18 ఏళ్ల క్రితం గజాలా.. ఇప్పుడు రాజమౌళి.. అనుకోకుండా జరిగింది.. ఎన్టీఆర్ సెన్సేషనల్ కామెంట్స్
ఎంటర్ టైన్మెంట్
- 27 days ago
స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సక్సెస్ సాధించిన రాజమౌళి- ఎన్టీఆర్ జోడీ ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ సినిమాలతో అలరించారు. మళ్ళీ ఇప్పుడు RRR అనే భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నారు. జక్కన్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.ఈ నేపథ్యంలో 2001లో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కోసం ఇదే రామోజీ ఫిలింసిటీలో తీసిన ఓ సన్నివేశాన్ని, ఇప్పుడు RRR కోసం తీయబోతున్న ఓ సన్నివేశాన్ని పోల్చుతూ రేర్ పిక్ షేర్ చేశారు ఎన్టీఆర్.