యూత్ కోసం స్పెషల్‌గా రెడీ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) అభిమానులకు ఎంతో ఇష్టమైన హంటర్ 350 (Hunter 350) ఇప్పుడు 2026 అవతారంలో మరింత ఆకర్షణీయంగా మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే నగర యువతలో మంచి క్రేజ్ సంపాదించిన ఈ బైక్, కొత్త మార్పులతో మరింత స్టైలిష్‌గా, ఫీచర్ల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. కంపెనీ ఈసారి కేవలం చిన్న అప్డేట్స్‌తో ఆగకుండా, పూర్తిగా లైనప్‌ను విస్తరించేలా కొత్త వేరియంట్‌ను కూడా పరిచయం చేసింది. ఈ కొత్త హంటర్ 350లో ముఖ్యమైన ఆకర్షణ 'బేస్ ప్రీమియం' వేరియంట్. ఇది బేస్ వేరియంట్‌కు కాస్త పైస్థాయిలో ఉండేలా రూపొందించారు. పేరు వినగానే అర్థమయ్యేలా, ఈ వేరియంట్ ప్రాథమిక హంటర్ డిఎన్‌ఎను కొనసాగిస్తూ, మరికొన్ని అదనపు ఫీచర్లను అందిస్తుంది.

ఏంటి ఆఫర్ ఇస్తున్నారా ? లేక కారే ఫ్రీగా ఇస్తున్నారా ?

కార్ల ప్రేమికులకు ఇది నిజంగా పండగ లాంటి వార్త. ప్రముఖ వాహన తయారీ సంస్థ ఎంజీ మోటర్ ఇండియా (MG Motor India) ఏప్రిల్ 2026 నెలకు సంబంధించి అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. కొత్త కారు కొనాలనే ప్లాన్‌లో ఉన్నవారికి ఇది సరైన సమయం. ఎలక్ట్రిక్ కార్ల నుంచి పవర్‌ఫుల్ ఎస్‌యూవీల వరకు దాదాపు అన్ని మోడళ్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని మోడళ్లపై ఏకంగా రూ.3.5 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

35 కిమీ మైలేజీతో మారుతి హైబ్రిడ్ సునామీ

మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ముఖ్యంగా టాటా నెక్సాన్ మీ ఫేవరెట్ లిస్ట్‌లో ఉందా? అయితే ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మార్కెట్లోకి నెక్సాన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అదిరిపోయే కాంపాక్ట్ ఎస్‌యూవీలు (SUVs) వరుసగా అడుగుపెట్టబోతున్నాయి. స్కోడా నుంచి స్టైలిష్ కారు, మారుతి నుంచి అదిరిపోయే మైలేజీ ఇచ్చే హైబ్రిడ్ మోడళ్లు ఇలా ఒక్కటేమిటి.. రాబోయే రోజుల్లో ఆప్షన్లు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఆ వివరాలేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఇక సెలవు.. ఇన్నాళ్లు ఆదరించినందుకు కృతజ్ఞతలు

భారతీయ రోడ్ల మీద రారాజుగా వెలుగుతున్న టయోటా ఇన్నోవా క్రిస్టా ప్రయాణం త్వరలోనే ముగియబోతోంది. దశాబ్ద కాలంగా మధ్యతరగతి కుటుంబాల నుంచి రాజకీయ నాయకుల వరకు, ట్రావెల్ ఆపరేటర్ల నుంచి బిజినెస్ మెన్ల వరకు అందరి మనసు గెలుచుకున్న ఈ కారుకు టయోటా గుడ్ బై చెప్పబోతోంది. టయోటా తీసుకున్న ఈ నిర్ణయం వాహన ప్రేమికులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
Advertisement

మీల్స్ ధరకే ధమ్ బిర్యానీ దొరికినట్టు.. చిన్న కారు ధరలో పెద్ద ఎస్‌యూవీ

భారతీయ ఆటోమొబైల్ రంగంలో టాటా మోటార్స్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల కలల కారుగా మారిన టాటా పంచ్ (Tata Punch) ఇప్పుడు మార్కెట్లో తిరుగులేని రారాజుగా నిలిచింది. 2026 మార్చి నెలలో విడుదలైన అమ్మకాల నివేదికలు చూస్తుంటే, ఇతర దిగ్గజ కంపెనీలకు చెమటలు పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు మారుతి ఆల్టో లాంటి కార్లు ఏలుతున్న ధరల పరిధిలోకి టాటా పంచ్ తన మైక్రో ఎస్‌యూవీ ఫీచర్లతో దూసుకొచ్చి, అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది.

