హోండా యాక్టివా కంటే పెద్దదైన కొత్త మ్యాక్సీ స్కూటర్

భారతదేశంలో ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్ వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ హోండా (Honda) ఈ విభాగంలో తన ఉనికిని మరింత బలపరచేందుకు కీలక అడుగులు వేస్తోంది. ముఖ్యంగా మ్యాక్సీ-స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, కంపెనీ హోండా ఏడీవీ160 (Honda ADV160) అనే కొత్త మోడల్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ స్కూటర్ 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో దేశీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

బ్యాక్ పెయిన్ రాకుండా అప్రిలియా నుంచి సరికొత్త బైక్

బైక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త అప్‌డేట్ వచ్చేసింది.. ప్రముఖ ప్రీమియం టూ-వీలర్ల తయారీ సంస్థ అప్రిలియా (Aprilia), అంతర్జాతీయ వరల్డ్ మోటార్‌సైకిల్ డే సందర్భాన్ని పురస్కరించుకుని భారతదేశంలో సరికొత్త 2026 అప్రిలియా టువొనో 457 స్పెషల్ ఎడిషన్ (Aprilia Tuono 457 Special Edition) బైక్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసింది.. రేసింగ్ ట్రాక్‌లపై దూసుకెళ్లే బైకులకు పెట్టింది పేరైన అప్రిలియా, ఈ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ.3.99 లక్షలుగా నిర్ణయించింది.. 2006 నాటి క్లాసిక్ మోడల్ టువొనో 1000ఆర్ స్పూర్తితో దీనిని ముస్తాబు చేశారు. విశేషం ఏంటంటే, ఇది మార్కెట్లో ఉన్న రెగ్యులర్ (స్టాండర్డ్) మోడల్ ధర కంటే కేవలం రూ.2,000 మాత్రమే ఎక్కువ. దేశవ్యాప్తంగా ఉన్న ఎంపిక చేసిన అప్రిలియా షోరూమ్‌లలో దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డిజైన్ పరంగా ఈ స్పెషల్ ఎడిషన్ బైక్ చూడటానికి ఎంతో అగ్రెసివ్‌గా, స్పోర్టీగా కనిపిస్తుంది. దీనిని కస్టమర్ల కోసం రెండు సరికొత్త ప్రీమియం కలర్ ఆప్షన్లలో కంపెనీ తీసుకొచ్చింది.

హైబ్రిడ్ పవర్ చూపించిన యమహా.. రే ZR సేల్స్‌లో సునామీ!

జపాన్‌కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ (Yamaha Motor) కంపెనీ భారతీయ మార్కెట్లో తన స్థాయిని మరింత బలపరుచుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా స్కూటర్ విభాగంలో యువతతో పాటు కుటుంబ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతికత, ఆకర్షణీయమైన డిజైన్, మెరుగైన ఇంధన సామర్థ్యంతో కూడిన ఉత్పత్తులను అందిస్తోంది. ఈ క్రమంలో యమహా రే జెడ్ఆర్ 125 ఎఫ్‌ఐ హైబ్రిడ్ (Yamaha RayZR 125 Fi Hybrid) స్కూటర్ వినియోగదారుల నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంటోంది. స్టైలిష్ లుక్, తక్కువ బరువు, చురుకైన పనితీరు, హైబ్రిడ్ అసిస్ట్ టెక్నాలజీ వంటి అంశాలు ఈ స్కూటర్‌ను మార్కెట్లో ప్రత్యేకంగా నిలబెట్టాయి.

ట్రాఫిక్‌లో ఎక్కువసేపు ఇరుక్కుంటే మీ వాహనానికి ఏమవుతుందో తెలుసా?

Heavy Traffic Effects on Cars. ట్రాఫిక్ జామ్ వల్ల ఇంజిన్ ఓవర్ హీటింగ్, క్లచ్ అరుగుదల మరియు మైలేజీ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. మీ వాహనాన్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ఈ చిట్కాలు పాటించండి.
Advertisement

