టయోటా కార్ల జోరు.. ఏప్రిల్ అమ్మకాలు చూస్తే షాకవ్వాల్సిందే!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మోటార్(Toyota Kirloskar Motor) భారతీయ మార్కెట్‌లో దుమ్ములేపుతోంది. ముఖ్యంగా ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, అర్బన్ క్రూజర్ హైరైడర్, టైసర్, గ్లాన్జా, హిలక్స్, ఫార్చ్యూనర్, రూమియన్ వంటి మోడళ్లకు వినియోగదారుల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

గత నెలలో కార్ల అమ్మకాల్లో దుమ్ములేపిన మారుతీ.. ఎన్నో తెలుసా?

ఏప్రిల్ నెల ముగిసి మే నెలలోకి అడుగుపెట్టాం. ఈ క్రమంలో వాహన తయారీదారులు తమ అమ్మకాల వివరాలను వెల్లడిస్తుంటారు. ఈ నేపథ్యంలో దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతీ సుజుకీ (Maruti Suzuki)తన అమ్మకాల నివేదికను వెల్లడించింది. దీని ప్రకారం, ఏప్రిల్ 2025లో కంపెనీ మొత్తం 1,79,791 కార్లను విక్రయించింది. ఈ మొత్తంలో దేశీయంగా జరిగిన విక్రయాలతో పాటు ఇతర దేశాలకు చేసిన ఎగుమతులు కూడా ఉన్నాయి. సేల్స్ నివేదిక ప్రకారం, ఇండియా మార్కెట్లో విక్రయించిన కార్ల సంఖ్య 1,42,053గా నమోదైంది. ఇది లోకల్‌గా వినియోగదారులు మారుతీ సుజుకీ బ్రాండ్ మీద పెట్టుకున్న నమ్మకాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుంది.

వేసవిలో మీ కారు ఏసీ ఐస్ లా ఉండాలంటే... ఇవి తప్పకుండా తెలుసుకోండి!

ఎండలు మండిపోతున్నాయి కదా, మీ కారు ఏసీ చల్లగాలి ఇవ్వట్లేదా? అయితే ఇవే కారణాలు ఉండొచ్చు! ఇప్పుడే చూసుకోండి. ఈ ఎండాకాలంలో మీ కార్లో ఏసీ సరిగ్గా పనిచేసి లోపల చల్లగా ఉంచకపోతే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏసీ సిస్టమ్‌లో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కొన్ని చిన్న చిన్న రిపేర్లతో పోతాయి.

భారతదేశంలో తక్కువ ధరలో పేద-మిడిల్ క్లాస్ వారికి టాప్ బెస్ట్ కార్లు ఇవే!

ఇండియాలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా ఉండటంతో ప్రజలు ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడు వినియోగదారులు కొత్త కారు కొనుగోలు చేసే ముందు మైలేజ్‌ను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎందుకంటే అధిక మైలేజ్ ఇచ్చేవి, నిర్వహణ ఖర్చులను కూడా తక్కువగా అవుతాయి. దీంతో చాలా వరకు డబ్బులను ఆదా చేసుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమయ్యే అత్యుత్తమ మైలేజ్ కార్ల జాబితాలో టాప్ కంపెనీలకు చెందిన పలు మోడళ్లు ఉన్నాయి. మైలేజ్ ఎక్కువ కావాలని కోరుకునే వారి కోసం ఈ కథనంలో భారత మార్కెట్లో మంచి మైలేజ్ అందించే 5 కార్ల గురించి ప్రత్యేకంగా ఇవ్వడం జరిగింది. మరి ఆ కార్లు ఎంటో ఒకసారి చూడండి.
Advertisement

కాలేజ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే..!

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా ఓలా, ఏథర్, టీవీఎస్, బజాజ్ వంటి బడా బ్రాండ్ల ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. పెట్రోల్ ఖర్చు లేకుండా సిటీలో రోజూ తిరగడానికి వీలుగా ఉండటంతో స్టూడెంట్స్ ఎక్కువగా ఎలక్ట్రిక్ స్కూటర్లు కొంటున్నారు.

దేశీయంగా తగ్గుదల, గ్లోబల్‌గా వృద్ధి.. హ్యుందాయ్ ఏప్రిల్ 2025 రిపోర్ట్

భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించిన హ్యుందాయ్ (Hyundai) చాలా కాలంగా వినియోగదారుల మనసు గెలుచుకుంటూ వస్తోంది. సాధారణంగా, ఈ దక్షిణ కొరియా కార్ల బ్రాండ్ భారత మార్కెట్లో నెలకు కనీసం 50,000 కార్లను విక్రయిస్తూ స్థిరమైన స్థానం ఏర్పరచుకుంది. మారుతీ సుజుకీ, టాటా మోటార్స్ వంటి తయారీదారులకు బలమైన పోటీగా అధునాతన ఫీచర్స్, ఆకట్టుకునే డిజైన్‌తో కార్లను దేశీయ మార్కెట్లో విడుదల చేస్తుంది. తాజాగా ఇటీవల విడుదలైన గణాంకాల ప్రకారం, ఏప్రిల్ 2025 నెలలో హ్యుందాయ్ అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం పడింది. ఏప్రిల్‌లో హ్యుందాయ్ భారతదేశంలో కేవలం 44,374 కార్లను మాత్రమే విక్రయించింది. ఇది సాధారణ అమ్మకాలతో పోలిస్తే గణనీయంగా తక్కువ.

ఫోక్స్‌వ్యాగన్ షాకింగ్ నిర్ణయం.. టైగూన్, వెర్టిస్ కార్లు రీకాల్!

పోలో, వెంటో వంటి మోడల్స్ నిలిచిపోవడంతో భారత మార్కెట్లో ఫోక్స్‌వ్యాగన్ కథ ముగిసిందని చాలామంది అనుకున్నారు. అయితే స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కలిసి ప్రారంభించిన టైగూన్, వెర్టిస్ మోడళ్లు కంపెనీకి మళ్లీ మంచి ఊపునిచ్చాయి. ప్రస్తుతం ఈ రెండు మోడళ్లు పోలో కంటే ఎక్కువ డిమాండ్‌తో దూసుకుపోతున్నాయి.

స్కోడా షాకింగ్ నిర్ణయం..వేలాది కార్లను రీకాల్ చేస్తున్న కంపెనీ!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ స్కోడా ఆటో ఇండియా తన వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది. దేశీయ మార్కెట్‌లో సక్సెస్ ఫుల్ గా అమ్ముడవుతున్న స్కోడా స్లావియా, కుషాక్, కైలాక్ మోడళ్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఏకంగా 25,000 యూనిట్లను వెనక్కి పిలుస్తున్నట్లు ప్రకటించింది. ఇంత పెద్ద సంఖ్యలో కార్లను రీకాల్ చేయడానికి గల కారణం ఏమిటంటే...
Advertisement

శక్తివంతమైన ఫీచర్లతో ఇసుజు తొలి ఎలక్ట్రిక్ పికప్ ట్రక్

జపాన్‌కు చెందిన ప్రముఖ వాహన తయారీ సంస్థ ఇసుజు కంపెనీ తన మొట్టమొదటి పూర్తిగా ఎలక్ట్రిక్ వన్-టన్ పికప్ ట్రక్ - D-Max EVని తీసుకొచ్చింది. ఇటీవల దీనిని యునైటెడ్ కింగ్‌డమ్‌లో జరిగిన 2025 కమర్షియల్ వెహికల్ షోలో ఆవిష్కరించడం ద్వారా, ఎలక్ట్రిక్ వాహనాల దిశగా ఓ కీలకమైన ముందడుగు వేసింది. ఈ ఎలక్ట్రిక్ పికప్‌ను మొదట థాయిలాండ్‌లో తయారు చేస్తోంది. ఇటీవలి కాలంలో పికప్ ట్రక్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ మార్కట్లో బాగా అమ్మకాలను సాధించే అవకాశం ఉంది. ఇసుజు తన తొలి ఎలక్ట్రిక్ వాహనం, D-Max EVను ప్రస్తుత డీజిల్-ఆధారిత డి-మాక్స్ డిజైన్‌కు అనుగుణంగా, కాని ఆధునిక ఎలక్ట్రిక్ టచ్‌తో రూపొందించింది. ఈ ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ మొదటిగా డబుల్ క్యాబ్ వేరియంట్‌లో అందించబడుతోంది.

