మార్చిలో కేవలం 294 యూనిట్లు మాత్రమే... ఇన్విక్టోకు ఏమైంది?

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీకి చెందిన ఇన్విక్టో (invicto), భారత ఆటోమొబైల్ రంగంలో ఓ ప్రముఖ MPVగా వెలుగులోకి వచ్చింది. టయోటా, మారుతీ మధ్య ఉన్న టెక్నాలజీ షేరింగ్ భాగస్వామ్య కారణంగా, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించబడిన ఈ కారును 2023 జులై నెలలో విడుదల చేశారు. అప్పట్లో, ఇది మారుతి నుంచి వచ్చిన అత్యంత ప్రీమియం MPVగా నిలిచింది. డిజైన్ పరంగా చూస్తే, ఆకర్షణీయమైన బాడీ లైన్స్, స్టైలిష్ గ్రిల్, మస్క్యులర్ ప్రొఫైల్ ఈ కారుకు ప్రత్యేకంగా నిలిచాయి. ఇన్విక్టోలో ఉన్న ఇంటీరియర్ ఇంకా ఫీచర్ల వలన కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో ఇది తన స్థానాన్ని నిలబెట్టుకోవడం మాత్రం కష్టంగా మారింది.

యెజ్డి అడ్వెంచర్ వచ్చేస్తోంది.. హిమాలయన్‌కు ఇక కష్టకాలమేనా?

మనదేశంలో అడ్వెంచర్ టూరర్ బైక్‌లకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఈ విభాగంలో యెజ్డి అడ్వెంచర్ ఒక బెస్ట్ ఆఫ్షన్. ఇది అందుబాటు ధరలో మంచి పనితీరును, అనేక ఫీచర్లను అందిస్తుంది. క్లాసిక్ లెజెండ్స్ వచ్చే నెల మే 15న యెజ్డి అడ్వెంచర్ అప్‌డేటెడ్ వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఈ బైక్‌కు కొత్త డిజైన్‌ను అందించనున్నట్లు సమాచారం. రాబోయే బైక్‌లో మనం ఎలాంటి మార్పులు రావచ్చో తెలుసుకుందాం.

గర్భవతి అయిన భార్య కోసం సిద్ధార్థ్ మల్హోత్రా కొన్న లగ్జరీ కారు చూస్తే షాకవ్వాల్సిందే!

బాలీవుడ్ లవ్ బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి వారి కెరీర్ విషయంలో మాత్రం కాదు. వారి వ్యక్తిగత జీవితం. త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంట తమ రాబోయే బిడ్డ కోసం ఒక ప్రత్యేకమైన బహుమతిని కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ బహుమతి ఏమిటంటే.. రూ.కోటికి పైగా విలువ చేసే ఒక లగ్జరీ కారు. ఇంతకీ ఆ కారు ప్రత్యేకతలు తెలుసుకుందాం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి త్వరలో బుల్లెట్ 650 ట్విన్ రాబోతుంది

రాయల్ ఎన్‌ఫీల్డ్ పేరు వినగానే, యువత హృదయాల్లో ఒక ప్రత్యేక స్థానం కలిగిన 'బుల్లెట్' మోడల్ కళ్ల ముందుకు వస్తుంది. ఇది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. తరతరాలుగా బుల్లెట్ బైక్ భారత యువతను మాత్రమే కాక, ప్రతి వయస్సు వారినీ ఆకర్షిస్తూ, దేశం అంతటా తన గంభీరమైన సౌండ్‌తో ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. మార్కెట్లో పోటీ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో పలు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి సన్నద్ధమైంది. తన మార్కెట్‌న మరింత విస్తరించే ప్రయత్నంలో భాగంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ అదిరిపోయే బుల్లెట్ 650 ట్విన్ బైకును త్వరలో లాంచ్ చేయాలని చూస్తుంది. . ఇది ఇప్పటి వరకు మనం చూసిన బుల్లెట్లకంటే కొంచెం కొత్తదైన, మరింత శక్తివంతమైన రూపంలో రాబోతుంది.
Advertisement

