చైనాలో తయారై భారత్‌ను షేక్ చేస్తున్న BYD సీలియన్ 7!

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతుంది. ఈ క్రమంలో దేశీయ కంపెనీలే కాకుంగా అంతర్జాతీయంగా ఉన్న ఈవీ తయారీదారులు పోటా పోటీగా మెరుగైన బ్యాటరీ పనితీరును కనబరిచే వాహనాలను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే చైనా‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ BYD (బిల్డ్ యోర్ డ్రీమ్స్) భారతదేశంలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తోంది. అధునాతన టెక్నాలజీ, డిజైన్, పనితీరు పరంగా భారత వినియోగదారులకు అనుకూలమైన ఈవీ కార్లను తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి గతంలో విడుదల అయిన సీలియన్ 7 కారు ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా నిలుస్తుంది. ఈ మోడల్ గురించిన వివరాలను కింది కథనంలో ఒకసారి చూద్దాం.

ఇన్నోవా కాదు.. 25kmpl మైలేజ్ ఇచ్చే టయోటా కారు ధర పెరిగింది! ఎంతంటే?

మనదేశంలో ప్రస్తుతం పర్యావరణ అనుకూల కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పూర్తిస్థాయి ఆదరణ ఇంకా లభించనందున, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో వస్తున్న కార్లను ప్రజలు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం వివిధ బాడీ స్టైల్స్, ధరల శ్రేణులలో హైబ్రిడ్ కార్లు అందుబాటులో ఉన్నాయి.

రెనాల్ట్ గేమ్ ఛేంజర్.. మూడేళ్లలో 5 కొత్త కార్లు.. మారుతి, టయోటాకు పోటీ తప్పదా?

ఒకప్పుడు క్విడ్, డస్టర్‌తో భారతీయ మార్కెట్‌లో సత్తా చాటిన రెనాల్ట్ సంస్థకు ఇప్పుడు పూర్వ వైభవం లేదు. కేవలం మూడు మోడళ్లతో నెట్టుకొస్తున్న ఈ ఫ్రెంచ్ కార్ల తయారీదారు అమ్మకాల పరంగా పెద్దగా పురోగతి సాధించలేకపోయింది. డస్టర్ వెళ్లిన తర్వాత అదృష్టం కూడా వెళ్ళిపోయిందని చాలా మంది భావిస్తున్నారు. త్వరలోనే ఫోర్డ్ పరిస్థితి వస్తుందని, దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని కూడా కొందరు జోస్యం చెబుతున్నారు. అయితే, అలా వెనుదిరగడానికి సిద్ధంగా లేమని రెనాల్ట్ గట్టిగా బల్లగుద్ది చెబుతోంది.

ఇండియా స్కూటర్ మార్కెట్ దుమ్మురేపింది! FY25లో అమ్మకాల్లో రికార్డు వృద్ధి

భారతీయ స్కూటర్ పరిశ్రమకు మార్చి 31, 2025తో ముగిసిన ఆర్థిక సంవత్సరం బాగా గుర్తిండిపోతుంది. ఈ ఏడాది అమ్మకాల్లో 17 శాతం గణనీయమైన వృద్ధితో, మొత్తం 68.53 లక్షల స్కూటర్లు రోడ్డెక్కాయి. ఇది ఈ రంగానికి ఒక రికార్డ్ స్థాయిగా చెప్పవచ్చు. ఇంతమంది వినియోగదారులు ఒకే ఏడాదిలో స్కూటర్‌లను కొనుగోలు చేయడం అంటే అరుదైన విషయం. ఈ గణంకాలకు ప్రధాన కారణం ప్రముఖ బ్రాండ్లు కొత్తగా, మరింత ఆకర్షణీయంగా స్కూటర్ మోడళ్లను విడుదల చేయడంతోమ పాటు, గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో స్కూటర్లకు డిమాండ్ పెరగడం బాగా కలిసొచ్చింది. ఉద్యోగాలు, విద్య, వాణిజ్య అవసరాల కోసం స్కూటర్ బాగా అనుకూలంగా ఉంటుంది. అందుకే గత ఆర్థిక సంవత్సరంలో సేల్స్ బాగా పెరిగాయి.
Advertisement

కొత్త ఫీచర్లు, కొత్త కలర్స్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 2025 వచ్చేస్తోంది!

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి గతంలో విడుదలైన హంటర్ 350 (Hunter 350) ఇప్పుడు భారతదేశంలో యువతని ఆకట్టుకుంటున్న అత్యంత ప్రజాదరణ పొందిన 350cc బైక్. క్లాసిక్ 350లాగే ఇది కూడా రాయల్ ఎన్‌ఫీల్డ్ అభిమానుల మనసులను గెలుచుకుంటోంది. దీని ధర తక్కువగా ఉండటం, అలాగే స్టైలిష్ రెట్రో డిజైన్‌తో మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా అవతరించింది. ఈ బైక్ మార్కెట్‌లో వచ్చినప్పటి నుంచి మంచి స్పందన దక్కించుకుంటూ, ఇప్పుడు దాని విభాగంలో నంబర్ వన్ బైక్‌గా నిలిచింది. అయితే, తాజాగా బైక్ మార్కెట్‌లో పోటీ బాగా పెరిగింది. హోండా, బజాజ్, జావా, TVS వంటి బ్రాండ్లు తమ తమ బైక్‌లను కొత్త ఫీచర్లతో విడుదల చేస్తూ, పోటీని పెంచుతున్నాయి.

కియా EV9.. కోటిన్నర కారు.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే

కియా కార్లు అంటేనే అదిరిపోయే ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ అని అందరికీ తెలిసిందే. కార్నివాల్ తర్వాత కియా ఇండియాలో విడుదల చేసిన మరో సంచలనం ఈ కియా EV9 ఎలక్ట్రిక్ SUV. దాదాపు రూ. 1.30 కోట్ల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదలైన ఈ భారీ కారు చాలా మంది కళ్లలో మెదలుతుంది అనడంలో సందేహం లేదు.

మారుతీ 800తో చేసిన లిమోజిన్.. రెండు ఇంజిన్లు, రెండు స్టీరింగ్‌లు!

భారత రోడ్లపై పరుగులు తీసిన తొలి కలల కార్లలో మారుతీ 800 ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. చిన్నదైనా కూడా ఇప్పటికి మంచి ఆదరణ కలిగి ఉంది. తక్కువ ధరలో లభిస్తూ, సులభమైన మెయింటనెన్స్‌తో దేశీయంగా పేద, మధ్యతరగతి ప్రజలకు ఇష్టమైన కారుగా నిలిచింది. బాగా ప్రజధారణ కలిగిన ఈ కారుకి ఇప్పుడు ఒక కొత్త రూపం లభించింది. ప్రముఖ యూట్యూబర్ దిల్‌రాజ్ సింగ్ రావత్, అతని స్నేహితుల బృందం కలిసి ఒక ప్రయోగాన్ని చేశారు. వారు రెండు మారుతి 800 కార్లను కలిపి, వాటిని ఒక పొడవైన లిమోజిన్ వాహనంగా మార్చేశారు. సాధారణంగా లిమోజిన్ అంటే చూడటానికి విలాసవంతమైన కారు అని ప్రపంచానికి తెలుసు. అయితే వారు మారుతి 800 కార్లను ఉపయోగించి కొత్తగా పొడవైన వాహనాన్ని తయారు చేశారు.

సన్‌రూఫ్‌ల కోసం ఎగబడుతున్న జనం! హ్యుందాయ్ అమ్మకాల్లో సంచలనం!

మన ఇండియన్లకు SUVలంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి సుజుకి వంటి దిగ్గజ కంపెనీలు కూడా SUV ట్రెండ్‌కు తగ్గట్టు తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. తాజాగా విడుదలైన హ్యుందాయ్ 2024-25 ఆర్థిక సంవత్సరం అమ్మకాల గణాంకాలు కూడా దేశంలో SUVల హవా ఏ విధంగా కొనసాగుతుందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
Advertisement

