స్క్రామ్ 440 బైక్ పై చిన్న సమస్య తీరింది.. బుకింగ్‌లు రీస్టార్ట్!

బైకుల రారాజు రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గతంలో స్క్రామ్ 440 (Scram 440) ఎంతో అట్టహాసంగా విడుదల అయింది. దీనిపై ఎన్నో అంచనాలు పెట్టుకున్నప్పటికి ఆవిష్కరణ అనంతరం ఈ మోడల్ ఇతర రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకుల్లా ఇంజిన్ వ్యవస్థలో కొన్ని సమస్యలు తలెత్తడంతో బైక్ ప్రాసెస్‌ను నిలిపివేయాల్సి వచ్చింది. ఈ సమస్యలు బైక్ పనితీరుపై ప్రభావం చూపి, కంపెనీకి అవి వెంటనే పరిశీలించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. ప్రారంభంలోనే సమస్యలు రావడంతో బుకింగ్స్ నిలిపివేశారు. అయితే తాజాగా, రాయల్ ఎన్ఫీల్డ్ ఈ సమస్యలపై దృష్టి సారించి అవసరమైన పరిష్కారాలను చేసినట్లు తెలుస్తోంది. సమస్యలు సరిచేసిన తరువాత, స్క్రామ్ 440 బైక్ మళ్లీ బుకింగ్స్‌కి అందుబాటులోకి వచ్చింది. వినియోగదారులకు సులభంగా డెలివరీలు చేయడం ద్వారా ఈ మోడల్‌ను తిరిగి ట్రాక్‌లోకి తీసుకురావడానికి బ్రాండ్ ప్రయత్నిస్తోంది.

క్రెటా తప్ప మిగిలినవన్నీ డౌన్.. హ్యుందాయ్ కార్లకు ఏమైంది?

హ్యుందాయ్ దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ. భారతదేశంలో మారుతి సుజుకి తర్వాత కార్ల అమ్మకాల్లో రెండో స్థానంలో ఉండే హ్యుందాయ్‌కు, గత కొన్ని నెలలుగా మహీంద్రా కంపెనీ గట్టి పోటీ ఇస్తోంది.

వెయిటింగ్‌కి ఎండ్.. టాటా హారియర్ EV బుకింగ్‌లకు గ్రీన్ సిగ్నల్!

భారతీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్ ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా ఐసీఈ ఆధారిత కార్లతో పాటు ఈవీలను కూడా విడుదల చేస్తుంది. ఇప్పటికే పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీలు వంటి వాటితో మార్కెట్లో బలమైన ఈవీ తయారీదారుగా ఉన్నటువంటి హారియర్ ఈవీ ద్వారా తన స్థానాన్ని మరింత పెంచుకుంటుంది. టాటా హారియర్ EV ఒక ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా అధునాతన ఫీచర్స్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. పూర్తిగా దేశీయంగా తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ కారుపై కస్టమర్లు ఇప్పటికే అధిక అంచనాలు పెట్టుకున్నారు. దాని డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ అన్నీ కలిపి భవిష్యత్తు తరహా డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తాయని టాటా మోటర్స్ చెబుతోంది.

హోండా సేల్స్.. దేశంలో డౌన్, విదేశాల్లో అప్.. ఏంటో విచిత్రం

కొత్త నెల ప్రారంభం కాగానే వాహన తయారీ కంపెనీలు గత జూన్ నెల అమ్మకాల వివరాలను, అలాగే గత క్వార్టర్ అమ్మకాల వివరాలను విడుదల చేయడం మొదలుపెట్టాయి. ఈ జాబితాలో హోండా మోటార్‌సైకిల్ కంపెనీ కూడా తన గణాంకాలను వెల్లడించింది. నివేదిక ప్రకారం.. హోండా మంచి వృద్ధిని సాధించినట్లు కనిపిస్తున్నప్పటికీ, లోపల కొన్ని ఆందోళనలు ఉన్నాయి. పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.
Advertisement

