కార్ల ప్రపంచాన్ని షేక్ చేయబోతున్న కొత్త బ్రెజ్జా
ఆటోమొబైల్స్
- 2 month, 27 days ago
భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీల విభాగంలో మారుతి బ్రెజ్జాకు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే ఇటీవల కాలంలో టాటా, మహీంద్రా, హ్యుందాయ్ కంపెనీల నుంచి వచ్చిన కొత్త మోడళ్ల పోటీని తట్టుకోలేక బ్రెజ్జా అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-10 కార్ల లిస్ట్ నుంచి బ్రెజ్జా వెనకబడిపోవడంతో మారుతి సుజుకి అలర్ట్ అయింది. కస్టమర్లను మళ్లీ తనవైపు తిప్పుకోవడానికి సరికొత్త డిజైన్, పవర్‌ఫుల్ ఇంజిన్ తో బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను తీసుకురావడానికి క్షేత్రస్థాయిలో రోడ్ టెస్టింగ్‌లను ముమ్మరం చేసింది.