టూ వీలర్ మార్కెట్లో సంచలనాలు సృష్టించేందుకు రాబోతున్న ఎలక్ట్రిక్ బైక్

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరవాసులకు మరింత ఆకర్షణీయమైన బైక్ అందుబాటులోకి రానుంది. త్వరలోనే అత్యాధునిక ఫీచర్లు, ఎక్కువ మైలేజీతో కూడిన 'మేటర్ ఏరా' ఎలక్ట్రిక్ బైక్ హైదరాబాద్‌లో విడుదల కానుంది. పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని కోరుకునే వారికి, అలాగే అత్యాధునిక టెక్నాలజీని ఆస్వాదించాలనుకునే వారికి ఈ బైక్ ఒక గొప్ప అవకాశం కానుంది.

ఈ కారులో రోడ్డుపై వెళ్తుంటే దిష్టి తీయించుకోండి.. అదిరిపోతున్న ఎంజీ కొత్త మోడల్

ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తనదైన స్థానం సంపాదించుకుంటూ, ఎప్పటికప్పుడు డిమాండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తుంటుంది ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్ (Mg motors). విండ్సర్, కామెట్ లాంటి మోడళ్లకు ప్రజల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది వినియోగదారులు వీటిని కొనుగోలు చేయడానికి ముందుకు వస్తున్నారు. టాటా మోటార్స్, హ్యూందాయ్ వంటి తయారీదారులకు పోటీగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను ఎంజీ తన కస్టమర్ల కోసం తీసుకొస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు పెట్రోల్, డీజిల్ వేరియంట్లను కూడా మార్కెట్లో నిలబెట్టి, అన్ని విభాగాల్లో ఆదాయాన్ని సంపాదిస్తూ ముందుకెళ్తోంది. ఈ క్రమంలో దాని ప్రసిద్ధ మోడల్ హెక్టర్ suv కూడా దేశంలో బాగా డిమాండ్ ఉన్నకారు.

వాహ్.. యమహా MT-09 హైబ్రిడ్ బైక్.. అదిరిపోతున్న డిజైన్

ఇటీవలి కాలంలో హైబ్రిడ్ వాహనాలు ఎక్కువ అయ్యాయి. ప్రజల నుంచి వీటికి సానుకూల స్పందన వస్తుండటంతో తయారీ దారులు సైతం ఈ దిశగా కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ప్రముఖ టూవీర్ కంపెనీ యమహా తన కొత్త MT-09 హైబ్రిడ్ బైక్‌ను పరిచయం చేసి మార్కెట్ వర్గాలనే కాకుండా ప్రజలను కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. హైబ్రిడ్ టెక్నాలజీ అనే పదం వినగానే మనకు సాధారణంగా కార్లు గుర్తొస్తాయి, ఎందుకంటే ఈ టెక్నాలజీని చాలా కాలంగా ప్రధానంగా కార్లలోనే ఉపయోగిస్తున్నారు. కానీ, టూవీలర్స్‌లో దీనిని అమలు చేయడం అంటే చిన్న విషయం కాదు. హైబ్రిడ్ వ్యవస్థకు అవసరమైన పరికరాలను బైకులో అమర్చడం అంటే సాధారణ విషయం కాదు. దీని కోసం కంపెనీ బృందం ఎంతో శ్రమ పడి ఉంటారని తెలుస్తుంది.

టాటా నానో కాదు.. ఈ బుజ్జి కారుకు విదేశాల్లో యమక్రేజ్.. త్వరలో భారత్‎లో కూడా విడుదల

వెరైటీ డిజైన్‎తో, తక్కువ ధరలో వస్తున్న ఒక ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‎గా మారింది. వియత్నాంకు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) ఈ చిన్న కారును తయారు చేస్తోంది. ఈ కంపెనీ త్వరలో భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశించడానికి రెడీ చేస్తోంది.
Advertisement

భద్రతలో రాజీ లేని కారు.. 5 స్టార్ సేఫ్టీతో సురక్షిత ప్రయాణం

భారతదేశంలో ప్రయాణికుల సేఫ్టీ పరంగా అత్యత్తమమైన ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో టాటా మోటార్స్ (tata motors) ఎప్పుడు ముందు స్థానంలో ఉంటుంది. భారతీయ ఆటోమొబైల్ రంగానికి భద్రత ఎంత ముఖ్యమో నేర్పిన బ్రాండ్ టాటానే. క్రాష్ టెస్టుల్లో అత్యుత్తమ 5-స్టార్ రేటింగ్ సాధించిన టియాగో, ఆల్ట్రోస్, నెక్సాన్, హారియర్, సఫారీ వంటి మోడల్స్‌తో టాటా తన కస్టమర్లకు 'సేఫ్టీ ఫస్ట్' అన్న సూత్రాన్ని పరిచయం చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులు వేస్తున్నా, టాటా ఎప్పుడు కూడా సేఫ్టీ విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. తాజాగా దాని ప్రసిద్ధ ఎలక్ట్రిక్ మోడల్ అయినటువంటి నెక్సాన్ ఈవీ 45 kWh వెర్షన్‌ భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ క్రాష్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది.

30 కి.మీ. మైలేజ్‌తో.. 10 లక్షల్లోపు బెస్ట్ కార్లు ఇవే!

మన దేశంలో మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. దీంతో లో బడ్జెట్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఎంట్రీ లెవెల్ కాకపోయినా, 10 లక్షల రూపాయల లోపు ధర ఉండే కార్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. అందుకే చాలా కంపెనీలు ఈ ధరలో రకరకాల బాడీ టైపుల్లో కొత్త కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి.

లక్ష రూపాయల లోపు బెస్ట్ బైకులు ఇవే.. మంచి మైలేజ్,స్టైల్, పర్ఫార్మెన్స్!

గతంలో మీ చేతిలో లక్ష రూపాయలు ఉంటే, ఆకట్టుకునే హీరో కరిష్మా 220 లాంటి ప్రీమియం బైక్‌నే సులభంగా సొంతం చేసుకోవచ్చు. ఆన్-రోడ్ ధరగా సుమారు రూ. 85,000 చెల్లిస్తే చాలు. బైక్ మీ ఇంటికి చేరిపోయేది. అయితే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పెరిగిపోయిన ద్రవ్యోల్బణం, రూపాయి విలువ తగ్గడం, వస్తువుల ఉత్పత్తి నిర్వహణ వ్యయం పెరగటం మొదలగు కారణాల వలన లక్ష రూపాయల బడ్జెట్ ఇప్పుడు కేవలం కమ్యూటర్ బైక్స్ కొనుగోలుకే సరిపోతుంది. ఈ ధరలో కొత్త బైకును కొనుగోలు చేయాలని చూసిన అలాంటి మోడళ్లు ఇప్పుడు మార్కెట్లో చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మీ చేతిలో రూ.1 లక్ష బడ్జెట్ ఉన్నా కూడా దానికి అనుగుణంగా మీకు కావాల్సి ఫీచర్స్‌తో చూడదగిన మోడళ్ల సంఖ్య గణనీయంగా తక్కువైపోయింది.

7 సీట్లు.. 8 మంది ప్రయాణం! హ్యుందాయ్ పాలిసేడ్ హైబ్రిడ్‌లో అదిరిపోయే ఫీచర్లు!

Hyundai : ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ ను ఎలక్ట్రిక్ కార్లు ఏలుతున్నా.. పెట్రోల్ కార్లకు మాత్రం డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ ప్రపంచ మార్కెట్‌లో ఒక సంచలన కారును విడుదల చేసింది. ఈ హైబ్రిడ్ SUVని ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే నేరుగా హైదరాబాద్ - విజయవాడకు రెండుసార్లు వెళ్లిరావొచ్చు. మధ్యలో ఎక్కడా పెట్రోల్ నింపాల్సిన అవసరం లేదు.
Advertisement

ఇండియాలో కుటుంబ ప్రయాణాలకు ఎక్కువ మంది కొంటున్న టాప్ కార్లు ఇవే!

