ఎదురు చూపులకు ఇక బ్రేక్ పడ్డట్టే… ఓలా నుంచి ఎలక్ట్రిక్ బైకులు త్వరలోనే రాబోతున్నాయ్!

ఎలక్ట్రిక్ టూ- వీలర్ తయారీలో బెంగుళూరుకు చెందిన ఓలా సంస్థ అదరగొడుతోంది. తక్కువ కాలంలోనే టూ- వీలర్ ఈవీల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటివరకు ఎలక్ట్రిక్ స్కూటర్లతో వినియోగదారులను ఆకట్టుకున్న ఈ సంస్థ.. ఇప్పుడు మరో అడుగు మందుకు వేసింది. ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను కూడా వినియోగదారుల ముందుకు తెచ్చేందుకు సిద్ధమవుతోంది. గతేడాది ఆగస్టులోనే.. ఓలా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తున్నట్లు ప్రకటించిందీ సంస్థ. అయితే.. ఇప్పుడు వీటి ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. ఇక త్వరలోనే ఈ బైకులు భారత రోడ్లపై ప్రయాణం మొదలుపెట్టనున్నాయి. ఈ బైకు ఫీచర్లు ఏంటి? వీటి ధర ఎంత ఉంటుంది? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

సింగిల్ ఛార్జ్‌తో 500 కి.మీల రేంజ్ ఇచ్చే మారుతీ మొదటి ఎలక్ట్రిక్ కారు..

ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్, cng వాహనాలతో పాటే ఈవీలను కూడా చాలా మంది కొనుగోలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే భారత్‌లోనే వీటి డిమాండ్ మరింత ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో దేశీయ కంపెనీలే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా మంచి పేరు కలిగిన వాహన తయారీదారులు తమ మోడళ్లను భారత్‌లో విడుదల చేస్తున్నారు. లోకల్ కంపెనీలు టాటా మోటార్స్, మహీంద్రా వంటి సంస్థలు ఇప్పటికే సాంప్రదాయ ఇంధన వాహనాలను లాంచ్ చేస్తూనే ఎలక్ట్రిక్ కార్లను కూడా తీసుకొస్తున్నారు. అయితే భారత్‌లో అతిపెద్ద వాహన తయారీదారుగా ఉన్న మారుతీ సుజుకీ మాత్రం ఈ విభాగంలో ఇంకా వెనుకబడి ఉంది. దీంతో మిగతా కంపెనీలకు పోటీగా ఈవీలలో కూడా తన సత్తాను చాటుకోడానికి దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ కారు కొత్త ఇ-విటారాను ఆవిష్కరించింది.

కారును ఉల్టా చేసి జాలీగా రైడ్… నీ ట్యాలెంట్ ముందు గ్రాఫిక్స్ కూడా పనికి రావు బ్రో!

సోషల్ మీడియాలో ఎన్నో వింతలు చక్కర్లు కొడుతుంటాయి. బైకులను, కార్లను వింతవింతగా మార్చి అలరిస్తుంటారు చాలా మంది. మొన్నామధ్య ఓ వ్యక్తి బైకును ఏటీఎంగా మార్చి వైరల్ అయ్యాడు. నంబర్ కొట్టగానే దాంట్లో నుంచి జ్యూస్, డబ్బులు వచ్చేలా చేసి ఔరా అనిపించాడు. ఇప్పుడు ఓ వ్యక్తి కారును ఊహించని రీతిలో మార్చేశాడు. సాధారణంగా ఏ వాహనానికైనా టైర్లు కింద ఉంటాయి. కానీ, ఈ వీడియోలో టైర్లు పైకి తెచ్చి వాహనాన్ని ఉల్టాపల్టా చేశాడు ఓ వ్యక్తి. దాన్ని రోడ్డుపై నడిపిస్తూ చక్కర్లు కొడుతున్నాడు. ఇదేదో గ్రాఫిక్స్ ట్రిక్కు అనుకుంటే పొరపాటే.. ఇది నిజంగా చేసిందే. ఇలా మార్చిన వ్యక్తి ఎవరు? ఈ కారు ఎలా నడుస్తోంది? వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.