గంటకు 343 కి.మీ...ఈ సూపర్‌కార్ స్పీడ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

ప్రముఖ ఇటాలియన్ సూపర్‌కార్ల తయారీ సంస్థ లంబోర్ఘిని తమ సరికొత్త మోడల్ టెమెరారియోను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. దాదాపు రూ. 6 కోట్ల ధరతో విడుదలైన ఈ మోడల్, గతంలో ఎంతో ప్రజాదరణ పొందిన హురాకాన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. గతేడాది ఆగస్టులో ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన ఈ సూపర్‌కార్ కేవలం 8 నెలల్లోనే భారతీయ రోడ్లపైకి రావడం విశేషం.

భారత రైల్వే షాకింగ్ డెసిషన్: స్లీపర్ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే జనరల్ కోచ్‌లోకి వెళ్లాల్సిందే!

మీరు తరచూ రైలు ప్రయాణం చేసేవారు అయితే, మే 1 నుండి అమలులోకి రానున్న భారత రైల్వే కొత్త నిబంధనలను తప్పకుండా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు, వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులు కొన్నిసార్లు స్లీపర్ లేదా ఏసీ కోచ్‌లలో ప్రయాణించేవారు. టికెట్ కన్ఫర్మ్ కాకపోయినా, స్థానికంగా టీటీ సహాయంతో లేదా ప్రయాణ సందర్భాన్ని బట్టి అనుమతితో ప్రయాణం సాగించగలిగేవారు. కానీ ఇకపై అటువంటి వెసులుబాటు ఉండదు. భారత రైల్వే తీసుకున్న తాజా నిర్ణయం ప్రకారం, మే 1, 2025 నుండి వెయిటింగ్ టికెట్ ఉన్న ప్రయాణికులను ఏసీ లేదా స్లీపర్ కోచ్‌లలోకి అనుమతించరు. కన్ఫర్మ్ టికెట్ లేకపోతే, ఆ ప్రయాణికుడు కేవలం జనరల్ (అన్‌రిజర్వ్డ్) కోచ్‌లో మాత్రమే ప్రయాణించవచ్చు.

కొండలైనా.. గుట్టలైనా.. ఈజీ ఎక్కగల 5 డోర్ల SUVలు ఇవే!

కొత్త కారు కొనాలనుకునే వారికి ఆఫ్-రోడ్ SUVలంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉంటుంది. ఇవి సాధారణ రోడ్లపై సులభంగా వెళ్లగలగడమే కాకుండా, గుంతలు, దిబ్బలు, కొండ ప్రాంతాల రోడ్లపై కూడా హాయిగా ప్రయాణించేలా రూపొందించబడి ఉంటాయి. ఇక్కడ అత్యంత శక్తివంతమైన, ప్రజాదరణ పొందిన ఆఫ్-రోడ్ SUVలైన మహీంద్రా థార్ రాక్స్, మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా మోడళ్ల గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.
Advertisement

డస్టర్ మళ్లీ వస్తోంది... ఈసారి బోరియల్ రూపంలో లాంచ్ కాబోతుంది!

