భారత్ లో ప్రతి ఐదు నిమిషాలకు ఒక కార్ సేల్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్ని కొత్త కార్లు వచ్చినా, హ్యుందాయ్ క్రెటా క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. మిడ్-సైజ్ SUV సెగ్మెంట్‌లో ఈ కారు ఒక బ్రాండ్‌గా మారిపోయింది. 2025-26 ఆర్థిక సంవత్సరం (FY26) గణాంకాలను పరిశీలిస్తే, క్రెటా తన హవాను మరోసారి చాటుకుంది. గడిచిన 12 నెలల్లో ఏకంగా 1,84,083 యూనిట్లు అమ్ముడై, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న కార్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఈ లిస్టులో మారుతి డిజైర్ (2.07 లక్షల యూనిట్లు) మొదటి స్థానంలో ఉండగా, టాటా నెక్సాన్ (1.96 లక్షల యూనిట్లు) రెండో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ, తన సొంత సెగ్మెంట్ (Mid-size SUV)లో మాత్రం క్రెటానే నెంబర్ వన్.

దేశం గర్వించే టెక్నాలజీతో సుజుకి లేటెస్ట్ సెన్సేషన్

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా నుంచి సరికొత్త బర్గ్‌మాన్ స్ట్రీట్ సెకండ్ జనరేషన్ స్కూటర్ లాంచ్ అయ్యింది. గురుగ్రామ్ వేదికగా సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా తన ఐకానిక్ స్కూటర్ బర్గ్‌మాన్ స్ట్రీట్ (Burgman Street)లో సెకండ్ జనరేషన్ మోడల్‌ను ఘనంగా విడుదల చేసింది. 2018లో తొలిసారి భారత్‌లోకి అడుగుపెట్టిన ఈ మ్యాక్సీ స్టైల్ స్కూటర్, అతి తక్కువ కాలంలోనే 125cc సెగ్మెంట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు వన్‌ అండ్ ఓన్లీ (ONE & ONLY) అనే కాన్సెప్ట్‌తో మరింత పవర్‌ఫుల్ గా, స్టైలిష్ గా మన ముందుకు వచ్చింది. కేవలం మూడు ఏళ్లలోనే దీని అమ్మకాలు రెట్టింపు అయ్యాయంటే ఈ స్కూటర్ కు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

మార్కెట్‌లో నెక్సాన్ హవా.. SUV సెగ్మెంట్‌లో టాప్ ప్లేస్!

భారత ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయత, భద్రత, పనితీరు ఈ మూడు అంశాలను సమతుల్యం చేస్తూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టాటా మోటార్స్ (Tata Motors)కు చెందిన టాటా నెక్సాన్(Tata Nexon) మరోసారి తన సత్తాను ఘనంగా చాటుకుంది. దేశంలో SUVల డిమాండ్ పెరుగుతున్న ఈ సమయంలో, నెక్సాన్ నిరంతరంగా బలమైన ప్రదర్శనతో మార్కెట్‌లో ముందంజలో కొనసాగుతోంది. ప్రతి ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత వెలువడే అమ్మకాల గణాంకాలు మార్కెట్ ట్రెండ్స్‌ను స్పష్టంగా చూపిస్తాయి. ఈ నేపథ్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటా చూసినప్పుడు, నెక్సాన్ ప్రదర్శన నిజంగా విశేషంగా నిలుస్తోంది. ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు మొత్తం 1,96,244 యూనిట్ల అమ్మకాలతో, ఈ SUV దేశంలో నెంబర్ వన్ SUVగా అవతరించింది.

దేశంలో నెంబర్ 1.. SUVలను కూడా దాటేసిన సెడాన్!

