లుక్కు మార్చి కొత్తగా వస్తున్న టాప్ కంపెనీ కారు.. ఇక కొనడమే లేటు!
ఆటోమొబైల్స్
- 1 year, 8 month, 22 days ago
ఆటోమేటిక్ కార్ల వాడకం విషయంలో విదేశాల కంటే భారత్ కాస్త వెనకబడి ఉంది. ఎప్పుడైతే మారుతి సుజుకి సంస్థ సెలెరియో కారును లాంచ్ చేసిందో ఇక అప్పటి నుంచి భారత్‌లో ఆటోమేటిక్ కార్ల వాడకం జోరందుకుంది. సరసమైన ధరలో, ఆటోమేటిక్ గేర్ ఆప్షన్‌తో ఉన్న సెలెరియో కారు.. భారత్‌లో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం ఈ కారుకు సంబంధించి ప్రీమియం ఫీచర్లతో న్యూ జనరేషన్ కోసం స్పెషల్ ఎడిషన్ కారును మారుతి సంస్థ ఇటీవలే తీసుకువచ్చింది. సెలెరియో మిలానో వెర్షన్ పేరుతో వచ్చిన ఈ కారు స్టన్నింగ్ లుక్స్‌తో అదరగొడుతోంది. ఆ సంగతులేంటో చూసేద్దాం.