బెస్ట్ మైలేజ్ ఇచ్చే టాప్ 5 CNG కార్ల పై భారీ డిస్కౌంట్

భారతదేశంలో ఇంధన ధరల పెరుగుదల మధ్యతరగతి ప్రజలకు పెద్ద భారంగా మారింది. ఈ నేపథ్యంలో సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ (ICE) వాహనాలతో పోలిస్తే SUV కార్ల డిమాండ్ మార్కెట్లో రోజురోజుకు అమాంతం పెరుగుతోంది. SUV ధరల్లో ఇటీవల స్వల్ప మార్పులు వచ్చినప్పటికీ, ఇవి పెట్రోల్ కంటే చాలా చౌకగా లభిస్తాయి. వీటికి తోడు ఇవి అద్భుతమైన మైలేజీని ఇస్తూ, తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తూ పర్యావరణహితంగా ఉంటాయి. ఈ క్రమంలో ఈ నెలలో కొత్త కారు కొనాలనుకునే వారి కోసం దేశంలోని టాప్ 3 కంపెనీలైన హ్యుందాయ్, మారుతి సుజుకి, టాటా మోటార్స్ తమ పాపులర్ 5 మోడళ్లపై భారీ ఆఫర్లను ఇస్తున్నాయి.

బడ్జెట్ ఈవీ కస్టమర్లపై పడనున్న అదనపు భారం

భారతదేశ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. ఎంతో కాలం ఎదురుచూసిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి (2026)లో లాంచ్ అయిన మారుతి సుజుకి ఫస్ట్ ఎలక్ట్రిక్ SUV ఇ-విటారా (eVitara) ధరలను కంపెనీ మొదటిసారిగా పెంచుతున్నట్లు ప్రకటించింది. కారు తయారీకి అవసరమైన ముడిసరుకుల ధరలు పెరగడం, మార్కెట్ లో ఉన్న ద్రవ్యోల్బణ పరిస్థితుల వల్లే ఈ ధరల సవరణ చేయాల్సి వచ్చిందని కంపెనీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ధరల పెంపు సాధారణ వేరియంట్లతో పాటు బ్యాటరీ-ఆస్-ఎ-సర్వీస్ (BaaS) మోడళ్లకు కూడా వర్తిస్తుంది.

డ్రైవింగ్ స్టైల్ వాహన ఖర్చులను ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ నిజం తెలుసుకోండి!

Vehicle maintenance tips. మీ డ్రైవింగ్ అలవాట్లు మీ వాహన ఖర్చులను ఎలా పెంచుతాయో తెలుసుకోండి. సరైన డ్రైవింగ్ పద్ధతులతో మైలేజీని పెంచుకుని, రిపేర్ ఖర్చులను తగ్గించుకునే మార్గాలు ఇక్కడ ఉన్నాయి.

పెట్రోల్ బంకుల్లో కొత్త రకం మోసం

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ రోజుల్లో.. పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలు వాహనదారులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి.. తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‎లో అనుజ్ అగ్నిహోత్రి అనే యూజర్ షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది.. ఒక బైక్ నడిపే వ్యక్తి బంకులో రూ.500 పెట్రోల్ కొట్టమని చెబితే, అక్కడి ఉద్యోగి అతడిని నమ్మించి చాలా తెలివిగా పెట్రోల్ దొంగతనం చేశాడు.. ఈ మోసమంతా బంకులోని సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవ్వడంతో అసలు విషయం బయటపడింది.
Advertisement

షోరూమ్ లిఫ్ట్ నుంచి కిందపడి ముక్కలైన బ్రాండ్ న్యూ కియా కారు

సొంతంగా ఒక కారు కొనుగోలు చేసి, దానిని ఫ్యామిలీతో కలిసి డెలివరీ తీసుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన అనుభూతి. కానీ ఒక కస్టమర్‌కు మాత్రం ఈ సంతోషం కాస్తా పెద్ద షాక్‌గా మారింది. కియా షోరూమ్‌లో కారు కొనుగోలుకు సంబంధించిన అన్ని రకాల పేపర్‌వర్క్, డాక్యుమెంటేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది.

రెనాల్ట్ సరికొత్త SUVల లుక్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే

భారతీయ కార్ల మార్కెట్లో తన పట్టును మరింత బలపరుచుకోవడానికి ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ (Renault) ఒక భారీ మాస్టర్ ప్లాన్‌తో ముందుకు వస్తోంది. కంపెనీ తన futuREady ప్రాజెక్ట్ కింద 2030 నాటికి భారతదేశంలో పలు సరికొత్త మోడళ్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ప్రణాళికలో భాగంగా రెనాల్ట్ ఇటీవల తన సరికొత్త బ్రిడ్జర్ (Bridger) కాన్సెప్ట్ కారును ప్రదర్శించింది. ఈ కాన్సెప్ట్ ఆధారంగానే భవిష్యత్తులో 4-మీటర్ల కంటే తక్కువ పొడవుండే ఒక పవర్‌ఫుల్ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీని రెనాల్ట్ సంస్థ మార్కెట్లోకి తీసుకురానుంది.