దేశంలో పేద, మధ్యతరగతి ప్రజల కారు కలను నిజం చేసిన కంపెనీల్లో మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తుంది. తక్కువ ధరలో మంచి మైలేజ్, నమ్మకమైన పనితీరు, తక్కువ మెయింటెనెన్స్ కలిపి సామాన్య వినియోగదారుడికి సరిపోయే కార్లను అందిస్తూ, ఈ సంస్థ కోట్ల మంది మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రతి కుటుంబానికి అందుబాటులో ఉండే కార్లను తయారు చేయడం ద్వారా, మారుతి సుజుకి భారత ఆటోమొబైల్ రంగంలో ఒక విప్లవాన్ని సృష్టించిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇలాంటి బలమైన నేపథ్యంతో ముందుకు సాగుతున్న ఈ సంస్థకు చెందిన ప్రసిద్ధ సెడాన్ మారుతి సుజకి డిజైర్ (Maruti Suzuki Dzire) మరోసారి తన సత్తాను చాటుకుంది.
Advertisement

ఈ రెండు బైకులకు ప్రొడక్షన్ ఖర్చులు కూడా రాలేదు

భారతీయ రోడ్లపై రివ్వున దూసుకుపోయే స్పోర్ట్స్ బైక్ ప్రియులకు హోండా షాకిచ్చింది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) తన పోర్ట్‌ఫోలియో నుంచి రెండు పాపులర్ ప్రీమియం మోడళ్లకు స్వస్తి పలికింది. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో కస్టమర్లు దొరకకపోవడం, అమ్మకాలు సున్నాకి పడిపోవడంతో కంపెనీ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా తన లైనప్ నుంచి CB650R, CBR650R మోడళ్లను అధికారికంగా తొలగించింది. 2025 ప్రారంభంలోనే ఈ బైకులను అప్‌డేట్ చేసిన వెర్షన్లతో కంపెనీ మళ్ళీ లాంచ్ చేసింది. ఇన్-లైన్ 4 సిలిండర్, 650cc ఇంజిన్‌తో వచ్చే ఈ బైకులు రైడింగ్ అంటే పిచ్చి ఉన్నవారికి ఫేవరెట్. అయితే, గత కొన్ని నెలలుగా ఈ రెండు మోడళ్ల అమ్మకాలు అస్సలు జరగలేదు. రిపోర్టుల ప్రకారం, వీటి సేల్స్ 0(సున్నా) యూనిట్లుగా నమోదయ్యాయి. ఒక భారీ బ్రాండ్‌కు ఇది పెద్ద దెబ్బే అని చెప్పాలి. అందుకే వేచి చూడటం కంటే, వాటిని ప్రస్తుతానికి పక్కన పెట్టడమే మేలని హోండా భావించింది.

స్కోడా ఇండియా దూసుకుపోతోంది.. కైలాక్‌తో భారీ సేల్స్ జంప్!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో నెమ్మదిగా కానీ స్థిరంగా తన స్థానం బలపరుచుకుంటూ వచ్చిన స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India), 2026 తొలి త్రైమాసికంలో చరిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అమ్మకాలలో గరిష్ట స్థాయిని అందుకోవడం ద్వారా, బ్రాండ్ తన ఎదుగుదల వేగాన్ని మరింత పెంచుకుంది. 2026 జనవరి నుంచి మార్చి వరకు గల మూడు నెలల్లో, స్కోడా ఆటో ఇండియా దేశీయ మార్కెట్లో మొత్తం 20,028 వాహనాలను విక్రయించడం గమనార్హం. ఈ సంఖ్యలు కేవలం వృద్ధిని మాత్రమే కాకుండా, కంపెనీ తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలు ఎంత ఫలితాన్నిస్తాయో కూడా తెలియజేస్తున్నాయి. 2025 ఇదే కాలంతో పోలిస్తే 17% వృద్ధి నమోదు కావడం, మార్కెట్‌లో స్కోడా కార్లపై పెరుగుతున్న విశ్వాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది.

