పేదల బండి ధర కూడా పెరిగింది

ఓ సాధారణ సామాన్యుడి సొంత వాహనం, మైలేజీ కింగ్ హీరో స్ప్లెండర్ ప్లస్(Hero Splendor Plus) ధరలు పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ అయిన హీరో మోటో కార్ప్, జనవరి 2026 నుంచే అన్ని మోడల్స్ పై ధరల పెంపును ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఆఫీస్, కాలేజ్, ఫ్యామిలీ… అన్నింటికీ సరైనవి ఇవే!

నేటి వేగవంతమైన జీవనశైలిలో టూవీలర్స్ మన జీవితాల్లో విడదీయరాని భాగంగా మారిపోయాయి. ముఖ్యంగా రోజూ ఆఫీసుకు వెళ్లే పురుషులు, మహిళలు, కాలేజీకి వెళ్లే విద్యార్థులు, చిన్నచిన్న పనుల కోసం బయటకు వెళ్లే కుటుంబ సభ్యులు అందరికీ స్కూటర్లు ఎంతో అవసరమైన సాధనంగా నిలుస్తున్నాయి. రద్దీ రోడ్లలో సులభంగా ప్రయాణించగలగడం, పార్కింగ్ సమస్య లేకపోవడం, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం వంటి కారణాలతో స్కూటర్లు ఎక్కువమంది ఎంపికగా మారాయి. అంతేకాదు, మంచి ఇంధన సామర్థ్యం కూడా ఉండటంతో నెలవారీ ఖర్చులు అదుపులో ఉంటాయి. మీరు కొత్త స్కూటర్ కొనాలనుకుంటే, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అనేక ఆప్షన్ల మధ్య సరైన ఎంపిక చేయడం కొంచెం కష్టంగా అనిపించవచ్చు.

5 లక్షల ఇళ్లకు చేరిన మిడిల్ క్లాస్ కారు

దక్షిణ కొరియా ఆటోమొబైల్ కంపెనీ కియా మోటార్స్ ఇండియాలో అడుగుపెట్టి తన సత్తాను చాటుతోంది. ఆ కంపెనీ ప్రొడక్ట్ అయిన సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ కియా సోనెట్ (Kia Sonet) అత్యంత ప్రజాదరణతో దూసుకుపోతుంది. ఈ విషయంలో కియా సోనెట్ ఓ భారీ రికార్డును క్రియేట్ చేసింది.

మధ్యతరగతి బడ్జెట్లో 28 కిమీ మైలేజ్‌ కారు

మిడిల్ క్లాస్ కుటుంబాలకు పెట్రోల్, డీజిల్ ఖర్చుల భారం తగ్గించడంతో పాటు, సిటీ ట్రాఫిక్‎లో డ్రైవింగ్ ఈజీ చేసే విధంగా ఓ అద్భుతమైన కారును టాటా మోటార్స్ మార్కెట్లోకి తీసుకొచ్చింది అదే టాటా టియాగో సీఎన్జీ ఆటోమేటిక్(Tata Tiago CNG Automatic). మన దేశంలో అత్యంత చౌకైన, సీఎన్జీ విభాగంలో ఆటోమేటిక్ గేర్‎బాక్స్‌తో వచ్చినటువంటి మొదటి ఇదే కావడం విశేషం.
Advertisement