టాటా కార్ల ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా సరికొత్త అప్‌డేట్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాటా హారియర్, సఫారీ కార్లు వాటి లుక్స్, రోడ్ ప్రెజెన్స్, అద్భుతమైన ఫీచర్లతో మంచి అమ్మకాలను సాధిస్తున్నాయి. అయితే ఇవి మోనోకాక్ ప్లాట్‌ఫామ్‌ పై ఆధారపడి నిర్మించబడటం వల్ల వీటిలో ఆఫ్‌రోడింగ్‌కు ఉపయోగపడే 4×4 డ్రైవ్‌ ట్రెయిన్ సిస్టమ్ అందుబాటులో లేదు. టాటా ఫ్యాన్స్ చాలా కాలంగా ఈ ఫీచర్ కావాలని కోరుతుండటంతో, కంపెనీ ఇప్పుడు వారి డిమాండ్‌ను నెరవేర్చడానికి పటిష్టమైన లైనప్‌ ను సిద్ధం చేస్తోంది.

వర్షాకాలంలో మైలేజ్ ఎందుకు తగ్గుతుంది? అసలు విషయం ఇదే!

Fuel efficiency tips for monsoon. వర్షాకాలంలో మీ కారు మైలేజ్ అకస్మాత్తుగా తగ్గిపోతుందా? రోడ్లపై నీరు, ఏసీ వాడకం మరియు టైర్ ప్రెజర్ వంటి కారణాల వల్ల ఇంధన వినియోగం పెరుగుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
Advertisement

ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎక్కువగా అమ్ముడుపోతుంది ఇదే

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, టీవీఎస్ (Tvs) మోటార్ కంపెనీ తన ఐక్యూబ్ (Iqube) ఎలక్ట్రిక్ స్కూటర్‌తో అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. సాంప్రదాయ పెట్రోల్ వాహనాల విభాగంలో ఇప్పటికే బలమైన స్థానం సంపాదించిన టీవీఎస్, ఇప్పుడు ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో కూడా తన సత్తాను చాటుతోంది. ముఖ్యంగా ఐక్యూబ్‌కు వినియోగదారుల నుంచి లభిస్తున్న ఆదరణ నెల నెలా పెరుగుతుండటం కంపెనీకి పెద్ద ఊరటనిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి పెరుగుతుండగా, టీవీఎస్ ఐక్యూబ్ తన విశ్వసనీయత, ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చులతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

దేశవ్యాప్తంగా చాలా మంది ఈ చిన్న బండినే ఎక్కువగా కొంటున్నారు

భారత టూవీలర్ మార్కెట్లో మోపెడ్ విభాగానికి వస్తే, టీవీఎస్ ఎక్స్ఎల్ 100 (tvs Xl 100) పేరు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దశాబ్దాలుగా సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు, రైతులు, గ్రామీణ ప్రాంతాల వినియోగదారులకు నమ్మకమైన తోడుగా నిలుస్తున్న ఈ మోపెడ్, మరోసారి తన సత్తా చాటుకుంది. 2026 మే నెలలో TVS XL 100 అమ్మకాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేసి, దేశీయ మార్కెట్లో తన బలమైన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా చిన్న వ్యాపారాలు, డెలివరీ సేవలు, రోజువారీ రవాణా అవసరాల కోసం మోపెడ్‌ల వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా తక్కువ నిర్వహణ ఖర్చు, అధిక లోడ్ మోసే సామర్థ్యం, అద్భుతమైన మైలేజ్ కారణంగా TVS XL 100కు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

హైవేలో టైర్ పంక్చర్ అయితే ఏం చేయాలి? ప్రాణాలు కాపాడే ఈ స్టెప్స్ తప్పక తెలుసుకోండి!

Highway safety tips. హైవేపై ప్రయాణించేటప్పుడు అకస్మాత్తుగా టైర్ పంక్చర్ అయితే కంగారు పడకుండా ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో, సురక్షితంగా టైర్ ఎలా మార్చుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకోండి.

హీరో బెస్ట్ సెల్లర్‌కు బ్యాడ్ టైమ్.. కొనేవాళ్లు ఎక్కడికి పోయారు?