ఈవీ మార్కెట్లో ఓలా సరికొత్త రికార్డ్

ఓలా ఎలక్ట్రిక్ మళ్ళీ ట్రాక్‌లోకి వచ్చేసింది. ఒకానొక దశలో సర్వీస్ ఇబ్బందులు, కస్టమర్ల ఫిర్యాదులతో సతమతమైన ఈ కంపెనీ, 2026 మార్చి నెలలో ఊహించని రేంజ్‌లో పుంజుకుంది. కేవలం ఒక్క నెలలోనే రిజిస్ట్రేషన్ల పరంగా 150 శాతం వృద్ధిని సాధించి ఆటోమొబైల్ రంగాన్ని విస్మయానికి గురిచేసింది. ఫిబ్రవరిలో డీలా పడిన అమ్మకాలు, మార్చి వచ్చేసరికి రాకెట్‌లా దూసుకెళ్లాయి.

మార్కెట్‌లో టాటా హవా.. అమ్మకాలలో రికార్డు గ్రోత్!

భారత ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయత, భద్రతకు ప్రతీకగా నిలిచిన టాటా మోటార్స్ (Tata Motors) దేశీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుంది. టాటా గ్రూప్‌కు చెందిన ఈ సంస్థ, సాధారణ ప్రజల అవసరాల నుంచి ప్రీమియం సెగ్మెంట్ల వరకు విస్తరించిన విభిన్న వాహనాలతో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇలాంటి బలమైన బ్రాండ్ ఇమేజ్‌తో ముందుకు సాగుతున్న టాటా మోటార్స్ తాజాగా విడుదల చేసిన సేల్స్ గణాంకాలు కూడా అదే దూకుడును ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా ప్యాసింజర్ వాహనాల (PV) విభాగంలో కంపెనీ గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది. మారుతి తర్వాత స్థానంలో నిలిచింది. 2026 మార్చి నెలలో టాటా మోటార్స్ దేశీయ మార్కెట్లో మొత్తం 66,192 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది.
Advertisement

