విజయ్ కారు తలుపు ఓపెన్ చేసిన సంఘటనపై వివరణ

నటుడు విజయ్ సినిమాలే కాకుండా ఇప్పుడు రాజకీయాల్లో కూడా చాలా చురుకుగా ఉన్నారు. గతంలో కొత్తగా రాజకీయ పార్టీని ప్రారంభించారు. తాజాగా వాటి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల కోయంబత్తూరులో ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ సదస్సు కోసం విజయ్ తన కారులో కోయంబత్తూరుకు వెళుతుండగా జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనలో ఆయన కారులో వెళ్తున్న క్రమంలో చాలా మంది అభిమానులు ఆయనను వెంబడిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఒక అభిమాని చేయి తలుపులో చిక్కుకునే విధంగా వీడియోలో కనిపించింది. దీన్ని చూసిన కొందరు గతంలో టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చినటువంటి సెన్సేషనల్ మూవీ ఒకే ఒక్కడు సినిమాలో మాదిరి సీన్ లాగా ఉందని అనుకుంటున్నారు.

గుడ్ న్యూస్.. కొత్త టాటా ఆల్ట్రోజ్ విడుదల తేదీ వచ్చేసింది.. ధర కూడా తక్కువే!

టాటా మోటార్స్ (Tata Motors) స్వదేశానికి చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ కంపెనీ, దేశీయ మార్కెట్‌లో చిన్న కార్ల నుంచి భారీ ట్రక్కుల వరకు అనేక రకాల వాహనాలను అందిస్తోంది. ముఖ్యంగా, టాటా మోటార్స్ సేఫ్టీ, క్వాలిటీ, వినియోగదారుల అవసరాలను అనుగుణంగా కార్లను రూపొందించడంలో ప్రత్యేక గుర్తింపు పొందింది.

సరికొత్త బజాజ్ చేతక్ 3503 లాంచ్.. ధర, ఫీచర్లు, రేంజ్ వివరాలు

ఇండియాలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు బాగా డిమాండ్ నెలకొంది. బజాజ్ కంపెనీ ఈ సెగ్మెంట్‌లో బాగా దూసుకుపోతుంది. చేతక్ ఈవీ మోడల్ ద్వారా దేశవ్యాప్తంగా మంచి ప్రజాధారణ సంపాదిస్తుంది. దేశీయ ఈవీ మార్కెట్‌లో తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న బజాజ్ చేతక్ (Bajaj Chetak), తాజాగా '35' సిరీస్‌లో కొత్త '3503' మోడల్‌ను విడుదల చేసింది. ఇప్పటికే విజయవంతంగా మార్కెట్లో అమ్మకాలను సాధిస్తున్న 3501, 3502 మోడళ్ల తర్వాత, ఇప్పుడు ఈ తాజా మోడల్‌ను సరికొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, అందుబాటు ధరతో కొనుగోలు చేయడానికి తీసుకొచ్చారు. బజాజ్ చేతక్ 3503 మోడల్ ధరను రూ. 1.10 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, ఇది మధ్యతరగతి వినియోగదారులకు బడ్జెట్‌కు అనుగుణంగా అందుబాటులో ఉండడం విశేషం.

రూ. 20 లక్షల్లో ఇంత పవరా? ఈ కార్లు మామూలువి కాదు

ప్రతి రైడ్‌ను ఎంజాయ్ చేయాలని చూస్తున్నారా.. అయితే రూ.20లక్షల లోపు ఉన్న టాప్ 5కార్ల లిస్ట్ చూద్దాం. ఈ కార్లు కేవలం ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లడానికి మాత్రమే కాదు. డ్రైవింగ్‌లోని థ్రిల్‌ను, ప్రతి మలుపులో అడ్రినలిన్‌ను నింపే ఎక్సపీరియన్స్‎ను అందిస్తాయి. హ్యాచ్‌బ్యాక్‌ల నుండి SUVల వరకు ప్రతి కార్ల లవర్స్‎కు కోరుకునే బాడీ స్టైల్స్, బ్రాండ్‌లు, పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉన్న వాహనాల గురించి తెలుసుకుందాం.
Advertisement

