న్యూఇయర్‌లోకి తొలుత అడుగుపెట్టేది న్యూజిలాండ్ కాదు.. మరి ఏదేశమో తెలుసా..?
భారత్
- 15 days ago
మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రపంచ దేశాలు ఇప్పటికే న్యూ ఇయర్‌కు గ్రాండ్ వెల్కమ్ పలికేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఒక్కో దేశంలో ఒక్కో సమయం ఉండటం వల్ల ఆయా దేశాలు మనకంటే ముందుగానే న్యూఇయర్‌కు స్వాగతం పలకనున్నాయి. అయితే ముందుగా ఏదేశం నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతుందో తెలుసుకుందాం...సాధారణంగా ఆస్ట్రేలియా సిడ్నీ హార్బర్‌పై బాణా సంచా పేలగానే కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమవుతాయని, నూతన సంవత్సర వేడుకలను తొలుత జరుపుకునే దేశం ఆస్ట్రేలియా అని చాలా మంది భావిస్తారు.