సాహస యాత్రికులారా ఇక సిద్దం కండి.. మీ కోసమే మారుతీ అడ్వెంచర్ కారు

దేశీయ అతిపెద్ద వాహన తయారీదారు మారుతీ సుజుకీ ప్రతి ఏడాది కూడా సేల్స్ పరంగా ముందు స్థానంలో ఉంటుంది. మధ్యతరగతి వినియోగదారులను ఎక్కువగా టార్గెట్ చేస్తూ, కంపెనీ తన కార్లను అందుబాటు ధరలో విడుదల చేస్తూ దేశీయ ప్రజల్లో పేదల కలను నెరవేర్చే కంపెనీగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. గత ఏడాది 2024లో మొత్తం కార్ల సేల్స్ పరంగా మొదటి స్థానంలో నిలిచిన మారుతీ, కొత్త ఏడాది 2025లో కూడా తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి ఈ సంవత్సరం కూడా అధునాతన ఫీచర్లతో కూడిన మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇదే క్రమంలో కంపెనీ తన ప్రసిద్ధ మోడల్ గ్రాండ్ విటారా (Grand Vitara) కారుకు కొత్త వెర్షన్‌ అడ్వెంచర్ డిజైన్‌ను ఆవిష్కరించింది. దీనిని ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఒక కాన్సెప్ట్‌ కారుగా ప్రదర్శనకు ఉంచింది.
Advertisement

95 కి.మీల రేంజ్‌ ఇచ్చే సుజుకి యాక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ

దేశీయ, అంతర్జాతీయ కంపెనీలు వరుసగా ఎలక్ట్రిక్ టూవీలర్లను విడుదల చేస్తున్నాయి. సాంప్రదాయ ఇంధన వాహనాలతో పాటు ఈవీలకు కూడా మంచి ఆదరణ వస్తుండటంతో తయారీ దారులు పోటా పోటీగా అధునాతన ఫీచర్స్‌తో కూడిన మోడళ్లను విడుదల చేస్తూ, మార్కెట్లో తమ వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో అత్యంత ఘనంగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ఈవెంట్‌లో పలు వాహన తయారీ దారులు తమ ఎలక్ట్రిక్ మోడళ్లను ప్రదర్శనకు ఉంచారు. ఇదే కార్యక్రమంలో దిగ్గజ టూవీలర్ తయారీ కంపెనీ సుజుకి (Suzuki) కూడా రాబోయే తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ పేరు యాక్సెస్ ఇ స్కూటర్ (e scooter). ఇప్పటికే మార్కెట్లో సాధారణ యాక్సెస్ అమ్మకానికి అందుబాటులో ఉండగా, ఇది దేశీయంగా మంచి డిమాండ్ ఉన్న మోడల్. ఇప్పుడు దీనిని మరింత అప్‌డేట్ చేస్తూ, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకొస్తుంది.

కియా కొత్త కారు.. బుకింగ్స్‌లో నయా రికార్డు.. పెట్రోల్ మోడళ్లకు ఫిదా అవుతున్న కస్టమర్లు!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ ఇండియాలోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే ఇక్కడి లోకల్ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. ప్రతి ఏడాది భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త మోడళ్లను విడుదల చేస్తూ సేల్స్‌ను రెట్టింపు చేసుకుంటూ తన మార్కెట్‌ను బాగా విస్తరించుకుంటుంది. దేశీయ మార్కెట్లో కంపెనీ సెల్టోస్‌, సోనెట్ వంటి ఇతర మోడళ్లను విక్రయిస్తుంది. ఇతర కంపెనీలకు పోటీగా కొత్త కొత్త కార్లను తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తుంది. ఇదే క్రమంలో కియా డిసెంబర్ 19వ తేదీన 'సైరోస్ ఎస్‌యూవీ (Syros SUV)ని ఆవిష్కరించింది. అదిరిపోయే ఫీచర్స్, సరికొత్త రూపంతో లాంచ్ అయిన ఈ కారు బుకింగ్స్‌లను కూడా కంపెనీ ప్రారంభించింది.

