టాటా పంచ్ EVకి గట్టి పోటీ!.. విన్ఫాస్ట్ VF5 ఇండియా ఎంట్రీ

వియత్నాం‌కు చెందిన విన్‌ఫాస్ట్ (Vinfast) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలలో ఒకటిగా ఎదిగింది. ఎలక్ట్రిక్ మొబిలిటీ భవిష్యత్తును లక్ష్యంగా పెట్టుకుని, విన్‌ఫాస్ట్ ఎలక్ట్రిక్ కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు సహా విస్తృత శ్రేణి వాహనాలను అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తోంది. ఆధునిక డిజైన్, టెక్నాలజీ, అలాగే గ్లోబల్ ప్రమాణాలకు తగ్గ భద్రతా ఫీచర్లతో ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. భారత మార్కెట్ విషయానికి వస్తే, ప్రస్తుతం విన్‌ఫాస్ట్ రెండు ఎలక్ట్రిక్ కార్లను మాత్రమే అధికారికంగా విక్రయిస్తోంది. అవి విన్‌ఫాస్ట్ VF6, విన్‌ఫాస్ట్ VF7. ఈ రెండు కార్లు కూడా డిజైన్, ఫీచర్లు, పనితీరు పరంగా ప్రీమియం సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తాయి.

టాటా పంచ్ అరాచకం భయ్యా

భారతీయ రోడ్ల మీద మైక్రో ఎస్‌యూవీ (Micro SUV)ల హవాను మొదలుపెట్టిన టాటా పంచ్ ఇప్పుడు మరింత శక్తివంతంగా, స్టైలిష్‌గా మన ముందుకు వచ్చింది. కేవలం బడ్జెట్ కారుగానే కాకుండా, ప్రీమియం ఫీచర్లతో 2026 మోడల్‌ను టాటా మోటార్స్ విడుదల చేసింది.

హ్యాచ్‌బ్యాక్ కార్లే ముద్దంటున్న బుద్ధిమంతులు

ప్రస్తుతం భారత కార్ల మార్కెట్లో ఎక్కడ చూసినా ఎస్‌యూవీల (SUV) హవానే నడుస్తోంది. పెద్ద టైర్లు, ఎత్తైన బాడీ, రోడ్డుపై వెళ్తుంటే అందరూ చూడాలనే కోరిక.. ఇవన్నీ ప్రజలను ఎస్‌యూవీల వైపు నడిపిస్తున్నాయి. అయితే, కేవలం షో కోసం కాకుండా.. ప్రాక్టికల్ గా ఆలోచించే వారు మాత్రం ఇప్పటికీ హ్యాచ్‌బ్యాక్ (Hatchback) కార్లనే ఇష్టపడుతున్నారు. నగరాల్లో ట్రాఫిక్ పెరిగిపోవడం, పార్కింగ్ సమస్యలు తలెత్తుతుండటంతో హ్యాచ్‌బ్యాక్ కార్ల విలువ మళ్ళీ పెరుగుతోంది. అసలు ఎస్‌యూవీ కంటే హ్యాచ్‌బ్యాక్ ఎందుకు మేలో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.6 లక్షల్లోపు దొరికే 7-సీటర్‌.. ఒక్క కారులో రెండు కుటుంబాలు

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఇటీవలి కాలంలో 7-సీటర్ MPV కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. పెద్ద కుటుంబాలకు అనువైన స్థలం, ప్రాక్టికాలిటీ, అలాగే బడ్జెట్‌కు సరిపోయే ధరల కారణంగా ఈ సెగ్మెంట్‌పై కస్టమర్ల ఆసక్తి మరింత పెరిగింది. ఈ క్రమంలో రెనాల్ట్ ట్రైబర్ భారత మార్కెట్‌లో ఒక బలమైన, విశ్వసనీయ ఎంపికగా తన స్థానాన్ని నిలుపుకుంటోంది. 7-సీటర్ MPV అయినప్పటికీ, ట్రైబర్ అందుబాటులో ఉండే ధరలతో రావడం దీనికి ప్రధాన బలం. అందుకే అన్ని వర్గాల వినియోగదారుల నుంచి ఈ కారుకు మంచి ఆదరణ లభిస్తోంది. ట్రైబర్‌కు ఉన్న ఈ డిమాండ్ అమ్మకాల గణాంకాల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి నెలా స్థిరమైన విక్రయాలతో ముందుకు సాగుతున్న ఈ MPV, డిసెంబర్ 2025లో కూడా అద్భుతమైన ప్రదర్శన చేసింది.
Advertisement

