ఈ బైక్ ముందు సూపర్ కార్లు కూడా బలాదూర్

భారతీయ రోడ్లపై రాయల్ లుక్ కోసం పాకులాడే యువతకు రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. గెరిల్లా 450 మోడల్‌లో 2026 కోసం సరికొత్త అపెక్స్ (Apex) వేరియంట్‌ను లాంచ్ చేసింది. అస్సాంలోని గౌహతి ఘాట్ రోడ్లు, హైవేలపై ఈ బైక్‌ను టెస్ట్ రైడ్ చేసిన తర్వాత తేలిన విశేషాలు, ఇందులో వచ్చిన మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒక్కసారిగా ధరలు పెంచిన ఎంజీ.. ఏమైంది తెలుసా?

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్నేళ్లుగా వేగంగా ఎదిగిన బ్రాండ్‌లలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor India) ఒకటి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టిన తర్వాత, ఈ సంస్థ మార్కెట్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. JSW Group తో భాగస్వామ్యం కుదుర్చుకున్న తర్వాత కంపెనీ వ్యూహంలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఈ పొత్తు ద్వారా ఎలక్ట్రిక్ మొబిలిటీ వైపు మరింత దూసుకెళ్లిన ఎంజీ, తన బ్రాండ్ ఇమేజ్‌ను కూడా గణనీయంగా పెంచుకుంది. అయితే ఈ అభివృద్ధి మధ్యలోనే కంపెనీ తాజాగా వినియోగదారులకు కొంత నిరాశ కలిగించే వార్తను ప్రకటించింది. JSW MG Motor India ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను పెంచనున్నట్లు అధికారికంగా వెల్లడించింది.

ఆటోగా మారిపోయే స్కూటర్.. ఇది నిజంగా ఇంజనీరింగ్ అద్భుతం

ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం ఏ స్థాయిలో పెరుగుతుందో మనందరికీ తెలిసిందే. అయితే ఈ రంగంలో ఒక సరికొత్త విప్లవానికి హీరో మోటోకార్ప్ తెరతీసింది. ఒకే వాహనం.. అవసరమైతే మూడు చక్రాల ఆటోగా, వద్దనుకుంటే రెండు చక్రాల స్కూటర్‌గా మారిపోయే అద్భుత టెక్నాలజీని మన ముందుకు తెచ్చింది. అదే హీరో సర్జ్ S32 (Hero Surge S32). ఈ వినూత్న వాహనానికి భారత ప్రభుత్వం నుంచి అధికారికంగా ఆమోదం లభించింది.

రేసింగ్ డీఎన్‌ఏతో కొత్త అపాచీ.. యువతకు ఫుల్ ట్రీట్!

దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) మరోసారి తన అభిమానులను ఆకట్టుకునేలా ముందుకొచ్చింది. యువతలో ప్రత్యేక గుర్తింపు పొందిన టీవీఎస్ అపాచీ ఆర్‌టిఆర్ 160 4వి (TVS Apache RTR 160 4V) బైక్‌కు 2026 సంవత్సరానికి సంబంధించిన అప్‌డేట్ మోడల్‌ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త వెర్షన్ కేవలం చిన్న మార్పులతో మాత్రమే కాకుండా, మరింత ప్రాక్టికల్‌గా, స్టైలిష్‌గా, అలాగే టెక్నాలజీ పరంగా ముందంజలో ఉండేలా తీర్చిదిద్దడం విశేషం. ఈసారి కంపెనీ రెండు కొత్త వేరియంట్‌లను కూడా పరిచయం చేసింది. దీంతో వినియోగదారులకు తమ అవసరాలు, బడ్జెట్‌ను బట్టి సరైన ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం మరింత విస్తరించింది.
Advertisement

యూరప్ ఖండాన్ని శాసిస్తున్న మేడ్ ఇన్ ఇండియా బైక్

భారతీయ తయారీ రంగానికి, ముఖ్యంగా ఆటోమొబైల్ రంగానికి ఇది గర్వకారణమైన సమయం. మేడ్ ఇన్ ఇండియా ముద్రతో తయారైన ఒక స్పోర్ట్స్ బైక్ ఇప్పుడు యూరప్ దేశాల్లో, ముఖ్యంగా ఇటలీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏప్రిలియా (Aprilia) సంస్థకు చెందిన ఆర్ఎస్ 457 (RS 457) బైక్ ఇప్పుడు ఇటలీ మార్కెట్‌లో అమ్మకాల్లో రికార్డులు సృష్టిస్తోంది.