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hf Deluxe) ఒకటి. తక్కువ ధర, మంచి మైలేజ్, సులభమైన నిర్వహణ ఖర్చులతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఈ బైక్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే తాజాగా విడుదలైన అమ్మకాల గణాంకాలు హీరో మోటోకార్ప్‌కు పెద్ద షాక్ ఇచ్చాయి. సాధారణంగా ప్రతి నెలా మంచి అమ్మకాలను నమోదు చేసే హెచ్‌ఎఫ్ డీలక్స్, ఈసారి గణనీయమైన అమ్మకాల క్షీణతను చవిచూసింది. గ్రామీణ మార్కెట్లలో అత్యధికంగా అమ్ముడయ్యే మోడళ్లలో ఒకటిగా నిలిచిన ఈ బైక్, గత కొన్ని సంవత్సరాలుగా హీరో మోటోకార్ప్ అమ్మకాలలో కీలక పాత్ర పోషిస్తోంది.
Advertisement

టాటా కొత్త ట్రంప్ కార్డ్.. సియెర్రా CNGతో ప్రత్యర్థులకు టెన్షన్!

భారతీయ SUV మార్కెట్లో టాటా మోటార్స్ (tata motors) మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దేశీయ మార్కెట్లో ప్రవేశించి మంచి ఆదరణ పొందిన టాటా సియెర్రా (sierra) ఇప్పుడు CNG వెర్షన్‌లో కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ రన్నింగ్ ఖర్చుతో కూడిన వాహనాలపై వినియోగదారుల ఆసక్తి నేపథ్యంలో, కంపెనీ తన ప్రముఖ SUVకి CNG పవర్‌ట్రెయిన్‌ను జోడించే పనిలో ఉన్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. నవంబర్ 2025లో భారత మార్కెట్లో అధికారికంగా విడుదలైన టాటా సియెర్రా, తన ప్రత్యేక డిజైన్, ఆధునిక ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, బలమైన పనితీరుతో వినియోగదారులను ఆకట్టుకుంది.

ఆర్మీ యూనిఫామ్ రంగుల్లో ఏప్రిలియా స్కూటర్లు

ప్రముఖ ఇటాలియన్ టూవీలర్ తయారీ సంస్థ ఏప్రిలియా (Aprilia) భారత మార్కెట్లో తన SR 125, SR 175 స్కూటర్లకు కొత్త ట్రిబ్యూట్ ఎడిషన్‌లను విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, స్పోర్టీ లుక్‌తో ఇప్పటికే యువతలో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ స్కూటర్లు ఇప్పుడు మరింత ప్రత్యేక రూపంలో వినియోగదారుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం భారతదేశంలో ఏప్రిలియా విక్రయిస్తున్న ప్రధాన స్కూటర్ మోడళ్లైన SR 125, SR 175లకు ఈ ప్రత్యేక ఎడిషన్‌లను ఒకేసారి పరిచయం చేయడం విశేషం. ఈ కొత్త ట్రిబ్యూట్ ఎడిషన్‌లలో ఇంజిన్, పనితీరు లేదా ఫీచర్ల పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. స్టాండర్డ్ మోడళ్లలో ఉన్న అదే మెకానికల్ సెటప్, అదే ఫీచర్లు ఇందులో కూడా కొనసాగుతున్నాయి.

అందరూ ఊహించకముందే మారుతి షాక్

భారతదేశంలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల విప్లవానికి మరో కీలక అడుగు పడింది. దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki) ఇటీవల భారతదేశపు తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ హ్యాచ్‌బ్యాక్‌గా వ్యాగన్ఆర్(Wagonr)ను అధికారికంగా మార్కెట్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ కారు ఆవిష్కరణ జరిగిన వెంటనే డెలివరీలు ప్రారంభం కావడం ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కొత్త టెక్నాలజీతో కూడిన వాహనాలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత వాటి డెలివరీలు ప్రారంభం కావడానికి నెలలు లేదా కొన్ని సందర్భాల్లో సంవత్సరాల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అయితే మారుతి మాత్రం ఈ విషయంలో అందరి అంచనాలను తారుమారు చేస్తూ, కారు విడుదలైన కొద్ది రోజుల వ్యవధిలోనే వినియోగదారులకు వాహనాలను అందించడం ప్రారంభించింది.

లాంగ్ డ్రైవ్‌లో ఇంధనం సేవ్ చేయాలా? ఈ స్మార్ట్ ట్రిక్స్ ఫాలో అయితే మైలేజ్ పెరుగుతుంది!