ఈ కారు కోసం షోరూంలకు క్యూ కడుతున్న జనం

భారతీయ వాహన రంగంలో జపాన్ దిగ్గజం టయోటాకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు టయోటా వాహనాలను చేరువ చేయడంలో మారుతి సుజుకితో ఉన్న భాగస్వామ్యం కీలక పాత్ర పోషించింది. ఈ కలయికలో వచ్చిన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ (Toyota Urban Cruiser Hyryder) ఇప్పుడు దేశంలో సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇంటర్నేషనల్ మార్కెట్లోకి అడుగుపెట్టిన మారుతి విక్టోరిస్ SUV

ఇటీవలే భారతీయ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టిన తన కొత్త విక్టోరిస్ (Victoris) SUVతో మారుతి సుజుకి మరోసారి తన మార్కెట్ శక్తిని నిరూపిస్తోంది. విడుదలైన తక్కువ సమయంలోనే ఈ SUVకు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన లభించడంతో పాటు, అమ్మకాలు కూడా ఆశించిన దానికంటే వేగంగా పెరుగుతున్నాయి. దేశీయ మార్కెట్‌లో మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా విక్టోరిస్‌పై మంచి నమ్మకం ఏర్పడిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కంపెనీ విక్టోరిస్ ఎగుమతులను అధికారికంగా ప్రారంభించింది. గుజరాత్‌లోని ముంద్రా, పిపావావ్ పోర్టుల నుంచి 450 యూనిట్లకు పైగా కార్లు ఇప్పటికే విదేశీ మార్కెట్లకు పంపించబడినట్లు మారుతి సుజుకి వెల్లడించింది.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.30వేలు తగ్గింది

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల హవా నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇటాలియన్ బ్రాండ్ అయిన వెలోసిఫెరో(Velocifero - VLF) తన వినూత్నమైన డిజైన్లతో కుర్రకారును ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా టెన్నిస్ అనే మోడల్ తన గ్లామరస్ లుక్‎తో ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ బ్రాండ్ తన కస్టమర్లకు ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఈ స్కూటర్ ధరపై ఏకంగా రూ.30,000ల భారీ తగ్గింపును ప్రకటించింది. దీంతో ఇప్పుడు ఈ స్టైలిష్ స్కూటర్ లక్ష రూపాయల లోపే అంటే రూ.99,999 (ఎక్స్-షోరూమ్) ధరకే అందుబాటులోకి వచ్చింది.

6 కొత్త అస్త్రాలను దింపబోతున్న కార్ కంపెనీలు

ప్రస్తుతం మార్కెట్లో SUVల ట్రెండ్ నడుస్తోంది. వచ్చే మరో రెండు వారాల్లో భారత ఆటోమొబైల్ రంగం సరికొత్త ఎస్‌యూవీల రాకతో సందడిగా మారబోతుంది. ఏకంగా మార్కెట్లోకి ఆరు సరికొత్త మోడళ్లు అడుగుపెడుతుండటంతో కారు లవర్లకు పండగ వాతావరణం నెలకొంది. రూ. 11 లక్షల నుంచి రూ. 50 లక్షల బడ్జెట్ వరకు, ఎలక్ట్రిక్ నుంచి పెట్రోల్ వేరియంట్ల వరకు అన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. మరి ఆ 6 అదిరిపోయే కార్ల వివరాలు, వాటి ఫీచర్లు, లాంచ్ డేట్స్ పై ఓ లుక్కేద్దాం.
Advertisement