కొత్త ఎలక్ట్రిక్ సెడాన్ భారత్‌లో అడుగుపెట్టింది.. BYD 2025 సీల్ లాంచ్ వివరాలు

చైనాకు చెందిన BYD (బిల్డ్ యువర్ డ్రీమ్స్) ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో ప్రపంచలోనే అమ్మకాల పరంగా మొదటి స్థానంలో ఉంటుంది. ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లాకు పోటీగా అంతర్జాతీయంగా తన మార్కెట్‌ను విస్తరించుకుంటుంది. అలాగే ఇండియాలో కూడా చాలా కాలంగా తన కార్లను విక్రయిస్తుంది. టెస్లా కార్లు ఇప్పటి వరకు ఇండియా రోడ్లపై పరుగులు పెట్టడం లేదు. దాని కంటే ముందుగానే ఇక్కడ అడుగుపెట్టి క్రమంగా తన కస్టమర్లను దేశవ్యాప్తంగా పెంచుకుంటుంది. మొదటగా, e6 అనే ఎంపీవీ ద్వారా భారత ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లోకి అడుగుపెట్టింది BYD. ఈ మోడల్‌కు అద్భుతమైన స్పందన లభించింది. దీని తరువాత BYD భారత మార్కెట్‌ను మరింత ఆకట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టింది. వరుసగా 6 MPV, స్టైలిష్ Atto 3 SUV మోడళ్లను అందించింది.

ఈ బేబీ ఫ్యామిలీ కారును ఇండియాలో జనాలు ఎగబడి మరి కొన్నారు.. లక్షల మంది సొంతం చేసుకున్నారు

దక్షిణ కొరియాకు చెందిన వాహన తయారీ సంస్థ హ్యుందాయ్‌ ఇండియాలో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. ఒకప్పుడు కార్ అనగానే హ్యాచ్‌బ్యాక్‌ను ఊహించే రోజులు. మారుతీ సుజుకీ భారతదేశంలో అడుగుపెట్టిన వెంటనే, మధ్యతరగతి ప్రజలకూ కార్ల కలను సాకారం చేసే అవకాశాన్ని ఇచ్చింది. అంబాసిడర్, ప్రీమియర్ పద్మిని వంటి సెడాన్ కార్ల యుగం నుంచి ప్రజలు మారుతి 800 వంటి చిన్న, సరసమైన హ్యాచ్‌బ్యాక్‌లను తీసుకొచ్చింది. వీటికి బలమైన పోటీగా హ్యుందాయ్ శాంట్రోను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీంతో ఇండియాలో కొత్త శకాన్ని ప్రారంభించింది. చిన్న కారు అయినప్పటికి కూడా ఎక్కువ స్థలం, సౌకర్యవంతమైన సీటింగ్ కారణంగా ఇది విజయవంతమైన మోడల్‌గా నిలిచింది.

పెట్రోల్ ఖర్చుతో విసిగిపోయారా? ఈ కార్లు లీటరుకు కిలోమీటర్లు కొద్దీ వెళ్తాయి!

కొత్త కారు కొనాలని చాలా మంది ఎప్పటి నుంచో కలలు కంటుంటారు. అయితే, కొనుగోలుదారులకు ఏ కారు లో మెయింటెనెన్స్ ఖర్చును కలిగి ఉంటుంది.. ఎక్కువ మైలేజ్‌ను ఇస్తుంది. ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుందా అనే సందేహం ఉంటుంది. అందుబాటు ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టొయోటా టైసర్, మారుతి సుజుకి డిజైర్, హ్యుండాయ్ వెన్యూ, టొయోటా హైరైడర్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

రూ.6 లక్షల లోపల 6 ఎయిర్‌బ్యాగ్స్ కార్ల జాబితా! సెలెరియో నుంచి ఎక్స్‌టర్ వరకు

ఈ రోజుల్లో కొత్త కారు కొనుగోలు చేసే వారు కేవలం స్టైల్‌ను మాత్రమే కాదు, సేఫ్టీని కూడా ప్రధానంగా తీసుకుంటున్నారు. ప్రత్యేకించి, కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్స్ ఉండాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఎయిర్‌బ్యాగ్స్ సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ప్రమాద పరిస్థితుల్లో లోపల కూర్చున్న ప్రయాణికులకు మరింత సేఫ్టీ లభిస్తుంది. అయితే సాధారణంగా ఇలాంటి భద్రతా ఫీచర్లు ఉన్న కార్లు ధర పరంగా కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ కొన్ని కంపెనీలకు చెందిన మోడళ్లు మాత్రం అందరు కొనగలిగే విధంగా అందుబాటు ధరలో మార్కెట్లో లభిస్తున్నాయి. కొత్తగా కారు కొనాలనే చూసే వినియోగదారుల కోసం ఇప్పుడు రూ. 6 లక్షల లోపే 6 ఎయిర్‌బ్యాగ్స్ ఫీచర్ ఉన్న కార్లను కింది కథనంలో అందిస్తున్నాం, అవెంటో ఒకసారి చూసేద్దాం.
Advertisement