2025 ప్రథమార్థంలో సరికొత్త విజయాన్ని నమోదు చేసిన కియా ఇండియా

దక్షిణ కొరియాకు చెందినటువంటి ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia Motors) తాజాగా తన అమ్మకాల వివరాలను వెల్లడించింది. 2025 ఏడాది ప్రారంభం నుంచి మొదలుకుని జూన్ వరకు మొత్తంగా ఆరు నెలల కాలంలో కంపెనీ మొత్తం 1,42,139 వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాదితో చూస్తే బలమైన వృద్ధి అని చెప్పవచ్చు. గత సంవత్సరం ఇదే సమయంలో 1,26,137 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి 12.7 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ఈ అమ్మకాలు కియా బ్రాండ్‌పై వినియోగదారుల నమ్మకాన్ని తెలియజేస్తున్నాయి. మన దేశంలో తయారైన కియా కార్లకు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. 2025 మొదటి అర్ధభాగంలోనే కంపెనీ 11,813 వాహనాలను విదేశాలకు ఎగుమతి చేసింది.

త్వరలో సుజుకి ఈ-యాక్సెస్ వస్తోంది.. రూ.లక్ష లోపే ఎలక్ట్రిక్ స్కూటర్

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రస్తుతం టూ వీలర్ తయారీలో టాప్ కంపెనీగా దూసుకుపోతోంది. దేశీయ మార్కెట్‌లో యాక్సెస్ 125, అవేనిస్ 125, బర్గ్‌మన్ స్ట్రీట్ 125 వంటి అనేక స్కూటర్లను, బైక్‌లను విజయవంతంగా విక్రయిస్తోంది. గత నెలలో కూడా కంపెనీ టూవీలర్లు భారీ సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఏకంగా 95,244 యూనిట్లను కస్టమర్లు కొనుగోలు చేశారు. 2024లో ఇదే సమయంలో 88,287 యూనిట్లు అమ్ముడయ్యాయి. దీనితో పోలిస్తే అమ్మకాల పరిమాణం ఏడాదికి 8 శాతం వృద్ధిని నమోదు చేసింది.

భారత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ రికార్డు అమ్మకాలు.. జూన్‌లో 22 శాతం వృద్ధి

యూత్‌తో పాటు పెద్ద వయస్సుల వారని అట్రాక్ట్ చేసే బైకులను విడుదల చేయడంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (royal enfield) దశాబ్ద కాలంగా ప్రసిద్ధి చెందిన కంపెనీ. దీని నుంచి మార్కెట్లోకి ఒక మోడల్ వచ్చిందంటే చాలు, దాని గురించి జనాలు ఎంతో ఆసక్తి కనబరుస్తారు. డుగ్గు డుగ్గు అంటూ సౌండ్ చేసుకుంటూ రోడ్లపై దూసుకుపోవడంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులకు పెట్టింది పేరు. తాజాగా కంపెనీ జూన్ 2025కు సంబంధించిన సేల్స్ నివేదికను విడుదల చేసింది. ఈ నెలలో కంపెనీ దేశీయ మార్కెట్లో 76,957 బైక్‌లను విక్రయించడం ద్వారా మళ్లీ తన సత్తా చాటింది. ఇది గత సంవత్సరం అదే నెలతో పోలిస్తే సగటున 16 శాతం వృద్ధిని సూచిస్తోంది. వినియోగదారుల నుంచి పొందుతున్న నమ్మకం, ప్రీమియం మోటర్‌సైకిల్ విభాగంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ పెరుగుతున్న ప్రాధాన్యత అమ్మకాలు పెరగడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

మారుతి, హ్యుందాయ్‌లకు షాక్.. చిన్న కార్ల అమ్మకాలు డౌన్

భారత మార్కెట్లో ప్రస్తుతం చాలా అద్భుతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, జూన్ 2025లో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు ఆశించినంతగా లేవు. దేశంలో అత్యధిక కార్లను విక్రయించే రెండు పెద్ద కంపెనీలు మారుతి, హ్యుందాయ్ అమ్మకాలు తగ్గాయి. చిన్న కార్ల అమ్మకాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ విభాగంలో మారుతి 13%, హ్యుందాయ్ 12% అమ్మకాల్లో పతనం నమోదైంది.
Advertisement

ఒక్క నెలలో 15వేలకుపైగా యూనిట్లు.. జూన్ 2025 సేల్స్ రికార్డు

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (HMIL) భారత మార్కెట్లో సత్తా చాటుతుంది. తన ప్రసిద్ధ మోడల్ SUV అయిన క్రెటా (Creta) ద్వారా మరోసారి తన దూకుడు ఏమిటో చూపించింది. క్రెటా కారు 2025లో ఈ మోడల్ దేశంలోని అత్యధికంగా అమ్ముడైన SUVగా అవతరించింది. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, ఇది జూన్ 2025లో కేవలం ఒక్క నెలలోనే మొత్తం 15,786 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత నెలకొంది.ఇలాంటి సమయంలో ఒక కారు ఇన్ని అమ్మకాలను నమోదు చేయడం అంటే విశేషం అని చెప్పాలి. ఈ నెలలోనే కాకుండా 2025 ఏడాది మొదలు జనవరి నుంచి జూన్ వరకు (H1 కాలం) క్రెటా భారత్‌లో అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది.

హీరో, బజాజ్.. తక్కువ ధరలో దొరికే ABS బైక్స్ ఇవే

రోడ్లపై బైక్ నడుపుతున్నప్పుడు అకస్మాత్తుగా బ్రేక్ వేయాల్సి వస్తే, బైక్ అదుపు తప్పి జారిపడే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి ఏబీఎస్ అనే సేఫ్టీ ఫీచర్ బైక్‌లలో చాలా ముఖ్యం. ముఖ్యంగా, భారతదేశంలోని రోడ్లు కొన్నిసార్లు సరిగా లేకపోవడం వల్ల ఈ ఫీచర్ మరింత ఉపయోగపడుతుంది. మీరు తక్కువ బడ్జెట్‌లో ఏబీఎస్ ఉన్న బైక్ కొనాలని చూస్తున్నారా? అయితే, భారతదేశంలో సింగిల్-ఛానెల్ ఏబీఎస్‎తో వచ్చే ఐదు చౌకైన బైక్‌ల గురించి తెలుసుకుందాం.

వరుసగా మూడో నెల.. ఓలాను దాటేసిన సంప్రదాయ కంపెనీలు

దేశంలోని సంప్రదాయ టూ-వీలర్ కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల రేసులో దూసుకుపోతున్నాయి. టీవీఎస్ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ ఐక్యూబ్ వరుసగా మూడో నెలలోనూ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎలక్ట్రిక్ టూ-వీలర్‌గా నిలిచింది. విశేషం ఏమిటంటే, రెండో స్థానంలో బజాజ్ ఆటో ఉంది. ఒకప్పుడు ఈ విభాగంలో రాజులా వెలుగొందిన ఓలా ఎలక్ట్రిక్ ఇప్పుడు మూడో స్థానానికి పడిపోయింది.

పెట్రోల్, డీజిల్‌ను మర్చిపోయి సీఎన్జీ వైపు ప్రజలు.. 2025లో అమ్మకాల జోరు!

మారుతీ సుజుకీ భారతీయ కారు మార్కెట్లో తనదైన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. మొత్తం కార్ల అమ్మకాలలో సగం వాటా దాదాపు 50 శాతం మారుతీ సుజుకీ ఖాతాలోనే చేరడం, ఈ బ్రాండ్‌కి ఉన్న విస్తృత ప్రజాదరణకు నిదర్శనం. రెండు కార్లు అమ్ముడైతే, వాటిలో ఒకటి మారుతీ సుజుకీకి చెందినదే అవుతుందన్నది సాధారణంగా వినిపించే మాట. 2025 ఆర్థిక సంవత్సరంలో, మారుతీ సుజుకీకి ఫ్యామిలీ వినియోగదారుల నుంచి మరింత ఆదరణ లభించింది. ముఖ్యంగా, పెద్ద కుటుంబాల కోసం రూపొందించిన 7-సీటర్ మోడళ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. పెట్రోల్ ధరల పెరుగుదల, ఆపరేటింగ్ ఖర్చులపై ఎక్కువ ఖర్చు చేయాలన్న ఆలోచనతో, వినియోగదారులు సీఎన్జీ (Cng) వాహనాల వైపుకు మరింతగా మొగ్గు చూపుతున్నారు.
Advertisement

ఒక్కసారి ఛార్జ్ చేస్తే తిరుగులేదు.. ఎర్టిగాకు షాక్.. కియా కారెన్స్ ఈవీ వచ్చేస్తోంది

ఇండియాలో 7-సీటర్ MPV సెగ్మెంట్‌లో కియా కారెన్స్ తన సత్తా చాటింది. మారుతి సుజుకి ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి వాటితో పోటీపడి, తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇటీవల, కారెన్స్ క్లావిస్ పేరుతో కొత్తగా ముస్తాబై మార్కెట్‌లోకి వచ్చింది. పాత మోడల్ కన్నా మరింత ప్రీమియంగా వచ్చిన ఈ కియా 7-సీటర్‌ను ప్రజలు బాగా ఆదరించారు.

రెండు కుటుంబాలకే సూపర్ సేఫ్ కారు.. బుల్లెట్ ప్రూఫ్ బాడీ, 27కి.మీ మైలేజ్!

భారతదేశంలో పేద, మధ్య తరగతి వారికి అనుకూలంగా ఉండేలా అందుబాటు ధరలో, అత్యాధునిక ఫీచర్స్ అందిస్తూ మంచి పెర్ఫామెన్స్ అందించే కార్లను విడుదల చేయడంలో ఎప్పుడు ముందు ఉంటుంది మారుతీ సుజుకీ (Maruti Suzuki). కంపెనీ వ్యాన్ విభాగంలో విక్రయిస్తున్న ఒకే ఒక ఎంపీవీ మోడల్ ఈకో (Eeco) మాత్రమే. తాజాగా ఈ మోడల్ జూన్ నెలలో నమోదు చేసిన అమ్మకాలను మారుతీ విడుదల విడుదల చేసింది. సేల్స్ డేటా ప్రకారం, ఈకో జూన్ 2025లో 9,340 యూనిట్లు అమ్ముడుపోయింది. ఇది గత ఏడాది అంటే, 2024 జూన్‌లో అమ్ముడైన 10,771 యూనిట్లతో పోలిస్తే ఇది స్వల్ప తగ్గుదల మాత్రమే. రానున్నరోజుల్లో ఇది తిరిగి పుంజుకునే అవకాశం ఉంది.

పెట్రోల్ అయిపోయి.. ఊపిరాడక.. తిరుపతిలో షాకింగ్ డెత్స్.. కారణం ఏంటంటే!

తిరుపతి జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ కారులో నిద్రించిన ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. ఆదివారం రాత్రి ఈ ఘటన జరగ్గా, సోమవారం ఉదయం విషయం వెలుగులోకి వచ్చింది. వారి నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తెచ్చిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒక లక్ష యూనిట్ల మార్కును దాటిన రిజ్టా.. ఇప్పుడు 3.7kWh బ్యాటరీతో కొత్త అవతారం!

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ రంగాన్ని కొత్త దిశలో నడిపిస్తున్న ఏథర్ ఎనర్జీ (Ather Energy) తాజాగా, కొత్త 'రిజ్టా ఎస్ (Rizta s)'ను 3.7kWh బ్యాటరీ ప్యాక్‌తో విడుదల చేసింది. ఇది రోజువారీ ప్రయాణికులకు, లాంగ్ రేంజ్ స్కూటర్‌గా ఇది నిలుస్తుందని ఏథర్ ప్రకటించింది. దీనిని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేసినట్లయితే దాదాపు 159 కి.మీ.ల IDC రేంజ్ అందిస్తుంది. ఏథర్ రిజ్టా మొదట 2024లో ఫ్యామిలీ స్కూటర్‌గా ప్రవేశపెట్టబడింది. రోజూ ఆఫీసు, బడి, షాపింగ్ వంటి అవసరాలకు ఉపయోగపడేలా, సౌలభ్యం, భద్రత, నాణ్యతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ దీనిని రూపొందించారు. రాజీ లేకుండా ఎక్కువ రేంజ్, అదే సమయంలో వినియోగదారుల కష్టాలు తక్కువయ్యేలా, సమర్థవంతమైన టెక్నాలజీ అందించడం ఈ వేరియంట్ ప్రధాన లక్ష్యం.
Advertisement

మహీంద్రాకు కార్ల కంటే ట్రాక్టర్లే కిక్ ఇస్తున్నాయా?.. సేల్స్ రిపోర్ట్ షాకింగ్

మహీంద్రా కంపెనీ గత జూన్ నెలలో ఏకంగా 47 వేల వాహనాలను విక్రయించింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 18% వృద్ధిని సూచిస్తోంది. ఈ అమ్మకాల వివరాలను కంపెనీ ఇప్పుడు విడుదల చేసింది. భారత మార్కెట్‌లో మహీంద్రా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. ముఖ్యంగా ఎస్‌యూవీ కార్లు మంచి అమ్మకాలను నమోదు చేయగా, ఎగుమతులు కూడా బాగానే ఉన్నాయి.

622 కి.మీ రేంజ్‌తో కొత్త స్టెల్త్ ఎడిషన్.. టాటా హారియర్ EV ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు ఇవే

ప్రముఖ కార్ల తయారీదారు అయినటువంటి టాటా మోటార్స్ (tata motors) కొత్తగా 2025 టాటా హారియర్ EV ని కొత్త రూపంలో విడుదల చేసింది. దీని పేరు స్టెల్త్ ఎడిషన్ (Stealth Edition). ఇది పూర్తి స్థాయిలో టాప్-స్పెక్ ఎంపవర్డ్ వేరియంట్‌పై అందుబాటులో ఉంది. టాటా మోటార్స్ దీని ధరను రూ.28.24 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. ప్రీమియమ్ బ్లాక్ అవతారం, అత్యాధునిక సౌకర్యాలు, ఎలక్ట్రిక్ డ్రైవ్‌ట్రైన్‌తో కలిపి, ఇది భారత మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ SUV లలో ఒక విశిష్టమైన స్థానం ఆక్రమిస్తుందని చెప్పవచ్చు. ఇది మొత్తం మ్యాట్ ఫినిషింగ్ స్టెల్త్ బ్లాక్ బాడీ పెయింట్‌తో ఒరిజినల్, అసాధారణమైన లుక్‌ను అందిస్తుంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ సరికొత్తగా అనిపిస్తుంది. ఇంటీరియర్‌లో కూడా బ్లాక్ థీమ్ బాగా ఆకట్టుకుంటుంది.

టెన్షన్ పెంచుతున్న జూన్ లెక్కలు.. ఎన్ని కార్లు అమ్మినా మారుతికి లాభం రాలేదట?

కొత్త నెల స్టార్ట్ కాగానే వాహనాల కంపెనీలు తమ సేల్స్ రిపోర్ట్‌లను విడుదల చేయడం మొదలుపెట్టాయి. భారత మార్కెట్‌లో ఎప్పటిలాగే మారుతి సుజుకి నంబర్ వన్ స్థానంలో ఉంది. అయినా కూడా, గత కొన్ని నెలలుగా దేశీయంగా కార్ల అమ్మకాలు తగ్గుతుండడం కంపెనీకి పెద్ద తలనొప్పిగా మారింది. 2025 జూన్‌లో మారుతి సుజుకి మొత్తం 1,67,993 వాహనాలను అమ్మింది.

జూన్‌లో 4 లక్షల వాహనాల అమ్మకాలు.. TVS మోటార్ 20% వృద్ధితో సరికొత్త రికార్డు!

ప్రముఖ వాహన తయారీదారు టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ ఇటీవలి కాలంలో అమ్మకాల పరంగా మెరుగ్గా దూసుకుపోతుంది. తాజాగా జూన్ నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ తన సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, జూన్ 2025 నెలలో మొత్తం (టూ+త్రీవీలర్) నెలవారీ అమ్మకాలు 4,02,001 యూనిట్లకు చేరుకున్నాయి, ఇది గత సంవత్సరం జూన్‌లో నమోదైన 3,33,646 యూనిట్లతో పోలిస్తే దాదాపు 20 శాతం వృద్ధి. సమీక్ష నెల టీవీఎస్ మోటార్‌కు మరొక పెద్ద విజయాన్ని తీసుకొచ్చింది. టీవీఎస్ టూవీలర్ విభాగం కూడా ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించింది. జూన్ 2024లో 3,22,168 యూనిట్లు విక్రయించగా, జూన్ 2025లో ఈ సంఖ్య 3,85,698 యూనిట్లకు పెరిగింది. ఈ విభాగం 20 శాతం వృద్ధిను సొంతం చేసుకోవడం కంపెనీ స్థిరమైన డిమాండ్‌ను చాటుతుంది.
Advertisement

కేవలం రూ.59 వేలకే హీరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫ్యామిలీకి, స్టైల్‌కి, రేంజ్‌కి కొత్త రూపం