కాంపాక్ట్ SUV మార్కెట్‌ను షేక్ చేస్తున్న కియా సోనెట్

కియా సోనెట్ (kia sonet) భారతీయ కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లలో ఒకటిగా నిలుస్తోంది. స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, అలాగే పెట్రోల్-డీజిల్ ఇంజిన్ ఎంపికలతో సోనెట్ యువతతో పాటు కుటుంబ వినియోగదారులను కూడా ఆకట్టుకుంటోంది. స్టైల్, ఫీచర్లు, పనితీరు అన్నింటిలోనూ సమతూకం ఉన్న కియా సోనెట్, నగర వినియోగంతో పాటు అప్పుడప్పుడు హైవే ప్రయాణాలకు కూడా సరిపోయే ఒక ఆల్‌రౌండ్ కాంపాక్ట్ SUVగా నిలుస్తోంది. డిసెంబర్ 2025 అమ్మకాల గణాంకాలు వెలువడిన తరువాత, కియా మోటార్స్‌కు చెందిన కాంపాక్ట్ SUV సోనెట్ మార్కెట్‌లో భారీ విజయాన్ని నమోదు చేసినట్లు స్పష్టమైంది.

ఈ కారుకు ఒక్కసారిగా భారీగా పెరిగిన డిమాండ్

భారత ఆటోమొబైల్ మార్కెట్లో బహుళార్ధసాధక వాహనాల (MPV) విభాగంలో ఒకప్పుడు మంచి గుర్తింపు సంపాదించుకున్న మహీంద్రా మరాజ్జో, ఇప్పుడు మళ్లీ బలమైన పునరాగమనం దిశగా అడుగులు వేస్తోంది. కొంతకాలంగా ఈ మోడల్ అమ్మకాల పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నప్పటికీ, 2025 ద్వితీయార్థంలో వచ్చిన సవాళ్లను అధిగమించిన తర్వాత, సంవత్సరం చివరి నెలల్లో మరాజో అమ్మకాల్లో స్పష్టమైన మార్పు కనిపించింది. ఇది మహీంద్రా ఈ MPVపై ఇంకా నమ్మకం కోల్పోలేదని, మార్కెట్‌లో మళ్లీ స్థిరపడేందుకు ప్రయత్నిస్తున్నదనే సంకేతాలను ఇస్తోంది. ప్రత్యేకంగా డిసెంబర్ 2025 నెలలో మహీంద్రా మరాజ్జో ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది.

ఆంధ్రప్రదేశ్‌కు మరో హైటెక్ గిఫ్ట్.. ఫ్లయింగ్ టాక్సీ తయారీ యూనిట్

భారతదేశంలోని పట్టణ రవాణా వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా ఒక కీలకమైన ముందడుగు పడబోతోంది. ట్రాఫిక్ సమస్యలు, ప్రయాణ సమయం పెరుగుదల వంటి సవాళ్లకు పరిష్కారంగా త్వరలోనే ప్రధాన నగరాల్లో ఎగిరే టాక్సీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విప్లవాత్మక మార్పుకు బీజం వేస్తూ, సరళ ఏవియేషన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం, అనంతపురం జిల్లాలో అత్యాధునిక eVTOL (ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్) ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ కేంద్రంను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే బెంగళూరులో తన ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ ప్రోటోటైప్‌ను విజయవంతంగా పరీక్షించిన సరళ ఏవియేషన్, ఇప్పుడు వాటిని వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ తయారీ కేంద్రం ఏర్పాటు కోసం కంపెనీ దాదాపు రూ.1,300 కోట్ల భారీ పెట్టుబడిని వెచ్చించనుంది.

