టాటా కర్వ్ డార్క్ ఎడిషన్.. ధర, డిజైన్, టాప్ ఫీచర్లు ఇవే

సేఫ్టీ పరంగా అత్యంత నమ్మకమైన కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల ఫ్లాగ్‌షిప్ కూపే SUV అయిన టాటా కర్వ్‌ కారును ప్రత్యేకమైన డార్క్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన బాడీ డిజైన్, కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ, ఇంటీరియర్ లగ్జరీ ఫీచర్స్‌తో కూడిన ఈ మోడల్ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఈ SUV పెట్రోల్/డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇన్ని పవర్‌ట్రెయిన్‌లో లభించడం వలన కస్టమర్లకు మల్టిపుల్ ఆప్షన్లను ఎంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. . ఇది మార్కెట్లో SUV ప్రియులకు ఒక కొత్త డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది. ఈ కారు గురించిన ఫీచర్స్ గురించి పూర్తి వివరాలను కింది కథనంలో తెలుసుకుందాం.

బెస్ట్ ఎస్‌యూవీ కొనాలని ఉందా? నెలవారీ EMI ఎంత? మీ శాలరీ ఎంత ఉండాలి?

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన మన దేశంలో ప్రస్తుతం స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలకు (ఎస్‌యూవీ) మంచి డిమాండ్ ఉంది. గణాంకాల ప్రకారం.. భారతదేశంలో అమ్ముడవుతున్న కార్లలో దాదాపు సగం ఎస్‌యూవీలే. అయితే, టాప్ 5 ఎస్‌యూవీల జాబితాలో పెద్దగా మార్పులు ఉండవు.

యాక్టివాకు చెక్ పెట్టేందుకు సుజుకి బంపర్ ఆఫర్.. రూ. 5,000 క్యాష్‌బ్యాక్, 100% లోన్!

భారతీయులకు స్కూటర్లంటే ఎంత మోజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాటి వినియోగ సౌలభ్యం, మోటార్‌సైకిళ్ల కంటే ఎక్కువ ప్రాక్టికల్‌గా ఉండడం వల్లనే ఆడ, మగ తేడా లేకుండా అందరూ స్కూటర్లను ఇష్టపడుతున్నారు. ఒకప్పుడు హోండా యాక్టివా, సుజుకి యాక్సెస్ వంటి కొన్ని కంపెనీలు మాత్రమే గేర్‌లెస్ మోడళ్లను మార్కెట్లోకి రిలీజ్ చేసేవి.

జాయ్ ఈ-బైక్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై భారీ డిస్కౌంట్.. రూ.14,251 వరకు తగ్గింపు

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ ప్రస్తుతం వేగంగా విస్తరిస్తోంది. ఓలా, ఏథర్ వంటి ఈవీ దిగ్గజ కంపెనీలు దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌పై కన్నేసి పోటా పోటీగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన వాహనాలను విడుదల చేస్తున్నాయి. వీటికి పోటీగా మరో కంపెనీ కూడా తన లాంచ్‌లతో దూసుకుపోతుంది. అదే జాయ్ ఈవీ తయారీదారు. వార్డ్ విజార్డ్ ఇన్నోవేషన్స్ అండ్ మొబిలిటీ లిమిటెడ్ ఆధ్వర్యంలోని జాయ్ ఈ-బైక్, భారతీయ మార్కెట్‌లో తన ప్రత్యేకతను చూపించేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం, ఈ కంపెనీ తన పోటీదారులపై ఒత్తిడి పెంచేలా మరోసారి ముందుకు వచ్చింది. ప్రజాధారణ పొందిన తన అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేకంగా డిస్కౌంట్లు ప్రకటించింది. తక్కువ ధరలో ఎలక్ట్రిక్ టూవీలర్ కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు కంపెనీ గొప్ప అవకాశాన్ని అందిస్తోంది.
Advertisement

నెక్సా షోరూమ్‌లోనూ నో రెస్పాన్స్! మారుతి ఇగ్నిస్‌కు ఏం జరిగింది?