భారతదేశంలో 7 సీట్ల వాహనాలపై దృష్టి గత కొంతకాలంగా మారుతోంది. ఒకప్పుడు టాక్సీ వాడకానికి మాత్రమే ఉపయోగించబడే ఈ తరహా కార్లు, ఇప్పుడు ఎక్కువగా కుటుంబ అవసరాల కోసం కొనుగోలు చేస్తున్నారు. పెళ్లిళ్లకు వెళ్లడం కావచ్చు, వారాంతపు విహారయాత్రలు కావచ్చు, ఒకేసారి మొత్తం కుటుంబంతో ప్రయాణించాలనుకుంటే, ఇవి అత్యంత బాగా ఉపయోపడుతాయి. ఏడుగురికంటే తక్కువ మంది ఉంటే వెనుక సీట్లను మడిచి అవసరమైన లగేజీ కూడా సులభంగా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లల ఆటబొమ్మల నుంచి పెద్దల బ్యాగుల వరకూ అన్నీ సర్దుకోవచ్చును. ఈ విభాగంలో టయోటా ఇన్నోవా, మారుతీ సుజుకీ ఎర్టిగా వంటి పెద్ద ఎంపీవీ కార్లు బాగా సెట్ అవుతాయి.

ఎర్టిగా, XL6 ఇక కథ ముగిసినట్టే! 7 సీట్లతో టయోటా హైరైడర్ వచ్చేస్తోంది!

టయోటా కంపెనీ ఇటీవల కాలంలో మారుతి సుజుకి కార్ల ఆధారంగా రూపొందించిన మోడల్స్‎ను విజయవంతంగా విక్రయిస్తోంది. అలా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా కారు ఆధారంగా రూపొందించిన టయోటా కారు అర్బన్ క్రూజర్ హైరైడర్. ఈ మోడల్‎కు ప్రస్తుతం మార్కెట్లో మంచి పేరుంది.

ప్రపంచంలోనే మొట్టమొదటి హైపర్‌కార్.. పైకప్పు మీద నడిచే కార్‌

మనం సాధారణంగా రోడ్లపై ప్రయాణించే కార్లను చూస్తుంటాం. అయితే ఇటీవల కాలంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. అంచనాలకు ఊహించని విధంగా సాంకేతికత అభివృద్ది చెందింది. తాజాగా కారును రివర్స్‌లో పైకప్పుకు అనకుని నడిచే విధంగా రూపొందించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి రివర్స్ కారు ఇటీవల తయారైంది. ఇది సొరంగాల్లో తలక్రిందులుగా నడుస్తుంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. ఈ ప్రత్యేక కారులో టైర్లు పైన ఉంటాయి, కానీ డ్రైవర్, ప్రయాణికుల కేబిన్ కింద భాగంలో ఉంటుంది. అంటే, మీరు కూర్చోవాల్సిన స్థానం నేలవైపు, టైర్లు ఆకాశవైపు ఉంటాయన్న మాట. ఇదో హాలీవుడ్ సినిమాలో చూసినట్టు ఉంది కానీ ఇది రియాలిటీగా జరిగింది. చూడటానికి డిజైన్, ఇంజినీరింగ్ పరంగా ఎంతో వినూత్నంగా, కొత్తగా కనిపిస్తోంది.

మారుతీకి కష్టకాలం మొదలైంది.. కియా కొత్త కారెన్స్ వచ్చేస్తోంది

దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా త్వరలో సరికొత్త 7 సీటర్ ఎంపీవీని విడుదల చేసేందుకు రెడీ అవుతుంది. అదే కియా కారెన్స్ (Kia Carens) ఫేస్‌లిఫ్ట్. ఈ కారు ఇప్పటికే మార్కెట్లో రెండు లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని చేరుకుంది. ఈ మధ్య కాలంలో ఈ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను భారత్‌తో పాటు విదేశాల్లో కూడా పలుమార్లు టెస్ట్ చేస్తుండగా కనిపించింది.
Advertisement

పెట్రోల్, డీజిల్ యుగానికి ముగింపు? ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు ఇదే!

మనదేశంలో ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల విప్లవం కొనసాగుతోంది. 2024 ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకు ఉన్న ఆర్థిక సంవత్సరంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఏకంగా 20 లక్షల మార్కును దాటాయి. జేఎంకే రీసెర్చ్ అందించిన నివేదిక ప్రకారం.. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 15.31శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం 20,26,184 ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఇది 2024 ఆర్థిక సంవత్సరం కంటే 2,69,075 వాహనాలు ఎక్కువ.