ఒక్క ఫోన్ చేస్తే చాలు మీ ఆఫీస్ వద్దకే కారు సర్వీసింగ్ సెంటర్

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) తన కస్టమర్ల కోసం ఒక విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. కారు సర్వీసింగ్ కోసం గంటల తరబడి వర్క్‌షాపుల చుట్టూ తిరగడం, వీకెండ్స్ పాడు చేసుకోవడం వంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ.. మీ ఆఫీసు వద్దకే సర్వీస్ సెంటర్‌ను తీసుకువచ్చే క్విక్‌స్టాప్ (QuickStop) సేవలను ప్రారంభించింది.

సేఫ్టీలో దుమ్ములేపిన దేశం మెచ్చిన కారు

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ ఎస్‌యూవీలలో ఒకటైన హ్యుందాయ్ వెన్యూ, ఇప్పుడు సేఫ్టీలోనూ తన సత్తా చాటింది. భారత్ NCAP (BNCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో హ్యుందాయ్ వెన్యూ, దాని స్పోర్టీ వెర్షన్ వెన్యూ ఎన్ లైన్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. భారతీయ రోడ్ల పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో హ్యుందాయ్ వెన్యూ అద్భుతమైన పాయింట్లను సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో ఈ కారు 32 పాయింట్లకు గాను 31.15 పాయింట్లు సాధించింది. గంటకు 64 కిలోమీటర్ల వేగంతో జరిపిన ఫ్రంటల్ ఆఫ్‌సెట్ టెస్టులో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ తల, మెడ భాగాలు పూర్తి సురక్షితంగా ఉన్నాయని తేలింది.

ప్రభుత్వ ఉద్యోగులకు భారీ డిస్కౌంట్లు!

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండటంతో, రోజువారీ రవాణా ఖర్చులు తగ్గించుకోవాలనే ఆలోచనలో చాలా మంది ప్రజలు ఎలక్ట్రిక్ కార్లు, టూవీలర్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ నిర్వహణ ఖర్చులు, పర్యావరణానికి మేలు చేసే లక్షణాలు, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు, ఇవి కలిసి ఈవీలకు మంచి డిమాండ్‌ను తీసుకువస్తున్నాయి. ఈ పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని దేశంలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నాయి. సబ్సిడీలు, ట్యాక్స్ రాయితీలు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు వంటి అనేక ప్రయోజనాలను ప్రకటిస్తూ ప్రజలను ఈవీల వైపు ఆకర్షిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ (Telangana) ప్రభుత్వం కూడా ఒక ముందడుగు వేసింది.
Advertisement

ఇప్పుడు ఈ కారు బిల్డ్ క్వాలిటీ చూసి కాలర్ ఎగరేస్తారు

భారతదేశంలో సేఫ్టీ అనే పదానికి పర్యాయపదంగా మారిన టాటా మోటార్స్‌కే ఇప్పుడు గట్టి పోటీ ఎదురైంది. కియా ఇండియా తన సెకండ్ జనరేషన్ సెల్టోస్ (2026 మోడల్)తో భారత్ NCAP (BNCAP) క్రాష్ టెస్టుల్లో అదిరిపోయే స్కోరు సాధించింది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP) విభాగంలో కియా సెల్టోస్ 32 పాయింట్లకు గాను ఏకంగా 31.70 పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్‌ను సొంతం చేసుకుంది. ఇదే విభాగంలో టాటా సవాల్ విసిరిన సియెర్రా (Tata Sierra) 31.14 పాయింట్లతో వెనుకబడిపోయింది. ఒకప్పుడు సేఫ్టీ విషయంలో విమర్శలు ఎదుర్కొన్న కియా, ఇప్పుడు నేరుగా టాటా కోటనే బద్దలు కొట్టడం విశేషం.