భారతీయ మార్కెట్‌లో మారుతి సుజుకి కార్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఆ కంపెనీ కార్లు ప్రతి నెలా భారీ సంఖ్యలో అమ్ముడవుతున్నప్పటికీ కొన్ని మోడళ్లు మాత్రం అమ్మకాల్లో వెనుకబడి ఉన్నాయి. అలాంటి కార్లలో ఒకటి మారుతి సుజుకి ఇగ్నిస్ కూడా ఒకటి. ఈ కారు అమ్మకాలు నెలనెలా నిరాశ కలిగిస్తున్నాయి. తాజాగా 2025 మార్చి నెలలో కూడా ఇగ్నిస్ అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. అసలేం జరిగిందో కథనంలో తెలుసుకుందాం.

ఇది కేవలం టెస్ట్ మోడల్ కాదు… ఫ్యూచర్ జావా గేమ్‌చేంజర్!

జావా మోటార్ సైకిల్స్ (jawa motorcycles) చాలా కాలంగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన టూవీలర్స్‌ను విడుదల చేస్తుంది. తాజాగా విడుదల చేసిన '42 FJ' మోడల్‌ ఇప్పుడు బైక్ ప్రేమికుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది సెప్టెంబర్ 2024లో లాంచ్ అయిన జావా 42 సిరీస్‌కు కొనసాగింపు కాగా, సరికొత్త డిజైన్, సాంకేతికత పరంగా కొన్ని ఆసక్తికరమైన అప్‌డేట్‌‌లతో మార్కెట్లోకి వచ్చింది. సింగిల్ సిలిండర్ ఇంజిన్‌తో కూడిన ఈ బైక్, డబుల్ ఎగ్జాస్ట్ పైపులు కలిగిన రూపంలో మొదట పరిచయం కావడం వలన చాలా మంది యువత దృష్టిని ఇది ఆకర్షించింది. రెండు వైపులా పైపులు రావడం ఈ సెగ్మెంట్‌లో ఉన్న బైక్‌లలో చాలా రేర్‌గా ఉంటే, జావా ఈ ఫీచర్‌తో 42 FJ ను ప్రత్యేకంగా నిలిపింది.

బెస్ట్ ఆల్టర్నేటివ్స్! మారుతి ఆల్టో కె10కి ఈ కార్లు మంచి ఛాయిస్!

మారుతి సుజుకి ఆల్టో కె10 ఒకప్పుడు పేదల కారుగా బాగా ప్రాచుర్యం పొందిన బాగా హ్యాచ్‌బ్యాక్. దీని ధర రూ. 4.23 లక్షల నుంచి రూ. 6.21 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇది 1-లీటర్ పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్‌లతో వస్తుంది. మైలేజ్ కూడా 24.39 నుండి 33.85 కిలోమీటర్ల వరకు ఉంటుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు చాలా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

త్వరలో భారత మార్కెట్‌లోకి కియా సెల్టోస్ హైబ్రిడ్

భారతదేశంలో కార్ల మార్కెట్ గత పదేళ్లలో గణనీయమైన వృద్ధిని సాధించింది. ఒకప్పుడు పెట్రోల్, డీజిల్ వాహనాలే రోడ్డుపై ఎక్కువగా కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మెల్లగా మారుతోంది. పర్యావరణంపై ప్రభావం, ఇంధన ధరల పెరుగుదల వంటి అంశాల నేపథ్యంలో వినియోగదారుల ఆసక్తి కొత్త టెక్నాలజీలవైపు మళ్లుతోంది. ఈ పరిణామంలో హైబ్రిడ్ కార్లు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. ఇవి పెట్రోల్/డీజిల్‌తో పాటు బ్యాటరీ ద్వారా కూడా నడుస్తాయి. ఈ రెండింటి కలయిక ద్వారా కారు మరింత సమర్థవంతంగా పని చేయడమే కాక, అధిక మైలేజ్ కూడా ఇస్తోంది. ఈ హైబ్రిడ్ వాహనాలు, భారత వినియోగదారులను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నాయి. పేద, మధ్య తరగతి అన్నివర్గాల వారూ ఇప్పుడు హైబ్రిడ్ టెక్నాలజీపై ఆసక్తిగా ఉన్నారు. ముఖ్యంగా రోజువారీ ప్రయాణాల కోసం మైలేజ్‌కి ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు, బెస్ట్ ఎంపికగా మారాయి.
Advertisement

భారత్‌లో అత్యంత సురక్షితమైన కార్లు ఇవే!