జోరు మీదున్న హోండా... కొత్త వెర్షన్ బైకు లాంఛ్.. ప్రత్యర్థి సంస్థలకు గట్టి పోటీ పక్కా!

ప్రముఖ టూ- వీలర్ తయారీ సంస్థ హోండా తన జోరు చూపెడుతోంది. ఎన్నో ఏళ్లుగా తమ వాహనాలతో భారతీయులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ సంస్థ.. మరో కొత్త మోడల్‌తో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. తమ పాపులర్ మోడల్ అయిన "హోండా లివో" బైకుకు అప్‌డేటెడ్ మోడల్‌ను లాంఛ్ చేసింది. రూ.83.080(ఎక్స్- షోరూమ్) ప్రారంభ ధరగా ఉన్న ఈ బైకును అధునాతన ఫీచర్లను జోడించి తీసుకువచ్చారు. ఈ హోండా లివో బైకు‌కు సంబంధించి పూర్తి వివరాలు, స్పెసిఫికేషన్లు తదితర అంశాలు ఈ కథనంలో చూద్దాం.

కోట్లు విలువ చేసే లగ్జరీ కారుతో గేమ్ ఛేంజర్ మూవీ హీరోయిన్

భారత్‌లో లగ్జరీ కార్లకు ఆదరణ పెరుగుతుంది. చాలామంది ధనవంతులు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు ఎక్కువగా కోట్లు ఖర్చు చేసి మార్కెట్లోకి కొత్తగా విడుదలయ్యే టాప్ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లను కొనుగోలు చేసి తమ గ్యారేజీలో పెట్టుకుంటారు. ఇటీవల కాలంలో చాలా మంది సినితారలు ఇలాంటి వాటితో కనిపిస్తున్నారు. తాజాగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ప్రముఖ నటి కియారా అద్వానీ మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన ఖరీదైన లగ్జరీ కారు మేబ్యాక్ S-క్లాస్ లిమోసిన్ కారుతో కనిపించారు. ఈ కారుకు దేశంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికే ఇది ప్రముఖుల దగ్గర ఉంది. ఇటీవల విడుదల అయిన గేమ్ ఛేంజర్ మూవీలో నటించిన కియారా కోట్లు విలువ చేసే కారుతో కనిపించగా, తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Advertisement

ఆటో ఎక్స్‌పోలో ఈ హైబ్రిడ్ కారు మామాలుగా లేదు... పర్ఫార్మెన్స్‌లో ఈ కారు ఊర మాస్ !

బ్రిటన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. దిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో అదరగొడుతోంది. తమ బ్రాండ్ నుంచి కొత్త మోడళ్లను పరిచయం చేసి, వీక్షకులను చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తోంది. ఈ సంస్థ ఆవిష్కరించిన హైబ్రిడ్- స్పెక్ ZS ఎస్‌యూవీ ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గతేడాది ఏస్టర్ మోడల్ కారును తీసుకువచ్చి ఆకట్టుకుందీ సంస్థ. ఇప్పుడు ఈ కారుకు సంబంధించి అప్డేటెడ్ వెర్షన్‌గా ZS HEV పేరుతో ఈ కొత్త కారును ఆవిష్కరించింది. ఈ కారు పూర్తి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆటో ఎక్స్‌పో‌లో ఇండియాలోనే మోస్ట్ డిమాండ్ బైక్ రాజ్‌దూత్

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో వాహన తయారీ దారులు తమ మోడళ్లను ప్రదర్శనకు ఉంచారు. వీటిలో కార్స్, బైక్స్, వాణిజ్య వాహనాలు ఇతర వాటిని అందరికీ పరిచయం చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంలో 1980, 90ల కాలం నాటి రోజులను గుర్తు చేస్తూ ఒకప్పుడు భారతదేశ రోడ్లను శాసించిన బైక్స్‌ను దర్శనిమిస్తున్నాయి. ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ యమహా (Yamaha)కు చెందినటువంటి ఆర్‌డీ 350 (RD 350) బైక్ ఈ షోలో సందర్శకులను కనువిందు చేస్తుంది. దీనిని చూసిన చాలా మంది కూడా తమ పాత రోజులు గుర్తచ్చాయ్ అంటూ మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా దీని పేరు రాజ్‌దూత్ 350. కానీ అందరు కూడా ఆర్‌డీ 350 అని పిలుస్తారు. ఇది ఒకప్పుడు అందరి కలల బైక్. దీంతో రోడ్లపై వెళ్తుంటే, అందరి చూపు కూడా దీని మీదే ఉండేది.

ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలదే హవా.. అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చిన టాప్ 5 కార్లు ఇవే!

దేశంలో ఎస్‌యూవీల హవా కొనసాగుతోంది. గతేడాది బెస్ట్ సెల్లింగ్ వాహనాల్లో ఎక్కువగా ఎస్‌యూవీలే ఉన్నాయి. ఈ ఏడాది కూడా వీటి జోరు గట్టిగానే వినిపించనుంది. దిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్ పోలో.. అనేక దిగ్గజ వాహన తయారీ సంస్థలు తమ కొత్త ఎస్‌యూవీలను పరిచయం చేసి అదుర్స్ అనిపించాయి. ఇందులో మారుతీ సుజుకీ, హ్యూందాయ్, టయోటా, స్కోడా, ఎంజీ సంస్థలకు చెందిన కార్లు ఉన్నాయి. పైగా అవన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలే కావడం గమనార్హం. ఈవీలవైపు భారతీయులు ఎక్కువ మక్కువ చూపుతున్న నేపథ్యంలో ఈ సంస్థలు... ఈవీలవైపు దృష్టి పెట్టాయి. టాటా, మహీంద్రా సంస్థలు కూడా ఎస్‌యూవీలను ప్రదర్శించాయి. ఆ కార్ల పూర్తి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

రతన్ టాటా కంపెనీ నుంచి చిన్న వ్యాపారుల కోసం మిని ట్రక్

ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరు మారుమోగేలా ఎంతో అట్టహసంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఆటో ఎక్స్‌పో 2025 విజయవంతంగా జరుగుతుంది. ఈ ఈవెంట్‌లో వాహన తయారీదారులు తమ మోడళ్లను ప్రదర్శనకు ఉంచారు. కార్స్, బైక్స్, ఇతర విభాగాలకు చెందిన పలు మోడళ్లు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. వాణజ్య వాహనాలు కూడా ప్రస్తుత ఈవెంట్‌లో ప్రదర్శనకు అందుబాటులో ఉన్నాయి. పలు తయారీ దారులు సరుకుల రవాణాకు ఉపయోగించే వాహనాలను ఆవిష్కరించారు. వీటిలో కొన్ని ఇప్పుడు బుకింగ్స్‌కు ఉండగా, మరిన్ని మాత్రం భవిష్యత్తులో కొనుగోలుకు రాబోతున్నాయి. ఈ ఈవెంట్‌లో ప్రముఖ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) తన వాణిజ్య వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. వీటిలో మినీ ట్రక్ ఒకటి అక్కడికి వచ్చిన సందర్శకులను ఆకట్టుకుంటుంది.
Advertisement

పెద్ద కుటుంబానికి ఇంధ్రభవనంలా మెరిసిపోతున్న హ్యుందాయ్ ఈవీ

దక్షిణ కొరియాకు చెందినటువంటి ప్రముఖ కార్ల తయారి కంపెనీ హ్యుందాయ్(Hyundai) భారత్‌లో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ వంటి వాహన తయారీ కంపెనీలకు గట్టి పోటీగా నిలుస్తుంది. దేశరాజధాని ఢిల్లీలో జనవరి 17 నుంచి ప్రారంభమైన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో‌ 2025 కార్యక్రమంలో హ్యుందాయ్ తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. తన ఫేవరెట్ మోడల్ క్రెటా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆవిష్కరించిన కంపెనీ దీంతో పాటు ఐయోనిక్ 9 (Ioniq 9) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కూడా ఆవిష్కరించింది. ప్రస్తుతానికి మాత్రం ఈ కారు ఇండియా మార్కెట్లో తీసుకురావడానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. దీనిని అంతర్జాతీయంగా ఉత్తర అమెరికా, దక్షిణ కొరియా మార్కెట్లో మాత్రం మొదట అమ్మకానికి అందుబాటులో ఉంచుతారు. ఆ తరువాత ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. హ్యుందాయ్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మంచి మార్కెట్ ఉంది.