ఈ కారు లోపల ఉంటే కశ్మీర్ లో ఉన్నట్లే

వేసవి కాలం వచ్చిందంటే చాలు.. బయటకు వెళ్లాలంటేనే భయం వేస్తుంది. కారులో ఏసీ ఉన్నప్పటికీ, ఎండ తీవ్రత వల్ల సీట్లు వేడెక్కి ఒంటికి చెమటలు పట్టడం సహజం. ఇలాంటి సమయంలో మనల్ని చల్లగా ఉంచే అద్భుతమైన ఫీచరే వెంట్రిలేటెడ్ సీట్లు (Ventilated Seats). ఒకప్పుడు కేవలం లగ్జరీ కార్లకే పరిమితమైన ఈ సౌకర్యం, ఇప్పుడు బడ్జెట్ కార్లలో కూడా అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం మన దేశంలో తక్కువ ధరలో ఈ సౌకర్యాన్ని అందిస్తున్న రెండు బెస్ట్ హ్యాచ్‌బ్యాక్ కార్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టయోటా నుంచి భారీ EV సర్ప్రైజ్

జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా (Toyota) భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ అయిన టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Toyota Urban Cruiser Ebella EV) ను త్వరలో విడుదల చేయనున్నట్లు సంకేతాలు ఇస్తోంది. ఆధునిక టెక్నాలజీ, ఫ్యూచరిస్టిక్ డిజైన్, ప్రీమియం ఫీచర్ల సమ్మేళనంగా ఈ మోడల్ ఈవీ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి వేగంగా పెరుగుతున్న సమయంలో, టయోటా ఈ కొత్త ఎస్‌యూవీతో పోటీలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా, Maruti Suzuki తన మొదటి ఎలక్ట్రిక్ కారు 'e Vitara'ను విడుదల చేసిన కొద్దికాలానికే, టయోటా కూడా తన సత్తాను చూపించేందుకు ముందుకు రావడం గమనార్హం.

దారిలో గుంతలున్నా రాళ్లున్నా డోంట్ కేర్.. దూసుకపోవడమే

దృఢమైన బాడీ, అదిరిపోయే ఆఫ్-రోడింగ్ సామర్థ్యం, ఆధునిక ఫీచర్లు.. ఇవన్నీ కలిపి ఒకే కారులో ఉంటే చూడాలని ఎవరికి ఉండదు? అందుకే భారతీయ వాహన ప్రియుల కోసం టాటా, మహీంద్రా, రెనో కంపెనీలు సరికొత్త రగ్గడ్ (Rugged) ఎస్‌యూవీలను సిద్ధం చేస్తున్నాయి. వీటి ధర కూడా సామాన్యులకు అందుబాటులో రూ.10 లక్షల లోపే ఉండే అవకాశం ఉండటంతో మార్కెట్లో ఇప్పుడే అంచనాలు పెరిగిపోయాయి.
Advertisement

సేల్స్ కౌంటర్ల వద్ద క్యూ కడుతున్న కస్టమర్లు

భారత స్కూటర్ మార్కెట్‌లో తనదైన శైలితో ప్రత్యేక గుర్తింపు పొందిన యమహా రేజెడ్ఆర్ (Yamaha RayZR) మరోసారి వార్తల్లో నిలిచింది. నగర వీధుల్లో చురుకుదనంతో దూసుకుపోయే పనితీరు, యువతను వెంటనే ఆకర్షించే స్పోర్టీ డిజైన్ ఈ రెండింటి సమ్మేళనమే రే స్కూటర్‌ను ప్రత్యేకంగా నిలబెట్టింది. అందుకే ఇది కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాకుండా, స్టైల్ స్టేట్‌మెంట్‌గా కూడా మారింది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ స్కూటర్ సాధించిన అమ్మకాల గణాంకాలు చూస్తే, మార్కెట్‌లో దాని డిమాండ్ ఎంతగా పెరిగిందో స్పష్టంగా అర్థమవుతుంది. తాజా నివేదిక ప్రకారం, ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా మొత్తం 22,593 యూనిట్ల రే స్కూటర్లు పంపిణీ అయ్యాయి. ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు, ఈ సెగ్మెంట్‌లో రే స్కూటర్ దూసుకెళ్తున్న వేగానికి నిదర్శనం.

