. ఆక్టేవియా, లారా, సూపర్బ్, కోడియాక్, కుషాక్, స్లావియా, ఇటీవల విడుదలైన సబ్-4 మీటర్ SUV కైలాక్ ఇలాంటి ప్రతీ మోడల్ వినియోగదారులలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. తాజాగా, స్కోడా తన ప్రయాణంలో మరో ముఖ్యమైన మైలురాయిని అధిగమించింది. భారతదేశంలోని స్థానిక తయారీ కర్మాగారం నుండి ఇప్పటివరకు ఐదు లక్షల (5 లక్షల) వాహనాల ఉత్పత్తి పూర్తయింది. ఇది కంపెనీ స్థిరమైన వృద్ధి, భారతీయ మార్కెట్‌కి తగినంత లోతైన నిబద్ధతకు బలమైన ఉదాహరణ.

టాటా హారియర్‌ ఈవీ రికార్డు.. ఒక రోజులోనే 10,000 బుకింగ్‌లు

ఇటీవలే కొత్త టాటా హారియర్‌ ఈవీని లాంచ్ చేశారు. ఈ కారు అదిరిపోయే డిజైన్, అదిరిపోయే ఫీచర్లతో వచ్చింది. జూలై 3 నుంచి టాటా కంపెనీ హారియర్‌ ఈవీ కోసం బుకింగ్స్ తీసుకోవడం మొదలుపెట్టింది. కస్టమర్ల నుంచి ఊహించని విధంగా భారీ స్పందన వచ్చింది. కేవలం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో ఆర్డర్లు వచ్చాయి. ఇది ఎలక్ట్రిక్ SUVలకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా చూపిస్తుంది.
Advertisement

హోండా జులై ఆఫర్లు.. 1.07 లక్షల వరకు డిస్కౌంట్లతో కొత్త కార్లు

హోండా ఇండియా కస్టమర్లను తమ షోరూమ్‌కు రప్పించడానికి, తక్కువ ధరలో కొత్త కారును కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మంచి అవకాశాన్ని అందించడానికి జులై 2025 నెలకు సంబంధించి తన మోడళ్లపై తగ్గింపును ప్రకటించింది. ఎప్పటినుండో కాంపాక్ట్ సెడాన్ విభాగంలో మంచి గుర్తింపు పొందిన హోండా అమేజ్, అలాగే, ఇతర మెడళ్లు హోండా సిటీ, ఎలివేట్ కార్లపై దాదాపు రూ. 1.07 లక్షల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రత్యేకంగా హోండా అందిస్తున్న కార్పొరేట్ బోనస్, లాయల్టీ డిస్కౌంట్స్ వంటివి ఉన్నాయి. ఇటీవల కాలంలో తక్కువ ధరలో అయిన సొంత కారును కలిగి ఉండాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ తగ్గింపు ఆఫర్ సద్వినియోగం చేసుకుని తమకు నచ్చిన హోండా కారును ఇంటికి తీసుకెళ్లవచ్చు.

జూన్‌లో వినియోగదారులను ఆకట్టుకున్న బ్రెజ్జా.. 14,507 యూనిట్లకు పైగా సేల్స్

మారుతీ సుజుకీ బ్రెజ్జా (Maruti Suzuki Brezza), ఈ మధ్యకాలంలో కాంపాక్ట్ SUV విభాగంలో తనదైన స్థానాన్ని సాధించింది. ఆకర్షణీయమైన డిజైన్, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, వినియోగదారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను అందించడం వంటి ప్రత్యేకతలతో బ్రెజ్జా అంటేనే అందరికి బాగా ఇష్టమైన కారుగా గుర్తింపు పొందింది. తాజాగా జూన్ నెల ముగియగానే తయారీ కంపెనీలు వరుసగా తమ సేల్స్‌ను వెల్లడిస్తున్న తరుణంలో మారుతీ సైతం బ్రెజ్జా కారు అమ్మకాలను విడుదల చేసింది. జూన్ నెలకు గాను దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితా వెల్లడి కాగా, ఈ జాబితాలో బ్రెజ్జా 3వ స్థానాన్ని సొంతం చేసుకుంది. 14,507 యూనిట్ల అమ్మకాలతో కస్టమర్ల ఆదరణ ఉందని నిరూపించుకుంది.