Fuel Saving Tips for Long Drives. లాంగ్ డ్రైవ్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించుకోవడానికి, మైలేజ్ పెంచుకోవడానికి ఈ సింపుల్ డ్రైవింగ్ ట్రిక్స్ మరియు మెయింటెనెన్స్ చిట్కాలు పాటించండి.
Advertisement

దేశం మొత్తం ఎదురు చూస్తున్న టైం వచ్చేసింది

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) తన సరికొత్త ఎలక్ట్రిక్ బ్రాండ్ ఫ్లయింగ్ ఫ్లీ (Flying Flea) కింద రూపొందించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఫ్లయింగ్ ఫ్లీ సీ6 (Flying Flea C6) డెలివరీలను అధికారికంగా ప్రారంభించింది. దీనితో కంపెనీ ఇంధన ఆధారిత వాహనాల నుంచి ఎలక్ట్రిక్ శకంలోకి గ్రాండ్‌గా అడుగుపెట్టింది. ఈ క్రేజీ బైక్ డెలివరీలు ప్రస్తుతం బెంగళూరు నగరంలో మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ప్రముఖ నగరాలకు కూడా ఈ విక్రయాలను విస్తరించడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కేవలం స్మార్ట్ ఫోన్ ధరకే అదిరిపోయే ఎలక్ట్రిక్ స్కూటర్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా కొనసాగుతోంది. ముఖ్యంగా తక్కువ ధరలో ఎక్కువ రేంజ్ ఇచ్చే ఈ-స్కూటర్లను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్ స్కూటర్ల ధరలు లక్ష దాటిపోవడంతో, దైనందిన అవసరాల కోసం లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లు బెస్ట్ ఆల్టర్నేటివ్‎గా మారాయి. మోటార్ వెహికల్ యాక్ట్ 1988 నిబంధనల ప్రకారం, 25కిమీ లోపు టాప్ స్పీడ్ ఉన్న వాహనాలకు ఎలాంటి ప్రభుత్వ పర్మిషన్లు, లైసెన్సులు అవసరం లేదు. అలాంటి టాప్ 5 స్కూటర్ల వివరాలు తెలుసుకుందాం.

వాహన నిర్వహణ ఖర్చులు పెరగకుండా ఎలా కంట్రోల్ చేయాలి? ఈ స్మార్ట్ మార్గాలు తెలుసుకోండి!

Vehicle Maintenance Tips. మీ కారు లేదా బైక్ మెయింటెనెన్స్ ఖర్చులను తగ్గించుకోవడానికి ఈ సింపుల్ చిట్కాలు పాటించండి. ఇంజిన్ ఆరోగ్యం మరియు టైర్ల సంరక్షణతో భారీ ఖర్చుల నుండి తప్పించుకోవచ్చు.

ఇంకొన్ని రోజుల్లో అందరూ ఈ కారు గురించే మాట్లాడుకుంటారు

భారత మధ్య తరహా SUV మార్కెట్‌లో పోటీ రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్న సమయంలో, నిస్సాన్ (Nissan) తన కొత్త ఎస్‌యూవీ 'టెక్టన్ (Tekton)'తో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతోంది. జూలై 9న ఈ కొత్త మోడల్‌ను అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ఈ విభాగంలో అనేక ప్రముఖ మోడళ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నప్పటికీ, టెక్టన్ తన ప్రత్యేక డిజైన్, ఆధునిక ఫీచర్లు, గ్లోబల్ స్టైలింగ్‌తో వినియోగదారుల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది. ఈ మోడల్ రాకను ప్రకటిస్తూ నిస్సాన్ ఇండియా విడుదల చేసిన తాజా టీజర్ వీడియో ఆటోమొబైల్ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా కంపెనీ ఫ్లాగ్‌షిప్ SUV అయిన ప్యాట్రోల్ నుంచి స్ఫూర్తి పొందిన డిజైన్ భాష ఇందులో కనిపించడం విశేషం.
Advertisement

దేశంలో ఈ స్కూటర్ క్రేజ్ మామూలుగా లేదు

భారత టూవీలర్ మార్కెట్‌లో స్కూటర్ల విభాగం రోజురోజుకు మరింత బలపడుతున్న నేపథ్యంలో, వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుని స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతున్న మోడళ్లలో టీవీఎస్ జూపిటర్ (Tvs Jupiter) ఒకటి. కుటుంబ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన ఈ స్కూటర్, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభవం, మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు, విశ్వసనీయ పనితీరు కారణంగా దేశవ్యాప్తంగా విస్తృత ఆదరణను పొందుతోంది. యువత నుంచి మధ్య వయసు వారివరకు, మహిళల నుంచి ఉద్యోగులకు వరకు ప్రతి వర్గం వినియోగదారులను ఆకర్షించగలిగిన అరుదైన స్కూటర్లలో జూపిటర్ ఒకటిగా నిలిచింది. ఈ ప్రజాదరణ అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది.