వెనుక నుంచి చూసినా వావ్ అనాల్సిందే.. వోల్వో XC60 ఫేస్‌లిఫ్ట్ రేపే విడుదల!

ప్రసిద్ధ కార్ల తయారీదారు అయినటువంటి వోల్వో (Volvo) తన మిడ్-సైజ్ లగ్జరీ SUV అయిన XC60 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ (Xc60 Facelift)ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1, 2025న ఈ కొత్త మోడల్ విడుదల కానుంది. ఇది ప్రస్తుతం అమ్ముడవుతున్న XC60కి రెండోసారి వచ్చిన ముఖ్యమైన అప్‌డేట్ కావడం విశేషం. XC60 ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ వోల్వో లగ్జరీ SUV శ్రేణిలో ఫ్లాగ్‌షిప్‌గా నిలుస్తుంది. కొత్తగా రానున్న మోడల్ పూర్తిగా డిజైన్‌ను మార్చకపోయినా, దాని డిజైన్ మరింత ఆధునీకరించడంలో వోల్వో ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. అతి ముఖ్యంగా ఫ్రంట్ గ్రిల్ డిజైన్, హెడ్‌ల్యాంప్‌ల రూపం, అలాగే బంపర్ డిజైన్ కొద్దిగా మారినట్లు సమాచారం. అంతే కాదు, అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా కొత్తగా కనిపించనుంది.

కొత్త బైక్ కొనాలనుకుంటున్నావా? ఇవే ఇప్పుడు మార్కెట్లో హాట్ టాపిక్

ప్రస్తుతం టూవీలర్ లేనిదే రోజులు గడవట్లేదు. మార్కెట్, ఉద్యోగాలు, పిల్లల స్కూల్ డ్రాప్ మొదలగు అన్ని అవసరాలకు కూడా తప్పనిసరిగా బైక్ లేదా స్కూటర్ ఇంట్లో ఉండాల్సిందే. ప్రధానంగా బైకులు ఎక్కువ మైలేజ్ అందించడం కారణంగా వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో తయారీదారులో పోటా పోటీగా తమ అధునాతన ఫీచర్స్, డిజైన్‌తో కూడిన బైకులను విడుదల చేస్తున్నాయి. ప్రతి నెలా లక్షల బైక్‌లు అమ్ముడవుతుండగా, ముఖ్యంగా 100cc నుంచి 125cc స్లాట్‌లో గిరాకీ ఊహించదగిన స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో హోండా మోటార్‌సైకిల్ ఇండియా, హీరో మోటోకార్ప్ తీవ్రంగా పోటీ పడే ఈ మార్కెట్లో, కొత్త మోటార్‌సైకిళ్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాటి గురించి ఈ కథనంలో చూద్దాం.

ఆగస్ట్‌లో అదిరే కార్ల లాంచ్‌లు.. పండగ సీజన్ కోసం కొత్త మోడల్స్ రెడీ

నేటితో జూలై నెల ముగియనుంది. ఆగస్టు రాబోతోంది. జూలైలో లాగే ఆగస్టు నెలలో కూడా కొన్ని అదిరిపోయే కొత్త కార్లు రాబోతున్నాయి. వాస్తవానికి ఆగస్టు నెల అంటే భారతదేశంలో వాహనాల విక్రయాలు జోరుగా సాగే పండుగ సీజన్‌కు నాంది. అందుకే ఆగస్టు నుండి కొత్త వాహనాల లాంచ్‌లు వరుసగా మొదలవుతాయి. కాబట్టి రేపటి నుండి, అంటే 2025 ఆగస్టు నెలలో విడుదల కాబోయే కార్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వెయిటింగ్ అయిపోయింది.. టాటా హారియర్ EV మీకు డోర్ డెలివరీ!

టాటా మోటార్స్ (Tata Motors) దేశీయంగా నమ్మకానికి నిలయంగా పేరొందిన ఆటోమొబైల్ బ్రాండ్. ప్రయాణికుల సేఫ్టీకి ఇది అత్యంత ప్రాధాన్యత అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది. ఇంధన ఆధారిత వాహనాలను విడుదల చేస్తూనే, అదే సమయంలో ఎలక్ట్రిక్ విభాగంలో కూడా ఇండియాలోనే అగ్రస్థానంలో ఉంది. ఇప్పటికే పలు ఈవీ కార్లను విక్రయిస్తున్న కంపెనీ ఇటీవల టాటా హారియర్ ఈవీ (tata harrier Ev)ని మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ కార్ల విభాగంలో పటిష్ట స్థానాన్ని పొందాలన్న టాటా లక్ష్యానికి ఇది బలమైన మెరుగుదల. వాగమోన్‌లోని ఏనుగు కొండను అధిరోహించిన తర్వాత, ఈ SUV దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ టెస్ట్ డ్రైవ్ విజయం టాటా హారియర్ EV సామర్థ్యాన్ని, ఎలక్ట్రిక్ కార్లలో కూడా కారు సత్తాను నిరూపించింది.
Advertisement

అదిరిపోయే ఫీచర్లతో కియా కారెన్స్ ఈవీ 6సీటర్ వచ్చేస్తోంది

భారతీయ వినియోగదారుల భారీ అంచనాల మధ్య, కియా కెరెన్స్ క్లావిస్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ఇటీవల మార్కెట్‌లోకి ప్రవేశించింది. ప్రస్తుతం ఈ కారు 7 సీటర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, త్వరలోనే కియా కెరెన్స్ క్లావిస్ ఈవీ 6 సీటర్ ఆప్షన్ కూడా మార్కెట్‌లోకి రాబోతున్నట్లు సమాచారం. ఈ 6 సీటర్ మోడల్ HTX+ ER వేరియంట్ ఆధారంగా రూపొందించబడే అవకాశం ఉంది.

దేశంలో 50 లక్షల యూనిట్లు అమ్ముడైన ఏకైక కారు.. అదే మారుతి ఆల్టో!

భారతదేశంలో సాధారణంగా మధ్య తరగతి జనాభా ఎక్కువగా ఉంటారు. వీరంతా కోట్లు కోట్లు పెట్టి ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం కష్టం. కాబట్టి వారికి అందుబాటు ధరలో లభించే కార్లంటేనే చాలా ఇష్టం. మంచి మైలేజ్, తక్కువ ధర, మెరుగైన పెర్ఫామెన్స్ అందించేవి వారికి ఫేవరెట్ కార్లు. వాటిలో మారుతి కంపెనీకి చెందినవి ఎక్కువగా ఉంటాయి. స్విఫ్ట్, వ్యాగన్ఆర్, డిజైర్ వంటివి ఉంటయి. దేశంలో ఇప్పటివరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల జాబితాలో కూడా ఇవి ఉన్నాయి. ఇవన్నీ భారత్ మార్కెట్‌లో గణనీయమైన విజయాన్ని సాధించిన మోడల్స్ అన్నది నిజమే. కానీ దేశంలోని అగ్రగామి, అత్యధికంగా అమ్ముడైన కారు మాత్రం వీటిలో ఏదీ కాదు! ఈ ఘనత సాధించింది ఒక లెజెండరీ మోడల్ మారుతి సుజుకి ఆల్టో (maruti suzuki Alto).

వర్షాకాలంలో కారు డ్రైవింగ్.. ఈ తప్పులు చేస్తే భారీ నష్టం!

వర్షాకాలం వచ్చిందంటే చాలు, వాతావరణం చల్లబడి ఎంతో రిలీఫ్‌గా అనిపిస్తుంది. కానీ మరోవైపు రోడ్లన్నీ నీటితో నిండిపోయి, డ్రైవింగ్ చేయడం కష్టంగా మారుతుంది. వర్షంలో కారు నడిపేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోకపోతే, మీరు కష్టాల్లో పడవచ్చు. మీ కారు ఇంజిన్ పాడై, వేల రూపాయలు ఖర్చు చేయాల్సి రావచ్చు. వర్షాకాలంలో కారు నడిపేటప్పుడు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన చిట్కాలు ఏమిటో వివరంగా ఈ వార్తలో తెలుసుకుందాం.

లోకల్ నుండి గ్లోబల్ కు గ్రామీణ మహిళల వ్యాపారాలు విస్తరిస్తున్న ఏఐ.. ఎలాగంటే

AI ఆధారిత ప్లాట్‌ఫారమ్‌లు గ్రామీణ మహిళా వ్యాపారవేత్తలకు వారి మార్కెట్ పరిధిని విస్తరించడం మరియు వ్యాపార సామర్థ్యాన్ని మెరుగుపరచడం ద్వారా సాధికారత కల్పిస్తున్నాయి.

హెల్మెట్ పెట్టుకోలేకపోతే బైక్ నడవదు.. ఇందోర్‌లో న్యూ రూల్!

భారతదేశంలో రోడ్డుప్రమాదాల కారణంగా ప్రతి సంవత్సరం వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విషాదకరంలో అత్యధికంగా ప్రాణనష్టం జరగడం టూవీలర్ వాహనదారులకే సంబంధించినది. ముఖ్యంగా హెల్మెట్‌ లేకుండా బైక్‌లు నడిపే వారు ప్రమాదంలో పడే అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రాలు ఎన్ని సూచనలు ఇచ్చినా కొంతమంది మాత్రం హెల్మెట్ ధరించడాన్ని లైట్‌గా తీసుకుంటున్నారు. ఈ తరహా నిర్లక్ష్యాన్ని నివారించేందుకు ప్రభుత్వం ఇప్పుడు మరింత కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందులో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్ జిల్లా యంత్రాంగం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్‌ నిబంధనలపట్ల ప్రజల్లో బాధ్యతాభావం పెంపొందించాలన్న ఉద్దేశంతో, "హెల్మెట్ లేకుంటే పెట్రోలు లేదు (No helmet no petrol)" అనే వినూత్న విధానాన్ని అమలు చేయబోతున్నారు.

ఫోక్స్‌వ్యాగన్ బంపర్ ఆఫర్.. టిగువాన్ R లైన్ పై రూ. 3 లక్షలు ఆదా

జులై నెలలో కార్లు, ఎస్‌యూవీలపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. తక్కువ ధరల కార్ల నుంచి ప్రీమియం కార్ల వరకు భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. వీటిలో అన్నింటికన్నా ఆకర్షణీయమైన ఆఫర్ ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ Rలైన్ పై ఉంది. కేవలం 90రోజుల క్రితం అంటే మూడు నెలల క్రితం రూ.49లక్షల (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ పవర్‌ఫుల్ SUV ఇప్పుడు ఏకంగా రూ. 3 లక్షల తగ్గింపుతో లభిస్తోంది.

వర్షాకాలం వాటర్ హీటర్స్ వాడుతున్నారా? హీటర్ వాడకంలో ఈ తప్పులు చెయ్యొద్దు

భారతదేశంలో లోపభూయిష్టమైన వాటర్ హీటర్లకు సంబంధించిన ఇటీవలి సంఘటనలు భద్రతా ఆందోళనలను పెంచుతున్నాయి, నియంత్రణ మరియు నిర్వహణపై వినియోగదారుల అవగాహన కోసం పిలుపునిచ్చాయి.

AOP, COP పాయింట్లు అంటే ఏమిటి? వాటి ప్రాముఖ్యత ఏంటి?

కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కార్ల సేఫ్టీ రేటింగ్స్ చూసే ఉంటారు కదా? ఇండియాలో ఇప్పుడు భారత్ NCAP టెస్టులు జరుగుతున్నాయి. వీటిల్లో కార్లకు స్టార్ రేటింగ్‌లు ఇస్తారు. అయితే, కేవలం 5 స్టార్ రేటింగ్ చూసి కారును కొనేస్తే సరిపోదు. ఆ రేటింగ్‌తో పాటు AOP, COP పాయింట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటి? వాటిని ఎందుకు చూడాలి? ఈ వార్తలో వివరంగా తెలుసుకుందాం.
Advertisement

మన టీచర్లు వెరీ వెరీ పూర్ అండీ బాబు

ఇటీవలి సర్వే ప్రకారం, 70% భారతీయ విద్యావేత్తలు తరగతుల్లో AI సాధనాలను ఉపయోగిస్తున్నారని వెల్లడించింది, ఇది శిక్షణ మరియు అవగాహన అవసరాన్ని హైలైట్ చేస్తుంది.