600 రూపాయల కోసం యమహా ఇంత ప్లాన్ వేసిందా?

భారత టూవీలర్ మార్కెట్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యమహా కంపెనీ, ఏప్రిల్ 2026 నుంచి తన స్కూటర్ల ధరలను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. యువతను విపరీతంగా ఆకర్షించే రే జెడ్ఆర్ 125 (RayZR 125), పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఏరోక్స్ 155 (Aerox 155) మోడళ్ల ధరలను కంపెనీ పెంచింది. సాధారణంగా ఏటా చేసే ధరల సవరణలో భాగంగానే ఈ పెంపు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఈ ధరల పెంపు కస్టమర్లపై పెద్దగా భారం పడకుండా స్వల్పంగానే ఉండటం గమనార్హం. యమహా రే జెడ్ఆర్ 125యమహా రే జెడ్ఆర్ 125 సిరీస్‌లోని అన్ని వేరియంట్లపై దాదాపు 660 రూపాయల ధర పెరిగింది. ఇందులో డ్రమ్, డిస్క్, డిస్క్ డీలక్స్, స్ట్రీట్ ర్యాలీ మోడల్స్ ఉన్నాయి. ఈ పెంపుతో రేజెడ్ఆర్ 125 హైబ్రిడ్ మోడల్ ధర ఇప్పుడు ఎక్స్-షోరూమ్ వద్ద రూ. 74,960 నుంచి రూ. 82,460 వరకు పలుకుతోంది. ఇక స్ట్రీట్ ర్యాలీ మోడల్ కావాలనుకుంటే రూ. 87,560 చెల్లించాల్సి ఉంటుంది. ధర పెరిగినప్పటికీ స్కూటర్ డిజైన్ లేదా ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు చేయలేదు. అదే 125 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజన్, హైబ్రిడ్ సిస్టమ్ పవర్ అసిస్ట్‌తో ఇది కస్టమర్లను పలకరించనుంది.

మారుతి కారుపై ఏకంగా రూ.3.65లక్షల డిస్కౌంట్

మారుతి సుజుకి కార్లు అంటేనే మన భారతీయ మధ్యతరగతి కుటుంబాలకు ఒక నమ్మకం. తక్కువ ఖర్చు, ఎక్కువ మైలేజీ, రీసేల్ వాల్యూలో వీటికి సాటి మరొకటి లేదు. అయితే ఇప్పుడు లగ్జరీ విభాగంలో కూడా మారుతి తన సత్తా చాటుతోంది. మారుతి సుజుకి నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన, లగ్జరీ 7-సీటర్ కారు ఇన్విక్టో (Maruti Suzuki Invicto) పై ఇప్పుడు కళ్లు చెదిరే ఆఫర్లు నడుస్తున్నాయి. ఏప్రిల్ 2026 నాటికి ఈ కారుపై ఏకంగా లక్షల రూపాయల డిస్కౌంట్ ప్రకటించి కంపెనీ అందరినీ ఆశ్చర్యపరిచింది.

మార్కెట్లో అల్లకల్లోలం.. దీంతో పెద్ద ఎస్‌యూవీల పని ఖతం

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. సాధారణంగా మారుతి అంటే స్విఫ్ట్, డిజైర్, బ్రెజా వంటి మోడళ్లే మనకు గుర్తొస్తాయి. కానీ, ఇప్పుడు సీన్ మారింది. కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన మారుతి సుజుకి విక్టోరిస్ (Maruti Suzuki Victoris) ఎస్‌యూవీ మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. కేవలం కొద్ది నెలల క్రితమే లాంచ్ అయిన ఈ కారు, అమ్మకాల్లో దూసుకుపోతూ టాప్-10 కార్ల జాబితాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మార్చి 2026 నెలలో ఏకంగా 11,062 మంది కస్టమర్లు ఈ కారును సొంతం చేసుకున్నారంటే దీని క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Advertisement