కస్టమర్లను కోల్పోతున్న ఈకో వ్యాన్? మార్చి అమ్మకాల రిపోర్ట్ చెప్తున్నది ఇదే

భారతీయ మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మారుతీ సుజుకీ నుంచి విడుదలైన ప్రసిద్ధ మోడల్ ఈకో (EECO) సాధారణంగా కుటుంబ ప్రయాణాలతో పాటు, వ్యాపార అవసరాలు రెండింటికీ బాగా ఉపయోగపడుతుంది. ఈ కారు బడ్జెట్ ధరలో లభిస్తూ, తక్కువ మెయింటనెన్స్, అందుబాటులో ఉన్న పెద్ద సీటింగ్ సామర్థ్యం వంటి కారణాలతో కస్టమర్లలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. తాజాగా కంపెనీ నుంచి విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, దీనికి మార్కెట్లో డిమాండ్ క్రమంగా తగ్గుతూ వస్తుంది. దీనికి ప్రత్యమ్యాయంగా కొత్త మోడళ్లు విడుదల కావడం, కస్టమర్ల ఇష్టాల్లో మార్పులు రావడం. కొత్త టెక్నాలజీ అప్‌డేట్స్ లేకపోవడం వంటి కారణాలతో ఈకో వాహనానికి ఆదరణ క్రమంగా తగ్గుతోంది. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, మార్చి నెలలో కూడా ఈ ట్రెండ్ కొనసాగినట్టే కనిపిస్తోంది.

ఇండియా ఈవీ మార్కెట్‌లో రికార్డు సృష్టించిన టీవీఎస్, బజాజ్

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్స్‌ అమ్మకాలు భారీగా ఉంటున్నాయి. పెరుగుతున్న పెట్రోల్ ధరల కారణంగా ప్రతి ఒక్కరు కూడా ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ విభాగంలో తాజాగా TVS iQube, బజాజ్ చేతక్ స్కూటర్లు ఒక గొప్ప మైలురాయిని అధిగమించాయి. అమ్మకాల నివేదిక ప్రకారం, రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు కలిపి 1 మిలియన్ యూనిట్ల అమ్మకాలను చేరుకుని ఈ సెగ్మెంట్‌లో పాత చరిత్రను తిరగరాశాయి. ఇవి స్టైలిష్ డిజైన్, అధునాతన టెక్నాలజీ, నమ్మకమైన పనితీరుతో మార్కెట్లో దూసుకుపోతున్నాయి. ఈ అమ్మకాలను చూసినట్లయితే దేశంలో ఈవీలకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నదని అర్థం అవుతుంది. నగరాల్లో పెరిగిన ట్రాఫిక్, పెరుగుతున్న పర్యావరణ అవగాహన కూడా వినియోగదారులను ఈవీ వాహనాల వైపు ఆకర్షించాయి. ఈ రెండు మోడళ్ల అమ్మకాల గురించి కింది కథనంలో పూర్తిగా తెలుసుకుందాం.

పేదోడి బండి.. అదిరిపోయే లుక్కు! కొత్త టీవీఎస్ స్పోర్ట్ వచ్చేసింది!

టీవీఎస్ మోటార్ (TVS Motor) భారతదేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారులలో ఒకటి. తమిళనాడుకు చెందిన ఈ సంస్థకు హోసూర్‌లో వాహన ఉత్పత్తి కర్మాగారం ఉంది. ఇక్కడ తయారైన టీవీఎస్ వాహనాలు భారతదేశంతో పాటు ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి.
Advertisement

టాప్‌లో కియా సోనెట్! 2025 ఆర్థిక సంవత్సరం అమ్మకాల వివరాలు

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ (Kia motors) ఇండియాలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి తయారీదారులకు పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. అమ్మకాల పరంగా ప్రతి ఏడాది కూడా దూసుకుపోతుంది. తాజాగా కియా ఇండియా 2025 ఆర్థిక సంవత్సరానికి తన సేల్స్ గణాంకాలను వెల్లడించింది. దాని ప్రకారం, కియా సోనెట్ (sonet) మోడల్ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. డేటాను చూసినట్లయితే సోనెట్ కారు 2025 ఆర్థిక సంవత్సరంలో 99,805 యూనిట్ల సేల్స్‌ను నమోదు చేసింది. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 23 శాతం అమ్మకాల వృద్ధిని కూడా సూచిస్తోంది. ఈ కాంపాక్ట్ SUV మార్కెట్లోకి లాంచ్ అయినప్పటి నుంచి కస్టమర్ల నుంచి మంచి ఆదరణ పొందుతూనే ఉంది.