అయ్యయ్యో.. మారుతి సుజుకికి ఈ కారుతో తలనొప్పి.. అత్యంత తక్కువ ధరలో ఉన్నా కొనేవాళ్లు కరవు!

మారుతి సుజుకి.. భారత ఆటో మొబైల్ ఇండస్ట్రీలో ఈ పేరు ప్రత్యేకం. దేశవాసులకు ఎన్నో ఏళ్లుగా సుపరిచితమైన బ్రాండ్. ప్రత్యర్థి సంస్థలకు గట్టిపోటీనిస్తూ మార్కెట్లో టాప్‌లో కొనసాగుతున్న కంపెనీ. అయితే.. ఈ కంపెనీ ఇప్పుడు ఓ కారు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ కారు ధర అత్యంత తక్కువ ధరలో ఉన్నప్పటికీ.. దీన్ని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అదే మారుతి సుజుకి ఎస్- ప్రెస్సో మోడల్. గతేడాది డిసెంబరు నెలలో ఈ కారు అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఈ కారు ఎందుకు వినియోగదారులను ఆకట్టుకోలేకపోతోంది? ఇప్పటివరకు దీని అమ్మకాలు ఎలా సాగాయి? దీంట్లో ఉన్న ప్రధాన లోపాలేంటో ఇప్పుడు చూద్దాం.

ఆర్‌ఎక్స్ 100 లవర్స్‌కు బిగ్ గుడ్‌న్యూస్.. ఆటో ఎక్స్‌పోలో యూత్ కలల బైక్

దేశరాజధాని ఢిల్లీలో అత్యంత వైభవంగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో‌ కార్యక్రమంలో టూవీలర్ తయారీదారులు తమ మోడళ్లను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ యమహా (Yamaha)కూడా తన ఉత్పత్తులను ప్రదర్శిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యం విషయం ఏమిటంటే కంపెనీ టూవీలర్లలో ఒక మోడల్ అందరినీ ఆకట్టుకుంటుంది. అదే దేశంలోని అందరి యూత్ కలల బైక్ ఆర్‌ఎక్స్ 100 (RX100). ఇది 1980,90ల కాలంలో భారత దేశ రోడ్లపై ఒక తిరుగులేని బైక్. దీని ధాటికి మిగతా కంపెనీలకు చెందిన వాహనాలు విలవిల్లాడి పోయాయి. అప్పట్లో అమ్మకాల పరంగా సంచలనాలు క్రియేట్ చేసిన ఈ బైక్ 1985లో మార్కెట్లోకి అడుగుపెట్టింది. విడుదల అయిన అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ఇది హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. ప్రధానంగా దీని సైలెన్స‌ర్ నుంచి వచ్చే సౌండ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.

పేదల కోసం తక్కువ ధరలో అదిరిపోయే స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో‌ కార్యక్రమంలో దేశీయ కంపెనీలే కాకుండా అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిన వాహన తయారీ కంపెనీలు తమ కార్స్, బైక్స్, ఇతర వాణిజ్య వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి. ఈ క్రమంలో వియత్నాంలో ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ సంస్థగా ఉన్నటువంటి విన్‌ఫాస్ట్ (Vinfast) ఇండియాలో జరుగుతున్న ఆటో ఎక్స్‌పో 2025లో తన వాహనాలను ప్రదర్శిస్తుంది. ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇదే ఈవెంట్‌లో విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లను కూడా ఆవిష్కరించింది. ఇవి చాలా అధునాతనంగా ఉన్నాయి. ఇండియాలో ఈవీలకు గతంతో పోలిస్తే డిమాండ్ బాగా పెరిగింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉండగా, ఇప్పుడు భారతీయ వినియోగదారులకు కోసం ఇక్కడకు తీసుకొచ్చింది. ఇవి పేద, మధ్య తరగతి వినియోగదారులు కొనే విధంగా అందుబాటులో ధరలోనే ఉంటాయని తెలుస్తోంది. ఈ ఇ స్కూటర్ల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం..
Advertisement

మారుతి సుజుకి ఎలక్ట్రిక్‌ కారు ఆవిష్కరణ.. ఫీచర్లు, రేంజ్‌ చెక్‌ చేశారా?