గతుకుల రోడ్లలో అతుకులు లేని ప్రయాణాలకు ఈ కార్లే బెస్ట్

వేసవి హాలీడేస్ వచ్చాయంటే చాలు.. అందరూ పట్టణాలు వదిలి పల్లెటూరికో లేదా చల్లని కొండ ప్రాంతాలకో చలోమని వెళ్తుంటారు. అయితే హైవేలు ఉన్నంత సేపు కారు సాఫీగానే సాగుతుంది. కానీ పల్లెటూరి కచ్చా రోడ్లు, గుంతలు, రాళ్లు రప్పలతో కూడిన దారుల్లోనే కారు అసలుసిసలు పరీక్ష మొదలవుతుంది. మండే ఎండలో కారు ఏసీ మొరాయించినా లేదా గుంతల దెబ్బకు సస్పెన్షన్ విరిగిపోయినా మీ ట్రిప్ మొత్తం పాడవుతుంది. అందుకే ఇలాంటి కఠినమైన రోడ్లకు సరిపోయే, కొండల్లాంటి గుంతలను కూడా ఈజీగా దాటేసే 5 పవర్‌ఫుల్ ఎస్‌యూవీల (SUVs) గురించి వివరంగా తెలుసుకుందాం.

దేశంలో అందరూ కొంటున్న బెస్ట్ 7 సీటర్ కారు ఇదే

భారతదేశంలో 7-సీటర్ సెగ్మెంట్‌లో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. కుటుంబ అవసరాలకు పూర్తిగా సరిపోయేలా రూపొందించిన ఈ MPV, అందుబాటు ధర, విశాలమైన అంతర్గత స్థలం, మంచి మైలేజ్ వంటి ముఖ్యమైన అంశాలతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. పెద్ద కుటుంబాలకు సరిపోయే సౌకర్యవంతమైన సీటింగ్, లాంగ్ డ్రైవ్స్‌లో కూడా కంఫర్ట్‌ను అందించే సస్పెన్షన్, అలాగే తక్కువ నిర్వహణ ఖర్చులు కలిపి ఎర్టిగాను చాలా మంది ఫ్యామిలీల మొదటి ఎంపికగా మార్చాయి. నగరాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లోనూ సమానంగా డిమాండ్ ఉండటం దీని విజయానికి ప్రధాన కారణం. తాజాగా ఈ కారుకు సంబంధించిన అమ్మకాలు విడుదలయ్యాయి. ఆ వివరాలు ఈ కథణంలో చూద్దాం.

మిడిల్‌క్లాస్ ఫేవరెట్ బాలెనో.. సేల్స్‌లో మరోసారి టాప్ గేర్!

భారతీయ కార్ల మార్కెట్‌లో మారుతి సుజుకి (Maruti Suzuki)కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సాధారణ కుటుంబాల నుంచి యువత వరకు అందరికీ అందుబాటులో ఉండే కార్లతో ఈ బ్రాండ్ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లోకి వస్తే, వెంటనే గుర్తుకు వచ్చే పేరు బాలెనో (Maruti Suzuki Baleno). బాలెనో చాలా కాలంగా మార్కెట్‌లో ఉన్నప్పటికీ, తన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. అందుబాటు ధరలోనే ఆకట్టుకునే ఫీచర్లు, విశాలమైన ఇంటీరియర్, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం, మంచి పనితీరు, మెరుగైన మైలేజ్ ఈ అన్ని అంశాలు కలిసి ఈ కారును వినియోగదారుల ఫేవరెట్‌గా మార్చాయి. అందుకే ప్రతి నెలా అమ్మకాల పరంగా బాలెనో స్థిరంగా మంచి గణాంకాలను నమోదు చేస్తూ వస్తోంది.

టీవీఎస్ మోటార్ షాక్.. ఒక్క నెలలో 5 లక్షలకు పైగా అమ్మకాలు!

టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) భారతదేశంలో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ సంస్థ, నాణ్యత, నూతన సాంకేతికత, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిన వాహనాలతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించింది. స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, మోపెడ్‌లు వంటి విభిన్న విభాగాల్లో టీవీఎస్ తన ఉత్పత్తులను అందిస్తూ, గ్రామీణ ప్రాంతాల నుంచి మెట్రో నగరాల వరకు విస్తరించిన వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంది. ముఖ్యంగా మైలేజ్, పనితీరు, ధరల మధ్య సమతూకాన్ని కలిగిన మోడళ్లతో టీవీఎస్ మార్కెట్‌లో బలమైన పోటీని ఇస్తోంది. తాజాగా ఈ కంపెనీ తన అమ్మకాల వివరాలను వెల్లడించింది.
Advertisement

గ్రామీణం నుంచి నగరాల వరకు హీరో హవా.. సేల్స్ జోరు ఇదే!

ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన హీరో మోటోకార్ప్ (Hero MotoCorp) మరోసారి తన సేల్స్ శక్తిని నిరూపించింది. 2026 మార్చి నెలలో కంపెనీ నమోదు చేసిన అమ్మకాల గణాంకాలు చూస్తే, మార్కెట్‌లో దాని ఆధిపత్యం ఎంత బలంగా ఉందో స్పష్టంగా తెలుస్తోంది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఈసారి హీరో మోటోకార్ప్ మరింత వేగంతో ముందుకు దూసుకెళ్లింది. 2025 మార్చిలో 5,49,604 యూనిట్లు విక్రయించిన కంపెనీ, 2026 మార్చిలో 5,98,198 యూనిట్లను అమ్ముతూ గణనీయమైన పెరుగుదల సాధించింది. ఈ పెరుగుదల కేవలం సంఖ్యల పరంగా మాత్రమే కాకుండా, బ్రాండ్‌పై వినియోగదారుల విశ్వాసం రోజురోజుకూ పెరుగుతోందనే విషయాన్ని కూడా తెలియజేస్తోంది.

4 కార్లతో చదరంగం ఆడుతున్న కంపెనీ

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు బలమైన స్థానం కలిగిన హోండా కార్స్ ఇండియా (Honda Cars India), గత కొన్ని సంవత్సరాలుగా తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడంలో సవాళ్లను ఎదుర్కొంటోంది. కొత్త మోడళ్ల కొరత, పెరుగుతున్న పోటీ, ముఖ్యంగా SUV సెగ్మెంట్‌లో ఇతర కంపెనీలు వేగంగా ఎదగడం వంటి కారణాలతో హోండా తన పాత జోరును కొనసాగించలేకపోయింది. అయినప్పటికీ, బ్రాండ్‌పై ఉన్న నమ్మకం పూర్తిగా తగ్గిపోలేదు. ప్రస్తుతం హోండా భారతదేశంలో పరిమిత మోడల్ లైన్‌ప్‌తోనే కొనసాగుతోంది. ముఖ్యంగా హోండా సిటీ (Honda City), హోండా అమేజ్ (Honda Amaze) వంటి కార్లు ఇప్పటికీ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. వీటి నాణ్యత, కంఫర్ట్, విశ్వసనీయత కారణంగా ఒక స్థిరమైన కస్టమర్ బేస్‌ను నిలబెట్టుకున్నాయి.

నిస్సాన్ దూకుడు.. 10,338 యూనిట్లు సేల్, 98% భారీ వృద్ధి!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) భారత మార్కెట్లో తన స్థానం బలపరచుకోవడానికి ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తోంది. ప్రారంభంలో ఊహించినంత స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయినప్పటికీ, ఇటీవల కాలంలో కంపెనీ పనితీరు గణనీయంగా మెరుగుపడుతోంది. ముఖ్యంగా 2026 మార్చి నెల అమ్మకాల గణాంకాలు చూస్తే, నిస్సాన్ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మార్చి 2026లో నిస్సాన్ మొత్తం 10,388 యూనిట్ల అమ్మకాలను నమోదు చేయడం ఒక పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇందులో 4,408 కార్లు భారతదేశంలోనే డెలివరీ చేయబడగా, మిగిలిన వాహనాలు విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేయబడ్డాయి.

37 ఇంచుల టైర్లతో ఇది భూమిపై తిరిగే రాక్షస వాహనం

దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ (Hyundai) నుంచి మరో అద్భుతం ఆవిష్కృతమైంది. న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఆటో షో 2026 వేదికగా హ్యుందాయ్ తన పవర్‌ఫుల్ అడ్వెంచర్ కాన్సెప్ట్ SUV బౌల్డర్ (Boulder)ను ప్రపంచానికి పరిచయం చేసింది. కొండలు, గుట్టలు, బురద దారులు.. ఇలా ఎలాంటి కష్టతరమైన రోడ్డుపైనైనా సాఫీగా దూసుకుపోయేలా ఈ రాక్షస వాహనాన్ని తీర్చిదిద్దారు. ఆటోమొబైల్ ప్రియులను ఫిదా చేస్తున్న ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.
Advertisement

ఈ కారు అందం చూస్తే.. పక్కింటోడు అసూయ పడాల్సిందే

జర్మన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) తన పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ టైగూన్ (Taigun)ను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తీసుకురావడానికి రంగం సిద్ధం చేసింది. ఎంతో కాలంగా కస్టమర్లు ఎదురుచూస్తున్న టైగూన్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కు సంబంధించి కంపెనీ తాజాగా ఒక ఆసక్తికరమైన టీజర్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 9, 2026న ఈ కారు ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా లాంచ్ కానుంది.

