రూ.79వేలకే ఫుల్ ట్యాంక్ పై 600కిమీ మైలేజ్ బైక్
ఆటోమొబైల్స్
- 8 month, 1 day ago
బడ్జెట్ ధరలో స్టైలిష్ బైక్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు బజాజ్ పల్సర్ సిరీస్‌లో ఒక అదిరిపోయే ఆప్షన్ అందుబాటులో ఉంది. పల్సర్ అంటేనే కుర్రాళ్ల క్రేజ్.. ఆ బ్రాండ్ వాల్యూనే వేరు. అయితే పల్సర్ అనగానే లక్షన్నర దాటుతుందని చాలామంది భయపడతారు. కానీ బజాజ్ కంపెనీ సామాన్యుల కోసం, ముఖ్యంగా కాలేజీ కుర్రాళ్లు, ఆఫీసుకి వెళ్లేవారి కోసం అత్యంత చౌకైన మోడల్‌ను మార్కెట్లో ఉంచింది. అదే బజాజ్ పల్సర్ 125 నియాన్ సింగిల్ సీట్ (Bajaj Pulsar 125 Neon Single Seat). తక్కువ ధర, భారీ మైలేజ్ ఇచ్చే ఈ బైక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.