మనదేశంలో వాహనాల భద్రతా ప్రమాణాలను పరీక్షించే సంస్థగా భారత్ NCAP (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) గుర్తింపు పొందింది. ఇది వివిధ ప్రమాణాల ఆధారంగా కార్లకు సేఫ్టీ రేంటింగ్ ఇస్తుంది. తాజాగా, దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని కార్లను అత్యంత సురక్షితమైనవిగా భారత్ NCAP ప్రకటించింది.

యాడ్ వల్ల బిగ్ షాక్ తిన్న బెంగళూరు.. కోర్టులోకి దూసుకెళ్లిన ఓనర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కేవలం టోర్నమెంట్‌ కాదు, భారతదేశంలో క్రికెట్‌ను పండుగలా మారుస్తుంది. ఐపీఎల్‌లో ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయల మార్కెట్ జరుగుతుంది. ప్రపంచంలోని అత్యంత లాభదాయకమైన లీగ్‌గా పేరుంది. స్టార్ ఆటగాళ్లు, ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు, అభిమానుల హోరాహోరీ.. ఈ అన్ని కలసి ఐపీఎల్‌ను ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఈ ఏడాది ఐపీఎల్ తన 18వ సీజన్‌లో అడుగుపెడుతోంది. ఈ లీగ్‌లో దేశంలోని 10 ప్రధాన నగరాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 10 ఫ్రాంచైజీలు పాల్గొంటున్నాయి. వీటిలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఉంది. ఈ జట్టు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటిగా నిలిచింది. విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాళ్లతో ఇది చాలా మంది ఫేవరెట్ టీంగా ఉంది.

మారుతీ మాస్టర్ ప్లాన్! త్వరలో మార్కెట్లోకి కొత్త EVలు, హైబ్రిడ్ కార్లు

మారుతీ సుజుకీ (Maruti Suzuki) ఇండియా ఆటోమొబైల్ రంగంలో తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రత్యేకంగా హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి పెట్టింది. మారుతున్న మార్కెట్ అవసరాలకు తగ్గట్టు పలు మోడళ్లను విడుదల చేయాలని చూస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో టయోటా, టాటా మోటార్స్, మహీంద్రా లాంటి కంపెనీలు తమ తమ ఎలక్ట్రిక్ కార్లతో దూసుకుపోతుండగా, మారుతీ కూడా అదే పోటీలో నిలవాలని గట్టి ప్రయత్నాల్లో ఉంది. ముఖ్యంగా కంపెనీ రాబోయే కాలంలో ఐదు కొత్త కార్లు మార్కెట్‌‌లోకి విడుదల చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ఈ కార్లలో కొన్ని హైబ్రిడ్ మోడళ్లైతే, మరికొన్ని పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండనున్నాయి. ఈ కొత్త కార్లపై వినియోగదారులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. రాబోయే ఆ మోడళ్ల గురించి కింద మరింత తెలుసుకుందాం.

మారుతి మాస్టర్ ప్లాన్.. ఎలక్ట్రిక్ కారుకు 10 ఏళ్ల వారంటీ.. ఇక పోటీదారులకు చుక్కలే!

భారతదేశపు ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌లో టాటా, మహీంద్రా, ఎంజీ దూసుకుపోతున్నాయి. దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే ఎస్‌యూవీ క్రెటా కూడా ఎలక్ట్రిక్ అవతారంలో వచ్చేసింది. కానీ అందరూ ఎదురుచూస్తున్నది మాత్రం మారుతి సుజుకి ఎంట్రీ కోసమే.
Advertisement

కస్టమర్ నమ్మకాన్ని కోల్పోతున్న ఎస్-ప్రెస్సో..? విక్రయాల్లో భారీ క్షీణత!

భారతదేశంలో మారుతీ సుజుకీ బ్రాండ్ అంటేనే చాలా మందికి పేదల బడ్జెట్‌కు అనుగుణంగా తక్కువ ధరలో కార్లను విడుదల చేసే తయారీ కంపెనీగా పేరుంది. అనుకూలమైన ధర, నిర్వహణ ఖర్చులు తక్కువ స్థాయిలో ఉండటం, ఎక్కువ మైలేజ్ ఇవ్వడం వల్ల మారుతీ సుజుకీ కార్లను జనాలు సాధారణంగా ఎగబడి మరి కొంటున్నారు. ఇటీవల మార్చి నెల ముగిసిన నేపథ్యంలో కంపెనీ తన సేల్స్ వివరాలను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఎస్-ప్రెస్సో (S-Presso)కు సంబంధించిన అమ్మకాల గణంకాలను వెల్లడించింది. ఈ కారు వినియోగదారులను ఆకర్షించడంలో చాలా ఇబ్బంది పడుతుంది. బలమైన పోటీ నేపథ్యంలో ఎస్-ప్రెస్సో ఆశించిన స్థాయిలో నిలబడలేకపోయింది.

కేటీఎమ్‌కు చెక్ పెట్టేందుకు టీవీఎస్ సంచలనం.. కొత్త అపాచే RR 310 వచ్చేసింది!

మనదేశంలో స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో టీవీఎస్ విడుదల చేసిన ఓ సెన్సేషన్ అపాచీ RR 310. మార్కెట్‌లో ఇది పెద్దగా సంచలనం సృష్టించలేకపోయినా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చాలామంది దీనిని 'పేదల డుకాటీ' అని ముద్దుగా పిలుచుకుంటారు. వినియోగదారుల అవసరాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ మార్పులు చేయడంలో టీవీఎస్ ముందుంటుంది.

హోండా అదిరిపోయే ఆఫర్.. యాక్టివా కొంటే మూడేళ్లు ఫ్రీ.. అదనంగా రూ.5,500కూడా

స్కూటర్ల రారాజు హోండా యాక్టివా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏ గెయిర్ లెస్ స్కూటర్ కొనాలన్నా చాలామంది మొదటిగా అడిగేది 'యాక్టివా తీసుకున్నావా?' అనే! కైనెటిక్ హోండా తర్వాత దేశంలో విప్లవం సృష్టించిన ఈ మోడల్ ఇప్పటికీ హాట్ కేక్‌లా అమ్ముడవుతోంది.

మారుతీ సెలెరియోకు ఝలక్! అమ్మకాల్లో భారీ తగ్గుదల

ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (Maruti Suzuki) తాజాగా మార్చి నెలకు సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేస్తుంది. అందులో భాగంగా ప్రసిద్ధ హ్యాచ్‌బ్యాక్ మోడల్ సెలెరియో (Celerio) మార్చి 2025లో ఆశించిన మేరకు అమ్మకాలను సాధించలేకపోయింది. గతంలో ఈ కారును కొనుగోలు చేయడానికి చాలా మంది మారుతీ షోరూమ్‌ల ముందు క్యూ కట్టేవారు. కానీ కాలక్రమేణా వినియోగదారుల అభిరుచులు మారుతుండటంతో పాటు, మార్కెట్‌లో కొత్త మోడళ్ల రాక, పెరిగిన పోటీకి కారణంగా అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. చిన్న బడ్జెట్‌లో స్టైలిష్ డిజైన్, మైలేజ్ పరంగా సెలెరియో కారు చాలా మంది మధ్యతరగతి భారతీయులకు ఫేవరెట్ మోడల్.
Advertisement

నింజా అభిమానులకు గుడ్‌న్యూస్! కవాసకి 2025 650 KRT ఎడిషన్ లాంచ్

భారత టూవీలర్ విభాగంలో కవాసకి (Kawasaki) పేరు చెప్పగానే ప్రీమియం బైక్స్ గుర్తుకువస్తాయి. దేశీయంగా ఉన్నటువంటి దిగ్గజ టూవీలర్ కంపెనీలకు ధీటుగా యువతను ఎక్కువగా టార్గెట్ చేస్తూ అదిరిపోయే మోడళ్లను విడుదల చేస్తుంది. ఓ సమయంలో బజాజ్‌తో కలిసి విడుదలైన 'కాలిబర్' మోడల్‌తో ఇండియన్ రోడ్లపై అడుగుపెట్టిన కవాసకి, అప్పటి నుంచి తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ముందుకు సాగుతోంది. ఆ కాలిబర్ నెమ్మదిగా చరిత్రలో నిలిచిపోగా, నింజా సిరీస్ ఆ బ్రాండ్‌కు పూర్తిగా కొత్త ముఖాన్ని ఇచ్చింది. ఇప్పుడు కవాసకి, డుకాటి, ట్రయంఫ్, BMW మోటోరాడ్ వంటి గ్లోబల్ సూపర్‌బైక్ బ్రాండ్‌లతో పోటీపడుతూ, సాంకేతికత, వేగం, స్టైల్ పరంగా తనదైన మార్కును ఏర్పరుస్తోంది. సాధారణంగా ఈ బైకుల చాలా ఖరీదులో లభిస్తాయి. అయినప్పటికి చాలా మంది యువత వీటి కోసం పోటిపడుతుంటారు.

మారుతిదే హవా! టాప్ 10లో ఎన్ని కార్లు ఉన్నాయో చూస్తే షాకవుతారు!

మనదేశంలోని ఆటోమొబైల్ పరిశ్రమ గత ఆర్థిక సంవత్సరంలో ఊహించని వృద్ధిని సాధించింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2026 ప్రారంభమైన నేపథ్యంలో గతేడాది అత్యధికంగా అమ్ముడు పోయిన కార్ల జాబితా విడుదల అయింది. ఈసారి కూడా మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. మరి గతేడాది టాప్ 10లో ఉన్న కార్లు ఏవో చూద్దాం. కొత్త కారు కొనాలనుకునే వారికి ఈ లిస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.

సన్‌రైజర్స్ యజమాని కావ్య మారన్ అదిరిపోయే కార్లు .. ఒక్కోటి కోట్లలో

దేశంలో ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. అందరు కూడా టీవీలు, ఫోన్‌లకు అతుక్కుపోయి మరి చూస్తున్నారు. మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ల సమయంలో కెమెరాలన్నీ కూడా స్టేడియంలోని గ్యాలరీలో ఒక్క వ్యక్తిని మళ్లీ మళ్లీ చూపిస్తుంటారు. ఎప్పుడూ ముఖంపై చిరునవ్వుతో అందంగా, జట్టుపై పాజిటివ్ ఎనర్జీతో కనిపిస్తూ ఉండే ఆ జట్టు యజమాని కావ్య మారన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఆమె అందంలోనే కాకుండా బిజినెస్, స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ రంగాల్లో తనదైన ముద్ర వేసింది. 32 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, అలాగే సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ (SA20) జట్లకు సహ యజమానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సేఫ్టీకి కేరాఫ్ అడ్రస్! హోండా ఎలివేట్ క్రాష్ టెస్ట్ రిపోర్ట్ చూశారా?

హోండా ఎలివేట్ (Honda Elevate) ఎట్టకేలకు భారతీయ మార్కెట్‌లోకి అడుగుపెట్టింది. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్ వంటి దిగ్గజాలు ఏలుతున్న ఈ సెగ్మెంట్‌లో తనదైన ముద్ర వేయాలని హోండా గట్టిగా ప్రయత్నిస్తోంది. తాజాగా ఈ SUV క్రాష్ టెస్ట్‌లో అద్భుతమైన ఫలితాలు సాధించింది.
Advertisement

ఇప్పుడు హోండా కార్లు కూడా CNGలో పరుగులు! పూర్తి వివరాలు ఇవే

ప్రస్తుత రోజుల్లో పెట్రోల్ ధరలు గరిష్ట స్థాయిని తాకిన నేపథ్యంలో, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల మార్పుల కారణంగా ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఎక్కువ మైలేజ్ అందించే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అధిక ఖర్చుతో కూడిన పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గిస్తూ, తక్కువ వ్యయంతో కూడిన వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో నడిచే వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ఇవి గాలి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు, ప్రభుత్వాలు కూడా ఈ మార్పును ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. కొత్తగా CNG స్టేషన్ల ఏర్పాటు, పన్ను సబ్సిడీలు వంటి విధానాల ద్వారా ఈ రంగానికి బలాన్నిచేకురుస్తుంది.