భారతీయులకు రెనాల్ట్ (Renault) అంటే సాధారణంగా వెంటనే గుర్తొచ్చే పేరు డస్టర్ (Duster).ఒకప్పుడు భారతదేశపు SUV మార్కెట్‌ను ఊపేసిన ఈ మోడల్, నిజంగా రెనాల్ట్ బ్రాండ్‌కు ఊపునిచ్చింది. కియా, ఎంజిలాంటి బ్రాండ్‌లు ఇంకా మార్కెట్లోకి రాకముందే, రెనాల్ట్ భారతీయుల మనసుల్లో ఈ కారుకు బలమైన డిమాండ్ ఉండేది. డస్టర్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రోడ్లపై ఇప్పటికీ కొన్నిసార్లు కనపడుతుంటే దాన్ని అలాగే చూస్తిండిపోతాం. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా అప్‌డేట్‌లు లేకపోవడం, పోటీ బ్రాండ్‌ల హావ పెరగడం వల్ల డస్టర్ మార్కెట్‌లో నుంచి మెల్లగా మాయమయ్యింది. ఈ మోడల్ తరువాత రెనాల్ట్‌కు ఉన్న పేరు కాస్త తగ్గిపోయింది. అమ్మకాల పరంగా కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా పెద్దగా మెరుగ్గా రాణించలేకపోయింది. అ

మారుతి ఫ్యాన్స్‌కు నిరాశ.. ఇ-విటారా రాక ఆలస్యం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి నంబర్ వన్‎గా నిలుస్తుంది. ఆ కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కార్లలో మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki e-Vitara) ఒకటి.

టాటా పంచ్‌కు నిస్సాన్ మాగ్నైట్‌కు గట్టి పోటీ

నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్... ఈ రెండు కార్లు వాటి బ్రాండ్‌ల తరఫున మార్కెట్లో మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో వచ్చే కార్లు ఎప్పుడూ మార్కెట్‌కు శుభవార్లనే అందిస్తున్నాయి. కానీ, కొనేటప్పుడు ఏది బెస్టో తేల్చుకోవడం మాత్రం కాస్త కష్టమే. నిస్సాన్ మాగ్నైట్, టాటా పంచ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ రెండు కాంపాక్ట్ SUVలలో ఏది బెటరో చెప్పడానికి ఓ సారి రెండింటినీ పోల్చి చూద్దాం.

రూ.7.93 లక్షలతో కొత్త వెర్సిస్ 650 వచ్చేసింది.. BS6 ఫేజ్ 2 అప్‌డేట్

జపనీస్ కంపెనీ కవాసకి (Kawasaki) ఇండియాలో చాలా ఏళ్లుగా వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. అదిరిపోయే డిజైన్లతో యూత్‌ను ఆకట్టుకునే టూవీలర్స్‌ను విడుదల చేస్తుంది. కొత్త మోడళ్లను లాంచ్ చేస్తూనే అదే సమయంలో తన పాత వాటిని ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త కొత్త అప్‌డేట్‌లను జోడించి విడుదల చేస్తుంటుంది. ఈ క్రమంలో కంపెనీ తాజాగా తన ప్రీమియం అడ్వెంచర్ టూర్ బైక్ వెర్సిస్ 650 (versys 650)ను తాజా మరిన్ని లేటెస్ట్ ఫీచర్స్‌తో విడుదల చేసింది. మునుపటి మోడల్‌తో పోలిస్తే, కొత్త దానిలో ఆకట్టుకునే అప్‌డేట్స్ బోలేడు ఉన్నాయి. ఈ కొత్త వెర్షన్, మోడల్ ఇయర్ 2025 (MY25), భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 2025 నుండి అమలు చేస్తున్న తాజా BS6 ఫేజ్ 2 OBD2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించబడింది.
Advertisement

ఇక 40 రోజుల వెయిటింగ్ అక్కర్లేదు.. ఈవీ సబ్సిడీ కేవలం 5 రోజుల్లో మీ సొంతం!

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) వినియోగాన్ని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ప్రభుత్వం భారీగా సబ్సిడీ ఇస్తోంది.

ఎర్టిగా తర్వాత భారతీయుల ఇష్టమైన 7 సీటర్ కారు ఇదేనా?

