కరెంట్ కార్లలో ఇది కింగ్

గ్లోబల్ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో తనదైన ముద్ర వేస్తున్న దక్షిణ కొరియా దిగ్గజం కియా (Kia), మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా సరికొత్త ఎలక్ట్రిక్ కారు కియా EV2 (Kia EV2) ను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో యూరప్ మార్కెట్ కోసం దీనిని ప్రదర్శించిన కియా, ఇప్పుడు దీని ధరలు, వేరియంట్లను వెల్లడించింది. విలాసవంతమైన ఇంటీరియర్, అత్యాధునిక ఫీచర్లు, ఏకంగా 453 కిలోమీటర్ల భారీ రేంజ్ ఇవ్వడం ఈ కారు స్పెషాలిటీ. జర్మనీతో సహా పలు యూరోపియన్ దేశాల్లో ఇప్పటికే దీని బుకింగ్స్ షురూ అయ్యాయి. కియా సంస్థ నుంచి వస్తున్న అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ కారుగా EV2 రికార్డు సృష్టించబోతోంది.

శాంసంగ్ ఫోన్ కంటే తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్!

భారత టూవీలర్ మార్కెట్‌లో స్టైల్, పనితీరు, ధర అన్నీ కలిపి ఒకే ప్యాకేజ్‌గా అందించే బైక్‌లలో రాయల్ ఎన్‌ఫీల్గ్ హంటర్ 350 (Royal Enfield Hunter 350) ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ముఖ్యంగా యువతలో ఈ బైక్‌కు ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ బ్రాండ్‌కు చెందిన ఇతర మోడళ్లతో పోలిస్తే, హంటర్ 350 అత్యంత సరసమైన ధరలో అందుబాటులో ఉండటం దీనికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ఈ అందుబాటు ధరే కాదు, దానికి తోడు నగర వినియోగానికి సరిపోయే లైట్‌వెయిట్ డిజైన్, సులభమైన హ్యాండ్లింగ్, క్లాసిక్ లుక్ కలిసి హంటర్ 350ను విభిన్న వయసు గల వినియోగదారులకు ఆకర్షణీయంగా మార్చాయి. అందుకే ఈ బైక్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి నెలా మంచి అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది.

ఇది స్కూటర్ కాదు మామ అందమైన శిల్పం

ప్రపంచవ్యాప్తంగా లగ్జరీ స్కూటర్లకు కేరాఫ్ అడ్రస్ అయిన ఇటాలియన్ బ్రాండ్ వెస్పా (Vespa), తన పాపులర్ మోడళ్లయిన ప్రైమావేరా (Primavera), స్ప్రింట్ ఎస్ (Sprint S) శ్రేణిని 2026 సంవత్సరానికి గానూ సరికొత్త హంగులతో అప్‌డేట్ చేసింది. స్టైల్‌కు మారుపేరుగా నిలిచే ఈ స్కూటర్లలో ఈసారి కేవలం రంగులు మార్చడమే కాకుండా, సేఫ్టీ (Safety), సౌకర్యం (Convenience), అధునాతన సాంకేతికత (Technology) కలగలిపి అదిరిపోయే అప్‌గ్రేడ్స్ ఇచ్చింది. ప్రస్తుతం విదేశీ మార్కెట్లలో లాంచ్ అయిన ఈ మోడళ్లు త్వరలోనే భారత రోడ్లపై కూడా మెరిసే అవకాశం ఉంది. పియాజియో (Piaggio) సంస్థ ఆధ్వర్యంలో తయారయ్యే ఈ స్కూటర్ల విశేషాలేంటో వివరంగా తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా ఎక్కువగా కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

భారతదేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ వేగంగా ఎదుగుతున్న సమయంలో, టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) తీసుకొచ్చిన టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube) ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సాధారణంగా ఎలక్ట్రిక్ వాహనాలు అంటే కొత్త టెక్నాలజీ, అనుమానాలు, పరిమిత వినియోగం అనే భావనలు ఉండేవి. కానీ iQube వచ్చాక ఆ అభిప్రాయాలు చాలా వరకు మారిపోయాయి. ఇది కేవలం ఒక స్కూటర్‌గా కాకుండా, రోజువారీ జీవితంలో భాగమైపోయే సౌకర్యవంతమైన ప్రయాణ సాధనంగా మారింది. 2020 జనవరిలో ప్రారంభమైన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్, నెమ్మదిగా కానీ స్థిరంగా వినియోగదారుల నమ్మకాన్ని గెలుచుకుంటూ వచ్చింది. మొదట్లో కొన్ని నగరాలకే పరిమితమైన ఈ వాహనం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరించి, భారీ స్థాయిలో అమ్మకాల్ని నమోదు చేసింది.
Advertisement