ఇది పేదవాడి స్కూటర్.. రూ.76 వేలకి కొనవచ్చు

టీవీఎస్ జూపిటర్ 110 (Tvs Jupiter 110) భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో ఒక అత్యంత విశ్వసనీయమైన, ప్రజాదరణ పొందిన స్కూటర్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా రోజువారీ వినియోగానికి అనువుగా రూపొందించబడిన ఈ స్కూటర్, ఆఫీస్ ప్రయాణాలు, షాపింగ్, పిల్లల స్కూల్ డ్రాప్‌లు వంటి రోజువారీ అవసరాలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ కారణంగానే దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వినియోగదారులు జూపిటర్ 110ను ఎంచుకుంటున్నారు. కస్టమర్ల నుంచి కూడా ఈ స్కూటర్‌కు మంచి స్పందన, ప్రశంసలు లభిస్తున్నాయి. మీరు కొత్త స్కూటర్ కొనాలనే ఆలోచనలో ఉన్నట్లయితే, నమ్మకమైన బ్రాండ్, మంచి రైడ్ కంఫర్ట్, సరసమైన ధర కలిగిన వాహనం కావాలంటే టీవీఎస్ జూపిటర్ 110 ఒక ఉత్తమ ఎంపికగా చెప్పుకోవచ్చు.
Advertisement

త్వరలో రానున్న టాటా సఫారీ EV.. రేంజ్, ఫీచర్లు, ధర వివరాలు ఇవే!

టాటా సఫారీ (tata safari) భారతీయ ఆటోమొబైల్ మార్కెట్‌లో ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ఫ్యామిలీ SUV. బలమైన రోడ్ ప్రెజెన్స్, విశాలమైన కేబిన్, అలాగే దూర ప్రయాణాలకు సరిపోయే కంఫర్ట్ కారణంగా ఈ వాహనానికి సంవత్సరాలుగా మంచి డిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం టాటా సఫారీ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలలో అందుబాటులో ఉండటంతో, వివిధ రకాల వినియోగదారుల అవసరాలను తీర్చగలుగుతోంది. పెద్ద కుటుంబాలు, అలాగే స్టైలిష్ అయినప్పటికీ ప్రాక్టికల్ SUV కావాలనుకునే వారు సఫారీని ఇష్టపూర్వకంగా ఎంచుకుంటున్నారు. అమ్మకాల గణాంకాలు కూడా సఫారీకి ఉన్న స్థిరమైన ఆదరణను స్పష్టంగా చూపిస్తున్నాయి.

స్కార్పియో తర్వాత అదే క్రేజ్.. బొలెరో సేల్స్‌లో భారీ జంప్

2025 క్యాలెండర్ సంవత్సరం భారతీయ SUV మార్కెట్‌లో మహీంద్రా & మహీంద్రా (M&M) కోసం ఒక మైలురాయిగా నిలిచింది. గత కొన్ని సంవత్సరాలుగా బలమైన ఉత్పత్తులు, వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకున్న డిజైన్‌లు, అలాగే విశ్వసనీయతపై పెట్టిన ప్రత్యేక దృష్టి కారణంగా మహీంద్రా దేశీయ మార్కెట్‌లో తన స్థానం మరింత పటిష్టం చేసుకుంది. ఫలితంగా, గత సంవత్సరం హ్యుందాయ్, టాటా మోటార్స్‌లను వెనక్కి నెట్టి, భారతదేశంలో రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా అవతరించడం కంపెనీకి ఒక గొప్ప విజయంగా నిలిచింది. ముఖ్యంగా 2025 చివరి నెల అయిన డిసెంబర్‌లో మహీంద్రా ప్రదర్శన అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్క నెలలోనే అర లక్షకు పైగా వాహనాలను విక్రయించడం ద్వారా కంపెనీ తన అమ్మకాల శక్తిని మరోసారి నిరూపించింది.

5 సీటర్లను వద్దని 7 సీటర్ల వైపు క్యూ కట్టిన జనం

భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్‌లో టయోటా (Toyota) బ్రాండ్ అంటేనే ఒక నమ్మకం. ముఖ్యంగా ఆ బ్రాండ్ నుంచి వచ్చే పెద్ద కార్లు, 7-సీటర్ వాహనాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా విడుదలైన 2025 డిసెంబర్ సేల్స్ రిపోర్ట్ చూస్తుంటే, భారతీయ కస్టమర్లు టయోటా 5-సీటర్ కార్ల కంటే 7-సీటర్ కార్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. అసలు టయోటా అమ్మకాల సునామీ ఎలా ఉంది? ఏ కారు ఎన్ని యూనిట్లు అమ్ముడైంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల వద్ద కొత్త రూల్స్

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇచ్చింది. ఇకపై టోల్ ప్లాజాల వద్ద చిల్లర కష్టాలు, క్యూ లైన్లలో గంటల తరబడి నిరీక్షణకు కాలం చెల్లిపోనుంది. 2026, ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న టోల్ ప్లాజాల వద్ద నగదు చెల్లింపులను పూర్తిగా నిలిపివేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. డిజిటల్ ఇండియాలో భాగంగా టోల్ వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యం.
Advertisement

భారీగా తగ్గనున్న టెస్లా కార్ల ధరలు

ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉంది. అయితే, తాజాగా ఎలన్ మస్క్ సారథ్యంలోని ఈ సంస్థ భారతీయ కస్టమర్ల కోసం ఒక అదిరిపోయే వార్తను మోసుకొచ్చింది. తన పాపులర్ మోడల్ అయిన టెస్లా మోడల్ Y(Tesla Model Y) ధరను ఏకంగా రూ.2 లక్షల వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.

సింగిల్ ఛార్జ్‎తో వారం మొత్తం తిరగొచ్చు

బజాజ్ చేతక్ C25 సమీక్ష: క్లాసిక్ డిజైన్‌తో కూడిన ఆచరణాత్మక, నమ్మదగిన ఎలక్ట్రిక్ స్కూటర్. నగర వినియోగదారులకు త్వరిత ఛార్జింగ్ సమయం ఒక ప్లస్ పాయింట్.

ఆటో కంటే తక్కువ ధరకే ఎలక్ట్రిక్ కారు

టాటా నానో.. సామాన్యుడి కారు కలని నిజం చేసిన పేరు. ఇప్పుడు అదే నానో రూపాన్ని గుర్తుకు తెచ్చేలా ఒక సరికొత్త ఎలక్ట్రిక్ కారు భారత రోడ్లపై సందడి చేస్తోంది. హర్యానాకు చెందిన బ్లింక్ మొబిలిటీ (Blinq Mobility) అనే స్టార్టప్ కంపెనీ, ఒక సాధారణ ఆటో రిక్షా ధరకే ఎలక్ట్రిక్ కారును అందించాలనే లక్ష్యంతో పాడ్(Pod) అనే మైక్రో ఎలక్ట్రిక్ కారును రూపొందించింది. ప్రస్తుతం ఈ కారు ప్రోటోటైప్ టెస్టింగ్ దశలో ఉండగా, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement

భారతదేశం కార్లను కొనడానికి ఎగబడుతున్న విదేశీయులు

భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమ ఇప్పుడు దేశీయ మార్కెట్‌కే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుతోంది. ఒకప్పుడు భారత్‌లో తయారైన వాహనాలు ప్రధానంగా దేశీయ అవసరాలకే వినియోగించబడేవి. కానీ కాలక్రమేణా టెక్నాలజీ, నాణ్యత, భద్రత ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ఖర్చు పరంగా కూడా పోటీగా ఉండటంతో, భారతీయ వాహనాలకు ప్రపంచ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇదే కారణంగా, భారతీయ ఆటోమొబైల్ తయారీదారులు తమ ఉత్పత్తులను ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ వంటి అనేక దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, సొసైటీ ఆఫ్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఇండియా (SIAM) తాజాగా విడుదల చేసిన గణాంకాలు పరిశ్రమలో జరుగుతున్న వృద్ధిని స్పష్టంగా చూపిస్తున్నాయి.

బ్యాటరీ ఛార్జింగ్ టెన్షన్ ఇక లేదు

వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ (VinFast), భారత టూ-వీలర్ మార్కెట్‌లో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే తమిళనాడులోని తూత్తుకుడిలో భారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఈ సంస్థ, ఇప్పుడు ఒకేసారి 4 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను పరిచయం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. కేవలం స్కూటర్లను అమ్మడమే కాకుండా, ఛార్జింగ్ సమస్యకు పరిష్కారంగా దేశవ్యాప్తంగా భారీ బ్యాటరీ స్వాపింగ్ నెట్‌వర్క్‌ను కూడా సిద్ధం చేస్తోంది.

రికార్డుల ఊచకోత..అమ్మకాల్లో అరాచకం

భారతదేశ టూ వీలర్ మార్కెట్‌లో ఎవరూ ఊహించని ఒక భారీ మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా నంబర్ 1 పీఠం కోసం పోటీ పడుతున్న హీరో మోటోకార్ప్, హోండా మోటార్ సైకిల్స్ సంస్థలకు షాక్ ఇస్తూ.. మన తమిళనాడుకు చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ (TVS Motor Company) అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

ఫ్యామిలీ కార్ మార్కెట్‌లో కియా సూపర్ హిట్

కియా కారెన్స్ భారత ఆటోమొబైల్ మార్కెట్లో కుటుంబ వినియోగదారుల మధ్య ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న MPVగా నిలిచింది. స్టైల్, స్పేస్, ఫీచర్లు, భద్రత అన్నింటినీ సమతుల్యం చేస్తూ, ఇది మధ్యతరగతి నుంచి ప్రీమియం కస్టమర్ల వరకు విస్తృత వర్గాన్ని ఆకర్షిస్తోంది. ప్రస్తుతం కియా కారెన్స్ మూడు వెర్షన్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. అవి స్టాండర్డ్ కియా కారెన్స్, మరింత ప్రీమియం టచ్‌తో వచ్చిన కియా కారెన్స్ క్లావిస్, పర్యావరణహిత టెక్నాలజీతో రూపొందించిన కియా కారెన్స్ క్లావిస్ EV. ఈ మూడు వెర్షన్లూ కలిసి బ్రాండ్‌కు మంచి అమ్మకాల బలాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా విడుదలైన డిసెంబర్ 2025 నెల అమ్మకాల నివేదిక కియా కారెన్స్ విజయాన్ని మరోసారి రుజువు చేసింది.
Advertisement

ఇది పేదవాడి కారు.. 4.70 లక్షల రూపాయలు

మారుతి సుజుకి సెలెరియో (maruti suzuki celerio) భారత మార్కెట్‌లో చాలా కాలంగా మంచి పేరు సంపాదించుకున్న హ్యాచ్‌బ్యాక్. ముఖ్యంగా మంచి మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చులు కావాలనుకునే వినియోగదారులకి ఇది నమ్మకమైన కారుగా నిలిచింది. రోజువారీ వినియోగానికి సరిపోయే సైజ్, సులభమైన డ్రైవింగ్ అనుభూతి, మారుతి బ్రాండ్‌పై ఉన్న విశ్వాసం కలసి సెలెరియోను మధ్యతరగతి కుటుంబాల్లో ఒక ప్రజాదరణ పొందిన ఎంపికగా మార్చాయి. మీరు ఇప్పుడు కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఎక్కువ ఖర్చు పెట్టకుండా, అవసరమైన అన్ని అంశాలు కలిగిన కారును కోరుకుంటే కొత్త మారుతి సెలెరియో నిజంగా ఒక ఉత్తమ ఎంపికగా చెప్పొచ్చు. ట్రాఫిక్ మధ్య సులభంగా నడపడానికి అనుకూలంగా ఉండటం, అలాగే పార్కింగ్ కూడా పెద్ద కష్టమేమీ లేకుండా చేయగలగడం ఈ కారుకు ఉన్న ప్రధాన ప్లస్ పాయింట్లు.