దూసుకెళ్తున్న మహీంద్రా బొలెరో.. క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు!
ఆటోమొబైల్స్
- 1 month, 28 days ago
భారత మార్కెట్లో మహీంద్రా కార్లకు మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాలక అనువుగా ఉండే మహీంద్రా బొలెరో (Mahindra Bolero) అంటే గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో చాలా మంది కొంటుంటారు. ఇదోక ఎస్‌యూవీ. బలమైన బాడీ నిర్మాణంతో ఆకట్టుకుంటుంది. చాలా సంవత్సరాలు గా మార్కెట్లో ఉన్నప్పటికీ, ఇప్పటికీ కూడా తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. బొలెరో గత నెలలో కూడా అమ్మకాల పరంగా తన సత్తా ఎలా ఉందో తెలియజేసింది. 2026, జూన్ నెలలో ఈ కారును 9,115 మంది కొనుగోలు చేశారు. ఇది గత ఏడాదితో పోలిస్తే 22 శాతం బలమైన వృద్ధిని సాధించింది.