34 నిమిషాల్లోనే 15 వేల ఆర్డర్లు..కార్ల మార్కెట్లో చైనా సంచలనం

స్మార్ట్‌ఫోన్ల తయారీలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన షియోమీ (Xiaomi), ఇప్పుడు ఆటోమొబైల్ రంగంలోనూ తన జెండా పాతేసింది. కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 2026 Xiaomi SU7 ఎలక్ట్రిక్ కార్ ఇప్పుడు చైనా వీధుల్లో సందడి చేస్తోంది. మార్చి 19న లాంచ్ అయిన ఈ కారుకు వినియోగదారుల నుంచి ఊహించని స్పందన లభించింది. విక్రయాలు ప్రారంభమైన కేవలం 34 నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 15,000 ఆర్డర్లు రావడం గమనార్హం. దీనిని బట్టి చూస్తుంటే టెస్లా వంటి అగ్రశ్రేణి కంపెనీలకు షియోమీ గట్టి పోటీని ఇస్తోందని అర్థమవుతోంది. కేవలం వారం రోజుల్లోనే 5 వేల యూనిట్లను డెలివరీ చేసి షియోమీ సీఈఓ లే జున్ (Lei Jun) అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఈ కారు మీ దగ్గర ఉందా? కీలక లోపం బయటపడింది

చెక్ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా ఆటో (Skoda Auto)కి చెందిన భారతీయ విభాగం స్కోడా ఆటో ఇండియా (Skoda Auto India) ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటనతో వినియోగదారులను అప్రమత్తం చేసింది. కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ అయిన స్కోడా కోడియాక్ (Skoda Kodiaq) లో సాంకేతిక లోపం గుర్తించిన నేపథ్యంలో, కొన్ని యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ రీకాల్ నిర్ణయం తీసుకోవడానికి కారణం ముందు సీట్ల లోపలి ఫ్రేమ్‌లో ఉన్న నిర్మాణాత్మక లోపం. సాధారణంగా డ్రైవర్, కో-డ్రైవర్ సీట్లలో ఉండే ఈ ఫ్రేమ్ భాగం భద్రత పరంగా ఎంతో కీలకం. అయితే కొన్ని యూనిట్లలో ఈ ఫ్రేమ్ అంచు సరిగ్గా డిజైన్ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడం గుర్తించారు.

ఏప్రిల్‌లో రాబోతున్న అదిరిపోయే కార్లు ఇవే!

ఈ ఏడాది ప్రారంభం నుంచే భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కొత్త కార్ల హడావిడి ఎక్కడా తగ్గలేదు. ప్రతి నెలా కొత్త మోడళ్లు వరుసగా ఎంట్రీ ఇస్తూ, కొనుగోలుదారుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ముఖ్యంగా మార్చి నెలలో కీలకమైన లాంచ్‌లు జరిగిన తర్వాత, అదే జోరు ఇప్పుడు ఏప్రిల్ నెలలో కూడా కొనసాగనుంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో, కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావడానికి మరింత ఉత్సాహంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఏప్రిల్ నెలలో వివిధ సెగ్మెంట్లలో పలు ఆసక్తికరమైన మోడళ్లు భారతీయ వినియోగదారుల ముందుకు రానున్నాయి. వాటిలో ముఖ్యంగా మారుతి సుజుకి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ ఫేస్‌లిఫ్ట్, ఎంజీ మెజెస్ట్రీ, టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా కార్లు ఉన్నాయి. వాటి గురించి ఈ కింది కథణంలో.
Advertisement

తన బ్రహ్మాస్త్రాన్ని దింపుతున్న నిస్సాన్

భారతదేశంలో ఆటోమొబైల్ రంగం గత కొన్నేళ్లలో విపరీతమైన మార్పులను చూసింది. ఒకప్పుడు ప్రతి ఇంట్లో టూ-వీలర్ ఉండటం సాధారణమైతే, ఇప్పుడు అదే స్థానాన్ని కార్లు దక్కించుకుంటున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాల్లో కార్ కొనుగోలు ఒక అవసరంగా మారింది. రోజువారీ ప్రయాణాల నుంచి కుటుంబంతో కలిసి లాంగ్ డ్రైవ్స్ వరకు ప్రతి అవసరానికీ సరిపోయేలా ఉండటంతో కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఈ పెరుగుతున్న డిమాండ్ కారణంగా మార్కెట్‌లో పోటీ కూడా మరింత తీవ్రమైంది. ప్రతి కంపెనీ వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్త ఫీచర్లు, మెరుగైన మైలేజ్, అందుబాటు ధరలతో మోడళ్లను తీసుకురావడంలో బిజీగా ఉంది.

పోటీ ఉన్నా నిలబడింది.. హైక్రాస్ సేల్స్ గ్రోత్ మామూలు కాదు!