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్‌లు! గ్రామీణ ప్రజల ఫస్ట్ ఛాయిస్!

మనదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. ఇక్కడ గ్రామాల్లో నివసించే వారి సంఖ్య చాలా ఎక్కువ. పొలం పనులకు వెళ్లాలన్నా, పాల కేంద్రానికి పాలు తీసుకెళ్లాలన్నా, ఇతర పనుల కోసం వెళ్లాలన్నా టూ వీలర్స్ చాలా అవసరం. అందులోనూ బైక్‌లు తప్పనిసరి.

పెట్రోల్‌ బంకులో కొత్త రూల్‌.. మీ బండి మొత్తం స్కాన్‌ చేసిన తర్వాతే ఫిల్‌ చేస్తారు!

దేశవ్యాప్తంగా పాతబడిన వాహనాలు ఎక్కువగా ఉన్నాయి. వీటి నుంచి అధికంగా కాలుష్య కారకాలు వెలుడుతున్నాయి. దీంతో వాతావరణ కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. క్రమంగా గాలి నాణ్యత తగ్గుముఖం పడుతుంది. ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీలో అయితే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. పెట్రోల్, డీజిల్ వంటి సాంప్రదాయ ఇంధనాలతో నడిచే పాత వాహనాల నుంచి విడుదలయ్యే ధూళి, కార్బన్ ఉద్గారాలు అక్కడి గాలిని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. దీంతో ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ దీని ప్రభావానికి లోనవుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ పరిణామాలు ఉన్నప్పటికి ఢిల్లీ వంటి నగరాల్లో ఇది మరింత దారుణంగా మారింది. అక్కడ వాయు కాలుష్యం అతి ప్రమాదకరమైన స్థాయికి చేరుకుని, ఆ నగరం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యభరిత నగరాల్లో ఒకటిగా నిలిచింది.

ట్రాఫిక్‌కు చిరాకొచ్చిందో ఏమో! సైఫ్ అలీ ఖాన్ స్కూటర్‌పై చక్కర్లు!

బాలీవుడ్‌ సెలబ్రిటీల దగ్గర కోట్లాది రూపాయల విలువైన కార్లు ఉండడం కామన్. కానీ కొన్నిసార్లు వారికి ఖరీదైన కార్ల కంటే సాధారణ వాహనాలే ఎక్కువగా ఉపయోగపడుతుంటాయి. దానికి నిదర్శనంగా సైఫ్ అలీ ఖాన్ తాజాగా ముంబై రోడ్లపై హోండా యాక్టివా స్కూటర్‌పై తిరుగుతూ కనిపించారు.
Advertisement

చైనాలో తయారై భారత్‌ను షేక్ చేస్తున్న BYD సీలియన్ 7!

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతుంది. ఈ క్రమంలో దేశీయ కంపెనీలే కాకుంగా అంతర్జాతీయంగా ఉన్న ఈవీ తయారీదారులు పోటా పోటీగా మెరుగైన బ్యాటరీ పనితీరును కనబరిచే వాహనాలను విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే చైనా‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ BYD (బిల్డ్ యోర్ డ్రీమ్స్) భారతదేశంలో పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తోంది. అధునాతన టెక్నాలజీ, డిజైన్, పనితీరు పరంగా భారత వినియోగదారులకు అనుకూలమైన ఈవీ కార్లను తీసుకొచ్చింది. ఈ కంపెనీ నుంచి గతంలో విడుదల అయిన సీలియన్ 7 కారు ప్రస్తుతం మార్కెట్లో బాగా డిమాండ్ ఉన్న మోడల్‌గా నిలుస్తుంది. ఈ మోడల్ గురించిన వివరాలను కింది కథనంలో ఒకసారి చూద్దాం.