తక్కువ బడ్జెట్ ఉన్నవారు ఈ రెండు కార్లనే కొంటున్నారు

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki), మార్చి 2026తో పాటు మొత్తం ఎఫ్‌వై 2026 ఆర్థిక సంవత్సరాన్ని కూడా ఆకట్టుకునే అమ్మకాల గణాంకాలతో ముగించింది. ఈ కాలంలో కంపెనీ ప్రదర్శించిన పనితీరు, మార్కెట్‌లో తన స్థిరమైన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. మార్చి 2026లో దేశీయ అమ్మకాలు, ఎగుమతులు కలిపి మొత్తం 2.25 లక్షల యూనిట్లను అధిగమించడం గమనార్హం. ఇది ఒకే నెలలో సాధించిన పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. అదే సమయంలో, మొత్తం FY2026లో కంపెనీ విక్రయాలు 2.4 మిలియన్ యూనిట్లకు పైగా చేరడం, మారుతి సుజుకి దూకుడు ఎంత బలంగా కొనసాగుతుందో తెలియజేస్తోంది. ఈ సంఖ్యలు కేవలం అమ్మకాల పరంగా మాత్రమే కాకుండా, వినియోగదారుల నమ్మకం, బ్రాండ్ స్ట్రెంగ్త్, విస్తృతమైన ఉత్పత్తి శ్రేణికి నిదర్శనం.

ఇ-విటారా తొలి నెలలో 2,205 యూనిట్లు సేల్!

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి (Maruti Suzuki), ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి అడుగుపెట్టిన క్షణం నుంచే పరిశ్రమలో ఒక కొత్త చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వాహనాలతో మార్కెట్‌ను ఏలిన ఈ సంస్థ, ఇప్పుడు భవిష్యత్తు మొబిలిటీ వైపు తన దృష్టిని మళ్లిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాల యుగంలోకి ప్రవేశించింది. ఈ మార్పుకు ప్రతీకగా నిలిచింది సంస్థ తీసుకొచ్చిన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మారుతి సుజుకి ఇ-విటారా (Maruti Suzuki e Vitara). ఎంతోకాలంగా వినియోగదారులు ఎదురుచూస్తున్న ఈ మోడల్, మొదట గత సంవత్సరం ఆటో ఎక్స్‌పోలో ప్రపంచానికి పరిచయం చేయబడింది. అప్పుడే దీని డిజైన్, టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ అప్రోచ్ ఆటోప్రియులను ఆకట్టుకుంది.

12 లక్షల మందిని ఫిదా చేసిన డుగ్ డుగ్ బండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే కేవలం ఒక బైక్ మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఈ విషయాన్ని మరోసారి నిరూపిస్తూ.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 12,38,659 యూనిట్లను విక్రయించి, అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 23 శాతం వృద్ధిని సాధించింది. 2024-25లో ఈ సంఖ్య 10,09,900గా ఉండేది. కేవలం ఏడాది కాలంలోనే అదనంగా రెండు లక్షలకు పైగా బైకులను రోడ్లపైకి తెచ్చి తన సత్తా చాటింది.
Advertisement

టయోటా ఇండియా సేల్స్ దూకుడు.. 4 లక్షలు దాటి కొత్త రికార్డ్!

ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత, నాణ్యతకు ప్రతీకగా నిలిచిన జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా మోటార్ కార్పోరేషన్ (Toyota Motor Corporation) భారత కార్ల మార్కెట్‌లో దాదాపు 25 సంవత్సరాల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. అయితే ఈ ప్రయాణం మొదట్లో అంత సులభం కాదు. భారతీయ వినియోగదారుల అభిరుచులు, ధరలపై సున్నితత్వం, స్థానిక పోటీదారుల బలమైన స్థానం కారణంగా టయోటా తన స్థిరమైన పట్టు సాధించడానికి కొంత సమయం తీసుకుంది. కానీ కాలక్రమేణా వ్యూహాలను మార్చుకుంటూ మెల్లగా తన స్థాయిని బలోపేతం చేసుకుంది. ఈ విజయానికి కీలక పాత్ర పోషించినది టీకెంఎమ్ (Toyota Kirloskar Motor). జపాన్‌కు చెందిన టయోటా మోటార్, భారతదేశానికి చెందిన కిర్లోస్కర్ సిస్టమ్స్ మధ్య ఏర్పడిన సంయుక్త సంస్థ, భారత మార్కెట్‌కు సరిపోయే విధంగా ఉత్పత్తులు, వ్యూహాలను అమలు చేసింది.