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎప్పటికీ తగ్గని క్రేజ్‌తో నిలిచే MPVలలో టయోటా ఇన్నోవా (Toyota Innova) ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కుటుంబ ప్రయాణాలు, లాంగ్ డ్రైవ్స్, అలాగే కమర్షియల్ వినియోగం.. ఏ కోణంలో చూసినా ఈ వాహనం నమ్మకానికి ప్రతీకగా మారింది. కాలం మారుతున్నా, కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నా, ఇన్నోవాపై వినియోగదారుల విశ్వాసం మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం మార్కెట్లో Toyota ఈ ఇన్నోవాను రెండు వెర్షన్లలో అందిస్తోంది. ఒకటి ఇన్నోవా క్రిస్టా (Innova Crysta) కాగా, మరొకటి ఆధునిక ఫీచర్లు, హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చిన ఇన్నోవా హైక్రాస్ (Innova Hycross). ఈ రెండింటిలో కూడా తమతమ ప్రత్యేకతలు ఉన్నప్పటికీ, కొత్త తరం వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది హైక్రాస్ మోడల్.

ఈ స్కూటర్‌కు ఒక్కసారిగా భారీగా పెరిగిన కస్టమర్లు

భారతీయ టూవీలర్ మార్కెట్‌లో జపనీస్ కంపెనీలకు ఎప్పటినుంచో ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అందులో ముఖ్యంగా సుజుకి (Suzuki) తన నమ్మకమైన ఉత్పత్తులతో వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. ఈ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి Suzuki Access 125. మంచి మైలేజ్, స్మూత్ పనితీరు, మరియు అత్యంత ఆచరణాత్మక డిజైన్‌తో ఈ స్కూటర్ భారతీయ కుటుంబాల్లో ఒక నమ్మకమైన ఎంపికగా నిలిచింది. దీన్ని ఆధారంగా చేసుకుని, అదే ఇంజిన్ ప్లాట్‌ఫారమ్‌పై సుజుకి అవినెస్ 125 (Suzuki Avenis 125) వంటి కొత్త మోడళ్లను కూడా కంపెనీ పరిచయం చేసింది. ఇది స్పోర్టీ లుక్, యంగ్ డిజైన్‌తో ప్రత్యేకంగా యువతను టార్గెట్ చేసింది. ప్రారంభంలో ఇది పెద్దగా సంచలనం సృష్టించకపోయినా, క్రమంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంది.

కొత్త బైక్‌లు వస్తున్నా యంగ్ నుంచి ఓల్డ్ వరకు బుల్లెట్ మోజు తగ్గలేదు!

భారతీయ బైక్ మార్కెట్‌లో క్లాసిక్ స్టైల్, పవర్‌ఫుల్ ప్రెజెన్స్, ప్రత్యేకమైన రైడింగ్ అనుభూతికి ప్రతీకగా నిలిచిన మోడల్ అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350). దశాబ్దాలుగా తన ప్రత్యేక గుర్తింపును నిలబెట్టుకున్న ఈ బైక్, ఇప్పటికీ యువతతో పాటు మధ్యవయస్కుల హృదయాలను సమానంగా ఆకట్టుకుంటూ, మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ బైక్‌ను రోడ్లపై నడిపేటప్పుడు కలిగే ఆ ఫీల్ నిజంగా ప్రత్యేకం. గంభీరమైన ఇంజిన్ శబ్దం, క్లాసిక్ డిజైన్, స్టేబుల్ రైడింగ్ అనుభవం కలిసి బుల్లెట్ 350ను సాధారణ బైక్‌గా కాకుండా ఒక ఎమోషన్‌గా మార్చాయి. అందుకే కొత్త బైక్ కొనాలనుకునే చాలా మంది ముందుగా ఈ మోడల్ వైపే చూస్తున్నారు. షోరూమ్‌లలో కూడా ఈ బైక్‌కు ఎప్పటికీ తగ్గని డిమాండ్ కనిపిస్తూనే ఉంది.
Advertisement

చీప్ రేట్లో ఇంటర్నేషనల్ ఎలక్ట్రిక్ స్కూటర్లు

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) ఇప్పుడు భారత మార్కెట్‌పై తన దృష్టిని గట్టిగా కేంద్రీకరించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తన ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకున్న ఈ సంస్థ, 'మేడ్ ఇన్ ఇండియా' కాన్సెప్ట్‌తో తీసుకువస్తున్న VF6, VF7 ఎలక్ట్రిక్ SUVల ద్వారా భారతదేశంలోని ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన విభాగంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు భారత ఈవీ మార్కెట్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న హ్యూందాయ్, కియా వంటి దిగ్గజ కంపెనీలకు నేరుగా సవాలు విసురుతూ విన్‌ఫాస్ట్ తన అడుగులు వేస్తోంది. కేవలం కార్లతో మాత్రమే కాకుండా, విభిన్న ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్లలో కూడా తన స్థానం ఏర్పరచుకోవాలని ఈ బ్రాండ్ లక్ష్యంగా పెట్టుకుంది.