పెట్రోల్‌కు గుడ్ బై చెప్పేయండి.. తక్కువ ధరలో మీ పాత స్కూటర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చేయండి!

ప్రస్తుతం పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి.. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో విసిగిపోయారా? కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలంటే లక్షలు ఖర్చు చేయాలా అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీ పాత పెట్రోల్ స్కూటర్‌ను కేవలం రూ. 10,000 ఖర్చుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌గా మార్చుకోవచ్చు.. వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

అరెరె! టెస్లా డబ్బు తిరిగి ఇచ్చేస్తుందేంటి? లోపల ఏదో స్కెచ్ ఉందే!

టెస్లా కేవలం ఒక కార్ల తయారీ సంస్థ కాదు. ఇది ఒక సంచలనం! ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమలో విప్లవాన్ని సృష్టించిన కంపెనీ ఇది. ఎలాన్ మస్క్ లాంటి విజన్ కలిగిన వ్యక్తి ఆలోచనల నుంచి పుట్టిన ఈ సంస్థ సాంప్రదాయ కార్ల తయారీదారులకు ఒక సవాలు విసిరింది. కేవలం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడమే కాకుండా, వాటిని అత్యాధునిక సాంకేతికత, అద్భుతమైన డిజైన్, భవిష్యత్ దృష్టితో రూపొందించడం దీని ప్రత్యేకత.

7 సీటర్ కార్లలో టాప్ 10లో చివరికి చేరిన రెనాల్ట్ ట్రైబర్

ఇండియాలో కుటుంబ ప్రయాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందరు కలిసి ఒకే కారులో సౌకర్యంగా వెళ్లడానికి అనువుగా ఉండే కార్లను కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్త చూపిస్తారు. ఎక్కువ మంది కలిసి వెళ్లడానికి ఎంపీవీ (మల్టీ పర్పస్ వెహికల్) బాగా సెట్ అవుతాయి. అందుకే పెద్ద ఫ్యామిలీ గల వారు ఈ సెగ్మెంట్ మోడళ్లను కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఇలాంటి కార్లు చాలా ఉన్నాయి. వాటిలో ప్రముఖ కార్ల తయారీ కంపెనీ రెనాల్ట్‌కు చెందిన ట్రైబర్ కూడా ఒకటి. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫీచర్లు కలిగి ఉన్న MPV కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మార్కెట్లో లభ్యమయ్యే చాలా MPV మోడళ్ళు ధర పరంగా కొంచెం ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ మోడల్ మాత్రం అందుబాటులోనే లభిస్తుంది.

గడ్కరీ సంచలన నిర్ణయం.. వాహన హారన్‌లు ఇక సంగీత స్వరాలతో!

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్నప్పుడు, ముందున్న డ్రైవర్ అనవసరంగా హారన్ మోగిస్తే, మనం కొంత అసహనంతోనే చూస్తాం. కొంత మంది అయితే అదే పనిగా హారన్ కొడుతుంటారు. హారన్‌ల గోల, చికాకు కలిగించే సౌండ్ ఇప్పుడు ఎక్కువ అయింది. దీంతో ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఒక కొత్త ఆలోచన చేశారు. వాహన హారన్‌లను భారతీయ సంగీత వాయిద్యాల సౌండ్‌‌లతో భర్తీ చేయాలని ఆయన ప్రతిపాదించారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా, మన సంస్కృతికి మరింత మద్దతుగా నిలిచేలా ఈ ఆలోచన రూపుదిద్దుకుంటోంది. రాబోయే రోజుల్లో, ట్రాఫిక్‌లో సాధారణ హారన్ కాకుండా తబలా మృదంగం లేదా వీణ సుతార రాగాలు వినబోతున్నారు.
Advertisement

6 లక్షల బడ్జెట్‌లో సూపర్ కార్లు.. పంచ్‌కు పోటీగా ఉన్నవి ఇవే!

