ఈ 5 యాక్సెసరీస్ లేకపోతే మీ పని గోవిందా

భారతదేశంలో వేసవి కాలం ఇప్పటికే తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఉదయం 10 గంటలకే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో బైక్ మీద బయటకు వెళ్లడమంటే ఒక సాహసమనే చెప్పాలి. ముఖ్యంగా లాంగ్ రైడ్స్ వెళ్లేవారు, ప్రతిరోజూ ఆఫీసులకు బైక్ పై వెళ్లేవారు ఎండ దెబ్బకు విలవిల్లాడుతున్నారు. అయితే, మారుతున్న టెక్నాలజీతో పాటు రైడర్ల సౌకర్యం కోసం మార్కెట్లోకి అనేక అద్భుతమైన యాక్సెసరీస్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి మిమ్మల్ని ఎండ నుంచి కాపాడటమే కాకుండా మీ ప్రయాణాన్ని చాలా సుఖవంతం చేస్తాయి. ఆ టాప్ 5 యాక్సెసరీస్ గురించి వివరంగా తెలుసుకుందాం.

దిగ్భ్రాంతికి గురిచేసిన కారు అమ్మకాలు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కాంపాక్ట్ ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా 4 మీటర్ల లోపు ఉండే ఎస్‌యూవీలు మధ్యతరగతి వినియోగదారులకు ఎంతో ఆకర్షణీయంగా మారాయి. ఈ సెగ్మెంట్‌లో తనదైన స్టైల్, ఫీచర్లు, ధరతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మోడల్ నిస్సాన్ మాగ్నైట్ (nissan magnite). ప్రారంభం నుంచే ఇది మంచి స్పందనను అందుకుంది, చాలా మంది కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షించింది. అయితే తాజా అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, నిస్సాన్ మాగ్నైట్‌కు స్వల్పంగా డిమాండ్ తగ్గినట్లు కనిపిస్తోంది. 2026 ఫిబ్రవరి నెలలో మొత్తం 2,230 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఇదే సమయంలో గత ఏడాది ఫిబ్రవరి 2025లో 2,328 యూనిట్లు విక్రయించబడ్డాయి. అంటే ఈసారి 98 కార్లు తక్కువగా అమ్ముడైనట్లుగా స్పష్టంగా తెలుస్తోంది.

దారి ఎలా ఉన్నా ఉన్నా గాడిదలా దూసుకెళ్లాల్సిందే

భారతదేశపు రోడ్లపై, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపించే అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ ఏదైనా ఉందంటే అది టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 (TVS XL100). ఇది కేవలం ఒక మోపెడ్ మాత్రమే కాదు, లక్షలాది మంది సామాన్యుల ఉపాధికి మూలాధారం. కష్టపడి పని చేసే తత్వం, ఎంతటి భారాన్నైనా మోసే శక్తి దీని సొంతం. మారుతున్న కాలానికి అనుగుణంగా టీవీఎస్ సంస్థ ఈ లెజెండరీ మోపెడ్‌లో అనేక ఆధునిక మార్పులను తీసుకువచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఈ వర్క్ హార్స్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం.

100 కోట్ల మంది ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది

భారతీయ ఆటోమొబైల్ చరిత్రలో కాంపాక్ట్ ఎస్‌యూవీ (SUV) సెగ్మెంట్‌కు ప్రాణం పోసిన కారు ఏదైనా ఉందంటే అది రెనాల్ట్ డస్టర్ మాత్రమే. 2012లో విడుదలై తన రగ్గడ్ డిజైన్, అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. కొన్నేళ్లుగా మార్కెట్ కు దూరమైన ఈ లెజెండరీ కారు, ఇప్పుడు సరికొత్త రూపంలో, అత్యాధునిక టెక్నాలజీతో మళ్ళీ భారత గడ్డపై కాలు మోపబోతోంది. రేపు, అంటే మార్చి 17, 2026న ఈ న్యూ జనరేషన్ రెనాల్ట్ డస్టర్ అధికారికంగా లాంచ్ కానుంది. ఈసారి రెనాల్ట్ కేవలం ఒక కారును మాత్రమే కాకుండా, మిడ్ సైజ్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌ను శాసించే ఒక పవర్ఫుల్ వెపన్ తీసుకువస్తోంది.
Advertisement

డాక్టర్లు, ఇంజనీర్లు ఎక్కువగా కొనేది ఇదే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎన్నో కార్లు వచ్చి వెళ్లినా, కొన్ని మోడళ్లు మాత్రం సంవత్సరాల తరబడి తమ స్థానాన్ని నిలబెట్టుకుంటాయి. అలాంటి విజయవంతమైన మోడళ్లలో ఒకటి మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్ (Maruti Suzuki WagonR). ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India) గత రెండున్నర దశాబ్దాలుగా ఈ కారును భారత మార్కెట్లో విజయవంతంగా విక్రయిస్తోంది. 1999లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ మోడల్‌కు ఉన్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. తక్కువ ధర, మంచి మైలేజ్, కుటుంబ అవసరాలకు సరిపోయే ప్రాక్టికల్ డిజైన్ వల్ల ఈ కారు ఇప్పటికీ వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూనే ఉంది.

ఆఫ్-రోడింగ్ లవర్స్ కోసం అదిరిపోయే బైక్

ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ సూపర్ బైక్ తయారీ సంస్థ డ్యుకాటీ (Ducati), భారతీయ ఆఫ్-రోడ్ రేసింగ్ లవర్స్ కోసం ఒక అద్భుతమైన వార్తను మోసుకొచ్చింది. తన మొట్టమొదటి మోటోక్రాస్ బైక్ డ్యుకాటీ డెస్మో450 MX (Ducati Desmo450 MX)ను అధికారికంగా భారత మార్కెట్లో విడుదల చేసింది. సాధారణంగా స్పోర్ట్స్ బైక్‌లు మరియు లగ్జరీ రోడ్ బైక్‌లకు పేరుగాంచిన డ్యుకాటీ, మొదటిసారిగా మట్టి రోడ్లపై, కొండ కోనల్లో దూసుకుపోయే రేసింగ్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 17.23 లక్షలుగా నిర్ణయించారు. ఇది కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, ఆఫ్-రోడ్ రేసింగ్‌లో ఒక సరికొత్త విప్లవమని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. డ్యుకాటీ డెస్మో450 MX సాధారణ రోడ్లపై నడపడానికి ఉద్దేశించినది కాదు. దీనిని ప్యూర్ ఆఫ్-రోడ్ రేసింగ్, మోటోక్రాస్ ట్రాక్‌ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ బైక్‌ను అభివృద్ధి చేసే క్రమంలో అంతర్జాతీయ MXGP వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో కఠినమైన పరీక్షలకు గురిచేశారు. అంటే, ప్రపంచ స్థాయి రేసింగ్ ట్రాక్‌లపై గెలిచిన టెక్నాలజీని ఇప్పుడు భారతీయ రైడర్లకు అందుబాటులోకి తెచ్చారన్నమాట. గతంలో జరిగిన ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ ఫైనల్స్‌లో దీనిని ప్రదర్శించినప్పుడే బైక్ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బైక్ గుండెకాయ వంటి ఇంజన్ గురించి చెప్పుకోవాలంటే.. ఇందులో 449.6cc సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ అమర్చారు. ఇది సుమారు 62 bhp పవర్, 54 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఏకంగా 12,000 rpm వరకు వెళ్లగలదు. డ్యుకాటీ తన హై-పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ బైక్‌లలో వాడే ప్రఖ్యాత డెస్మోడ్రోమిక్ వాల్వ్ టెక్నాలజీని ఈ మోటోక్రాస్ బైక్‌లో కూడా వాడటం విశేషం. దీనివల్ల ఇంజన్ నుంచి పవర్ డెలివరీ చాలా వేగంగా, పటిష్టంగా ఉంటుంది. ఆఫ్-రోడింగ్‌లో బైక్ బరువు చాలా కీలకం. అందుకే డ్యుకాటీ దీనిని అత్యంత తేలికపాటి అల్యూమినియం ఫ్రేమ్‌తో తయారు చేసింది. దీనివల్ల బైక్‌ను గాల్లోకి ఎగిరేటప్పుడు లేదా మలుపుల్లో తిప్పేటప్పుడు రైడర్‌కు పూర్తి నియంత్రణ ఉంటుంది. సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు వైపు 49mm షోవా (Showa) ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపు పూర్తిగా అడ్జస్ట్ చేసుకోగలిగే మోనోషాక్ సస్పెన్షన్‌ను ఇచ్చారు. ఎంతటి కఠినమైన రాళ్ల దారిలోనైనా ప్రయాణం సుఖవంతంగా ఉండేలా ఈ సెటప్ సహాయపడుతుంది. బ్రేకింగ్ కోసం వరల్డ్ క్లాస్ బ్రెంబో సిస్టమ్‌ను వాడారు. సాధారణంగా మోటోక్రాస్ బైక్‌లలో ఎలక్ట్రానిక్ ఫీచర్లు తక్కువగా ఉంటాయి. కానీ డ్యుకాటీ ఇందులో ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. బురదలో లేదా ఇసుకలో వెనుక చక్రం స్లిప్ అవ్వకుండా ఈ సిస్టమ్ నిరంతరం పర్యవేక్షిస్తుంది. దీనివల్ల రైడర్ పడిపోయే ప్రమాదం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసంతో వేగంగా వెళ్లవచ్చు. వివిధ రకాల రైడింగ్ మోడ్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. డ్యుకాటీ ఇండియా ఇప్పటికే ఈ బైక్ కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. మార్చి 2026 నాటికి ఈ బైక్‌ల డెలివరీ ప్రారంభమవుతుందని కంపెనీ ప్రకటించింది. కేవలం ప్రొఫెషనల్ రేసర్లు మాత్రమే కాకుండా, ఆఫ్-రోడింగ్‌ను ఒక హాబీగా మార్చుకున్న సంపన్న వర్గాల వారు కూడా ఈ బైక్ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. భారత్‌లో కేటీఎం, హోండా వంటి సంస్థలకు మోటోక్రాస్ సెగ్మెంట్‌లో ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

రూ.87 వేలకే EV స్కూటర్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీలు

పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా నగర ప్రయాణాల్లో తక్కువ ఖర్చుతో ప్రయాణం చేయాలనుకునే వారు ఎలక్ట్రిక్ స్కూటర్లను ఎక్కువగా పరిశీలిస్తున్నారు. ఈ కారణంగా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అనేక కంపెనీలు ఈ విభాగంలో కొత్త మోడళ్లను ప్రవేశపెట్టి వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పోటీ మధ్యలోనే బజాజ్ ఆటో (Bajaj Auto) తన ప్రసిద్ధ స్కూటర్‌ను మళ్లీ కొత్త రూపంలో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఒకప్పుడు భారతీయ రోడ్లపై ఎంతో ప్రజాదరణ పొందిన బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఇప్పుడు ఎలక్ట్రిక్ వేరియంట్‌గా తిరిగి వచ్చి వినియోగదారుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది.

డిజైర్ తర్వాత అందరూ కొంటున్న కారు ఇదే

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో సబ్-కాంపాక్ట్ సెడాన్ విభాగం వినియోగదారులలో మంచి ప్రజాదరణ పొందుతోంది. ఈ విభాగంలో ప్రధానంగా పోటీ పడుతున్న మోడళ్లలో హ్యూందాయ్ ఆరా (Hyundai Aura) ఒకటి. ముఖ్యంగా Hyundai Motor India కంపెనీకి చెందిన ఈ సెడాన్, మార్కెట్లో బలమైన పోటీదారుగా నిలుస్తూ మారుతి డిజైర్‌కు ప్రత్యక్షంగా పోటీ ఇస్తోంది. ఆకర్షణీయమైన డిజైన్, సరసమైన ధర, ఉపయోగకరమైన ఫీచర్లు వంటి అంశాల వల్ల ఆరా క్రమంగా వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించింది. ఈ కారు మొదటిసారిగా 2020లో భారత మార్కెట్లో ప్రవేశించింది. ఆ తర్వాత నుంచి దీని అమ్మకాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి.
Advertisement

చుక్క పెట్రోల్ లేకుండా ప్రపంచమంతా తిరగొచ్చు

ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య సాగుతున్న ఈ పోరు వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గిపోతాయేమో, పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతాయేమో అన్న భయం సామాన్యుల్లో మొదలైంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు క్యూలు కట్టి పెట్రోల్ నిల్వ చేసుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో పెట్రోల్ ఖర్చు లేని ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడటం తెలివైన పని. ముఖ్యంగా చిన్న చిన్న దూరాలకు ప్రయాణించే వారు, విద్యార్థులు, ఆఫీసులకు వెళ్లేవారు 'ఎలెక్ట్రిక్ సైకిళ్ల' (E-Bikes) వైపు మొగ్గు చూపుతున్నారు. రూ. 50,000 లోపు బడ్జెట్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిళ్ల వివరాలు మీకోసం..

7 సీట్ల కారు కోసం ఇదే బెస్ట్ ఆప్షన్!

రెనాల్ట్ (Renault) కంపెనీకి చెందిన ట్రైబర్ (Triber) భారతీయ మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన కార్లలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా తక్కువ ధరలో 7 సీట్ల కారును కోరుకునే వినియోగదారులకు ఇది మంచి ఎంపికగా మారింది. అందుకే ఈ MPVకి దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ కనిపిస్తోంది. సరసమైన ధర, ఉపయోగకరమైన డిజైన్, కుటుంబ ప్రయాణాలకు అనువైన సీటింగ్ ఏర్పాటు వంటి కారణాలతో చాలా మంది కొనుగోలుదారులు ఈ కారువైపు ఆకర్షితులవుతున్నారు. ఈ కారణంగానే భారత మార్కెట్లో ట్రైబర్ అమ్మకాలు ప్రతి నెలా మంచి స్థాయిలో కొనసాగుతున్నాయి. 2026 ఫిబ్రవరి నెలలో కూడా ఈ కారు అద్భుతమైన అమ్మకాల గణాంకాలను నమోదు చేసింది.

లగ్జరీ కారు కొని 15 ఏళ్ల తరబడి ఏడ్చాడు

ఒక సామాన్య వినియోగదారుడు కష్టపడి సంపాదించిన సొమ్ముతో కారు కొనుక్కుంటే, అది అతనికి సంతోషాన్ని ఇవ్వాలి. కానీ, కేరళకు చెందిన ఒక వ్యక్తికి మాత్రం తాను కొన్న లగ్జరీ ఎస్‌యూవీ (SUV) ఏకంగా 15 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరిగేలా చేసింది. చిట్టచివరకు న్యాయం గెలిచింది. కారు కొన్న 15 ఏళ్ల తర్వాత సదరు కంపెనీకి షాక్ ఇస్తూ, కస్టమర్‌కు రూ.28 లక్షలు తిరిగి చెల్లించాలని జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ (NCDRC) సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు, ఆ వినియోగదారుడు పడ్డ ఇబ్బందులు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

బ్రెజ్జా కంటే రూ.2.50 లక్షల తక్కువకే కారు!

రెనాల్ట్ (Renault) కంపెనీకి చెందిన కైగర్ (Kiger) భారతీయ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటోంది. ప్రస్తుతం భారతదేశంలో సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్ వేగంగా పెరుగుతున్న విభాగంగా మారింది. మధ్యతరగతి కుటుంబాలకు సరిపడే ధర, మంచి మైలేజ్, ఆకర్షణీయమైన డిజైన్ వంటి అంశాల కారణంగా ఈ విభాగంలోని కార్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. అందుకే దాదాపు అన్ని ఆటోమొబైల్ కంపెనీలు ఈ సెగ్మెంట్‌లో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టాయి. ఈ పోటీ మధ్య కూడా రెనాల్ట్ కైగర్ తన స్థానం నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతోంది. 2026 ఫిబ్రవరి నెలలో రెనాల్ట్ కైగర్ అమ్మకాలు గణనీయంగా పెరగడం గమనించదగ్గ విషయం.
Advertisement

బండికి ఇది ఉంటే ప్రాణాలకు ఫుల్ గ్యారెంటీ

భారతదేశంలోని రద్దీగా ఉండే రోడ్లపై టూ వీలర్ ప్రయాణం ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదే. ముఖ్యంగా అకస్మాత్తుగా బ్రేకులు వేయాల్సి వచ్చినప్పుడు చక్రాలు లాక్ అయిపోయి వాహనం అదుపు తప్పే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో ప్రాణరక్షక కవచంలా పనిచేసేదే యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS). సాధారణంగా ఖరీదైన బైక్‌లకే పరిమితమైన ఈ ఫీచర్, ఇప్పుడు స్కూటర్లలోనూ అందుబాటులోకి వస్తోంది. ప్రస్తుతం భారత మార్కెట్లో లభిస్తున్న టాప్-5 అత్యంత సరసమైన ఏబీఎస్ స్కూటర్ల వివరాలు తెలుసుకుందాం.

ఈ కారును అస్సలు వదలొద్దు బ్రో

టాటా మోటార్స్ ప్రస్తుతం భారత ఆటోమొబైల్ మార్కెట్లో తిరుగులేని వేగంతో దూసుకుపోతోంది. ముఖ్యంగా నెక్సాన్, పంచ్ వంటి మోడళ్లతో ఇప్పటికే రికార్డులు సృష్టిస్తున్న ఈ స్వదేశీ దిగ్గజం, ఇప్పుడు తన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్ (Tata Altroz) ద్వారా మరోసారి వార్తల్లో నిలిచింది. కారు కొనేటప్పుడు మైలేజీతో పాటు సేఫ్టీకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే భారతీయులకు ఆల్ట్రోజ్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ఫిబ్రవరి 2026 నాటి అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, ఈ కారుపై కస్టమర్ల నమ్మకం మరింత పెరిగిందని స్పష్టమవుతోంది. గత నెలలో ఈ కారు అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి.

పేదవాడి కారును కొనే నాథుడే లేదు..షోరూమ్‌లు వెలవెల

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒకప్పుడు చిన్న కార్ల విభాగంలో సంచలనం సృష్టించిన రెనాల్ట్ క్విడ్ (Renault Kwid) ఇప్పుడు షోరూంలలో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది. మధ్యతరగతి ప్రజల కలల కారుగా, బడ్జెట్ ధరలో లభించే స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్‌గా పేరు తెచ్చుకున్న ఈ కారు అమ్మకాలు ఊహించని విధంగా పడిపోయాయి. గత నెల అంటే ఫిబ్రవరి 2026 నాటి అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, కేవలం 375 మంది మాత్రమే ఈ కారును కొనుగోలు చేశారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే అమ్మకాల్లో సుమారు 46.28 శాతం క్షీణత కనిపించడం వాహన రంగ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఇక టోల్ గేట్ దాటాలంటే జేబు లూటీ కావాల్సిందే

జాతీయ రహదారులపై నిత్యం ప్రయాణించే వాహనదారులకు భారీ షాక్ తగిలింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ (FASTag Annual Pass) ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గతేడాది ఆగస్టు 15న సామాన్యుడిపై టోల్ భారాన్ని తగ్గించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ఈ వార్షిక పాస్ విధానం, ఇప్పుడు ప్రియం కాబోతోంది. మార్చి 12న వెలువడిన అధికారిక ఉత్తర్వుల ప్రకారం, వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వాహనదారులపై అదనపు భారం పడనుంది.
Advertisement

150-200cc సెగ్మెంట్‌లో టాప్-5 బైకులు ఇవే

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన మార్కెట్‌గా అవతరించింది. 2025-26 గణాంకాల ప్రకారం, దేశంలో బైకుల అమ్మకాలు 2 కోట్ల యూనిట్లను దాటేశాయి. గతంలో బైక్ కొనేవారు కేవలం మైలేజీని మాత్రమే చూసేవారు, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. నేటి యువత స్టైలిష్ లుక్, అదిరిపోయే పర్ఫార్మెన్స్, లేటెస్ట్ టెక్నాలజీని కోరుకుంటున్నారు. అయితే, పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో పర్ఫార్మెన్స్‌తో పాటు మైలేజీ కూడా ఇచ్చే బైక్ దొరకడం కాస్త కష్టమే. ముఖ్యంగా 150cc నుంచి 200cc సెగ్మెంట్‌లో పవర్ ఎక్కువ ఉంటే మైలేజీ తగ్గుతుందనే అపోహ ఉంది. కానీ మార్కెట్‌లో కొన్ని బైకులు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ దూసుకుపోతున్నాయి. మీరు కూడా 150-200cc మధ్యలో మంచి మైలేజీ ఇచ్చే బైక్ కోసం చూస్తున్నట్లయితే, ఈ టాప్-5 ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.

ఫ్యామిలీ ట్రిప్స్ కోసం టాప్ 5 కార్లు ఇవే

కుటుంబంతో కలిసి లాంగ్ ట్రిప్ వెళ్లాలన్నా లేదా పండగలకు ఊరికి వెళ్లాలన్నా మనకు మొదట గుర్తొచ్చేది కారులో ఖాళీ స్థలం (Space). పెళ్లిళ్లు, సెలవుల సీజన్ వచ్చిందంటే చాలు.. ఇంట్లోని సామాన్లన్నీ కారులో పడతాయా లేదా అన్నదే పెద్ద టెన్షన్. ప్రస్తుతం మార్కెట్‌లో ఎస్‌యూవీ (SUV)ల హవా నడుస్తోంది. కానీ, చూడటానికి పెద్దగా ఉన్నా లోపల ఇరుకుగా ఉండే కార్లు చాలానే ఉన్నాయి. మీ బడ్జెట్ 12 లక్షల రూపాయల లోపు ఉండి, మంచి స్పేస్ కావాలని కోరుకుంటే.. మీకోసం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టాప్-5 కార్ల వివరాలు తెలుసుకుందాం.

సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు ఇష్టంగా కొంటున్న కారు

కియా సెల్టోస్ (Kia Seltos) భారత మార్కెట్లో మిడ్-సైజ్ SUV విభాగంలో పెద్ద మార్పులకు కారణమైన ప్రముఖ మోడళ్లలో ఒకటి. ఈ SUV మొదటిసారి మార్కెట్లోకి వచ్చినప్పుడే తన ఆకర్షణీయమైన డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన పనితీరుతో వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా అప్పటివరకు ఈ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చెలాయించిన Hyundai Cretaకి గట్టి పోటీగా నిలిచి, కొన్ని సందర్భాల్లో అమ్మకాల పరంగా దానిని కూడా అధిగమించింది. అందుకే కొంతకాలం పాటు ఈ కారు మిడ్-సైజ్ SUV మార్కెట్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న మోడల్‌గా గుర్తింపు పొందింది.

రూ.5 లక్షల్లో 35 కి.మీ మైలేజ్ ఇచ్చే CNG కార్లు

భారతదేశంలో కొత్త కారు కొనాలనుకునే చాలా మంది కస్టమర్లు మొదటగా చూసేది రెండు విషయాలనే ధర, మైలేజ్. తక్కువ ధరలో లభిస్తూ ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లకు మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్న ఈ రోజుల్లో, ఖర్చును తగ్గించుకోవాలనుకునే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా CNG కార్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. CNG కార్లు నడపడానికి ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు మంచి మైలేజ్ కూడా అందిస్తాయి కాబట్టి రోజువారీ ప్రయాణాలకు ఇవి చాలా ఉపయోగకరంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత మార్కెట్లో తక్కువ ధరలో లభించే CNG కార్లలో మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో, ఆల్టో కె10, సెలెరియో కార్లు కీలకంగా ఉన్నాయి. వీటి గురించి ఈ కింది కథణంలో చూద్దాం.
Advertisement

ట్రెండింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ కార్లు ఇవే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, తక్కువ నిర్వహణ ఖర్చు, పర్యావరణానికి మేలు వంటి కారణాల వల్ల చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకే దేశంలో EV మార్కెట్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ నెలలో మీరు కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, మార్కెట్లో కొన్ని మంచి ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా టాటా టియాగో (Tata Tiago EV), టాటా పంచ్ ఈవీ (Tata Punch EV), ఎంజీ విండ్సర్ (MG Windsor EV) వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. ఈ కార్లు మంచి రేంజ్, ఆధునిక ఫీచర్లు, అందుబాటు ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. వీటి గురించి ఈ కింది కథణంలో.

నెల జీతం సరిపోతుంది.. చిన్న బడ్జెట్‌లో స్టైలిష్ కారు

SUVలు మార్కెట్లో ట్రెండ్‌గా మారకముందు, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్‌లో వినియోగదారుల మనసును గెలుచుకున్న కార్లలో హ్యూందాయ్ ఐ20 (Hyundai i20) ఒకటి. మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒకప్పుడు కలల కారుగా భావించబడేది. ఆకర్షణీయమైన డిజైన్, మంచి పనితీరు, ఆధునిక ఫీచర్లు వంటి అంశాలతో ఈ కారు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. ముఖ్యంగా రెండవ తరం 'ఎలైట్ i20' యూరోపియన్ కార్లను తలపించే స్టైలిష్ డిజైన్‌తో వచ్చినప్పుడు వినియోగదారులను బాగా ఆకట్టుకుంది. ఆ సమయంలో ఇది దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ మోడళ్లలో ఒకటిగా నిలిచింది. కాలం మారడంతో SUVల ప్రాచుర్యం పెరిగినా కూడా హ్యూందాయ్ ఐ20 తన ప్రత్యేక స్థానాన్ని కోల్పోలేదు.

రూ.6.26 లక్షలకే 33 కిమీ మైలేజ్.. 30 లక్షల మంది ఇదే కారు కొన్నారు!

భారత ఆటోమొబైల్ మార్కెట్లో సెడాన్ కార్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ వర్గంలో ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకున్న కార్లలో ఒకటి మారుతి సుజుకి డిజైర్ (Maruti Suzuki Dzire). మధ్యతరగతి కుటుంబాలకు సరిపోయే ధర, మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు వంటి లక్షణాల వల్ల ఈ కారు ప్రారంభం నుంచే మంచి ఆదరణ పొందింది. అందుకే దేశవ్యాప్తంగా చాలా మంది కొనుగోలుదారులు తమ మొదటి కారుగా డిజైర్‌ను ఎంచుకుంటున్నారు. కాలక్రమేణా ఈ కారుకు ఉన్న డిమాండ్ మరింత పెరిగింది. మారుతి సుజుకి ఈ కారును మొదటిసారి భారత మార్కెట్లో మార్చి 2008లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి డిజైర్ ప్రయాణం నిరంతరం విజయవంతంగా కొనసాగుతోంది.

తక్కువ ధరలో రెండు ఆటోమేటిక్ ఆప్షన్లు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ కియా ఇండియా (Kia India) భారత మార్కెట్లో తన ప్రాచుర్యం పొందిన కాంపాక్ట్ SUV అయిన కియా సోనెట్ (Kia Sonet)ను మోడల్ ఇయర్ 2026 (MY26) కోసం కొత్తగా ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మరింత ఎంపికలు, మెరుగైన విలువ అందించాలనే లక్ష్యంతో ఈ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న సోనెట్‌కు ఇప్పుడు మరిన్ని వేరియంట్ ఎంపికలను జోడించడం ద్వారా కంపెనీ వినియోగదారులను మరింత ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త MY26 సోనెట్‌లో ప్రధానంగా ఇంజిన్,ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో మార్పులు చేశారు. ముఖ్యంగా డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌ను మరింత అందుబాటులోకి తీసుకువచ్చారు.
Advertisement

సర్వీస్ లో కింగ్ అనిపించుకుంటున్న టాప్ 5 కార్లు ఇవే!

కొత్త కారు కొనాలనుకున్నప్పుడు చాలామంది కేవలం దాని మైలేజీ, బాహ్య రూపం లేదా ఫీచర్లను మాత్రమే చూసి మురిసిపోతుంటారు. కానీ, అసలైన పరీక్ష కారు కొన్న తర్వాతే మొదలవుతుంది. మధ్యలో ఎక్కడైనా కారు చెడిపోతేనో లేదా సర్వీస్ చేయించాలన్నా ఆ కంపెనీకి తగినన్ని సర్వీస్ సెంటర్లు ఉన్నాయా? స్పేర్ పార్ట్స్ తక్కువ ధరలో దొరుకుతున్నాయా? అన్నది చాలా ముఖ్యం. కారు ఆగిపోతే మీ ప్రయాణం నరకం కాకుండా ఉండాలంటే, సర్వీస్ నెట్‌వర్క్ బలంగా ఉన్న బ్రాండ్‌ను ఎంచుకోవాలి. 2026 నాటి తాజా మార్కెట్ విశ్లేషణల ప్రకారం సర్వీస్ విషయంలో భారతీయులు కళ్లు మూసుకుని నమ్మే ఐదు బెస్ట్ కార్ల వివరాలు తెలుసుకుందాం.