డాక్టర్లు, గవర్నమెంట్ ఉద్యోగుల ఫేవరెట్ కార్! రూ.4 లక్షలకే మంచి మైలేజ్

భారతదేశపు కార్ల తయారీలో అతిపెద్ద సంస్థగా అవతరించిన మారుతీ సుజుకీ (maruti suzuki)కి చెందిన ప్రసిద్ధ కార్లలో ఆల్టో K10 (alto k10) ఒకటి. ఇది దేశంలోని అన్ని వర్గాల ప్రజలలో బాగా ప్రసిద్ధి చెందిన మోడల్. ముఖ్యంగా సాధారణ మధ్యతరగతి ప్రజలకు ఫేవరెట్. ఈ చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు, సౌకర్యం, మైలేజ్, బడ్జెట్ ధరల కారణంగా ఇప్పటికీ కోట్లాదిమంది మనసు గెలుచుకుంటోంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారుకి సంబంధించిన 2024-25 ఆర్థిక సంవత్సరం అమ్మకాల గణాంకాలు విడుదలయ్యాయి. డేటా ప్రకారం, 2024 ఏప్రిల్ 1 నుండి 2025 మార్చి 31 వరకు మారుతీ సుజుకీ మొత్తం 1,02,232 ఆల్టో K10 యూనిట్లను విక్రయించింది.

స్ప్లెండర్ ప్లస్‌కు పోటీగా ఈ 5 టూ వీలర్స్.. ఏది బెస్ట్ ఆల్టర్నేటివ్? 

భారతదేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. వారి అవసరాలకు తగ్గట్లు మీడియం రేంజ్ టూ వీలర్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు. టా వీలర్ మార్కెట్లో హీరో స్ప్లెండర్ ప్లస్(Hero Splendor Plus) ఇటీవల కొన్ని అప్‌డేట్స్‌తో విడుదలైంది. ఈ కొత్త మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 79,096 నుండి గరిష్టంగా రూ. 85,001 (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

స్కోడా కైలాక్ బేస్ వేరియంట్ కోసం 5 నెలల వెయిటింగ్! ఎందుకింత డిమాండ్?

ఇండియాలో ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీగా ఉన్నటువంటి స్కోడా (Skoda) ప్రీమియం ఫీచర్స్ కలిగిన మోడళ్లను విడుదల చేస్తూ తన మార్కెట్‌ను వేగంగా విస్తరించుకుంటుంది. ప్రస్తుతం భారతీయ మధ్యతరగతి కస్టమర్లపై ఎక్కువ ఫోకస్ చేసింది. అందుకే ఇటీవల కాలంలో అందుబాటు ధరలో కార్లను విడుదల చేస్తుంది. స్కోడా తన ఇండియా 2.0 వ్యూహంలో భాగంగా బడ్జెట్ ధరలో కుషాక్, స్లావియా కార్లను తీసుకువచ్చింది. ఇవి ప్రజల నుంచి ఆశించిన మేరకు ఆదరణ పొందడంతో అమ్మకాలు బాగానే ఉన్నాయి. దీంతో స్కోడాకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. అయితే వాహన మార్కెట్ వేగంగా విస్తరిస్తుంది. దేశంలో చాలా మంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఇతర తయారీదారులు దూకుడుగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన పలు కార్లను తీసుకురావడంపై దృష్టి పెట్టారు.

బ్రెజ్జాకు చుక్కలు చూపించే కార్లు ఇవే! మీ బడ్జెట్‌లో బెస్ట్ SUV ఏది?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి బ్రెజ్జా(Maruti Suzuki Brezza) ఒక పాపులర్ SUVగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇది రూ. 8.69 లక్షల నుండి రూ. 14.14 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరలో అందుబాటులో ఉంది. దీనిలో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. అలాగే CNG ఇంజన్ ఆప్షన్‌లతో కూడా లభిస్తుంది.
Advertisement

మూడు వరుసల లగ్జరీ SUV GLB అమ్మకాలు నిలిపివేత!

భారత ఆటోమొబైల్ రంగంలో 7 సీటర్ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. కోవిడ్ మహమ్మారి అనంతరం ప్రజల ప్రయాణ అలవాట్లలో వచ్చిన మార్పులు, ఎక్కువ మందితో సౌకర్యవంతమైన ప్రయాణ అవసరాలు ఈ సెగ్మెంట్‌కు భారీ ఊపునిచ్చాయి. ఒక కుటుంబం అంతా కలిసి ప్రయాణించగలగడం, పైగా అంతా కలిసి టూర్స్ లేదా దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటం వలన ఎక్కువ సీటింగ్ కలిగిన కార్లకు ప్రస్తుతం డిమాండ్ ఏర్పడింది. టయోటా ఇన్నోవా క్రిస్టా, హైక్రాస్, వంటివి, మిడ్-సెగ్మెంట్ విభాగంలో మారుతీ ఎర్టిగా, కియా కారెన్స్, మహీంద్రా స్కార్పియో వంటి వాహనాలకు ఇండియాలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. వీటి ధర, మైలేజ్, ఫీచర్ల కారణంగా సాధారణ గృహ వినియోగదారులకు కూడా సులభంగా అందుబాటులో ఉన్నాయి.