తక్కువ ధర 7 సీటర్ కల నెరవేరలేదా? నిస్సాన్ గ్రావిటీ లాంచ్ డిలే

ఫ్రాన్స్‌కు చెందిన రెనాల్ట్, జపాన్‌కు చెందిన నిస్సాన్ మధ్య ఉన్న గ్లోబల్ అలయన్స్ కారణంగా కంపెనీలు ఒకే ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి వేర్వేరు మోడళ్లను అభివృద్ధి చేయడం తెలిసిందే. ఇదే భాగస్వామ్యంలో భాగంగా, భారత మార్కెట్‌లో ఇప్పటికే మంచి గుర్తింపు పొందిన రెనాల్ట్ ట్రైబర్‌ను ఆధారంగా తీసుకుని నిస్సాన్ తన కొత్త 7-సీటర్ కారును రూపొందించింది. దీనికి నిస్సాన్ గ్రావిటీ (Nissan Gravite) అనే పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం భారతదేశంలో రెనాల్ట్ ట్రైబర్ అత్యంత సరసమైన 7-సీటర్ కార్లలో ఒకటిగా నిలుస్తోంది. రెనాల్ట్ ఇండియా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ కారుకు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర కేవలం రూ. 5.76 లక్షలు మాత్రమే. ఇదే నేపథ్యంలో, ట్రైబర్ మాదిరిగానే తక్కువ ధరలో నిస్సాన్ గ్రావిటీని కూడా భారత మార్కెట్లోకి తీసుకురావాలని నిస్సాన్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.

ఏసీ సీట్లో కూర్చుని డెలివరీలే డెలివరీలు

మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ తన ఐకానిక్ వాహనాలైన బొలెరో క్యాంపర్ (Bolero Camper), బొలెరో పిక్-అప్ (Bolero Pik-Up) శ్రేణిని 2026 కొత్త మోడళ్లతో అప్‌డేట్ చేసింది. కేవలం లోడ్ మోయడానికే కాకుండా, డ్రైవర్ల సౌకర్యం, మోడ్రన్ టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ఈ మార్పులు చేపట్టింది. ఈ కొత్త మార్పులు వ్యాపారస్తుల పనితీరును ఎలా మార్చబోతున్నాయో ఈ కథనంలో చూద్దాం.

2026 జీప్ మెరిడియన్ ఇండియా లాంచ్

స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాల ప్రపంచంలో జీప్‌ (Jeep) కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆఫ్‌రోడ్ సామర్థ్యం, బలమైన నిర్మాణం, భద్రత విషయంలో అంతర్జాతీయంగా పేరు సంపాదించిన ఈ బ్రాండ్‌కు, భారత మార్కెట్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయం దక్కడం లేదు. అయినప్పటికీ, భారతీయ వినియోగదారుల అభిరుచులు, అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీప్ నిరంతరం తన ఉత్పత్తులను అప్‌డేట్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగానే తాజాగా అప్‌డేట్ చేసిన 2026 జీప్ మెరిడియన్ SUVను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త 2026 మెరిడియన్‌లో చేసిన మార్పులు కేవలం చిన్న అప్‌డేట్‌లకే పరిమితం కాకుండా, వినియోగదారుల రోజువారీ వినియోగం మరియు కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడ్డాయి.

క్రాష్ టెస్ట్‌లో దుమ్మురేపిన VinFast VF6

వియత్నాం దేశానికి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరుచుకుంటోంది. కొత్త బ్రాండ్ అయినప్పటికీ, ఆధునిక టెక్నాలజీని వినియోగించడం, ఎలక్ట్రిక్ మొబిలిటీపై స్పష్టమైన విజన్ కలిగి ఉండటం, ముఖ్యంగా భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం వంటి అంశాలు భారతీయ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. ఈ కారణంగానే విన్‌ఫాస్ట్ మోడళ్లపై దేశవ్యాప్తంగా ఆసక్తి క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో విన్‌ఫాస్ట్ నుంచి వచ్చిన VF 6 ఎలక్ట్రిక్ SUV తాజాగా ఒక కీలకమైన మైలురాయిని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ SUVను భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్(Bharat NCAP) కఠిన భద్రతా పరీక్షలకు గురి చేయగా, అత్యున్నతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది.
Advertisement

క్రాష్ టెస్ట్‌లో విన్‌ఫాస్ట్ VF7 అదరగొట్టింది

వియత్నాం దేశానికి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast) భారత మార్కెట్‌లో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటోంది. కొత్త బ్రాండ్ అయినప్పటికీ, ఆధునిక టెక్నాలజీ, ఎలక్ట్రిక్ మొబిలిటీపై స్పష్టమైన దృష్టి, భద్రతకు ఇచ్చే ప్రాధాన్యం కారణంగా భారతీయ వినియోగదారుల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. ఈ క్రమంలోనే విన్‌ఫాస్ట్‌కు చెందిన VF 7 ఎలక్ట్రిక్ SUV తాజాగా ఒక కీలకమైన మైలురాయిని సాధించింది. ఈ SUVను భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP) పరీక్షించగా, అత్యున్నతమైన 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఇది ప్రయాణికుల భద్రత విషయంలో ఈ కారు ఎంత బలంగా డిజైన్ చేయబడిందో స్పష్టంగా సూచిస్తోంది.

రూ. 5 లక్షలు ఉంటే ఈ కారు కొనచ్చు! 34 కి.మీ మైలేజ్

మారుతి సుజుకి సెలెరియో (maruti suzuki celerio) భారత మార్కెట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో మంచి మైలేజ్, సిటీ డ్రైవింగ్‌కు సౌకర్యం, మారుతి బ్రాండ్ నమ్మకం కావాలనుకునే వినియోగదారులకు సెలెరియో ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. యువత నుంచి చిన్న కుటుంబాల వరకు విస్తృత వర్గాల వినియోగదారులను ఈ కారు ఆకర్షిస్తోంది. కొత్త తరం సెలెరియోకు మారుతి సుజుకి మరింత ఫ్రెష్ లుక్‌ను అందించింది. స్మూత్ కర్వ్స్‌తో కూడిన బాడీ, కొత్త గ్రిల్ డిజైన్, స్టైలిష్ హెడ్‌ల్యాంప్స్ వలన ఈ కారు మునుపటి మోడల్‌తో పోలిస్తే మరింత మోడ్రన్‌గా కనిపిస్తుంది. కాంపాక్ట్ సైజ్‌లో ఉన్నప్పటికీ, ఇది రోడ్లపై చక్కని ప్రెజెన్స్‌ను ఇస్తుంది. సిటీ ట్రాఫిక్‌లో ఈ కారును నడపడం చాలా ఈజీగా ఉంటుంది.

టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా పూర్తి వివరాలు

సరికొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (toyota urban cruiser ebella) నిన్న భారత మార్కెట్‌లో అధికారికంగా లాంచ్ అయింది. ఎలక్ట్రిక్ SUVలపై ఆసక్తి పెరుగుతున్న ఈ సమయంలో టయోటా నుంచి వచ్చిన ఈ కొత్త మోడల్‌పై ఇప్పటికే వినియోగదారుల్లో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. లాంచ్‌తో పాటు బుకింగ్‌లను కూడా ప్రారంభించిన కంపెనీ, ఆసక్తి ఉన్న కస్టమర్లు కేవలం రూ. 25,000 అడ్వాన్స్ చెల్లించి ఈ కారును రిజర్వేషన్ చేసుకునే అవకాశం కల్పించింది. మీరు కొత్తగా ఒక ఎలక్ట్రిక్ SUV కొనాలని ప్లాన్ చేస్తుంటే, స్టైలిష్ డిజైన్, టయోటా బ్రాండ్ నమ్మకం, ఆధునిక టెక్నాలజీ ఒక ప్యాకేజీగా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా ఒక మంచి ఎంపికగా నిలుస్తోంది. సిటీ నుంచి లాంగ్ డ్రైవ్స్ వరకు అన్ని అవసరాలకు సరిపోయేలా ఈ కారును డిజైన్ చేశారు.

కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ఫుల్ రివ్యూ

Explore the Tata Punch Facelift review: design, interior, specs, engine details, driving experience, and price in India. Is it the right choice? | టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ రివ్యూను అన్వేషించండి: డిజైన్, ఇంటీరియర్, స్పెసిఫికేషన్‌లు, ఇంజిన్ వివరాలు, డ్రైవింగ్ అనుభవం మరియు భారతదేశంలో ధర. ఇది సరైన ఎంపికనా?
Advertisement

9 మంది ఒకే కారులో కూర్చోవచ్చు.. పెద్ద ఫ్యామిలీకి సరైన ఎంపిక!

SUV విభాగంలో అగ్రగామిగా నిలిచిన మహీంద్రా స్కార్పియో (mahindra scorpio), గత నెల అయిన డిసెంబర్ 2025లో కూడా తన మార్కెట్ పవర్‌ను మరోసారి రుజువు చేసింది. సంవత్సరాలు గడిచినా, కొత్త కొత్త SUVలు మార్కెట్లోకి వచ్చినా, స్కార్పియోకు ఉన్న క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని తాజా అమ్మకాల గణాంకాలు స్పష్టంగా చెబుతున్నాయి. డిసెంబర్ 2025లో మహీంద్రా స్కార్పియో మొత్తం 15,885 యూనిట్లను విక్రయించి అద్భుతమైన ప్రదర్శనను నమోదు చేసింది. ఇదే డిసెంబర్ 2024లో ఈ సంఖ్య కేవలం 12,195 యూనిట్లకే పరిమితమైంది. అంటే ఏడాది వ్యవధిలోనే స్కార్పియో అమ్మకాలు 3,690 యూనిట్లు పెరిగాయి. శాతం పరంగా చూస్తే, ఇది దాదాపు 30 శాతం వృద్ధి కావడం విశేషం.

రోడ్డు మీద వెళ్తుంటే అందరూ ఆగి చూడాల్సిందే

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా (Skoda) తన పాపులర్ ఎస్‌యూవీ కుషాక్(Kushaq) కొత్త వెర్షన్‌ను తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త హంగులు, అదిరిపోయే ఫీచర్లతో రీ-డిజైన్ చేయబడిన ఈ కారు ఇప్పుడు భారతీయ రోడ్లపై రాజసం ప్రదర్శించడానికి సిద్ధమైంది. కారు డిజైన్ నుంచి ఇంజిన్ గేర్ బాక్స్ వరకు స్కోడా చేసిన మార్పులు వాహన ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

భద్రతలో టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ అదరగొట్టింది

టాటా కార్ల అభిమానులు చాలా కాలంగా ఆసక్తిగా ఎదురుచూసిన టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ (tata punch facelift) ఇటీవలే భారత మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్న పంచ్‌కు ఇది ఒక కీలకమైన అప్‌డేట్‌గా చెప్పుకోవచ్చు. పాత మోడల్‌తో పోలిస్తే, కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మరింత ఆధునిక ఫీచర్లు, తాజా డిజైన్ టచ్‌లు, మెరుగైన టెక్నాలజీతో ముందుకు వచ్చింది. చిన్న SUV సెగ్మెంట్‌లో టాటా పంచ్‌కు ఉన్న బలమైన స్థానం ఈ ఫేస్‌లిఫ్ట్‌తో మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ధర విషయానికి వస్తే, టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 5.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించబడింది. ఈ ధర శ్రేణిలో ఆధునిక ఫీచర్లు, మెరుగైన బిల్డ్ క్వాలిటీ, టాటా బ్రాండ్ నమ్మకాన్ని అందించడం దీని ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.

మధ్యతరగతికి సరైన స్కూటర్.. ఒక్కసారి కొంటే 10 ఏళ్లపాటు వాడచ్చు!

హోండా యాక్టివా 110 (honda activa 110) భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన, ప్రజాదరణ పొందిన స్కూటర్‌లలో ఒకటిగా నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ మార్కెట్‌లో ఈ స్కూటర్ స్థిరంగా భారీ అమ్మకాలను నమోదు చేస్తూ వస్తోంది. పట్టణ ప్రాంతాల్లో రోజువారీ ఆఫీస్ ప్రయాణాలకు అయినా, గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన పనులకు అయినా యాక్టివా 110ను సులభంగా ఉపయోగించుకోవచ్చు. దాని సింపుల్ ఆపరేషన్, నమ్మకమైన ఇంజిన్, తక్కువ నిర్వహణ ఖర్చులు అన్ని వర్గాల వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. మీరు కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే, హోండా యాక్టివా 110 ఒక ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. ముఖ్యంగా సరసమైన ధరలో మంచి నాణ్యత కలిగిన స్కూటర్ కావాలనుకునే వారికి ఇది బాగా సరిపోతుంది.
Advertisement

రూ.10.77 లక్షలకే అదిరిపోయే SUV

మధ్యతరగతి కుటుంబాల కలల కారుగా మారిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా(Maruti Suzuki Grand Vitara) మార్కెట్లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. పెట్రోల్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఒక్కసారి ఫుల్ ట్యాంక్ చేస్తే ఏకంగా 1200 కిలోమీటర్ల వరకు ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో జనం ఈ కారు కోసం క్యూ కడుతున్నారు. కేవలం మైలేజ్ మాత్రమే కాదు, అదిరిపోయే లుక్స్, అత్యాధునిక ఫీచర్లతో ఈ SUV దూసుకుపోతోంది.

ఒక్కసారిగా కుప్పకూలిన టాటా కర్వ్ SUV అమ్మకాలు

టాటా మోటార్స్ (Tata Motors) ఆశలతో మార్కెట్‌లోకి తీసుకువచ్చిన టాటా కర్వ్ (tata curvv) ఒక కూపే SUVగా ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. ఫ్యూచరిస్టిక్ డిజైన్, కొత్త ప్లాట్‌ఫామ్, ప్రీమియం ఫీచర్లతో ఈ కారు ప్రారంభంలో మంచి చర్చకు వచ్చింది. అయితే, వాస్తవ అమ్మకాల విషయానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఇటీవల నెలల్లో టాటా కర్వ్‌కు డిమాండ్ స్పష్టంగా తగ్గుతున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. గత నెల అయిన డిసెంబర్ 2025లో టాటా కర్వ్ అమ్మకాలు తీవ్రంగా పడిపోయాయి. ఆ నెలలో కేవలం 1,104 యూనిట్లు మాత్రమే డెలివరీ చేయబడటం గమనార్హం. ఇదే సమయంలో, డిసెంబర్ 2024లో ఈ సంఖ్య 4,994 యూనిట్లు ఉండేది.

ఫస్ట్ టైమ్ 8-స్పీడ్ గేర్‌బాక్స్.స్కోడా సంచలనం

యూరప్ కార్ల తయారీ దిగ్గజం స్కోడా తన పాపులర్ ఎస్‌యూవీ కుషాక్(Skoda Kushaq)ను సరికొత్త హంగులతో భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ఇండియా 2.0 ప్రాజెక్టులో భాగంగా వస్తున్న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్.. కేవలం డిజైన్ పరంగానే కాకుండా.. సెగ్మెంట్లోనే మొదటిసారిగా వస్తున్న ఫీచర్లు, టెక్నాలజీతో వినియోగదారులను ఆకట్టుకోనుంది. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

ఒక్క ఛార్జ్‌తో 543 కి.మీ రేంజ్.. టయోటా ఇబెల్లా EV ఇండియాలో లాంచ్

జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా (Toyota), భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లోకి అధికారికంగా అడుగుపెట్టింది. భారతదేశం కోసం తన మొదటి పూర్తి ఎలక్ట్రిక్ కారుగా టయోటా తీసుకువచ్చిన మోడల్ అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Urban Cruiser Ebella). ఈ ఎలక్ట్రిక్ SUV వాస్తవానికి మారుతి సుజుకి ఈ-విటారా (e Vitara)కు రీబ్యాడ్జ్డ్ వెర్షన్‌గా ఉండటం గమనార్హం. మారుతితో ఉన్న గ్లోబల్ భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ, టయోటా ఈ కొత్త EVని ఇండియన్ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిచయం చేసింది. కొత్త టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా EV రెండు LFP (లిథియం ఫెరో ఫాస్ఫేట్) బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో అందుబాటులోకి రానుంది. ఇందులో ఒకటి 49 kWh బ్యాటరీ, మరొకటి 61 kWh బ్యాటరీ ప్యాక్. ఈ రెండు వేరియంట్లలోనూ ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు.
Advertisement

అక్టోబర్ నుంచి మైలేజీ మోసాలకు చెక్

భారతదేశంలో సామాన్యుడు కారు కొనాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాడు. అనేక కంపెనీ కార్ల గురించి చాలా విచారించి మాత్రమే కొంటారు. కారు కొనాలనే ప్రతి సామాన్యుడికి ఉండే మొదటి ఆలోచన మైలేజీ. షోరూమ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒక మైలేజీ అంకె చెబితే, తీరా కారు రోడ్డు మీదకు వచ్చాక వచ్చే మైలేజీకి అస్సలు పొంతన ఉండదు.

యువత ఫేవరెట్ స్కూటర్! హోండా డియో 110 ధర, డిజైన్, ఫీచర్స్ వివరాలు

హోండా డియో 110 (honda Dio) భారత మార్కెట్‌లో ఒక ప్రముఖమైన, నమ్మకమైన స్కూటర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. స్టైలిష్ డిజైన్‌, స్పోర్టీ లుక్, హోండా బ్రాండ్ విశ్వసనీయత కలసి ఈ స్కూటర్‌ను యువతలో అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌గా నిలిపాయి. రోడ్డు మీద కనిపించిన వెంటనే ఆకట్టుకునే లుక్ ఉండటంతో పాటు, రోజువారీ వినియోగానికి సరిపోయే సౌకర్యాలు ఉండడం వల్ల డియో 110 మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. ప్రత్యేకంగా యువ కస్టమర్లు ఈ స్కూటర్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాలేజీకి వెళ్లే విద్యార్థులు, ఆఫీస్‌కు రోజూ ప్రయాణించే యువ ఉద్యోగులు, అందరికీ సరిపోయేలా డియో 110 డిజైన్, పనితీరు ఉన్నాయి. తేలికైన బాడీ, స్మూత్ రైడ్ క్వాలిటీ, మంచి మైలేజ్ వంటి అంశాలు దీనిని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నాయి.

చూడగానే ఈ బైక్‎తో లవ్‎లో పడిపోతారు

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో తన అత్యంత ప్రజాదరణ పొందిన పల్సర్ సిరీస్‌లో మరో సంచలన మార్పుతో ముందుకు వచ్చింది. ఇటీవలే పల్సర్ 150 మోడల్‌ను కొత్త హంగులతో అప్‌డేట్ చేసిన సంస్థ, ఇప్పుడు తన చిన్న తమ్ముడు పల్సర్ 125(Bajaj Pulsar 125)ను కూడా 2026 ఎడిషన్‌గా సరికొత్తగా ముస్తాబు చేసింది.

ఒక్క సారి ఛార్జింగ్ పెట్టి 100కిమీ తిరిగేయండి

ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో 17 ఏళ్ల అనుభవం ఉన్న గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (Greaves Electric Mobility)కి చెందిన అంపియర్ బ్రాండ్, సరికొత్త మాగ్నస్ జి మ్యాక్స్ (Magnus G Max) స్కూటర్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఈ స్కూటర్ ఇప్పటికే ఎనిమిది విభాగాల్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‎లో చోటు సంపాదించుకోవడం విశేషం. అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్లను అందించడం ఈ స్కూటర్ ప్రత్యేకత.
Advertisement

టాటా పంచ్ EVకి గట్టి పోటీ!.. విన్ఫాస్ట్ VF5 ఇండియా ఎంట్రీ

వియత్నాం‌కు చెందిన విన్‌ఫాస్ట్ (Vinfast) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకుని, విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు సహా విస్తృత శ్రేణి వాహనాలను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఆధునిక డిజైన్, టెక్నాలజీ, అలాగే గ్లోబల్ ప్రమాణాలకు తగ్గ భద్రతా ఫీచర్లతో ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. భారత మార్కెట్ విషయానికి వస్తే, ప్రస్తుతం విన్‌ఫాస్ట్ రెండు ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అధికారికంగా విక్రయిస్తోంది. అవి విన్‌ఫాస్ట్ VF6, విన్‌ఫాస్ట్ VF7. ఈ రెండు కార్లు కూడా డిజైన్, ఫీచర్లు, పనితీరు పరంగా ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తాయి.