భారతదేశంలో కుటుంబ ప్రయాణాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అందరు కలిసి ఒకే కారులో ఆడుతూ, పాడుతూ టూర్స్ లేదా ఇతర ప్రయాణాలకు వెళ్తుంటే ఆ ఎంజాయ్ వేరేగా చెప్పనవసరం లేదు. అందుకే దేశంలో ఏడు సీట్ల వాహనాలకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తక్కువ ధరలో లభిస్తూ, పెట్టిన ప్రతి రూపాయికి లాభం చేకూర్చే కార్లు ప్రస్తుతం మార్కెట్లో చాలా ఉన్నాయి. వాటిలో మారుతీ సుజుకీకి చెందిన ఎర్టిగా, టయోటా ఇన్నోవా వంటి కార్లు ఉన్నాయి. వీటితో పాటు దక్షిణ కొరియాకు కియా కంపెనీకి చెందిన కారెన్స్ (Kia Carens) కూడా ఇండియాలో కుటుంబ ప్రయాణాలకు అనువుగా ఉంటుంది. తాజాగా కియా నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కారెన్స్ అమ్మకాల వివరాలు వెల్లడయ్యాయి.

మార్కెట్లోకి మాస్ అట్రాక్షన్ బైక్.. కేవలం రూ.1.18 లక్షలకే

ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ ఒడిస్సే (odysse) స్పోర్టీ డిజైన్, అత్యాధునిక ఫీచర్స్‌తో కూడిన శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. దీని పేరు ఎవోకిస్ లైట్ (evoqis lite). ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ డిజైన్ చూడటానికి చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు కొనగలిగే విధంగా కంపెనీ దీన్ని రూ. 1.18 లక్షల ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంత తక్కువ ధరలొ టాప్ మోడళ్లలో ఉండే విధంగా అధునాతన ఫీచర్స్‌ను అందించారు. ధర పరంగా ఇది అందుబాటులో ఉండటంతో పాటు, ఫీచర్ల విషయంలో ఒడిస్సే ఎక్కడా రాజీ పడలేదు. ఇది యువ రైడర్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తుంది.

హోండా యూనికార్న్ ఇంతలా అమ్ముడుపోతోందా? దీని క్రేజ్ మామూలుగా లేదు!

భారతదేశపు అగ్రగామి, విశ్వసనీయమైన ద్విచక్ర వాహన తయారీ సంస్థ అయిన హోండా స్కూటర్ అండ్ మోటార్‌సైకిల్ ఇండియా తన బైక్‌లు, స్కూటర్‌లతో దేశీయ మార్కెట్‌లో బలమైన స్థానాన్ని కలిగి ఉంది. హోండా విడుదల చేసే ప్రతి వాహనం దాని ఆకర్షణీయమైన డిజైన్, అధునాతన సాంకేతికత, విశ్వసనీయతతో వినియోగదారులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
Advertisement

హంటర్ 350 Vs జావా 42 FJ.. ఎవరు బెస్ట్? డిజైన్, ఇంజిన్ మధ్య తేడాలు

దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రసిద్ధ మోడల్ హంటర్ 350ని మళ్లీ కొత్తగా అప్‌డేట్ చేసి భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. 2022లో తొలిసారి ప్రవేశపెట్టిన ఈ బైక్, ఇప్పుడు కొత్త ఫీచర్లతో, ఇంకా ఆకర్షణీయమైన రూపంతో రీ-ఎంట్రీ ఇచ్చింది. హంటర్ 350 అనేది కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, ఇది స్టైల్, హ్యాండ్లింగ్ వంటి పలు ప్రత్యేకతల కలయిక. ఈ బైక్, కంపెనీకి అత్యధిక విక్రయాలను తీసుకువచ్చిన క్లాసిక్ 350, బుల్లెట్ 350 మోడళ్లతో సమానంగా నిలిచే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా యువతలో దీనికి విపరీతమైన ఆదరణ ఉంది. హంటర్ 350 ప్రత్యేకత ఏమిటంటే, ఇది ట్రెడిషనల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ డిజైన్‌ను మోడ్రన్ టచ్‌తో కలిపి రైడర్లను అట్రాక్ట్ చేస్తుంది.