హోండా సిటీ హైబ్రిడ్.. రూ.95,000 ధర తగ్గింపు.. రూ.20 లక్షల లోపే సూపర్ కారు!

హోండా కార్స్ ఇండియా కంపెనీ తమ పాపులర్ సిటీ కారులో e:HEV అనే పేరుతో హైబ్రిడ్ వెర్షన్‌ను కొన్నేళ్లుగా అమ్ముతోంది. సిటీ కారు అమ్మకాల్లో ఈ హైబ్రిడ్ మోడల్ వాటా చాలా కీలకం. అందుకే హోండా కంపెనీ సిటీ హైబ్రిడ్ కారులో ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లు ఇస్తూనే ఉంటుంది.

ఒక్కో వేరియంట్ పై ఊరించే ఆఫర్లు.. రెనాల్ట్ కార్లపై రూ.80,000 వరకు బెనిఫిట్స్!

ప్రతినెలా వాహన తయారీదారులు తమ సేల్స్‌ను పెంచుకోవడానికి కస్టమర్లను ఆకర్షించడం కోసం కార్లపై భారీ ఎత్తున తగ్గింపులు, డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ వంటివి అందిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా జులై 2025ను మరింత ప్రత్యేకంగా మార్చేందుకు, రెనాల్ట్ తన కార్లపై ఆకర్షణీయమైన ఆఫర్‌లను ప్రకటించింది. దీని ద్వారా కొత్తగా కారును కొనుగోలు చేయాలనే ఆలోచన చేస్తున్న వారిని తమ వైపు ఆకట్టుకోవడానికి వీలవుతుంది. దీంతో రెనాల్ట్ సేల్స్ పెరగడం వలన మంచి లాభం చేకూరుతుంది. రెనాల్ట్ తన MY2025 లైన్‌అప్‌లో ఆకర్షణీయమైన తగ్గింపులు ఇస్తుంది. కొన్ని ఎంపిక చేసిన వేరియంట్‌లపై గణనీయమైన నగదు తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు ప్రకటించింది. ఈ ఆఫర్లు ప్రధానంగా ఎంట్రీ-లెవల్ మోడళ్లను, అలాగే కాంపాక్ట్ విభాగంలో ఉన్న వాహనాలను టార్గెట్ చేస్తున్నాయి.
Advertisement

627కిమీ రేంజ్.. 7 ఎయిర్‌బ్యాగ్‌లు.. టాటా హారియర్‌ ఈవీలో ఏమున్నాయో తెలుసా?

ఇండియన్ కస్టమర్లంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో టాటా హారియర్‌ ఈవీ ఒకటి. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ కారు. గత నెల జూన్ 27న టాటా హారియర్‌ ఈవీని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత, జూలై 2న ఈ కారుకు బుకింగ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు పుణెలోని టాటా ఫ్యాక్టరీలో హారియర్‌ ఈవీ ఉత్పత్తి కూడా అధికారికంగా మొదలైంది.

ఆస్ట్రేలియాలో మహీంద్రా XUV 3XO గ్రాండ్ లాంచ్

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ మహీంద్రా (mahindra) భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఒక విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకుంది. దేశీయ విపణిలో సుస్థిరంగా నిలబడిన ఈ సంస్థ, అంతర్జాతీయ మార్కెట్లో కూడా మెల్లగా ఆదరణ సంపాదించుకుంటుంది. తాజాగా స్వదేశంలో తయారు చేసిన సరికొత్త మహీంద్రా XUV 3XO కాంపాక్ట్ SUVను కంపెనీ ఆస్ట్రేలియాలో విడుదల చేసింది. ఆస్ట్రేలియా మార్కెట్లో, ఈ SUVను రెండు వేరియంట్లలో అందిస్తున్నారు, అవి AX5L, AX7L. AX5L వేరియంట్‌కి ధర AUD 23,490 (భారత రూపాయల్లో సుమారు రూ. 13.18 లక్షలు). AX7L వేరియంట్‌కి ధర AUD 26,490 (సుమారు 14.87 లక్షలు). ఈ ధరలతో, మహీంద్రా కాంపాక్ట్ SUV విభాగంలో గట్టి పోటీ ఇవ్వనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

500 కిలోమీటర్ల రేంజ్‎తో మహీంద్రా ఈవీలు.. ఫుల్ గ్లాస్ రూఫ్, ADAS ఫీచర్లతో

భారత మార్కెట్‌లో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల వార్ పీక్స్‎కు చేరింది. ఒక పక్క టాటా మోటార్స్ తమ కొత్త హారియర్ ఎలక్ట్రిక్ SUVతో దూసుకొస్తుంటే.. దానికి పోటీగా మహీంద్రా తమ BE 6, XEV 9e మోడళ్లను అప్‌డేట్ చేసి రంగంలోకి దింపింది.

నియమాలు లెక్క చేయని డ్రైవర్‌కు బీమా డబ్బు వద్దు.. సుప్రీం కోర్టు స్పష్టం!

వాహన బీమా పరిధి, బాధ్యతలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వాహనాల్లో ప్రయాణికుల నిర్లక్ష్యం లేదా వారి స్వంత తప్పిదం కారణంగా జరిగే ప్రమాదాలపై బీమా కంపెనీలు పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని కోర్టు తన తీర్పులో తాజాగా స్పష్టంగా తెలిపింది. పూర్తి వివరాల్లోకి వెళితే, జూన్ 18, 2014న కర్ణాటకకు చెందిన రవీషా తన కుటుంబంతో కలిసి ఒక సాధారణ ప్రయాణానికి బయలుదేరాడు. అరషిగరే నుంచి మల్లచంద్రకు వెళ్ళే రోడ్డుపై తన సొంత కారులో అతను తండ్రి, సోదరి, ఇద్దరు పిల్లలతో ప్రయాణిస్తున్నాడు. అయితే ఆ రోజు దురదృష్టం కూడా వారితోనే ప్రయాణం చేసింది. వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది.
Advertisement

డొమినార్ 400, 250 మోడల్స్.. టీజర్ వచ్చింది.. విడుదల తేదీ ఎప్పుడో తెలుసా?

టూరింగ్ బైకుల విషయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఇప్పటి వరకు తిరుగులేదనే చెప్పాలి. దానికి గట్టి పోటీ ఇవ్వడానికి తాజాగా ఇండియాలో బజాజ్ డోమినార్ అనే కొత్త బైక్ వచ్చింది. మొదటి అడ్వర్టైజ్‌మెంట్‌లోనే బులెట్‌ను టార్గెట్ చేస్తూ దేశంలో బడ్జెట్-ఫ్రెండ్లీ స్పోర్ట్స్ టూరర్ విభాగంలో డోమినార్ ఎంట్రీ ఇచ్చింది. మొదట్లో బాగానే దూసుకెళ్లినప్పటికీ కాలం మారే కొద్దీ బులెట్ మార్కెట్ విపరీతంగా పెరిగిందే తప్ప, డోమినార్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఒకప్పుడు దూసుకుపోయిన హోండా.. ఇప్పుడు జూన్‌లో కేవలం 5,124 కార్లు మాత్రమే సేల్

