కస్టమర్లు రాకపోయే సరికి దోమలు కొట్టుకుంటున్న డీలర్లు
ఆటోమొబైల్స్
- 7 month, 23 days ago
ఒకప్పుడు భారతీయ కార్ మార్కెట్‌ను హ్యాచ్‌బ్యాక్‌లు ఏలిన రోజులు ఉన్నాయి. తక్కువ ధర, మంచి మైలేజ్, నగరాల్లో సులభమైన డ్రైవింగ్ ఈ కారణాల వల్ల హ్యాచ్‌బ్యాక్‌లు మధ్యతరగతి కుటుంబాలకు ఫస్ట్ ఛాయిస్‌గా ఉండేవి. కానీ కాలం మారింది. నేడు వినియోగదారుల అభిరుచులు పూర్తిగా మారిపోతున్నాయి. ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్, రఫ్ అండ్ టఫ్ లుక్, పెద్ద కారు ఫీల్ కోసం అందరూ స్పోర్ట్ యుటిలిటీ వాహనాలైన SUVల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు ప్రభావం వల్ల హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్ అమ్మకాలు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ మారుతున్న పరిస్థితుల్లో ఒకప్పుడు ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో గట్టి పోటీదారుగా నిలిచిన రెనాల్ట్ క్విడ్ పరిస్థితి కూడా ఇప్పుడు ఆందోళనకరంగా మారింది.