టాటా పంచ్ (Tata Punch) ఒక పాపులర్ మైక్రో SUVగా మనదేశంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇది దాదాపు రూ. 6.20 లక్షల నుండి రూ. 10.32 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ పెట్రోల్, CNG ఇంజన్‌తో వస్తుంది. ఇది లీటరుకు 18.8 నుండి 26.99 కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6.. మొదటిసారి రోడ్డుపై స్పై ఫోటో

ఇంగ్లాండ్‌ మట్టి మీద పుట్టి, ఇప్పుడు ఇండియాలో తన హావాను చూపిస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ చాలా కాలంగా సేల్స్‌లో తన సత్తాను చాటుతుంది. క్లాసిక్, రెట్రో స్టైల్‌తో పాటు మరింత ఆధునికతను జోడిస్తూ, కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, అమ్మకాల్లో దూసుకుపోతుంది. టూవీలర్ విభాగంలో పోటీ ఎక్కవగా ఉన్న నేపథ్యంలో ఈ బ్రాండ్, మరింత వేగంగా ముందుకు సాగేందుకు సరికొత్త ప్రణాళికలను అమలు చేస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూవీలర్ వాహనాలకు డిమాండ్ పెరిగిన కారణంగా తొలి ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అభివృద్ధి పనుల్లో నిమగ్నమైంది. గత సంవత్సరం 2024లో జరిగిన ప్రఖ్యాత EICMA ఎగ్జిబిషన్ సందర్భంగా, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన తొలి ఎలక్ట్రిక్ బైక్ పేరును ప్రకటించింది. అదే ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (flying flea c6).

దిగడానికి కష్టపడాల్సిన పనిలేదు.. ఎంజీ అదిరిపోయే ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ వచ్చేసింది!

ప్రముఖ కార్ల తయారీ సంస్థల్లో ఒకటైన ఎంజీ మోటార్ (MG Motor) ఎలక్ట్రిక్ వాహనాల (Electric Cars) విభాగంలో దూసుకుపోతుంది. ముఖ్యంగా భారతదేశంలో జేఎస్‌డబ్ల్యూ (JSW)తో భాగస్వామ్యం తర్వాత ఎంజీ మోటార్ వ్యాపారం మరింత ఉత్సాహంగా కొనసాగిస్తోంది.

సియాజ్ సెడాన్‌కు మళ్లీ ఊపు.. మార్చిలో 676 కార్లు అమ్ముడయ్యాయి

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ (maruti suzuki)కి చెందిన ప్రసద్ధ కార్లలో సియాజ్ (ciaz) మోడల్ కూడా ఒకటి. ఇది ఒక ప్రీమియం సెడాన్. మార్చి నెలకు సంబంధించిన అమ్మకాల వివరాలను విడుదల చేస్తున్న కంపెనీ తాజాగా ఈ సెడాన్‌ సేల్స్ డేటాను తాజాగా వెల్లడింంచింది. నివేదిక ప్రకారం, చూసినట్లయితే ఈ కారును మార్చి 2025లో 676 మంది కొనుగోలు చేశారు. ఇది గత ఏడాది అంటే, 2024 మార్చి నెలలో 590 యూనిట్లను విక్రయించింది. మొత్తంగా విక్రయాల వృద్ధి 14.58 శాతంగా నమోదైంది. సియాజ్ కారు కేవలం లుక్ కోసం మాత్రమే కాదు, దాని అధునాతన ఫీచర్స్‌తో అందిరిని కట్టిపడేస్తుంది.
Advertisement

కొరియన్ కార్ల జోరు.. భారత్‌లో 15 లక్షల కార్లు అమ్మడయ్యాయి

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కొరియన్ కార్ల తయారీదారుల హవా కొనసాగుతోంది. ఏకంగా మూడేళ్ల స్వల్ప వ్యవధిలోనే వారు ఇక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 2019 ఆగస్టులో తమ ఉత్పత్తిని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు ఏకంగా 15 లక్షల కార్లను విక్రయించి సంచలనం సృష్టించారు.