ఒకప్పుడు భారతీయ మార్కెట్లో ఎంతో వెలుగొందిన హోండా కార్స్ ఇండియా, ఇప్పుడు తన స్థానాన్ని పునరుద్ధరించుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. జపాన్‌లో ప్రధాన కార్యాలయం కలిగి, ఏళ్ల తరబడి భారత్‌లో కార్లను అందించిన ఈ కంపెనీ అమ్మకాల పరంగా క్రమంగా వెనుకబడుతోంది. అసలు ఈ పరిస్థితిని హైలైట్ చేస్తూ హోండా ఇటీవల జూన్ నెలకు సంబంధించిన అమ్మకాల గణాంకాలను బయటపెట్టింది. గత సంవత్సరం ఇదే జూన్‌లో కంపెనీ 9,776 కార్లను విక్రయించింది. కానీ ఈ సంవత్సరం జూన్‌లో అమ్మకాల సంఖ్య గణనీయంగా తగ్గి కేవలం 5,124 యూనిట్లకే పరిమితమైంది. అంటే, కేవలం ఒక ఏడాది వ్యవధిలో సగానికి పైగా విక్రయాలు తగ్గిపోయాయి. ఇది కేవలం ఒక్క నెలకు పరిమితం కాని సమస్య కాదనే విషయం కూడా తెలుస్తుంది.

ఢిల్లీలో నిరసనలు ఫలితం.. ప్రజల ఆందోళనతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం

ఢిల్లీలో పాత వాహనాలపై ప్రభుత్వం విధించిన ఇంధన నిషేధం ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. జూలై 1 నుంచి 10 ఏళ్ల పాత డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల పాత పెట్రోల్ వాహనాలకు ఇంధన విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జనవరి నుండి మే వరకు మారుతి S-ప్రెస్సో అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా తక్కువ ధరలో లభించే అన్ని వర్గాల వారు కొనగలిగే కార్లకు డిమాండ్ తగ్గుతుంది. తాజాగా ఇటీవలి కాలంలో విడుదలవుతున్న అమ్మకాల గణంకాలను చూస్తే ఇదే అర్థం అవుతుంది. తాజాగా మారుతీ సుజుకీ తన సేల్స్ డేటాను వెల్లడించింది. దీని ప్రకారం, పేద, మధ్యతరగతి వారికి బాగా ఇష్టమైన ప్రసిద్ధ మోడల్ ఎస్-ప్రెస్సో (S-presso) ఒక ఉదాహరణగా నిలుస్తోంది. ఈ మోడల్‌ను తక్కువలో, సులభంగా అందుబాటులో ఉండే హ్యాచ్‌బ్యాక్‌గా భావిస్తారు. నిజానికి, తక్కువ ధరలో అందుబాటులో ఉన్న కార్ల జాబితా తయారు చేస్తే, ఎస్-ప్రెస్సో ఖచ్చితంగా ఆ జాబితాలో స్థానం సంపాదిస్తుంది. ఇంత తక్కువ బడ్జెట్‌లో సొంత కారు కొనాలనుకునేవారికి, ముఖ్యంగా కొత్తగా మొదటిసారి కారులోకి అడుగుపెడుతున్న వినియోగదారులకు, ఎస్-ప్రెస్సో సరైన ఆప్షన్ అవుతుంది.
Advertisement

కిమీకు కేవలం 25పైసల ఖర్చు మాత్రమే.. గేర్లు ఉన్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇదే

మేటర్ కంపెనీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా గేర్‌తో కూడిన ఎలక్ట్రిక్ బైక్ ఏరాను విడుదల చేసింది. రూ.1.93 లక్షల ప్రారంభ ధరతో వచ్చిన ఈ బైక్, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 173 కి.మీ.ల వరకు వెళ్తుందని కంపెనీ తెలిపింది. ఈ బైక్‌లో ప్రయాణించడం ద్వారా చాలా తక్కువ ఖర్చు అవుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇది చరిత్ర.. స్కోడా ఆరునెలల్లో సాధించిన అమ్మకాలు తెలుసా?