కిరాయికి నడిపితే ఈ కారు డ్రైవర్ల కడుపు నింపుతుంది

దేశంలో మిడిల్ క్లాస్ ప్రజల నాడి తెలిసిన కంపెనీ ఏదైనా ఉందంటే అది కచ్చితంగా మారుతి సుజుకి మాత్రమే. తక్కువ ధరలో ఎక్కువ మంది ప్రయాణించేలా, మైలేజీలో రాజీ పడకుండా కార్లను తీసుకురావడంలో మారుతికి సాటి లేదు. తాజాగా మార్చి 2026 సేల్స్ రిపోర్ట్స్ చూస్తుంటే మారుతి సుజుకి మరోసారి తన సత్తా చాటింది. ముఖ్యంగా వ్యాన్ సెగ్మెంట్‌లో మారుతి ఈకో (Maruti Suzuki Eeco) సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. గతేడాది కంటే ఎక్కువ అమ్మకాలతో దూసుకుపోతూ, దేశంలోనే అత్యంత చౌకైన 7-సీటర్ కారుగా తన రికార్డును పదిలం చేసుకుంది. మారుతి సుజుకి కంపెనీ మార్చి 2026 నెలలో అదిరిపోయే అమ్మకాలను నమోదు చేసింది. ప్రతి సెగ్మెంట్‌లోనూ వృద్ధి సాధించిన మారుతి, వ్యాన్ సెగ్మెంట్‌లో మాత్రం తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. గత నెలలో ఏకంగా 11,333 యూనిట్ల ఈకో కార్లు అమ్ముడయ్యాయి. మార్చి 2025లో ఈ సంఖ్య 10,409గా ఉండేది. అంటే ఏడాది కాలంలో దాదాపు 924 యూనిట్లు అదనంగా అమ్ముడయ్యాయి. దీనికి ప్రధాన కారణం ఈ కారు ధర మరియు అది ఇచ్చే మల్టీ పర్పస్ సౌలభ్యం. కేవలం రూ.5.18 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లభిస్తుండటమే దీని ప్లస్ పాయింట్. ఒకప్పుడు ఈకో అంటే కేవలం ఒక డబ్బా కారు అనే విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు మారుతి సుజుకి ఆ అపోహలను చెరిపేసింది. కొత్త ఈకోలో ఇప్పుడు ఏకంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లను స్టాండర్డ్‌గా అందిస్తోంది. ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన భద్రతా నిబంధనలను దృష్టిలో ఉంచుకుని 11 రకాల సేఫ్టీ ఫీచర్లను ఇందులో చేర్చారు. రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, వెనుక తలుపులకు చైల్డ్ లాక్, సీట్ బెల్ట్ రిమైండర్ మరియు EBDతో కూడిన ABS వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. సాధారణ ప్రయాణికులకే కాకుండా స్కూల్ వ్యాన్లకు కూడా ఇది అత్యంత సురక్షితమైన ఎంపికగా మారింది. మారుతి ఈకోలో కె-సిరీస్ 1.2-లీటర్ అడ్వాన్స్‌డ్ ఇంజన్ ఉంటుంది. ఇది పెట్రోల్ వెర్షన్‌లో 80.76 PS పవర్, 104.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజీ విషయానికి వస్తే పెట్రోల్ వెర్షన్ లీటరుకు సుమారు 19.7 కిలోమీటర్ల నుంచి 20.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇక మధ్యతరగతి ప్రజలకి వరప్రసాదమైన CNG వెర్షన్ విషయానికి వస్తే, ఇది కేజీ గ్యాస్‌కు ఏకంగా 26.78 నుంచి 27.05 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. భారీగా పెరిగిన ఇంధన ధరల కాలంలో ఇంత తక్కువ ఖర్చుతో ప్రయాణించే మరో 7-సీటర్ కారు లేదనే చెప్పాలి. కొత్త మారుతి ఈకో లోపల కూడా చాలా మార్పులు జరిగాయి. ఇప్పుడు ఇందులో మారుతి సెలెరియో, ఎస్-ప్రెస్సో కార్లలో ఉండే కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అమర్చారు. అలాగే పాతకాలపు స్లైడింగ్ ఏసీ కంట్రోల్స్ తీసేసి, కొత్తగా రొటరీ నాబ్స్ (తిప్పే బటన్లు) ఇచ్చారు. స్టీరింగ్ వీల్ కూడా కొత్త డిజైన్‌తో ఆకర్షణీయంగా ఉంది. మొత్తం 4 వేరియంట్లలో (5-సీటర్, 7-సీటర్, కార్గో, టూర్, అంబులెన్స్) ఈ కారు లభిస్తుంది. కారు పొడవు 3,675mm ఉండగా, వెడల్పు 1,475mm, ఎత్తు 1,825mm ఉంటుంది. ఇది ఇరుకైన సందుల్లో కూడా సులభంగా దూసుకుపోవడానికి వీలుగా ఉంటుంది. మారుతి సుజుకి కంపెనీ 2026 మార్చి నెలలో మొత్తం 1,66,219 ప్యాసింజర్ వాహనాలను విక్రయించింది. గతేడాదితో పోలిస్తే ఇది 10.27 శాతం వృద్ధి. అంతేకాకుండా విదేశాలకు ఎగుమతి చేయడంలో కూడా మారుతి దూసుకుపోతోంది. ఎగుమతుల్లో ఏకంగా 42.68 శాతం వృద్ధి సాధించి 47,040 వాహనాలను ఇతర దేశాలకు పంపింది. టయోటా కంపెనీకి మారుతి సరఫరా చేసే కార్ల అమ్మకాలు కూడా 27.62 శాతం పెరిగాయి. దీన్నిబట్టి చూస్తుంటే భారతీయుల మొదటి ప్రాధాన్యత ఎప్పుడూ మారుతి సుజుకి అనే విషయం మరోసారి స్పష్టమైంది.

మార్చి నెలలో మారుతి మ్యాజిక్.. ప్రతి సెగ్మెంట్‌లో వృద్ధి!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) మరోసారి తన మార్కెట్ ఆధిపత్యాన్ని గట్టిగా చాటుకుంది. కొన్ని కోట్ల మందికి కారు కలను నెరవేర్చిన మారుతి, ప్రతి నెలా అమ్మకాలతో కొత్త రికార్డులు సృష్టించే ఈ సంస్థ, 2026 మార్చి నెలలోనూ అదే ఊపు కొనసాగించింది. తాజా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడైన గణాంకాలు చూస్తే, కంపెనీ పనితీరు ఎంత బలంగా ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. మార్చి 2026లో మారుతి సుజుకి మొత్తం అమ్మకాలు 2,25,251 యూనిట్లకు చేరుకోవడం గమనార్హం. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 1,92,984 యూనిట్లతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదల. ఈ సంఖ్యలు కేవలం పెరుగుదలనే కాకుండా, వినియోగదారుల విశ్వాసం కంపెనీపై ఎంతగా ఉందో తెలియజేస్తున్నాయి.

ఒక్క సెల్టోస్‌తోనే గేమ్ మార్చేసిన కియా

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో కియా ఇండియా (Kia India) సరికొత్త రికార్డులతో దూసుకుపోతుంది. ముఖ్యంగా 2026 సంవత్సరం ప్రారంభం నుంచి కియా కార్ల అమ్మకాలు ఊహించని స్థాయిలో పుంజుకున్నాయి. మార్చి 2026 విక్రయాల గణాంకాలను పరిశీలిస్తే, కియా తన చరిత్రలోనే అత్యుత్తమ త్రైమాసిక ఫలితాలను సాధించి ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిస్తోంది. సెల్టోస్, సోనెట్ వంటి మోడళ్ల క్రేజ్ తగ్గకపోవడమే కాకుండా, కొత్తగా రాబోతున్న మోడళ్లపై అంచనాలు పెరగడం కియాకు బాగా కలిసొచ్చింది.

రోడ్డు మీద ఎటు చూసిన ఆ కంపెనీ కార్లే

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్లో ప్రస్తుతం ఎస్‌యూవీల (SUVs) హవా ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడంలో సౌత్ కొరియా దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా (HMIL) మరోసారి సత్తా చాటింది. మార్చి 2026 విక్రయాల గణాంకాల్లో హ్యుందాయ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ఎస్‌యూవీల అండతోనే మార్చి నెలలో దేశీయ విక్రయాల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. గత కొన్ని త్రైమాసికాలుగా పెరుగుతూ వస్తున్న డిమాండ్, ఈ ఆర్థిక సంవత్సరం ముగింపులో సరికొత్త రికార్డులకు దారితీసింది.
Advertisement

మార్కెట్‌ను షేక్ చేస్తున్న సియోర్రా.. 3 నెలల్లో 20 వేల డెలివరీలు!

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన టాటా మోటార్స్ (Tata Motors) మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఎన్నో ఏళ్ల తర్వాత తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చిన టాటా సియోర్రా (Tata Sierra) ఇప్పుడు కొత్త రూపంలో వినియోగదారుల మనసులు గెలుచుకుంటూ, అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తోంది. పాత మోడల్‌కు ఉన్న నాస్టాల్జియాను కాపాడుతూ, ఆధునిక డిజైన్, అత్యాధునిక ఫీచర్లతో వచ్చిన ఈ కొత్త సియెర్రా, లాంచ్ అయిన కొద్ది కాలంలోనే భారీ స్పందనను దక్కించుకుంది. 2025 నవంబర్ చివరి వారంలో అధికారికంగా మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా సియోర్రా, చాలా తక్కువ సమయంలోనే కస్టమర్ల దృష్టిని ఆకర్షించింది.

మహీంద్రా ఫుల్ జోష్‌లో.. మార్చి నెల సేల్స్ రిపోర్ట్ వైరల్

దేశీయ ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) మరోసారి తన అమ్మకాలతో మార్కెట్లో దూసుకుపోతూ శక్తివంతమైన ప్రదర్శనను కనబరిచింది. మార్చి నెల ముగిసిన వెంటనే కంపెనీ విడుదల చేసిన సేల్స్ గణాంకాలు, దాని వృద్ధి వేగాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న డిమాండ్, ఇప్పుడు మరింత బలంగా మారిందని ఈ తాజా గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 2026లో మహీంద్రా దేశీయ, ఎగుమతి మార్కెట్లలో కలిపి మొత్తం 99,969 యూనిట్ల వాహనాలను రవాణా చేసింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 21 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ స్థాయి పెరుగుదల, కంపెనీ ఉత్పత్తులపై వినియోగదారుల నమ్మకం ఎంతగానో పెరిగిందని తెలియజేస్తోంది.

