వెండి ధరలు పెరగడం వెనుక అసలు నిజం ఇదే

వెండి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది మెరిసే ఆభరణాలు, పూజా సామాగ్రి లేదా వెండి నాణేలు. సాధారణంగా మనం వెండిని ఒక పెట్టుబడి సాధనంగానో లేదా శుభకార్యాల్లో బహుమతులుగా ఇచ్చే వస్తువుగానో చూస్తాం. కానీ పారిశ్రామిక రంగంలో వెండికి ఉన్న విలువ అమూల్యమైనది. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు, సోలార్ ప్యానెల్స్ తయారీలో వెండిని ఎక్కువగా వాడుతుంటారు.

జాతర్లకు వెళ్లాలంటే పర్ఫెక్ట్ కారు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో కుటుంబ అవసరాలను కేంద్రంగా చేసుకుని కొనుగోళ్లు చేసే వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా 7-సీటర్ MPV కార్లకు ఇటీవల కాలంలో కనిపిస్తున్న డిమాండ్ దీనికి స్పష్టమైన నిదర్శనం. పెద్ద కుటుంబాలకు సరిపడే స్థలం, ప్రయాణాల్లో సౌకర్యం, రోజువారీ వినియోగానికి అవసరమైన ప్రాక్టికాలిటీ వంటి అంశాలతో పాటు బడ్జెట్‌కు అందుబాటులో ఉండే ధరలు ఈ సెగ్మెంట్‌ను మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి. ఒకే కారులో కుటుంబమంతా సౌకర్యంగా ప్రయాణించాలన్న కోరిక ఉన్న వినియోగదారులు ఎక్కువగా ఈ విభాగం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రెనాల్ట్ ట్రైబర్ భారత మార్కెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.

చిన్న కారు నుంచి 7-సీటర్ వరకూ.. విన్‌ఫాస్ట్ EV దండయాత్ర

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆటోమొబైల్ తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) ఇటీవల భారత మార్కెట్లో తన అడుగులు బలంగా వేస్తోంది. ఈ కంపెనీ సెప్టెంబర్ 2025లో అధికారికంగా దేశీయ మార్కెట్లోకి ప్రవేశించి, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో కొత్త ఊపుని తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకట్టుకునేలా VF6, VF7 అనే రెండు ఆధునిక ఎలక్ట్రిక్ SUVలును కూడా విడుదల చేసింది. ఈ మోడళ్ల ద్వారా విన్ ఫాస్ట్ భారత EV మార్కెట్లో తన సీరియస్ ఉద్దేశాలను స్పష్టంగా చూపించింది. రాబోయే రోజుల్లో మరింత విస్తృతమైన పోర్ట్‌ఫోలియోను అందించేందుకు కూడా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా, త్వరలోనే లిమో గ్రీన్, VF3, VF5 వంటి కొత్త కార్లను మార్కెట్లోకి తీసుకురావడానికి విన్ ఫాస్ట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వాటి గురించి ఈ కింది కథణంలో చూద్దాం.

ఫార్చ్యూనర్‌కు పోటీగా కొత్త 7-సీటర్!

గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజమైన ఫోక్స్‌వ్యాగన్ ఇండియా భారత మార్కెట్లో తన ఉనికిని మరింత బలపరుస్తూ, తాజాగా తన కొత్త 7-సీటర్ SUV - ఫోక్స్‌వ్యాగన్ టేరాన్ R-లైన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. ఇది 2026 సంవత్సరంలో ఫోక్స్‌వ్యాగన్ బ్రాండ్ నుంచి భారతదేశంలో లాంచ్ అవుతున్న మొదటి మోడల్ కావడం విశేషం. ప్రీమియం డిజైన్, ఆధునిక టెక్నాలజీ, కుటుంబ అవసరాలకు సరిపోయే స్పేస్‌తో ఈ SUV భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించబడింది. ఇది బ్రాండ్ అందించే SUVలలో అత్యంత ప్రీమియం, ఫీచర్-రిచ్ మోడల్‌గా నిలవనుంది. ముఖ్యంగా 7 మంది ప్రయాణికులు సౌకర్యంగా ప్రయాణించేందుకు అనుకూలంగా ఉండే ఈ SUV, లగ్జరీతో పాటు పనికివచ్చే ప్రాక్టికాలిటీని కూడా అందించనుంది. R-లైన్ బ్యాడ్జ్ ఉండటం వల్ల స్పోర్టీ లుక్, ప్రత్యేక స్టైలింగ్ ఎలిమెంట్స్, మరింత డైనమిక్ డిజైన్ ఇందులో కనిపించనున్నాయి.
Advertisement

పేదింటి మహలక్ష్మి ఈ బైక్

హీరో గ్లామర్ (hero glamour) మోటార్‌సైకిల్, తన సరసమైన ధర, ప్రీమియం ఫీచర్లతో ఇండియన్ బైక్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. వినియోగదారుల డిమాండ్ రోజురోజుకు పెరుగుతూ, బైక్ ప్రజాదరణను కొత్త ఎత్తుకు తీసుకువెళ్ళింది. డిసెంబర్ 2025లో మాత్రమే, మొత్తం 17,166 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి, ఇది 2024 డిసెంబర్‌లోని 6,022 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే అద్భుతమైన 185.05% వృద్ధిని సూచిస్తోంది. ఈ అద్భుతమైన అమ్మకాల వృద్ధికి చాలా కారణాలు ఉన్నాయి. మొదట, హీరో గ్లామర్ తన స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లతో ప్రతి తరానికి ఆకర్షణీయంగా ఉంటుంది. దీని ఫ్యూయల్ ఎఫీషియెన్సీ కూడా గొప్పగా ఉంది, కాబట్టి రోజువారీ ప్రయాణాల్లో వినియోగదారులు ఖర్చులను తగ్గించుకోగలుగుతున్నారు.

చిన్న ఫ్యామిలీకి సరైన కారు! కేవలం రూ. 4.95 లక్షలు.. 28 కి.మీ మైలేజ్

ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ బ్రాండ్ సిట్రోయెన్ (Citroen) రూపొందించిన C3 ఇప్పుడు భారతీయ మధ్యతరగతి వినియోగదారుల కోసం ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన ఎంపికగా మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ కారు కేవలం డిజైన్ అందం కోసం మాత్రమే కాదు, ప్రతి రోజు వాడకం, నగరాల్లో సులభమైన డ్రైవ్, కుటుంబ యాత్రలు అన్నీ సక్రమంగా నిర్వహించడానికి దృష్టి పెట్టి రూపొందించబడింది. చిన్న వీధులు, ట్రాఫిక్ జామ్‌లతో నిండిన సిటీల్లో కూడా C3 సౌకర్యవంతంగా, నమ్మకంగా నడుస్తుంది. కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్న వినియోగదారులకు C3 ఒక సమగ్ర ప్యాకేజ్‌ను అందిస్తుంది. ఈ కార్ వాడకం, ధర, సర్వీసులు అన్నీ భారతీయ లైఫ్‌స్టైల్‌ను బాగా పరిగణలోకి తీసుకుని రూపొందించబడ్డాయి. అందువల్ల, రోజువారీ ప్రయాణంలో ఆర్థికంగా, సౌకర్యపూర్వకంగా, విశ్వసనీయంగా ఉండేలా కేర్ తీసుకోవడం ఈ కారు ప్రత్యేకత.

బంగారానికే షాక్ ఇస్తోన్న కారు ఇదే

నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) ఇప్పుడు కేవలం ఒక కాంపాక్ట్ SUV మాత్రమే కాదు... భారత ఆటో పరిశ్రమ ఎగుమతుల మ్యాప్‌ను మార్చేస్తున్న పేరు. విదేశీ మార్కెట్లలో ఈ కారు సాధించిన విజయం చూసి, భారత మార్కెట్లో నంబర్ వన్ అమ్మకందారులైన మారుతి సుజుకి, హ్యుందాయ్ వంటి దిగ్గజ కంపెనీలు కూడా ఆశ్చర్యపోయే స్థాయికి నిస్సాన్ మాగ్నైట్ ఎదిగింది. డిసెంబర్ 2025 నెలకు సంబంధించిన కార్ల ఎగుమతి గణాంకాలు విడుదలైనప్పుడు, అందరి దృష్టి ఒక్కసారిగా నిస్సాన్ మాగ్నైట్ SUV పైనే నిలిచింది. ఎందుకంటే ఆ నెలలో భారతదేశం నుంచి అత్యధికంగా ఎగుమతి చేయబడిన వాహనంగా మాగ్నైట్ నిలిచింది. ఒక్క డిసెంబర్ 2025 లోనే మొత్తం 9,268 యూనిట్ల మాగ్నైట్ SUVలను విదేశీ మార్కెట్లకు నిస్సాన్ పంపింది.

మారుతి షోరూమ్‌ల ముందు క్యూ కట్టిన జనం!

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి తన ప్రస్థానంలో మరో అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో (Q3) కంపెనీ కలలో కూడా ఊహించని రీతిలో రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది. ముఖ్యంగా సామాన్యులకు అందుబాటులో ఉండే చిన్న కార్ల విభాగంలో డిమాండ్ ఒక్కసారిగా పెరగడం విశేషం. ఈ అద్భుతమైన వృద్ధికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'GST 2.0' సంస్కరణలు అని విశ్లేషకులు చెబుతున్నారు.
Advertisement

దేశంలో జనాలు ఎక్కువగా బుక్ చేసుకుంటున్న కారు ఇదే

భారత మార్కెట్లో మహీంద్రా (Mahindra) మరోసారి తన క్రేజ్‌ను నిరూపించింది. XUV 700కి కొనసాగింపుగా అప్‌డేట్ చేసిన ఫేస్‌లిఫ్ట్ మోడల్ మహీంద్రా XUV 7XOను కంపెనీ ఇటీవల అధికారికంగా విడుదల చేసింది. లాంచ్ అయినప్పటి నుంచే ఈ SUVకి మార్కెట్లో అసాధారణమైన స్పందన లభిస్తోంది. కొత్త డిజైన్, అప్‌డేటెడ్ ఫీచర్లు, మెరుగైన టెక్నాలజీతో వచ్చిన XUV 7XOపై కస్టమర్ల ఆసక్తి ఎంత స్థాయిలో ఉందో బుకింగ్ గణాంకాలే చెబుతున్నాయి. మహీంద్రా XUV 7XOను రూ. 13.66 లక్షల నుంచి రూ. 24.11 లక్షల వరకు ఎక్స్-షోరూమ్ ధరల శ్రేణిలో ప్రవేశపెట్టింది. ఈ ధరలు ప్రారంభ ధరలు మాత్రమే కాగా, మొదటి 40,000 మంది కస్టమర్ల డెలివరీలకు మాత్రమే వర్తిస్తాయని కంపెనీ స్పష్టంచేసింది.

రూ.1.03 కోట్ల డిఫెండర్ ఇప్పుడు రూ.53 లక్షలకే?

భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య తాజాగా కుదిరిన కొత్త స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ఇప్పుడు ఆటోమోటివ్ రంగంలో భారీ చర్చకు దారితీస్తోంది. మంగళవారం, జనవరి 27, 2027న అధికారికంగా సంతకం చేసిన ఈ ఒప్పందాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్‌గా అభివర్ణించడం విశేషం. దాదాపు 2 బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ఈ ఒప్పందం, భారత్-యూరప్ మధ్య వాణిజ్య సంబంధాల్లో ఒక చారిత్రాత్మక మైలురాయిగా భావించబడుతోంది. ముఖ్యంగా భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఇది భారీ మార్పులకు నాంది పలికే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత యూరప్ నుంచి నేరుగా దిగుమతి అయ్యే లగ్జరీ కార్ల ధరల్లో గణనీయమైన తగ్గుదల ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

కొత్త రెనాల్ట్ డస్టర్లో ఉన్న లోపాలు ఇవే

కొన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఎస్యూవీ లవర్స్ ఆరాధ్య దైవం రెనాల్ట్ డస్టర్ (Renault Duster) సరికొత్త అవతారంలో భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. పాత డస్టర్ సృష్టించిన మేజిక్ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఈ కొత్త వెర్షన్ అదిరిపోయే డిజైన్, ప్రీమియం ఇంటీరియర్లతో వచ్చినప్పటికీ, లోతుగా పరిశీలిస్తే కొన్ని చేదు నిజాలు బయటపడుతున్నాయి. పాత డస్టర్ లో ఉన్న కొన్ని స్ట్రాంగ్ ఫీచర్లు కొత్త దాంట్లో లేకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. ముఖ్యంగా రెనాల్ట్ కంపెనీ పైకి చెప్పని, దాచిపెట్టిన కొన్ని లోపాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

నమ్మకమైన బైక్‌కు స్టైల్ టచ్.. షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్

హోండా షైన్ 125 (Honda Shine 125) భారతీయ టూవీలర్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఒక ప్రసిద్ధ బైక్. విడుదలైనప్పటి నుంచి ఈ మోడల్‌పై వినియోగదారుల నమ్మకం నిరంతరం పెరుగుతూనే ఉంది. రోజువారీ ప్రయాణాలకు అనువైన సౌకర్యం, మంచి మైలేజ్, హోండా బ్రాండ్ విశ్వసనీయత కలిసి షైన్ 125ను దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన బైక్‌లలో ఒకటిగా మార్చాయి. అందుకే ఈ బైక్‌కు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ ఉండటం గమనించవచ్చు. కేవలం పెద్దవాళ్లే కాకుండా, కుటుంబ అవసరాల కోసం బైక్ కొనుగోలు చేసే వారు కూడా హోండా షైన్ 125ను ఆనందంగా ఎంచుకుంటున్నారు. స్మూత్ రైడింగ్ అనుభవం, తక్కువ నిర్వహణ ఖర్చు, దీర్ఘకాలం నమ్మకంగా పనిచేసే ఇంజిన్ వంటి అంశాలు ఈ బైక్‌కు మరింత ప్రజాదరణ తీసుకొచ్చాయి.
Advertisement

రెండు కిలోల వెండితో టాటా పంచ్ కొనొచ్చా ?

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. కిలో వెండి ధర ఏకంగా రూ.4.25 లక్షల మార్కును దాటడంతో ఇప్పుడు సామాన్యుడి లెక్కలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో మనం దాచుకున్న వెండికి.. టాటా మోటార్స్ వారి పాపులర్ మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ధరకు మధ్య ఆసక్తికరమైన పోలిక మొదలైంది. ఒకప్పుడు తులం బంగారం అంటే ఒక బైక్ వచ్చేది.. కానీ ఇప్పుడు రెండు కిలోల వెండి ఉంటే ఏకంగా టాటా పంచ్ కారునే ఇంటికి తెచ్చుకోవచ్చు.

సెడాన్ సెగ్మెంట్‌లో ఆరా హవా.. డిసెంబర్‌లో రికార్డు సేల్స్

భారత ఆటో మార్కెట్లో SUVల ప్రభావం భారీగా పెరిగిన నేపథ్యంలో, ఒకప్పుడు వెలుగొందిన సెడాన్ కార్లు తమ వైభవాన్ని కోల్పోయినట్లుగా అనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా SUVల హవానే కనిపిస్తుండటంతో, సెడాన్ విభాగం పూర్తిగా వెనుకబడిపోయిందనే భావన చాలా మందిలో ఉంది. అయితే గణాంకాలు చూస్తే ఈ అభిప్రాయం పూర్తిగా నిజం కాదని స్పష్టమవుతోంది. గత క్యాలెండర్ సంవత్సరంలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారు టైటిల్‌ను ఒక చిన్న సెడాన్ గెలుచుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్ వంటి భారీ డిమాండ్ ఉన్న SUVలను కూడా వెనక్కి నెట్టి, మారుతి సుజుకి డిజైర్ దేశంలో నంబర్ వన్‌గా నిలవడం విశేషం.

రోడ్డు మీద ఈ స్కూటర్ వెళ్తుంటే కళ్లు తిప్పుకోలేరు

యువతను ఆకట్టుకోవడంలో ముందుండే హోండా డియో ఇప్పుడు సరికొత్త హంగులతో మన ముందుకు వచ్చేస్తోంది. 125cc సెగ్మెంట్‌లో అప్పటికే క్రేజ్ సంపాదించుకున్న హోండా డియో 125, ఇప్పుడు మరింత స్టైలిష్‌గా X ఎడిషన్ రూపంలో ఆవిష్కృతమైంది. త్వరలోనే మార్కెట్లోకి విడుదల కానున్న ఈ స్కూటర్, కేవలం లుక్ పరంగానే కాకుండా టెక్నాలజీ పరంగా కూడా అదిరిపోయే అప్‌డేట్స్‌ను మోసుకొస్తోంది.

2025లో హ్యుందాయ్ క్రెటా ప్రభంజనం.. ఏడాదిలో 2 లక్షల అమ్మకాలు!

హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta) భారతీయ ఆటో మార్కెట్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ఒక ప్రసిద్ధ SUV. విడుదలైనప్పటి నుంచే ఈ కారు వినియోగదారుల విశ్వాసాన్ని గెలుచుకుంటూ వస్తోంది. కాలం గడిచేకొద్దీ క్రెటాపై డిమాండ్ తగ్గకుండా మరింత పెరుగుతుండటం గమనించవచ్చు. కుటుంబ వినియోగదారుల నుంచి యువత వరకు అందరికీ నచ్చే డిజైన్, ఆధునిక ఫీచర్లు, నమ్మకమైన పనితనం ఈ కారును ఎక్కువగా కొనుగోలు చేయడానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. మంచి ఇంధన సామర్థ్యం కూడా హ్యుందాయ్ క్రెటాను ప్రత్యేకంగా నిలబెడుతోంది. రోజువారీ వినియోగంలో ఖర్చు తక్కువగా ఉండటం వల్ల దీర్ఘ ప్రయాణాలకు కూడా ఈ SUV అనుకూలంగా మారింది.
Advertisement

రికార్డుల వేటలో మారుతి సుజుకి

భారతదేశ మధ్యతరగతి కుటుంబానికి కారు అంటే మొదట గుర్తొచ్చే పేరు మారుతి సుజుకి. దశాబ్దాలు మారుతున్నా, మార్కెట్లోకి విదేశీ లగ్జరీ బ్రాండ్లు ఎన్ని వస్తున్నా.. సామాన్యుడి నమ్మకాన్ని గెలుచుకోవడంలో మారుతికి సాటిలేదని మరోసారి నిరూపితమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తాజా అమ్మకాల గణాంకాలు ఆటోమొబైల్ రంగాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి. కేవలం తొమ్మిది నెలల కాలంలోనే మారుతి సుజుకి సాధించిన విక్రయాలు ఆ బ్రాండ్ తిరుగులేని ఆధిపత్యానికి నిదర్శనంగా నిలిచాయి.

.పేదల కోసం మారుతి తీసుకొచ్చిన ఆపద్భాందవులు

దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి హవా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలనుకునే సామాన్యుడికి మారుతి సిఎన్‌జి (CNG) కార్లు వరంలా మారాయి. ఇతర కార్ల కంపెనీలతో పోలిస్తే, మారుతి సుజుకి వద్దే అత్యధికంగా 14 రకాల సిఎన్‌జి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఫలితంగా ఆర్థిక సంవత్సరం 2025లో దేశవ్యాప్తంగా సీఎన్జీ వాహనాల అమ్మకాలు 22 శాతం వృద్ధిని నమోదు చేశాయి. గత ఏడాది ఏకంగా 8,38,546 సిఎన్‌జి కార్లు అమ్ముడవ్వగా, అందులో సింహభాగం మారుతి సుజుకివే కావడం విశేషం.

మిడిల్‌క్లాస్ బెస్ట్ బైక్! 330 కి.మీ మైలేజ్.. రూ. 92 వేలు!

బజాజ్ ఫ్రీడమ్ 125 (Bajaj Freedom 125) ఇప్పుడు భారత మార్కెట్లో ప్రసిద్ధ CNG మోటార్‌సైకిల్‌గా నిలిచింది. ఇది కేవలం ఒక సాధారణ బైక్ మాత్రమే కాదు, రోజువారీ ఉపయోగానికి ప్రత్యేకంగా రూపొందించబడిన వాహనం. పట్టణ ప్రాంతాల్లో నడిపినా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించలేమో అన్న ఆలోచన రాదు, ఫ్రీడమ్ 125 ప్రతి పరిస్థితిలో సులభంగా, నమ్మకంగా పనిచేస్తుంది. దీని తక్కువ ఇంధన ఖర్చు, స్థిరమైన పనితీరు, మెరుగైన మైలేజ్, నిర్వహణ సౌలభ్యం దీనిని వినియోగదారుల కోసం ఒక సమగ్ర పరిష్కారం గా చేస్తుంది. అందువల్ల కొత్త బైక్ కొనాలని యోచిస్తున్నవారికి ఇది ఉత్తమ ఎంపికగా మారుతుంది.

రూ.90 వేలకే 84 కి.మీల మైలేజ్ ఇచ్చే స్కూటర్

భారత స్కూటర్ మార్కెట్లో టీవీఎస్ జూపిటర్‌ (Tvs Jupiter)కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. హోండా యాక్టివాకు ప్రత్యక్ష పోటీదారుగా నిలిచిన ఈ స్కూటర్, ప్రతి నెలా స్థిరమైన అమ్మకాలతో ముందుకు సాగుతోంది. నమ్మకమైన పనితీరు, సౌకర్యవంతమైన రైడింగ్ అనుభూతి, తక్కువ నిర్వహణ ఖర్చులు వంటి అంశాలు వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అందుకే కుటుంబ వినియోగదారుల నుంచి యువత వరకు చాలా మంది జూపిటర్‌ను ఆనందంగా కొనుగోలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ విజయవంతమైన స్కూటర్‌ను మరో అడుగు ముందుకు తీసుకెళ్లే దిశగా టీవీఎస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం కంపెనీ CNG పవర్‌ట్రెయిన్ ఎంపికలో టీవీఎస్ జూపిటర్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి అన్ని రకాల సన్నాహాలు చేస్తోంది.
Advertisement

ఇంత మంచి 7 సీటర్ కారును ఎందుకు పట్టించుకోవడం లేదు?

భారతదేశంలో ఏడు సీట్ల వాహనం కొనాలనుకునే చాలా మంది వినియోగదారుల మనసులో ముందుగా మెదిలే పేర్లు టయోటా ఇన్నోవా, మారుతి సుజుకి ఎర్టిగా. ఈ రెండు మోడళ్లు సంవత్సరాలుగా మార్కెట్లో బలమైన స్థానం సంపాదించుకోవడంతో, 7-సీటర్ కార్లంటే ఇవే అనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడింది. అయితే, చాలామంది 7-సీట్ల SUV సెగ్మెంట్ వైపు అంతగా దృష్టి పెట్టడం లేదు. ఈ సెగ్మెంట్‌లో కూడా కొన్ని ఆసక్తికరమైన ఎంపికలు ఉన్నప్పటికీ, అవి ఆశించినంతగా వినియోగదారుల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాయి. అటువంటి మోడళ్లలో దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ నుంచి వచ్చిన 7-సీట్ల అల్కాజార్ (Alcazar) ఒకటి. ఇది రూపకల్పన, ఫీచర్లు, డ్రైవింగ్ సౌలభ్యం పరంగా చూస్తే టయోటా ఇన్నోవాకు నిజమైన ప్రత్యామ్నాయంగా నిలవగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో రిజ్టా హవా.. డిసెంబర్‌లో 14,282 యూనిట్లు

ఏథర్ రిజ్టా (Ather Rizta) భారతీయ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో వేగంగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటోంది. స్టైలిష్ డిజైన్‌తో పాటు ప్రాక్టికల్ ఫీచర్లను అందిస్తూ, రోజువారీ వినియోగానికి సరిపోయే స్కూటర్‌గా ఇది వినియోగదారుల మనసులు గెలుచుకుంది. అందుకే మార్కెట్లో దీని డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ కనిపిస్తోంది. షోరూమ్‌లలో కూడా ఏథర్ రిజ్టాకు మంచి స్పందన లభిస్తోంది, కొనుగోలుదారులు ఆనందంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఎంచుకుంటున్నారు. ఈ పెరుగుతున్న ఆదరణకు గణాంకాలే నిదర్శనం. గత నెల డిసెంబర్ 2025లో ఏథర్ రిజ్టా మొత్తం 14,282 యూనిట్లు వినియోగదారులకు డెలివరీ చేయబడ్డాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే ఈ సంఖ్య స్పష్టమైన వృద్ధిని చూపిస్తోంది.

SUV మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాటా నెక్సాన్

టాటా నెక్సాన్ (tata nexon) భారతీయ SUV మార్కెట్లో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. స్టైలిష్ డిజైన్, బలమైన నిర్మాణం, సరసమైన ధర... ఇవన్నీ కలసి నెక్సాన్‌ను సామాన్య వినియోగదారుడి నుంచి ఫ్యామిలీ కొనుగోలుదారుడి వరకు అందరికీ ఇష్టమైన SUVగా మార్చాయి. ముఖ్యంగా ధర-ఫీచర్ల సమతుల్యత దీనికి పెద్ద ప్లస్ పాయింట్. అందుకే మార్కెట్లో దీని డిమాండ్ రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది, షోరూమ్‌ల వద్ద కూడా మంచి స్పందన కనిపిస్తోంది. వినియోగదారులు నెక్సాన్‌ను ఎంచుకునే మరో ప్రధాన కారణం దీని తక్కువ నిర్వహణ ఖర్చులు. రోజువారీ వినియోగంలో జేబుకు భారం కాకుండా ఉండటం, అలాగే మంచి ఇంధన సామర్థ్యం అందించడం వల్ల ఈ SUVను కొనుగోలు చేసిన వారు సంతృప్తిగా ఉన్నారు.

బ్యాటరీ తప్పు లేదని తేల్చి చెప్పిన కంపెనీ

ఎలక్ట్రిక్ వాహనాలు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది బ్యాటరీ పేలిపోతుందేమో.. కారు తగలబడిపోతుందేమో అన్న భయం. ముఖ్యంగా గతంలో కొన్ని చౌకబారు విదేశీ విడిభాగాలతో తయారైన ఎలక్ట్ిక్ స్కూటర్లు తగలబడటంతో ఈ భయం జనాల్లో బలంగా నాటుకుపోయింది. అయితే తాజాగా మహీంద్రా కంపెనీకి చెందిన అత్యంత ఆధునిక మహీంద్రా బీఈ 6 (Mahindra BE 6) ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఉత్తరప్రదేశ్ సమీపంలో అగ్నిప్రమాదానికి గురికావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ఈవీల సేఫ్టీ మీద మళ్లీ ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో మహీంద్ర కంపెనీ అత్యంత పారదర్శకంగా స్పందిస్తూ అసలు మంటలు ఎలా వచ్చాయో సాక్ష్యాధారాలతో సహా వివరించింది.
Advertisement

కేంద్ర బడ్జెట్ 2026పై ఆటో రంగం భారీ ఆశలు

ఫిబ్రవరి 1న భారత ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ 2026ను పార్లమెంట్‌లో సమర్పించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, దేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో ఆశలు మరింత పెరుగుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాల్లో ఆటో రంగం ఒకటైన నేపథ్యంలో, ఈ పరిశ్రమ మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను బడ్జెట్‌లో ప్రకటించాలని ఆటో రంగ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రంగం GDPకి గణనీయంగా దోహదపడుతుంది, ఉపాధిని సృష్టిస్తుంది, కాబట్టి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ప్రోత్సాహాలను అందించాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా, గత కొన్ని సంవత్సరాలుగా విధానాల్లో వచ్చిన మార్పుల తర్వాత, ఇప్పుడు స్థిరమైన, స్పష్టమైన పాలసీ దిశ అవసరమని వారు భావిస్తున్నారు.