ఒకే లీటరుతో ఏకంగా 85 కిలోమీటర్లు.. అందుకే జూన్‌లో అద్భుతమైన సేల్స్!

దేశీయ దిగ్గజ టూవీలర్ తయారీదారు అయినటువంటి టీవీఎస్ (Tvs) భారతీయుల కోసం రోజువారి అవసరాలకు ఉపయోగపడే టూవీలర్స్‌ను విక్రయించడంలో ఎప్పుడు కూడా ముందు ఉంటుంది. ఈ కంపెనీకి సంబంధించిన సేల్స్ మెరుగ్గానే నమోదవుతున్నాయి. తన ప్రసిద్ధ మోడల్ స్టార్ సిటీ ప్లస్ (Star City Plus)కు సంబంధించి సేల్స్ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, జూన్ 2025లో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ మరోసారి తన మార్కెట్‌లోని స్థానం ఎంత బలమైనదో నిరూపించుకుంది. ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ సెగ్మెంట్‌లో దీర్ఘకాలంగా ఉన్న ఈ బైక్, తన సదుపాయాలు, మైలేజ్, నమ్మకమైన పనితీరుతో వినియోగదారుల మనసు గెలుచుకుంటూనే ఉంది. జూన్ 2025లో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ బైక్‌లు ఏకంగా 2,400 యూనిట్లు అమ్ముడయ్యాయి.

ఫ్యామిలీకి ఒక స్కూటర్ కావాలా? సేఫ్, స్టైలిష్, స్పేస్ కలిపిన జూమ్ 160!

హీరో మోటోకార్ప్ (Hero Motocorp) తన టూవీలర్ విభాగంలో నంబర్ వన్ తయారీదారుగా భారత మార్కెట్లో మంచి స్థానం సంపాదించుకుంది. బైక్ విభాగంలో ఇప్పటికే తిరుగులేని పేరు సంపాదించుకున్న ఈ సంస్థ, ఇప్పుడు స్కూటర్ విభాగంపైనా దృష్టి సారించింది. ఈ క్రమంలో జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో, హీరో జూమ్ 160 (Hero Xoom 160) అనే స్టైలిష్, పవర్‌ఫుల్ స్కూటర్‌ను సంస్థ ప్రదర్శించింది. డైనమిక్ డిజైన్, స్పోర్టీ బిల్డ్, ప్రీమియం లక్షణాలతో, ఈ స్కూటర్ అప్పటినుంచి యువతలో మంచి క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ అడ్వెంచర్-స్టైల్ స్కూటర్ ఈ ఏడాది ప్రారంభంలోనే లాంచ్ అయింది. లాంచ్ అయినప్పటికి కూడా దాని బుకింగ్స్‌ను అప్పుడు ప్రారంభించలేదు. అయితే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వారికి ఇది ఒక శుభవార్తే. తాజాగా కంపెనీ దీని బుకింగ్స్‌ను ప్రారంభించింది.

పండుగ సీజన్లో కొనేందుకు లక్షలోపు బెస్ట్ స్కూటర్లు ఇవే

ఈ ఏడాది వరలక్ష్మి వ్రతం పండుగ ఆగస్టు 8న వస్తోంది. పండుగకు బంగారం కాకుండా, రోజూ వాడటానికి కొత్త స్కూటర్ కొందామని ఆలోచిస్తున్నారా? అయితే లక్ష రూపాయలలోపు (ఎక్స్-షోరూం ధర) దొరికే కొన్ని బెస్ట్ స్కూటర్ల వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం. హోండా యాక్టివా 125, సుజుకి యాక్సెస్ 125, టీవీఎస్ జూపిటర్ 125, హీరో డెస్టిని 125, హోండా క్యూసి1 స్కూటర్లు బెస్ట్ ఛాయిస్ కావచ్చు. వీటి ధరలు, ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

మీరు ఎదురుచూసింది ఇదేనా? ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ డెలివరీలు మొదలయ్యాయి!