చరిత్ర సృష్టించిన మార్చి నెల

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ విప్లవం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా టూ-వీలర్ విభాగంలో మునుపెన్నడూ లేని విధంగా అమ్మకాలు ఊపందుకున్నాయి. మార్చి 2026 నెలకు సంబంధించిన ఎలక్ట్రిక్ టూ వీలర్ల విక్రయాల గణాంకాలు తాజాగా విడుదలయ్యాయి. ఈ డేటా చూస్తుంటే మార్కెట్లో ఒకప్పుడు రారాజుగా వెలిగిన కంపెనీలు వెనుకబడిపోగా, నమ్మకానికి మారుపేరుగా నిలిచిన పాత తరం దిగ్గజ కంపెనీలు ఈవీ రేసులో టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. కేవలం 31 రోజుల్లోనే రెండు ప్రధాన కంపెనీలు కలిసి దాదాపు లక్షకు చేరువలో అంటే 95,550 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించి రికార్డు సృష్టించాయి. ఈ రేసులో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో తమ ఆధిపత్యాన్ని చాటుకోగా, స్టార్టప్ దిగ్గజం ఓలా ఎలక్ట్రిక్ మాత్రం గట్టి దెబ్బతింది.

మార్కెట్ ట్రెండ్ మార్చేస్తున్న MG.. మార్చిలో 19% వృద్ధి

భారత ఆటోమొబైల్ మార్కెట్లో స్థిరంగా ఎదుగుతూ తన ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్న జెఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor India) ఇటీవలి కాలంలో మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. ఒకప్పుడు పరిమిత మోడళ్లతో మాత్రమే కనిపించిన ఈ బ్రాండ్, ఇప్పుడు విస్తృతమైన పోర్ట్‌ఫోలియోతో దేశీయ మార్కెట్లో గట్టి పోటీని ఇస్తోంది. ముఖ్యంగా వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకుని, తగిన విధంగా ఉత్పత్తులను అందించడం ద్వారా తన స్థానాన్ని బలపరుచుకుంటోంది. ఇక పోటీ విషయానికి వస్తే, ఇప్పటికే మార్కెట్లో బలమైన స్థానం కలిగిన కంపెనీలను ఎదుర్కొంటుంది.
Advertisement

ఇది బైక్ కాదు రోడ్డు మీద దూసుకెళ్లే రాకెట్

ప్రస్తుతం రాయల్ ఎన్‎ఫీల్డ్ అంటేనే ఒక ఎమోషన్.. ఇప్పటివరకు క్లాసిక్, బుల్లెట్ మోడళ్లతో టూ వీలర్ మార్కెట్‎ను ఏలిన ఈ కంపెనీ, ఇప్పుడు కుర్రకారును ఉర్రూతలగించేలా తన రోడ్‌స్టర్ సెగ్మెంట్‌ను సరికొత్తగా తీర్చిదిద్దింది. 2026 మోడల్ రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 (Guerrilla 450) ఇప్పుడు మునుపటి కంటే మరింత పవర్‌ఫుల్‌గా, అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. మీరు ఈ బైక్‌ను కొనాలని ప్లాన్ చేస్తుంటే, కంపెనీ చేసిన ఆ ఐదు ప్రధాన మార్పుల గురించి తెలుసుకోవడం చాలా అవసరం. కేవలం లుక్స్ మాత్రమే కాదు, పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇది ఇప్పుడు కేటీఎం 390 డ్యూక్ వంటి దిగ్గజాలకు సవాల్ విసురుతోంది.