డిఫెండర్ లా ఉన్నా దీన్ని కొనేందుకు ఇష్టపడని కస్టమర్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో కియా (Kia) సంస్థకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. సెల్టోస్, సోనెట్ వంటి మోడళ్లతో దేశీ మార్కెట్‌ను ఊపేసిన ఈ కొరియన్ కార్ల దిగ్గజానికి ఇప్పుడు ఒక కొత్త చిక్కు వచ్చి పడింది. ఎంతో ఆశగా, వినూత్నమైన డిజైన్‌తో లాంచ్ చేసిన కియా సైరోస్ (Kia Syros) కాంపాక్ట్ ఎస్‌యూవీ అమ్మకాల విషయంలో ఘోరంగా వెనుకబడిపోతుంది. 2026 ఫిబ్రవరి నెలలో ఈ కారు సేల్స్ గణాంకాలు చూస్తుంటే కంపెనీ మేనేజ్‌మెంట్‌కు చెమటలు పడుతున్నాయి. ఫీచర్లు అదిరిపోయినా, లుక్స్ విషయంలో మాత్రం కస్టమర్లను మెప్పించలేకపోతోందా? అసలు సైరోస్ ఎందుకు ఫెయిల్ అవుతోందో తెలుసుకుందాం.

కొత్తగా వచ్చిన మారుతి కారుకి జనాల నీరాజనం

దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి (Maruti Suzuki), ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి తన మొదటి అడుగును ధైర్యంగా వేసింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఇ-విటారా (e-vitara)ను మార్కెట్లోకి తీసుకువచ్చి, ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా 2026 ఫిబ్రవరి 17న ఈ వాహనం విడుదలైన వెంటనే, ఇది కేవలం మరో కొత్త కారు కాదని, మారుతి నుంచి వచ్చిన గేమ్ ఛేంజర్ అని చెప్పేలా మారింది. ఈ ఇ-విటారా ప్రత్యేకతలలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని ధర. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) మోడల్ కింద ప్రారంభ ధరను కేవలం రూ. 10.99 లక్షలుగా నిర్ణయించడం ద్వారా, ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది.

కేంద్రానికి వింత ప్రతిపాదన.. వాహనదారుల్లో కొత్త గుబులు

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఇథనాల్ (Ethanol) ఒక హాట్ టాపిక్‌గా మారింది. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపిన E20 ఇంధనం ఇప్పటికే మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ ఇంధనం వాడకం వల్ల వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. పాత వాహనాల్లో ఇంజిన్ లైఫ్ తగ్గిపోతోందని, మైలేజీ దారుణంగా పడిపోతోందని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య, ఇప్పుడు E30 (30% ఇథనాల్) వైపు అడుగులు వేయాలని ఆల్ ఇండియా డిస్టిల్లర్స్ అసోసియేషన్ (AIDA) కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. అసలు ఈ E30 వెనుక ఉన్న కథాకమీమామిషు ఏంటో వివరంగా తెలుసుకుందాం.

ఇవి కార్లు కాదు ప్రాణాలు కాపాడే బాడీగార్డులు

ఒకప్పుడు కారు కొనేటప్పుడు కేవలం మైలేజీ, తక్కువ ధర మాత్రమే చూసేవారు. కానీ, ఇప్పుడు కాలం మారింది. రోడ్డు ప్రమాదాల భయం పెరగడంతో, ప్రాణాలకు రక్షణ ఇచ్చే సేఫ్టీ ఫీచర్లకు జనం పెద్దపీట వేస్తున్నారు. కారు బాడీ ఎంత బలంగా ఉంటే అంత సురక్షితం అనే నమ్మకం పెరిగింది. అందుకే మన దేశంలో తయారవుతున్న కార్లు కూడా ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్లుగా లోహపు కోటల మాదిరిగా వస్తున్నాయి. ముఖ్యంగా 10 లక్షల రూపాయల కంటే తక్కువ బడ్జెట్‌లోనే గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) లేదా బి-ఎన్‌క్యాప్ (BNCAP) నుంచి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ అందుకున్న టాప్-5 కార్లు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఆ అదిరిపోయే కార్ల వివరాలు తెలుసుకుందాం.
Advertisement

మారుతి నుంచి తక్కువ ధరకే 7-సీటర్ ఎలక్ట్రిక్ కారు!

ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై వినియోగదారుల ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ ఉండటం, పర్యావరణంపై అవగాహన పెరగడం, అలాగే ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇవి కలిసి ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్‌ను తీసుకువచ్చాయి. ఈ అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్ని కూడా ఈ సెగ్మెంట్‌లోకి దూసుకెళ్లాయి. ప్రస్తుతం టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి కంపెనీలు ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో ముందంజలో నిలుస్తున్నాయి. విభిన్న మోడళ్లతో, విభిన్న ధరల శ్రేణిలో కార్లను అందిస్తూ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ కంపెనీలు ఇప్పటికే మంచి అమ్మకాలను నమోదు చేస్తూ, ఈ విభాగంలో తమ ఆధిపత్యాన్ని చూపిస్తున్నాయి.

తాతల కాలం నుంచి ఈ బండి అంటే మనోళ్లకు ఓ అటాచ్‎మెంట్

భారతదేశపు దిగ్గజ టూవీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) ఫిబ్రవరి 2026 నెలకు సంబంధించిన సేల్స్ డేటాను విడుదల చేసింది. ఈ గణంకాలు చూస్తుంటే బజాజ్ తన పట్టును మార్కెట్లో ఏమాత్రం కోల్పోలేదని స్పష్టమవుతోంది. ముఖ్యంగా బజాజ్ పల్సర్ సిరీస్ తన హవాను కొనసాగిస్తూ, మిగిలిన 12 మోడల్స్‌ను వెనక్కి నెట్టి నంబర్-1 స్థానాన్ని కైవసం చేసుకుంది. సామాన్యుడి నుంచి స్పోర్ట్స్ బైక్ ప్రియుల వరకు అందరినీ ఆకట్టుకుంటూ బజాజ్ దూసుకుపోతోంది. ఈ సేల్స్ రిపోర్ట్‌లో ఏయే బైక్‌లు ఎలా అమ్ముడయ్యాయి? ఎలక్ట్రిక్ స్కూటర్ల పరిస్థితి ఏంటి? ఏ మోడల్ అట్టడుగున నిలిచింది? వంటి ఆసక్తికరమైన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

హోండా అమేజ్‌పై భారీ ఆఫర్.. రూ.57,000 వరకు తగ్గింపు!

జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా (Honda) భారత మార్కెట్లో పోటీని మరింత కఠినంగా మార్చేందుకు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా తన ప్రసిద్ధ కాంపాక్ట్ సెడాన్ అయిన హోండా అమేజ్ (Honda Amaze) అమ్మకాలను పెంచుకోవడానికి ఈసారి ఆకర్షణీయమైన ఆఫర్‌ను ప్రకటించింది. మార్చి నెలను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ ప్రత్యేక ఆఫర్, కొత్త కారు కొనాలని భావిస్తున్న వినియోగదారులకు మంచి అవకాశంగా మారింది. 4 మీటర్ల లోపు సెడాన్ విభాగంలో మంచి గుర్తింపు పొందిన హోండా అమేజ్ పై మొత్తం రూ.57,000 వరకు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ఈ రెండింటిలో ఏ ఎస్‌యూవీ మీ ఫ్యామిలీకి కరెక్ట్?

భారత ఆటోమొబైల్ రంగంలో ఒకప్పుడు ఎస్‌యూవీ (SUV) అంటే కేవలం పెద్ద కార్లు మాత్రమే అనే ముద్ర ఉండేది. కానీ సామాన్యుడికి కూడా ఎస్‌యూవీ అనుభూతిని పరిచయం చేసిన ఘనత రెనాల్ట్ డస్టర్ (Renault Duster)కే దక్కుతుంది. మధ్యలో కొంతకాలం విరామం తీసుకున్న ఈ లెజెండరీ కారు, ఇప్పుడు సరికొత్త హంగులతో, పవర్‌ఫుల్ ఇంజిన్లతో మార్చి 2026లో మళ్లీ గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. అయితే, ప్రస్తుతం మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta)ను ఢీకొట్టడం డస్టర్‌కు అంత ఈజీ కాదు. ఈ రెండు కార్లలో ఏది బెస్ట్? ఏ కారు ఫీచర్లు ఎలా ఉన్నాయి? ధరలో ఏది తక్కువ? వంటి పూర్తి వివరాలు చూద్దాం.
Advertisement

బైక్ ధర రూ.64 వేలు.. గ్రామాల్లో, నగరాల్లో చాలా మంది కొంటున్నారు!

భారతదేశంలో ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైక్‌లకు ఉన్న ప్రాధాన్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోని పెద్ద భాగం ప్రజలు రోజువారీ ప్రయాణాల కోసం ఆధారపడేది ఈ తరహా బైక్‌లపైనే. తక్కువ ధరలో అందుబాటులో ఉండటం, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా లేకపోవడం, ముఖ్యంగా లీటర్‌కు మంచి మైలేజ్ ఇవ్వడం వంటి అంశాలు ఈ బైక్‌లను మధ్యతరగతి, తక్కువ ఆదాయ వర్గాలకు అత్యంత అనుకూలంగా మారుస్తాయి. నగరాల్లో ట్రాఫిక్ మధ్యన సులభంగా నడపగలగడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా సులభంగా ఉపయోగించుకోవడం వీటి ప్రధాన బలాలు. అందుకే ఈ సెగ్మెంట్‌లో పోటీ ఎంత ఎక్కువగా ఉన్నా, డిమాండ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు.

10 కార్లలో 7 అక్కడే అమ్ముడవుతున్నాయట

ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల హవా నడుస్తోంది. అయితే ఒకప్పుడు కేవలం మెట్రో నగరాలకే పరిమితమైన ఈ క్రేజ్, ఇప్పుడు చిన్న పట్టణాలకు కూడా పాకింది. దీనికి ప్రధాన కారణం MG విండ్సర్ ఈవీ (MG Windsor EV). ఈ ఎలక్ట్రిక్ కారు భారత మార్కెట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అక్టోబర్ 2024లో లాంచ్ అయినప్పటి నుంచి ఈ కారు అమ్మకాల్లో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లోని ప్రజలు ఈ కారుపై చూపిస్తున్న ఆసక్తి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఒక తాజా నివేదిక ప్రకారం.. ఈ కారు కొంటున్న ప్రతి 10 మందిలో ఏడుగురు చిన్న పట్టణాలకు చెందిన వారే కావడం విశేషం. సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు అంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ఎంజీ విండ్సర్ ఈవీ ఈ సమీకరణాలను మార్చేసింది. కార్‌ట్రాక్ నివేదిక ప్రకారం, ఈ కారు మొత్తం విక్రయాల్లో 70 శాతం వాటా టైర్-2, టైర్-3 నగరాల నుంచే వస్తోంది. అంటే కేవలం 30 శాతం అమ్మకాలు మాత్రమే మెట్రో నగరాల్లో జరుగుతున్నాయి. అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2026 వరకు సుమారు 65,000 యూనిట్ల విండ్సర్ ఈవీలు అమ్ముడయ్యాయి. ఈ ఘనత సాధించడం వెనుక ఎంజీ మోటార్ అనుసరించిన వ్యూహాత్మక ధరలు, ఫీచర్లు ప్రధాన పాత్ర పోషించాయి. ఎంజీ విండ్సర్ ఈవీ విజయంలో దాని BaaS (Battery-as-a-Service) మోడల్ కీలక పాత్ర పోషించింది. ఈ విధానం వల్ల కారు ప్రారంభ ధర కేవలం రూ.9.99 లక్షలకు తగ్గిపోయింది. కస్టమర్లు బ్యాటరీని అద్దెకు తీసుకుని, కిలోమీటరుకు కేవలం రూ.3.5 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ఇది ఒక పెట్రోల్ కారు మెయింటెనెన్స్ కంటే చాలా తక్కువ. ఒకవేళ బ్యాటరీతో కలిపి కారును పూర్తిగా సొంతం చేసుకోవాలనుకుంటే, దీని ధర రూ.13.50 లక్షల నుంచి రూ.18.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ చిన్న పట్టణాల్లోని వ్యాపారస్తులను, ఫ్యామిలీలను ఎక్కువగా ఆకర్షించింది. విండ్సర్ ఈవీ కేవలం ధరలోనే కాదు, ఫీచర్లలో కూడా రాజీ పడలేదు. దీనిని ఒక క్రాస్ఓవర్ లాగా డిజైన్ చేశారు, దీనివల్ల కారు లోపల చాలా ఎక్కువ స్థలం లభిస్తుంది. ముఖ్యంగా దీని వెనుక సీట్లు 135 డిగ్రీల వరకు వంగి ఉండటం వల్ల (Lounge Style Seats) ప్రయాణికులకు విమానంలోని బిజినెస్ క్లాస్ లాంటి అనుభూతిని కలిగిస్తాయి. కారు డాష్‌బోర్డ్‌పై 15.6 ఇంచుల భారీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. లగ్జరీ ఇంటీరియర్, విశాలమైన లెగ్ రూమ్ ఉండటం వల్ల లాంగ్ రైడ్స్ చేసే వారికి ఇది మొదటి ఛాయిస్‌గా మారింది. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా ఎంజీ దీనిని రెండు బ్యాటరీ ఆప్షన్లతో అందిస్తోంది:38 kWh బ్యాటరీ: ఇది సింగిల్ ఛార్జ్‌పై 331 కి.మీ రేంజ్ ఇస్తుంది. రోజువారీ ఆఫీస్ పనులకు లేదా సిటీ డ్రైవింగ్‌కు ఇది సరిపోతుంది.52.9 kWh బ్యాటరీ: దూర ప్రయాణాలు చేసే వారి కోసం ఈ వేరియంట్ 449 కి.మీ వరకు రేంజ్ అందిస్తుంది.ఈ కారులో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 136 bhp పవర్, 200 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 45kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో ఛార్జ్ చేస్తే కేవలం 55 నిమిషాల్లోనే 0 నుంచి 80 శాతం వరకు ఛార్జింగ్ పూర్తవుతుంది. విండ్సర్ ఈవీ రాకతో ఎంజీ మోటార్ ఇండియా తన అమ్మకాల్లో భారీ వృద్ధిని చూసింది. అక్టోబర్ 2024 నుంచి ఫిబ్రవరి 2026 మధ్య కాలంలో కంపెనీ మొత్తం మీద ఒక లక్షకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించింది. ఇందులో విండ్సర్ ఈవీతో పాటు ఎంజీ కామెట్ (Comet), ఎంజీ జెడ్ఎస్ ఈవీ (ZS EV) వంటి మోడల్స్ కూడా ఉన్నాయి. చిన్న పట్టణాల్లో తమ సర్వీస్ సెంటర్లను విస్తరించడం వల్ల ప్రజల్లో ఈ బ్రాండ్‌పై నమ్మకం పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఎంజీ అమ్మకాలు 19 శాతం పెరగడం గమనార్హం. టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 వంటి కార్లకు విండ్సర్ ఈవీ ఇప్పుడు గట్టి పోటీనిస్తోంది.

దీని మీద వీధిలో వెళ్తుంటే అమ్మాయిలు అలా చూస్తుండిపోవాల్సిందే

ప్రస్తుతం భారతీయ టూవీలర్ మార్కెట్లో జపనీస్ దిగ్గజం సుజుకి (Suzuki) హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఆ కంపెనీ నుంచి వచ్చిన బర్గ్‌మన్ స్ట్రీట్ 125 (Burgman Street 125) స్కూటర్ అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. సాధారణంగా 125సీసీ సెగ్మెంట్లో సుజుకి యాక్సెస్ (Access) రాజాలా ఏలుతుంటే, ఇప్పుడు దానికి తోడుగా మాక్సీ స్టైల్ బర్గ్‌మన్ కూడా రికార్డు స్థాయి వృద్ధిని నమోదు చేసింది. 2026 ఫిబ్రవరి నెల అమ్మకాల గణాంకాలు చూస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. గతేడాదితో పోలిస్తే ఏకంగా 112 శాతానికి పైగా వృద్ధిని సాధించి, టాప్ 10 స్కూటర్ల జాబితాలో చోటు దక్కించుకుంది.

యాక్టివా కంటే తక్కువే.. మధ్యతరగతి మనసు గెలిచింది

భారతదేశంలో రోజురోజుకూ స్కూటర్లకు పెరుగుతున్న ఆదరణ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బైక్‌ల మాదిరిగా తరచుగా గేర్లు మార్చాల్సిన అవసరం లేకపోవడం, ట్రాఫిక్‌లో సులభంగా నడపగలగడం, కుటుంబ సభ్యులందరికీ ఉపయోగపడే విధంగా ఉండటం వంటి కారణాలతో స్కూటర్ల వైపు వినియోగదారులు మరింతగా ఆకర్షితులవుతున్నారు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన ప్రముఖ సంస్థ Suzuki తయారు చేసిన సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) భారత మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రతి నెలా మంచి అమ్మకాలను నమోదు చేస్తూ వస్తున్న ఈ స్కూటర్, 2026 ఫిబ్రవరిలో కూడా తన దూకుడు కొనసాగించింది.
Advertisement

ఇది కారు కాదు కదిలే థియేటర్

మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ భారతీయ ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేపింది. ఇప్పటికే తన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తున్న మహీంద్రా, తాజాగా XEV 9e మోడల్‌లో అత్యంత విలాసవంతమైన సినెలక్స్ ఎడిషన్ (Cineluxe Edition)ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ నెల ప్రారంభంలోనే దీనిని పరిచయం చేయగా, ఇప్పుడు ఈ స్పెషల్ ఎడిషన్ కార్లు దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ డీలర్‌షిప్‌లకు చేరుకుంటున్నాయి. అంటే మీరు ఈ కారును నేరుగా షోరూమ్‌కు వెళ్లి చూసి, టెస్ట్ డ్రైవ్ చేసి ఇంటికి తెచ్చుకునే సమయం వచ్చేసిందన్నమాట. మహీంద్రా XEV 9e సినెలక్స్ ఎడిషన్ ప్రధాన ఆకర్షణ దాని ఇంటీరియర్. కారు లోపలికి అడుగు పెట్టగానే మీకు ఒక లగ్జరీ లాంజ్‌లో కూర్చున్న అనుభూతి కలుగుతుంది. దీని క్యాబిన్‌లో చెస్టనట్ బ్రౌన్, క్ట్రన్ బ్లాక్ కలర్స్‌లో స్మూత్-గ్రెయిన్ లెదరెట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇది కారుకు అత్యంత ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. అంతేకాదు, ఈ కారులో ఇన్ఫినిటీ రూఫ్ (పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్),16 మిలియన్లకు పైగా రంగుల ఆప్షన్లు ఇచ్చే అంబియంట్ లైటింగ్ సిస్టమ్ ఉంది. అంటే మీ మూడ్‌ని బట్టి కారు లోపలి లైటింగ్ రంగును మార్చుకోవచ్చు. డాష్‌బోర్డ్ మొత్తం కవర్ చేస్తూ ట్రిపుల్ హెచ్‌డీ (Triple HD) డిస్ప్లే సెటప్ ఉండటం ఈ కారును ఫ్యూచర్ వెహికల్ మాదిరి చూపిస్తుంది. కారులో ప్రయాణిస్తున్నప్పుడు మ్యూజిక్ ఎంజాయ్ చేసేవారికి ఇది ఒక వరమనే చెప్పాలి. సినెలక్స్ ఎడిషన్‌లో డాల్బీ అట్మాస్ (Dolby Atmos) టెక్నాలజీతో కూడిన 16 స్పీకర్ల హర్మన్ కార్డన్ ఆడియో సిస్టమ్ అమర్చారు. కారు లోపల ఒక చిన్న థియేటర్ ఉన్నంత సౌండ్ క్వాలిటీని ఇది అందిస్తుంది. ఇక ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే, ఇది సాటిన్ బ్లాక్, సాటిన్ వైట్ అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కారు బాడీ డిజైన్ చాలా ఏరోడైనమిక్‌గా ఉండి, చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ స్పెషల్ ఎడిషన్ కారు 79kWh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ కారు 500 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంటే లాంగ్ ట్రిప్స్‌కు ఇది బెస్ట్ ఆప్షన్. దీని వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 286hp శక్తిని, 380Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల కారు కేవలం 7.45 సెకన్లలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. స్పీడ్, రేంజ్ రెండింటిలోనూ మహీంద్రా రాజీ పడలేదని ఇక్కడ స్పష్టమవుతోంది. మహీంద్రా ఈ కారులో ప్యాక్ త్రీ (Pack Three) అనే అడ్వాన్స్‌డ్ ఫీచర్ల సెట్‌ను అందించింది. ఇందులో స్ట్రెయిట్ అహెడ్ విజన్‌ఎక్స్ ఏఆర్ హెడ్స్-అప్ డిస్ప్లే (HUD) ఉంటుంది. ఇది కారు వేగం, మ్యాప్ వివరాలను విండ్‌షీల్డ్‌పైనే చూపిస్తుంది. డ్రైవర్, ప్యాసింజర్ మానిటరింగ్ సిస్టమ్, హ్యాండ్స్-ఫ్రీ పార్క్ అసిస్ట్, సెక్యూర్ 360 సేఫ్టీ సూట్ వంటివి ఈ కారులో సేఫ్టీని నెక్ట్స్ లెవల్కి తీసుకెళ్లాయి. కారు చుట్టూ ఉన్న ప్రతి అంగుళాన్ని గమనించేలా సెక్యూర్ 360 ప్రో కెమెరా సిస్టమ్ కూడా ఉంది. పావ్ పాల్ (PawPal) మోడ్ ద్వారా మీ పెంపుడు జంతువులకు కూడా కారులో సౌకర్యవంతమైన వాతావరణాన్ని (HVAC) అందించవచ్చు. మహీంద్రా XEV 9e సినెలక్స్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.29.35 లక్షలుగా నిర్ణయించారు. దీని టాప్ ఎండ్ మోడల్ ధరలు రూ. 31.25 లక్షల వరకు వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లకు ఈ కార్లు చేరుకుంటున్నాయి. టాటా హారియర్ ఈవీ (Harrier EV), బీవైడీ అట్టో 3 (BYD Atto 3) వంటి కార్లకు ఇది గట్టి పోటీనిస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారు, లగ్జరీ, టెక్నాలజీ కలగలిసిన వాహనం కావాలనుకుంటే మహీంద్రా XEV 9e సినెలక్స్ ఒక సరైన ఎంపిక.

కుషాక్ ఫేస్‌లిఫ్ట్ vs డస్టర్.. ఎవరిది బెస్ట్ డీల్? పూర్తి కంపారిజన్

భారతీయ కాంపాక్ట్ SUV మార్కెట్లో పోటీ రోజురోజుకూ మరింత కఠినంగా మారుతోంది. ఈ నేపథ్యంలో స్కోడా (Skoda) తాజాగా తన ప్రాచుర్యం పొందిన కుషాక్ (Kushaq) ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లతో వచ్చిన ఈ మోడల్ మార్కెట్లో మళ్లీ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, కుషాక్‌కు ఇది సులభమైన ప్రయాణం కాదు. ఎందుకంటే ఎంతోకాలం తర్వాత తిరిగి మార్కెట్లోకి అడుగుపెట్టిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) ఇప్పుడు గట్టి పోటీగా మారింది. ఒకప్పుడు ఈ సెగ్మెంట్‌లో తనదైన గుర్తింపు పొందిన డస్టర్, కొత్త అప్‌డేట్స్‌తో మళ్లీ వినియోగదారుల ముందుకు రావడం వల్ల పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఈ రెండింటి మధ్య తేడాలను ఈ కథణంలో చూద్దాం.

హైబ్రిడ్ కార్ అయినా తగ్గిన డిమాండ్.. క్యామ్రీకి ఏమైంది?

కారు ప్రియుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న జపాన్ ఆటో దిగ్గజం టయోటా (Toyota) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత మార్కెట్లో సంవత్సరాలుగా తన నాణ్యత, నమ్మకంతో ఒక స్ట్రాంగ్ ఇమేజ్‌ను నిర్మించుకున్న ఈ సంస్థ, ప్రతి విభాగంలో తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా Toyota Innova, Toyota Fortuner వంటి మోడళ్లతో కుటుంబ వాహనాల నుంచి ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్ వరకు వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంది. టయోటా ప్రత్యేకత ఏమిటంటే, అమ్మకాల పరంగా మాత్రమే కాకుండా, అమ్మకానంతర సేవలో కూడా ఒక బెంచ్‌మార్క్‌గా నిలవడం. అందుకే టయోటా సామాన్య వినియోగదారుల నుంచి లగ్జరీ కస్టమర్ల వరకు అందరినీ ఆకట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది.

మన జీవితాల్లో భాగమైన 5 ఐకానిక్ స్కూటర్లు ఇవే

భారతదేశంలో మధ్యతరగతి కుటుంబాలకు స్కూటర్ అంటే కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, అదొక భావోద్వేగం. ఒకప్పుడు పెళ్లి కానుకగా ఇచ్చే బజాజ్ చేతక్ నుంచి, నేటి తరం యువత మనసు దోచుకుంటున్న హోండా యాక్టివా వరకు స్కూటర్ల ప్రయాణం ఎంతో ఆసక్తికరంగా సాగింది. రోడ్లపై తిరుగుతూ, చరిత్ర సృష్టించి, కొన్ని తరాల జీవితాలను ప్రభావితం చేసిన టాప్ 5 ఐకానిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Advertisement

15 లక్షల లోపు లభించే టాప్ టర్బో పెట్రోల్ ఎస్‌యూవీలు ఇవే

గడిచిన కొన్నేళ్లుగా భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎస్‌యూవీ (SUV)ల హవా నడుస్తోంది. అయితే, కేవలం కారు చూడటానికి పెద్దగా ఉంటే సరిపోదు, దాని ఇంజిన్‌లో కూడా పవర్ ఉండాలని నేటి యువత కోరుకుంటోంది. ముఖ్యంగా డ్రైవింగ్ అంటే ఇష్టం ఉన్నవారికి టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఇచ్చే కిక్కు వేరు. మీరు కూడా 15 లక్షల రూపాయల లోపు బడ్జెట్‌లో అదిరిపోయే పవర్, వేగంతో దూసుకెళ్లే ఎస్‌యూవీ కోసం చూస్తున్నారా? అయితే మీ కోసమే ఈ అదిరిపోయే లిస్ట్. టాటా, మహీంద్రా, కియా వంటి దిగ్గజాలతో పాటు సరికొత్తగా మార్కెట్లోకి వచ్చిన రెనాల్ట్ డస్టర్ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

టాటా పంచ్‌కు పోటీగా మారుతి కొత్త కారు.. రూ.5.5 లక్షలలోపే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తన వ్యూహాలను మార్చుకుంటూ ముందుకు సాగుతున్న మారుతి సుజుకి (Maruti Suzuki), గత దశాబ్దంలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కూడా తన స్థాయిని గణనీయంగా పెంచుకోవడానికి చాలా కృషి చేసింది. ఒకప్పుడు చిన్న కార్ల తయారీలోనే ప్రధానంగా దృష్టి పెట్టిన ఈ సంస్థ, ఇప్పుడు వినియోగదారుల అభిరుచులు ఎస్‌యూవీల వైపు మళ్లడంతో, అదే దిశగా భారీగా అడుగులు వేసింది. ఈ క్రమంలో ఆరు మోడళ్లతో కూడిన విస్తృత SUV లైనప్‌ను నిర్మించి, మార్కెట్లో బలమైన స్థానాన్ని సంపాదించింది. అయితే, కంపెనీ లక్ష్యాలు ఇక్కడితో ఆగిపోలేదు. రాబోయే సంవత్సరాల్లో ఈ ఎస్‌యూవీ శ్రేణిని మరింత విస్తరించాలనే ప్రణాళికతో మారుతి ముందుకు సాగుతోంది.

బుల్లెట్ బండికి బ్రేకులు వేయడానికి ట్రయంఫ్ మాస్టర్ ప్లాన్

భారతదేశంలో ప్రీమియం బైకుల మార్కెట్ ఇప్పుడు ఊహించని మలుపు తిరుగుతోంది. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ ఏలుతున్న 350సీసీ సెగ్మెంట్‌లోకి బ్రిటీష్ దిగ్గజం ట్రయంఫ్(Triumph) తన సరికొత్త అస్త్రాలతో దాడికి సిద్ధమైంది. బజాజ్ ఆటోతో కలిసి ఇప్పటికే 400సీసీ సెగ్మెంట్‌లో దుమ్మురేపుతున్న ట్రయంఫ్, ఇప్పుడు మరింత తక్కువ ధరకే లభించేలా 350సీసీ బైకులను లాంచ్ చేయబోతోంది. ఏప్రిల్ 6, 2026న ఈ బైకులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త మార్పుల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ధరలు ఎంత తగ్గుతాయి? రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు ఇది గట్టి పోటీ ఇస్తుందా? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. భారత ప్రభుత్వం ప్రతిపాదించిన GST 2.0 నిబంధనలే ఈ భారీ మార్పుకు ప్రధాన కారణం. కొత్త పన్ను విధానం ప్రకారం, 350సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైకులపై ఏకంగా 40 శాతం జీఎస్టీ విధిస్తారు. అదే 350సీసీ లోపు ఉంటే కేవలం 18 శాతం మాత్రమే పన్ను ఉంటుంది. ప్రస్తుతం ట్రయంఫ్ స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400 మోడళ్లు 399సీసీ ఇంజిన్‌ను కలిగి ఉన్నాయి, దీనివల్ల కస్టమర్లపై పన్ను భారం ఎక్కువగా పడుతోంది. ఈ భారాన్ని తగ్గించి, బైకులను మరింత అందుబాటులోకి తేవడానికి బజాజ్, ట్రయంఫ్ కలిసి 350సీసీ ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశాయి. ప్రస్తుత 400సీసీ ఇంజిన్‌ను కొద్దిగా తగ్గించి కొత్త 350సీసీ ఇంజిన్‌ను రూపొందిస్తున్నారు. నివేదికల ప్రకారం, ఈ కొత్త ఇంజిన్ 35 bhp పవర్, 33 Nm టార్క్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. దీనికి 6-స్పీడ్ గేర్‌బాక్స్‌ను జత చేస్తారు. ఇంజిన్ సైజు తగ్గినప్పటికీ, రైడింగ్ క్వాలిటీలో ఎటువంటి రాజీ పడకూడదని ట్రయంఫ్ భావిస్తోంది. స్పీడ్ T4 మోడల్‌ను ఇప్పటికే టెస్టింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఇది కేవలం పవర్ కోసమే కాకుండా, నగర ప్రయాణాలకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు.ధర తగ్గుతోంది కదా అని ఫీచర్లు తగ్గిస్తారని అనుకుంటే పొరపాటే. ట్రయంఫ్ తన కొత్త 350సీసీ రేంజ్‌లో మరిన్ని అడ్వాన్స్‌డ్ ఫీచర్లను జోడించబోతోంది. ఇందులో TFT డిస్‌ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వివిధ రైడింగ్ మోడ్స్ (Rain, Road), సెగ్మెంట్-ఫస్ట్ క్విక్ షిఫ్టర్ వంటి ఫీచర్లు వచ్చే ఛాన్స్ ఉంది. డిజైన్ పరంగా ప్రస్తుత స్పీడ్ 400 మోడల్‌ను పోలి ఉన్నప్పటికీ, కొత్త గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్లతో ఇది మరింత ఫ్రెష్‌గా కనిపిస్తుంది. ఈ కొత్త 350సీసీ రేంజ్ రాకతో ట్రయంఫ్ బైకుల ధరలు దాదాపు రూ.30,000 వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే, ఈ బైకులు రూ.1.80 లక్షల నుంచి రూ.2.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల మధ్యలో లభించవచ్చు. ఇదే జరిగితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ 350 మార్కెట్‌కు ట్రయంఫ్ గట్టి సవాలు విసిరినట్లే. తక్కువ ధరలో ప్రీమియం బ్రిటీష్ బ్రాండ్ దొరుకుతుందంటే యువత కచ్చితంగా ట్రయంఫ్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ట్రయంఫ్ కు ఉన్న అతిపెద్ద సవాలు సర్వీస్ సెంటర్లు. రాయల్ ఎన్‌ఫీల్డ్ కు దేశవ్యాప్తంగా మూలమూలలా సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. అయితే, బజాజ్ భాగస్వామ్యంతో ట్రయంఫ్ ఇప్పుడు వేగంగా తన నెట్‌వర్క్‌ను విస్తరిస్తోంది. స్పేర్ పార్ట్స్ ధరలను కూడా తగ్గించి, సామాన్యులకు అందుబాటులోకి తెస్తే మాత్రం 350సీసీ సెగ్మెంట్‌లో ట్రయంఫ్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. ఏప్రిల్ 6న జరిగే లాంచ్ ఈవెంట్‌లో పాత 400సీసీ మోడళ్లను కొనసాగిస్తారా లేదా అనేది స్పష్టత రానుంది.

ఒక్కసారిగా బాంబ్ పేల్చిన టాటా.. పెట్రోల్, డీజిల్, CNG కార్లపై ధరల పెంపు

భారత ఆటోమొబైల్ రంగంలో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన టాటా మోటార్స్ (Tata Motors) నుంచి తాజాగా వచ్చిన వార్త, టాటా కారును కొనాలని భావిస్తున్న అనేక మందికి కొంత నిరాశ కలిగిస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని దృష్టిలో పెట్టుకుని, కంపెనీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 2026 ఏప్రిల్ 1 నుండి పెట్రోల్, డీజిల్, అలాగే CNG ఇంజిన్లతో వచ్చే అన్ని ICE వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నది కాదు; గత కొంతకాలంగా పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల ప్రభావమే దీనికి ప్రధాన కారణం. ముఖ్యంగా వాహనాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాల ధరలు గణనీయంగా పెరగడం వల్ల కంపెనీపై ఆర్థిక ఒత్తిడి పెరిగింది.
Advertisement

త్వరలో మార్కెట్లోకి 5 సరికొత్త 7-సీటర్ హైబ్రిడ్ ఎస్‌యూవీలు

భారత ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా హైబ్రిడ్ జపం వినిపిస్తోంది. ఒకప్పుడు కేవలం డీజిల్, పెట్రోల్ ఇంజిన్లకే పరిమితమైన మన కార్ల మార్కెట్, ఇప్పుడు ఎలక్ట్రిక్ వైపు అడుగులు వేస్తోంది. అయితే, పూర్తి ఎలక్ట్రిక్ కార్ల వాడకంలో ఛార్జింగ్ ఇబ్బందులు ఉండటంతో, సామాన్యుడికి హైబ్రిడ్ టెక్నాలజీ ఒక వరంగా మారింది. పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉండటం వల్ల మైలేజీ అదిరిపోవడమే కాకుండా, పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. ముఖ్యంగా పెద్ద కుటుంబాల కోసం 7-సీటర్ విభాగంలో సరికొత్త హైబ్రిడ్ ఎస్‌యూవీలు (SUVs) మార్కెట్లోకి రాబోతున్నాయి. టయోటా నుంచి నిస్సాన్ వరకు దిగ్గజ కంపెనీలు సిద్ధం చేస్తున్న ఆ 5 అదిరిపోయే కార్ల వివరాలు తెలుసుకుందాం.