గత కొన్నేళ్లుగా ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి. అందులో భాగంగా చాలా కార్లు మార్కెట్‌లోకి కొత్త కార్లను విడుదల చేస్తున్నాయి. 2025 ఆటో ఎక్స్‌పోలో e-విటారా ఆవిష్కరణతో మారుతి సుజుకి భారతదేశంలో ఎలక్ట్రిక్‌ వెహికిల్‌తో రంగ ప్రవేశం చేసింది. దేశంలోనే ప్రముఖ కార్ల తయారీదారుగా మారుతి సుజుకి అంతర్జాతీయ మార్కెట్లలో ఉంది. ఇన్నోవేటివ్ e-హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన e-విటారా కారు అధునాతన డిజైన్, ఫీచర్లతో అందుబాటులో ఉంది. e-విటారా మారుతి EVX కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందింది. ఇది మొదట 2023 జనవరిలో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తర్వాత అక్టోబర్‌లో జపాన్ మొబిలిటీ షోలో ప్రవేశపెట్టబడింది. ఇప్పుడు అధికారికంగా దీనిని పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టారు.

ఆటో ఎక్స్‌పోలో సూట్-కేస్‌ లాగా మడత పెట్టే ఇ స్కూటర్

ఢిల్లీలోని భారత్ మండపంలో ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచేలా మన దేశ ప్రతిష్టను పెంచేలా జరుగుతున్న అతిపెద్ద వాహన ఎగ్జిబిషన్ భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌‌లో దేశీయ, అంతర్జాతీయ తయారీదారులు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. వీటిలో కొన్నింటిని ఇప్పుడే మార్కెట్లోకి విడుదల చేస్తుండగా, మరికొన్నింటిని భవిష్యత్తు మోడళ్లుగా ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. ఈ వాహనాల ప్రదర్శనలో కొన్ని చిత్ర విచిత్రమైన రూపంతో కనువిందు చేస్తున్నాయి. దేశీయ దిగ్గజ కంపెనీ హోండా (Honda) తన ఉత్పత్తులను ఈ ఈవెంట్‌లో ప్రదర్శిస్తుండగా, వీటిలో ఒక కొత్త మోడల్ ఆటో ప్రియుల దృష్టిని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. ఇది ఒక సూట్-కేస్‌ మాదిరిగా ఉంది. అసలు ఇది ఎంటంటే, ఒక 'మోటోకాంపాక్టో ఇ-స్కూటర్‌(Motocompacto)'. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి మాత్రం బట్టలను తీసుకెళ్ళే సూట్-కేస్‌ లాగా కనిపిస్తుంది. ఆటో ఎక్స్‌పో ఈవెంట్‌లో చాలా మంది దీని గురించి ఆసక్తిగా తెలుసుకుంటున్నారు.

పెట్రోల్ కోసం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేని టాటా సరికొత్త పంచ్

దేశీయ దిగ్గజ వాహన తయారీ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) అత్యున్నత ప్రమాణాలతో కూడిన కార్లను విడుదల చేయడంలో ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం ఢిల్లీలో ఎంత అట్టహసంగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో టాటా తన వాహనాలను ఆవిష్కరించింది. ఇతర కంపెనీలకు పోటీగా కంపెనీ హారియర్ EV, సియెర్రా, అవిన్యతో సహా అనేక రకాల మోడళ్లను ఆవిష్కరించింది. ఇదే కార్యక్రమంలో టాటా మోటార్స్ ఫ్లెక్స్ ఫ్యూయల్ పంచ్ కారును అందరికీ పరిచయం చేసింది. ఈ కొత్త మోడల్ తక్కువ స్థాయిలో వాతావరణ ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఇటీవల కాలంలో గాలి కాలుష్యం బాగా పెరిగిపోయింది. దీంతో ఇలాంటి సమయంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు ప్రత్యామ్నాయ ఇంధన వాహనంగా బాగా ఉపయోగపడుతుంది.