ఇది నిజంగానే ఊహించలేదు.. విజయ్ దగ్గర TVS XL

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాజకీయ రంగం వేడెక్కుతుండగా, మరోవైపు సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖులు కూడా ప్రత్యేకంగా చర్చకు వస్తున్నారు. ఈ క్రమంలో విజయ్ (Vijay) మరోసారి వార్తల్లో నిలిచారు. తమిళ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడిగా రాజకీయంగా తన ప్రభావాన్ని పెంచుకుంటూనే, హీరోగా ఉన్న అతని స్టైల్, జీవనశైలి కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి మళ్లీ ప్రజాభిమానాన్ని కోరుకుంటున్న విజయ్, తన నామినేషన్ అఫిడవిట్‌లో వెల్లడించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా అభ్యర్థులు తమ ఆస్తుల వివరాలు వెల్లడించడం ఒక నియమం అయినప్పటికీ, విజయ్ వెల్లడించిన వాహనాల జాబితా మాత్రం ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది.

ఒక్క రోజే 3,520 కార్లకు ఆర్డర్..హిస్టరీ క్రియేట్ చేసిన వియత్నాం కంపెనీ

ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) హవా నడుస్తోంది. టెస్లా, టాటా, మహీంద్రా వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా ఇప్పుడు వియత్నాంకు చెందిన విన్‌ఫాస్ట్ (VinFast) సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఊహించని వేగంతో దూసుకుపోతున్న ఈ కంపెనీ, కేవలం ఒకే ఒక్క రోజులో వేల సంఖ్యలో ఆర్డర్లు పొంది అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా భారత మార్కెట్లోకి అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే తనదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతోంది.

30 నిమిషాల్లోనే ఛార్జ్.. 7 సీటర్ సూపర్ ఎలక్ట్రిక్ కారు

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) ఇప్పుడు భారత మార్కెట్‌పై గట్టి దృష్టి పెట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తన ఎలక్ట్రిక్ కార్లతో గుర్తింపు పొందిన ఈ కంపెనీ, భారతదేశంలో కూడా తన స్థానం బలపర్చుకునేందుకు దూసుకెళ్తోంది. దేశంలో వేగంగా పెరుగుతున్న ఈవీ డిమాండ్‌ను అవకాశంగా తీసుకుని, వినియోగదారుల అవసరాలకు సరిపోయే కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలో, ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత మార్కెట్లోకి విన్‌ఫాస్ట్ తన తొలి ఎలక్ట్రిక్ MPVను తీసుకురానుందనే సమాచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా 7-సీటర్ లేఅవుట్‌తో వచ్చే ఈ వాహనం, పెద్ద కుటుంబాలు, కమర్షియల్ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడినట్లు తెలుస్తోంది.
Advertisement

ఈ కార్లను చూస్తే యముడు కూడా యూ టర్న్ తీసుకోవాల్సిందే

భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు కారు అంటే కేవలం మైలేజీ, లుక్స్ మాత్రమే చూసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. కారు ఎంత బలంగా ఉంది? ప్రమాదం జరిగితే మన ప్రాణాలను కాపాడుతుందా? అనే సేఫ్టీ అంశానికే జనం మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. దీనికి నిదర్శనమే భారత్ ఎన్ క్యాప్ (BNCAP) తాజాగా విడుదల చేసిన సేఫ్టీ రేటింగ్స్. ఈ లిస్టులో భారతీయ కంపెనీలు గ్లోబల్ బ్రాండ్లకు చుక్కలు చూపిస్తూ టాప్ గేర్‌లో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా మహింద్రా, టాటా సంస్థలు తమ కార్లను రోడ్లపై తిరిగే కోటలగా తీర్చిదిద్దాయి.

మార్కెట్ మీద డైనోసార్ లాంటి ఎస్‌యూవీల దండయాత్ర

భారతదేశంలో ఫుల్ సైజ్ ఎస్‌యూవీ (SUV) అంటే అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు టయోటా ఫార్చ్యూనర్. ఏళ్ల తరబడి ఇండియన్ రోడ్లపై రారాజులా వెలుగుతున్న ఈ కారుకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గంభీరమైన లుక్, తిరుగులేని పవర్, రీసేల్ వాల్యూ.. ఇలా అన్నీ ఫార్చ్యూనర్‌ను టాప్‌లో నిలబెట్టాయి. అయితే, ఇప్పుడు కాలం మారుతోంది. ఫార్చ్యూనర్‌కు చుక్కలు చూపించేందుకు కొన్ని అద్భుతమైన ఎస్‌యూవీలు సిద్ధమవుతున్నాయి. ఆ వివరాలు చూద్దాం.