భారత మార్కెట్లో మిడ్-సైజ్ MPV సెగ్మెంట్‌కి సంబంధించి, రెనాల్ట్ ట్రైబర్ మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా 2025 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌కి సంబంధించి భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మోడల్ ఇప్పటికే మార్కెట్లో సందడి చేస్తోంది. కొత్తగా వచ్చిన ఈ వేరియంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా రెనాల్ట్ షోరూమ్‌లకు రీచ్ అవుతోందని కార్దేఖో వెబ్‌సైట్ నివేదించింది. ఈ కారును బుకింగ్ చేసుకున్న వినియోగదారులకు ఇది శుభవార్త అని చెప్పవచ్చు. 2025 ట్రైబర్ ఫేస్‌లిఫ్ట్ వేరియంట్ మరింత ఆకర్షణీయమైన రూపంలో, ఇంకా మరింత ఫీచర్‌లతో మార్కెట్లో అడుగుపెట్టింది. ఈ కారులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది దీని ధర. ప్రారంభ వేరియంట్‌ ధర కేవలం రూ.6.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి మొదలవుతుండగా, టాప్ వేరియంట్ ధర రూ.9.40 లక్షల వరకు చేరుతుంది.

కరెంట్ పోయినా ఈవీలు పొలంలో మోటార్లను కూడా నడిపిస్తున్నాయ్

ఎలక్ట్రిక్ వెహికల్ కొనేటప్పుడు ప్రతి ఒక్కరు ఇంధన ఖర్చులను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని అనుకుంటారు. కానీ, ఈవీలు కొంటే ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. మీ కరెంట్ కారును ఉపయోగించి మరో ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా నడపగలరు. ఏంటి నమ్మడం లేదా.. కానీ ఇది నిజం. ఇదే V2L టెక్నాలజీ. ఈ సిస్టమ్ ద్వారా మీరు కారులోని బ్యాటరీ నుంచి ఇతర వస్తువులకు కరెంటు తీసుకోవచ్చు.

అంజీర్ పండ్ల‌ను తింటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!!

భారతదేశంలో నానబెట్టిన అంజీర్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలను కనుగొనండి, వాటిలో గట్ ఆరోగ్యం, జీర్ణక్రియ, మరియు బరువు నిర్వహణ ఉన్నాయి. మీ ఆహారానికి పోషకమైన అదనం.

జూన్‌లో టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాల్లో తగ్గిన జోరు

టీవీఎస్ మోటార్(Tvs Motor) కంపెనీ భారత్‌లో ప్రముఖ టూవీలర్ తయారీదారుగా ఉంది. అందరికి అందుబాటు ధరలో, అతి తక్కువ ధరలో బైకులు, స్కూటర్లను విక్రయిస్తూ హీరో, హోండా వంటి కంపెనీలకు బలమైన పోటీదారుగా నిలుస్తుంది. అమ్మకాల పరంగా కూడా టీవీఎస్ దూసుకుపోతుంది. దీనికి నిదర్శనంగా జూన్ 2025లో సాధించిన సేల్స్ గణాంకాలు పరిశీలిస్తే, మార్కెట్లో తన స్థిరతను మరోసారి నిరూపించుకున్నట్లు కనిపిస్తోంది. జూన్ 2024తో పోల్చితే, ఈసారి టీవీఎస్ తన అమ్మకాలలో 9.89 శాతం వృద్ధిని సాధించింది. జూన్ 2025 నెలలో కంపెనీ మొత్తం 2,81,012 యూనిట్ల విక్రయాలతో గణనీయమైన పురోగతిని నమోదు చేసింది. అంటే గతేడాది ఇదే నెలలో విక్రయించిన 2,55,723 యూనిట్ల కంటే 25,289 యూనిట్లు ఎక్కువ అమ్ముడయ్యాయి.
Advertisement

ఎక్కువ మైలేజ్ ఇస్తోంది..100లో 81 మంది ఈ కంపెనీ కారే కొంటున్నారు!

ఇటీవలి కాలంలో భారతదేశంలో హైబ్రిడ్ కార్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. మైలేజ్ ఎక్కువ ఇవ్వడం, పర్యావరణానికి మంచిది కావడం వంటి కారణాలతో వీటిని కొనేవారు పెరుగుతున్నారు. ఈ హైబ్రిడ్ సెగ్మెంట్‌లో టయోటా కంపెనీ ఏకంగా 81% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ముఖ్యంగా టయోటా హైక్రాస్ కారు బాగా అమ్ముడవుతోంది. ఈ హైబ్రిడ్ కార్ల మార్కెట్ ఎలా పెరుగుతోంది, ఏ కంపెనీలు ఎలా రాణిస్తున్నాయో తెలుసుకుందాం.