హ్యూందాయ్‌తో టీవీఎస్ సంస్థ జట్టు.. ఈ త్రీవీలర్- ఫోర్ వీలర్ ఈవీలతో చేరుతాయి ఇంకో మెట్టు!

ఆటోమోబైల్ రంగంలో వినియోగదారులకు మంచి వాహనాలను అందించేందుకు పెద్ద సంస్థలు చేతులు కలపడం జరుగతూ ఉంటుంది. మారుతి సుజుకి, టయోటా వంటి దిగ్గజ సంస్థలు ఉమ్మడిగా ఇప్పటికే వాహనాలను కూడా తీసుకువచ్చాయి. ఇప్పుడు మరో రెండు దిగ్గజ సంస్థలు కలిసి పని చేయడానికి ముందుకు వచ్చాయి. దిల్లీలో జరుగుతున్న భారత్ మొబలిటీ‌ గ్లోబల్ ఎక్స్‌పోలో టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్, అలాగే మరో ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యూందాయ్ జట్టు కట్టినట్లు ప్రకటించాయి. భారత మార్కెట్లో.. ఎలక్ట్రిక్ త్రీవీలర్‌ను, మైక్రో 4 వీలర్ వాహనాలను తీసుకువచ్చేందుకు కలిసి పని చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇదే వేడుకలో... హ్యుందాయ్ సంస్థ ఈ మైక్రో మొబిలిటీ వాహనాల కాన్సెప్ట్‌లను కూడా పరిచయం చేసింది. ఆ విశేషాలేంటో చూసేద్దాం.
Advertisement

లగ్జరీ రూమ్ లాంటి అన్ని ఫీచర్స్ ఉన్న కియా కొత్త కారు

దక్షిణ కొరియా బ్రాండ్ కియా మోటార్స్ ఇండియాలో అడుగుపెట్టిన అనతి కాలంలో మంచి పేరును సంపాదించుకుంది. దేశీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త మోడళ్లను విడుదల చేస్తూ, టాటా మోటార్స్, హ్యుందాయ్ వంటి పలు వాహన తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి ఎదిగింది. 2024 ఏడాదిలో కొత్త కార్లను విడుదల చేసి మెరుగైన సేల్స్‌ను నమోదు చేసిన కియా ఇండియాలో తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఇతర కార్ల తయారీదారుల మాదిరిగా తన మోడళ్లను ప్రదర్శిస్తుంది. కంపెనీ ఈ ఈవెంట్‌లో కార్నివాల్ హై లిమౌసిన్ (carnival hi limousine) కారును ప్రదర్శనకు ఉంచింది. ఇది ఆకట్టుకునే డిజైన్‌తో పొడవుగా లగ్జరీ సదుపాయాలను కలిగి ఉంది. కియా కార్నివాల్‌ లైనప్‌లో ఈ కొత్త మోడల్ చాలా ఆకర్షణీయంగా ఉంది. లగ్జరీ ఫీచర్స్ బొలెడు ఉన్నాయి.

బైకు లుక్‌లో కనిపించే ఎలక్ట్రిక్ స్కూటర్.. దీని మీద రైడ్ వేరే లెవెల్ అంతే!

భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో టీవీఎస్ సంస్థ అదరగొడుతోంది. ఇప్పటికే అనేక సంస్థలు తమ వాహనాలను పరిచయం చేస్తూ ఆకట్టుకుంటుండగా.. టీవీఎస్ సంస్థ కూడా 'తగ్గేదేలే' అంటోంది. ఓ కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని పరిచయం చేసి వారెవా అనిపించింది. TVS X Nacht Fury Edition concept పేరుతో ఈ ఇ-స్కూటర్‌ను ప్రదర్శించింది. అదిరిపోయే డిజైన్‌తో, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఈ కాన్సెప్ట్ స్కూటర్ వీక్షకులను చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ఈ స్కూటర్‌లో ఉన్న విశేషాలేంటో చూసేద్దాం.

tvs నుంచి అదిరిపోయే స్కూటర్.. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరణ

దేశీయ ప్రముఖ టూవీలర్ తయారీ కంపెనీ టీవీఎస్ మోటార్స్ (TVS) ఢిల్లీలో ఎంతో ఘనంగా జరుగుతున్న భారత్ మొబలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో 2025 iQube ST కాన్సెప్ట్‌ను తాజాగా ఆవిష్కరించింది. ప్రస్తుతం ఉన్నటువంటి iQube ST ఆధారంగా దీనిని తీసుకొస్తున్నారు. ఈ కొత్త స్కూటర్ అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తుంది. దీని లుక్ చూసినట్లయితే ప్రీమియం మోడల్ లాగా అనిపిస్తుంది. ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శనకు ఉంచారు. ఈ స్కూటర్‌ చాలా ఆకట్టుకునే విధంగా ఉంటుంది. iQube ST ఎలక్ట్రిక్ స్కూటర్‌కి ఇది ప్రీమియం వెర్షన్ లాగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇప్పటికే ఈ ఈవెంట్‌లో చాలా రకాల ఈవీలు ఆవిష్కరించబడ్డాయి. ఇప్పుడు ఈ కొత్త ఎలక్ట్రిక్ రాకతో టీవీఎస్ కంపెనీ ఈవీ సెగ్మెంట్‌లో మరింత పుంజుకుంటుంది.

ఆటో ఎక్స్‌పోలో రాకెట్ వేగంతో దూసుకుపోయే BMW లగ్జరీ బైక్‌

జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ (BMW) ఇండియాలో కూడా మంచి మార్కెట్ కలిగి ఉంది. ఇది లగ్జరీ కార్లతో పాటు బైక్స్‌ను కూడా విడుదల చేస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా టూవీలర్లను లాంచ్ చేస్తుంది. దేశంలో కార్ల విభాగంతో పాటు, బైక్స్ అమ్మకాల్లో కూడా మెరుగైన సేల్స్‌ను సాధిస్తున్న కంపెనీ తాజాగా S1000 RR బైక్‌ను విడుదల చేసింది. దీనిని 2024 ఏడాది అక్టోబర్‌లో ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు దీన్ని దేశ రాజధాని ఢిల్లీలో ప్రపంచవ్యాప్తంగా వాహన పరిశ్రమను మన తిప్పుకునేలా ఎంతో అట్టహసంగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025 ఈవెంట్‌లో విడుదల చేసింది. జనవరి 17 నుంచి మొదలైన ఈ ఈవెంట్ 22వ తేదీ వరకు జరుగుతుంది.
Advertisement

క్రెటా విషయంలో హ్యుందాయ్ ‘తగ్గేదేలే’.. ఈసారి మరో డిఫరెంట్ వెర్షన్‌లో..

హ్యూందాయ్ క్రెటా.. లాంఛ్ అయిన అనతి కాలంలోనే వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఎస్‌యూవీ. ఈ కారు సేల్స్ పెంచుకుంటూ హ్యుందాయ్ సంస్థకు మంచి లాభాల్ని కూడా తెచ్చిపెట్టింది. ఈ ఎస్‌యూవీ.. డీజిల్, పెట్రోల్, టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో ఇప్పటివరకు మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే.. ఈ సంస్థ ఇప్పుడు న్యూ‌దిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వెర్షన్‌లోనూ క్రెటాను లాంఛ్ చేసింది. దాంతోపాటుగా ఈ ఈవెంట్‌లోనే క్రెటా మరో కొత్త వెర్షన్‌ను ఆవిష్కరించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. హ్యూందాయ్ క్రెటా ఫ్లెక్ల్‌ ఫ్యూయల్ మోడల్‌ను తీసుకువచ్చింది. ఈ కొత్త కారు మోడల్‌లో ఉండే విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.