డబ్బులు ఆదా చేసే టాప్-5 స్కూటర్లు ఇవే

పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, సామాన్యుడికి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఎలక్ట్రిక్ వాహనం. ఆఫీసుకెళ్లాలన్నా, కాలేజీకి వెళ్లాలన్నా లేదా సాయంత్రం పూట కూరగాయలు తీసుకురావాలన్నా.. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లే బెస్ట్ ఛాయిస్. మార్కెట్లో లక్షలాది రూపాయల ఈవీలు ఉన్నప్పటికీ, సామాన్యుడి బడ్జెట్‌కు సరిపోయేలా, లక్ష రూపాయల లోపు లభించే టాప్-5 ఎలక్ట్రిక్ స్కూటర్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఇవి మీ పైసా పైసాను వసూలు చేయడమే కాకుండా, పెట్రోల్ ఖర్చును పూర్తిగా మిగిలిస్తాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనాలనుకునే వారికి పండుగ లాంటి న్యూస్

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవాన్ని మరింత పరుగులు పెట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెట్రోల్ ధరల సెగతో సతమతమవుతున్న సామాన్యుడికి ఊరటనిస్తూ, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఈ-రిక్షాలపై ఇస్తున్న సబ్సిడీ గడువును పెంచుతూ భారీ నిర్ణయం తీసుకుంది. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ చేపట్టిన పీఎం ఇ-డ్రైవ్ (PM E-DRIVE) పథకం కింద లభించే ఆర్థిక ప్రయోజనాలు ఇకపై మరికొంత కాలం అందుబాటులో ఉండనున్నాయి. దీనివల్ల కొత్తగా ఈవీ వాహనాలు కొనాలనుకునే వారికి వేల రూపాయల ఆదా అయ్యే అవకాశం కలిగింది.

ఏప్రిల్‌లో విడుదల కానున్న టాప్ 5 సరికొత్త మోడల్స్

భారత ఆటోమొబైల్ రంగంలో 2026 సంవత్సరం ఒక కొత్త ఉత్తేజంతో ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా ఏప్రిల్ నెల కార్ల ప్రేమికులకు పండగలా మారనుంది. మధ్యతరగతి కుటుంబాలకు నచ్చే బడ్జెట్ కార్ల నుంచి, ఎలైట్ క్లాస్ మెచ్చే లగ్జరీ ఎలక్ట్రిక్ వాహనాల వరకు ఐదు అదిరిపోయే మోడల్స్ మార్కెట్లోకి రాబోతున్నాయి. మారుతి సుజుకి, టయోటా, ఎంజీ వంటి దిగ్గజ సంస్థలు తమ అస్త్రాలను సిద్ధం చేశాయి. కొత్త కారు కొనాలనే ప్లాన్‌లో ఉన్నవారు ఒక్క నిమిషం ఆగి, వచ్చే నెల లాంచ్ కాబోతున్న ఈ కార్ల వివరాలను తెలుసుకుందాం.
Advertisement

జనాలకు నచ్చిన కారు ధరను భారీగా పెంచిన కంపెనీ

సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్, తన పాపులర్ సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూ (Hyundai Venue) ధరలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అలాంటి వారికి అలర్ట్. వేరియంట్, ఇంజిన్ రకాన్ని బట్టి హ్యుందాయ్ వెన్యూ ధరలు రూ.5,000 నుంచి రూ.20,000 వరకు పెరిగాయి. ఈ కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. 2026 మార్చి చివరి నాటికి హ్యుందాయ్ చేసిన ఈ మార్పుల వల్ల ఏయే మోడల్స్ ఎంత ఖరీదు అయ్యాయో, వెన్యూ ప్రత్యేకతలు ఏంటో వివరంగా తెలుసుకుందాం.