డెలివరీ బాయ్స్‎కు బెస్ట్ ఫ్రెండ్ లాంటి బైక్స్

భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు, సామాన్యులకు హీరో మోటోకార్ప్ అంటే కేవలం ఒక కంపెనీ మాత్రమే కాదు. అదొక నమ్మకం. పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత రోజుల్లో, జేబుకు చిల్లు పడకుండా గమ్యాన్ని చేర్చే బైక్ కోసం ప్రతి ఒక్కరూ వెతుకుతుంటారు. ముఖ్యంగా రోజువారీ ఆఫీసు పనులకు వెళ్లేవారు, డెలివరీ బాయ్స్, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు వెళ్లేవారికి హీరో బైకులు ప్రాణవాయువులాంటివి. కేవలం రూ.57,657 ప్రారంభ ధరతో లభిస్తూ, ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వెసులుబాటు కల్పించే మూడు అద్భుతమైన బైకుల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఒక్క సెకను కూడా వదల్లేదు, 7 నిమిషాల్లోనే మొత్తం సేల్

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మహీంద్రా అండ్ మహీంద్రా (Mahindra & Mahindra) ప్రస్తుతం తన కార్ల అమ్మకాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కంపెనీకి మంచి స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ విడుదల చేసిన ప్రత్యేక ఎడిషన్ ఎలక్ట్రిక్ SUV అయిన మహీంద్రా బీఈ 6 బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ (Mahindra BE 6 Batman Edition) మార్కెట్లో భారీ సంచలనాన్ని సృష్టించింది. ప్రత్యేక డిజైన్, పరిమిత సంఖ్యలో మాత్రమే లభించడం వంటి కారణాల వల్ల ఈ మోడల్‌పై కొనుగోలుదారుల ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది. ఈ ప్రత్యేక ఎడిషన్ SUVను కంపెనీ 2025 ఆగస్టు 14న అధికారికంగా విడుదల చేసింది.

రెండూ 5 స్టార్ సేఫ్టీ ఉన్నా కార్లే.. ఏది బెస్ట్

భారతదేశ మధ్యతరగతి కుటుంబాలకు కాంపాక్ట్ సెడాన్ కార్లు అంటే ఒక స్పెషల్ క్రేజ్. అందులోనూ మారుతి సుజుకి డిజైర్, హోండా అమేజ్ కార్లు ఈ సెగ్మెంట్‌లో దశాబ్ద కాలంగా రారాజులుగా వెలుగొందుతున్నాయి. ముఖ్యంగా సిటీ ట్రాఫిక్‌లో క్లచ్ నొక్కే బాధ లేకుండా హాయిగా డ్రైవ్ చేయాలనుకునే వారు ఆటోమేటిక్ (AMT/CVT) వేరియంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఈ రెండు కార్ల మధ్య పోటీ మరింత రసవత్తరంగా మారింది.

ఒక్క ఛార్జ్‌తో హైదరాబాద్ టూ వైజాగ్ నాన్-స్టాప్

మెర్సిడెస్-బెంజ్ భారతదేశంలో లగ్జరీ కార్ల మార్కెట్‌ను ఏలుతోంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలో కూడా తన ముద్ర వేయడానికి సిద్ధమైంది. తాజాగా కంపెనీ విడుదల చేసిన మెర్సిడెస్-బెంజ్ CLA ఎలక్ట్రిక్ సెడాన్, ఆటోమొబైల్ ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీసింది. ఇది కేవలం ఒక కారు మాత్రమే కాదు, టెక్నాలజీ, విలాసాల మేళవింపుతో రూపొందించిన ఒక అద్భుతం. ఈ కారుకు సంబంధించిన ప్రతి అంశం గురించి వివరంగా తెలుసుకుందాం.
Advertisement

టయోటా కార్లలో అందరూ దీన్నే ఎక్కువగా కొంటున్నారు

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా (Toyota) ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. కంపెనీకి చెందిన కార్లు వరుసగా మంచి అమ్మకాలు సాధిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా టయోటా ఇన్నోవా, గ్లాంజా, ఫార్చ్యునర్ వంటి మోడళ్లు ఇప్పటికే మార్కెట్లో భారీ డిమాండ్‌ను సొంతం చేసుకున్నాయి. కుటుంబ వినియోగానికి అనువైన డిజైన్, నమ్మకమైన ఇంజిన్ పనితీరు, మంచి రీసేల్ విలువ వంటి కారణాలతో ఈ కార్లకు వినియోగదారులు ఎప్పటినుంచో మంచి ఆదరణ చూపిస్తున్నారు. అయితే ఈ మోడళ్లన్నింటిని మించి ఇప్పుడు మరొక టయోటా కారు దేశవ్యాప్తంగా అద్భుతమైన డిమాండ్‌ను సంపాదించుకుంటోంది. అదే టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder).

ఇవే 4 బెస్ట్ మైలేజ్ స్కూటర్లు.. ఒక్కసారి కొంటే ఎప్పుడో కానీ రిపేర్లు రావు!

భారత టూవీలర్ మార్కెట్లో స్కూటర్లకు ఉన్న డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్, సులభమైన రైడింగ్ అనుభవం, తక్కువ నిర్వహణ ఖర్చుల వల్ల చాలా మంది ఇప్పుడు స్కూటర్లను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రోజువారీ ప్రయాణాలకు స్కూటర్లు ఎంతో సౌకర్యంగా ఉండటంతో వినియోగదారులు వాటిని ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా రోజువారీ ఉపయోగం కోసం ఒక కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మంచి మైలేజ్ ఇచ్చే మోడళ్లను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. ఈ విషయంలో మార్కెట్లో మంచి పేరు సంపాదించిన కొన్ని 125cc స్కూటర్లు మంచి ఎంపికగా నిలుస్తున్నాయి. అందులో ముఖ్యంగా Honda Activa 125, TVS Jupiter 125, Suzuki Access 125, TVS NTorq 125 వంటి మోడళ్లు ప్రస్తావించవచ్చు. వాటి గురించి ఈ కథణంలో..

రూ.2.50లక్షల్లోపు టాప్ 6 బైకులివే

రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఈ పేరు వింటేనే బైక్ లవర్స్‌లో ఒక రకమైన పూనకం వస్తుంది. ఆ గంభీరమైన డుగ్ డుగ్ శబ్దం, క్లాసిక్ లుక్ ఏ బైకుకూ రాదు. అందుకే చాలామంది సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ బుల్లెట్ బైక్ కొనాలని కలలు కంటుంటారు. అయితే, రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే భారీ ధర ఉంటుందని చాలామంది భయపడతారు. కానీ, ప్రస్తుతం మార్కెట్లో రూ.2.50 లక్షల కంటే తక్కువ బడ్జెట్ లోనే అదిరిపోయే మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు మొదటిసారి రాయల్ ఎన్‌ఫీల్డ్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీ బడ్జెట్ కు తగ్గట్టుగా ఉన్న టాప్ 6 బైకుల వివరాలు తెలుసుకుందాం.

ప్రత్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్న ఎంజీ '5-5-5' ప్లాన్

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ప్రీమియం ఎస్‌యూవీల హవా పెరుగుతుంది. ఈ తరుణంలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor) తన ప్రతిష్టాత్మక మోడల్ మెజెస్టర్ (MG MAJESTOR)తో సంచలనం సృష్టిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి D+ సెగ్మెంట్ ఎస్‌యూవీగా గుర్తింపు పొందిన ఈ కారును కేవలం అమ్మడమే కాకుండా, కస్టమర్లకు దీర్ఘకాలిక భరోసా ఇచ్చేందుకు కంపెనీ '5-5-5 పీస్ ఆఫ్ మైండ్' (5-5-5 Complete Peace of Mind) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది. సాధారణంగా లగ్జరీ కార్లు కొనేవారికి మెయింటెనెన్స్ ఖర్చులు భారంగా అనిపిస్తుంటాయి, కానీ ఎంజీ మోటార్ ఈ ప్యాకేజీతో ఆ భయాలకు చెక్ పెట్టింది.
Advertisement

కనీవిని ఎరుగని రీతిలో ఈ కారు కోసం లక్ష మంది వచ్చారు

భారతదేశంలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్లో హ్యుందాయ్ వెన్యూ (Hyundai Venue) తనదైన ప్రత్యేక స్థానం సంపాదించింది. ప్రారంభం నుండి ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్‌తో వచ్చిన ఈ మోడల్ విపరీతమైన ఆదరణను పొందింది. దీని ఫ్లెక్సిబుల్ ఫీచర్స్, కాలానుగుణమైన డిజైన్, స్మార్ట్ ఇంటీరియర్, ఆధునిక సాంకేతికతలకు కారణంగా, ఈ వెన్యూ తన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హ్యుందాయ్ ఇటీవల విడుదల చేసిన న్యూ-జెన్ వెర్షన్ మరింత అప్‌డేటెడ్ డిజైన్, కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లతో మార్కెట్‌లో కొత్త అలలను సృష్టించింది. కొత్త వెర్షన్ విడుదలతో, కంపెనీ ఊహించిన దానికన్నా ఎక్కువ మంది వినియోగదారులు ఈ SUV వైపు ఆకర్షితులయ్యారు. దీని ఫ్లెక్సిబిలిటీ, స్మార్ట్ ఫీచర్స్, ధర కారణంగా కస్టమర్లు ఈ వెన్యూ మోడల్‌ను చాలా ఆసక్తిగా బుక్ చేస్తున్నారు.

భారత మార్కెట్లో ట్రయంఫ్ బైకుల దూకుడు

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్రీమియం బైక్ బ్రాండ్ అయిన ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ (Triumph Motorcycles) భారత మార్కెట్లో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంటోంది. ఇందుకు ముఖ్య కారణం భారతదేశంలోని ప్రముఖ టూవీలర్, త్రీవీలర్ వాహన తయారీ సంస్థ అయిన Bajaj Autoతో ఏర్పడిన వ్యూహాత్మక భాగస్వామ్యం. ఈ భాగస్వామ్యం ద్వారా భారత మార్కెట్లో ట్రయంఫ్ బైకుల తయారీ, మార్కెటింగ్, పంపిణీ కార్యక్రమాలను బజాజ్ సమర్థంగా నిర్వహిస్తోంది. దీనివల్ల ట్రయంఫ్ మోటార్ సైకిళ్లు దేశవ్యాప్తంగా మరింత విస్తృతంగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ భాగస్వామ్యం ఫలితంగా ట్రయంఫ్ బ్రాండ్ భారతదేశంలో మంచి విజయాన్ని నమోదు చేస్తోంది.

ఇది పేదవాళ్ల కల నిజం చేసిన కారు

భారతదేశంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఒక కారు కొనడం అనేది కేవలం అవసరం మాత్రమే కాదు, అది ఒక జీవితకాలపు కల. వర్షం వస్తే తడవకుండా, ఎండ తగలకుండా భార్యాపిల్లలతో కలిసి సురక్షితంగా ప్రయాణించాలని ప్రతి సామాన్యుడు కోరుకుంటాడు. అలాంటి పేద, మధ్యతరగతి ప్రజల కలను నిజం చేస్తున్న కారు మారుతి సుజుకి ఆల్టో K10 (Maruti Suzuki Alto K10). తక్కువ ధర, అదిరిపోయే మైలేజీతో ఈ కారు ఇప్పుడు భారత మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా విడుదలైన సేల్స్ రిపోర్ట్స్ చూస్తుంటే, షోరూమ్‌ల ముందు జనం క్యూ కడుతున్నారని స్పష్టమవుతోంది.

త్వరలో రోడ్ల మీద రచ్చ చేయబోతున్న కొత్త SUVలు ఇవే

ప్రస్తుత ఆటోమొబైల్ ప్రపంచంలో ఎలక్ట్రిక్ కార్లు, హైబ్రిడ్ ఇంజిన్ల హడావుడి ఎంత ఉన్నా.. డీజిల్ కార్లకు ఉన్న క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ముఖ్యంగా ఎస్‌యూవీ (SUV) లవర్స్ ఇప్పటికీ డీజిల్ ఇంజిన్లకే ఓటు వేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు.. లాంగ్ జర్నీలు చేసేటప్పుడు ఇచ్చే మైలేజ్, ఆఫ్ రోడింగ్‌లో చూపించే పవర్, కొండ ప్రాంతాల్లో ఎక్కేటప్పుడు డీజిల్ ఇంజిన్ ఇచ్చే టార్క్ మరే ఇంజిన్ ఇవ్వలేదు. అందుకే దిగ్గజ కంపెనీలు తమ పవర్ ఫుల్ డీజిల్ మోడళ్లను సరికొత్త హంగులతో మార్కెట్లోకి తెస్తున్నాయి. రాబోయే రోజుల్లో భారత రోడ్లపై గర్జించబోతున్న ఆ 9 మోస్ట్ అవైటెడ్ డీజిల్ ఎస్‌యూవీల వివరాలు ఇక్కడ చూడండి.
Advertisement

7-సీటర్ రాక్-సాలిడ్ టాటా కారు

టాటా సఫారీ (Tata Safari) భారత మార్కెట్‌లో ఎంతో విశ్వాసం సంపాదించిన SUVగా ప్రత్యేక గుర్తింపు పొందింది. చాలా సంవత్సరాలుగా ఈ కారు నమ్మకానికి ప్రతీకగా నిలుస్తూ, కుటుంబాలకు సరైన ప్రయాణ భాగస్వామిగా మారింది. ముఖ్యంగా భద్రత విషయంలో ఈ మోడల్‌కు మంచి పేరు ఉంది. ప్రయాణికుల రక్షణకు అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ రూపొందించబడిన ఈ SUV, భద్రత పరీక్షల్లో కూడా అద్భుతమైన ఫలితాలు సాధించింది. అందుకే దీనికి Global NCAP, Bharat NCAP నుండి ప్రతిష్టాత్మకమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఈ రేటింగ్ వల్ల వినియోగదారుల విశ్వాసం మరింత పెరిగింది.

ఫుల్ ట్యాంక్ చేస్తే 700 కిమీ మైలేజ్ ఇచ్చే బైక్

ప్రతి రోజూ ఆఫీసుకో లేదా వ్యాపార పనుల మీద పల్లెటూరి రోడ్లపైన, సిటీ ట్రాఫిక్‌లోనూ ప్రయాణించాల్సి వస్తోందా? పెట్రోల్ ధరలు చూస్తే భయమేస్తుందా? అయితే మీ కోసమే టీవీఎస్ (TVS) సంస్థ అదిరిపోయే మైలేజీ ఇచ్చే స్టార్ సిటీ ప్లస్ (Star City Plus) బైక్‌ను అందుబాటులోకి తెచ్చింది. కేవలం రూ.72,500 ధరతో ప్రారంభమయ్యే ఈ బైక్, మధ్యతరగతి ప్రజలకు ఒక వరప్రసాదం అని చెప్పొచ్చు. దీని బిల్డ్ క్వాలిటీ, సిట్టింగ్ కంఫర్ట్ కారణంగా ఈ బైక్ ఎన్నాళ్లుగానో మార్కెట్లో రారాజుగా వెలుగుతోంది. ముఖ్యంగా పల్లెటూరి రోడ్లపై కూడా ఇది చాలా స్మూత్‌గా వెళ్తుంది.

జూపిటర్ 110, జూమ్ 110లో అసలు బెస్ట్ ఏది?

భారతదేశంలో స్కూటర్ సెగ్మెంట్ రోజురోజుకీ మరింత పోటీతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన, నమ్మకమైన, సౌకర్యవంతమైన స్కూటర్లకు వినియోగదారుల నుంచి భారీ డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో మంచి గుర్తింపు పొందిన మోడళ్లలో టీవీఎస్ జూపిటర్ 110 (TVS Jupiter 110) ఒకటి. ఈ స్కూటర్ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుంచి వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుని, కుటుంబాలకు అనువైన నమ్మకమైన వాహనంగా పేరు సంపాదించింది. ఇక మరోవైపు, Hero Xoom 110 కూడా ఈ సెగ్మెంట్‌లో మంచి పోటీని అందిస్తోంది. యువతను ఆకట్టుకునే స్టైలిష్ లుక్, ఆకర్షణీయమైన ఫీచర్లు, చురుకైన పనితీరు కారణంగా ఈ స్కూటర్ వేగంగా ప్రజాదరణ పొందుతోంది. వినియోగదారుల కోసం ఈ రెండు స్కూటర్ల గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

కుప్పకూలిన మారుతి కారు అమ్మకాలు

మారుతి సుజుకి ఇన్విక్టో (Maruti Suzuki Invicto) భారత మార్కెట్లో ఫ్లాగ్‌షిప్ MPVగా గుర్తింపు పొందింది. ప్రీమియం ఫీచర్లు, విశాలమైన క్యాబిన్, హైబ్రిడ్ టెక్నాలజీతో ఈ కారు మంచి స్థాయిలో ఆకట్టుకునేలా రూపొందించబడింది. అయితే మార్కెట్లో ఈ కారు అమ్మకాలు మాత్రం స్థిరంగా లేకుండా పాము-నిచ్చెన ఆటలా ఎగబాకుతూ పడిపోతూ సాగుతున్నాయి. ఒక నెలలో కొంచెం పెరుగుదల కనిపిస్తే, మరో నెలలో గణనీయంగా తగ్గిపోతున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, 2026 ఫిబ్రవరి నెలలో ఈ కారు అమ్మకాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ఆ నెలలో కేవలం 143 యూనిట్లను మాత్రమే వినియోగదారులకు డెలివరీ చేయగలిగారు. గత సంవత్సరం అంటే 2025 ఫిబ్రవరి నెలలో మాత్రం పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉండేది.
Advertisement

మహీంద్రా కారుకు జనాల నీరాజనం

భారతదేశంలో సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ ప్రస్తుతం అత్యంత పోటీతత్వంగా మారింది. ఈ విభాగంలో అనేక కంపెనీలు తమ మోడళ్లతో మార్కెట్‌లో పోటీ పడుతున్నప్పటికీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 3ఎక్స్‌ఓ (Mahindra XUV 3XO) మాత్రం ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ముందుగా Mahindra XUV300 పేరుతో మార్కెట్‌లో ఉన్న ఈ మోడల్, కొత్త అవతారంలో XUV 3XOగా ప్రవేశించిన తర్వాత మరింత ఆదరణ పొందుతోంది. కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, మెరుగైన పనితీరుతో ఈ కారు వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో చాలా మోడళ్లు ఉన్నప్పటికీ, XUV 3XO తన ప్రత్యేకతతో నిలుస్తోంది. నగరాల్లో డ్రైవింగ్‌కు అనుకూలమైన పరిమాణం, ప్రీమియం ఫీచర్లు, మంచి పనితీరు కారణంగా ఈ మోడల్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది.

హంటర్ 350 కొనడం లాభమా.. నష్టమా?

రోడ్డు మీద దర్జాగా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ మీద వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి? కానీ ఆ బైకుల బరువు, ఎత్తు చూసి చాలామంది వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం, ముఖ్యంగా యువత మనసు దోచుకోవడానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి వచ్చిన మాస్టర్ పీస్ హంటర్ 350 (Royal Enfield Hunter 350). కేవలం రూ.1.38 లక్షల ప్రారంభ ధరతో లభిస్తున్న ఈ బైక్, ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది. అయితే, షోరూమ్‌కి వెళ్లి బుక్ చేసే ముందు ఈ బైక్ గురించి కొన్ని కీలక విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.

భార్యకు అల్లు అర్జున్ ఇచ్చిన లగ్జరీ మెర్సిడెస్ ఇదే!

టాలీవుడ్‌లో తన స్టైల్, డ్యాన్స్, యాక్టింగ్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర హీరోల్లో ఒకరు. అభిమానులు ప్రేమగా ఆయనను ఐకాన్ స్టార్ అని పిలుస్తారు. సినిమాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఆయన పేరు సంపాదించారు. ముఖ్యంగా తన భార్య స్నేహా రెడ్డి(Sneha Reddy)తో ఆయనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మార్చి 6న అల్లు అర్జున్ - స్నేహా రెడ్డి తమ 15వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఆనందంగా జరుపుకున్నారు. ఈ ప్రత్యేక రోజును మరింత గుర్తుండిపోయేలా చేయాలని భావించిన అల్లు అర్జున్, తన భార్యకు ఒక అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు.

మహీంద్రా కంపెనీకి శనిలా పట్టిన 7 సీటర్

భారతదేశ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రాకు ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి. స్కార్పియో, థార్, ఎక్స్‌యూవీ 700 వంటి మోడళ్లతో మార్కెట్‌ను ఏలుతోంది. కానీ ప్రతి నాణేనికి రెండు పార్శ్వాలు ఉన్నట్టే, మహీంద్రా కంపెనీలో ఒక మోడల్ మాత్రం ఇప్పుడు అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. అది మరేదో కాదు, ఒకప్పుడు ఎంతో ఆశలతో విడుదల చేసిన ఎంపీవీ (MPV) మహీంద్రా మరాజో (Mahindra Marazzo). తాజా అమ్మకాల నివేదికల ప్రకారం, ఈ కారు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే.. గత ఫిబ్రవరి 2026 నెలలో ఒక్క కారు కూడా అమ్ముడుపోలేదు. అంటే జీరో (0) సేల్స్ నమోదయ్యాయి.
Advertisement

కొత్త హ్యుందాయ్ వెర్నా వచ్చేసింది

దక్షిణ కొరియాకు చెందిన హ్యూందాయ్ వెర్నా (Hyundai Verna) భారత మార్కెట్లో ప్రముఖ మిడ్-సైజ్ సెడాన్‌లలో ఒకటిగా గుర్తింపు పొందింది. స్టైలిష్ డిజైన్, ఆధునిక టెక్నాలజీ, సౌకర్యవంతమైన క్యాబిన్‌తో ఈ కారు చాలా కాలంగా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు కంపెనీ ఈ సెడాన్‌ను 2026 అప్‌డేట్‌తో మరింత ఆకర్షణీయంగా తీసుకొచ్చింది. కొత్త వెర్నా ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.98 లక్షల నుంచి రూ. 18.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి. ఈ తాజా వెర్షన్‌లో బాహ్య రూపం, అంతర్గత డిజైన్, ఫీచర్ల పరంగా అనేక మార్పులు చేసి, కారును మరింత ప్రీమియంగా మార్చారు.

రెండు అదిరిపోయే బైక్స్.. ఏది బెస్ట్?

హోండా షైన్ 125 (Honda Shine 125) లిమిటెడ్ ఎడిషన్ భారత మార్కెట్లో చాలా కాలంగా ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌గా గుర్తింపు పొందింది. మంచి మైలేజ్, సింపుల్ డిజైన్, విశ్వసనీయమైన ఇంజిన్ కారణంగా ఈ బైక్‌కు గ్రామీణ ప్రాంతాల నుంచి నగరాల వరకు మంచి డిమాండ్ ఉంది. మరోవైపు హీరో గ్లామర్ ఎక్స్ 125 (Hero Glamour X 125) కూడా ఇదే సెగ్మెంట్‌లో బలమైన పోటీని ఇస్తోంది. స్టైలిష్ డిజైన్, మెరుగైన ఫీచర్లు, మంచి పనితీరు వల్ల ఇది యువతలో ఎక్కువగా ఆకర్షణ పొందుతోంది. ఈ రెండు కూడా భారత పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలో లభిస్తూ రోజూ ప్రయాణంలో తోడుగా నిలుస్తాయి. ఇప్పుడు ఈ కథణంలో ఈ రెండు బైకుల గురించిన తేడాల గురించి తెలుసుకుందాం.

కార్ల ప్రపంచంలో మహా విప్లవం

సినిమా హాల్‌లో కొత్త సినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తామో, కార్ల మార్కెట్‌లో కూడా కొత్త మోడళ్ల కోసం అంతే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు జనం. ఇప్పుడు అలాంటి ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. ఇండియాలో ఎస్‌యూవీ (SUV) కార్లకు ఉన్న డిమాండ్ చూసి, ప్రముఖ కంపెనీలు రెనాల్ట్ (Renault), నిస్సాన్ (Nissan) గట్టి ప్లాన్ వేశాయి. టాటా నెక్సాన్, మారుతి బ్రెజా వంటి కార్లకు గట్టి పోటీ ఇచ్చేలా, రాబోయే మూడేళ్లలో ఏకంగా 5 కొత్త ఎస్‌యూవీలను లాంచ్ చేయబోతున్నాయి. 2028 నాటికి ఈ కార్లన్నీ రోడ్ల మీద రయ్‌రయ్‌మంటూ తిరగనున్నాయి. ఈ లేటెస్ట్ ఎస్‌యూవీల ప్రత్యేకతలు ఏంటి? అవి ఎప్పుడు వస్తాయి? లాంటి వివరాలు తెలుసుకుందాం.

కస్టమర్లు రాక దోమలు కొట్టుకుంటున్న డీలర్లు

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో చిన్న కార్ల విభాగంలో ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించిన హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio) ఒకటి. సరసమైన ధర, మంచి మైలేజ్, సులభమైన డ్రైవింగ్ అనుభవం వంటి కారణాల వల్ల ఈ కారు సంవత్సరాలుగా మధ్యతరగతి కుటుంబాలకు నచ్చిన ఎంపికగా నిలిచింది. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువుగా ఉండటం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం వల్ల కూడా ఇది చాలా మందికి ప్రాధాన్యమైన కారుగా మారింది. అయితే, ఇటీవల కాలంలో ఈ కారుకు ఉన్న డిమాండ్ మాత్రం క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రత్యేకంగా చెప్పాలంటే, 2026 ఫిబ్రవరి నెలలో ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపించింది. ఆ నెలలో మొత్తం కేవలం 862 యూనిట్లు మాత్రమే వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి.
Advertisement

కార్ల ఉత్పత్తిని సగానికి తగ్గించిన టాటా

మధ్యప్రాచ్యంలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ప్రస్తుతం భారత ఆటోమొబైల్ రంగాన్ని, ముఖ్యంగా స్వదేశీ దిగ్గజం టాటా మోటార్స్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్ పై జరిపిన దాడులు, ప్రతిగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై చేస్తున్న ప్రతీకార దాడులతో పశ్చిమ ఆసియా అట్టుడుకుతోంది. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కేవలం యుద్ధ భూమికే పరిమితం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటి చమురు, గ్యాస్ సరఫరాను అస్తవ్యస్తం చేశాయి. దీనివల్ల టాటా మోటార్స్ వంటి కంపెనీలు తమ ఉత్పత్తిని భారీగా తగ్గించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.