మనోళ్లే కాదు విదేశీయులు కూడా ఈ కార్లంటే పిచ్చెక్కి పోతున్నారు

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి దేశీ మార్కెట్లోనే కాదు, విదేశీ గడ్డపై కూడా జెండా పాతేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కంపెనీ కళ్లు చెదిరే అమ్మకాల గణాంకాలను నమోదు చేసింది. ముఖ్యంగా విదేశీయులు మారుతి కార్ల ఫీచర్లు, మైలేజీకి ఫిదా అయిపోతున్నారు. ఏకంగా 4.47 లక్షల మంది విదేశీయులు మారుతి కార్లను కొనుగోలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ అద్భుతమైన విజయం వెనుక ఉన్న అసలు కారణాలు తెలుసుకుందాం.

రెనాల్ట్ కంబ్యాక్ స్ట్రాంగ్‌గా.. అమ్మకాలలో భారీ జంప్!

ఫ్రెంచ్ ఆటోమొబైల్ దిగ్గజం రెనాల్ట్ (Renault) భారత మార్కెట్‌లో మరోసారి తన సత్తాను చాటుకుంది. మార్చి 2026 అమ్మకాల గణాంకాలు బయటకు వచ్చిన తర్వాత, కంపెనీ నిజంగా ఒక బలమైన కంబ్యాక్ చేసినట్టు స్పష్టమైంది. గత కొంతకాలంగా అమ్మకాల విషయంలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన రెనాల్ట్, ఈసారి మాత్రం అంచనాలకు మించి ప్రదర్శన చూపించింది. కంపెనీ విడుదల చేసిన వివరాల ప్రకారం, మార్చి 2026లో మొత్తం 5,046 యూనిట్ల వాహనాలను విక్రయించింది. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, బ్రాండ్‌పై తిరిగి పెరుగుతున్న వినియోగదారుల నమ్మకానికి నిదర్శనం. గత సంవత్సరం ఇదే సమయంలో కంపెనీ 2,846 యూనిట్లు మాత్రమే విక్రయించగా, ఇప్పుడు 77.30 శాతం వార్షిక వృద్ధి నమోదు కావడం నిజంగా గమనించదగ్గ విషయం.

1.98 లక్షల కుటుంబాల నమ్మకం గెలిచిన కారు

మధ్యతరగతి భారతీయుడికి కారు అంటే కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. ఆ సెంటిమెంట్‌ను ఒడిసిపట్టుకోవడంలో మారుతి సుజుకి ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా 2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విడుదలైన కార్ల విక్రయాల గణాంకాలు చూస్తుంటే, మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Wagon R) మరోసారి తన హవా చాటుకుంది. లక్షలాది మంది మనసు గెలుచుకుని, హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది.
Advertisement

టాటా ఆధిపత్యానికి బ్రేక్.. మహీంద్రా ఈవీలు 50K సేల్స్‌తో సెన్సేషన్!

భారత ఆటోమోటివ్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల పోటీ రోజు రోజుకీ ఉత్కంఠభరితంగా మారుతున్న ఈ సమయంలో, మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో అద్భుతమైన మైలురాయిని సాధించింది. విడుదలైన కేవలం 12 నెలల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలను దాటడం సాధారణ విషయం కాదు, ఇది మార్కెట్‌లో వినియోగదారుల నమ్మకం, బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం, ఉత్పత్తుల నాణ్యతకు ప్రతిబింబం. ఇప్పటివరకు భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో గట్టి పట్టు సాధించిన టాటా మోటార్స్ ఆధిపత్యాన్ని సవాలు చేయాలనే లక్ష్యంతో మహీంద్రా తన కొత్త తరం ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను రంగంలోకి దింపింది. ముఖ్యంగా XEV 9e, XEV 9S, BE 6 వంటి మోడళ్లు కేవలం వాహనాలు మాత్రమే కాకుండా, భవిష్యత్తు మొబిలిటీకి ఒక కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చాయి.