టాప్ 10 ఎగుమతుల్లో మారుతి సుజుకి హవా

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మేడ్-ఇన్-ఇండియా కార్లు దుమ్మురేపుతున్నాయి. చాలా దేశాలు భారతదేశంలో తయారైన కార్లను దిగుమతి చేసుకుంటున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) లో భారత్ కార్ల ఎగుమతులు ఇప్పటివరకు లేనంత భారీగా పెరిగాయి. ఈ మూడు నెలల్లో భారతదేశం నుండి ఇతర దేశాలకు మొత్తం 2,04,330 యూనిట్లు పంపబడ్డాయి.

రూ.4.23 లక్షలకే 34 కిలోమీటర్ల మైలేజ్ కారు!

భారతీయ కార్ల మార్కెట్లో మారుతి సుజుకి (Maruti Suzuki)కి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ధర, నిర్వహణ ఖర్చులు తక్కువగా ఉండటం, మైలేజ్, నమ్మకమైన సర్వీస్ నెట్‌వర్క్.. ఇవన్నీ కలిసి ఈ బ్రాండ్‌ను భారతీయుల జీవితంలో ఒక భాగంగా మార్చేశాయి. కొత్తగా తక్కువ ధరలో కారు కొనుగోలు చేయాలని ఆలోచన చేసే వారు మొదటగా మారుతి వైపు అడుగులు వేస్తారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మారుతి సుజుకి నుండి వచ్చిన ఆల్టో కె10 (Alto K10) అనే హ్యాచ్‌బ్యాక్ మోడల్‌కి మార్కెట్‌లో అనుకూలమైన కారుగా నిలుస్తుంది. తక్కువ బడ్జెట్‌లో కారును కొనాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకి ఇది ఓ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది.

చిన్నది కానీ పర్‌ఫార్మెన్స్‌లో పెద్దదే.. వోల్వో EX30 EV ఎలక్ట్రిక్ SUV రాబోతుంది

భారతదేశంలో విదేశీ లగ్జరీ కార్లకు ఆదరణ రోజురోజుకి పెరుగుతోంది. ప్రీమియం పరంగా అవే మొదటి ఎంపికగా మారిపోతున్నాయి. అటువంటి బ్రాండ్స్‌లో వోల్వో (Volvo)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం లగ్జరీ కార్ల బ్రాండ్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అత్యంత సురక్షితమైన ఆటోమొబైల్ బ్రాండ్‌గానూ గుర్తింపు పొందింది. ఇప్పటికే భారత మార్కెట్‌లో రెండు ఎలక్ట్రిక్ వాహనాలను (EVలు) విజయవంతంగా ప్రవేశపెట్టిన వోల్వో.. ఇప్పుడు తన వ్యాపార మార్కెట్‌ను పెంచుకోవడానికి ఎలక్ట్రిక్ కార్లను అందుబాటులోకి తేవడానికి సన్నాహాలు చేస్తోంది. XC40 రీచార్జ్, C40 రీచార్జ్ మోడళ్లకు మార్కెట్ నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రీమియం లుక్స్, టాప్ క్లాస్ బిల్డ్ క్వాలిటీ, హై ఎండ్ సేఫ్టీ ఫీచర్లు వాటిని ప్రత్యేకంగా నిలబెట్టాయి. ఇప్పుడు అదే విజయాన్ని కొనసాగిస్తూ, వోల్వో తన మూడవ ఎలక్ట్రిక్ వాహనాన్ని భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది.

ఐటీ ఉద్యోగుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయ్.. ఎమర్జెన్సీ అలెర్ట్!

భారతదేశ టెక్ రంగంలో పని ఒత్తిడికి సంబంధించిన ఆత్మహత్యల రేట్లు పెరుగుతున్నాయి మరియు మద్దతు వ్యవస్థలు మరియు విధానాల అత్యవసర అవసరం.