కేంద్ర బడ్జెట్ 2026పై ఆటో రంగం భారీ ఆశలు

ఫిబ్రవరి 1న భారత ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ 2026ను పార్లమెంట్‌లో సమర్పించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో, దేశంలోని ఆటోమోటివ్ పరిశ్రమలో ఆశలు మరింత పెరుగుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు కీలకమైన రంగాల్లో ఆటో రంగం ఒకటైన నేపథ్యంలో, ఈ పరిశ్రమ మరింత వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను బడ్జెట్‌లో ప్రకటించాలని ఆటో రంగ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ రంగం GDPకి గణనీయంగా దోహదపడుతుంది, ఉపాధిని సృష్టిస్తుంది, కాబట్టి ప్రపంచ దేశాలతో పోటీ పడేలా ప్రోత్సాహాలను అందించాలని వారు కోరుతున్నారు. ముఖ్యంగా, గత కొన్ని సంవత్సరాలుగా విధానాల్లో వచ్చిన మార్పుల తర్వాత, ఇప్పుడు స్థిరమైన, స్పష్టమైన పాలసీ దిశ అవసరమని వారు భావిస్తున్నారు.

రోడ్లపై రాజ్యం బుల్లెట్‌దే.. సేల్స్ నంబర్లు షాక్ ఇచ్చాయి

భారతీయ బైక్ ప్రియుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న మోటార్‌సైకిళ్లలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) ఒక ఐకానిక్ పేరు. కాలం మారినా, మోడళ్లు కొత్తగా వచ్చినా, బుల్లెట్‌కు ఉన్న క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎన్ని కొత్త బైక్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చినా, బుల్లెట్ అనే పేరు భారతీయ రోడ్లపై ఎప్పటికీ నిలిచేలా ఉంది. అదే కారణంగా, ఈ బైక్‌కు అమ్మకాల పరంగా ప్రతి నెలా స్థిరమైన, బలమైన డిమాండ్ కనిపిస్తూనే ఉంటుంది. డిసెంబర్ 2025 నెల కూడా ఈ ట్రెండ్‌కు మినహాయింపు కాదు. తాజాగా విడుదలైన అమ్మకాల నివేదిక ప్రకారం, ఆ ఒక్క నెలలోనే 24,849 యూనిట్ల రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 బైక్‌లు అమ్ముడయ్యాయి.

అజిత్ పవార్ కార్ కలెక్షన్ ఇదే

మహారాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ అకాల మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. బారామతిలో జరిగిన విమాన ప్రమాదం ఒక ధీశాలి అయిన రాజకీయ నాయకుడిని మనకు దూరం చేసింది. అజిత్ పవార్ కేవలం రాజకీయాల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ చాలా క్రమశిక్షణతో ఉండేవారు.

50,000 యూనిట్ల ఉత్పత్తిని పూర్తి చేసిన స్కోడా కైలాక్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో స్కోడా కైలాక్ (Skoda Kylaq) చాలా తక్కువ కాలంలోనే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో ప్రవేశించిన ఈ మోడల్, భారతీయ కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా రూపొందించబడడంతో వేగంగా ప్రజాదరణ పొందింది. స్టైలిష్ డిజైన్, ప్రీమియం ఫీల్, స్కోడా బ్రాండ్‌పై ఉన్న నమ్మకం కలిసి కైలాక్‌ను కుటుంబాలకూ, యువతకూ ఒక ఆకర్షణీయ ఎంపికగా మార్చాయి. స్కోడా కైలాక్‌ను కంపెనీ డిసెంబర్ 2024లో అధికారికంగా భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. లాంచ్ అయిన కొద్ది రోజులకే ఈ SUVపై మంచి స్పందన రావడంతో, డెలివరీలు జనవరి 27, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచే కైలాక్‌కు స్థిరమైన డిమాండ్ కొనసాగుతూ వస్తోంది.
Advertisement

ఈ కారు కొనకపోతే చాలా మిస్ అవుతారు

టయోటా తన పాపులర్ ఎస్యూవీ అర్బన్ క్రూయిజర్ హైరైడర్(Urban Cruiser Hyryder)లో సరికొత్త టెక్నాలజీని జోడించింది. మార్కెట్లో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు ముఖ్యంగా టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్ వంటి కొత్త మోడళ్లకు చెక్ పెట్టేందుకు టయోటా ఒక అదిరిపోయే టెక్ ప్యాకేజీని లాంచ్ చేసింది. బేస్ వేరియంట్ కొన్నవారికి కూడా హై ఎండ్ ఫీచర్లు అందుబాటులో ఉండడం ఈ ప్యాకేజీ స్పెషాలిటీ.

భారీ డిమాండ్‌తో దూసుకెళ్తున్న యాక్సెస్ 125

సుజుకి యాక్సెస్ 125 (Suzuki Access 125) భారతీయ స్కూటర్ మార్కెట్‌లో ఒక నమ్మకమైన పేరుగా, ఇంటింటికీ సుపరిచితమైన మోడల్‌గా నిలిచింది. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి బలమైన ప్రత్యర్థులు ఉన్నప్పటికీ, యాక్సెస్ 125 తనకంటూ ప్రత్యేకమైన అభిమాన వర్గాన్ని ఏర్పరుచుకుని నిరంతరం మంచి డిమాండ్‌ను కొనసాగిస్తోంది. స్టైల్, పనితీరు, నమ్మకమైన ఇంజిన్ కలయికే ఈ స్కూటర్ విజయానికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇటీవల విడుదలైన అమ్మకాల గణాంకాలు కూడా యాక్సెస్ 125 మార్కెట్‌లో ఎంత బలంగా నిలబడిందో స్పష్టంగా చూపిస్తున్నాయి. గత నెల, అంటే డిసెంబర్ 2025లో మాత్రమే సుజుకి యాక్సెస్ 125 మొత్తం 69,622 యూనిట్లు అమ్ముడయ్యాయి.

అజిత్ పవార్ ఆఖరి ప్రయాణం ఆ విమానంలోనే

మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) బుధవారం ఉదయం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణించారు. బారామతిలో ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా జరిగిన ఈ విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. అసలు అజిత్ పవార్ ప్రయాణించిన ఆ విమానం ఏది ? అది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? దాని సామర్థ్యం ఎంత? అనే సాంకేతిక వివరాలపై ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆ విమానం వివరాలు, అందులో ఎవరెవరు ఉన్నారు అనే పూర్తి సమాచారం ఈ వార్తలో తెలుసుకుందాం.

ఫిబ్రవరి 12న MG మెజెస్టర్ ఎంట్రీ.. టీజర్ విడుదల

JSW MG మోటార్ ఇండియా తాజాగా తన కొత్త ఫ్లాగ్‌షిప్ SUV ఎంజీ మెజెస్టర్ (MG Majestor)కు సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేసింది. ఈ కారు ఫిబ్రవరి 12న అధికారికంగా మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే టీజర్ విడుదలతోనే ఆటోమొబైల్ వర్గాల్లోనే కాదు, కస్టమర్లలో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. MG బ్రాండ్ నుంచి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ SUV, డిజైన్, పనితీరు విషయంలో పూర్తిగా కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేయనుందని కంపెనీ స్పష్టంగా చెబుతోంది. MG మోటార్ తెలిపిన వివరాల ప్రకారం, మెజెస్టర్ తన విభాగంలోనే అత్యంత పొడవైన, వెడల్పు, ఎత్తైన SUVగా నిలవనుంది. ఈ ప్రత్యేకతతో, ఇప్పటివరకు ఉన్న సాంప్రదాయ D-సెగ్మెంట్ పరిమితులను దాటి, పూర్తిగా కొత్త D+ సెగ్మెంట్ను సృష్టించాలనే లక్ష్యంతో MG ముందుకు సాగుతోంది.
Advertisement

ఈ బైక్ వెళ్తుంటే ప్రతి ఒక్కరూ సైడ్ తప్పుకోవాల్సిందే

ఇండియన్ రోడ్లపై రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కనిపిస్తే ఆ రాజసమే వేరు. ముఖ్యంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350(Royal Enfield Classic 350) మోడల్‌కు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా విడుదలైన 2025 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే, ఈ బైక్ తన సొంత కంపెనీలోని ఇతర మోడళ్లను కూడా వెనక్కి నెట్టి దూసుకుపోతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు, అదిరిపోయే లుక్ ఉండటంతో కుర్రాళ్ల నుంచి ముసలి వాళ్ల దాకా అందరూ దీనికే జై కొడుతున్నారు.

ఇక సామాన్యుడూ బీఎండబ్ల్యూ కార్ కొనొచ్చు

భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య జరిగిన సరికొత్త వాణిజ్య ఒప్పందం ఆటోమొబైల్ రంగంలో ఒక మహా విప్లవానికి తెరలేపింది. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ చర్చల తర్వాత, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(FTA) ఎట్టకేలకు ఖరారైంది. దీనివల్ల విదేశీ కార్లంటే మోయలేని భారం అనుకునే వారికి భారీ ఊరట లభించనుంది. ముఖ్యంగా బీఎండబ్ల్యూ (BMW), మెర్సిడెస్ బెంజ్, ఆడి వంటి లగ్జరీ కార్ల ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ చారిత్రాత్మక ఒప్పందాన్ని ప్రధాని మోదీ "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్" అని అభివర్ణించారు.

స్కూటర్లలో కీలక లోపం.. వెంటనే సర్వీస్ సెంటర్‌‌కు వెళ్లండి!

ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా గుర్తింపు పొందిన యమహా(yamaha)కు భారతదేశంలో కూడా భారీ అభిమాన గణం ఉంది. నాణ్యత, పనితీరు, ముఖ్యంగా కస్టమర్ భద్రత విషయంలో యమహా ఎప్పుడూ రాజీ పడదు. ఈ నిబద్ధతలో భాగంగానే, తాజాగా కంపెనీ ఒక కీలకమైన, బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకుంది. ఇండియా యమహా మోటార్ ప్రైవేట్ లిమిటెడ్ (IYM) అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం, మే 2, 2024 నుంచి సెప్టెంబర్ 3, 2025 మధ్య తయారు చేసిన 125-సిసి స్కూటర్ మోడళ్లలో మొత్తం 3,06,635 యూనిట్లకు స్వచ్ఛంద రీకాల్ ప్రచారం ప్రారంభించింది. ఈ రీకాల్ తక్షణమే అమలులోకి వస్తుందని యమహా స్పష్టం చేసింది. కంపెనీకి కస్టమర్ల భద్రతే అత్యంత ప్రాధాన్యత అని మరోసారి ఈ నిర్ణయం ద్వారా నిరూపించింది.

బాక్సాఫీస్ సక్సెస్ గిఫ్ట్.. అనిల్ రావిపూడికి చిరంజీవి లగ్జరీ కారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను పొందుతూ, ఏకంగా రూ. 350 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టి సంచలన విజయంగా నిలిచింది. మాస్ ఆడియన్స్‌తో పాటు ఫ్యామిలీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న ఈ చిత్రం, చిరంజీవి కెరీర్‌లో మరో మైలురాయిగా మారింది. ఈ భారీ సక్సెస్ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని ప్రత్యేకంగా వ్యక్తం చేశారు. సినిమా విజయానికి కీలకంగా నిలిచిన దర్శకుడు అనిల్ రావిపూడికి, చిరు తన సంతోషాన్ని చాటుతూ ఖరీదైన అల్ట్రా ప్రీమియం రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును గిఫ్ట్‌గా అందించారు.
Advertisement

ఇక షోరూంల ముందు భారీ క్యూలు ఖాయం

భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఫ్యామిలీ కార్లకు ముఖ్యంగా 7 సీటర్ కార్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇప్పటివరకు ఈ విభాగంలో మారుతీ సుజుకీ ఎర్టిగా రారాజుగా వెలుగుతోంది. అయితే మారుతీ ఏకఛత్రాధిపత్యానికి చరమగీతం పాడేందుకు జపాన్ కార్ల దిగ్గజం నిస్సాన్ (Nissan) సిద్ధమైంది. అత్యంత చౌక ధరలో, అదిరిపోయే ఫీచర్లతో నిస్సాన్ గ్రావైట్ (Nissan Gravite) పేరుతో సరికొత్త 7 సీటర్ ఎంబీవీ (MPV) కారును మార్కెట్లోకి దించుతోంది. ఈ కారు రాకతో మధ్యతరగతి ప్రజల సొంత కారు కల చాలా తక్కువ ధరలోనే నెరవేరబోతోంది.

ఎదురుచూపులకు ఫుల్ స్టాప్.. 2026 రెనాల్ట్ డస్టర్ స్పెసిఫికేషన్స్

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 రెనాల్ట్ డస్టర్ SUV ఎట్టకేలకు నిన్న అధికారికంగా ఆవిష్కరించబడింది. తొలి చూపులోనే ఆకట్టుకునే స్టైలిష్ డిజైన్‌తో పాటు, ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఇందులో అనేక కొత్త ఫీచర్లను రెనాల్ట్ జోడించింది. లుక్ పరంగా మరింత మస్క్యులర్‌గా, ప్రీమియం టచ్‌తో కనిపించే ఈ కొత్త డస్టర్, SUV ప్రియుల అంచనాలను నిజం చేసినట్టే అనిపిస్తోంది. ఇప్పటికే ఈ SUV కోసం ప్రీ-బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. కొత్త డస్టర్‌ను బుక్ చేసుకోవాలనుకునే వారు కేవలం రూ. 21,000 అడ్వాన్స్ చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవచ్చు. ఇది రానున్న రోజుల్లో మార్కెట్లోకి వచ్చే అత్యంత ఆసక్తికర SUVలలో ఒకటిగా మారుతుందనే అభిప్రాయం ఆటో వర్గాల్లో వినిపిస్తోంది. ఈ కారు గురించిన డిజైన్, ఇంజిన్, ఫీచర్స్, ధర వివరాలు ఈ కింది కథణంలో చూద్దాం.

స్టాక్ లేదన్నా షోరూమ్స్ వద్ద పడిగాపులు

యమహా మోటార్ ఇండియా తన అమ్ములపొదిలోకి కొత్తగా చేరిన XSR 155 మోడల్‌తో భారత టూవీలర్ మార్కెట్‌ను ఒక ఊపు ఊపేస్తోంది. 2025 డిసెంబర్ నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, యమహా చరిత్రలోనే కనివినీ ఎరుగని వృద్ధిని నమోదు చేసింది. కేవలం ఒక్క నెలలోనే యమహా బ్రాండ్‌ను అమ్మకాల శిఖరాగ్రాన నిలబెట్టిన ఘనత XSR 155 బైక్‌కే దక్కుతుంది. నవంబర్ 2025లో మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ నియో-రెట్రో స్టైల్ బైక్, డిసెంబర్ నెలలోనే రికార్డు స్థాయిలో అమ్ముడై ఆటోమొబైల్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది.

5 డోర్ల థార్ రాక్స్ దూకుడు.. రికార్డ్ సేల్స్‌తో దుమ్మురేపింది!

భారతీయులకు SUV అనే మాట వినిపించగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చే పేరు మహీంద్రా థార్ (Mahindra Thar). రఫ్ అండ్ టఫ్ డిజైన్, ఆఫ్-రోడ్ సామర్థ్యం, స్టైల్ కలిసిన ఈ SUV 2020లో విడుదలైన రెండో తరం మోడల్‌తో నిజంగా చాలా మంది కలల కారుగా మారిపోయింది. ముఖ్యంగా 3-డోర్ల వెర్షన్ యూత్‌తో పాటు అడ్వెంచర్ ప్రేమికుల మనసును పూర్తిగా దోచుకుంది. అయితే, అదే సమయంలో కుటుంబ వినియోగానికి కొంచెం పరిమితిగా ఉందన్న అభిప్రాయం కూడా వినియోగదారుల నుంచి వినిపించేది. ఈ కస్టమర్ల డిమాండ్‌ను సీరియస్‌గా తీసుకున్న మహీంద్రా, థార్‌ను మరింత ఫ్యామిలీ ఫ్రెండ్లీగా మార్చాలనే ఆలోచనతో మార్కెట్లోకి 5-డోర్ల మోడల్‌ను తీసుకొచ్చింది.
Advertisement

ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో టీవీఎస్ సంచలనం

టీవీఎస్ మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో ఐక్యూబ్(iQube), ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ TVS Xతో తనదైన ముద్ర వేసిన ఈ హోసూర్ ఆధారిత సంస్థ, ఇప్పుడు నేరుగా ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల మార్కెట్లోకి అడుగుపెడుతోంది. తాజాగా టీవీఎస్ తన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ e.FX.3O డిజైన్‌ను భారత్‌లో పేటెంట్ చేసింది. 2025లో మిలన్‌లో జరిగిన EICMA ఈవెంట్‌లో ఒక కాన్సెప్ట్ రూపంలో ప్రపంచానికి పరిచయమైన ఈ బైక్, ఇప్పుడు ప్రొడక్షన్ మోడల్‌గా రూపాంతరం చెందుతోంది.

డిజైర్ దూకుడు.. రోజుకు 587 కార్లు అంటే మాటలు కాదు!

మారుతి సుజుకి డిజైర్ (maruti suzuki dzire) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఒక సాధారణ కారుగా మాత్రమే కాకుండా, ఒక ఇంటి పేరుగా మారిపోయింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సామాన్య కుటుంబాల నుంచి సంపన్న వర్గం వరకు అన్ని స్థాయిల వినియోగదారుల మనసును గెలుచుకున్న సెడాన్‌గా డిజైర్ ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. రోజువారీ ఆఫీస్ ప్రయాణాలు, కుటుంబ అవసరాలు, దూర ప్రయాణాలు ఎలాంటి వినియోగానికైనా ఇది సౌకర్యంగా సరిపోతుంది. తక్కువ నిర్వహణ ఖర్చులు, విశ్వసనీయత, మెరుగైన ఇంధన సామర్థ్యం వంటి అంశాలు డిజైర్‌ను వినియోగదారులకు మరింత దగ్గర చేశాయి. అంతేకాదు, సంవత్సరాల పాటు ఎలాంటి పెద్ద సమస్యలు లేకుండా ఉపయోగించుకునే సుదీర్ఘ జీవితకాలం కూడా ఈ కారుకు ఉన్న ప్రధాన బలంగా చెప్పుకోవచ్చు.

ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే 800 కిమీ పక్కా

ప్రస్తుతం పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ఆఫీసుకో, కాలేజీకో వెళ్లాలంటే పెట్రోల్ బిల్లు చూసి గుండె జారిపోతోంది. ఇలాంటి సమయంలో అందరూ వెతికేది ఒకటే.. తక్కువ ధరలో రావాలి, మైలేజీలో తోపు అయి ఉండాలి. సరిగ్గా ఇదే పాయింట్‌ను క్యాచ్ చేసిన టీవీఎస్ (TVS) మోటార్స్, సామాన్యుల జేబుకు చిల్లు పడకుండా మూడు అదిరిపోయే బైక్‌లను అందుబాటులోకి తెచ్చింది.

ఇది భైక్ కాదు భయ్యా.. ఒక ఎమోషన్

రాయల్ ఎన్‎ఫీల్డ్ అంటే ఒకప్పుడు అది ఒక హోదా. కేవలం డబ్బులున్న వాళ్లు, రాజసం కోరుకునే వాళ్లు మాత్రమే నడిపే బైక్ అనే ముద్ర ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆ బ్రాండ్ తన రూపురేఖలను మార్చుకుంది. మిడిల్ క్లాస్ యువత కలలను నిజం చేస్తూ, వారి బడ్జెట్లో ఇమిడిపోయేలా తీసుకొచ్చిన హంటర్ 350(Royal Enfield Hunter 350) ఇప్పుడు ఆటోమొబైల్ మార్కెట్లో ఓ ప్రభంజనం క్రియేట్ చేస్తోంది. 2025 డిసెంబర్ నెల అమ్మకాల లెక్కలు ఈ బైక్ క్రియేట్ చేసిన సంచలనాన్ని స్పష్టం చేస్తున్నాయి.
Advertisement

డస్టర్ మళ్లీ వచ్చేసింది.. ఈసారి లగ్జరీతో పాటు పవర్ కూడా!

రెనాల్ట్ ఇండియా (renault india) 2026 గణతంత్ర దినోత్సవం రోజున తన అత్యంత గుర్తింపు పొందిన బ్యాడ్జ్‌లలో ఒకటైన కొత్త డస్టర్ (duster) ను విడుదల చేయడం ద్వారా భారత మార్కెట్లో మరోసారి తన సత్తాను చాటేందుకు సిద్ధమవుతోంది. ఒకప్పుడు రెనాల్ట్‌కు భారీ గుర్తింపు తీసుకొచ్చిన డస్టర్‌ను 2022లో నిలిపివేయాల్సి వచ్చినప్పటికీ, ఇప్పుడు పూర్తిగా నూతన రూపంలో తిరిగి తీసుకురావడం కంపెనీ పునరుత్థానానికి ఒక కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. వేగంగా విస్తరిస్తున్న మిడ్-సైజ్ SUV విభాగం ప్రస్తుతం భారతీయ వినియోగదారుల ఆసక్తిని శాసిస్తోంది. అలాంటి అత్యంత పోటీ ఉన్న విభాగంలోకి డస్టర్‌తో మళ్లీ అడుగుపెట్టడం ద్వారా రెనాల్ట్ తన పోటీదారులకు గట్టి సవాల్ విసరనుంది.

చుక్క పెట్రోల్ అవసరం లేకుండా 421 కిమీ

పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్న ప్రస్తుత రోజుల్లో సామాన్యుడి చూపు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతోంది. కాలుష్యం లేకపోవడం, మెయింటెనెన్స్ ఖర్చు తక్కువగా ఉండడంతో చాలా మంది ఈవీల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎలక్ట్రిక్ కార్లు అంటే చాలా ఖరీదైనవి అనే అపోహ చాలా మందిలో ఉంది.

పెట్రోల్ రాజ్యంలో ఎలక్ట్రిక్ దండయాత్ర.. టీవీఎస్ iQube చరిత్ర!

భారత టూ-వీలర్ మార్కెట్ ఇప్పటివరకు ప్రధానంగా పెట్రోల్ వాహనాల ఆధిపత్యంలోనే కొనసాగుతోంది. హీరో స్ప్లెండర్, హోండా యాక్టివా వంటి లెజెండరీ మోడళ్లు సంవత్సరాలుగా అమ్మకాల జాబితాలో అగ్రస్థానాల్లో ఉంటూ మార్కెట్‌ను శాసిస్తున్నాయి. అయితే ఈ స్థిరమైన ట్రెండ్‌ను మార్చే స్థాయిలో టీవీఎస్ ఐక్యూబ్ (Tvs iqube) ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గట్టి సవాల్ విసురుతోంది. డిసెంబర్ 2025 నెల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే, దేశంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ద్విచక్ర వాహనాల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక ఎలక్ట్రిక్ మోడల్‌గా టీవీఎస్ ఐక్యూబ్ నిలిచింది. ఇది ఎలక్ట్రిక్ వాహన రంగానికి మాత్రమే కాకుండా, మొత్తం భారతీయ టూ-వీలర్ మార్కెట్‌కు ఒక కీలక మైలురాయిగా చెప్పుకోవచ్చు.

పేదల పాలిట కల్పవృక్షం ఈ బైక్

భారతదేశ ఆటోమొబైల్ చరిత్రలో కొన్ని వాహనాలు కేవలం యంత్రాలుగా మాత్రమే కాకుండా కోట్లాది మంది భారతీయుల జీవితాల్లో ఒక అంతర్భాగంగా మారిపోయాయి. హిందుస్తాన్ అంబాసిడర్, మారుతి 800, మారుతి ఓమ్ని వంటి కార్లు ఒకప్పుడు భారతీయ రోడ్లను ఏలాయి. అయితే టూ వీలర్ల విషయానికి వస్తే గత మూడు దశాబ్ధాలుగా ఒకే ఒక పేరు మార్మోగుతోంది. అదే హీరో స్ప్లెండర్(Hero Splendor).
Advertisement

భారతదేశంలో రేపటి నుంచి ఈ కారు గురించే మాట్లాడుకుంటారు!

రెనాల్ట్ (Renault) అభిమానులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. ఒకప్పుడు భారత SUV మార్కెట్‌లో సంచలనం సృష్టించిన రెనాల్ట్ డస్టర్ (Renault Duster) ఇప్పుడు మళ్లీ భారతదేశంలోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది. బలమైన బిల్డ్, అద్భుతమైన డ్రైవింగ్ క్వాలిటీ, రఫ్ అండ్ టఫ్ ఇమేజ్‌తో డస్టర్ ఒకప్పుడు యూత్‌తో పాటు ఫ్యామిలీ కొనుగోలుదారుల హృదయాలను గెలుచుకుంది. అలాంటి ఐకానిక్ మోడల్‌ను తిరిగి తీసుకురావడం ద్వారా, భారత మార్కెట్లో తన స్థితిని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో రెనాల్ట్ ముందుకెళ్తోంది. రెనాల్ట్ అధికారికంగా ప్రకటించిన సమాచారం ప్రకారం, జనవరి 26న కొత్త డస్టర్ భారత మార్కెట్లో అమ్మకానికి రానుంది. ఈ తేదీకి ప్రత్యేకత కూడా ఉండటంతో, కంపెనీ ఈ లాంచ్‌ను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.