ప్రస్తుతం వాహన తయారీ కంపెనీలు వరుసగా తమ అమ్మకాలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ కార్ల సంస్థ స్కోడా కూడా తన సేల్స్ వివరాలను వెల్లడించింది. గత ఆరు నెలల్లో స్కోడా భారత ఆటోమొబైల్ రంగంలో ఎప్పుడూ లేని విధంగా తన విజయపథాన్ని మరింత బలంగా నిరూపించింది. ఈసారి అద్భుతమైన విక్రయ గణాంకాలతో కొత్త రికార్డును నెలకొల్పింది. 2025 ఏడాది జనవరి నుండి జూన్ వరకు స్కోడా మొత్తం 36,194 వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన అమ్మకాలతో పోలిస్తే ఇది ఏకంగా 134 శాతం పెరుగుదలను సాధించింది. 2022లో గరిష్ఠంగా 28,899 కార్లు అమ్ముడవడం ఒక చరిత్రగా నిలిచింది. అయితే, ఈసారి ఆ రికార్డుని కూడా బద్దలు కొట్టి స్కోడా తన సామర్థ్యాన్ని దేశవ్యాప్తంగా చూపించింది.

ఆంపియర్ నెక్సస్‌కు 5 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో సంచలనం

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లను సామాన్యులకు చేరువ చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన స్టార్టప్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఆంపియర్. గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ అయిన గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ సంస్థ లో-స్పీడ్, హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రంగంలో తమదైన ముద్ర వేసింది.

మళ్లీ టాప్ టెన్‌లోకి ఎగబాకిన వ్యాగన్ఆర్.. జూన్ సేల్స్‌లో విరుచుకుపడింది!

మారుతీ సుజుకీ వ్యాగన్ఆర్ భారతీయ కుటుంబాలందరిలోనూ మంచి గుర్తింపు సంపాదించిన ఒక ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్. సాధారణ వాడకానికి సరిపడే మైలేజ్, తక్కువ ధర మొదలగు అంశాలతో ఇది దేశంలో పేద, మధ్య తరగతి వారికి బాగా నచ్చిన మోడల్‌గా స్థిరపడింది. తాజాగా జూన్ నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ తన అమ్మకాల వివరాలను విడుదల చేసింది. దీని ప్రకారం, జూన్ నెలలో దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో వ్యాగన్ఆర్ మరోసారి తన సత్తా చూపించింది. ఈ జాబితాలో ఆరవ స్థానంలో నిలిచిన ఈ హ్యాచ్‌బ్యాక్ మొత్తం 12,930 యూనిట్లను అమ్మేసింది. ఇది కేవలం ఒక నెలలోనే సాధించిన గణనీయమైన విజయంగా చెప్పాలి. ప్రస్తుతం 2025 సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటివరకు వ్యాగన్ఆర్ అమ్మకాల ప్రగతిని పరిశీలిస్తే దాని స్థిరమైన డిమాండ్ స్పష్టమవుతుంది.
Advertisement

అమ్మకాల్లో రెండో స్థానం.. కానీ ధరలు పెంచబోతున్న మహీంద్రా

హ్యుందాయ్, టాటా మోటార్స్ వంటి బలమైన పోటీదారులను వెనక్కి నెట్టి, అమ్మకాలలో దేశంలోనే రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా మహీంద్రా అండ్ మహీంద్రా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఎస్‌యూవీలను మాత్రమే విక్రయించే కంపెనీ ఇంత ఈజీగా ఈ స్టాయికి ఎలా చేరుకుందనేది చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.

