హీరో డెస్టినీ 125 దూకుడు.. 26 వేల యూనిట్లు అమ్ముడై 76% వృద్ధి!
ఆటోమొబైల్స్
- 2 month, 22 days ago
భారతీయ స్కూటర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్‌కు బలమైన స్థానం సంపాదించడం అంత సులభం కాలేదు. ఒకప్పుడు హీరో ప్లెజర్ మంచి విజయాన్ని అందుకున్నప్పటికీ, ఆ తర్వాత కంపెనీ తీసుకొచ్చిన అనేక స్కూటర్ మోడళ్లు మార్కెట్లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. ముఖ్యంగా హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సెస్ వంటి బలమైన ప్రత్యర్థుల మధ్య హీరో తన ఉనికిని చాటుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. అయితే పరిస్థితి ఇప్పుడు క్రమంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. కొత్త తరం హీరో డెస్టినీ 125 (Hero Destini 125) మార్కెట్లోకి వచ్చిన తర్వాత కంపెనీ స్కూటర్ విభాగంలో తిరిగి పుంజుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి.