సై అంటే సై.. నువ్వా-నేనా అంటున్న రెండు కార్లు

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా తక్కువ ధరలో మంచి పనితీరు, సరిపడే ఫీచర్లు, తక్కువ నిర్వహణ ఖర్చు కావాలనుకునే వినియోగదారులు ఈ సెగ్మెంట్ కార్లను ఎక్కువగా ఎంచుకుంటారు. నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన ఈ చిన్న కార్లు మొదటిసారి కారు కొనుగోలు చేసే వారికి కూడా మంచి ఎంపికగా నిలుస్తాయి. ఈ విభాగంలో ప్రముఖంగా చెప్పుకునే రెండు కార్లు టాటా టియాగో (Tata Tiago), హ్యూందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios). భారత మార్కెట్లో సరసమైన ధరతో పాటు విశ్వసనీయత కలిగిన ఈ రెండు మోడళ్లు వినియోగదారుల నుంచి మంచి స్పందన పొందుతున్నాయి. ఈ రెండు కార్ల మధ్య తేడాల గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

కొత్త కలర్‌‌తో బర్గ్‌మాన్ స్ట్రీట్ EX ఆకట్టుకుంటోంది!

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ (Suzuki Motor Corporation)కు అనుబంధంగా పనిచేస్తున్న సుజుకి మోటార్ సైకిల్ ఇండియా (Suzuki Motorcycle India) భారత మార్కెట్లో మరో కొత్త అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. కంపెనీ తన ప్రీమియం స్కూటర్ సుజుకి బర్గ్‌మాన్ స్ట్రీట్ ఈఎక్స్ (Suzuki Burgman Street EX) కోసం పెర్ల్ గ్రే వైట్ అనే కొత్త కలర్ ఆప్షన్‌ను అధికారికంగా పరిచయం చేసింది. ఈ కొత్త రంగు స్కూటర్‌కు మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వడంతో పాటు స్పోర్టీ లుక్‌ను కూడా పెంచుతుంది. యువతను ఆకట్టుకునేలా ఈ కలర్‌ను ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు కంపెనీ తెలిపింది. ఈ కొత్త కలర్ ఎంట్రీతో ఇప్పుడు బర్గ్‌మాన్ స్ట్రీట్ EX స్కూటర్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంటుంది.

ఐ ఫోన్ కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్

పెట్రోల్ ధరలు రోజురోజుకూ మండిపోతున్న నేపథ్యంలో, సామాన్యుడి చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు, ప్రతిరోజూ ఆఫీసులకు లేదా పనులకు వెళ్లేవారికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒక వరంగా మారాయి. ఈ విభాగంలో టీవీఎస్ మోటార్ కంపెనీ తన అద్భుతమైన సృష్టి టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube)తో మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. 2026 కొత్త మోడల్స్ మరింత రేంజ్, స్మార్ట్ ఫీచర్లు, అత్యంత తక్కువ ధరతో వినియోగదారుల ముందుకు వచ్చాయి. కేవలం బడ్జెట్ మాత్రమే కాదు, కారులో ఉండేలాంటి పెద్ద డిస్‌ప్లే, అదిరిపోయే వేగంతో ఈ స్కూటర్ ఇప్పుడు మార్కెట్ లీడర్‌గా ఎదిగింది.

ఏనుగు సైజున్న మారుతి కారుకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది

భారత మార్కెట్లో కుటుంబ అవసరాలకు సరిపోయే కార్లకు ఎప్పటినుంచో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా ఎక్కువ సీటింగ్ సామర్థ్యం, సౌకర్యవంతమైన కేబిన్, నమ్మకమైన పనితీరు కలిగిన MPV కార్లను చాలా మంది వినియోగదారులు ఇష్టపడుతున్నారు. ఈ విభాగంలో ప్రముఖంగా నిలిచిన మోడళ్లలో ఒకటి మారుతి సుజుకి ఎక్స్‌‌ఎల్6 (Maruti Suzuki XL6). స్టైలిష్ డిజైన్, విశాలమైన ఇంటీరియర్, ఫ్యామిలీ ప్రయాణాలకు అనువైన ఫీచర్ల కారణంగా ఈ కారు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ఇటీవల కాలంలో ఈ MPVకు వినియోగదారుల నుంచి వస్తున్న స్పందన మరింత పెరిగింది. నగరాల్లోనే కాకుండా చిన్న పట్టణాల్లో కూడా ఈ కారుకు మంచి డిమాండ్ కనిపిస్తోంది.
Advertisement

చూపు తిప్పుకోనివ్వని అందం..ఆడి ఫ్యామిలీలోకి కొత్త అతిథి

జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి (Audi) తన క్యూ8 (Q8) లైనప్‌ను భారత్‌లో మరింత బలోపేతం చేసేందుకు సిద్ధమైంది. వేగాన్ని, విలాసాన్ని కోరుకునే వారి కోసం సరికొత్త ఆడి ఎస్‌క్యూ8 (Audi SQ8) పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీని మార్చి 17న మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఈ కారు కోసం బుకింగ్స్ అప్పుడే ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల కస్టమర్లు రూ.5 లక్షల టోకెన్ అమౌంట్‌తో ఆడి అధికారిక వెబ్‌సైట్ లేదా myAudi Connect యాప్ ద్వారా తమ కలల కారును రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ కొత్త మోడల్ సాధారణ క్యూ8 వెర్షన్‌కు, అత్యంత శక్తివంతమైన ఆర్‌ఎస్ క్యూ8 (RS Q8)కు మధ్యలో ఉంటుంది. దీని ధరలను లాంచ్ రోజైన మార్చి 17న అధికారికంగా వెల్లడించనున్నారు.

జపాన్ కంపెనీ కార్లకు బ్రహ్మరథం పడుతున్న జనాలు

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా (Toyota Motor Corporation) భారత మార్కెట్లో కూడా తన స్థాయిని క్రమంగా పెంచుకుంటూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా దేశీయ మార్కెట్లో బలమైన ఉనికి కలిగిన మారుతి సుజుకితో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న తర్వాత, టయోటా కార్ల విక్రయాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా పలు మోడళ్లను భారత మార్కెట్లో ప్రవేశపెట్టి, వినియోగదారుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. దీనికి తాజా ఉదాహరణగా ఫిబ్రవరి 2026 నెలలో నమోదైన అమ్మకాల గణాంకాలను చెప్పుకోవచ్చు. గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 2026లో భారత మార్కెట్లో టయోటా మొత్తం 30,737 కార్లను విక్రయించింది. ఈ సంఖ్య కంపెనీకి మంచి వృద్ధిని సూచిస్తోంది.

ఆకాశాన్ని తాకుతున్న ఈ కారు క్రేజ్

మిడిల్ క్లాస్ వాళ్లకు కారు కొనడం అనేది ఒక తీరని కల. ముఖ్యంగా పెద్ద కుటుంబం ఉన్నప్పుడు అందరూ కలిసి ప్రయాణించాలంటే ఏడు సీట్ల కారు తప్పనిసరి. అయితే మార్కెట్లో ఉన్న ఎంపీవీలు (MPVs), ఎస్‌యూవీల (SUVs) ధరలు చూస్తే సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి. కానీ, ఈ రంగుల ప్రపంచానికి దూరంగా ఒక కారు మాత్రం సైలెంటుగా రికార్డులు సృష్టిస్తోంది. అదే మారుతి సుజుకి ఈకో (Maruti Suzuki Eeco). ఎలాంటి ఆర్భాటాలు లేకపోయినా, ప్రతి నెలా వేల సంఖ్యలో అమ్ముడవుతూ భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని రారాజుగా నిలుస్తోంది. కేవలం రూ.5.18 లక్షల ప్రారంభ ధరకే లభిస్తున్న ఈ 7-సీటర్ కారును కొనేందుకు జనం ఎందుకు ఎగబడుతున్నారో వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంత తక్కువ ధరలో SUV ఉన్నా కొనేవాళ్లు తగ్గారు

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా SUV కార్లకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ఒకప్పుడు ఎక్కువ మంది వినియోగదారులు హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్‌ల వైపు మొగ్గు చూపేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, బలమైన డిజైన్, విశాలమైన కేబిన్ వంటి కారణాల వల్ల చాలా మంది కొనుగోలుదారులు SUVలను ఎంపిక చేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా యువతతో పాటు కుటుంబ వినియోగదారులు కూడా SUVల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే SUVలు సాధారణంగా ఇతర కార్లతో పోలిస్తే కొంచెం ఖరీదైనవిగా ఉంటాయి. అందువల్ల తక్కువ బడ్జెట్ ఉన్న చాలా మంది వినియోగదారులు SUV కొనాలని అనుకున్నప్పటికీ కొన్నిసార్లు ఆ ఆలోచనను వాయిదా వేస్తుంటారు.
Advertisement

ఈ బండి ఎక్కితే దిగాలనిపించదు

మిడిల్ క్లాస్ వాళ్లకు హీరో మోటోకార్ప్ ఎప్పుడూ ఒక నమ్మకమైన బ్రాండ్. ముఖ్యంగా 125సీసీ సెగ్మెంట్‌లో మైలేజీతో పాటు కాస్త పవర్, స్టైల్ కోరుకునే వారి కోసం హీరో మూడు అద్భుతమైన ఆప్షన్లను అందుబాటులో ఉంచింది. హీరో సూపర్ స్ప్లెండర్ XTEC, హీరో గ్లామర్, హీరో ఎక్స్‌ట్రీమ్ 125R.. ఈ మూడు బైకులు వేర్వేరు బడ్జెట్లలో, వేర్వేరు అవసరాలకు తగ్గట్టుగా రూపొందించబడ్డాయి. నేటి పెట్రోల్ ధరల కాలంలో కేవలం రూ.82,813 ప్రారంభ ధరకే లభిస్తున్న ఈ బైకుల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇంటి ముందు ఖాళీగా ఉన్న కారుతో కాసుల వర్షం

నేటి ఆధునిక కాలంలో కారు అనేది కేవలం ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది ఒక సంపాదించి పెట్టే యంత్రం కూడా. చాలామంది లక్షలు ఖర్చు చేసి కారు కొంటారు కానీ, అది కేవలం ఆఫీసుకో లేదా వారానికి ఒకసారి షికారుకో మాత్రమే పరిమితం అవుతుంది. మిగిలిన సమయమంతా ఆ కారు ఇంటి ముందు పార్కింగ్‌లోనే ఉంటుంది. అయితే, గ్యారేజీలో నిలబడి ఉన్న మీ కారు మీకు ప్రతి నెలా వేల రూపాయల లాభాన్ని తెచ్చిపెడుతుంది.. అవును కాస్త తెలివిగా ఆలోచిస్తే మీ కారును ఒక చిన్న వ్యాపారంగా మార్చుకోవచ్చు. మీ కారు ద్వారా ఆదాయం పొందే ఐదు అద్భుతమైన మార్గాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

రూ.5 లక్షలతో లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అయిన మీ డ్రీమ్ కారు

జర్మన్ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి (Audi), భారతీయ కార్ లవర్స్ కోసం మరో పవర్‌ఫుల్ మెషీన్‌ను సిద్ధం చేసింది. తన పాపులర్ ఎస్‌యూవీ లైనప్‌లో స్పోర్టియర్ వెర్షన్‌గా వస్తున్న ఆడి ఎస్‌క్యూ8 (Audi SQ8) లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. మార్చి 17, 2026న ఢిల్లీ వేదికగా ఈ కారును అధికారికంగా విడుదల చేయనున్నారు. అయితే, లాంచ్‌కు ముందే ఈ కారు బుకింగ్స్‌ను కంపెనీ ప్రారంభించింది. ఆసక్తి గల కస్టమర్లు రూ. 5 లక్షల టోకెన్ అమౌంట్ చెల్లించి ఆడి ఇండియా వెబ్‌సైట్ లేదా మై ఆడి కనెక్ట్ యాప్ ద్వారా ఈ లగ్జరీ ఎస్‌యూవీని బుక్ చేసుకోవచ్చు. సాధారణ క్యూ8 (Q8), అత్యంత పవర్ఫుల్ ఆర్ఎస్ క్యూ8 (RS Q8) మధ్యలో ఈ ఎస్‌క్యూ8 నిలవనుంది.

కుటుంబం మొత్తం ఒక్క కారులో.. ఒకేసారి 9 మంది వెళ్లొచ్చు!

మహీంద్రా బొలెరో (Mahindra Bolero) భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఈ SUVకు మంచి ఆదరణ ఉంది. దృఢమైన నిర్మాణం, విశ్వసనీయ పనితీరు, తక్కువ నిర్వహణ ఖర్చులు కారణంగా చాలా మంది వినియోగదారులు ఈ కారును నమ్మకంగా ఎంచుకుంటున్నారు. సంవత్సరాలు గా మార్కెట్లో ఉన్నప్పటికీ, ఇది ఇప్పటికీ తన ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది. బొలెరో గత నెలలో భారత మార్కెట్లో మరోసారి తన బలాన్ని చూపించింది. ఫిబ్రవరి 2026లో ఈ SUV మొత్తం 9,863 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. గత ఏడాది ఇదే నెల అయిన ఫిబ్రవరి 2025లో కేవలం 8,690 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
Advertisement

రోజుకు 66 మంది ఇదే కారును ఇంటికి తీసుకెళ్తున్నారు

భారతీయ మార్కెట్లో హ్యాచ్‌బ్యాక్ కార్లకు ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ విభాగంలో స్టైలిష్ డిజైన్, కాంపాక్ట్ సైజు, నగర ప్రయాణాలకు అనువైన అంశాలతో మంచి గుర్తింపు పొందిన కార్లలో మారుతి సుజుకి ఇగ్నిస్ (Maruti Suzuki Ignis) ఒకటి. యువతను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఈ కారు తన ప్రత్యేకమైన డిజైన్, ఫీచర్లతో ఒకప్పుడు మంచి డిమాండ్‌ను సంపాదించింది. అయితే ఇటీవల ఈ మోడల్ అమ్మకాల గణాంకాలు చూస్తే కొంత మందగమనాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇగ్నిస్‌కు డిమాండ్ కొద్దికొద్దిగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2026 ఫిబ్రవరి నెలలో విడుదలైన అమ్మకాల గణాంకాలు ఈ పరిస్థితిని మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆ నెలలో ఈ కారు మొత్తం 1,848 యూనిట్లు మాత్రమే వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి.

స్మార్ట్‌ఫోన్ కన్నా తక్కువ ధరకే స్కూటర్

భారతదేశపు ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తిరుగులేని రారాజుగా వెలుగుతున్న టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor), సామాన్యుల కలలను సాకారం చేస్తూ మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే తన ఐక్యూబ్ (iQube) మోడల్‌తో ఓలా, ఏథర్ వంటి దిగ్గజాలకు చమటలు పట్టించిన టీవీఎస్, ఇప్పుడు బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లను కోరుకునే వారి కోసం ఆర్బిటర్ (Orbiter) శ్రేణిలో సరికొత్త బేస్ మోడల్ టీవీఎస్ ఆర్బిటర్ V1 (TVS Orbiter V1)ను మార్కెట్లోకి విడుదల చేసింది. కేవలం రూ.49,999 ప్రారంభ ధరకే లభించే ఈ స్కూటర్, ఎలక్ట్రిక్ వాహన రంగంలో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమైంది.

ఈ కారు పరిస్థితి చూస్తే జాలేస్తుంది

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో టయోటా (Toyota Kirloskar Motor) కార్లకు ప్రత్యేకమైన స్థానం ఉంది. విశ్వసనీయత, మంచి పనితీరు, దీర్ఘకాలిక నాణ్యత కారణంగా టయోటా బ్రాండ్‌కు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే కార్ల నుంచి ప్రీమియం, లగ్జరీ వాహనాల వరకు విస్తృత శ్రేణిలో మోడళ్లను అందించడం టయోటా ప్రత్యేకత. అందుకే భారతీయ వినియోగదారులు ఈ బ్రాండ్‌పై విశ్వాసం చూపుతూ పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో టయోటా దేశీయ మార్కెట్లో మొత్తం 30,737 యూనిట్ల కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 26,414 యూనిట్లను మాత్రమే విక్రయించింది.

స్కూటర్ ఇప్పుడే కొంటేనే వేలల్లో లాభం

మీరు ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా ? అయితే మీకు ఇది డెడ్ లైన్ సమయం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై ఇస్తున్న భారీ సబ్సిడీ గడువు ముగియడానికి కేవలం మరి కొద్ది రోజులు మాత్రమే సమయం ఉంది. మార్చి 31, 2026 తర్వాత ఈ సబ్సిడీలో భారీ మార్పులు రానున్నాయి. దీనివల్ల ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది. ఈ లోపే కారు లేదా బైక్ ఇంటికి తెచ్చుకుంటే మీకు వేల రూపాయల లాభం కలుగుతుంది. ప్రస్తుత ఆఫర్లు, సబ్సిడీ వివరాలు, మార్కెట్ ట్రెండ్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం PM E-DRIVE(PM Electric Drive Revolution in Innovative Vehicle Enhancement) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం 2028 వరకు ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ టూ-వీలర్లు (e-2W), త్రీ-వీలర్లపై (e-3W) ఇచ్చే ఇన్సెంటివ్‌లు మాత్రం 31 మార్చి 2026 వరకే అమల్లో ఉంటాయి. ప్రస్తుతం ప్రభుత్వం ప్రతి kWh బ్యాటరీ సామర్థ్యంపై రూ.5,000 వరకు సబ్సిడీ ఇస్తోంది. అయితే, ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది రూ.2,500కి పడిపోతుంది. అంటే, మీరు ఏప్రిల్‌లో స్కూటర్ కొంటే నేరుగా మీ జేబు నుంచి రూ.5,000 నుంచి రూ.10,000 వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ మార్చి నెలాఖరు లోపు కొనుగోలు పూర్తి చేయడం తెలివైన పని.
Advertisement

బైక్ లాగా 30 కి.మీ మైలేజ్ కారు.. కొనేవాళ్లు మాత్రం కనిపించడం లేదు

భారతీయ మార్కెట్లో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఈ విభాగంలో మంచి పేరు తెచ్చుకున్న కార్లలో టయోటా గ్లాంజా (Toyota Glanza) ఒకటి. స్టైలిష్ డిజైన్, మంచి ఫీచర్లు, విశ్వసనీయతతో ఈ కారు వినియోగదారుల మధ్య మంచి గుర్తింపు పొందింది. ముఖ్యంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాలకు అనువైన కారుగా దీనిని చాలా మంది ఎంపిక చేస్తున్నారు. అయితే ఇటీవల ఈ కారుకు సంబంధించిన అమ్మకాల గణాంకాలు కొంత మార్పును చూపుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో Toyota Kirloskar Motor విక్రయిస్తున్న గ్లాంజా అమ్మకాలు పాములు-నిచ్చెనల ఆటలాగే పైకి దిగుతూ కొనసాగుతున్నాయి. కొన్నినెలల్లో మంచి వృద్ధి కనిపిస్తుండగా, మరికొన్నినెలల్లో అమ్మకాలు తగ్గుతున్నాయి. ఇదే పరిస్థితి తాజాగా విడుదలైన ఫిబ్రవరి 2026 నెల గణాంకాల్లో కూడా కనిపించింది.

దేశం మొత్తం ఈ కారే కావాలంటోంది

భారతీయ ఆటోమొబైల్ రంగంలో ఇప్పుడు ఎక్కడ చూసినా టాటా మోటార్స్ పేరే వినిపిస్తోంది. ఒకప్పుడు కేవలం కమర్షియల్ వాహనాలకే పరిమితమైన ఈ దిగ్గజ సంస్థ, ఇప్పుడు ప్యాసింజర్ కార్ల విభాగంలో కూడా రారాజుగా వెలుగుతోంది. ఫిబ్రవరి 2026 నాటికి అందిన తాజా గణాంకాల ప్రకారం.. టాటా మోటార్స్ అమ్మకాల్లో సరికొత్త రికార్డులను సృష్టించింది. గత నెలలో ఈ సంస్థ ఏకంగా 62,329 కార్లను విక్రయించి, తన చరిత్రలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇది సుమారు 34 శాతం వృద్ధిని సూచిస్తోంది. ముఖ్యంగా సేఫ్టీ రేటింగ్స్, అడ్వాన్సుడ్ ఫీచర్ల వల్ల సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ టాటా కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

ఏథర్ స్కూటర్లపై రూ.20,000 వరకు తగ్గింపు

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్ రోజురోజుకూ వేగంగా విస్తరిస్తోంది. ఈ విభాగంలో ముందంజలో నిలుస్తున్న ప్రముఖ కంపెనీలలో ఏథర్ ఎనర్జీ (Ather Energy) ఒకటి. ఆధునిక టెక్నాలజీ, ఆకర్షణీయమైన డిజైన్, మంచి పనితీరు కలిగిన స్కూటర్లతో ఈ సంస్థ ఇప్పటికే పెద్ద సంఖ్యలో వినియోగదారులను ఆకట్టుకుంది. ప్రస్తుతం మార్కెట్లో అనేక కంపెనీలు కొత్త ఫీచర్లు, మెరుగైన రేంజ్, ఆకర్షణీయమైన డిజైన్‌లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకువస్తూ పోటీని మరింత పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తన అమ్మకాలను మరింతగా పెంచుకోవాలని భావించిన ఏథర్ ఎనర్జీ కస్టమర్ల కోసం ప్రత్యేక పరిమిత కాల ఆఫర్‌ను ప్రకటించింది.

ఇది కారు కాదు ఇనుప కోట

మహారాష్ట్రలోని థానే నగరంలో జరిగిన ఒక భీకర రోడ్డు ప్రమాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. టాటా మోటార్స్ ప్రతిష్టాత్మకంగా పునరుద్ధరించిన టాటా సియెర్రా (Tata Sierra) SUV టెస్ట్ డ్రైవ్ సమయంలో జరిగిన ఈ ప్రమాదం, వాహనాల భద్రత (Car Safety) ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పింది. సుమారు 20 అడుగుల లోతైన గోతిలో కారు పడిపోయినప్పటికీ, అందులోని ప్రయాణికులు సురక్షితంగా ప్రాణాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. టాటా కార్ల బిల్డ్ క్వాలిటీకి ఈ ఘటనే ఒక నిదర్శనమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
Advertisement

బైక్ సెకండ్ హ్యాండ్‎కు అమ్మినా వారంటీ పోదు

భారతదేశంలోని స్పోర్ట్స్ బైక్ ప్రేమికులకు కేటీఎం (KTM) అంటే ఒక క్రేజ్. వేగం, స్టైల్, పవర్‌ఫుల్ ఇంజిన్‌లకు మారుపేరుగా నిలిచిన ఈ ఆస్ట్రియన్ బైక్ తయారీ సంస్థ, ఇప్పుడు తన కస్టమర్ల కోసం ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తమ బైక్‌లపై నమ్మకాన్ని మరింత పెంచేందుకు, అమ్మకాలను భారీగా పెంచుకునే లక్ష్యంతో, కేటీఎం తన వారంటీ ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు ఉన్న వారంటీ కాలాన్ని ఏకంగా రెట్టింపు చేస్తూ కంపెనీ పెద్ద ప్రకటన చేసింది. దీనివల్ల కొత్తగా బైక్ కొనేవారికే కాకుండా, పాత బైక్‌ను రీసేల్ చేసేటప్పుడు కూడా కస్టమర్లకు భారీ ప్రయోజనం కలగనుంది.

రియర్ వెంటిలేటెడ్ సీట్లున్న టాప్-5 SUVలు ఇవే

వేసవిలో భారతదేశంలో ప్రయాణం అంటే అదొక నరకం. ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఉక్కపోతతో ప్రయాణికులు అల్లాడిపోతుంటారు. అందుకే ఇప్పుడు కారు కొనేవారు ఇంజిన్ పవర్ కంటే ముందు ఏపీ ఎంత బాగా వస్తుంది. సీట్లు ఎంత కంఫర్ట్‌గా ఉన్నాయనేది చూస్తున్నారు. ముఖ్యంగా వెంటిలేటెడ్ సీట్లు ఇప్పుడు ఒక లగ్జరీ నుంచి అవసరంగా మారిపోయాయి. సాధారణంగా చాలా కార్లలో డ్రైవర్, కో-డ్రైవర్ కోసం మాత్రమే ఈ సీట్లు ఉంటాయి. కానీ వెనుక సీట్లో కూర్చునే ప్రయాణికుల కోసం కూడా చల్లని గాలిని అందించే రియర్ వెంటిలేటెడ్ సీట్లు కలిగిన టాప్ 5 కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

లీటరుకు 70 కి.మీ ఇచ్చే సామాన్యుడి ‘ఫ్యాషన్’ ఈ బైక్

భారతదేశ ఆటోమొబైల్ రంగంలో టూ వీలర్లకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బైక్ అనేది కేవలం ఒక ప్రయాణ సాధనం మాత్రమే కాదు, అది వారి ఫ్యామిలీలో ఓ మెంబర్‎తో సమానం. పల్లెటూళ్లలో నివసించే సామాన్యులకు, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చే వాహనం ప్రాణాధారం.

రోజుకు కేవలం 16 కార్లు మాత్రమే.. ఎస్-ప్రెస్సోకు మార్కెట్లో షాక్!

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు మంచి గుర్తింపు పొందిన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో మారుతి సుజుకి ఎస్‌-ప్రెస్సో (Maruti Suzuki S‑Presso) ఒకటి. తక్కువ ధర, చిన్న కుటుంబాలకు సరిపడే డిజైన్, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈ కారు చాలా కుటుంబాల్లో ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా మొదటిసారి కారు కొనుగోలు చేసే వినియోగదారులు ఈ మోడల్‌ను ఎక్కువగా ఎంచుకునేవారు. అందుకే ఇది మార్కెట్లో ఇంటింటికి సుపరిచితమైన కారుగా మారింది. అయితే ఇటీవల కాలంలో ఈ కారుకు ఉన్న డిమాండ్ తగ్గుతూ వస్తోంది. కొత్త మోడళ్లు మార్కెట్లోకి రావడం, వినియోగదారుల అభిరుచులు మారడం వంటి కారణాల వల్ల ఎస్‌ ప్రెస్సో అమ్మకాలు క్రమంగా పడిపోతున్నాయి.
Advertisement

27 కి.మీ మైలేజ్.. 5-సీటర్ SUVని కొనడానికి ఇష్టపడట్లే!

మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఎస్‌యూవీ (Maruti Suzuki Grand Vitara SUV), ప్రారంభంలో తన నమ్మకమైన ఇమేజ్, స్థిరమైన ఫీచర్లతో కారు ప్రియుల మధ్య మంచి ఆదరణ పొందింది. అయితే, తాజాగా విడుదలైన అమ్మకాల డేటా చూపిస్తున్నది, ఈ SUV అమ్మకాలు ప్రతివారం తగ్గిపోతున్నాయి. ఫిబ్రవరి 2026లో మాత్రమే 5,859 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి, ఇది 2025 ఇదే నెలలో 10,669 యూనిట్లతో పోలిస్తే, సుమారు 45% తగ్గుదలను సూచిస్తోంది. ఈ తగ్గుదలకు అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా, మారుతి సుజుకి స్వయంగా గ్రాండ్ విటారా ఆధారంగా రూపొందించిన కొత్త విక్టోరిస్ SUVని మార్కెట్‌లో ప్రవేశపెట్టడం, వినియోగదారులను కొత్త ఆప్షన్ల వైపు మోచేసింది. కొత్త SUVలోకి ఆకర్షణీయమైన ఫీచర్స్, తక్కువ ధరలు, సమకాలీన డిజైన్‌లు వినియోగదారుల దృష్టిని ఆకర్షించాయి.