ఆకట్టుకునే డిజైన్, పవర్ఫుల్ ఇంజన్.. పట్టణమైనా, పల్లె అయినా... వెస్పా రైడ్ అంటే ఒక పండగే!

వెస్పా... ఈ పేరు వింటేనే మన మదిలో ఒక ప్రత్యేకమైన వైబ్రేషన్స్ మొదలవుతాయి. అందమైన ఒంపులతో, క్లాసిక్ డిజైన్‌తో ఉండే ఈ స్కూటర్ ఒక వాహనం మాత్రమే కాదు, ఒక లైఫ్ స్టైల్‎కు కేరాఫ్ అడ్రస్. ఇటలీలో జన్మించిన వెస్పా దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకుంది.

థార్ అభిమానులకు షాక్! మహీంద్రా 8 వేరియంట్లను నిలిపివేసింది

భారత ఆటోమొబైల్ పరిశ్రమలో ప్రసిద్ధ వాహన తయారీ కంపెనీగా ఉన్నటువంటి మహీంద్రా నుంచి గతంలో విడుదలైన ఆఫ్‌రోడ్ కింగ్ థార్ దేశీయంగా మంచి ప్రజాధారణ సంపాదించింది. మొదట్లో 3 డోర్ థార్‌ను విడుదల చేసిన కంపెనీ ఈ ఆ తరువాత పెరుగుతున్న వినియోగదారుల అవసరాలు, సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని కుటుంబ ప్రయాణాలకు సైతం అనువుగా ఉండేలా 5 డోర్ థార్‌ను తీసుకువచ్చి తన కస్టమర్లను ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. బలమైన బాడీ రూపం, శక్తివంతమైన ఇంజిన్ పనితీరు, అన్ని రకాల రోడ్లపై కూడా దూసుకుపోయేలా పెర్ఫామెన్స్ కారణంగా గత ఏడాది అత్యుత్తమ కార్ల జాబితాలో టాప్‌లో నిలిచింది. ప్రస్తుతం మహీంద్రా మూడు-డోర్ల థార్, ఐదు-డోర్ల థార్ రాక్స్‌ను కలిపి మార్కెట్లో విక్రయిస్తోంది. ఈ రెండింటి ద్వారా కంపెనీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది.

టీవీఎస్ టూ-వీలర్స్‌కు భారీ డిమాండ్.. జూపిటర్, ఐక్యూబ్‌ల కోసం క్యూ కట్టిన జనం!

భారతదేశపు అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన టీవీఎస్ మోటార్ (TVS Motor) మరోసారి తన సత్తా చాటింది. విశ్వసనీయమైన వాహనాలతో వినియోగదారుల హృదయాలను గెలుచుకున్న ఈ కంపెనీ, గత నెల (మార్చి-2025) ఏకంగా 2,97,622 యూనిట్ల ద్విచక్ర వాహనాలను (బైక్‌లు & స్కూటర్లు) విక్రయించి అదరగొట్టింది.
Advertisement

స్టైల్, శక్తి రెండు కలిపి మార్కెట్లోకి వచ్చిన కొత్త హంటర్ 350 బైక్

భారతదేశంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే ఏదో తెలియని ప్రత్యేకమైన అభిమానం. లం మారినా, తరాలు మారినా, ఈ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గకుండా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పాత కొత్త కలయికలతో కూడిన అదిరిపోయే డిజైన్లతో పలు మోడళ్లను విడుదల చేస్తూ రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రత్యేకమైన గుర్తింపును కొనసాగిస్తోంది. యువత నుంచి పెద్ద వయస్సు గల వారికి ఈ బ్రాండ్ నుంచి విడుదలయ్యే బైకులంటే చాలా ఇష్టం. తన వినియోగదారుల కోసం కంపెనీ కొత్త బైకును విడుదల చేసింది. ఈ మోడల్ పేరు 'హంటర్ 350 (Hunter 350)'. హంటర్‌హుడ్ ఫెస్టివల్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త హంటర్ 350ని తీసుకొచ్చి బుల్లెట్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇప్పటికే యువత హృదయాలను గెలుచుకున్న హంటర్, ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన రూపంలో మన ముందుకొచ్చింది.

టైర్ మార్చడానికి విసిగిపోయారా? ఈ సింపుల్ టిప్స్‌తో మీ టైర్ల లైఫ్ పెంచండి!

బైకులు, కార్లు, బస్సులు ఏ వెహికల్ అయినా వాటికి టైర్లు చాలా ముఖ్యమైనవి. వాహనం మొత్తం బరువును మోసేది టైర్లే. ముఖ్యంగా కార్లు వంటి వేగంగా వెళ్లే వాహనాల్లో టైర్ల పాత్ర చాలా కీలకం. అలాగే, తక్కువ మందం ఉండే బైక్ టైర్లను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అవసరం. పాత టైర్లను ఉపయోగించడం ప్రమాదకరం. మీ వాహనం టైర్లను తనిఖీ చేయడానికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫ్యాన్సీ నంబర్ కోసం బాలయ్య భారీ ఖర్చు.. ధర వింటే ఆశ్చర్యపోతారు!

కారు అనేది చాలామందికి ఒక సాధారణ ప్రయాణనికి ఉపయోడేది అయినా, కొందరికి అది సమాజంలో ఒక సోషల్ సింబాలిక్‌గా చూపించుకునేందుకు ఇష్టపడుతుంటారు. చాలా మంది తమ డ్రిమ్ కారును కొనుగోలు చేయడాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు. అయితే తమకు నచ్చిన కారును సొంతం చేసుకోవడంతో పాటు, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబరు కూడా తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలనుకోవడం చూస్తున్నాం. దేశంలోని పలు ప్రాంతాల్లో ఫ్యాన్సీ నంబర్ల కోసం వేలంలో లక్షలు ఖర్చు చేయడం సాధారణంగా మారిపోయింది. కారు నెంబర్ అంటే అది వ్యక్తి అభిరుచి, స్టేటస్ సింబల్, అలాగే ప్రత్యేకతను ప్రతిబింబించే ఒక గుర్తుగా నిలుస్తోంది. సినిమా తారలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇలా ప్రముఖులు తమ ఇష్టమైన నంబర్ల కోసం వేలం లాంటి పోటీల్లో పాల్గొనడం ఇటీవల కాలంలో ఎక్కువ అయింది.

125సీసీ సెగ్మెంట్‌లో ఈ రెండు బైక్‌లకు తిరుగులేదు! గ్లామరా? షైనా?

భారతదేశంలో అత్యంత పాపులారిటీ పొందిన 125సీసీ మోటార్‌సైకిళ్లలో హీరో గ్లామర్ 125, హోండా షైన్ 125 ముందు వరుసలో ఉంటాయి. ఇవి స్టైలిష్ డిజైన్‌తో పాటు అందుబాటు ధరలో మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి. ఇటీవల ఈ రెండు బైక్‌లు కూడా కొన్ని అప్‌డేట్‌లతో మార్కెట్‌లోకి వచ్చాయి. మరి ఈ రెండింటిలో జనాలకు ఏది బాగా నచ్చుతుందో తెలుసుకునేందుకు వాటి ధర, పనితీరు, ఫీచర్లను పోల్చి చూద్దాం!
Advertisement

మార్చిలో కేవలం 294 యూనిట్లు మాత్రమే... ఇన్విక్టోకు ఏమైంది?

దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీకి చెందిన ఇన్విక్టో (invicto), భారత ఆటోమొబైల్ రంగంలో ఓ ప్రముఖ MPVగా వెలుగులోకి వచ్చింది. టయోటా, మారుతీ మధ్య ఉన్న టెక్నాలజీ షేరింగ్ భాగస్వామ్య కారణంగా, టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆధారంగా రూపొందించబడిన ఈ కారును 2023 జులై నెలలో విడుదల చేశారు. అప్పట్లో, ఇది మారుతి నుంచి వచ్చిన అత్యంత ప్రీమియం MPVగా నిలిచింది. డిజైన్ పరంగా చూస్తే, ఆకర్షణీయమైన బాడీ లైన్స్, స్టైలిష్ గ్రిల్, మస్క్యులర్ ప్రొఫైల్ ఈ కారుకు ప్రత్యేకంగా నిలిచాయి. ఇన్విక్టోలో ఉన్న ఇంటీరియర్ ఇంకా ఫీచర్ల వలన కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో ఇది తన స్థానాన్ని నిలబెట్టుకోవడం మాత్రం కష్టంగా మారింది.