బడ్జెట్‌లో దుమ్మురేపే స్కూటర్లు! డియో vs ఎన్-టార్క్.. మీ పికప్ ఏది?

మనదేశంలో స్కూటర్లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, స్టైలిష్ స్కూటర్లకు మాత్రం యువతలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాంటి స్కూటర్ల జాబితాలో హోండా డియో 125, టీవీఎస్ ఎన్-టార్క్ ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు స్కూటర్లు కూడా తమ స్పోర్టీ లుక్స్, పర్ఫామెన్స్‌తో యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ రెండిట్లో ఏది బెస్ట్ స్పోర్టీ స్కూటర్? వాటి మధ్య పోలికను ఈ కథనంలో చూద్దాం.

ఆఫ్ రోడ్ కింగ్ మహీంద్రా థార్.. రికార్డ్ స్థాయిలో 84,834 యూనిట్ల అమ్మకాలు

మహీంద్రా థార్ భారతీయ SUV మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకుంది. మార్కెట్లోకి విడుదలైనప్పటి నుంచి అంచనాలకు ధీటుగా దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో కూడా అమ్మకాలతో దుమ్ములేపుతుంది. థార్ ఎక్కువగా అడవులు, కొండ ప్రాంతాలు, క్లాసిక్ ఆఫ్-రోడ్ ట్రిప్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇది 3 డోర్ వెర్షన్ మాత్రమే. తరువాత మహీంద్రా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆఫ్‌రోడ్ ప్రయాణాలతో పాటు, రోజువారి ప్రయాణాల కోసం కుటుంబ ప్రయాణాలకు అనువుగా ఉండేలా 5 డోర్ థార్‌ను తీసుకొచ్చింది. ఈ వెర్షన్ ముఖ్యంగా కుటుంబ ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకున్న కొత్త థార్ రాక్స్ తక్కువ కాలంలోనే ప్రజలందరి అభిమానాన్ని పొందింది.

సిట్రోయెన్ బసాల్ట్: అమ్మకాలు పెరుగుతున్నాయ్.. ఈ కారులో అంత స్పెషల్ ఏముంది?

సిట్రోయెన్ బసాల్ట్(Citroen Basalt) ఒక పాపులర్ కూపే SUV. ఇది మార్కెట్లో టాటా కర్వ్(TATA Curvv)కు గట్టి పోటీదారుగా నిలుస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, అద్బుతమైన ఫీచర్లతో పాటు, ఇది మధ్య తరగతి వాళ్లకు కూడా అందుబాటు ధరలో కూడా లభిస్తుంది. అయినా, ఈ కారు అమ్మకాలు ఈ మధ్య క్రమంగా తగ్గుతూ వచ్చాయి. కానీ, మార్చి నెలలో అమ్మకాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Advertisement

రూ. 5 లక్షల్లో టాప్ క్లాస్ కార్.. ఫుల్ సెఫ్టీతో పాటు మెరుగైన మైలేజ్

ఇండియాలో కార్ల వినియోగదారుల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు కేవలం తక్కువ ధరలో కారు వస్తుందా అనేది కాకుండా, భద్రత, డిజైన్, మైలేజ్, టెక్నాలజీ వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతున్నారు. అలాంటి వాటిలో టాటా మోటార్స్‌కు చెందిన ప్రసిద్ధ కారు టియాగో (Tiago) ఒకటి. ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు పదేళ్లు పూర్తయినా, ఇంకా అమ్మకాల్లో దుమ్ము రేపుతుంది. టియాగో ఒక ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయినప్పటికీ, దీని డిజైన్, సేఫ్టీ కారణంగా చాలా మందిని ఆకర్షిస్తోంది. 2025లో కూడా టియాగో ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూ, డిజైన్‌లో చిన్నచిన్న మార్పులు, కొత్త ఫీచర్లు, ఆకర్షణీయమైన వేరియంట్లతో మార్కెట్లో విజయవంతమవుతోంది. ప్రస్తుతం ఇది అత్యంత తక్కువ ధరకు అమ్మకానికి ఉంది. దీని గురించి మరిన్ని వివరాలు చూద్దాం.

ఇకపై ఎలక్ట్రిక్ కార్లదే రాజ్యం.. విన్‌ఫాస్ట్ VF 6, VF 7 లతో సంచలనం ఖాయం!

వియత్నాంకు చెందిన కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ భారతీయ ఆటో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. మహీంద్రా, మారుతి వంటి దిగ్గజాలను సైతం వెనక్కి నెట్టే సత్తా ఉన్న ఈ 'మేడ్ ఇన్ తమిళనాడు' కార్ల గురించి ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. విన్‌ఫాస్ట్ కంపెనీ తన టాప్-లెవెల్ ఎలక్ట్రిక్ వాహనాలతో ఇండియాలో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

కంగనా శర్మ గ్లామర్ రైడ్.. అదిరిపోయే కారుతో ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంట్రీ!

సినిమా తారలు ఎప్పుడూ ఫ్యాషన్ లుక్‌లోనే కనిపిస్తుంటారు. వారు ఎక్కడికి వెళ్లినా కెమెరాలు కూడా వారిని ఫాలో అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా విమానాశ్రయాల వద్ద వారి లుక్‌కి సంబంధించి వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇదే తరహాలో ఇప్పుడు నటీ కంగనా శర్మ కూడా కెమెరాల కంట పడ్డారు. ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌‌తో మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించారు. తన గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న కంగనా ఇటీవల ముంబై ఎయిర్‌పోర్ట్ వద్ద కెమెరాల కంట పడ్డారు. హీంద్రా కంపెనీకి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన SUV XUV700లో కంగనా శర్మ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కారు ప్రస్తుతం ఆటో ఔత్సాహికులను బాగా ఆకట్టుకుంటుంది.

రోజువారీ ప్రయాణానికి బెస్ట్ బైక్ ఏది? స్ప్లెండర్ ప్లస్ లేదా ప్లాటినా?

మనదేశంలో టూ వీలర్ మార్కెట్లో హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus), బజాజ్ ప్లాటినా 100 (Bajaj Platina 100) అత్యంత ప్రజాదరణ పొందిన బైక్‌లుగా నిలిచాయి. ఈ రెండు మోటార్‌సైకిళ్లు విశ్వసనీయతకు మారుపేరుగా ఉండటమే కాకుండా, లో మెయింటెనెన్స్ కాస్ట్ తో, అధిక ఫ్యూయెల్ కెపాసిటీతో వినియోగదారుల మొదటి ఎంపికగా ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల రోజువారీ అవసరాలకు ఈ బైక్‌లు చక్కగా సరిపోతాయి. ఈ కథనంలో ఈ రెండు బైక్‌ల ధర, ఫీచర్లను ఓ సారి పోల్చి చూద్దాం.
Advertisement

భారతదేశంలో బాగా అమ్ముడవుతున్న టాప్ 5 SUVలు.. మిస్ అవ్వకండి!

ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన కార్ల సేల్స్‌ను గమనించినట్లయితే ఎస్‌యూవీ (SUV) మోడళ్లను జనాలు ఎక్కువగా ఆదరిస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. ఒకప్పుడు సెడాన్‌లు, హ్యాచ్‌బ్యాక్‌లు రాజ్యమేలితే, ఇప్పుడు దేశవ్యాప్తంగా కస్టమర్లు పెద్దఎత్తున ఈ సెగ్మెంట్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కార్ల తయారీదారులు కూడా ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు అనుగుణంగా suv మోడళ్లను విడుదల చేస్తున్నారు. ఇండియాలో దిగ్గజ కార్ల తయారీదారుల టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, మహీంద్రా వంటి కంపెనీల నుంచి ప్రస్తుతం మార్కెట్లోకి ఆకట్టుకునే కార్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌యూవీ లవర్స్ కోసం గత నెలలో ఇండియాలో అత్యధిక కస్టమర్లను ఆకర్షించిన టాప్ 5 అత్యంత ప్రజాదరణ పొందిన SUV ల గురించి కింది కథనంలో ఇవ్వడం జరిగింది. ఆ వివరాలను తెలుసుకోండి.

బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. తక్కువ ధరలో సూపర్ రేంజ్.. మహిళలకు పర్ఫెక్ట్ ఛాయిస్!

మనదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతుండడంతో వాటిని కొనేందుకు వినియోగదారులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ముఖ్యంగా తేలికగా ఉండే, అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ స్కూటర్లు భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రస్తుతం ఇంటి పనుల కోసం ఉపయోగపడే అనేక బడ్జెట్-ఫ్రెండ్లీ స్కూటర్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఫ్యామిలీ కార్‌గా వచ్చిన మరాజ్జో ఎందుకు ఫెయిలయ్యింది?

దేశీయ ప్రముఖ వాహనాల తయారీ కంపెనీ మహీంద్రా (mahindra) మార్కెట్లోకి ప్రతి కొత్త వాహనం విడుదల చేసినప్పుడల్లా మార్కెట్‌లో మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. సేల్స్ పరంగా ఇతర కంపెనీలకు ధీటుగా మెరుగైన గణంకాలను నమోదు చేయడం మహీంద్రాకు చాలా కాలంగా ఉన్న అలవాటే. ICE ఇంజిన్ వాహనాలు అయినా సరే, ఎలక్ట్రిక్ వేరియంట్లు అయినా సరే, కంపెనీ నుంచి విడుదల అయిన మోడళ్లు చాలా వరకు మర్కెట్లో ప్రజల నుంచి మంచి ఆదరణ సాధిస్తుంటాయి. ఇటీవలి రోజుల్లో టాటా మోటార్స్‌ను అధిగమించి, దేశంలో మూడవ స్థానాన్ని దక్కించుకున్న మహీంద్రా, కొన్నిసార్లు హ్యుందాయ్ స్థానానికే సవాలు చేసింది. మహీంద్రా కార్లు చాలా బాగా అమ్ముడవుతున్నప్పటికీ, కానీ ఒక కారు మాత్రం ప్రజల నుంచి ఆశించిన విధంగా డిమాండ్‌ను సాధించలేకపోతుంది.

టయోటా గ్లాంజా అమ్మకాలు తగ్గడానికి కారణాలు ఇవే ?

టయోటా (Toyota), సుజుకి (Suzuki) రెండు సంస్థలు కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పార్టనర్ షిప్ ద్వారా టయోటా సంస్థ భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki) కొన్ని కార్లను తన బ్రాండ్ కింద రీ-బ్యాడ్జ్ చేసి విక్రయిస్తోంది. ఉదాహరణకు మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) కారు టయోటా రూమియన్ (Toyota Rumion) పేరుతో అమ్ముతుంది.
Advertisement

టాటా కర్వ్ డార్క్ ఎడిషన్.. ధర, డిజైన్, టాప్ ఫీచర్లు ఇవే

సేఫ్టీ పరంగా అత్యంత నమ్మకమైన కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల ఫ్లాగ్‌షిప్ కూపే SUV అయిన టాటా కర్వ్‌ కారును ప్రత్యేకమైన డార్క్ ఎడిషన్‌లో విడుదల చేసింది. ఆకర్షణీయమైన బాడీ డిజైన్, కటింగ్-ఎడ్జ్ టెక్నాలజీ, ఇంటీరియర్ లగ్జరీ ఫీచర్స్‌తో కూడిన ఈ మోడల్ వినియోగదారులకు బెస్ట్ ఆప్షన్‌గా ఉంది. ఈ SUV పెట్రోల్/డీజిల్, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఇన్ని పవర్‌ట్రెయిన్‌లో లభించడం వలన కస్టమర్లకు మల్టిపుల్ ఆప్షన్లను ఎంచుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. . ఇది మార్కెట్లో SUV ప్రియులకు ఒక కొత్త డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది. ఈ కారు గురించిన ఫీచర్స్ గురించి పూర్తి వివరాలను కింది కథనంలో తెలుసుకుందాం.