మేలో దుమ్మురేపిన హీరో విడా V2.. రికార్డు స్థాయిలో అమ్మకాలు!
ఆటోమొబైల్స్
- 1 year, 3 month, 5 days ago
హీరో మోటోకార్ప్ (Hero Motocorp), దేశంలోనే అత్యంత నమ్మకమైన టూవీలర్ తయారీ సంస్థగా తన స్థానాన్ని బలపరుచుకుంటుంది. ఐసీఈ ఇంజిన్ ఆధారిత మోడళ్ల విభాగంలో ఇప్పటికే అగ్రగామిగా ఉన్న హీరో ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలపై కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టి వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడానికి కృషి చేస్తుంది. హీరో నుంచి వచ్చిన విడా బ్రాండ్ కింద అందిస్తున్న వాటికి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రత్యేకంగా ఎలక్ట్రిక్ వాహన విభాగంలో విస్తరిస్తూ విడా V2 ఇ-స్కూటర్‌కు వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ పొందుతుంది. ఈ స్కూటర్ అందించే సాంకేతికత, స్టైలిష్ డిజైన్, తక్కువ నిర్వహణ ఖర్చులు ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలతోపాటు, ప్రజల్లో సుస్థిరమైన వాహనాలపై ఆసక్తి గణనీయంగా పెరుగుతోంది.