కళ్లు చెదిరే ఫీచర్లతో మిడిల్ క్లాస్ కోసం కొత్త ఈవీ.. సింగిల్ ఛార్జ్‌ చాలు

వియత్నాంకు చెందిన ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ విన్‌ఫాస్ట్ ఇప్పుడు అంతర్జాతీయ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధిస్తోంది. ప్రముఖ ఆటోమేకర్‌గా అవతరించిన ఈ సంస్థ, భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు అన్ని విధాలుగా సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా పలు మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాటిని దేశంలో ప్రదర్శించింది. వాటిలో VF6, VF7 అనే రెండు ఎలక్ట్రిక్ SUVలు కూడా ఉన్నాయి. అన్నీ అనుకున్నట్టు సాగితే, విన్‌ఫాస్ట్ నుంచి భారత విభాగంలో విడుదల కానున్న తొలి మోడల్ VF6 కానుంది. వచ్చే సెప్టెంబర్‌లో ఈ ఎలక్ట్రిక్ SUVను అధికారికంగా మార్కెట్‌లోకి తీసుకురావాలని సంస్థ యోచిస్తోంది. ఇప్పటికే VF6 మోడల్ ప్రపంచవ్యాప్తంగా మెరుగైన స్పందన పొందుతూ, తన ప్రత్యేకతను చాటుతోంది.

మతిపోగొట్టే మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. కొనసాగుతున్న మారుతి డిజైర్ జోరు

మారుతి సుజుకి డిజైర్ అంటే నమ్మకానికి, స్టైల్‌కి, మంచి పర్ఫామెన్స్‎కు మారుపేరు. దాని ఆకర్షణీయమైన డిజైన్, మంచి మైలేజ్, అందుబాటు ధరలతో ఇది ఎంతో మంది మనసు గెలుచుకుంది. అందుకే ఎప్పుడూ మంచి సంఖ్యలో అమ్ముడవుతూ ఉంటుంది. తాజాగా, జూన్ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల రిపోర్ట్ వచ్చింది.

కేవలం రూ.4.23 లక్షలకే కొత్త కారు! 34 కి.మీ మైలేజీని ఇస్తుంది!

భారతీయ కస్టమర్లు తక్కువ ధరలో దొరికే, మంచి మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ కార్లు ఇలాంటి అంచనాలను చాలా సమర్థంగా తీర్చుతూ, ఎన్నో ఏళ్లుగా లక్షలాది కుటుంబాలకు ఆధారంగా నిలిచాయి. తక్కువ ధర, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, ఇంధన పొదుపు వంటి కారణాల వల్ల వీటికి మంచి ఆదరణ లభించింది. కానీ, ఇటీవలి కాలంలో భారతీయ వినియోగదారుల ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కేవలం తక్కువ ధర, ఎక్కువ మైలేజ్ అనే పాత ప్రమాణాలతోనే కస్టమర్లు సంతృప్తి చెందడం తగ్గిపోయింది. కారులో సౌకర్యం, సేఫ్టీ, ఆధునిక ఫీచర్లు, డిజైన్ ఆకర్షణ వంటి అంశాలకూ సమాన ప్రాధాన్యం ఇస్తున్నారు.
Advertisement

స్క్రామ్ 440 బైక్ పై చిన్న సమస్య తీరింది.. బుకింగ్‌లు రీస్టార్ట్!

బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గతంలో స్క్రామ్ 440 (Scram 440) ఎంతో అట్టహాసంగా విడుదల అయింది. దీనిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికి ఆవిష్కరణ అనంతరం ఈ మోడల్ ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్లా ఇంజిన్ వ్యవస్థలో కొన్ని సమస్యలు తలెత్తడంతో బైక్ ప్రాసెస్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సమస్యలు బైక్ పనితీరుపై ప్రభావం చూపి, కంపెనీకి అవి వెంటనే పరిశీలించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. ప్రారంభంలోనే సమస్యలు రావడంతో బుకింగ్స్ నిలిపివేశారు. అయితే తాజాగా, రాయల్ ఎన్ఫీల్డ్ ఈ సమస్యలపై దృష్టి సారించి అవసరమైన పరిష్కారాలను చేసినట్లు తెలుస్తోంది. సమస్యలు సరిచేసిన తరువాత, స్క్రామ్ 440 బైక్ మళ్లీ బుకింగ్స్‌కి అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులకు సులభంగా డెలివరీలు చేయడం ద్వారా ఈ మోడల్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి బ్రాండ్ ప్రయత్నిస్తోంది.