భారతదేశపు దిగ్గజ టూవీలకర్ వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన ఎలక్ట్రిక్ వాహన ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ, కొత్త మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. కొంతకాలం క్రితం, విడా (Vida) బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ విభాగాన్ని ఏర్పాటు చేసి, V1 స్కూటర్‌ను వినియోగదారులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, దీనికి 2 అనే కొత్త పేరును పెట్టినప్పటికీ, టెక్నికల్ స్పెసిఫికేషన్లలో పెద్ద మార్పులు జరగలేదు. ఇప్పుడు మరింత మందికి చేరవకావడానికి హీరో కొత్త మోడల్ విడా వీఎక్స్2 (Vida Vx2)ను తాజాగా విడుదల చేసింది. ఈ స్కూటర్‌ను తీసుకురావడానికి ముందు ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికర చర్చలు జరిగాయి. అంచనాలకు తగ్గట్టే, ఈ స్కూటర్‌ను అత్యంత ఆకర్షణీయమైన ధరలో అందుబాటులోకి తీసుకువచ్చారు.

కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నవారికి కూడా డ్రైవింగ్ లైసెన్స్ వస్తుందా?.. రూల్స్ ఇవే

కారు నడుపుతున్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ చాలా ముఖ్యం. డ్రైవింగ్ లైసెన్స్‌కు సంబంధించి అనేక రూల్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొందరిలో ఓ ప్రశ్న తలెత్తుతుంది. కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నవారికి డ్రైవింగ్ లైసెన్స్ లభిస్తుందా? దీనికి సంబంధించిన నియమాలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్‌కు గడ్డుకాలం..కొత్త కారు వైపు పరుగులు పెడుతున్న జనం

తక్కువ ధర, త్వరగా డెలివరీ అని ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ భారతదేశ ఆటో సెక్టార్‌లో ఒక సంచలనం సృష్టించింది. కానీ తాజా సర్వే ప్రకారం.. ఆ నమ్మకం ఇప్పుడు సన్నగిల్లుతోంది. పార్క్‌+ రీసెర్చ్ ల్యాబ్స్ నివేదిక ప్రకారం, కొత్త కారు కొనేవారిలో ప్రతి 10 మందిలో 8 మంది ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ల వైపు చూడడం లేదు. అసలు ఏం మారింది? వివరంగా తెలుసుకుందాం.

టీవీఎస్ ఐక్యూబ్ 2025 కొత్త వెర్షన్ వచ్చేసింది.. ప్రత్యేకమైన బ్యాటరీ ఆప్షన్, సూపర్ ఫీచర్లు

టీవీఎస్ మోటార్ కంపెనీ నుంచి విడుదలైన ప్రముఖ వాహనాల్లో ఐక్యూబ్ (iQube) ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి. ఇప్పటికే దీనిని వేలాది మంది వినియోగదారులు ఎటువంటి పెద్ద ఫిర్యాదులు లేకుండా దీన్ని రోజువారి అవసరాల కోసం ఉపయోగిస్తుండటం గమనార్హం. సాధారణ టూవీలర్ల మాదిరిగాకుండా, ఇది సౌకర్యం, సాంకేతికత, సామర్థ్యం, అన్నింటిని సమానంగా కలగలిపి మార్కెట్లో మంచి ఆదరణ సంపాదిస్తుంది. అయితే టీవీఎస్ దీన్ని మరింత మంది వినియోగదారులకు చేరువచేయడానికి తాజాగా 2025 ఎడిషన్ iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారత మార్కెట్లో పరిచయం చేసింది. పాత దానితో పోలిస్తే, ఈ కొత్త మోడల్‌లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ప్రధానంగా ఈ స్కూటర్‌లో 3.1 kWh బ్యాటరీ ప్యాక్‌‌ను అందించి విడుదల చేశారు. మధ్యతరగతి కుటుంబాలకి అందుబాటులో ఉండే ధరలో రూ.1.05 లక్షల ఎక్స్ షోరూమ్ ధరకు దీన్ని తీసుకొచ్చింది.
Advertisement

ఏథర్ కొత్త ప్లాన్: స్కూటర్ ధర సగానికి సగం తగ్గబోతుంది!

ఏథర్ కంపెనీ భారతదేశంలో బ్యాటరీని సర్వీస్ పద్ధతిలో అందించే కొత్త పథకాన్ని తీసుకురాబోతున్నట్లు ప్రకటించింది. దీనివల్ల వాహనం ధర 40 శాతం కంటే ఎక్కువ తగ్గుతుందని తెలుస్తోంది. ఇది ఎలా సాధ్యం? బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ అంటే ఏమిటి? దీని గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.