కారుతో సహా లిఫ్ట్ పడినా టాటా నెక్సాన్‌కు ఏమీ కాలేదు!

సేఫ్టీ, బిల్డ్ క్వాలిటీ అనే పదాలు వినిపిస్తే వెంటనే మనకు గుర్తుకు వచ్చే పేరు టాటా మోటార్స్. వినియోగదారులు లేదా వారి ఎక్స్‎పీరియన్స్‎లే దేశీయ వాహన తయారీదారుల అతిపెద్ద ప్రకటనలు. ఇంటర్నెట్ మీమ్స్‌లో చూసినట్లుగా ఒక ఫ్యామిలీగా మారిన తర్వాత చాలా మంది మారుతి కార్లను కాదని టాటా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు.

భారత రోడ్లపై బ్రిటిష్ స్టైల్.. కొత్త రేంజ్ రోవర్ ఎవోక్ ఆటోబయోగ్రఫీ లాంచ్

టాటా మోటార్స్ యాజమాన్యంలో నడుస్తున్న బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ ల్యాండ్ రోవర్ (Land Rover) గత కొన్ని సంవత్సరాలుగా ఇండియా మార్కెట్లో అమ్మకాల్లో దూసుకుపోతుంది. ముఖ్యంగా రేంజ్ రోవర్ సిరీస్‌కు సంబంధించి, దీని ప్రీమియం SUV మోడళ్లకు పెరుగుతున్న డిమాండ్, జాగ్వార్ ల్యాండ్ రోవర్ సంస్థకు మంచి ఆదాయ వనరులలో ఒకటిగా మారింది. ఈ క్రమంలో, కంపెనీ తాజాగా 2025 రేంజ్ రోవర్ ఎవోక్ ఆటోబయోగ్రఫీ (range rover evoque autobiography)ని మార్కెట్లోకి విడుదల చేసింది. అత్యున్నత నాణ్యత, అత్యాధునిక టెక్నాలజీ, స్టైలిష్ డిజైన్‌కు మారుపేరుగా నిలిచే ఈ కొత్త మోడల్, లగ్జరీ SUV మార్కెట్‌లో అత్యంత బెస్ట్ ఆప్షన్‌గా మారుతోంది.

బడ్జెట్‌లో బ్లాక్‌బస్టర్.. ఎక్కువ మైలేజ్ ఇచ్చే బెస్ట్ డీజిల్ కార్లు ఇవే !

భారతదేశంలో ఇప్పటికీ డీజిల్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని కొన్ని వాహన తయారీ కంపెనీలు దేశంలో ఇంకా డీజిల్ కార్లకు ప్రాధాన్యతనిస్తున్నాయి. వాటిని ఎక్కువ సంఖ్యలో విక్రయానికి అందుబాటులో ఉంచుతున్నారు. ఈ వార్తలో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న డీజిల్ కార్లలో అత్యధిక మైలేజ్ ఇచ్చే టాప్ 10 కార్ల గురించి తెలుసుకుందాం.
Advertisement

బజాజ్ మాస్టర్ ప్లాన్! డామినార్ 400తో మళ్లీ మార్కెట్‌ను షేక్ చేయబోతోంది!

బజాజ్ ఆటో (Bajaj Auto) నుంచి త్వరలో అప్ డేట్ చేయబడిన 2025 డామినార్ 400 (Dominar 400) మోటార్‌సైకిల్ విడుదల కానుంది. కొత్త డామినార్ 400 బైక్‌లు ఇప్పటికే బజాజ్ అధికారిక డీలర్‌షిప్ షోరూమ్‌లకు చేరుకోవడం మొదలయ్యాయి.