డ్రైవర్ అవసరం లేదు.. నిస్సాన్ తీసుకొస్తున్న అద్భుతమైన టెక్నాలజీ!

ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) తన తదుపరి తరం ప్రోపైలట్ టెక్నాలజీని (next generation ProPILOT technology) 2027 ఆర్థిక సంవత్సరం నుండి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. తదుపరి తరం లిడార్, వేవ్ ఏఐ (Lidar and Wayve AI) డ్రైవర్ సాఫ్ట్‌వేర్‌తో నిస్సాన్ గ్రౌండ్ ట్రూత్ పర్సెప్షన్ టెక్నాలజీని పరిచయం చేస్తోంది.

భారతీయ రైల్వేల్లో మరో వినూత్నం.. రైలులో ATM సేవలు

భారతీయ రవాణా వ్యవస్థలో రైల్వేలు ఒక ప్రముఖ స్థానం సంపాదించుకున్నాయి. దేశం అంతటా విస్తరించిన వేరు వేరు రైలు మార్గాల ద్వారా భారతీయ రైల్వేలు లక్షలాది మంది ప్రజలకు ప్రతిరోజూ సేవలందిస్తూ, వారి ప్రయాణాలను తక్కువ ఖర్చులో మరింత సౌకర్యవంతంగా అందిస్తున్నాయి. రైల్వేలు భారతదేశానికి ఒక వెన్నెముక లాంటివి. ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో ఒకటిగా భారతీయ రైల్వేలను నిలబెడుతోంది. ఇది కేవలం ప్రయాణికులకు మాత్రమే కాదు, సరుకుల రవాణాకు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వ్యవసాయం నుండి పరిశ్రమల వరకు అన్ని రంగాలకూ రైల్వేలు ముఖ్యమైన శక్తిగా ఉన్నాయి.

టెస్లా వచ్చేస్తోంది! ముంబై-పూణే హైవేపై మెరుపు వేగంతో దూసుకుపోతున్న మోడల్ వై!

టెస్లా (Tesla), అమెరికాకు చెందిన ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ. నేటి ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో అనేక టెస్లా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. ముఖ్యంగా, తీవ్రమైన పోటీ ఉన్న చైనాలో కూడా టెస్లా కార్లకు మంచి మార్కెట్ ఉంది. అందుకే అమెరికాను దాటి చైనాలో కూడా టెస్లా కార్ల ఉత్పత్తి కర్మాగారాన్ని ఏర్పాటు చేసింది.
Advertisement

చీరలోనూ చార్మింగ్‌గా.. BMW 7 సిరీస్‌లో దిశా పటానీ

ఇండియాలో సెలబ్రిటీలకు లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం అన్న సంగతి అందరికి తెలిసిందే. మార్కెట్లోకి ఏదైనా కొత్త మోడల్ విడుదల అయితే చాలు, వెంటనే దాని గురించి వాకబు చేసుకుని నచ్చినట్లయితే తమ గ్యారేజీలోకి చేర్చుకుంటారు. ఇటీవల కాలంలో పలువురు కోట్లు విలువ చేసే లగ్జరీ కార్లతో కెమెరాల కంట పడుతున్న వీడియోలు సోషల్ మీడయాలో తెగ కనిపిస్తున్నాయి. తాజాగా భారతీయ చిత్ర పరిశ్రమంలో ఇటీవల కాలంలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న దిశా పటాని ఖరీదైన BMW కంపెనీకి చెందిన కారుతో కనిపించారు. ఆమె కారు మోడల్ BMW 7 సిరీస్‌. ఇది కేవలం కార్‌ మాత్రమే కాదు, ప్రస్టేజ్, క్లాస్, టెక్నాలజీకి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ సిరీస్‌కు ఉన్న ఆదరణ సామాన్యుల నుంచే కాదు, దేశంలోని అత్యంత ప్రముఖ వ్యక్తుల నుంచి కూడా వస్తోంది.