టాటా నుంచి భారీ సర్‌ప్రైజ్.. సియెర్రా EV లాంచ్ టైమ్ ఫిక్స్!

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో వేగంగా దూసుకెళ్తున్న కంపెనీలలో టాటా మోటార్స్ (Tata Motors) ఒకటి. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ కార్లతో మార్కెట్‌లో బలమైన స్థానాన్ని సంపాదించిన ఈ సంస్థ, రాబోయే సంవత్సరాల్లో మరిన్ని కొత్త మోడళ్లతో తన స్థాయిని మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే కంపెనీ నుంచి రానున్న కొత్త SUV గురించి తాజాగా ఆటోమొబైల్ వర్గాల్లో పెద్ద చర్చ మొదలైంది. ఆ SUV మరేదో కాదు, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టాటా సియోర్రా ఈవీ (Tata Sierra EV). ఈ మోడల్ మొదటిసారి కాన్సెప్ట్ రూపంలో కనిపించినప్పటి నుంచి వినియోగదారుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. పాత సియెర్రా పేరుకు ఉన్న క్రేజ్‌ను కొత్త ఎలక్ట్రిక్ అవతారంలో తీసుకురావడం వల్ల ఈ కారుపై అంచనాలు మరింత పెరిగాయి.

రోజూ ఆఫీసుకి వెళ్లేవారికి బెస్ట్ బైక్స్ ఇవే!

ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, కొత్తగా టూవీలర్ కొనాలనుకునే చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఖర్చు పరంగా ఆలోచిస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఒకప్పుడు స్టైల్, స్పీడ్, బ్రాండ్ అనే అంశాలు ప్రాధాన్యం కలిగినప్పటికీ, ఇప్పుడు మాత్రం "ఎక్కువ మైలేజ్ - తక్కువ ఖర్చు" అనే ఫార్ములానే ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. రోజువారీ ప్రయాణాలు చేసే ఉద్యోగులు, విద్యార్థులు, చిన్న వ్యాపారులు.. అందరికీ బెస్ట్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో మార్కెట్‌లో కొన్ని బైక్‌లు ప్రత్యేకంగా వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ (Hero HF Deluxe), టీవీఎస్ రేడియన్ (TVS Radeon), హోండా షైన్ 100 (Honda Shine 100) వంటి మోడళ్లు తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ అందిస్తూ బెస్ట్ ఆప్షన్లుగా నిలుస్తున్నాయి. వీటి గురించి ఈ కథణంలో చూద్దాం.
Advertisement

పొరుగింటి వాళ్లు కుళ్లుకోవాలంటే ఈ కారు ఉండాల్సిందే

ఒకప్పుడు కారుకు సన్‌రూఫ్ ఉండటం అనేది కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఫీచర్. లక్షల రూపాయలు అదనంగా ఖర్చు చేస్తేనే గానీ ఆ వెలుగు, గాలి మనకు అందేవి కావు. కానీ, కాలం మారింది. ఇప్పుడు మధ్యతరగతి ప్రజల బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకుని కార్ల తయారీ కంపెనీలు రూ.8 లక్షల లోపు ధరలోనే అద్భుతమైన సన్‌రూఫ్ కార్లను మార్కెట్లోకి తెచ్చాయి. మీరు మీ ఫ్యామిలీ కోసం ఒక స్టైలిష్, బడ్జెట్ ఫ్రెండ్లీ సన్‌రూఫ్ కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మార్చి 31, 2026 నాటికి మార్కెట్లో అందుబాటులో ఉన్న ఈ 5 బెస్ట్ ఆప్షన్లను ఓసారి పరిశీలిద్దాం.